Siddham Sabha
-
వైయస్సార్సీపీ సిద్ధం సభలకు అమెరికా NRI ల సంఘీభావం !
ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో లాస్ ఏంజెల్స్, ఇర్విన్ పట్టణంలోని వైయస్సార్సీపీ అభిమానులు సమావేశమైనారు.,ఈ వారం రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులపై సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు .వాస్తవానికి గత అన్ని ప్రభుత్వాలకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించినప్పటికీ , ఆదాయ వనరులతో భావితరాల అభివృద్ధికి బాటలు పరిచినప్పటికీ, కేవలం సంక్షేమానికి సంబందించిన విషయాలు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందినందున, అభివృద్ధికి సంబంధించి మరింత అవగాహన కల్పించాలని తీర్మానించారు .ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ, వైయస్సార్సీపీ తాను చేసిన పనులను చెప్పుకుంటూ, ఓట్లను అభ్యర్థిస్తుండగా , ప్రతిపక్షాలు మాత్రం వారు గతంలో చేసిందేమీ లేక కేవలం తిట్లు , పరుషవాక్యాలతో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఈ వ్యత్యాసం గ్రహించలేని అజ్ఞానులు ఏమాత్రం కాదని , అది ఎన్నికల ఫలితాలలో నిరూపించబడుతుంది అన్నారు . -
YSRCP: మరో జైత్రయాత్రకు సిద్ధం
సాక్షి, గుంటూరు: ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు, 22 రోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని నిరూపించారాయన. ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారాయన. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభంఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్‌మ్యాప్‌కు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలోనే ఆయన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. -
గుడివాడ సిద్ధం సభలో సీఎం జగన్‌పై మరో దాడికి కుట్ర
కంకిపాడు: కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మరో దాడికి కుట్ర జరిగింది. విజయవాడలో శనివారం సీఎంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుడివాడలో సోమవారం మరోసారి దాడిచేసి, అల్లర్లు సృష్టించటమే లక్ష్యంగా టీడీపీ సానుభూతిపరుడు కుట్రపన్నాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేయత్నం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో కుట్రభగ్నమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన కోటా శరత్ అలియాస్ రాఘవులు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణానికి ప్రవేశించే యత్నం చేశాడు. పోలీసులు శరత్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద రాయిని స్వా«దీనం చేసుకున్నారు. అతడు టీడీపీ సానుభూతిపరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారు. శరత్‌తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు కూడా సిద్ధం సభకు వచి్చనట్లు పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించటం లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోను విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన మాట వాస్తవమే. సభలో అల్లర్లు, దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? కారణం ఏంటి? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం. – అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణాజిల్లా ఎస్పీ -
నంద్యాల సీఎం జగన్ సభకు భారీ ఏర్పాట్లు
-
సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్
-
Best Photos Of Siddham : మేమంతా సిద్ధం (ఫొటోలు)
-
మేమంతా సిద్ధం.. సీఎం జగన్ 21 రోజుల బస్సు యాత్ర
-
ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి
సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరుగుతున్నందున అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలన్నారు. తమ నియోజకవర్గపరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేలా అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. దీనిపై అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయాలని ప్రాంతీయ సమన్వయకర్తలను ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామన్నారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరిచి, వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని లక్ష్య నిర్దేశం చేశారు. ఈ దిశగా కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని, ఘన విజయాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలని సూచించారు. బస్సు యాత్రను విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. బస్సు యాత్రలో భాగంగా జరిగే సభలు.. సిద్ధం సభల తరహాలోనే చరిత్రాత్మకం కావాలని దిశా నిర్దేశం చేశారు. -
సీఎం జగన్ సక్సెస్ ఫార్ములా.. ప్రతిపక్షాల వెన్నులో వణుకు
-
‘సిద్ధం’ సభలపై ఎల్లో మీడియా ఏడ్చిచస్తోంది
మా చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటే ఒక్కడూ రాడా? అదే జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్దమా అంటే లక్షలాది మంది ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చి జయ జయ ధ్వానాలు పలుకుతారా? ఏంటీ అన్యాయం? ఏంటీ ఘోరం? అని తెలుగుదేశం-జనసేనలతో పాటు ఎల్లో మీడియా ఏడ్చిచస్తోంది. బాబు జేబు మీడియాల్లో ఒకటేమో అసలు జనమే రాలేదంది. ఇంకోటి అబ్బే వాళ్లు జనం కారు గ్రాఫిక్సే అని లోకేష్ చెప్పారంది. ఆ సభలకు ఇంత ఖర్చు అవసరమా అంది. వచ్చిన వాళ్లకి మూడుపూటలా భోజనాలు పెట్టేస్తున్నారని మరో ఏడుపు. ఇది భీమిలి సిద్ధం సభ. ఇదిగో ఇది దెందులూరులో జరిగిన రెండో సభ. ముచ్చటగా మూడోది అనంతపురం జిల్లా రాప్తాడు లోనిది. మొదటి మూడింటినీ తలన్నేసిన మేదరమెట్లలో జరిగిన నాలుగో సిద్ధం సభ. నాలుగు సభల్లోనూ జనసునామీలను చూశారు కదా. ఇంతమంది తరలి రావడం పచ్చ మందకు ఒక ఏడుపు అయితే వచ్చిన వారు తిన్నంగా కూర్చోకుండా జగన్ మోహన్ రెడ్డికి జై జై నినాదాలు కొట్టడం.. ఆయన ప్రసంగం చేసేటపుడు అడుగడుగునా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఎగిరి గంతులేస్తూ చేతులు ఊపుతూ జెండాలు రెపరెప లాడిస్తూ మహాజాతరను తలపించేలా వ్యవహరించడం పచ్చ బ్యాచ్‌కి అస్సలు నచ్చలేదు. అది వాళ్లకి జీర్ణం కాకుండా ఉంది. వాళ్లు అలా ఏడవడంలో అర్ధం కూడా ఉంది. లోకేష్ నిర్వహించే శంఖారావం సభలు చూశారుగా. జనం లేకుండా ఎలా వెలవెల బోతూ ఉంటాయో తెలుసు కదాచంద్రబాబు నాయుడు గొంతు చించుకుని రా కదలి రా బాబూ అని పిలిచినా జనం కుర్చీలు మడత పెట్టేసినట్లు అరకొరగా సభలో ఈసురోమంటూ కూర్చోవడాలు చూశారు కదా. తానొక్కడూ పిలిస్తే రావడం లేదని.. పవన్ కల్యాణ్ ను కూడా పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు తన పుత్రరత్నం లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో నిర్వహించిన బీసీ జయహో సభను చూశారు కదా. లక్షకు పైగా జనం వస్తారని టిడిపి నేతలు అంచనాలు వేసుకుంటే 12 వేల పైచిలుకు మంది మాత్రమే వచ్చిన దృశ్యం గుర్తుంది కదా. మంగళగిరి బీసీ జయహో సభ మంగళగిరిలో టిడిపి నిర్వహించింది బీసీల సభ. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే లక్షమందికి పైగా బీసీలు ఉంటారని అంచనా. ఇక క్రౌడ్ పుల్లర్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు కదా పవన్ అభిమానులు, ఆయన సామాజిక వర్గం ప్రజలూ కూడా తరలి వచ్చేస్తారు కదా అన్నది బాబు లెక్క. కానీ ఆ లెక్క తప్పేసింది. సభ చీదేసింది. బాబు మొహం మాడిపోయింది. పవన్ అహం దెబ్బతింది. లోకేష్ మొహం చిన్నబోయింది. టిడిపి నేతల్తో ఉన్న పిసరంత నమ్మకం కాస్తా పోయింది. రాసుకోడానికి ఎల్లో బ్యాచ్ కీ ఏమీ లేకుండా పోయింది. ఒకటి మన చంద్రబాబు మన పవన్ పెట్టిన సభలకు జనం రావడం లేదాయె.రెండోది జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా జన సునామీలు పోటెత్తుతున్నాయి.ప్రజలు ఇంత దారుణంగా తమని దూరం పెట్టేస్తే బాధగా ఉండదండీ? ఒళ్లు మండిపోదాండీ? పచ్చ పార్టీ ఇంత దైన్యంగా ఉంటే ఎల్లో మీడియాకు కడుపు మంట ఉండదాండీ?ఉంటుందుంటుంది. ఆ మంటతోనే ఈ రాతలు. రామోజీరావు పత్రికలో అయితే గ్రాఫిక్స్ అన్నారు. సరే గ్రాఫిక్స్ అయితే జనం లేనట్లే కదా. ఇక ఎల్లో వారికి ఇబ్బందేమిటి? వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేశారని నీచపు రాత రాయించారు రామోజీ. సిద్ధం సభలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తోంది కానీ..ప్రభుత్వానికి సంబంధం లేదు. అటువంటప్పుడు ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంది? ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రామోజీ పత్రిక నడిపేస్తున్నారు. ఏడుపులు అన్నీ ఇన్నీ కావు. వచ్చిన వారికి బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు ఇచ్చేస్తున్నారని రామోజీ రాసుకొచ్చారు. తమ సభలకు వచ్చిన వారికి కావల్సిన ఏర్పాట్లు చేయడం రాజకీయ పార్టీల బాధ్యత. గతంలో టిడిపి కూడా సభలు నిర్వహించింది. అప్పుడూ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. బాబు హయాంలో అయితే బిర్యానీ ప్యాకెట్టే కాదు మందు బాటిళ్లు కూడా ఇచ్చేవారు. మరప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతోందని ఎందుకు రాయలేదు? సిద్ధం సభలతో మామూలు ప్రయాణికులకు బస్సులు చాలాక ఇబ్బందులు పడ్డారని రాశారు. నిజమే కొన్ని బస్సులు తగ్గినపుడు ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే స్వాతంత్ర్యం వచ్చింది లగాయితు అన్ని రాజకీయ పార్టీల సభలకూ ఆర్టీసీ బస్సులను వాడుకున్న చరిత్రే ఉంది. అపుడూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు హాయంలో టిడిపి సభలకు ఆర్టీసీ బస్సులు కాకుండా బెంజ్ కార్లను వాడారా? విషయం ఏంటంటే ఇబ్బంది పడుతోంది జనం కాదు. రామోజీరావు.రాథాకృష్ణ. అండ్ అదర్ ఎల్లో మీడియాసే. కుత కుత లాడిపోతోంది టిడిపి,జనసేన అధినేతలే.వణికిపోతోంది టిడిపి-జనసేన శ్రేణులే.అయితే దానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదు. తమని జనం ఎందుకు దూరం పెట్టారో చంద్రబాబు పవన్ లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలను వాళ్లు దూరం పెట్టడంతోనే..ప్రజాసంక్షేమాన్ని వారు అడ్డుకుంటున్నారు కాబట్టే..పేదల కు దోచిపెట్టేస్తున్నారని గుక్క పెట్టి ఏడుస్తున్నారు కాబట్టే చంద్రబాబు, పవన్ లను జనం దూరం పెట్టారు. ఇంకా దూరం పెడతారు. రేపు ఎన్నికల్లో మరింత దూరం పెట్టడానికి ఏం చేయాలో అదీ చేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే ముందుగా ప్రజలను ప్రేమించడం నేర్చుకోవాలి. అది వదిలేసి మేం పెత్తందార్ల కొమ్ము కాస్తాం..పేదల పొట్ట కొడతాం.. అయినా అందరూ మా వెంటే ఉండాలంటే కుదిరేపని కాదని ఎల్లో జనం గ్రహించాలి. -
జగన్ అన్న కోసం యూకే సైన్యం సిద్ధం (ఫొటోలు)
-
రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని అడుగే ఇది
అసలు ఆ సభలు ఏమిటి? ఆ జనం ఏమిటి? ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీ రాజకీయాలు చూస్తున్న జర్నలిస్టులకు కూడా అంతు చిక్కని రీతిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్దం సభలు విజయవంతం అయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఏపీలో భారీ సభలు మొదలయ్యాయి. ప్రజా గర్జన పేరుతోనో, మరో పేరుతోను ఐదేళ్లకు ఒకసారి ఇలాంటి సభలు నిర్వహించేవారు. ఉదాహరణకు 1994 శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఒక సభ నిర్వహించారు. అప్పుడు తెలుగుదేశం నేతలు పోటీలు పడి ప్రజలను సమకీరించారు. ఇప్పుడు అలాంటి సభలు ఏకంగా నాలుగు నెలల్లో నాలుగు నిర్వహించడం అంటే తమాషా కాదు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి హేమాహేమీల వల్లే కాని పని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంత సునాయాసంగా చేసేస్తున్నారు! భీమిలి వద్ద జరిగిన సిద్దం సభ చూసిన తర్వాత జనంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికు బాగానే పలుకుబడి ఉంది.. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆయన జనాకర్షణ శక్తి తగ్గలేదులే అనుకున్నారు. దానిని మించి దెందులూరు సిద్దం సభ జరిగింది. తదుపరి రాయలసీమలో అనంతపురం వద్ద రాప్తాడు వద్ద ఊహించలేనంత జనంతో సిద్దం సభ జరిగింది. అంతటితో సభలు అయిపోయాయని అనుకుంటే, మళ్లీ దక్షిణ కోస్తాలో మేదరమెట్ట వద్ద అత్యంత భారీ ఎత్తున సభ జరిపారు. వీటన్నిటిలోను ఒకరే స్టార్ స్పీకర్. మిగిలిన నేతలు ప్రసంగాలు చేసినా, వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్ కోసమే అంతా ఎదురు చూపులు. సరిగ్గా చెప్పిన టైమ్ ప్రకారం నాలుగు గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడం, ప్రజలకు అభివాదం చేస్తూ రాంప్వ్యాక్ చేయడం, తదుపరి ప్రసంగం ఆరంభించి సుమారు గంట నుంచి గంటంబావు సేపు మాట్లాడడం.. ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతున్నాయి. వందల ఎకరాలలో సభలు పెట్టడం, వాహనాల పార్కింగ్ కోసమే వంద ఎకరాలు కేటాయించడం.. అయినా ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, అది మొత్తం క్లియర్అవడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటలు పట్టడం. పోని వచ్చిన జనం ఏదో వచ్చాంలే.. వెళ్లాంలే అన్నట్లు ఉంటున్నారా! ఊహూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పే ప్రతిమాటకు స్పందించడం, ఉర్రూతలూగడం, ఉత్సాహంతో ఉరకలెత్తడం.. నినాదాలు చేయడం.. ఐదేళ్ల అధికారం తర్వాత ఒక రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఇన్ని సభలను ఒక రాజకీయ పార్టీ పెట్టడం నేనైతే చూడలేదు. నలభైఆరు సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న నాకు ఇదంతా కలయో, వైష్ణవ మాయో అన్నట్లుగా ఈ సభలు జరిగిపోయాయనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయా సందర్భాలలో ఒక ప్రశ్న వేస్తే చాలు.. సభలో ఉన్న జనమే సిద్దం..సిద్దం అని నినదించడం, అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్దమా అని అడగ్గానే అదే హోరు.. వందల కిలోమీటర్లను లెక్కపెట్టకుండా జనం తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటే ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలు రాకుండా ఎలా ఉంటాయి!. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఢిల్లీలో రోజుల తరబడి పడిగాపులు పడి ఉండడం, అంతకుముందు నెల రోజులకు పైగా బీజేపీ పెద్దల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తుండడం వంటి ఘట్టాలు గమనించాం. మరో వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరితో పొత్తులతో పని లేకుండా ఒంటరిగా ప్రజలే తన స్టార్ ప్రచారకర్తలు అంటూ ఈ స్థాయిలో సభలు పెడుతుంటే ప్రత్యర్దులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తక ఏమి అవుతుంది. కొద్ది రోజుల క్రితం తాడేపల్లిగూడెం వద్ద టీడీపీ, జనసేన పక్షాలు కలిసి నిర్వహించిన సభకు జనం కోసం కొన్ని గంటలు ఎదురు చూడవలసి వచ్చిందట. మరి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్దం సభలకు ఉదయం నుంచే జనం రావడం. ఒక వృద్ద మహిళ మేదరమెట్ల సభకు ఉదయం పది గంటలకల్లా వచ్చి కూర్చున్నారట. అదేమిటి అని తన మనవడిని చూడడానికి అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఉద్దేశించి అన్నారట. ఆ స్థాయిలో పేదల గుండెల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజంగానే స్థానం సంపాదించుకోవడం చరిత్రలో ఎన్నడూ చూడలేదనే చెప్పాలి. ఇంత భారీగా సభలు జరిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, వారి టీవీ మీడియాలలో ఏమని ప్రచారం చేస్తున్నారు? జనం లేరని, గ్రాఫిక్స్ వేసుకుంటున్నారని ఇలా ఏవేవో కుళ్లు వార్తలు ప్రచారం చేసి పరువు పోగొట్టుకున్నారు. టీవీలలో లైవ్ కవరేజీ ఇచ్చేటప్పుడు గ్రాఫిక్స్ వేయడం కుదరదన్న సంగతిని కూడా విస్మరించి అజ్ఞానంతో అబద్దాలు రాసేస్తున్నారు. వారి ద్వేషం ఆ స్థాయిలో ఉంది... టీడీపీ సభలలో చంద్రబాబు బోరు కొట్టించే ఉపన్యాసం వినలేక జనం మధ్యలో వెళ్లిపోతుంటే, దాని గురించి ఒక్క ముక్క రాయరు. బ్రహ్మాండంగా జరిగిన వైఎస్సార్సీపీ సభలపై మాత్రం విషం కక్కుతుంటారు. ఆర్టీసీ బస్‌లను వైఎస్సార్సీపీ వారు వాడితే ప్రయాణికులకు అసౌకర్యమట. అదే చిలకలూరిపేటలో టీడీపీ కూటమి నిర్వహించే సభకు ఆర్టీసీ వాహనాలు ఇస్తే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదట.. ఇది ఈనాడు దిక్కుమాలిన జర్నలిజం. ఏది ఏమైనా సభల స్టైల్లో కాని, జన సమీకరణలో కాని, వారికి సదుపాయాల కల్పనలో కాని, ఇతరత్రా అన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కచ్చితమైన ప్రమాణాలు నెలకొల్పడం విశేషం. అందువల్లే వచ్చిన జనం ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా సభలో పాల్గొని వెళుతుంటారు. ఈ నేపధ్యంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పొత్తు ప్రజలతోనేనని గర్వంగా ప్రకటించుకుంటున్నారు. చంద్రబాబు, పవన్‌లకు ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. ఒంటరిగా అయితే ఎట్టి పరిస్థితిలోను గెలవలేనన్న భయంతో చంద్రబాబు కాళ్లా, వేళ్లాపడి పొత్తులు పెట్టుకుంటున్నారు. అయినా వీరంతా కలిసినా వారికి వచ్చేది బండ సున్నానేనని వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమాగా సభలో చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇన్ని భారీ సభలు చేసిన తీరు కాని, అందులో ప్రసంగించిన వైనం కాని, దానికి ప్రజలు స్పందించిన విధానం కాని చూశాక వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమన్న విశ్వాసం కలుగుతుంది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలు ఆయనను ఓన్ చేసుకుంటున్న పద్దతి గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. ప్రజలకు పాలనలో విశేషమైన మార్పులు తెచ్చి అందిస్తున్న ఈ సేవలు కొనసాగాలంటే వైఎస్సార్సీపీ ఎన్నుకోక తప్పని అనివార్య పరిస్థితిని వైఎస్ జగన్మోహన్రెడ్డి సృష్టించుకోగలిగారంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘సిద్ధం’ సభలతో విపక్షాల్లో వణుకు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు ప్రజాసముద్రం పోటెత్తింది. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా రాప్తాడు సభ నిలిచింది. పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన తెచ్చేందుకు వైఎస్సార్సీపీని మళ్లీ గెలిపిచేందుకు సిద్ధమా అని సీఎం జగన్ పిలునిస్తే.. మేం సిద్ధమే అంటూ లక్షలాది మంది ఒక్కసారిగా పిడికిళ్లు పైకెత్తి మేం సిద్ధమే అంటూ చేసిన సింహనాదంతో దిక్కులు పిక్కటిల్లాయి. ఈ మూడు సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడం.. టీడీపీ–జనసేన పొత్తు లెక్కతేలాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేయడంతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తమకు ఘోర పరాజయం తప్పదనే భయంతో గజగజ వణికిపోయారు. ఎన్నికల్లో కనీసం ఉనికినైనా చాటుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లి కాళ్లబేరానికి దిగజారి బీజేపీతో జట్టు కట్టారు. ప్రభంజనాన్ని ముందే పసిగట్టి చౌకబారు డ్రామాలు.. మరోవైపు.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ఆదివారం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం చివరి సభకూ లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని గ్రహించిన చంద్రబాబు తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టారు. సభా ప్రాంగణంలో ఉ.11 గంటలకు ముందు ఫొటోలు తీయించారు. ఆ తర్వాత.. నవ్విపోదురు గాక నా(రా)కేంటి సిగ్గు అనే రీతిలో జనం పలుచగా ఉన్నారని, సిద్ధం సభ ఫెయిల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పచ్చముఠా వీరంగం వేసింది. తండ్రికి తగ్గ తనయుడినని లోకేశ్ కూడా ఎక్కడా తగ్గకుండా చౌకబారు డ్రామాకు తెరతీసి రెచి్చపోయారు. ఇక సభకు హాజరయ్యే ప్రజలు కూర్చోవడం కోసం కింద గ్రీన్‌మ్యాట్ వేస్తే.. జనం హాజరుకాకున్నా హాజరైనట్లు చూపేలా గ్రాఫిక్స్ సృష్టించేందుకు వాటిని వేసినట్లు హోరెత్తించారు. అందుకే సభ ప్రత్యక్ష ప్రసారాలను 45 నిముషాలు ఆలస్యంగా ఇస్తున్నారంటూ ఇష్టమొచి్చనట్లు చౌకబారు ఆరోపణలు చేశారు. సభ పూర్తయిన తర్వాత ఉదయం తాము తీసిన ఫొటోలను గ్రాఫిక్స్ ద్వారా మాయచేసి జనం హాజరుకాకున్నా హాజరైనట్లు వైఎస్సార్సీపీ చిత్రీకరించిందంటూ ఎల్లో మీడియా శివాలెత్తింది. తద్వారా కూటమి శ్రేణులు డీలాపడకుండా చేసేందుకు ఈ ముఠా ఆపసోపాలు పడింది. లైవ్‌లో 1.50 కోట్ల వ్యూస్‌తో రికార్డు.. ఇక మేదరమెట్ల సిద్ధం సభకు దక్షిణ కోస్తాలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా. వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత రీతిలో జనంతో కిక్కిరిసిపోయింది. మేదరమెట్ల నుంచి రేణంగివరం మధ్య సుమారు 18 కిమీల పొడవున జనప్రవాహం కొనసాగడం.. కోల్‌కత–చెన్నై జాతీయ రహదారితోపాటు అద్దంకి–నార్కాట్‌పల్లి జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయాయి. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్, కేబుల్ టీవీలు, జాతీయ మీడియా ద్వారా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఇలా 1.50 కోట్ల వ్యూస్‌తో మేదరమెట్ల సభ చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేలడంతో కూటమి నేతలు వణికిపోతున్నారు. ఆ భయంతోనే ఎల్లో ముఠా ఇలా చీప్‌ట్రిక్స్ ప్రయోగిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
KSR Live Show: బాబుకి పొత్తులు..జగన్ కి ప్రజలు
-
Public Watching Siddham Meeting: ఊరు వాడ.. జగన్ కోసం జనం (ఫొటోలు)
-
తన మార్ఫింగ్ వీడియోపై అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
సీఎం జగన్ సిద్ధం ప్రజా అభిమానం..చంద్రబాబు గుండెల్లో దడ..
-
‘నా మనవడ్ని చూసేందుకు వచ్చాను’
బాపట్ల: మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. -
30 ఏళ్ళు మహానేతతో ఉన్న..సీఎం జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
అద్దంకి ప్రజలు భయపెడితే భయపడేవారు కాదు..టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్
-
ట్రెండ్ సృష్టించిన సీఎం జగన్..సిద్ధం తరహాలో సీఎం మమతా మీటింగ్
-
సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్..ఏడ్చి చస్తున్న ఎల్లో బ్యాచ్
-
చంద్రబాబుకి ఓటు వేస్తే..చంద్రముఖిని నిద్ర లేపినట్టే..
-
చరిత్ర సృష్టించిన సీఎం జగన్ నాలుగు సిద్ధం సభలు
-
రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ఓటు అనే అస్త్రం ప్రయోగించాలని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు.. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు పోటెత్తిన జనం..ఇంకా ఇతర అప్డేట్స్
-
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్‌లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్‌లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
రాజకీయ కుంభమేళా!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: దక్షిణ కోస్తా ప్రాంతంలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ కుంభమేళాను తలపించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీకి తాజా సభ మరో తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మేదరమెట్ల–రేణంగివరం మధ్య కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సిద్ధం సభకు ఉదయం 9.30 గంటల నుంచే కార్యకర్తలు, నేతలు, అభిమానుల ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సభా ప్రాంగణం మొత్తం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత సభకు వస్తున్న వారంతా జాతీయ రహదారిపై(అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగడానికి వీలుగా పది లేన్లతో నాలుగు కి.మీ.పొడవున అభివృద్ధి చేశారు) నిలబడిపోయారు. సభకు తరలివస్తున్న లక్షలాది మంది ప్రజలు వాహనాల్లోనే ఉండిపోయారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేదరమెట్ల–రేణంగివరం మధ్య 18 కి.మీ. పొడవున ఆరు వరుసల రహదారిపై వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మేదరమెట్ల నుంచి అద్దంకి వైపు వెళ్లే నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఏడు కి.మీ. పొడవున వాహనాలు స్తంభించిపోయాయి. సీఎం జగన్ ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా సభకు జనప్రవాహం కొనసాగడం గమనార్హం. శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహం.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక వైఎస్సార్సీపీ నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తడంతో పార్టీ శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్రలో జనవరి 27న నిర్వహించిన భీమిలి సభ, ఉత్తర కోస్తాలో ఫిబ్రవరి 3న జరిగిన దెందులూరు సభ, రాయలసీమలో ఫిబ్రవరి 18న నిర్వహించిన రాప్తాడు సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వాటికి మించి మేదరమెట్ల సభ సూపర్ హిట్ కావడం సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సభలు ఈ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతలు వణికిపోతున్నారు. మారుమోగిన ‘సిద్ధం’.. రాష్ట్రంలో 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు చంద్రబాబు–పవన్ కళ్యాణ్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 2014 ఎన్నికల్లోనూ ఆ మూడు పార్టీలు జట్టు కట్టాయని గుర్తుచేస్తూ రుణమాఫీ పేరుతో రైతులకు, మహిళలకు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను చంద్రబాబు వంచించిన వైనాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే కూటమి మరోసారి జత కట్టిందని, చంద్రబాబు హామీలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదంటూ విమర్శించడంతో జనం హర్షధ్వానాలు చేశారు. మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశామని, డీబీటీతో రూ.2.65 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని.. పేదలు బాగుపడటం చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని సీఎం జగన్ విమర్శించినప్పుడు జనం నుంచి అనుహ్య స్పందన లభించింది. మరో చారిత్రక విజయానికి, మహా సంగ్రామానికి సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నించగా లక్షలాది మంది పిడికిళ్లు బిగించి సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. రైతన్నల రాజ్యం.. సీఎం జగన్ అన్నదాతల శ్రేయస్సును కాంక్షిస్తూ రైతు రాజ్యం తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందచేశారు. ప్రతి కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట వేసి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఉద్యోగాలు, పదవులు, రుణాలు, ఇళ్ల స్థలాలు... అన్నింటా వారికే ప్రాధాన్యం ఇచ్చారు. పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు చేరువ చేసి విద్యా దీపాలు వెలిగించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తేదీనే టంచన్‌గా రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లను ఇంటివద్దే పారదర్శకంగా అందించే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. లక్షల సంఖ్యలో సచివాలయ ఉద్యోగాలతోపాటు గ్రూపు 1, గ్రూపు 2, డీఎస్సీతో యువత కలలను నెరవేరుస్తున్నారు. సీఎం జగన్‌ను ప్రతి పేద కుటుంబం తమ పెద్ద బిడ్డ మాదిరిగానే భావిస్తూ ఆశీర్వదిస్తోంది. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రీజినల్ కో–ఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త. సముద్రంలో కలిపేస్తాం.. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు సీఎం జగనైతే 14 ఏళ్లు అందరినీ వంచించిన మోసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలో.. మోసగాడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. సీఎం జగన్‌ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనంటున్న చంద్రబాబు తనకు దత్తపుత్రుడు తోడైనా ధైర్యం చాలక ఇప్పుడు ముగ్గురం కలిసే వస్తామంటున్నారు. ఆయన సింగిల్‌గా వస్తే చితకబాదుతాం. ఇద్దరొస్తే విసిరి కొడతాం. ముగ్గురూ కలిసి వస్తే సముద్రంలో కలిపేస్తాం. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని 50 శాతానికిపైగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఆయన్ను ఏమీ చేయలేరు. టీడీపీ – జనసేన జెండాలు ఎత్తేసే సభలు నిర్వహిస్తున్నాయి. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి వంచన చరిత్ర బాబుదే సీఎం జగన్‌కు పాలన చేతకాదని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు నాలుక మడత పెట్టి ఆయన ఒక బటన్ నొక్కితే నేను ఐదు బటన్లు నొక్కుతానని నమ్మబలుకుతున్నారు. కరోనా సమయంలో బడికి వెళ్లని పిల్లలకు ఎవరి అబ్బ సొమ్ములా అమ్మ ఒడి ఇచ్చారని విమర్శించిన చంద్రబాబు తాను ఒక్కరికైతే రూ.15 వేలు, ముగ్గురు పిల్లలుంటే రూ.90 వేలు చొప్పున ఇస్తామంటున్నారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలనూ రుణమాఫీ పేరుతో వంచించిన చరిత్ర చంద్రబాబుదే. సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మాటకు మించి పెట్టుబడి సాయాన్ని అన్నదాతలకు అందచేశారు. మాట ప్రకారం పొదుపు సంఘాల మహిళలను కూడా ఆదుకున్నారు. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పేద బిడ్డలకు ప్రోత్సాహం.. సీఎం జగన్ నిరుపేద బిడ్డలకు ఇంగ్లిషు మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నారు. చేయూతతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నిజమైన సాధికారత అంటే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే. మహిళల రక్షణ కోసం ‘దిశ’ తీసుకొచ్చారు. 1.40 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ రిజిస్టర్ కావడం సీఎం జగన్ కల్పిస్తున్న భరోసాకు నిదర్శనం. – మేకతోటి సుచరిత, హోంశాఖ మాజీ మంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ‘సిద్ధం’ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని ముందుకు సాగటానికి సీఎం జగన్ కల్పిస్తున్న భరోసానే కారణం. ప్రతి కార్యకర్త, నాయకుడు 45 రోజులు పాటు కష్టపడితే ఆ తరువాత ఐదేళ్లు సీఎం జగన్ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. 2024 తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ మాత్రమే ఉంటుంది. జగనన్నను ఎదుర్కొనే దమ్ములేక ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడుతున్నారు. – అనిల్‌కుమార్ యాదవ్, నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త ఊరూరా ఘన స్వాగతం.. నన్ను అద్దంకి పంపించి ఇంత పెద్ద వైఎస్సార్ కుటుంబాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటికి చేరిన సంక్షేమ పథకాలు సీఎం జగన్ మంచితనం, మానవత్వాన్ని చాటుతున్నాయి. 70 ఏళ్ల పెద్దమ్మ కూడా జగనన్నా అంటోందంటే వారి మనసుల్లో సీఎం జగన్ చిరస్థాయిలో నిలిచారనేందుకు నిదర్శనం. – పాణెం హనిమిరెడ్డి, అద్దంకి వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఒక నమ్మకం.. భరోసా జగనన్న అంటే.. ఒక నమ్మకం.. ఒక భరోసా. పేదలకు అండగా ఉంటూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేయూతనందిస్తున్నారు. దాదాపు 36 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో నేరుగా రూ.2.50 లక్షల కోట్లకు పైగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశారు. పిల్లల చదువులు మొదలుకొని మహిళలు సాధికారతతో ఎదిగేలా తోడుగా నిలుస్తున్నారు. పేదలకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యం. వీటిని భరోసాగా వారికి అందించిన ఘనత సీఎం జగన్‌దే. – నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నా కుటుంబానికి అన్ని పథకాలు అందాయి. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నా కుటుంబానికి అందాయి. నా భార్యకు వైఎస్సార్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ అందాయి. నాకు సెంట్రింగ్ పని నిమిత్తం పెట్టుకున్న రుణం రూ.3లక్షలు కూడా అందజేసిన మనసున్న వ్యక్తి సీఎం జగనన్న. తిరిగి జగనన్నను సీఎంను చేసుకునేందుకు పాటుపడతాం. – షేక్ మీరావలి, సంతనూతలపాడు జగనన్నను చూడాలన్న కోరికతో వచ్చా సీఎం జగన్ ఇచ్చినన్ని సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేకపోయారు. అందుకే జగనన్న అంటే ఎనలేని అభిమానం. ఆయన సభ ఎక్కడ జరిగినా, ఎంత దూరమయినా వెళుతుంటాను. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. రానున్న ఎన్నికల్లో ఆయన మళ్లీ సీఎం అవడం ఖాయం. – సీహెచ్ రామ్మూర్తి, విశాఖపట్నం 3 చక్రాల బండిపై 80 కి.మీ. ప్రయాణించి వచ్చా.. మాది బాపట్ల పట్టణం ఇందిరానగర్ కాలనీ. దివ్యాంగులం అయిన మాకు జగనన్న సీఎం అయిన తర్వాత చేసిన మేలు జీవితంలో మరువలేం. మాకు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు చక్రాల బండ్లు పంపిణీ చేశారు. జగనన్న మీద అభిమానంతో 80 కిలోమీటర్లు మూడు చక్రాల బండిమీద ప్రయాణం చేస్తూ వచ్చాను. అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి జగనన్న పాలనలోనే పెన్షన్లు సక్రమంగా వస్తున్నాయి. జగనన్న మాకు చేస్తున్న మేలును మేము జీవితంలో మరువలేం. – చల్లా రామయ్య, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరోగ్యం బాగోలేదు.. అయినా నా మనవడిని చూద్దామని వచ్చా.. నాది జె.పంగులూరు మండలం రేణంగివరం గ్రామం. నా వయస్సు 73 ఏళ్లు. నాకు మూడు రోజులుగా జ్వరం. ఒళ్లంతా నొప్పులు. నా మనవడిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. మా ఊరి దగ్గరకు వచ్చినప్పుడైనా చూద్దామనుకుంటే జ్వరం వచ్చింది. అయినా సరే చచ్చినా ఫర్లేదు అనుకుని బయల్దేరాను. అందరూ ముసలిదానివి ఆ జనంలో తొక్కుతారు. చచ్చిపోతావని చెప్పారు. అయినా సంతోషమే అంటూ వచ్చాను. దేవుడి దయవల్ల నన్ను పోలీసులు స్టేజీ దగ్గరకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. నేను నా మనుమడిని దగ్గరగా చూశాను. ఈ జన్మకు ఇది చాలు. – భూమి రాములమ్మ 370 కి.మీ. ప్రయాణించి వచ్చా.. నాది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా. నేను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. విద్యా వ్యవస్థలో జగనన్న తీసుకుంటున్న సమూలమైన మార్పుల కారణంగా జగనన్నకు అభిమానిగా మారాను. ఇంత అభిమానం ఉన్న నాకు జగనన్నకు ఓటేసే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అబ్బాయిని వివాహం చేసుకుని జగనన్నకు ఓటు వేసి ఆయనకు మద్దతుగా నిలవాలన్నది నా కోరిక. ఆయన మీద అభిమానంతో 370 కి.మీ ప్రయాణం చేసి అద్దంకి సిద్ధం సభకు వచ్చా. జగనన్నను దగ్గరగా చూడటంతో నా జన్మ ధన్యమైంది. – తోకాటి నిదూష – కరీంనగర్ దివ్యాంగుడిని అయినా దిగులు లేదు దివ్యాంగుడిని అయినా నా జీవనంపై దిగులు పడకుండా ప్రభుత్వం నెల నెలా రూ.మూడు వేల పింఛన్ నగదు అందజేసి నాలో మనోధైర్యం నింపుతోంది. త్రిచక్ర వాహనాన్ని కూడా అందజేశారు. అలాగే నా కుటుంబంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమం ప్రతి ఒక్కరికీ అందాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలి. – ఆర్.ఆంజనేయులు, ఒంగోలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌తోనే.. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం చింతగుంట్ల గ్రామం. మా అభిమాన హీరో, మా ఇంటి ఆశాదీపం అయిన మా జగనన్నను చూసేందుకు బైక్‌పై 100 కి.మీ.ప్రయాణించి వచ్చాం. మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగనన్నతోనే ఉంటాం. సీఎం హోదాలో ఉన్న జగనన్న కామన్ మేన్‌గా నడుచుకుంటూ మా మధ్యలోకి రావడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. – రాంబాబు, నాగరాజు, అశోక్ నా రెండు కాళ్లూ సహకరించకున్నా జగన్ కోసం వచ్చా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు వచ్చాను. నా రెండు కాళ్లు సహకరించకపోయినా మార్కాపురం నుంచి వచ్చాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు మా కుటుంబానికి అందాయి. పంటల బీమా, డ్వాక్రా రుణమాఫీ వంటి వాటితో మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు జగన్. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, మార్కాపురం తెలంగాణ నుంచి వచ్చా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మా ఇంట్లో వెలుగులు నింపాయి. బతుకుదెరువు కోసం నేను బేల్దారి మే్రస్తిగా తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో పనిచేస్తున్నాను. నా కుటుంబం ఇక్కడే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అమ్మ ఒడి, ఇళ్ల పట్టా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలు మాకు అందాయి. సీఎం జగన్ మా ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి హన్మకొండ నుంచి ఆయనను చూసేందుకు సిద్ధం సభకు వచ్చాను. – గంగుల అశోక్, మర్రిపూడి నా మనవడిని దగ్గరగా చూడాలన్న ఆశ నెరవేరింది.. జీవిత చరమాంకంలో ఉన్న మాలాంటి వృద్ధులకు అండగా నిలిచిన నా మనవడు జగన్‌ను దగ్గరగా చూడాలని సిద్ధం సభకు వచ్చాను. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు పింఛన్ అందించి మాలాంటి వారికి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్నా. నా మనవడిని దగ్గరగా చూడాలనే ఆశ నెరవేరింది. – చెన్నక్క, పొదిలి జగన్ నూరేళ్లూ చల్లగా ఉండాలి రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా సీఎం జగన్ నిలిచారు. మా ఇంట్లో రైతు భరోసా వచ్చింది. ఇల్లు కూడా కట్టుకున్నాం. మంచి మనసున్న సీఎం జగన్‌ను చూసేందుకు వృద్ధాప్యంలో ఉన్నా, భార్యాభర్తలం ఇద్దరం వచ్చాం. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలన్నది మా కోరిక. – అనంత సీతమ్మ, జె.పంగులూరు -
Sidham : లండన్ లో YSRCP భారీ కార్ ర్యాలీ
#why not 175 వైనాట్ 175 అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుపై లండన్ లోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. YSRCP UK కమిటీ ఆధ్వర్యంలో లండన్‌లోని ఈస్ట్ హామ్ లో ఘనంగా YSRCP సిద్ధం సభను నిర్వహించారు. అనంతరం భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో YSRCP ఘన విజయం సాధిస్తుందని, రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. YSRCP లండన్ కన్వీనర్లు Dr ప్రదీప్ చింతా, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అద్దంకి సిద్ధం సభను పురస్కరించుకుని UKలోని వైఎస్సార్ సిపి అభిమానులు, నాయకులు గత కొన్ని నెలలుగా పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో UKలో నిర్వహించిన 5వ YSRCP సభ ఇది. ఈ కార్యక్రమంలో UK నలుమూలల నుండి YSRCP కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి కిషోర్ మలిరెడ్డి, కిరణ్ పప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సిద్ధం స్మరణతో సభా ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలోనే ఎన్నికలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలకు మరింత వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉందని YSRCP NRI ఛైర్మన్ వెంకట్ మేడపాటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. NRIలు ఏవిధంగా ఎన్నికలకు సన్నద్దమవాలో వివరించారు. Dr ప్రదీప్ చింతా తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. సీఎం జగన్ జనరంజక పాలన చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ దేశంలోనే బెస్ట్ గా నిలిచారని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు వచ్చే పాతికేళ్లు కొనసాగాలని ఆశించారు. ఈ సభలో YSRCP నూతన కార్యవర్గాన్ని కన్వీనర్లు సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో UK కమిటీ సభ్యులు శ్రీకాంత్ పసుపుల, మన్మోహన్ యమ్మసాని , PC రావు కోడె, అనంత్ రాజ్ పరదేశి, శ్రీనివాస్ తాల్ల, సుబ్బారెడ్డి ఆకేపాటి, శ్రీనివాస్ దొంతిబోయున, సురేందర్ అలవల, రవి మోచర్ల, రాజేష్ యాదవ్, వంశీ కృష్ణ మద్దూరి, విజయ్ పెండేకంటి, కార్తీక్ కొలిశెట్టి ,జయంతి రెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, NR నందివెలుగు, మధు గట్టా, వజ్రాల రాజశేఖర్ , సుధాకర్ ఏరువ, భస్కర్ మాలపాటి , శ్యామ్ తొమ్మండ్రు , నరసింహారెడ్డి వేములపాటి పాల్గొన్నారు -
Addanki Siddham Sabha Photos: కిక్కిరిసిన రోడ్లు, జన సముద్రం (ఫొటోలు)
-
అద్దంకి సిద్ధం సభ: కిక్కిరిసిన రోడ్లు, ఒక్కటైన హృదయాలు
సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సిద్ధం సభ’ విజయవంతమైంది. సిద్ధం సభకు లక్షాలాదిగా ప్రజలు హాజరై.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ఉత్సాహంగా విన్నారు. కార్యకర్తలు, అభిమానులతో సభకు వచ్చే.. అన్ని దారులు నిండిపోయాయి. రోడ్లన్ని కిక్కిరిసి.. హృదయాలు ఒక్కటైయ్యాయి. సభా ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో.. సభ బయట అంత మంది కంటే ఎక్కువే ఉన్నారు. -
Top 5 Pictures Of The Day Addanki Siddham Sabha: దద్దరిల్లిన అద్దంకి సిద్ధం సభ (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ ‘సిద్ధం’ (ఫొటోలు)
-
త్వరలోనే మేనిఫెస్టో.. బాబుకి ఓటంటే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: అధికారమంటే నాకు వ్యామోహం లేదు. అధికారం పోతుందనే భయం లేదు. చెసేదే చెప్తాం. చెప్పామంటే చేస్తాం. హిస్టరీ బుక్‌లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే కోరిక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆదివారం సాయంత్రం మేదరిమెట్ల సిద్ధం సభ వేదికగా ప్రకటించారాయన. మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా హామీలు అమలు చేశాం. 2024 తర్వాత కూడా మనం చేస్తున్న మంచి కొనసాగాలి. దేవుడి మీద తప్ప మీ అన్న పొత్తులు జిత్తులు నమ్ముకోలేదు. 2019కి ముందు మీకు మంచి భవిష్యత్తు అందిస్తానని మాటిచ్చా. 99 శాతం హామీలు అమలు చేశాం. మన సంకక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు. నాపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకోవడమే. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ సీట్లకు 25 సీట్లు తెచ్చుకోవడమే మన టార్గెట్. మన నేతలు ఇంటి ఇంటికి వెళ్లి జరిగిన మంచి చెబుతున్నారు. వాళ్లు మాత్రం రామోజీ, రాధాకృష్ణ, ఢిల్లీ గడపలు తొక్కుతున్నారు. పేదవారి భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్నే తెచ్చుకోవాలని మీరంతా చెప్పండి. మీ అన్న వస్తేనే పథకాలన్నీ అందుతాయని చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయట తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి చంద్రబాబు మేనిఫెస్టోకి.. శకుని చేతిలో పాచికలకు తేడా ఏముంది? మూడు పార్టీలు 2014లో హామీలు అమలు చేయలేదు. 2014లో ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు చేశారా?. చంద్రబాబుకు ఓటేయడమంటే.. పథకాల రద్దుకు ఓటేయడమే. మనం అమలు చేస్తున్న 8 పథకాల్ని ఎవరూ టచ్ చేయలేరు.. ఎవరైనా అమలు చేయాల్సిందే. చంద్రబాబు చెబుతున్న సూసర సిక్స్‌కు ఏటా 73వేల కోట్లు కావాలి. చంద్రబాబు ఇస్తున హమీల విలువు ఇప్పటికే రూ.లకక్షా యాభై వేల కోట్లు దాటుతున్నాయి. అబద్ధపు హామీలతో.. పొత్తుల డ్రామాతో మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు. జరగబోయేది.. మాట మీద నిలబడే వాళ్లకుXమాట తప్పడమే అలవాటుగా ఉన్నవాళ్లకు యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నా. జరగబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి సిద్ధమా?. వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధమని చెప్పండి. కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన మెప్పించేందుకు జగన్ అనే నేను మీ సేవకుడిగా సిద్ధం అని.. సీఎం జగన్ అద్దంకి సిద్ధం సభలో తన ప్రసంగం ముగించారు. -
2024లో జగనే సీఎం: కాకాణి గోవర్థన్ రెడ్డి
సాక్షి, బాపట్ల: చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. పగటి వేశాగాళ్లు వలే సంవత్సరానికి ఒకసారి బయటి వచ్చి పద్యాలు, మాటలు చెప్పి.. చందాలు పట్టుకొని పోయిన విధంగా ఇవాళ మరల చంద్రబాబు బయటకు వచ్చారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం సభలో కాకాణి ప్రసంగించారు. ‘చంద్రబాబు రకరకాల వాగ్ధానాలు చేస్తున్నారు. సీఎం జగన్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి సీఎం జగన్ ఒకసారి బటన్ నొక్కితే.. తాను ఐదు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నానని నాలుక మడతబెట్టి మాట్లాడుతున్నాడు. అమ్మ ఒడిపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పడు మళ్లీ మాట మార్చాడని మండిపడ్డారు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు... 2024లో జగనే సీఎం అవుతారు’ అని కాకాణి అన్నారు. -
అద్దంకి సిద్ధం సభలో బాబు&కోపై సీఎం జగన్ పంచ్‌లు
సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్.. బాబు&కోపై పంచ్‌లు వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకటే ఒక సూటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది? ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారు పార్టీల పొత్తులతో బాబు ... ప్రజలే బలంగా మనం తలబడపోతున్న మహాసంగ్రామానికి మీరంతా సిద్ధమా..? జగన్‌ను ఓడించాలని వారు.. పేదలను గెలిపించాలని మనం మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడానికి మీరంతా సిద్ధమా...? సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం.. సిద్ధమంటే ప్రజాసముద్రం ఇప్పటీకే ఉత్తారంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి చంద్రబాబు జేబులో ఉన్న మరో నేషనల్ పార్టీ చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌లు లేవు టైర్లు లేవు.... చంద్రబాబు సైకిల్ తుప్పుపట్టింది ఈ తుప్పు పట్టిన సైకిల్ తోయడానికి వేరే పార్టీలు కావాలి సైకిల్ చక్రం తిరగక.. ఢిల్లీ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నాడు చిత్తశుద్ధితో మనం చేసిన మంచే చంద్రబాబును పొత్తుల వైపు పరుగులు పెట్టేలా చేసింది విరగగాసిన మామిడి చెట్లులా మనముంటే.. తెగులుపట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది మీ అన్న మాటిస్తే.. తగ్గేదేలే రాబోయే ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్ర, నాది అర్జునుడి పాత్ర, ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధం చంద్రబాబు సైకిల్ తప్పు పట్టిపోయింది, టీడీపీకి సైకిల్ కు టైర్లు లేవు, ట్యూబ్ లు లేవు, తుప్పుపట్టిన సైకిల్ ను తోయడానికి ఇతర పార్టీలు కావాలి శకుని చేతిలోకి పాచికలకు .. బాబు ఇచ్చిన వాగ్దానాలకు తేడా లేదు, చంద్రబాబు తాజా మేనిఫెస్టో లోని వాగ్దానాలు చూస్తే పక్క రాష్ట్రాల్లోంచి కొన్ని హామీలు తీసుకొచ్చి కిచిడి చేస్తాడు మంచి చేసి మేం విరగకాసిన మామిడిచెట్టులా ఉంటే మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచినందుకు చంద్రబాబు పరిస్థితి తెగులుపట్టిన చెట్టులా ఉంది ఫ్యాన్ ఇంట్లో ఉండాలి .. సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి మీ అన్న చేసేదే మేనిఫెస్టో లో పెడతాడు, మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే, చేసేదే చెప్తాం .. చెప్పామంటే చేస్తాం -
నాకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సముద్రానికి సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో లక్షల మంది జనసందోహం నడుమ ప్రసంగించారాయన. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా? అని సీఎం జగన్ అనగానే.. లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా.. దక్షిణ కోస్తా సిద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని.. ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. -
ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో చెవిరెడ్డి ప్రసంగించారు. ‘సీఎం జగన్ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారు’ అని చెవిరెడ్డి తెలిపారు. -
అద్దంకి సిద్ధం సభకు ఎన్ని ప్రత్యేకతలో తెలుసా?
సాక్షి, బాపట్ల: రాష్ట్ర వ్యాప్తంగా అద్దంకి 'సిద్ధం' సభ హోరెత్తుతోంది. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో.. చివరి క్యాడర్ సమావేశం ఇది. ఈ సమావేశానికి బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి మొత్తం ఆరు జిల్లాల (మొత్తం 43 నియోజక వర్గాలు) నుంచి ఏకంగా 15 లక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా. బాపట్ల ఈవెంట్లో ప్రత్యేకత ఏమిటంటే.. మేదరమెట్లలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం పై నుంచి చూస్తే 'వై' లాగా కనిపించే ర్యాంప్, సీఎం జగన్ యుద్ధ నినాదం 'వై నాట్ 175' అని మధ్యలో రాసి ఉంది. హీలియం బెలూన్లు, సిద్ధమ్ కటౌట్లు, జెండాలు, ఆటో బ్రాండింగ్, బైక్ బ్రాండింగ్ వంటి బ్రాండింగ్ కార్యకలాపాలు, వేదిక స్థలంలో ఎక్కువ మంది సీఎం జగన్ ప్రసంగం వీక్షించేలా పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 'సిద్ధం' స్టాంపుల వంటి ఇంటరాక్టివ్ కార్యకలాపాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పటికే వైఎస్సార్సీపీ మూడు సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. జనవరి 27న భీమిలిలో జరిగిన మొదటి సభకు 3 లక్షల కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 3న ఏలూరులో జరిగిన రెండో సభకు 6 లక్షల మంది హాజరయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 18న అనంతపురం సభకు 10 లక్షల మంది (1 మిలియన్) హాజరై.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ ర్యాలీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా 'మేం సిద్దం' అనే పేరుతో వెబ్సైట్ ప్రారంభించింది. ఇందులో 'జగనన్న కనెక్ట్స్' ద్వారా వారి పేరుతో ఫ్రీ సిద్దం పోస్టర్‌ను రూపొందించుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పటికే.. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఈ వెబ్సైట్ ద్వారా 4,00,00లకు పైగా ప్రత్యేక పోస్టర్లు క్రియేట్ చేసుకున్నారు. సరికొత్త ప్రచారం 'నా కల' ఇక పొతే ఏపీలో వైఎస్సార్సీపీ కొత్త క్యాంపెయిన్ 'నా కల'కు శ్రీకారం చుట్టింది. అద్దంకి సిద్ధం సభ వేదికపై సీఎం జగన్ ఈ కొత్త ప్రచార కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా.. రాష్ట్ర వ్యాప్తంగా నా కల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్సీపీ. -
జగన్ వన్స్‌మోర్ నినాదాలతో మారుమోగిన అద్దంకి సిద్ధం సభ (ఫొటోలు)
-
ఎంతమంది వచ్చినా జగనే మళ్లీ సీఎం: అనిల్ కుమార్ యాదవ్
సాక్షి, బాపట్ల: సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయని.. ఎన్ని పార్టీలు కూటమి కట్టినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేవని మాజీ మంత్రి, నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మేదరమెట్ల సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం అవుతారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
మొనగాడు కావాలా?.. మోసగాడు కావాలా?: మంత్రి అంబటి
సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది. సిద్ధం సభలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పంచ్‌లతో దద్దరిల్లేలా చేశారు. సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడని అన్నారు. ‘సింగిల్‌గా వస్తే చితకబాదుతాం. ఇద్దరు వస్తే విసిరి కొడతాం. ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు. ... చంద్రబాబు రా .. కదలి రా అంటే ఎవరూ రావడం లేదు. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగనన్న. 14 ఏళ్లు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కిన మొసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలా?. మోసగాడు కావాలా?. ... టీడీపీ కదలి రా అంటే ఎవరూ వెళ్లడం లేదు. ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్ నిలబెట్టుకున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు మోసం చేశారు. ఒంటరిగా వచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే దత్తపుత్రుడితో కలిసి వస్తున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరు. వాళ్లది జెండా సభ కాదు.. జెండా ఎత్తేసే సభ. పవన్ సీఎం కావాలని కాపులు అడుగుతారని ఎంపీగా పోటీ చేయించాలని ప్లాన్ చేశారు’ అని మంత్రి అంబటి అన్నారు. -
అద్దంకి సిద్ధం సభలో డ్రోన్ కలకలం
సాక్షి, బాపట్ల: ఆదివారం అద్దంకి మేదరమెట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో డ్రోన్ కలకలం రేగింది. మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచే ప్రకటించారు. ఆ సమయంలో సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఆ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక కాసేపటికే మైక్ అందుకుని ‘‘ఏయ్ పప్పూ... ఎక్కడో దూరంగా ఉండి.. డ్రోన్‌ను పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా. కార్యకర్తల నినాదాలతోనే ఈ షర్ట్ తడిచిపోవడం ఖాయం’’ అంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్‌ను ఉద్దేశించి సవాలు విసిరారు. -
గ్యాలరీలు ఫుల్..
-
రాప్తాడులో రాజసం చూపించిన జగన్
-
నేను ఒంటరి కాదు..నా బలం మీరే
-
సిద్ధం ఓ సభ కాదు.. ఓ సింహనాదం
ఇటీవల తెలుగురాష్ట్రాల్లో.... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ.. ఏ పార్టీకి సాధ్యం కానీ రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు చరిత్రాత్మకం అయ్యాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించిన సభలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తాన్ని వేడెక్కించాయి. లక్షలాదిగా హాజరవుతున్న జనం సీఎం వైయస్ జగన్ పట్ల తమకు ఎంత అభిమానం ఉన్నదో.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉన్నదో తేటతెల్లం చేశారు. అంతేకాకుండా సిద్ధం స్థాయి సభలు నిర్వహించాలని ప్రతి పార్టీ కూడా తలపోసి రీతిలో ఈ సభలు జరుగుతున్నాయి. లక్షలాదిగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి అధినేత జగన్ చేస్తున్న ప్రసంగాలు సొంత క్యాడర్లో ఉత్తేజాన్ని నింపుతుండగా అవతలి పార్టీల పాలిట అదో సింహనాదం మాదిరి వినిపిస్తోంది. ఒకదాన్ని మించి ఇంకోటి అన్నట్లుగా భీమిలి సభను మించి దెందులూరు సభ నిర్వహించారు.. దాన్ని మించి రాప్తాడు సభ జరిగింది.. ఇప్పుడు అద్దంకిలో ఏకంగా పదిహేను లక్షలమందితో అంటే అచ్చంగా ఓ యుద్దాన్ని తలపించే రీతిలో సైన్యాన్ని సమీకరించి జగన్ చేసే ప్రసంగం ప్రతిపక్షాల గుండెల్లో భయాన్ని రేపిన సభలు ఇవి. ఒక్కో సభ జరిగేకొద్దీ ప్రజల్లో పార్టీకి క్రేజ్ పెరుగుతూ వస్తోంది... మళ్ళీ వచ్చేది జగనే... ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా చివరకు గెలిచేది జగనే.. అనే సందేశం... ఓ పాజిటివ్ అభిప్రాయం సమాజంలోకి దూసుకు వెళ్తోంది. దానికితోడు.. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి.. మంచి జరగకపోతే ఓట్ వద్దు అని వైయస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం కూడా ప్రజలను ఆలోచింపజేస్తోంది. అదీ మాట ... అదీ మగాడితనం అంటే... అదిరా దమ్ము అనే అభిప్రాయం సైతం ప్రజల్లోకి వెళ్ళింది. తాను ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేసానన్నది రొమ్ము విరుచుకుని మరీ చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రసంగాలు.. నిర్వహిస్తున్న సభల్లో కేవలం జగన్‌ను తిట్టడానికి తప్ప తాము ప్రజలకు ఏమి చేస్తామన్నది చెప్పలేకపోతున్నారు. సిద్ధం సభలకు... ప్రతిపక్షాల సభలకు ఇది కదా అసలు తేడా... నిర్వహించి ఎన్నిలకు తాము సిద్ధం అని పొలికేక పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే సిరీస్ లో భాగంగా ఇప్పుడు అడ్డంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో మరో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్‌ను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది. దాదాపు పదిహేను లక్షల మంది కార్యకార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్న మెదరమెట్ల సభ పార్టీకి మరింత ఊపు తేనుంది. భీమిలీ, దెందులూరు, రాప్తాపాడు లలో జరిగిన సభలు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మును, ప్రజాదరణను తెలియజేయగా ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే విధంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది హజరయ్యే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది వీక్షించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లు అమర్చారు. సీఎం వైయస్ జగన్ కార్యకర్తలకు మరింత చెరువ కావడానికి వీలుగా ర్యాంప్ లు ఏర్పాటు చేశారు. ఇదే సభలో సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫేస్టో లో కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇటు వరుస సిద్ధం సభలతో వైఎస్సార్ సీపీ దూసుకుపోతుండగా అటు ప్రత్యర్ధి టీడీపీ, జనసేన కూటమి ఇలాంటి సభ ఒక్కటి కూడా నిర్వహించలేకపోవడం వారి అనైక్యతను, ప్రజల్లో వారికున్న బలాన్ని తేటతెల్లం చేస్తోంది. ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తూ.. వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి పొత్తులు, బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. మేదరమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజల్లో సీఎం వైయస్ జగన్ కు ఉన్న ఆదరణ మరోమారు తెలుస్తుంది . దీంతరువాత ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారవుతుంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రాలో మళ్ళీ జగనే వస్తారనే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్, బిజెపి .. ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తోంది. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పథకాలతో అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిలువరించడం కష్టమని ఇప్పటికే టీడీపీ, జనసేన క్యాడర్ అభిప్రాయపడుతోంది. ✍️సిమ్మాదిరప్పన్న -
హుషారుగా.. అద్దంకి సిద్దం సభకు (ఫొటోలు)
-
అడ్డురాని అంగవైకల్యం...సిద్ధం సభకు వికలాంగులు
-
Watch Video: అద్దంకి సిద్ధం సభలో సీఎం జగన్
-
అంతులేని అభిమానం...గుండెలపై సీఎం జగన్ పచ్చ బొట్టు..
-
సీఎం జగన్ సిద్ధం సభ..డ్రైవర్ గా మారిన ఎమ్మెల్యే పిన్నెల్లి
-
15 లక్షల మందితో సిద్ధం సభ
-
పేరెంట్స్ కి పిల్లలు భారం కాకుండా జగనన్న చెయ్యందించాడు
-
YSRCP: ‘సిద్ధం’ అంటూ.. సమరోత్సాహంతో కదం తొక్కుతూ..
జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని మరోసారి రుజువు కాబోతోంది. సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మేదరమెట్ల వైఎస్సార్సీపీ సభకు జన వాహిని తరలి రానుంది. గత మూడు సిద్ధం సభలకు మించి లక్షల గొంతుకలు.. పెత్తందారులతో పేదల ప్రభుత్వానికి జరగబోయే యుద్ధానికి మేము సైతం సిద్ధమంటూ గళమెత్తబోతున్నాయి. ఈ దెబ్బకు సోషల్ మీడియాలో మరోసారి #Siddham ట్రెండ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఎన్నికల ముందర.. సిద్ధం పేరిట సన్నద్ధ సభల్ని వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసింది. రాజకీయ దుష్టశక్తుల విషయంలో ఓటర్లను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరిధిలో.. రెండో సభను ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గ సమీపంలో.. మూడో సభను రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం రాప్తాడులో భారీ ఎత్తున నిర్వహించారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పరిధికి సంబంధించి బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో నాల్గో సభను.. ఆఖరి సిద్ధం సభగా నిర్వహిస్తున్నారు. జనవరి 27వ తేదీన.. ఒకవైపు విశాఖ సముద్రం మరోవైపు జగనన్నపై అభిమానంతో పోటెత్తిన జన సంద్రం చూసి భీమిలి మురిసిపోయింది. కురుక్షేత్రంలో అర్జుడినిమల్లే సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించి.. ఢంకా మోగించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని సీఎం జగన్ అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. ఫిబ్రవరి 3వ తేదీన.. ఏలూరు జిల్లా దెందలూరు సిద్ధం సభకు.. 50 నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్ కదలింది. ముఖ్యంగా యువత పోటెత్తింది. సభా వేదికపైకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.110 ఎకరాల సిద్ధం ప్రాంగణం సరిపోక.. ప్రజలు కోల్‌కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు.సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని నేతలు అంచనా వేశారు. ఫిబ్రవరి 18వ తేదీన.. అనంతపురం రాప్తాడు మూడో సిద్ధం సభ.. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. రాప్తాడులో దాదాపు 280 ఎకరాలు జనసముద్రంగా మారిపోయింది. సభా ప్రాంగణం నిండిపోయి బయట ఎదురుచూపులు చూసిన దృశ్యాలు కనిపించాయి. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే..రోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందంటూ సీఎం జగన్ సైతం అభిమానులకు అభివాదం చేశారు. 1 Million Crowd - 1 Million Heart beats For #Siddham in Anantapur ♥️ Hello Non Resident Andhras @PawanKalyan @ncbn @naralokesh…😎 How is the josh? This is the Power of our Andhra Pradesh! #Siddham 🔥 This is the Power of YSRCP! 🔥🦁#YSJaganAgain pic.twitter.com/isRd2EvMEM — YSR Congress Party (@YSRCParty) February 18, 2024 మార్చి 10వ తేదీన.. బాపట్ల అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల, పిచ్చుకుల గిడిపాడు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిద్దం సభకు లక్షల మంది తరలి వస్తున్నారు. జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధం.. పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు జెండాలు జతకట్టే టీడీపీ, జనసేన దోపిడీదారులపై యద్ధానికి సిద్ధం.. అంటూ పిడికిలెత్తి నినాదాలు చేస్తూ సభా ప్రాంగణం వైపు కదులుతున్నారు. -
జైత్రయాత్రకు మేం 'సిద్ధం' పబ్లిక్ గూస్ బంప్ కామెంట్స్
-
ముగ్గురు కలిసినా..సింహం సింగిల్ గా వస్తుంది..
-
జగన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..
-
సిద్ధం సభలో మొదలైన హంగామా
-
Watch Live: ఏపీ దద్దరిల్లేలా సిద్ధం సభ
-
కార్యకర్తలు కదం తొక్కేలా సిద్ధం సభ కార్యాచరణ
-
200 ఎకరాల్లో సిద్ధం సభ
-
Bapatla: జైత్ర యాత్రకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, నరసరావుపేట: సిద్ధం... ఈ మాట వింటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఎన్నికల యుద్ధానికి కదం తొక్కుతున్నారు.. మరోవైపు ఈ సభలకు వస్తున్న ప్రతిస్పందన చూసి ప్రతిపక్ష నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరిట ఇప్పటికే మూడు సభలు నిర్వహించి గడచిన నాలుగేళ్ల పది నెలల కాలంలో ప్రజలకు చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజలకోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న మూకుమ్మడి కుట్రను వివరిస్తున్నారు. ► అందులో భాగంగా నేడు చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడులో జరగనుంది. ఇందులో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు హాజరుకానున్నారు. ► చరిత్రలో నిలిచేపోయే ఈ సభలో పాల్గొనాలని పల్నాడు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జననేత సందేశం వినాలని ఆత్రుతతో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ప్రతి ఇంటికీ చేర్చి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే లక్ష్యంగా నేడు వీరు సిద్ధం సభకు వెళ్లనున్నారు. ► గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి విడదల రజని, తూర్పు నుంచి నూరి ఫాతిమా, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు నుంచి బలసాని కిరణ్‌కుమార్, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే ఆర్కే, సమన్వయకర్త మురుగుడు లావణ్య, పొన్నూరు నుంచి అంబటి మురళీకృష్ణ, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య నేతృత్వంలో జన సమీకరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే వాహనాలు సిద్ధం చేశారు. ►పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి ఎమ్మెల్యే కాసు మహే‹Ùరెడ్డి, నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట నుంచి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. ► బాపట్ల జిల్లాలో బాపట్ల నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి, అద్దంకి నుంచి సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి, రేపల్లె నుంచి సమన్వయకర్త ఈవూరి గణే‹Ù, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాం, సమన్వయకర్త వెంకటేష్, పర్చూరు నుంచి సమన్వయకర్త ఎడం బాలాజీ, వేమూరు నుంచి సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో శ్రేణులు కదం తొక్కనున్నాయి. సొంత వాహనాల్లో ప్రయాణం పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు మార్లు సిద్ధం సభ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో ప్రజలు సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల కోరిక మేరకు సభకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు తాము సొంతగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు వెళ్లనున్నారు. వీటితో నేడు దారులన్నీ సిద్ధం సభ వైపునకు మళ్లాయి. ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్న వైఎస్సార్ సీపీ క్యాడర్ నేడు సిద్ధం సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశంతో మరింత పెరిగిన ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, పార్టీ అఖండ విజయానికి కృషి చేయనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. నగరంపాలెం: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు/ వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా వెళ్లాలి.. ► విజయవాడ, గుంటూరు నుంచి జాతీయ రహదారిపై ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్ మీదగా పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట వైపుగా వెళ్లాలి. ► గుంటూరు నగరం నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలు ఏటుకూరు జంక్షన్ నుంచి ప్రత్తిపాడు, పర్చురు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, త్రోవగుంట వైపు వెళ్లాలి. ► గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్లే వాహనాలు చుట్టుగుంట, పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి. ► 16వ నంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా నుంచి బొల్లాపల్లి, మేదరమెట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. సిద్ధం సభ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు అమల్లోకి వస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. -
గత సభలకు మించి మేదరమెట్ల సిద్ధం భారీ ప్రణాళిక
-
Siddham Sabha: అద్దంకి సిద్ధం సభ హైలైట్స్
Medarametla Siddham Sabha Updates: 4:45PM, Mar 10th, 2024 సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. బిందువూ బిందువూ సింధువైనట్లుగా.. నా మీద, మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రభంజనంలా ఇక్కడికి సిద్ధం అంటూ ఉప్పెనలా తరలి వచ్చిన ఈ జన సమూహం.. ఓ మహాసముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తోంది. ఈ మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం. ఓ జన ప్రవాహం. ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌవరాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకుని మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి, ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడుకీ మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికల మహాసంగ్రామానికి, ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు, ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనమూ.. తలపడబోతున్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమేనా..! జగన్‌ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని మనం.. చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా కూడా సిద్ధమేనా..! సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం. ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం. ఇప్పటికే రాయలసీమ సిద్ధం. ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ, అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది. ప్రజలందరిదీ. అర్జునుడి పాత్ర మీ బిడ్డది. మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్మి చెట్టు మీద ఇంత కాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజికవర్గాల అభివృద్ధికి, అడ్డు పడుతున్న పెత్తందార్ల మీద ప్రయోగించాల్సిన ఇక సమయం వచ్చేసింది. నాకు, చంద్రబాబుకు ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. నాకు చంద్రబాబు మాదిరిగా ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు.. ఉన్నదల్లా.. నక్షత్రాలు ఎన్నున్నాయో అంత మంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ప్రతి గడపలోనూ ఉన్నారు. నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం.. మీలో ప్రతి ఒక్కరూ మీ జగన్‌కు, మీ అన్నకు, మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి. బహుశా మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది. చంద్రబాబు పార్టీలు, చంద్రబాబు జేబులో ఉన్న మరో పార్టీ.. వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని కూడా ఓట్లు రాని పార్టీలు. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికీ మంచి చేసి మనం ఈరోజు సిద్ధం అంటుంటే వారి వెనుక ప్రజలు లేరు, చేసిన మంచి చెప్పుకునే పరిస్తితి లేదు కాబట్టి, అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈరోజు ఏపీలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి, మంచి వల్ల మనకున్న ప్రజా బలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలపడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీకి దత్తపుత్రుడితో కలిసి వెళ్లి పడిగాపులుగాసి, ఢిల్లీలో మోకరిల్లుతున్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు పరిస్థితి. కేవలం జగన్ ఒక్కడే ఇటువైపున. జగన్ వల్ల మంచి జరక్కపోయి ఉంటే ప్రతి ఇంటికీ, మేనిఫెస్టోలో చెప్పినది చేయకపోయి ఉంటే, జగన్ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించి ఉండకపోయి ఉంటే.. చంద్రబాబు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతున్నాడు? ఇంత మందితో పొత్తుల కోసం అగచాట్లు పడుతున్నాడు? ఎందుకు ఢిల్లీదాకా వెళ్లి అక్కడ మోకరిల్లుతున్నాడు. దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపిన కమిట్మెంట్, ఇంటింటికీ మనం చేసిన అభివృద్ధి. మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగకాసిన మామిడిచెట్టులా మనం ఉంటే, చంద్రబాబు పార్టీ అందర్నీ మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి, గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది. మన ఎమ్మెల్యేలు, నాయకులు అంతా ప్రతి నియోజకవర్గంలో గడపగడపకూ ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు.. ఇలా ఓ అరడజను గడపలు.. ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతున్నాడు. ఇది కనిపిస్తున్న చంద్రబాబు మార్క్ రాజకీయం. మరి మీ జగన్ మార్క్ రాజకీయం.. మీ అన్న మార్క్ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది. నిబద్ధత ఉంది. సిద్ధాంత బలం ఉంది. ఇంటింటికీ మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. అన్నింటికీ మించి ప్రజల మీద, అక్కచెల్లెమ్మల మీద నమ్మకం ఉంది. మీ బిడ్డ పాలనలో ప్రతి ఇంట్లోనూ చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులున్నాయి. మన మార్క్ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు. ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు. నేరుగా ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన ఫ్యాన్‌కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికీ చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన ఎవరైనా ఇవ్వగలుగుతారా అని ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు లంచాలు లేని వివక్ష లేని పాలన అందించిన దాంట్లో నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. మాటతప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి ఇంత వరకు ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటని గమనిస్తే.. చంద్రబాబుకు సైకిల్‌కు ట్యూబుల్లేవు. టైర్లు లేవు. చక్రాలే లేవు. తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. తుప్పుపట్టిన సైకిల్‌ను తొక్కటానికి, తోయటానికి చంద్రబాబుకు వేరే పార్టీలు కావాలి. ఇదీ చంద్రబాబు గారి జాబ్ రిక్వైర్మెంట్. బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచీ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. ఒక్క స్కీము కూడా వినపడదు, కనిపించదు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఈ ప్యాకేజీ స్టార్ అయితే, సైకిల్ సీటు తనకు కావాలని అడగడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా ఈ పెద్దమనిషి అడగనే అడగడు. ఎందుకు ఇచ్చి తక్కువ సీట్లు ఇస్తున్నావని క్వశ్చన్ కూడా అడగడు. తాను తాగుతున్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. ఎప్పుడు సైకిల్‌ను దిగమంటే అక్కడ దిగుతాడు. ఎప్పుడు సైకిల్‌ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు. విభేదించినట్లు డ్రామాలాడమంటే రక్తికట్టించేట్టు డ్రామా ఆడతాడు. వెనకటికి చంద్రబాబు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. అయ్యా.. పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని అడిగారట. అప్పుడు ఆ బాబు.. ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది. చీర కొనిపెడితే చిరిగిపోతుంది. ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది. కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని చెప్పాడట. ఈ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే. అదే చేశాడు. ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పార్టీలున్నా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. ఇప్పుడు చంద్రబాబు ముగ్గురితో కలిసి పొత్తు అంటున్నాడు. ఈ ముగ్గురూ కలిసి 2014లో ఇలాగే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురూ కలిసి ఒకే స్టేజీ మీద కూర్చుని వీళ్లంతా మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ముగ్గురి ఫొటోలు వేసుకుని చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికీ ఈ పాంప్లేట్ను పంపించాడు. రైతులకు రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాం, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తాం, ఉద్యోగం వచ్చే దాకా నెలనెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాం, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాం.... ఇవీ ఇదే చంద్రబాబు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫొటో, ఇదే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో. వీళ్లు ముగ్గురూ కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పాంప్లేట్ పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా? మరి ఇవి గతంలో చేయకుండా, పొత్తులో వీరంతా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి, మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి, పాంప్లేట్లుగా చేసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపి, మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు.. ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మళ్లీ చంద్రబాబు పొత్తుల డ్రామాతో మీ అందరి ముందుకు వస్తున్నారు. చంద్రబాబు చూపిస్తున్న ఈ పొత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా, ప్రజలకు మంచి చేసిన జగన్‌ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ల ఏకైక ఎజెండా కనిపిస్తోంది. చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలంఆటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు.. కారణం.. ఆ అధికారంతో ప్రజల్ని దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలి. గతంలో 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో.. ఇంటింటికీ పంపిన పాంప్లేట్.. టీవీ ఆన్ చేస్తే చాలు.. ఊదరగొట్టే అడ్వటైజ్మెంట్లు ఇవీ.. అడ్డగోలుగా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు.. తాజా మేనిఫెస్టోగా.. నరకలోకానికి, నారా లోకానికి రమ్మంటే ఎవరూ రారు కాబట్టి ఎంట్రన్స్‌లో స్వర్గం చూపించి.. లోపలికి వెళ్లాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటు. కిచడీ వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణ నుంచి కొన్ని.. వాళ్ల హామీలన్నీ కలిపి కిచడీ మేనిఫెస్టో తెచ్చాడు. అందులో వారు చూపించే గ్రాఫిక్స్, ఎల్లో మీడియా డిబేట్లు.. వారు చేసే ప్రచారాలు.. ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా? చంద్రబాబు కేరక్టర్‌కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం సాకులు చూపకుండా పేదలందరికీ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ అందించాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాలా రూ.2.65 లక్షల కోట్లు నేరుగా వెళ్లిపోవడం జరుగుతున్న పరిస్థితిని గమనించాలి. నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా, మన దగ్గర భూముల విలువ తీసుకోకుండా, మనం సేకరించిన భూముల విలువలు మాత్రమే తీసుకుని నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు.. ఈ 58 నెలల కాలంలో.. చేసిన ఖర్చు రూ.1.10 లక్షల కోట్లు. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే 58 నెలల కాలంలో మనం 3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన, ప్రజలకిచ్చిన సొమ్ము సంవత్సరానికి రూ.75 వేల కోట్లు. అది కూడా మనం చాలా కష్టపడితే, ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే. మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని,ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి గతంలో ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు ఎన్నెన్నో సందర్భాల్లో వాదించడం కూడా మన కళ్ల ఎదుట కనిపించిన సత్యం. ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేవన్నీ అబద్ధాలే కదా.. హద్దులెందుకు అని చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆరు వాగ్దానాలు అంటూ వదిలారు. ఏటా ఖర్చెంత అవుతుందని మా ఫైనాన్స్ వారిని లెక్కలు తీయమన్నాను. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు.. 66 లక్షల మంది పెన్షన్లకు మనం ఖర్చు చేస్తున్నది దాదాపు రూ.24 వేల కోట్లు. రైతన్నలకిచ్చే ఉచిత విద్యుత్‌కు ఖర్చు రూ.11 వేల కోట్లు. సబ్సిడీ బియ్యానికి రూ.4600 కోట్లు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108.. మరో రూ.4.400 కోట్లు, పూర్తి పీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తున్నది విద్యాదీవెన, వసతి దీవెన కింద మరో రూ.5000 కోట్లు సంపూర్ణ పోషణ కింద రూ.2200 కోట్లు, గోరుముద్ద కింద రూ.1900 కోట్లు. కేవలం ఈ ఎనిమిది పథకాలకే.. ఖర్చు రూ.52,700 కోట్లు. ఇవి కచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుందో లెక్కేస్తే, ఇది పచ్చి మోసం అని తెలిసినా లెక్క వేయిస్తే.. అదనంగా కావాల్సింది ఏటా రూ.73,440 కోట్లు. ఇది కాక చంద్రబాబు ఈ మధ్యనే ఏడో హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానన్న హామీని లెక్కేస్తే ఇది అదనంగా రూ.13872 కోట్లు. అంటే చంద్రబాబు చెప్పిన ఆరు సిక్సులు, ఈ ఏడో పథకానికి ఈరెండూ కలిపితే 87312 కోట్లు, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా 8 స్కీములకు కచ్చితంగా ఎలాగూ చేయాల్సిన స్కీములకు ఖర్చయ్యేది మరో 52,700 కోట్లు. రెండూ కలిపితే అక్షరాలా రూ.1.40 లక్షల కోట్లు.. చంద్రబాబు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం రూ.1.40 లక్షల కోట్లు.. మనం ఎంతో కష్టపడితే, ఎక్కడా లంచాలు లేకుండా ప్రజలకు ఇస్తే, పాలనలో ఎన్నో మార్పులు తెచ్చి పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి రూ.75 వేల కోట్లయితే, చంద్రబాబు చెబుతున్న హామీలు.. ఇప్పటికే రూ.1.40 లక్షల కోట్లు దాటుతోందంటే.. ఇక ఆలోచన చేయండి.. ఈ పెద్దమనిషి చంద్రబాబు చెప్పే హామీలు మళ్లీ ప్రజల్ని ఎంతగా మోసం చేసేందుకు చెబుతున్నాడో అని అందరూ ఆలోచన చేయాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటే చంద్రబాబు మాట్లాడరు. ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం జరిగింది. ఎలాగూ అబద్ధాలు చెప్పేటప్పుడు హద్దులెందుకు, భావదారిద్ర్యం ఎందుకని అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరన్నా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లుగానే ప్రజలందరూ మోసపోతారు అని తెలియజేస్తున్నా. ఈ 58 నెలల్లో ప్రజల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. దాదాపు రూ.1.70 లక్షల కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిందంటే అది కేవలం మీ జగన్‌కు మాత్రమే సాధ్యమైంది. అది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా కుటుంబాలు బయటకు రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి. ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుందని ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ వివరించాలి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలు వారి భవిష్యత్‌ను ఎలా మారుస్తుందో వివరించాలి. 2019 ఎన్నికల ముందు మీ జగన్ ఓ మాట చెప్పాడు. గుర్తుందా? ఆ మాట.. మీ బిడ్డ వస్తాడు. మంచి రోజులు మీకు తెస్తాడని మీ బిడ్డ మాట ఇచ్చాడు. ఈరోజు మళ్లీ మీ అందరికీ.. ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెబుతున్నాడు. నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊర్లోనూ చెప్పండి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేద వాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే, మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి, ప్రతి ఊళ్లోనూ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. మన అన్నను సీఎంగా తెచ్చుకుందాం. మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాం. బాబు అనే మాయలేడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికీ వెళ్లి చెప్పండి. మీ కోసం నిలబడిన మన అన్నమీద అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేదలకు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు. కాబట్టే అరడజను పార్టీలు, అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తుల్ని నమ్ముకోలేదు, అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలా మనందరికీ తోడుగా నిలబడ్డాడు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మన అన్న ప్రజల్ని, దేవుడి తప్ప పొత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే నమ్మకున్నాడు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చేయి చేయి కలపాలి, మనమంతా ఒక్కటి కావాలి, మనమంతా సిద్ధం అని చెప్పాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. సీఎంగా అన్న వస్తేనే, నెలనెలా ఒకటో తేదీన మళ్లీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే రూ.3 వేల పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే అమ్మ ఒడి కొనసాగుతుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే చేయూత పథకం అందుతుందని, రైతు భరోసా రైతన్నకు తోడుగా నిలుస్తుందని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యాదీవెన, వసతి దీవెన కేవలం అన్న వస్తేనే జరుగుతుందని చెప్పండి. నేరుగా అక్కచెల్లెమ్మలకు ఎలాంటి వివక్ష లేకుండా డబ్బులు పడే పరిస్థితి రావాలంటే మళ్లీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పండి. సీఎంగా మళ్లీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి, సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ ఆస్పత్రి బాగుపడుతుందని చెప్పండి. నవరత్నాల్లోని అన్నిపథకాలు కూడా కొనసాగుతాయని చెప్పండి. ఈ పథకాలు అందుకున్న మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటుకు ఒక ఓటు వేస్తేనే మళ్లీ అన్న సీఎం అవుతాడు. అన్ని పథకాలూ ఇంటికే వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. చెప్పేటప్పుడు.. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే.. మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది అని కూడా చెప్పండి. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి. మళ్లీ లంచాలు, వివక్షల రాజ్యం మళ్లీ గ్రామాల్లో చెలరేగుతుంది. మళ్లీ అవ్వలు, తాతలు, రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఎండనక, వాననక ఎవరైనా చనిపోతేగానీ ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి మళ్లీ వస్తుందని చెప్పండి. పొరపాటున చంద్రబాబుకు ఓటేయడం అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసినట్లు అవుతుందని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషుమీడియం రద్దుకు మీరే ఓటు వేసినట్లు అని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే గవర్నమెంట్ బడిని మళ్లీ కార్పొరేట్లకు అమ్మేయడం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే మళ్లీ వైద్యం కోసం అప్పులు కావడమే, రైతన్నలు రైతు భరోసాను వదులుకోవడమే, మళ్లీ మోసపోవడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే చంద్రముఖిని మనమే వెళ్లి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి. మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతున్నాం. గతంలో ఎప్పుడూ చంద్రబాబు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతున్నాడని చెప్పండి. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు, ఫ్యాన్‌కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్‌కు వేసే ఓటు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు మీరు వేసే ఓటు మన పేదరికం సంకెళ్లను తెంపుకోవడానికి, మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటున్న ఓటు అని చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్‌లోనే ఉండాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికీ ప్రతి ఊరికీ, ఇంత మంచి మనం చేశాం కాబట్టి, ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మోజారిటీ, 175కు 1725.. 25 ఎంపీలకు 25 ఎంపీలు.. గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా..! నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం. చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటీ కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లేదు అని ఈ సందర్భంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్‌లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారి తీస్తోంది. 90 శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంకెళ్లను తెంచుకుని వాళ్లు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికీ అవకాశం కల్పించడం, ఆ పేద పిల్లల బతుకులు మార్చాలన్నది నా కల. అది నా లక్ష్యం. ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ల మీద తాను నిలబడేట్టుగా చిరునవ్వు ఉండాలన్నది నా కల. నా లక్ష్యం. ఏ ఒక్క రైతన్న కూడా వ్యవసాయం వల్ల నష్టపోయానని చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం. ఇక ఏ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడన్న పరిస్థితి ఉండకూడదు. పేదవారికి సమానమైన అవకాశాలు రావాలి. సాధికారత కల్పించగలగాలి. అలా మార్చాలన్నది మీ బిడ్డ కల. మీ బిడ్డ సంకల్పం. మీ బిడ్డ లక్ష్యం. వైద్యం కోసం ఏ ఒక్కరూ మరణించే పరిస్థితి రాకూడదు. అప్పులపాలయ్యే పరిస్థితి, ఆస్తులమ్ముకునే పరిస్థితి రాకూడదు. అలా చేయాలన్నది నా కల. ఆ దిశగా అడుగులు వేసేది నా లక్ష్యం. వీటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల. నా లక్ష్యం. ఎవరూ కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు. ఏ పేదవాడూ వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు. ఇది నా కల. ఇదే నా లక్ష్యం. ఇందుకోసమే మనకు అధికారం కావాలి. చదువుల పరంగా, వ్యవసాయం పరంగా, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం. అక్కచెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడూ చూడని రీతిలో అడుగులు వేశాం. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడూ చూడని విధంగా ఏపీని నంబర్ వన్ దిశగా అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తున్నాం. అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది, వేస్తావున్నది, ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది, ఈ ప్రయాణం ముందుకు పోవాలి, పేదవాడి భవిష్యత్ మారాలన్నదే నా కల. దాని కోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటున్నాం. పేదవాడి భవిష్యత్ మారాలని, మార్చాలని.. దీని కోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నా. అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. అధికారం పోతుందన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ ఉండదు, రాదు అని చెబుతున్నా. హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్‌లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడటం కోసం. ప్రతి పేద వాడి ఇంట్లో మీ బిడ్డ ఫొటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికుండటం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దాని కోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. దానికోసమే మీ బిడ్డ పరితపిస్తున్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తున్నాడు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు ఒకే ఒక మాట చెబుతున్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరే ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్.. అందరూ నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి జరిగించేందుకు మీ బిడ్డ ఉన్నాడు. వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మొదలు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించుకుని అవకాశాలిచ్చిన పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మన పరిపాలన చూశారు. అందరూ ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాల పరిపాలన చూశారు. గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. ఈ రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నా. నాయకుడంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చే సరికి రంగురంగుల మేనిఫెస్టో చూపి, రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తెచ్చి అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలో వేసి మోసం చేస్తున్న చంద్రబాబులా నాయకుడు ఉండాలా? ఒక మాట నోట్లో నుంచి వచ్చాక, ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా, నష్టమైనా మాట మీద నిలబడే నాయకుడు.. నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా? అని అడుగుతున్నా. నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు. ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికీ మేనిఫెస్టో చూపించి ప్రతి కార్యకర్తా చెప్పే పరిస్థితి. ఇదీ నాయకుడంటే.. ఇదీ పార్టీ అంటే. నాయకుడంటే ప్రతి కార్యకర్తా కూడా కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు.. అలాంటి వాడే మా నాయకుడు.. అని ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసేలా నాయకుడు ఉండాలి. అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తా, ప్రతి అభిమానీ ప్రతి ఇంటికీ వెళ్లి మా అన్న ఇవన్నీ దేవుడి దయతో చేశాడు అని వారి చిరునవ్వుల మధ్య కాలర్ ఎగరేసి తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి. నాయకత్వం అంటే విశ్వసనీయత అనే పునాదుల మీద ఎప్పుడూ పెరుగుతుంది. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది. నాది. ప్రతి గ్రామానికీ మంచి చేశాం. ప్రతి ఇంటికీ మంచి చేశాం. ప్రతి పేదకూ మంచి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు.. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ, రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం ఇళ్లకు ప్రతి ఇంటికీ మంచి జరిగింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మీరందరూ మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి చూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి సచివాలయం పరిధిలో ఏకంగా రూ.20 కోట్లకుపైగా మంచి జరిగి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగనిది. దేశంలో ఎక్కడా జరగని ఈ మార్పు. ప్రతి ఇంటికీ, ప్రతి ఊరికీ మంచి చేశాం. మన హయాంలోనే బడులు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం మారింది. ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అందుకే చెబుతన్నా. వై నాట్ 175. వై నాట్ 25కు 25 ఎంపీ స్థానాలు అని గట్టిగా అడుగుతున్నా. చెబుతున్నా. పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గే పరిస్థితే ఉండకూడదని తెలియజేస్తున్నా. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటికీ కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు కొనసాగించాలనే మనకు, వాటిని రద్దు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందార్లు మరోవైపున ఉన్నారు. పెత్తందార్లను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! ఈ యుద్ధం మాట ఇచ్చిన నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం. ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబునాయుడు ప్రచారాలు, ఈనాడు రోత రాతలు, ఏబీఎన్, టీవీ5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..! ప్రతి ఒక్కరూ కూడా మీ జేబులోంచి సెల్‌ఫోన్ తీయండి.. సెల్ ఫోన్లో లైట్ బటన్ ఆన్ చేయండి.. సిద్ధం అని చెప్పండి.. ఇలా వెలుగుల బాటలో ప్రయాణానికి మరోసారి సిద్ధం అని చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ అనే నేను.. మీ సేవకుడిగా సిద్ధం అని ఈ సందర్భంగా చెబుతున్నా. 4:27PM, Mar 10, 2024 సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నలువైపులా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ కాసేపట్లో ప్రసంగించనున్న సీఎం జగన్ జన సంద్రంగా మారిన మేదరమెట్ల లక్షలాదిగా తరలివచ్చిన జనం మేదరమెట్లలో ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కువ మంది వీక్షించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు 4:20PM, Mar 10, 2024 మేదరమెట్ల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్ ప్రసంగం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జనం 4:07PM, Mar 10, 2024 మేదరమెట్ల చేరుకున్న సీఎం జగన్ జనసంద్రమైన మేదరమెట్ల వైఎస్సార్సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం 15లక్షల మందికిపైగా వైఎస్సార్సీపీ శ్రేణులు వచ్చినట్లు అంచనా జై జగన్ నినాదాలతో హెరెత్తుతున్న మేదరమెట్ల సభా ప్రాంగణం వన్స్‌మోర్ జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న మేదరమెట్ల YSRCP కొత్త క్యాంపెయిన్ నా కల ఏపీలో వైఎస్సార్సీపీ కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం సిద్ధం సభ వేదిక పై నా కల ప్రచార కార్యక్రమం ప్రారంభం ఏపీ వ్యాప్తంగా నా కల పేరుతో హోర్డింగ్ లు యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం డ్రోన్ కలకలం సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తూండగా... సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఒకటి ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనుమతి లేకుండా డ్రోన ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచి ప్రకటించారు. సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఈ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. 3:40PM, Mar 10, 2024 ఆకాశం బద్ధలైందా.. నేల ఈనిందా అన్నట్టుగా ఉంది ఇక్కడ జనసంద్రాన్ని చూస్తే.. : మంత్రి అంబటి రాంబాబు ఏంటి ఈ జన ప్రవాహం అనిపిస్తోంది ఇక్కడకు సీఎం జగన్ హాజరయ్యేలోపు ఓ నాలుగు మాట్లాడదామని వచ్చా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా 50 శాతం ప్రజలు సీఎం జగన్ కావాలనే అంటున్నారు సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు మొనగాడు కావాలా...?, మోసగాడు కావాలా...? సింగిల్ గా వస్తే చితకబాదుతాం ఇద్దరు వస్తే విసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు చంద్రబాబు రా.. కదిలి రా అంటే ఎవరూ రావడం లేదు ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం ఎలాంటి వివక్ష లేకుండా సీఎం జగన్ పారదర్శక పాలన చేశారు 3:25PM, Mar 10, 2024 చంద్రబాబు పచ్చి మోసగాడు: మంత్రి కాకాణి చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు గతంలో రైతులు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశాడు సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు 175కు 175 సీట్లు గెలిచి తీరుతాం 3:20PM, Mar 10, 2024 సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయి: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం 3:10PM, Mar 10, 2024 మేదరమెట్ల బయల్దేరిన సీఎం జగన్ కాసేపట్లో సిద్ధం సభకు హాజరుకానున్న సీఎం జగన్ జనసంద్రమైన మేదరమెట్ల వైఎస్సార్సీపీ సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రవాహం జన సునామీని తలపిస్తున్న మేదరమెట్ల సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పు సీఎం జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటనలో స్వల్ప మార్పు వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్దం’లో పాల్గొననున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. అన్నిదారులు మేదరమెట్ల వైపే కోస్తాంధ్రలో కనివినీ ఎరుగుని రీతిలో భారీగా సిద్ధం సభ రైళ్లు, బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో భారీగా తరలివస్తున్న వైఎస్సార్సీపీ క్యాడర్ రాజకీయ కుంభమేళాను తలపించనున్న సిద్ధం సభ మేదరమెట్లలో సీఎం జగన్ ఏం మాట్లాడతారనే ఆసక్తి విపక్షాలపై సీఎం జగన్ విసుర్లు ఎలా ఉండనున్నాయి? సీఎం జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ మేదరమెట్లకు పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తారంటున్న జనం సీఎం జగన్ పథకాలే ప్రతిపక్షాలు కాపీ కొడుతున్నాయి: కార్యకర్తలు ఎంతమందితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న గెలిచేది మాత్రం జగనే వైఎస్ జగన్‌ని మళ్లీ సీఎం చేయడానికి ప్రజలు ‘సిద్ధం’: ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధం సభకి 15 లక్షల మంది వస్తున్నారు చంద్రబాబు సిద్ధాంతాలు, విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు బీజేపీకి గత ఎన్నికల్లో 1 శాతం ఓట్లు వచ్చాయి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎలాంటి ప్రయోజనం లేదు సీఎం జగన్‌ని ఓడించడం ఆ మూడు పార్టీల వలన కాదు గతంలో ఎన్డీఏలో ఉండి చంద్రబాబు ఏం సాధించారు సీఎం జగన్‌కి గత ఎన్నికల కంటే అధికంగా ఓట్ల శాతం వస్తుంది అధికారమే చంద్రబాబుఏకి పరమావధి జై జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న సిద్ధం సభ మేదరమెట్ల సిద్ధం సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ జగన్ చేస్తున్న పాలన.. జనరంజకంగా సాగుతోందంటున్నారు ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా తామంతా జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్తున్నారు మేదరమెట్ల: సిద్ధం సభకు భారీగా తరలివస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర ప్రయివేటు వాహనాలన్నీ మేదరమెట్ల వైపే దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు హాజరు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు కొన్నిచోట్ల వాహనాలు దారి మళ్లింపు సిద్ధం సభకు సర్వం సిద్ధం ప్రత్యేక కాన్సెప్ట్‌తో ర్యాంప్ రూపొందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 కాన్సెప్ట్‌తో Y ఆకారంలో ర్యాంప్ ర్యాంప్ చివర 75 అడుగుల ఎత్తులో రెండు వైపులా వైఎస్సార్ కాంగ్రెస్ జెండా రెపరెపలు సీఎం జగన్ ఎన్నికల నినాదంతో ర్యాంప్ ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన వై నాట్ 175 కాన్సెప్ట్ ఇదే ర్యాంప్‌పై నడిచి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేయనున్న సీఎం జగన్ దద్దరిల్లనున్న అద్దంకి సిద్ధం సభ 🔥✊🏻 సీఎం @ysjagan కు మద్దతు తెలపడానికి నాయకులు, క్యాడర్ సర్వం సిద్ధం #Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/aIC07wOoDl — YSR Congress Party (@YSRCParty) March 10, 2024 ►రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు. ►దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారు. వీరిని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ►రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మూడు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ మ్యారిటైజ్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని తేలడంతో చివరి ‘సిద్ధం’ సభకు కూడా ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లడానికి సంసిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ దూకుడు ►ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం జగన్ సమరశంఖం పూరించారు. ఓ వైపు జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ సభలు పూర్తవడం.. అవి గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తుచేస్తూ.. ప్రభుత్వంవల్ల మంచి జరిగి ఉంటే.. మరింతగా మంచి చేయడానికి వైఎస్సార్సీపీని ఆశీర్వదించి, ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వీరికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటంతో మరింత నూతనోత్సాహంతో వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. పొత్తుల లెక్కతేలినా నైరాశ్యం.. ఇక టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక రెండు పార్టీలు మొదటిసారిగా ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభకు జనం మొహం చాటేశారు. ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు తరలిరావడంలేదు. టీడీపీ–జనసేన పొత్తును ఆదిలోనే జనం ఛీకొట్టడం.. వైఎస్సార్సీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయి. అలాగే, టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక టైమ్స్‌నౌ–ఈటీజీ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ 49 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 21–22 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని.. టీడీపీ–జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3–4 లోక్‌సభ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. ఇది ఆ రెండు పార్టీ శ్రేణులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. దీంతో ఎన్నికలకు ముందే శ్రేణులు కకావికలమవుతుండటంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి.. ఆ పార్టీతోనూ పొత్తు ఖరారు చేయించుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4,200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. నలుగురు ఎస్పీలు, 14 మంది అడిషనల్ ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు, 292 మంది ఎస్‌ఐలతోపాటు ఏఆర్ నుంచి 400 మంది, స్పెషల్ ఫోర్స్ సుమారు 160 మంది బందోబస్తులో ఉన్నారన్నారు. పదివేలకు పైగా బస్సులు, ఇతర వాహనాలు వచ్చే అవకాశమున్నందున దానికి అనుగుణంగా 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేశామని ఎస్పీ చెప్పారు. పటిష్ట ఏర్పాట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లుచేస్తోంది. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి అక్కడే మకాంవేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఆదివారం సా.3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ సభ జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి విడదల రజిని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి సమన్వయకర్త పాణెం చిన హనిమిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. ► ఆదివారం ఉ.10 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు ఎస్పీ జిందాల్ చెప్పారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డ రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లిస్తామన్నారు. ► హైదరాబాద్ వైపు నుంచి ఒంగోలు వైపునకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా.. ► నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా మళ్లిస్తున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విశాఖ వైపు ఎన్‌హెచ్ 16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్ 216 పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు. ► ఒంగోలు వైపు నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా వాహనాలను మళ్లిస్తారు. ► ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా.. విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాటిని నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా.. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తున్నారు. ► 16వ నంబర్ ఎన్‌హెచ్‌పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్‌ప్లాజా వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదని.. సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చే వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఈ ఆంక్షలు ఆదివారం రాత్రి 8 వరకూ అమల్లో ఉంటాయన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో జైత్రయాత్రకు ‘సిద్ధం’.. నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సభ..ఇంకా ఇతర అప్డేట్స్
-
వావ్.. మేదరమెట్ల సిద్ధం సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్
వైఎస్సార్సీపీ జెండాలతో.. అశేష జన వాహిని నడుమ సీఎం జగన్ నినాదాలతో గత మూడు సిద్ధం సభలు హోరెత్తడం చూశాం. ఇక ఆఖరి సిద్ధం సభ అంతకు మించి ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ జరగబోతోంది. గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే.. రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్ నెట్టింట పలువురిని ఆకట్టుకుంటున్నాయి.. -
సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన విడదల రజిని
-
యుద్ధానికి సిద్ధం.. సీఎం జగన్ ఎలక్షన్ మేనిఫెస్టో
-
Siddam Sabha: అందరి చూపు.. ఆఖరి ‘సిద్ధం’ వైపు
సాక్షి, బాపట్ల జిల్లా: సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి విడదల రజని అన్నారు. మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మేదరమెట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సిద్ధం సభలకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, ఏపీ రాజకీయ చర్రితలోనే సిద్ధం సభలకు కనీవిని ఎరుగని ప్రజామద్దతు లభిస్తోందన్నారు. గత మూడు సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో.. ఆదివారం బాపట్ల జిల్లాలో జరిగే నాలుగో సిద్ధం సభకు భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పాలన ప్రగతిని సీఎం.. ప్రజలకు వివరించున్నారు. సీఎం ప్రసంగం కోసం ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. సిద్ధం సభ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారి కోసం వందల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు సిద్ధం చేశారు. సభకు తరలివచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభావేదిక నుంచి పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
సిద్ధం సభకు పటిష్ట బందోబస్తు
-
సీఎం జగన్ సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు
-
సీఎం జగన్ సిద్ధం సభ రద్దీగా మారనున్న నెల్లూరు టూ గుంటూరు హైవే
-
ప్రజలతో పొత్తు పెట్టుకొని, సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సీఎం జగన్
-
సీఎం జగన్ సిద్ధం సభకు జన ప్రవాహం..ప్రతిపక్షాల గుండెలు గుబేల్
-
సీఎం జగన్ సిద్ధం సభకు భారీ బందోబస్తు
-
సీఎం జగన్ రాకకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాం
-
YSRCP Siddham: దద్దరిల్లేలా రేపే సిద్ధం సభ
అద్దంకి రూరల్/మేదరమెట్ల: గత మూడు సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో.. ఆదివారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడులో జరిగే నాలుగో సిద్ధం సభకు భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. సభకు అంచనాలకు మించి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారని భావిస్తున్నారు. సభ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు సభాస్థలాన్ని, వేదికను నిశితంగా పరిశీలిస్తున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు అన్నీ సిద్ధం: తలశిల రఘురామ్ సిద్ధం సభకు అన్నీ సిద్ధం చేశామని ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ చెప్పారు. సిద్ధం సభా ప్రాంగణాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. మొత్తం సుమారు 200 ఎకరాల్లో సిద్ధం సభ నిర్వహణ సాగుతుందని, సభకు వచ్చే వాహనాల కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారని చెప్పారు. సభ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వాహనాల దారి మళ్లింపు సిద్ధం సభ నేపథ్యంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ♦ నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ సంఘమిత్ర హాస్పిటల్, కర్నూలు రోడ్డు, చీమకుర్తి, పొదిలి, దొనకొండ, అడ్డరోడ్డు మీదుగా మళ్లించారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చే భారీ వాహనాలు సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా మళ్లిస్తారు. ఒంగోలు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే సాధారణ వాహనాలు మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లాలి. ♦ ఒంగోలు వైపు నుంచి విశాఖపట్నం వైపు 16వ నంబరు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్ 216పైకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతారు. ♦ ఒంగోలు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లిస్తారు. ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా వెళ్లాలి. ♦ విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వచ్చే వాహనాలను నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లిస్తారు. గుంటూరు నుంచి ఒంగోలు–చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తారు. ♦ 16వ నంబర్ జాతీయ రహదారి మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు సిద్ధం సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అద్దంకి నుంచి నాగులపాడు, వెంకటాపురం మీదుగా జాతీయ రహదారిపై ఎటువంటి వాహనాలు అనుమతించరు. ♦ ఈ ఆంక్షలు 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అమలులోకి వస్తాయని ఎస్పీ తెలిపారు. -
175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం
మేదరమెట్ల: రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగవ సిద్ధం సభను భారీఎత్తున విజయవంతం చేయడానికి సర్వ సన్నద్ధమవుతున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక రానున్న ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను సీఎం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఆదివారం జరిగే సిద్ధం మహాసభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈసభ విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ నిర్వహించే వంద ఎకరాలకు పక్కన మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేశామన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టును దాదాపు పూర్తిచేశామని.. తీర ప్రాంతంలో మిగిలిన పోర్టుల పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయన్నారు. ఎన్నో పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాయన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరుగుదలకు అభివృద్ధి పనులే కారణం అన్నారు. అభివృద్ధి లేకపోతే తలసరి ఆదాయం పెరగదని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేశామని తెలిపారు. బీసీలకు తెలివితేటలు లేవని, బీసీలు జడ్జిలుగా పనికిరారు అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటే ఎవరూ నమ్మరని చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 75 శాతం పదవులు ఇచ్చారని చెప్పారు. వైనాట్ 175 ఎందుకంటున్నామో.. సిద్ధం సభ ద్వారా చూపిస్తామన్నారు. నేషనల్ మీడియా నుంచి కూడా అనేక మంది సిద్ధం సభకు హాజరవుతున్నారని, సిద్ధం సభల గురించి తెలుసుకోవడానికి వారు ఎంతో ఆసక్తితో ఉన్నారన్నారు. మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేనలు పొత్తుల కోసం వెంపర్లాడే పార్టీలని.. తాము ముఖ్యమంత్రిని చూపించి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. అభ్యర్థులను వేరే చోటికి మార్చినంత మాత్రాన తమ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. మార్చి 13, 14 లేదా 15 తేదీల్లో ఎన్నికల ప్రకటన రావచ్చన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన సిద్ధం టీ షర్టులను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి తాటిపర్తి చంద్రశేఖర్, పొన్నూరు ఇన్చార్జి అంబటి మురళి, గుంటూరు తూర్పు ఇన్చార్జి ఫాతిమా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాదు: విజయసాయిరెడ్డి
సాక్షి, బాపట్ల: జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని.. కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైఎస్సార్సీపీ నిర్వహించబోయే సిద్ధం ముగింపు సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పర్యవేక్షించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మేదరమెట్ల సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మా అంచనా ప్రకారం 15 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. సభా ప్రాంగాణాన్ని అవసరమైతే ఇంకో 200 ఎకరాలకు పొడిగిస్తాం. ఇదే ఆఖరి సిద్ధం సభ.. .. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనలో ఏపీలో 87 శాతం కుటుంబాలు సంక్షేమ పథకాలు పొందారు. ఏపీ అభివృద్ధి చెందినది కాబట్టి తలసరి ఆదాయం పెరిగింది. రామాయపట్నం పోర్ట్ ని రికార్డు సమయంలో ముఖ్యమంత్రి పూర్తి చేశారు. పోర్టులు అభివృద్ధి పరిచాం. ఇదంతా అభివృద్ధి కాదా?. విశాఖ ఎయిర్‌పోర్టును కూడా అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి.. తప్పడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొదు. .. టీడీపీ జనసేన 20 ఎకరాలలో సభ పెట్టి 6 లక్షలు వచ్చారని డబ్బాలు కొట్టారు. టీడీపీ బీసీ డిక్లరేషన్ అనేది హాస్యాస్పదం. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారు అని గతంలో చంద్రబాబు అన్నారు. కానీ, 75 శాతం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవులిచ్చారు. 2024 ఎన్నికలకు నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ప్రచారం ముమ్మరం అవుతుంది. ఎటువంటి పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాదు. మా టార్గెట్ 175 సీట్లు కొట్టి తీరుతాం. మేదరమెట్ల సిద్ధం వేదికగా వచ్చే ఏదేళ్లలో చేయబోయే కార్యక్రమాల్ని వివరిస్తాం. రాబోయే కాలంలో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం’’ అని విజయసాయిరెడ్డి అన్నారాయన. -
ఈనెల 10న మేదరమెట్లలో సిద్ధం బహిరంగ సభ
-
సిద్ధం సభలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
భారీ ప్రణాళికలతో బాపట్ల సిద్ధం సభ
-
సిద్ధం సభకు సర్వం సమాయత్తం
ఒంగోలు: ఈనెల 10న ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించనున్న సిద్ధం సభకు సర్వం సమాయత్తంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు, బాపట్ల జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని వీకేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్‌హాలులో సిద్ధం నాలుగో సభ పోస్టర్‌ను, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పాటను రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్ల వద్ద నిర్వహించే సిద్ధం సభలో ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి, రాజకీయంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి చేసిన కృషిని వివరిస్తారన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో పొందుపరచబోయే అంశాలను వివరిస్తారని చెప్పారు. 15 లక్షల మందికిపైగా హాజరవుతారు నాలుగో సిద్ధం సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 15 లక్షల మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. 100 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నామని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తొలి సిద్ధం సభకు, ప్రస్తుత సభలకు మధ్య సర్వేల ద్వారా పరిశీలిస్తే పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందన్నారు. దీనిని బట్టి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాల గెలుపు అతిశయోక్తి కాదని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఈ సభ అనంతరం సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పరిశీలకులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగునీరు, మౌలిక సౌకర్యాలు, వారు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో కార్యక్రమాన్ని అప్పజెప్పడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు చేపట్టామన్నారు. వాహనాల పార్కింగ్, వాటి నిర్వహణ బాధ్యతలను విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం పర్యవేక్షిస్తారన్నారు. గత ప్రభుత్వాల పాలనతో పోల్చిచూసుకుంటే బీసీల అభివృద్ధికి ఎవరు పాటుపడుతున్నారో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని, ఈ నేపథ్యంలోనే బీసీలంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారన్నారు. బీసీల అభివృద్ధి కాంక్షిస్తూ అటు పార్లమెంట్, ఇటు శాసనసభలో వారికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు నిదర్శనంగా ఉందన్నారు. విజయవంతానికి కృషి చేస్తాం: బాలినేని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు హాజరయ్యేలా చర్యలు చేపడతామన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసినా వైఎస్సార్సీపీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు. అంతకు ముందు విజయసాయిరెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పరిశీలకులు, సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. సిద్ధం సభకు సంబంధించి నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తనను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తలశిల రఘురాం, తూమాటి మాధవరావు, శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, కుందూరు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, మేకపాటి విక్రమ్‌రెడ్డి, దర్శి ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు, అద్దంకి ఇన్చార్జి పాణెం హనిమిరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
YSRCP: మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు
సాక్షి, ప్రకాశం: బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ సభలోనే వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘మేదరమీట్లలో సిద్ధం సభను ఈనెల పదో తేదీన నిర్వహిస్తున్నాం. ఈ సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారు. ఈ సభలోనే వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు. ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
మా టార్గెట్.. సిద్ధం సభకు సర్వం సిద్ధం
-
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం
-
ఎన్నికల యుద్ధానికి సిద్ధం
-
15 లక్షల మందితో..సిద్ధం సభ
-
175 స్థానాల్లో గెలుపే లక్ష్యం
మేదరమెట్ల: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు వద్ద వచ్చే నెలలో నిర్వహించే సిద్ధం సభ కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని ఆయన పార్టీ నేతలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభను 10వ తేదీకి మార్చామన్నారు. సిద్ధం సభలు ఎక్కడ జరిగినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈసారి సభకు 15 లక్షల మంది హాజరయ్యేలా వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరో వంద ఎకరాలు కూడా సభాప్రాంగణానికి ఆనుకుని అందుబాటులో ఉన్నాయన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ప్రజలు ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. మార్చి 10న సిద్ధం సభకు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన చేస్తోందని కొనియాడారు. ప్రజల స్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందడం ఖాయమని తెలుస్తోందన్నారు. మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని.. అతి త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రకటించకుండా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారని చెప్పారు. ఎంతమంది పొత్తులతో వచ్చి నా ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, ఎంపీలు నందిగం సురే‹Ù, మోపిదేవి వెంకట రమణారావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పానెం చిన హనిమిరెడ్డి, కరణం వెంకటేశ్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల జిల్లా మేదరమిట్లలో "సిద్ధం" సభ: విజయసాయిరెడ్డి
-
Siddam Sabha: బాపట్ల ‘సిద్ధం’.. మార్చి 10న
సాక్షి, బాపట్ల జిల్లా: అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభను మార్చి 10న నిర్వహించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మార్చి 3న జరగాల్సిన సభను మార్చి 10వ తేదీకి మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ‘‘98 ఎకరాలలో సభ ప్రాంగణం ఉంటుంది. పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. 6 జిల్లాల నుంచి ప్రజలు హాజరవుతారు. ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో దిశా నిర్ధేశం చేస్తారు. 13,14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండవచ్చు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పేద వర్గాలతో పాటు అగ్రకులాలలో కూడా వైఎస్సార్సీపీపై అపూర్వ స్పందన ఉంది. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నాం. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పాలన చేసింది. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం మాకు ఉంది. మేదరమెట్ల సిద్ధం సభలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రసంగిస్తారు. 5 గంటలకు సభ ముగుస్తుంది’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘మేనిఫెస్టో పై చర్చ జరుగుతోందని.. అతి త్వరలో విడుదల చేస్తామన్నారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుందని, పొత్తులు ఎవరు పెట్టుకున్నా.. ప్రజలు మా వైపే ఉన్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఆస్తుల అమ్మకం.. పవన్ సరికొత్త నాటకం -
LIVE: మేము సిద్ధం..మా పోలింగ్ బూత్ సిద్ధం
-
మార్చి 3 పల్నాడు జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ
-
ఎన్నికలకు ‘సిద్ధం’ కావాలని తెలియజేసేలా సభ
నెల్లూరు(దర్గామిట్ట): బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో మార్చి 3న సిద్ధం సభను విజయవంతంగా నిర్వహిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని తెలియజేసేలా సభ ఉంటుందని చెప్పారు. సిద్ధం సభ విషయమై నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయకర్తలు పాల్గొన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు సిద్ధం సభలు భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించామని, మేదరమెట్లలో నిర్వహించే ఆఖరి సభకు 15 లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సభలో సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్ల 10 నెలల కాలంలో అందించిన పాలన, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తమ పాలనలో అందించిన మేలును వివరిస్తారని చెప్పారు. భీమిలి, ఏలూరు తర్వాత రాప్తాడులో జరిగిన సభ అజరామరమని, ప్రజలను ఉత్తేజ పరిచేలా ఉందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో తయారవుతోందని, త్వరలో విడుదలవుతుందని తెలిపారు. నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్య ర్థిగా శరత్ చంద్రారెడ్డి పోటీ చేయరన్నారు. త్వరలోనే జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని, నెల్లూరు ఎంపీ అభ్య ర్థిని ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లçపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీ«ధర్, సమన్వయకర్తలు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మహ్మద్ ఖలీల్, దద్దాల నారాయణయాదవ్, తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చెవిరెడ్డి అభినవ్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మేయర్ స్రవంతి,పాల్గొన్నారు. -
Feb 24th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:05PM, Feb 24th, 2024 టీడీపీ-జనసేనకు అభ్యర్థులే దొరకడం లేదు: జోగి రమేష్ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు మా టార్గెట్ 175కు 175 సీట్లు గెలవడమే మళ్లీ వైఎస్ జగనే సీఎంగా కొనసాగడం ఖాయం 8:50PM, Feb 24th, 2024 తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబుకి ఇదే ఆఖరి ఎలక్షన్: ఎంపీ కేశినేని నాని ఎన్నికల ఫలితాలు రాగానే సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్ళిపోతాడు జనసేన నాయకులు కార్యకర్తలపై జాలేస్తుంది జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆయన చంద్రబాబుకు ప్రాణమిచ్చేందుకు సిద్ధపడుతున్నాడు రాజానగరంలో జక్కంపూడి రాజాను కచ్చితంగా గెలిపించుకోవాలి 8: 40PM, Feb 24th, 2024 విజయవాడ: వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించకపోవడంపై రంగా , రాధా అభిమానులు ఆగ్రహం చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రంగా అభిమానులు వంగవీటి రంగాను పొట్టపెట్టుకున్న చంద్రబాబు ... వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారు వంగవీటి రాధాకు టిక్కెట్ ఇవ్వకుండా మరోమారు రంగాను పొట్టన పెట్టుకున్నాడు రంగా కుటుంబానికి మరోమారు ద్రోహం చేశారు బోండా లాగా కబ్జాలు రౌడీయిజాలు రాధా చేయలేరు ప్రజల రక్తాన్ని పీల్చి ముడుపులు తెచ్చి ఇవ్వలేరు కాబట్టే కాపు ముద్దుబిడ్డ రంగా వారసుడుని పక్కనపెట్టి నీచరాజకీయాలకు తెరలేపారు రంగా ఆత్మక్షోభకు గురయ్యేలా చేశారు చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహి 8: 20PM, Feb 24th, 2024 చిత్తూరు: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ముందుంది: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ, జనసేలు అభ్యర్థులను వెతుకుతున్నాయి ఇవాళ ప్రకటించిన లిస్ట్ చూస్తే ఆ కూటమికి అభ్యర్థులు కరువైనట్లు కనిపిస్తోంది మరోసారి వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం 7:40PM, Feb 24th, 2024 మనం ఆయన్ని నమ్మాము... కానీ ఆయన మనల్ని నమ్మలేదు పవన్ కళ్యాణ్ పై కొత్తపేట జనసేన ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ వ్యాఖ్యలు టిక్కెట్టు దక్కకపోవడంపై నిర్వేదం. 6:50 PM, Feb 24th, 2024 మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోటలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. శంకర్‌కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గయుల ఆగ్రహం ఫ్లెక్సీలు చింపివేసి నిరసన 6:45 PM, Feb 24th, 2024 ఏపీలో రోడ్డెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు టికెట్ రాకపోవడంతో పలుచోట్ల నిరసనలు పి.గన్నవరం టికెట్ మహాసేన రాజేష్‌కు కేటాయించిన టీడీపీ! మహాసేన రాజేష్‌కు ఇవ్వడంపై తమ్ముళ్ల ఆగ్రహం పార్టీకి రాజీనామా చేసిన పి.గన్నవరం మండల అధ్యక్షుడు సత్తిబాబు 6:44 PM, Feb 24th, 2024 నెల్లూరు: వచ్చే నెల 3న మేదరమెట్లలో సిద్ధం సభ: విజయసాయి రెడ్డి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో చర్చించాం మేదరమెట్ల సభకు 15 లక్షల మందికి పైగా వస్తారు 2024 నుంచి 2029 వరకు ఏమి చేయబోతున్నారో జగన్ వివరిస్తారు ప్రభుత్వం అందించిన పథకాలను సభలో సీఎం జగన్ వివరిస్తారు 6:43 PM, Feb 24th, 2024 జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర భావోద్వేగం టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో ఆమరణదీక్ష అచ్యుతాపురం దుర్గాదేవి గుడి ఎదుట దీక్షకు సిద్ధమైన సూర్య ఆమరణ దీక్షతో ప్రాణాలు పోయినా లెక్కచేయను రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్లు అసెంబ్లీకి వెళ్లకూడదా? సామాన్యులు టికెట్ కోరుకోవడమే తప్పా? : సూర్యచంద్ర 6:41 PM, Feb 24th, 2024 ఉత్తరాంధ్రలో జనసేనకు ఇచ్చిన 2 స్థానాల్లో టీడీపీ అసంతృప్తులు నెల్లిమర్ల, అనకాపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ల అసంతృప్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కర్రోతు బంగార్రాజు అనకాపల్లి టికెట్ పీలా గోవింద్ కే ఇవ్వాలని అనుచరుల డిమాండ్ 6:40 PM, Feb 24th, 2024 ఏలూరు: టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టీడీపీ టికెట్ ఇవ్వడంతో అలక ఉండి నుంచే పోటీ చేస్తానని తన క్యాడర్‌కు కలువపూడి శివ భరోసా 2009, 2014లో ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కలువపూడి శివ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న కలువపూడి శివ 6:20PM, Feb 24th, 2024 పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైంది: పేర్ని నాని ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడు 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా? పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సామేత గుర్తొస్తుంది పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారు పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు నే డిసైడ్ చేస్తారు జనసేన , టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలంట చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారు కాపులకు మరి హీనంగా 7 సీట్లు ప్రకటించారు చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది సీఎం జగనే భువనేశ్వరి భయంతో చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటుంది అని బాబు భయపడ్డాడు ఈ జాబితా తో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది 5:53PM, Feb 24th, 2024 అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీలో రచ్చరచ్చ తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు మొండిచెయ్యి టీడీపీ ఫ్లెక్సీలను చింపేసిన శంకర్ యాదవ్ వర్గం 5:50PM, Feb 24th, 2024 టీడీపీ-జనసేన శ్రేణుల్లో విభేదాలు, అసమ్మతి సెగలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతకు మొండిచెయ్యి చింతలపూడి నాన్‌లోకల్‌కు టికెట్ కేటాయింపుతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలు ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం తణుకులో పవన్ మాట ఇచ్చినా.. రామచంద్రరావుకు దక్కని సీటు తాడేపల్లిగూడెం, నర్సాపురం స్థానాల్లో టీడీపీ-జనసేనల మధ్య కుదరని సయోధ్య ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్ప నాయుడికి ఆశాభంగం 5:05PM, Feb 24th, 2024 పవన్ కనీసం తన సీటును ప్రకటించుకోలేదు:మంత్రి అంబటి ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారు పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిచారు పల్లకీ మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు చేసుకో చంద్రబాబును కాపాడేందుకు పవన్ రాజకీయాల్లోకి వచ్చారు చంద్రబాబు, పవన్ ఓడిపోతారని వాళ్ల ఫేస్ చూస్తే తెలుస్తుంది పవన్ ఎక్కడ పోటీ చేస్తారో తెలియన అధ్వాన్న స్థితి చంద్రబాబు పల్లకి మోసే దశకు పవన్ చేరుకున్నారు ప్యాకేజీ రాజకీయాల్లో పవన్ బలికావొద్దు 5:02PM, Feb 24th, 2024 కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్ ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బుద్ధప్రసాద్ అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని ఆశపడ్డ బుద్ధ ప్రసాద్ పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును పెండింగ్ లో పెట్టిన చంద్రబాబు , పవన్ నాపేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉంది నేను పదవుల కోసం పుట్టలేదు రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబు పై పరోక్ష విమర్శలు చేసిన బుద్ధప్రసాద్ 5:00PM, Feb 24th, 2024 విజయనగరం: కళా వెంకట్రావ్ వర్గానికి ఆశాభంగం కిమిడి కళా వెంకట్రావ్, కిమిడి నాగార్జునకు దక్కని చోటు కళా వెంకట్రావ్ వ్యతిరేకించిన కొండ్రు మురళీమోహన్‌కు రాజాం టికెట్ 4:56PM, Feb 24th, 2024 విశాఖ జిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం విశాఖ వెస్ట్ టీడీపీ టికెట్ గణబాబుకు కేటాయించడంపై పాసర్ల అసంతృప్తి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కార్యదర్శి పాసర్ల ప్రసాద్ రాజీనామా తొలి నుంచి గణబాబుకు టికెట్‌ను వ్యతిరేకిస్తున్న పాసర్ల ప్రసాద్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేసినా గుర్తింపు దక్కలేదని పాసర్ల ఆవేదన 4:50PM, Feb 24th, 2024 ప్యాకేజీ స్టార్ సీటుపై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు: మంత్రి అమర్నాథ్ 24 సీట్లు తీసుకున్న పవన్ ఎలా సీఎం అవుతాడు? అది ప్యాకేజీ ఇంజినీరింగ్..! సామాజిక న్యాయాన్ని పట్టించుకోని టిడిపి, జనసేన కాపులను హింసించిన బాబును ఎలా నమ్ముతారు? మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే 4:10PM, Feb 24th, 2024 టీడీపీ, జనసేన పార్టీల డొల్లతనం బయటపడింది: ధర్మశ్రీ నియోజకవర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి పవన్ పార్టీని జనసేన అనాలో, భజన సేన అనాలో అర్థమైంది పవన్.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు పార్టీకి జెండా.. అజెండా ఉండాలి కాపులకి ఏ విధంగా న్యాయం చేశావో చెప్పాలి టీడీపీకి నీ భాషలో పొత్తు.. కానీ జనం భాషలో తొత్తుగా తయారయ్యావు పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే సినిమాలు చేసుకో: మంత్రి అంబటి పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది ..... మన అన్నగారిలా!! పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది ..... మన అన్నగారిలా!!@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2024 పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2024 3:56 PM, Feb 24th, 2024 తికమక పొత్తులు - వెన్నుపోటు కత్తులు! 😂#TDPJSPCollapse#EndOfTDP pic.twitter.com/msvjk4bJrQ — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 3:30 PM, Feb 24th, 2024 బంటుమిల్లి పర్యటనలో వేదవ్యాస్‌కు అస్వస్థత కృష్ణా : చినపాండ్రాక PHCలో వేదవ్యాస్‌కు ప్రాథమిక చికిత్స పెడన టికెట్ కృష్ణప్రసాద్‌కు కేటాయించడం పై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ అసంతృప్తి 2024లో పెడన సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఏం జరిగిందో తెలియదు కానీ లిస్ట్ లో నా పేరు లేదు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తా 3:16 PM, Feb 24th, 2024 తిరుపతి: కాపుల ఆత్మగౌరవాన్ని బాబుకు పవన్ తాకట్టు పెట్టారు: మంత్రి ఆర్కే రోజా పవన్.. రాజకీయాలకు పనికిరారు 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని బాబుకు పవన్ తాకట్టు పెట్టారు పవన్, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికిపోయారు ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు 2:50 PM, Feb 24th, 2024 కాకినాడ: టీడీపీ-జనసేనలో టికెట్ల అసమ్మతి జగ్గంపేట సీటు టీడీపీకి కేటాయించడంపై జనసేనలో నైరాశ్యం టీడీపీ టికెట్ జ్యోతుల నెహ్రూకు కేటాయింపుపై జనసేనలో అసంతృప్తి పవన్ తీరుపై తీవ్ర మనస్తాపం చెందిన జనసేన ఇన్చార్జ్ సూర్యచంద్ర ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పని బోరున విలపించిన పాఠంశెట్టి 2:40 PM, Feb 24th, 2024 టీడీపీలో అసంతృప్తి సెగలు రాయచోటిలో రమేష్ రెడ్డికి మొండిచేయి రామ్ ప్రసాద్ రెడ్డికి రాయచోటి టికెట్ ప్రకటన తనను సంప్రదించకుండా టికెట్ ప్రకటించారని రమేష్ రెడ్డి ఆగ్రహం చంద్రబాబుది అనాలోచిత నిర్ణయంత్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా 2:30 PM, Feb 24th, 2024 బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే చంద్రబాబు వ్యవహారశైలిపై ఫైర్ అవుతున్న ఇతర వర్గాలు 2:20 PM, Feb 24th, 2024 అనంతపురం : కల్యాణదుర్గం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు టికెట్ కేటాయించిన చంద్రబాబు చంద్రబాబు తీరుపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఆగ్రహం చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసిన ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం 2:10 PM, Feb 24th, 2024 గజపతి నగరం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి పార్టీ కార్యాలయంలో అనుచరులతో అప్పలనాయుడు అత్యవసర భేటీ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు కొండపల్లి అప్పలనాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై క్యాడర్ అసంతృప్తి కష్టకాలంలో పార్టీ జెండాను మోసినవారిని ఎందుకు కాదన్నారంటూ ఆగ్రహం 2:00 PM, Feb 24th, 2024 24 సీట్లతో యుద్ధం చేస్తావా పవన్: సజ్జల పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారు చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారు ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవు జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు తాను పోటీ చేసే స్ధానంపైనా పవన్ కు క్లారిటీ లేదు జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారు పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలి 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరు పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుంది 24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా? 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా మాకు ఇబ్బంది లేదు వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే ఘన విజయం 1:10 PM, Feb 24th, 2024 కర్నూలు టీడీపీలో ముసలం.. ఆలూరు టీడీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు. ఆలూరు ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మకు సైడ్ ఇస్తున్న చంద్రబాబు.. మాజీలు వీరభద్రగౌడ్, శివప్రసాద్ పేర్లు టికెట్ కోసం పరిశీలన. దీంతో, టీడీపీలో ముసలం. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తిరుగుబాటు తప్పదంటున్న టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా ఆలూరులో @JaiTDP లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి..! ఆలూరు ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మని పక్కనపెట్టి.. మాజీలు వీరభద్రగౌడ్, శివప్రసాద్ పేర్లని టికెట్ పరిశీలన కోసం @ncbn తీసుకోవడంతో ముసలం మొదలైంది. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో తిరుగుబాటు… — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 1:00 PM, Feb 24th, 2024 తొలి జాబితా ఎఫెక్ట్.. టీడీపీకి షాక్! రాయచోటిలో చంద్రబాబుపై తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలకు రెడీ అయిన టీడీపీ నేతలు ఇంఛార్జ్ రమేష్‌రెడ్డి హ్యాండిచ్చిన చంద్రబాబు. టీడీపీని వీడిన 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, 6 మంది పీఎంపీ, 20 మంది ఐటీడీపీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి తదితరులు. డబ్బు కోసం టీడీపీ టికెట్ అమ్ముకోవడానికి నిరసనగా రాజీనామాలు. రాయచోటిలో బాబుపై తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలు..! నియోజకవర్గ ఇంఛార్జ్ రమేశ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, 6 మంది పీఎంపీ, 20 మంది ఐటీడీపీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి తదితరులు పార్టీని వీడారు.… — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 12:45 PM, Feb 24th, 2024 ఒంటరిగా పోటీకి దమ్ములేని చంద్రబాబు.. తొలి జాబితాలో టీడీపీకి 94 స్థానాలు, జనసేకు 24 స్థానాలు, బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు బీజేపీ కోసం 57 స్థానాలను రిజర్వ్ చేసిన బాబు, పవన్ బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు రెడీ అయిన చంద్రబాబు. బీజేపీ కోసం వెంపర్లాడుతున్న @ncbn ఇప్పటికే @JaiTDP కి కొన్ని సీట్లు కేటాయించి, @JanaSenaParty కి కొన్ని సీట్లు ముష్టి వేసి, బీజేపీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళని కూడా పొత్తులోకి తీసుకుని వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచాడు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే దమ్ములేని… — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 12:15 PM, Feb 24th, 2024 టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు వీరే.. ఇచ్ఛాపురం- బెందాళం అశోక్ టెక్కలి-అచ్చెన్నాయుడు ఆమదాలవలస-కూన రవికుమార్ రాజాం-కోండ్రు మురళి కురుపాం - తొయ్యక జగదీశ్వరి పార్వతీపురం - విజయ్ బోనెల సాలూరు - గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి-ఆర్ఎస్వీకేకే రంగారావు(బేబీ నాయన) గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం - అదితి గజపతిరాజు విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు అరకు - సియ్యారి దొన్ను దొర పాయకరావుపేట - వంగలపూడి అనిత నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు తుని-యనమల దివ్య పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు పి.గన్నవరం - రాజేశ్ కుమార్ కొత్తపేట - బండారు సత్యానంద రావు మండపేట - జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) ఆచంట - పితాని సత్యనారాయణ పాలకొల్లు - నిమ్మల రామానాయుడు ఉండి - మంతెన రామరాజు తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు - బాదెటి రాధాకృష్ణ చింతలపూడి - సోంగ రోషన్ తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు - కొలుసు పార్థసారథి గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ - వెనిగండ్ల రాము పెడన - కాగిత కృష్ణ ప్రసాద్ మచిలీపట్నం - కొల్లు రవీంద్ర పామర్రు - వర్ల కుమార రాజ విజయవాడ సెంట్రల్ - బొండ ఉమ విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన రావు నందిగామ - తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి - నారా లోకేశ్ పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర వేమూరు(ఎస్సీ) - నక్కా ఆనంద్‌బాబు రేపల్లె - అనగాని సత్యప్రసాద్ బాపట్ల - వి.నరేంద్ర వర్మ ప్రత్తిపాడు(ఎస్సీ) - బూర్ల రామాంజినేయులు చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి - కన్నా లక్ష్మినారాయణ వినుకొండ - జీవీ ఆంజనేయులు మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి యర్రగొండపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్సన్ బాబు పర్చూరు - ఏలూరి సాంబశివరావు అద్దంకి - గొట్టిపాటి రవికుమార్ సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజి నిరంజన్ విజయ్‌కుమార్ ఒంగోలు - దామచర్ల జనార్దనరావు కొండపి - డోలా బాల వీరాంజనేయస్వామి కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కావలి - కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ - పి. నారాయణ నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గూడూరు (ఎస్సీ) - పాశం సునీల్‌కుమార్ సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవేల విజయశ్రీ ఉదయగిరి - కాకర్ల సురేశ్ కడప - మాధవిరెడ్డి రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కర్నూలు - టీజీ భరత్ పాణ్యం - గౌరు చరితా రెడ్డి నంద్యాల - ఎన్ఎండీ ఫరూక్ బనగానపల్లి - బీసీ జనార్దనరెడ్డి డోన్ - కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పత్తికొండ - కేఈ శ్యాంబాబు కోడుమూరు - బొగ్గుల దస్తగిరి రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు ఉరవకొండ - కేశవ్ తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి శింగనమల (ఎస్సీ) - బండారు శ్రావణి శ్రీ కల్యాణదుర్గం - అమిలినేని సురేంద్రబాబు రాప్తాడు - పరిటాల సునీత మడకశిర (ఎస్సీ) - ఎం.ఈ. సునీల్‌కుమార్ హిందూపురం - నందమూరి బాలకృష్ణ పెనుకొండ - సవిత తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి పీలేరు - నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి నగరి - గాలి భానుప్రకాశ్ గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డాక్టర్ వీఎం. థామస్ చిత్తూరు - గురజాల జగన్మోహన్ పలమనేరు - ఎన్.అమర్నాథ్రెడ్డి కుప్పం - నారా చంద్రబాబు నాయుడు ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులు వీరే కాకినాడ రూరల్.. నానాజీ, నెల్లిమర్ల.. లోకం మాధవి తెనాలి.. నాదెండ్ల మనోహర్ అనకాపల్లి.. కొణతాల రామకృష్ణ. రాజానగరం.. రామకృష్ణుడు 11:25AM, Feb 24th, 2024 ఏపీలో పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్ పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. టీడీపీ, జనసేన పొత్తులో ఉండి సీట్ల సర్ధుబాటు చేసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు ఆ విషయం అధిష్టానం చూసుకుంటుంది. అప్పటివరకు క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తాం 11:10AM, Feb 24th, 2024 చంద్రబాబుతో పవన్, మనోహర్ భేటీ టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాపై కసరత్తు చంద్రబాబుతో పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ కాసేపట్లో అభ్యర్థుల ప్రకటన 10:54AM, Feb 24th, 2024 బీజేపీతో టీడీపీ-జనసేన దొంగాట.. ఒకవైపు బీజేపీతో చర్చలు అంటూనే మరోవైపు టీడీపీ-జనసేన సీట్ల ప్రకటన ఈనెల 21, 22న బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు-పవన్ చర్చలని లీకులు పొత్తుల డ్రామా ఆడి చివరికి ఏకపక్షంగా సీట్లు ప్రకటిస్తున్న టీడీపీ-జనసేన బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడవడం కొత్తేమీ కాదంటున్న పరిశీలకులు ఇలా అయితే ఇక పొత్తు లేనట్లే అంటున్న బీజేపీ నేతలు 10:43 AM, Feb 24th, 2024 బాబు ఇంటికి జనసేనాని చంద్రబాబు నివాసానికి బయల్దేరిన పవన్ కల్యాణ్ కాసేపట్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల తొలి జాబితాను ప్రకటించనున్న బాబు-పవన్ టీడీపీ-జనసేనకు 50-10 లేదంటే 60-10గా ఉండే అవకాశం 10:15 AM, Feb 24th, 2024 ఏం చేద్దాం తమ్ముళ్లూ? కాసేపట్లో టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ 11 గంటలకు అభ్యర్థులు ఇరువురు నేతల సంయుక్త ప్రకటన టీడీపీ నుండి 50, జనసేన నుండి 10 సీట్లు ప్రకటించే అవకాశం కాసేపటి కిందట.. ఉండవల్లిలోని తన నివాసంలో కీలక నేతలతో చంద్రబాబు భేటీ హాజరైన అచ్చెన్న, యనమల తదితర సీనియర్లు జాబితాపై నేతలతో బాబు చర్చలు పలు నియోజకవర్గాల కోసం ఇరు పార్టీల నడుమ తీవ్ర పోటీ టికెట్ దక్కనివాళ్లు త్యాగాలు చేస్తారా? తిరగబడతారా? .. నెలకొన్న ఆసక్తి ఇదీ చదవండి: టీడీపీ-జనసేనలో మిగిలేదెవరో? 10:05 AM, Feb 24th, 2024 ఎల్లో మీడియా చెత్త రాతలు.. జర్నలిజం విలువలు వదిలేసిన ఎల్లో మీడియా చంద్రబాబుకు అధికారం కోసం పిచ్చి రాతలు.. ప్రభుత్వంపై బురద చల్లి వికృతానందం. టిష్యూ పేపర్లా మారిన ఆంధ్రజ్యోతి. 9:45 AM, Feb 24th, 2024 చంద్రబాబు సొంతింట్లో కుంపటి.. కుప్పం నుంచి బైబై అంటున్న చంద్రబాబు పోటీకి రెడీ అంటున్న భువనేశ్వరి చంద్రబాబు సొంతింట్లో కుంపటి..! #WhyNotKuppam#ByeByeBabu#WhyNot175#EndOfTDP pic.twitter.com/dKCTquryle — YSR Congress Party (@YSRCParty) February 23, 2024 9:15 AM, Feb 24th, 2024 అజ్ఞాతంలోకి టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి రెండు రోజులుగా అజ్ఞాతంలోకి చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున. చీపురుపల్లి నుండి గంటా శ్రీనివాసరావును పోటీ చేయమని ఆదేశించిన టీడీపీ అధిష్టానం. అధిష్టానం తీరుతో పార్టీకి దూరంగా కిమిడి నాగార్జున. చంద్రబాబు ఫోన్‌కు స్పందించని నాగార్జున. గంటాకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్దం అవుతున్న చీపురుపల్లి కేడర్ 8:40AM, Feb 24th, 2024 పెద్దాపురంలో టీడీపీలో కొత్త ట్విస్ట్.. పెద్దాపురంలో టడీపీ సీటు విషయంలో కొత్త ట్విస్ట్ చిన రాజప్పకు కంట్లో నలుసుగా మారిన లోకేష్ అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి. సీటు కోసం విశ్వప్రయ్నాలు చేస్తున్న చంద్రమౌళి ఇటీవల కారణంగా నియోజకవర్గంలో తన కుమారుడు రంగనాథ్‌ను పార్టీ కార్యక్రమాలకు తిప్పిన రాజప్ప టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో రాజప్పకు 52%, నోటాకు 48% ఓటింగ్. దీంతో పెద్దాపురంలో మరోసారి ఇంటర్నల్ సర్వే చేపట్టిన టీడీపీ. పెద్దాపురం సీటు నాదే అంటున్న చినరాజప్ప. నేడు ప్రకటించే జాబితపై రాజప్ప ఉంటుందా? అనే అంశంపై ఆసక్తికర చర్చ. 8:15AM, Feb 24th, 2024 బొబ్బిలి టికెట్‌పై సస్పెన్స్.. బొబ్బిలి టీడీపీ టికెట్‌పై తర్జన భర్జన. టికెట్ ఆశిస్తున్న బేబీనాయనకు ఆశాభంగం అని జోరుగా ప్రచారం. తెరపైకి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు పేరు. బేబీనాయన శిబిరంలో తీవ్ర అసంతృప్తి. 7:45AM, Feb 24th, 2024 నేడు టీడీపీ-జనసేన జాబితా విడుదల! పొత్తుల్లో భాగంగా నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాబితా విడుదల 60-70 నుంచి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం జాబితా విడుదల నేపథ్యంలో టీడీపీ నేతల్లో టెన్షన్ టికెట్ రాకపోతే చంద్రబాబుపై యుద్ధానికి రెడీ అంటున్న పచ్చ నేతలు కొందరికి సీటు ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలు చోట్ల ఉద్రిక్తతలు 7:25AM, Feb 24th, 2024 టీడీపీలో ముసలం.. పారాచూట్ నేతల హవా.. ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల్లో దిగిపోయిన బయట వ్యక్తులు ధన బలం, ఇతర హంగులుండడంతో వారికే చంద్రబాబు ప్రాధాన్యం మొదటినుంచి ఉన్నవారిని పక్కన పెట్టడంతో వారిలో తీవ్ర అసంతృప్తి గుడివాడలో వెనిగళ్ళ రాము రాకతో మొదటి నుంచి ఉన్న ‘రావి’కి చెక్ గుంటూరులో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ కోసం పార్టీ నేతలకు ఝలక్ పార్వతీపురంలో చిరంజీవులును పక్కనపెట్టి ఎన్ఆర్ఐకి పెద్దపీట అన్ని జిల్లాల్లోనూ పారాచూటర్లతో స్థానిక నేతలకు ఇబ్బందులు 7:15AM, Feb 24th, 2024 మార్చి 3న సిద్ధం సభ వైఎస్సార్సీపీ సిద్ధం నాలుగో సభ ఖరారు. మార్చి మూడో తేదీన బాపట్ల జిల్లా అద్ధంకిలోని మేదరమెట్లలో సిద్ధం సభ సిద్ధం సభ ఏర్పాట్లు చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి. భీమిలీ, ఏలూరు, రాప్తాడు సభలకు పోటెత్తిన ప్రజలు నాలుగో సభకు కూడా రికార్డు స్థాయిలో హాజరుకానున్న జనం. 7:00AM, Feb 24th, 2024 చంద్రబాబుకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.... ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు పొలాల్లో రాజధాని ఎలా కడతాం రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్ కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి మిగిలిన 99శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి 33 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు... పిట్టల దొర కబుర్లు చెబుతున్నాడు ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థనుక్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా...? రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్ తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా...? దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా....? ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు 25 లక్షల జనాభా.... పోర్టు.... అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే.... మహానగరంగా అయ్యి తీరుతుంది వైజాగ్‌ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే..... వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని జగన్ ఆలోచిస్తున్నారు ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు ...120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం నేనైతే సంపద సృష్టించే వాడిని, జగన్‌కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో A టు Z తెలిసిన వ్యక్తి సీఎం జగన్ 6:50AM, Feb 24th, 2024 కాకినాడలో టీడీపీ, జనసేన రచ్చకెక్కిన విభేదాలు తమకు చెప్పకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం పై టీడీపీ ఫైర్ సీటు ప్రకటించకుండా కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు చంద్రబాబు, టీడీపీకి జనసేన ఊపిరి పోసిందని ఓ అసామి మాట్లాడారు అలాంటి వ్యాఖ్యలు చేస్తే మేం చేతగాని వాళ్లలా చూస్తూ ఊరుకోవాలా? జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా? కాకినాడ రూరల్ సీటును టీడీపీ ఎప్పటి నుంచో బీసీలకు కేటాయిస్తోంది 6:30AM, Feb 24th, 2024 కాకినాడ రూరల్‌లో టీడీపీ వర్సెస్ జనసేన జనసేన తీరును తప్పుపట్టిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ నిన్న కాకినాడ రూరల్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడం పై టీడీపీ అభ్యంతరరం జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటన ఆ ప్రకటన పై సారీ చెబుతూనే జనసేన తీరును తప్పుపట్టిన పిల్లి సత్యనారాయణ తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటున్న పిల్లి వర్గం తమ కుటుంబం పై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయన్న పిల్లి సత్యనారాయణ -
బాపట్ల: మార్చి 3న మేదరమెట్లలో ‘సిద్ధం’
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. కాగా.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. కంచు కోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్సార్సీపీ ఎంచుకుంటోంది. భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైఎస్సార్సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. నాలుగు ముఖ్యమైన రీజియన్లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్సార్సీపీ. ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్ -
Siddam Sabha: సిద్ధంగా ఉన్నారా? నాలుగో సభ ఎక్కడంటే?
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నుంచి మరో సిద్ధం సభ ఖరాయింది. మార్చి మొదటి వారంలో సిద్ధం సభతో తమ ఎన్నికల ప్రచారాన్ని దద్దరిల్లేలా ప్రకటనలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. నాలుగో సిద్దం సభను పల్నాడు జిల్లాలో నిర్వహించనున్నట్టు తెలిసింది. మార్చి మొదటి వారంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ జరగనుంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సభను నిర్వహించనున్నారు. నాలుగు జిల్లాల శ్రేణులతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి కేడర్ ఈ సభకు హాజరు కానున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈ సారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కంచుకోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్సార్సీపీ ఎంచుకుంటోంది భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ తొలిసారి మాత్రమే గెలిచింది. ఇక్కడ భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైఎస్సార్సీపీ కేడర్ లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. నాలుగు ముఖ్యమైన రీజియన్లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్సార్సీపీ. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్‌బై? -
ఫ్లెక్సీలేనా?.. అభ్యర్థులు లేరా?
సాక్షి, కృష్ణా: మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్సార్సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధం అంటే బాగుంటుందంటూ చురకలంటించారాయన. మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నారు. ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటున్నారు. మరి మీరు దేనికి సిద్ధం?. మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా?. క్యాండిడేట్లను పెట్టరా? ఫ్లెక్సీలే పెడతారా?. మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అని పవన్‌కు సూచించారాయన. -
ప్రతిపక్షాలను సీఎం జగన్ ర్యాంప్ ఆడిస్తున్నాడు
-
Feb 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 06:30 PM, Feb 20th, 2024 అసెంబ్లీకి దారేదీ? పవన్ రూటేదీ? ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్ జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్ 06:25 PM, Feb 20th, 2024 రాజానగరం, రాజమండ్రి కూటమిలో రచ్చ రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడం పై టీడీపీ నేతల్లో అసంతృప్తి రాజమండ్రి రూరల్ లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్, రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గానికి సీట్లు కోల్పోయామని కమ్మ సామాజిక వర్గం అసంతృప్తి రాజమండ్రి రూరల్ టికెట్ తనకే ఉంటుందన్న గోరంట్ల నేనూ జిల్లాలో పార్టీ వ్యవస్ధాపకుడినే, సీనియర్ నే పార్టీ టికెట్ నాకే, ఇందులో ఎలాంటి వివాదం లేదు జనసేనకు మరో నియోజవకర్గం కేటాయిస్తాం, సర్దుబాటు చేసుకుంటారో.. లేదో వాళ్లిష్టం : బుచ్చయ్య చౌదరీ 06:24 PM, Feb 20th, 2024 రాయచోటి సైకిల్ నేనే తొక్కుతా రాయచోటి టీడీపీ ఇంఛార్జ్ నేనే : మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ టికెట్ వచ్చేది నాకే... రాజీనామా చేయను కావాలని నన్ను తీసేస్తే వెళ్లిపోతా చంద్రబాబు దగ్గర తేల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ఈ ప్రాంతంలోనే ఉంటా...ఇక్కడే పోటీ చేస్తా : రమేష్ కుమార్ 06:20 PM, Feb 20th, 2024 చంద్రబాబు నన్ను దారుణంగా మోసం చేశారు: ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు టీడీపీ పార్టీకార్యాలయంలో టీడీపీ పోస్టర్లను పీకిపడేసిన ముద్రబోయిన చంద్రబాబు పై ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ పార్టీ నన్ను దారుణంగా మోసం చేసింది ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బ్రతికించా పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా..నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు ఈరోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు 04:50 PM, Feb 20th, 2024 చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి: కొడాలి నాని అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ‘X’లో చాలెంజ్‌లు చేస్తున్నాడు సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారు మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ‘X’లో చాలెంజ్‌లు చేస్తున్నాడు భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకులు మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా? డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలి ఎవరు సీఎంగా ఉండాలో జగన్ ,చంద్రబాబు కాదుగా నిర్ణయించేది ......ప్రజలే న్యాయ నిర్ణేతలు తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు X లో ఛాలెంజ్‌లు చేసుకోవాలి.. ప్రజలు ఎన్నుకున్న జగన్‌తో కాదు నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? సీఎం జగన్‌ను ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుది అందుకే మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్‌లు చెయ్యాలి 04:43 PM, Feb 20th, 2024 చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ కదలటం లేదు: మంత్రి అంబటి రాంబాబు లోకేష్ శంఖారావం పేరు కూడా సరిగా ఉచ్చరించలేకపోతున్నాడు ఇక పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఆయిల్ కూడా కొట్టించటం లేదు మా సిద్దం సభకు జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎన్నికల మూడ్ క్లియర్‌గా అర్థం అవుతోంది జనమంతా వైఎస్ జగన్ వైపే ఉన్నారని క్లియర్ గా అర్థం అవుతోంది జగన్‌ని చర్చకు రమ్మనటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి చర్చించాల్సిన అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు దద్దమ్మ సవాళ్లు చేయటం చంద్రబాబు మానుకోవాలి చంద్రబాబు కోసం నేనే టీడీపీ ఆఫీసుకు వస్తా అయితే.. చర్చ అయిపోయాక ఏడవనని చంద్రబాబు హామీ ఇస్తేనే వస్తా చంద్రబాబు ముసలోడని మేము అంటే లోకేష్‌కి తెగ కోపం వస్తోంది జైల్లో ఉన్నప్పుడు తన తండ్రి ముసలోడనీ, రోగాలు ఉన్నాయనీ చెప్పుకుని బెయిల్‌పై బయటకు తెచ్చారు ఇప్పుడు ముసలోడని మేము అంటే లోకేష్ తెగ ఏడుస్తున్నాడు ఎన్నికల తర్వాత టీడీపీ కుర్చీని మడత పెట్టేస్తారు సింగిల్‌గా వచ్చే దమ్ము లేనోళ్లు మాకు సవాల్ చేయడం ఏంటి? ఎన్టీఆర్ ఢిల్లీని వ్యతిరేకిస్తే చంద్రబాబు అదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు వారాహికి రెండు రంగులేశారు. త్వరలోనే మూడో రంగు కూడా వేస్తారు ఎన్నికల తరువాత టీడీపీ అనేదే ఉండదు మ్యానిఫెస్టోని అమలు చేయలేని చరిత్ర చంద్రబాబుది మ్యానిఫెస్టోని అమలు చేసి చూపించిన వ్యక్తి జగన్ మళ్లీ జగన్ ప్రకటించే మ్యానిఫెస్టో కోసం జనం ఎదురు చూస్తున్నారు చంద్రబాబుది మోసఫెస్టో, జగన్ ది మ్యానిఫెస్టో ఎమ్మెల్యే ఆర్కే సిన్సియర్ లీడర్ పార్టీ కోసం మొదటిరోజు నుండి కష్టపడి పనిచేశారు 04:01 PM, Feb 20th, 2024 పవన్ కల్యాణ్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు కాకినాడ: మనం చెప్పాల్సింది చెప్పాం...తర్వాత మనం చేసేదేమీ లేదు వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అంటున్న ముద్రగడ గత నెల ముద్రగడ నివాసానికి రెండుసార్లు వచ్చిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ త్వరలోనే పవన్ ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పిన బొలిశెట్టి పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పిన ముద్రగడ నెల రోజులు దాటినా ముఖం చాటేసిన పవన్ పవన్ వైఖరిపై చురకలంటించిన ముద్రగడ 03:29 PM, Feb 20th, 2024 విశాఖ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. పప్పు లోకేష్‌కు పప్పును కానుకగా పంపుతున్నాను.. కొంచెం ఉప్పు కారం కూడా వేసాను సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ నేను లోకేష్‌లా బ్యాక్ డోర్ పొలిటీషియన్‌ను కాదు రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యాను అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా.. 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడాడు నేను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటాను మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ పీకలేకపోయారు.. నువ్వేమీ పీకుతావు లోకేష్ సారాయి, గంజాయి తాగిన వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు వీరప్పన్లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారు ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్దం అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమీ చెప్పారో గుర్తుకు తెచ్చుకో గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకో బంధుత్వాలు గురించి మాట్లాడడానికి లోకేష్‌కు సిగ్గులేదు లోకేష్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశాము రెడ్‌బుక్‌లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్‌కు రాదు ఎర్రబుక్‌ను మడత పెట్టీ ఎక్కడ పెట్టుకుంటారో లోకేష్ ఇష్టం 03:20 PM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్‌రెడ్డి అధికారంగా ప్రకటించనున్న అధికారులు దీంతో రాజ్యసభలో 11కు చేరిన వైఎస్సార్సీపీ ఎంపీలు 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోయిన టీడీపీ 02:50 PM, Feb 20th, 2024 ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి : ఎమ్మెల్యే ఆర్కే 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలి మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా 01:28 PM, Feb 20th, 2024 కుప్పానికి బాబు నీళ్లు కూడా తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గంలో ఈనెల 26న సీఎం జగన్ పర్యటన హంద్రీనీవా జలాలను కుప్పం వాసులకు అంకితం చేయనున్నారు శాంతిపురం మండలం గునిశెట్టి వారి పల్లెలో హంద్రీనీవా జలాలకు సీఎం జగన్ జలహారతి అక్కడే బహిరంగ సభ వివరాలు వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశాడు : మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు కుప్పంకు హంద్రీనీవా జనాలు తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు వేసవి ఉన్న కృష్ణా జలాలను తెప్పిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి ఇకనుంచి కుప్పం ప్రాంతం శ్యామలం: మంత్రి పెద్దిరెడ్డి ఇప్పటికే 55 చెరువులకు నీళ్లు ఇస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో రాజన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి: మంత్రి పెద్దిరెడ్డి అన్ని రకాల ఆహారాలను రెండు క్యాంటీన్ ల ద్వారా అందిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి 01:28 PM, Feb 20th, 2024 కేంద్రం సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్ధతు: ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో పార్టీ జాయినింగ్స్ వేమూరు నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీలో చేరిక రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో చేరికలు వేమూరు నియోజకవర్గం చుండూరు,అమర్తలూరు,భట్టిప్రోలు మండలాలకు చెందిన బిసి,ఎస్సీ, మైనార్టీ నాయకులు,కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి పాల్గొన్న వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వరికూటి అశోక్ బాబు మంచి వ్యక్తి...మృదుస్వభావి వరికూటి అశోక్ బాబును అందరూ ఆశీర్వదించాలి ఎన్నికల్లో గెలిపించాలి...గెలిపిస్తే మీఅందరికీ మేలు జరిగుతుంది వరికూటి అశోక్ బాబుకు మీరంతా సహకరిస్తేనే అసెంబ్లీలో మీ సమస్యలను వినిపిస్తారు మీ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తా ఎస్సీలను కొందరు రెండు వర్గాలుగా విభజించాలని చూస్తున్నారు వైఎస్సార్సీపీకి అందరూ సమానమే జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒంటరిగానే పోటీచేయాలనేది మన సిద్ధాంతం దేశానికే ఏపీని తలమానికంగా తీర్చిదిద్దుతాం ఎన్నికలకు 50 రోజులే సమయం ఉంది ప్రతీ ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పథకాలు కొనసాగుతాయి మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకునే టీడీపీని నమ్మొద్దని కోరుతున్నా ఏపీలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుకావాలంటే కేంద్రం సహకారం అవసరం కేంద్రం సహకారం కోసమే మనం కొన్ని బిల్లులకు మద్దతు పలికాం త్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు మనం మద్దతు పలకలేదు సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లుసకు మనం సపోర్టు చేయలేదు మతతత్వ పార్టీలతో ఎప్పుడూ వైఎస్సార్సీపీ పొత్తు ఉండదు 01:10 PM, Feb 20th, 2024 బాబుకి ఓటేస్తే లోకేష్‌కి మంచిరోజులు: భూమన అభినయ్‌రెడ్డి చంద్రబాబు నాయుడికి ఓటు వేసి.. తినే అన్నంలో మట్టి వేసుకోవద్దు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఆయనకు ఆయన కొడుక్కి మంచిరోజులొస్తాయి తప్ప ప్రజలకు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేస్తారు మీ ఇంటి వద్దకే ఫించన్ అందుతోంది అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ వల్లే పేదరికం నిర్మూలన జరగాలన్న ఒక మంచి ఆలోచనతో అన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను బెస్ట్ సిలబస్‌తో (IB) అందిస్తున్నారు. నాడు - నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మంచి విద్యా బోధన చేయిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చేసుకోవాలి 12:58 PM, Feb 20th, 2024 చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు మేం సిద్ధం మాతో చర్చకు చంద్రబాబు సిద్ధమా? విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు బాబు రావాలి చంద్రబాబు, లోకేష్, పవన్.. ఎవరైనా చర్చకు రావాలి? సైకిల్‌ను జనం తొక్కేశారు.. మడతపెట్టి పక్కన పడేశారు చంద్రబాబు దళిత ద్రోహి 12:35 PM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న ఆర్కే కిందటి ఏడాది డిసెంబర్లో పార్టీకి.. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్‌ను కలవనున్న ఆర్కే మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ గెలుపు బాధ్యతల్ని ఆర్కేకు అప్పగించే ఛాన్స్ మంగళగిరి ఇన్ఛార్జిగా ఇప్పటికే గంజి శ్రీనివాస్‌ను ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం 12:17 PM, Feb 20th, 2024 బాబు, చినబాబు ఫొటోల్లేకుండానే టీడీపీ సమావేశం! రాయచోటి టీడీపీ లో భగ్గుమన్న అసంతృప్తి లక్కిరెడ్డి పల్లెలో తన వర్గీయులతో టీడీపీ నేత రమేష్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశంలో ఎక్కడా కనిపించని చంద్రబాబు, లోకేష్ ఫోటోలు వలస నేతలు పార్టీని ప్రలోభాలు పెట్టి టికెట్ పొందాలని ప్రయత్నిస్తున్నారు: రమేష్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పోరాటం తప్ప మరో మార్గం లేదు : రమేష్ రెడ్డి 11:55 AM, Feb 20th, 2024 భువనేశ్వరి యాత్ర.. జగన్ అనే నిజం గెలుస్తుంది: మంత్రి కారుమూరి చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యం సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డే కావాలి-రావాలి అంటున్నారు ప్రజలు ప్రజలకు అన్నివిధాలా ఆదుకున్న నేత సీఎం జగన్ మాత్రనే పార్టీ ఓ కుటుబం లాంటిది.. మా కుటుంబ సమస్య మేమే తీర్చుకుంటాం ఒకరిద్దరు బయటకు వెళ్లిపోతే వారి వ్యక్తిగతం తెలంగాణను తగలేసి ఏపీని తగలపెట్టడానికి షర్మిల వచ్చింది నిజం జగన్… అబద్ధం చంద్రబాబు అని ప్రజలు అంటున్నారు భువనేశ్వరి నిజం గెలవాలని కార్యక్రమం చేపట్టారు.. కచ్చితం నిజం అయిన జగన్ గెలుస్తారు తిరుమలలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యలు 11:45 AM, Feb 20th, 2024 నార్కో టెస్టుకు చంద్రబాబు సిద్ధమా?: పోసాని వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్లో ఉంది హెరిటేజ్‌ను మోహన్‌బాబు నుంచి ఎందుకు లాక్కున్నారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కార్యకర్త కూడా కాదు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్లో ఉంది నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి వైఎస్సార్సీపీ నేత, ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌టీవీడీసీ) ఛైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు 10:30 AM, Feb 20th, 2024 అమర్నాథ్పై లోకేష్ వ్యాఖ్యలు అర్థరహితం: మలసాల భరత్ కుమార్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ కేడర్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ వ్యాఖ్యలు అర్ధ రహితం మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజక వర్గాల్లో ఏటువంటి భూకబ్జాలకు పాల్పడలేదు ఒక్క సెంటు భూమిని మంత్రి గుడివాడ అమర్నాథ్ కబ్జా చేసినట్టు నారా లోకేష్ నిరూపించగలరా అనకాపల్లి నియోజకవర్గాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసారు అనకాపల్లి నియోజకవర్గం యువగళం సభ నియోజవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గంలో పెట్టుకోవడం సిగ్గు చేటు మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్దరహితం పవన్ కల్యాణ్ కూడా విసన్నపేటలో పర్యటించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కంగుతిన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ భూకబ్జాలకు పాల్పడ్డారని నిరూపించే సత్తా నారా లోకేష్ కి గాని, తెలుగు దేశం లేదంటే జనసేన నాయకులకు వుందా? నియోజకవర్గ ఇన్‌ఛార్జి మలసాల భరత్ కుమార్ వ్యాఖ్యలు 09:28 AM, Feb 20th, 2024 పచ్చ పార్టీ నేతలే విశాఖలో భూ రాబందులు ఎంవీవీఎస్ మూర్తి గీతం కళాశాలలో కలిపేసుకున్నది 42.51 ఎకరాలు టీడీపీ నేత పల్లా, ఆయన బంధుగణం నుంచి స్వాధీనం చేసుకున్నది 38.45 ఎకరాలు కబ్జాకోరు గంటా అంటూ సిట్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న బండారు కంటబడ్డ ఏ భూమైనా కబ్జానే... విశాఖ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపిస్తున్న జగన్ సర్కారు ఇలా గత నాలుగున్నరేళ్లలో 430.81 ఎకరాలు స్వాధీనం ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు మార్కెట్ విలువ రూ.5 వేల కోట్ల పైమాటే! టీడీపీ కబ్జాదారుల కోరలు పీకేస్తే ఓర్వలేకపోతున్న చంద్రబాబు, రామోజీ.. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఈనాడు 08:32 AM, Feb 20th, 2024 పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన 22 న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ మీడియాకి లీకులు రెండురోజులలో డిల్లీ వెళ్తున్నానంటూ విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో పవన్ వ్యాఖ్యలు టిడిపితో కలవడం బిజెపికి ఇష్టం లేదని కార్యకర్తలతో అన్న పవన్ టీడీపీతో జతకట్టడం ఇష్టం లేకున్నా తానే ఒప్పించానని పవన్ వ్యాఖ్యలు పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం ఇప్పటివరకు పవన్ కి దొరకని బిజెపి పెద్దల అపాయింట్ మెంట్ గత నెలలోనూ ఇదే విధంగా లీకులు పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వని బీజేపీ పెద్దలు రేపటిలోగా బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ ఖరారవుతుందంటున్న జనసేన వర్గాలు టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయం- ఖరారు కాని టిక్కెట్లు త్యాగాలకి సిద్దం కావాలంటున్న పవన్ వ్యాఖ్యలతో కార్యకర్తలలో పెరిగిపోతున్న నైరాశ్యం కేడర్ చేజారిపోకుండా ఉండేందుకే మరోసారి ఢిల్లీ డ్రామా 07:23 AM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీలో సిద్ధం కళ కళ.. టీడీపీ, జనసేన సభలు వెలవెల సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభంజనం చరిత్రాత్మక రాప్తాడు ప్రజా సభే ఇందుకు నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతి పెద్ద ప్రజా సభ 1982లో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మందితో సభ 1990లో వరంగల్‌లో 100 ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలీ సభకు 7 లక్షల మంది.. 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఐదు లక్షల మందితో ఎన్టీఆర్ సభ ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు 2010లో వరంగల్‌లో నాటి టీఆర్ఎస్ సభకు ఏడు లక్షలకుపైగా హాజరైన జనం అనంతపురం జిల్లా రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ ఈ సభకు 10 నుంచి 11 లక్షల మంది కార్యకర్తలు, అభిమానుల రాక అదీ రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచే.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సభలు సూపర్ హిట్.. భీమిలికి మించి దెందులూరు.. ఆ రెండింటినీ మించి రాప్తాడు ‘సిద్ధం’ సభ సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దంపట్టిన సిద్ధం సభలు టీడీపీ, జనసేన సభలు వెలవెల 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు 07:18 AM, Feb 20th, 2024 నేను పార్టీ లైన్ దాటను: మండలి హనుమంతరావు గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో మండలి హనుమంతరావు పేరుతో ప్రచారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మండలి ఎమ్మెల్యే కొడాలి నానికి తనకు అభిప్రాయ భేదాల్లేవని స్పష్టీకరణ ఎమ్మెల్యే కొడాలి నానిని దాటనంటూ ప్రకటన పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు లేవు: మండలి ఎమ్మెల్యే కొడాలి నానితో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం నాకు లేదు: మండలి వృత్తి రీత్యా నేను బిజీగా ఉన్నాను: మండలి నేను వైఎస్సార్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను: మండలి పార్టీ లైను దాటి వెళ్లను: మండలి వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు 06:52 AM, Feb 20th, 2024 జనసేనాని.. ఇవ్వాళైనా క్లారిటీ ఇస్తాడా? రాజమండ్రిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఉదయం 10గం. ఏవీఏ రోడ్డులోని జనసేన ఆఫీస్‌లో పవన్ మీటింగ్ టికెట్ ఆశావహులు, ముఖ్యనేతలతో చర్చించనున్న పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఏయే స్థానాల్లో పోటీ చేయాలి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ పొత్తు ధర్మం పాటించలేదంటూ.. రాజానగరం, రాజోలులో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన పవన్ వారాలు గడుస్తున్నా.. అభ్యర్థులపై ఇంకా రాని క్లారిటీ! నేటి సమావేశంతో అయినా క్లారిటీ ఇస్తారని ఎదురుచూస్తున్న ఆశావహులు 06:49 AM, Feb 20th, 2024 ఆ నమ్మకమే.. ఈ ప్రజాభిమానం: సజ్జల సీఎం జగన్‌పై ఏపీ ప్రజలకు అపార విశ్వాసం అందుకే సిద్ధం సభలకు భారీగా జనం రాక జగన్ ప్రభుత్వంలో 87 శాతం మంది ప్రజలు నేరుగా లబ్ధి డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ ఇది వాస్తవం కాదా? ప్రతిపక్షాలకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్న మా నాయకుడిపై ఉన్న విశ్వాసంతోనే సిద్ధం సభలకు భారీగా జనం వస్తున్నారు సీఎం @ysjagan ప్రభుత్వంలో 87 శాతం మంది ప్రజలు నేరుగా లబ్ధి పొందారు డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… pic.twitter.com/grxlylf7rI — YSR Congress Party (@YSRCParty) February 19, 2024 06:38 AM, Feb 20th, 2024 నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్ జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక సోమవారంనాడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి యువతలో సీఎం జగన్‌కు మంచి క్రేజ్ ఉందని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ప్రతాప్ ధీమా 06:31 AM, Feb 20th, 2024 సమాధానం చెప్పే దమ్ముందా చంద్రబాబు? సమాధానం చెప్పే దమ్ముందా @ncbn? #EndOfTDP #MosagaduBabu pic.twitter.com/qNQ8RMO35T — YSR Congress Party (@YSRCParty) February 19, 2024 -
YSRCP: సందేహం లేదు సునామీయే
సాక్షి, అమరావతి: ‘సందేహమే లేదు.. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించడం తథ్యం.. అందుకు తార్కాణమే చరిత్రాత్మక రాప్తాడు సభ’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభకు సుమారు పది నుంచి 11 లక్షల మంది అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారని అంచనా. అదీ రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 52 శాసనసభ స్థానాల పరిధి నుంచే ఇంత భారీ స్థాయిలో ప్రజలు కదలిరావడం గమనార్హం. రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో ‘సిద్ధం’ సభను వైఎస్సార్సీపీ నిర్వహించింది. ఇందులో 200 ఎకరాల విస్తీర్ణంలో సభను వీక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇసుకేస్తే రాలనంత స్థాయిలో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 1982లో పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో విజయవాడలో కృష్ణా నది ఇసుక తిన్నెలపై సీపీఎం నిర్వహించిన సభకు 5 లక్షల మంది హాజరయ్యారని అప్పట్లో అంచనా. 1990లో వరంగల్‌లో వంద ఎకరాల మైదానంలో పీపుల్స్ వార్ నిర్వహించిన రైతు కూలీ సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ.. వాస్తవంగా ఆ సభకు ఆరు నుంచి ఏడు లక్షల మంది వచ్చారని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ ఆధ్యర్యంలో టీడీపీ నిర్వహించిన సభకు పది లక్షల మంది ప్రజలు హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. పరేడ్ గ్రౌండ్స్‌తోపాటు పక్కనున్న జింఖానా గ్రౌండ్స్, బౌసన్పోలో గ్రౌండ్ కలిసినా దాని విస్తీర్ణం 90 ఎకరాలే. ఈ లెక్కన ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఐదు లక్షల మందేనని అంచనా. ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్ర పరిధిలోని 23 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించడం గమనార్హం. ఇక 2010లో వరంగల్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ గర్జన సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఏడు లక్షల మందికి కాస్తా అటూ ఇటూ అని అంచనా. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభే అతి పెద్ద ప్రజా సభ అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పెత్తందారులపై పోరుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపునిస్తే.. 10 నుంచి 11 లక్షల మంది ఒక్కసారిగా పిడికిలి పైకెత్తి, దిక్కులు పిక్కటిల్లేలా ‘మేం సిద్ధమే’ అంటూ ప్రతిస్పందించారు. ఇది రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జైత్ర యాత్రతో సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రణనినాదమై మారుమోగుతున్న ‘సిద్ధం’ ‘మేమంతా సిద్ధం’ అని వైఎస్సార్సీపీ శ్రేణుల ప్రతిస్పందన రణ నినాదమై రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. ఈనెల 3న దెందులూరు.. ఆదివారం రాప్తాడులలో ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్సీపీ నిర్వహించిన సభలు ఒకదాన్ని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. భీమిలి సభకు సముద్రంతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం కదలివచ్చారు. దెందులూరు సభకు భీమిలి సభ కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తర కోస్తా ప్రాంత అభిమానులు పోటెత్తారు. ఇక రాప్తాడు సభ తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభగా నిలిచింది. మూడు సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణుల్లో సరి కొత్త జోష్ నింపింది. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన మూడు సభల్లోనూ.. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మరోసారి మన పార్టీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నిస్తే.. మేం సిద్ధమే అంటూ ఒక్కసారిగా లక్షలాదిమంది ప్రతిస్పందించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేసిన దిశా నిర్దేశం మేరకు 175కు 175 శాసనసభ.. 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జైత్రయాత్రకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సీఎం జగన్ నాయకత్వంపై విశ్వాసానికి ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధికారం చేపట్టిన తొలి ఏడాదే 95 శాతం సీఎం జగన్ అమలు చేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.76 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్‌డీబీటీ రూపంలో రూ.4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు లేవు. ఓ వైపు సంక్షేమాభివృద్ధి పథకాలు.. మరో వైపు విద్య, వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు.. ఇంకో వైపు సుపరిపాలనతో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. దాంతో సీఎం జగన్‌పై ప్రజల్లో మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. ‘మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలం, అభిమానులం’ అంటూ కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునే రీతిలో సీఎం జగన్ పరిపాలిస్తుండటం ఆయన నాయకత్వంపై శ్రేణుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచింది. ఇది ‘సిద్ధం’ సభల్లో మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలం టీడీపీ–జనసేనల మధ్య పొత్తుల లెక్కలు ఇప్పటికీ తేలలేదు. రెండు పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతున్నాయి. రా కదలి రా.. పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తున్నారు. ఇటు ‘సిద్ధం’ సభల్లో లక్షలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్త్తలు, అభిమానులు ‘పోరుకు మేం సిద్ధమే’ అంటూ చేసిన రణనినాదం మోరుమోగుతుండగా.. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు జన స్పందన కన్పించకపోవడంతో టీడీపీ–జనసేన అగ్రనేతల వెన్నులో వణుకు పుట్టించింది. సిద్ధం సభలు నింపిన జోష్‌తో ప్రజా క్షేత్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నాయి. మరో వైపు పొత్తులు తేలక, చంద్రబాబు–పవన్‌ల సభలకు జన స్పందన లేక టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలమయ్యాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే వైఎస్సార్సీపీ శ్రేణులు చారిత్రక విజయమే లక్ష్యంగా కదం తొక్కుతుంటే.. టీడీపీ–జనసేన శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురయ్యాయి. ఇది 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
రాప్తాడు సిద్ధం సభ ఒక ప్రభంజనం: వైఎస్సార్సీపీ నేతలు
-
టీడీపీ తప్పుడు రాతలపై జర్నలిస్ట్ స్వప్న విశ్లేషణ
-
సిద్ధం సభపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది
-
ఈల వేశారు జనం! వెల్లివిరిసింది జ(గ)నం!
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ముఖ్యమంత్రి జగన్ YSRCP సిద్ధం సభ కొత్త ఊపు తీసుకొచ్చింది. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడం, ముఖ్యమంత్రి స్పీచ్ కోసం లక్షలాది మంది తరలి రావడం పట్ల చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఖాళీ అయ్యింది బంగాళా ఖాతపు జల సంద్రం రాయల సీమలో మోహరించింది జన సముద్రం ఈల వేశారు జనం వెల్లివిరిసింది జ(గ)నం అదొక జగన ఘన ప్రభంజనం, ఆడబిడ్డలకు అన్న అంజనం జగనన్న కలిగించాడు ఎంతో ప్రమోదం ప్రజలందరికీ అన్న సర్వ ఆమోదం - డాక్టర్ రాం కేసరి, అమెరికా సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
గూస్బంప్స్ వచ్చేలా సీఎం వైఎస్ జగన్ రాప్తాడు సిద్ధం మీటింగ్
-
సిద్దం మీటింగ్ లో సీఎం వైఎస్ జగన్ క్రేజ్
-
జగన్ మామ.. జగన్ మామ పాటకు.. పరవశించిన రాప్తాడు సభ
-
UK : లండన్‌లో YSRCP సిద్ధం
-
ఇది సీఎం జగన్ చరిష్మా..జగన్ పంచులకు పావలా పీకే, బాబులకు సీన్ సితారే
-
సిద్ధం సూపర్ సక్సెస్..రామోజీ నరకం
-
సీఎం జగన్ సిద్ధం సభపై రాయలసీమ ప్రజల రియాక్షన్ అదుర్స్
-
KSR Comments: ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ
-
సైకిల్ ఇంటి బయటే ఉండాలి..
-
జగన్ వెంట జన సముద్రం
-
సీఎం జగన్ రాప్తాడు సిద్ధం సభ హైలైట్స్
-
'సీమ'లో జనసముద్రం
అనంతపురం: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్ జగన్ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 175, 25 లోక్‌సభ స్థానాల్లో 25 గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లక్షలాది జనం బ్రహ్మరథం పట్టారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల నుంచి వేలాది వాహనాల్లో ప్రజలు తరలివచ్చారు. సభా వేదికపైకి సీఎం జగన్ చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇంకా లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్– బెంగళూరు, అనంతపురం–చెన్నై జాతీయ రహదారులపై ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అనంతపురం–చెన్నై జాతీయ రహదారిలో ఎస్కే యూనివర్సిటీ దాటి సంజీవపురం వరకు 12 కిలోమీటర్ల పొడవునా, ఇటు రాప్తాడు వైపు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరూరు టోల్గేట్, మరో వైపు రాప్తాడు నుంచి అనంతపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణంలో ఎన్ని లక్షల మంది ఉంటారో.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారు అంతకు మించే ఉన్నారని అనంతపురం నగరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ‘సిద్ధం’ అని నినదించిన లక్షలాది గొంతులు దుష్ట చతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్ చేసిన రణ గర్జనకు ..‘సిద్ధం’ అంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్కచేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది. పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? అని అడిగిన ప్రశ్నలకు.. లక్షలాది మంది టార్చ్ ఆన్ చేసిన మొబైల్ ఫోన్లను చేత్తో పట్టుకుని చూపుతూ ప్రతిస్పందించారు. ‘రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే. గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి’ అన్నప్పుడు లక్షలాది గొంతులు ‘అవును.. అవును..’ అంటూ నినదించాయి. పోటెత్తిన రైతన్నలు రాప్తాడు సిద్ధం సభకు హాజరైన వారిలో అత్యధికులు అన్నదాతలే ఉండడం గమనార్హం. రాయలసీమ వ్యవసాయాధారిత ప్రాంతం. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు, రైతు సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన అన్నదాతలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ సభకు ఇంత భారీ స్థాయిలో తరలి వచ్చారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుంటేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆకాంక్షిస్తున్నారు. సీఎం జగన్ రైతు బాంధవుడిగా ఉంటారనే నమ్మకంతోనే అన్నదాతలు వైఎస్సార్సీపీ పక్షాన నిలబడుతున్నారు. ఈ సభకు యువతతో పాటు మహిళలు, వృద్ధులు సైతం తరలిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నంత సేపు వాహనాల్లో జనం వస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ప్రాంగణానికి చేరుకోలేక పెద్ద సంఖ్యలో మధ్యలో నిలిచి పోయిన వారు తమ సెల్ ఫోన్లలో లైవ్ చూస్తూ ఆనందించారు. జగనన్నను గెలిపించేందుకు సిద్ధం ఎన్నడూ చూడనివిధంగా జగనన్న సైనికులు ‘సిద్ధం’ సభకు తరలివచ్చారు. సీఎం జగన్‌కు అండగా ఉండేందుకు సిద్ధమని నినదించారు. ఆయన ముఖ్యమంత్రయ్యాక బడుగు, బలహీన వర్గాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అణగారిన వర్గాలకు నేరుగా లబ్ధి కల్పించిన ఏకైక ప్రభుత్వం జగనన్నదే. రూ.2.55 లక్షల కోట్లు పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. –అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ప్రభంజనం అంటే ఇదే ప్రభంజనం అంటే ఇలాగే ఉంటుంది. ఎల్లో మీడియా కూటమి విషప్రచారం చేస్తున్నా.. గొప్ప నాయకుడిని మాత్రం చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాలన్నీ జగనన్న దెబ్బకు మంచుకొండల్లా కరిగిపోతాయి. రానున్న ఎన్నికల కోసం కౌరవులందరూ గుంపులుగా వస్తుంటే జగనన్న మాత్రం సింగిల్‌గా వస్తున్నారు. – ఉషశ్రీ చరణ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి దేశానికి రోల్ మోడల్ జగన్ ప్రజావసరాలను గుర్తించి పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన దేశానికి రోల్ మోడల్. రాబోయే కురుక్షేత్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సిద్ధం సభలతో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఏంటో అందరికీ తెలిసింది. –కొరుముట్ల శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే మీ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం బ్రిటీష్ వాళ్లపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయుడు సీమబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎట్టా ఉంటాడో తెలుసా.. ఇట్టా ఉంటాడు! (సీఎంను చూపుతూ).. దాతృత్వంలో బుడ్డా వెంగల్రెడ్డి, రాజసంలో రాజశేఖరరెడ్డి, పౌరుషంలో సైరా నరసింహారెడ్డికి ప్రతీక మన జగన్మోహన్రెడ్డి. 21 ఏళ్ల టీడీపీ పాలనలో ఈ ప్రాంతం వందేళ్లకు సరిపడా విషాదం చూసింది. ఫ్యాక్షన్ హత్యలు, రైతుల ఆత్మహత్యలు, కరువు కాటకాలు, వలసలతో గ్రామాలు నిర్మానుష్యమయ్యాయి. జగన్ సీఎంగా వచ్చిన క్షణం నుంచి నేటి వరకు ఫ్యాక్షన్ హత్యలు లేవు. రైతు ఆత్మహత్యలు, కరువు కాటకాలు, వలసలు అసలే లేవు. ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చిన జగన్‌కు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. ‘పచ్చ’రాజ్యంలో కాళ్లు పట్టుకుంటే తప్ప పథకాలు వచ్చేవి కాదు. ఈ రోజు ఇంటికే పథకాలు వస్తున్నాయి, జగనన్న అండతో రాయలసీమ అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. నిన్నే నమ్ముకున్న రాయలసీమ బిడ్డలంతా నీ అడుగులో అడుగు వేసేందుకు సిద్ధం. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఈ ప్రాంతంలో తెగిన స్త్రీల తాళిబొట్లను, రైతులకు జరిగిన అన్యాయం, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలకు జరిగిన మోసాన్ని గుర్తు చేసుకోవాలి. జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఇంటికీ మేలు చేశారు. అందుకే ధైర్యంగా జనాల్లో తిరుగుతున్నాం. వచ్చే ఎన్నికల్లో పెత్తందారులతో యుద్ధానికి కార్యకర్తలంతా సిద్ధమా? – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే, రాప్తాడు జగన్ సత్తా చాటిన సిద్ధం సభ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత భారీగా సభ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. పేదల జీవితాలను మార్చగలిగే కలియుగ బ్రహ్మ వైఎస్ జగన్. అంబేడ్కర్ కలలను ఆయన నిజం చేశారు. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చారు. ప్రజాభిమానంతో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ గెలిచితీరుతుంది. –బీవై రామయ్య, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నిరుపేదలను గుండెల్లో పెట్టుకున్న జగన్ నిరుపేదలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండెల్లో పెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం చేశారు. రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. అలాంటి జగనన్నకు రెండు చేతులు పైకెత్తి దండం పెట్టడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.–పైలా నరసింహయ్య, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు 2.30లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైద్య, ఆరోగ్య శాఖలో కూడా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – అమర్నాథ్ రెడ్డి, తాడిపల్లి గ్రామం, వైఎస్సార్ జిల్లా బాబు మళ్లీ వస్తే అవినీతి తప్పదు ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా మన ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మధ్యవర్తులు లేని ప్రజా పాలన సాగిస్తున్నారు. లంచాలకు, అవినీతికి తావు లేదు. చంద్రబాబు పొరపాటున వస్తే అవినీతికి ద్వారాలు తెరిచినట్టే. – జయమ్మ, ఎర్రవంకపల్లి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా చంద్రబాబు హామీలు ఎవరూ నమ్మరు ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గతంలో 600 అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేశాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేస్తోంది. – అమరావతి, అనంతపురం రుణమాఫీతో మహిళలకు చేయూత ఎన్నికల సమయంలో ఇచి్చన హామీ మేరకు విడతల వారీగా స్వయం సహాయక సంఘాల మహిళల రుణాలను సీఎం వైఎస్ జగన్ మాఫీ చేశారు. ఒక్కో మహిళకు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు రుణమాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున ఆరి్థకసాయం అందించి అండగా నిలిచారు. గతంలో చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పేరుతో మహిళలను మోసం చేశారు. మళ్లీ ఆయన మాయలో పడేది లేదు. – జయమ్మ, రాంపురం, అనంతపురం జిల్లా జగన్ సీఎం అయితేనే పథకాల అమలు పేదలు ఆరి్థకంగా అభివృద్ధి చెందాలనే గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆయన మళ్లీ సీఎం అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. పేదల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడతాయి. సంక్షేమ పథకాలు ఆగకూడదని సీఎం మాటగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఇదే చెబుతాం. – విశ్వనాథ్, వానవోలు, శ్రీసత్యసాయి జిల్లా జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి ఉదయించే సూర్యుడు లాంటివాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జన సంక్షేమం కోసం పాటుపడుతున్న ఆయనపై బురద చల్లాలనుకోవడం అవివేకమే. చంద్రబాబు, పవన్‌లను ఎన్నికల్లో ఓడించడం ద్వారా వారికి తగిన బుద్ధి చెబుతాం. జనరంజక పాలన సాగించే జగన్నే మళ్లీ సీఎంను చేసుకుంటాం. – శ్రీనివాసులు, గాజులపల్లి, నంద్యాల జిల్లా కరువు, చంద్రబాబు కవలలు కరువు, చంద్రబాబు ఇద్దరూ కవల పిల్లలు. ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటే కరువు విలయతాండవం చేస్తుంది. గ్రామాల్లో తాగేందుకు చుక్కనీరు కూడా దొరకదు. ఆయన కుమారుడు యువగళం పేరుతో పాదయాత్ర చేసినందుకు మా జిల్లాలో వర్షాలు కూడా రాకుండా అటే వెళ్లిపోయాయి. మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవడమంటే కరువు తెచ్చుకున్నట్లే అవుతుంది. – రవీంద్రారెడ్డి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా మా పాలిట దేవుడు జగన్ మా లాంటి నిరుపేదలకు వలంటీర్‌గా ఉద్యోగం ఇచ్చి జగనన్న దేవుడయ్యాడు. ఉద్యోగాలు లేక ఇంటి పట్టున ఉండేవాళ్లం. వలంటీర్ ఉద్యోగం వచ్చాక సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటి దగ్గరకు తీసుకెళ్లి అందిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని దేవుళ్లలా భావిస్తున్నారు. జగనన్న మేలు మరచిపోలేం. – రామాంజనేయులు, కౌతాళం గ్రామం, కర్నూలు జిల్లా అభివృద్ధి, సంక్షేమం జగన్‌తోనే సాధ్యం విద్య, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక తదితర రంగాల్లో అభివృద్ధితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడం ఎంతో అవసరం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేను మేలు చేశానని భావిస్తేనే ఓటు వేయండి అని అడుగుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. – పార్వతి, రుద్రంపేట, అనంతపురం. ఇంతటి అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే రోగులు భయపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాలుగున్నరేళ్లలో ఆస్పత్రులు నాడు–నేడు ద్వారా అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఆధునికంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే ఈ మార్పు కనిపిస్తోంది. ఖరీదైన ఎంఆర్ఐ, సీటీస్కాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ యూనిట్లను పునరుద్ధరించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్‌తో సరిపోయింది. మిగిలిన తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. – శివకృష్ణ, వైద్యాధికారి, రాప్తాడు, అనంతపురం జిల్లా పేదలంటే బాబు దృష్టిలో కూలీలు పేదలంటే పెత్తందార్ల ఇళ్లలో పనిచేసే కూలీలుగా చంద్రబాబు భావించేవారు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి.. గెలిచిన తర్వాత పక్కన పెట్టేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతే రాజయ్యాడు. ఏటా పెట్టుబడి రాయితీ, విత్తనాలు, ఎరువులు రైతుల వద్దకే చేరుతున్నాయి. మనసున్న ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు అందుకున్నారు. – మల్లిరెడ్డి, పత్తికోట, అన్నమయ్య జిల్లా బాబు పాలనలో నరకం చూశాం చంద్రబాబు పాలనలో నరకం చూశాం. వర్షాలు కురవక, పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. తినేందుకు తిండి లేక వలసలు వెళ్లాల్సి వచ్చేది. మూగ జీవాలకు మేత దొరక్క వాటిని కూడా అమ్ముకున్నాం. జగన్ ముఖ్యమంత్రి కాగానే రాజన్న పాలన మళ్లీ ప్రారంభమైంది. రైతులకు మంచిరోజులు వచ్చాయి. కడుపునకు అన్నం తినే ఎవడూ చంద్రబాబుకు ఓటు వేయరు. – జయరామిరెడ్డి, రైతు, బుక్కచెర్ల, అనంతపురం జిల్లా జిత్తులమారి పొత్తులను తిప్పికొడతాం ప్రతిపక్షాలు నక్క జిత్తుల పొత్తులతో జగన్‌ను గద్దె దింపాలని చూస్తున్నాయి. సీఎం జగన్ తన ప్రసంగంతో ఇ చ్చిన స్ఫూర్తితో పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో గ్రామాల్లో ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలును అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాం. జగనన్నను గెలిపించుకుంటాం. – సుప్రజ, అనంతపురం నా తొలి ఓటు జగనన్నకే నేను అనంతపురంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. తొలిసారి ఓటు హక్కు పొందా. నా తొలి ఓటు జగనన్నకే వేస్తాను. జగన్మోహన్ రెడ్డిని చూడాలనే మా ఊరోళ్లతో కలిసి సభకు వచ్చాను. నాలాంటి వారి చదువులకు సీఎం జగన్ ఎంతో సాయం అందిస్తున్నారు. అందుకే మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. – మేఘనాథ్‌రెడ్డి, పైలబోయినపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ రాష్ట్రంలో అర్హులైన 33 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు అందించలేదు. – అబ్దుల్లా, బస్తిపాడు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా జగనన్నపై నమ్మకం పెరిగింది సీఎం వైఎస్ జగన్ ప్రసంగం విన్నాక రాష్ట్రంలో 175కు 175 స్థానాలు వైఎస్సార్ సీపీ సాధిస్తుందన్న నమ్మకం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. పార్టీ విజయం కోసం మరింతగా పని చేయాలన్న సంకల్పం మా అందరికీ కలిగింది. మేమంతా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం సిద్ధంగా ఉన్నాం. – చంద్రకళాబాయి, కర్నూలు మహిళలంతా జగనన్న వెంటే సీఎం జగన్ వస్తున్నారంటే మా మహిళలంతా స్వచ్ఛందంగా తరలివచ్చాం. మహిళలను తన అక్క, చెల్లెమ్మల్లా భావించి ఎన్నో పథకాలు అందిస్తున్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి. ఇదే విషయాన్ని ఊరెళ్లాక అందరికీ చెబుతాను. – వై.హేమలత, రామినేపల్లి, అనంతపురం జిల్లా ఈ యుద్ధంలో జగన్‌దే గెలుపు విపక్షాలు ఎన్ని పన్నాగాలు పన్నినా అర్జునుడిలా పోరాడి రానున్న ఎన్నికల రణరంగంలో విజేతగా నిలుస్తానని వైఎస్ జగన్ చేసిన ప్రకటన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఎన్నికల రణరంగంలో జగన్ విజేతగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. – జగదీశ్వర్ రెడ్డి, చిన్నకులాల గ్రామం, వైఎస్సార్ జిల్లా -
మంచి పాలనకు మళ్లీ ‘సిద్ధం’
జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: విశ్వసనీయతకు–వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యుద్ధం.. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు, ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోందన్నారు. మనందరి ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. బాబు మార్కు ఎక్కడైనా ఉందా? ఈ వేదిక నుంచి చంద్రబాబుకు ఒక సవాల్ విసురుతున్నా. మీరు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా? మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మీ పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా? మీ పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు.. మా పెన్షన్ మా ఇంటికే పంపాడనే పరిస్థితి ఏనాడైనా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్లు, ఆస్పత్రులు ఏ గ్రామంలోనైనా ఉన్నాయా? కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే మీ మార్క్ ఉందా చంద్రబాబూ? పథకాలను పక్కనపెడితే చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? మేనిఫెస్టోకు రంగులు పూసి ప్రతి సామాజికవర్గాన్ని మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీ. ఏనాడైనా కనీసం 10శాతం వాగ్దానాలను అమలు చేశారా? బంగారు కడియం ఇస్తానంటూ ఊబిలోకి దింపి మనుషుల్ని తిన్న పులి మాదిరిగా మరోసారి ఎర వేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్య్రం ఎందుకన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం అన్ని సామాజికవర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి కుర్చీని లాగేసి చీపుర్లతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా బయటకు రావాలి. వైఎస్సార్ సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికీ వివరించాలి. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న మన స్టార్ క్యాంపెయినర్‌గా ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యానీ పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి రూ.87,612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తుచేయాలి. అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని మీరంతా చెప్పాలి. ఏ గ్రామానికైనా వెళదాం.. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి నిల్చున్నా ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే మంచి వలంటీర్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే జరిగాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ‘నా’ వాళ్లకు గరిష్టంగా లబ్ధి అణగారిన వర్గాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ జగన్ బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం ‘నా..’ అని ఆప్యాయంగా పిలుచుకునే వర్గాలకే ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకే దక్కాయి. ఇంతటి సామాజిక న్యాయం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపిస్తోంది. 35 లక్షల ఎకరాలపై అనుభవదారులు, గిరిజనులు, రైతన్నలు, నిరుపేదలకు సర్వహక్కులు ఇచ్చింది ఎవరంటే మీ జగనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కింది మీ జగన్ వచ్చాకే. చంద్రబాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడమే. డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. మీరంతా గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలామంది పరిపాలన చూశారు. కానీ మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్ మాత్రమే. మొదటి చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. మీ జగన్ పేరు చెబితే.. మీ జగన్ పేరు చెబితే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడ్డ పాఠశాలలు, బైజూస్ కంటెంట్, బైలింగ్యువల్ బుక్స్, ట్యాబ్‌లు, డిజిటల్ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానళ్లు, తొలిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం గుర్తొస్తాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఇవన్నీ కొనసాగాలంటే, పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలంటే, పెత్తందార్ల పిల్లలతో పోటీ పడే పరిస్థితి రావాలంటే మీ అన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఇవాళ ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు మరో 10–15 ఏళ్లలో అంతర్జాతీయ చదువులతో గొప్ప ఉద్యోగాలు సాధించాలంటే మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పండి. సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దుకు ఓటేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే రూ.3 వేల పెన్షన్లు కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగాలన్నా, కొందరికే పింఛన్లు ఇచ్చిన రోజులు మళ్లీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ సేవలతో విస్తరించిన ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఆదుకుంటున్నాయి. వీటి పేరు వింటే కోవిడ్ కష్టకాలంలో అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరాలి. 57 నెలల్లో మీకోసం 125 సార్లు బటన్లు ఈ 57 నెలల్లో నేను ప్రజల కోసం 125 సార్లు బటన్లు నొక్కా. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లాయి. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి మన పాలనలో మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని, మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడాలని మనం నిబద్ధతతో సిద్ధం అంటుంటే ఏ ఒక్కరికైనా ఏం చేశారో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మేమూ సిద్ధం.. సంసిద్ధం అంటూ చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావ్? కృష్ణుడిలా కోట్ల గుండెలు తోడున్నాయి.. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడుగా కృష్ణుడి రూపంలో ప్రతి పేదవాడి ఇంట్లో కోట్ల గుండెలున్నాయి. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తులతో ఎన్నికల పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ఇది మీ అందరి పార్టీ. జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్సార్సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మా నాయకుడు మాటిచ్చాడంటే చేస్తాడంతే అని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి. 99 శాతం వాగ్దానాలు అమలుచేసి ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి మరీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పార్టీ మనదే. అందుకే ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్. మన టార్గెట్ 25కు 25 ఎంపీ సీట్లు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలేలేదు. మరో 55 రోజుల్లో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. చంద్రబాబు అబద్ధాలు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎదుర్కొంటూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరంతా సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, వలంటీర్లు, గృహ సారథుల పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం. చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరని జాతీయ పార్టీలతో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకే ఒక్కడిపై యుద్ధం చేయడానికి ఇన్ని తోడేళ్లు ఏకం అవుతున్నాయి. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒక్కడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న మీ జగన్‌కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. మీకెందుకు ఓటేయాలి బాబూ? జగన్ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో మంచి మార్పు కనిపిస్తున్నప్పుడు బాబుకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్ పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. ఊతం కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా? సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడని తెలుసు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
CM Jagan: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్
సాక్షి, అనంతపురం జిల్లా: రాయలసీమలోనే కాదు.. ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ జరిగింది. సభ సముద్రాన్ని తలపించింది. సభకు లక్షలాదిగా జగన్ దండు తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. సీఎం జగన్ స్పీచ్‌కు జనం యుద్ధ నినాదాన్ని మోగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేసిన సీఎం జగన్.. ఎంత మంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్దిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించిన సీఎం జగన్.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బైట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలంటూ జగన్ పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ►మేనిఫెస్టోలో 99 శాతం హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించిన సీఎం జగన్ ►పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం జగన్ భరోసా ►భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్‌తో వైఎస్సార్సీపీ కేడర్‌లో జోష్ ►ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టిన సీఎం జగన్ ►ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఎన్నికల నినాదాన్ని సవివరంగా సోదహారణంగా వివరించిన సీఎం జగన్ ఇదీ చదవండి: రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్‌లు -
రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్‌లు
సాక్షి, అనంతపురం జిల్లా: రాప్తాడు ‘సిద్ధం’ సభ పంచ్ డైలాగ్‌లతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పలు డైలాగ్స్‌ను అందిపుచ్చుకున్న సీఎం జగన్.. రాప్తాడు ‘సిద్ధం’సభలో ప్రతిపక్షాలపై అస్త్రాలుగా ప్రయోగించారు. ‘‘విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ.. నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో జన సముద్రం చూడొచ్చు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు. ఎగ్గొట్టేవాడు.. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మానిఫెస్టో మాయం చేసి.. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు’’ అంటూ చంద్రబాబుకు సీఎం జగన్ చురకలు అంటించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పంచ్ డైలాగ్‌లు విసిరారు. 125 సార్లు బటన్ నొక్కి 2.55 లక్షల కోట్లు పేదలకు ఇచ్చాం. ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో చేశా. మీరు 2, 3 సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు మీకు, రాష్ట్రానికి జరుగుతుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ .. నేడు అనంతపురం జిల్లా రాప్తాడు లో జన సముద్రం చూడొచ్చు చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు ఎగ్గొట్టేవాడు .. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి త్రాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి కౌరవ సేన లాంటి టీడీపీ కూటమికి ఎదురుగా ఉన్నది అభిమన్యుడు కాదు గాండీవధారి అర్జునుడు నా వెనకాల శ్రీకృష్ణుడి లాగా ఉన్నది ప్రజలు సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడేవాడే నాయకుడు చెప్పాడంటే చేస్తాడంతే అని నమ్మాలి ప్రజలు 650 హామీలిచ్చి మానిఫెస్టో మాయం చేసినవాడు బాబు కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు చేసింది ఏదైనా ఎక్కడైనా కనిపిస్తోందా..? మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం చదవండి: ఇది సీఎం జగన్ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’ -
రాయలసీమ చరిత్రలోనే భారీ బహిరంగ సభ
-
Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచాం పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయి లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు వేశాం మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాం రూ.2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం వైఎస్ఆర్ సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పండి 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చాం కేవలం 57 నెలల కాలంలో 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టోను మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా ఉన్నారా? చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? జగన్ కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు? సైకిల్ ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు? ప్రజల కోసం 125 సార్లు నేను బటన్ నొక్కాను మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు సైకిల్ కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుంది పేదవాడి బతుకును మార్చేందుకు మనం యుద్దం చేస్తున్నాం చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారు టీడీపీ దేనికి సంసిద్ధమని అడుగుతున్నా ?? దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు వైఎస్ఆర్ సీపీ మీ అందరి పార్టీ మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు గతంలో లంచాలు పిండుతూ తన వారికే చంద్రబాబు పథకాలిచ్చుకున్నాడు పార్టీలో ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా ఉంటాడు నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా ఉండాలి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సీపీ 99 శాతం హామీలు అమలు చేసింది ఎల్లోమీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు ఎల్లో మీడియా చీకటి రాతలు తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు ఈ ఎన్నికలు చాలా కీలకం పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుంది సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం -
ఇది సీఎం జగన్ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సోషల్ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సిద్ధం అప్డేట్స్ను వైఎస్సార్సీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్బుక్, ట్విట్టర్ నిండిపోయింది. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నేడు రాయలసీమలోని రాప్తాడులో ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది. రాప్తాడు సభ సముద్రాన్ని తలపించింది. సభకు లాక్షలాదిగా సీఎం జగన్ సైన్యం తరలివచ్చింది. సీఎం జగన్ ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. ఎంతమంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలతోనే తన పొత్తు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్ధిదారులే తనకు ఓటు వేయిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్‌లు -
Live: రాప్తాడు సిద్ధం బహిరంగ సభ
-
బాబు గుండెల్లో "సిద్ధం" ప్రకంపనలు
-
ఈరోజు సిద్ధం సభతో..మా దమ్మెంటో మళ్లీ నిరూపిస్తాం
-
చరిత్రలో ఎన్నడూలేని విధంగా 10 లక్షల మంది తరలి వస్తున్నారు
-
జై జగన్..హోరెత్తుతున్న రాప్తాడు
-
సిద్ధం సభకు కుప్పం నుంచి భారీగా పోటెత్తుతున్న జనం
-
సిద్ధం సభపై ఎల్లో మీడియా దుష్ప్రచారం..మండిపడ్డ లీల అప్పిరెడ్డి
-
10 లక్షల మందితో సిద్ధం సభ..
-
రాప్తాడు సిద్ధం సభకు రోజా సైన్యం
-
బస్సుల్లో దండిగా తరలి వస్తున్న జనం
-
మీకు మూడింది..175/175...జగన్ ధీమా
-
సిద్ధం సభకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు
-
రాప్తాడులో సిద్ధం సభపై పబ్లిక్ రియాక్షన్స్
-
రాప్తాడులో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు..
-
దూసుకుపోతున్న జగన్...రాప్తాడులో సిద్ధం సభ
-
భీమిలి, దెందులూరును మించిపోయేలా రాప్తాడు ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే భీమిలి, దెందులూరు బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సుమారు 250 ఎకరాల మైదానం లో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. లక్షలాది మంది వచ్చే సిద్ధం సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాప్తాడు బైపాస్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని... ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎం ప్రొగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. రాప్తాడు సిద్ధం సభ నుంచి సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం మరోసారి ఖాయమని ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు. -
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వైఎస్సార్ సీపీదే
-
చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తాడో చెప్పడం లేదు: మంత్రి ఉషశ్రీ
-
సీఎం జగన్ సిద్ధం సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు
-
కనీవినీ ఎరుగని రీతిలో రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ
-
రాప్తాడు సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటన
-
రాప్తాడులో రేపు సిద్ధం సభ
-
ఈ నెల 18న రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ
-
చరిత్రలో నిలిచిపోయేలా సిద్ధం సభ ఉంటుంది: MLA వెంకట రామిరెడ్డి
-
రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి: మంత్రి పెద్దిరెడ్డి
-
YSRCP Siddham Sabha: మేము సైతం ‘సిద్ధం’
అనంతపురం: రాప్తాడులో ఈ నెల 18న జరుగనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ఏ చిన్నలోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వలంటీర్లుగా పనిచేసేందుకు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో వచ్చిన పలువురు విద్యార్థులతో మంగళవారం సిద్ధం సభాస్థలి వద్ద ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ భేటీ అయ్యారు. వలంటీర్లుగా విద్యార్థులు అందించాల్సిన సేవలపై తలశిల దిశానిర్దేశం చేశారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో విపక్షాలన్నీ కట్టగట్టుకుని జగనన్న ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీద దాడి చేస్తున్నాయన్నారు. పేదోడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాడటానికి, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని తలశిల రఘురామ్ పిలుపునిచ్చారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానాన్ని నీరుగార్చేందుకు పెత్తందార్లంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద వారి దండ యాత్ర కొనసాగుతుందన్నారు. వారి కుట్రలను విద్యార్థిలోకం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవ, రాష్ట్ర అధికార ప్రతినిధి కేశవ, రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి, నాయకులు శ్రీకాంత్, రమేష్, విజయ్, ఆదాం, కిరణ్, అనిల్, వినోద్, ప్రశాంతి, కోమల, ఇమ్రాన్, ఇర్షాద్, చంద్ర, పవన్ పాల్గొన్నారు. -
రాప్తాడు సిద్ధం సభ తేది మార్పు..పెద్దిరెడ్డి కీలక ప్రకటన