సిద్ధం ఓ సభ కాదు.. ఓ సింహనాదం | YSRCP Siddham Completely Changes AP Political Scenario | Sakshi
Sakshi News home page

సిద్ధం ఓ సభ కాదు.. ఓ సింహనాదం

Published Sun, Mar 10 2024 1:35 PM | Last Updated on Sun, Mar 10 2024 1:51 PM

YSRCP Siddham Completely Changes AP Political Scenario - Sakshi

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మార్చేసిన సభలు

ఇవాళ అద్దంకిలో మరో భారీ సభ

ఇటీవల తెలుగురాష్ట్రాల్లో.... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ.. ఏ పార్టీకి సాధ్యం కానీ రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు చరిత్రాత్మకం అయ్యాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించిన సభలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తాన్ని వేడెక్కించాయి. లక్షలాదిగా హాజరవుతున్న జనం సీఎం వైయస్ జగన్ పట్ల తమకు ఎంత అభిమానం ఉన్నదో.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉన్నదో తేటతెల్లం చేశారు. అంతేకాకుండా సిద్ధం స్థాయి సభలు నిర్వహించాలని ప్రతి పార్టీ కూడా తలపోసి రీతిలో ఈ సభలు జరుగుతున్నాయి.

లక్షలాదిగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి అధినేత జగన్ చేస్తున్న ప్రసంగాలు సొంత క్యాడర్లో ఉత్తేజాన్ని నింపుతుండగా అవతలి పార్టీల పాలిట అదో సింహనాదం మాదిరి వినిపిస్తోంది. ఒకదాన్ని మించి ఇంకోటి అన్నట్లుగా భీమిలి సభను మించి దెందులూరు సభ నిర్వహించారు.. దాన్ని మించి రాప్తాడు సభ జరిగింది.. ఇప్పుడు అద్దంకిలో ఏకంగా పదిహేను లక్షలమందితో అంటే అచ్చంగా ఓ యుద్దాన్ని తలపించే రీతిలో సైన్యాన్ని సమీకరించి జగన్ చేసే ప్రసంగం ప్రతిపక్షాల గుండెల్లో భయాన్ని రేపిన సభలు ఇవి. ఒక్కో సభ జరిగేకొద్దీ ప్రజల్లో పార్టీకి క్రేజ్ పెరుగుతూ వస్తోంది... మళ్ళీ వచ్చేది జగనే... ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా చివరకు గెలిచేది జగనే.. అనే సందేశం... ఓ పాజిటివ్ అభిప్రాయం సమాజంలోకి దూసుకు వెళ్తోంది. దానికితోడు.. 

మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి.. మంచి జరగకపోతే ఓట్ వద్దు అని వైయస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం కూడా ప్రజలను ఆలోచింపజేస్తోంది. అదీ మాట ... అదీ మగాడితనం అంటే... అదిరా దమ్ము అనే అభిప్రాయం సైతం ప్రజల్లోకి వెళ్ళింది. తాను ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేసానన్నది రొమ్ము విరుచుకుని మరీ చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రసంగాలు.. నిర్వహిస్తున్న సభల్లో కేవలం జగన్ను తిట్టడానికి తప్ప తాము ప్రజలకు ఏమి చేస్తామన్నది చెప్పలేకపోతున్నారు. సిద్ధం సభలకు... ప్రతిపక్షాల సభలకు ఇది కదా అసలు తేడా... నిర్వహించి ఎన్నిలకు తాము సిద్ధం అని పొలికేక పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే సిరీస్ లో భాగంగా ఇప్పుడు అడ్డంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో మరో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్ను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది.

  • దాదాపు పదిహేను లక్షల మంది కార్యకార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్న మెదరమెట్ల సభ పార్టీకి మరింత ఊపు తేనుంది.
  • భీమిలీ, దెందులూరు, రాప్తాపాడు లలో జరిగిన సభలు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మును, ప్రజాదరణను తెలియజేయగా ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే విధంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు.
  • లక్షలాది మంది హజరయ్యే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
  • ఎక్కువ మంది వీక్షించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లు అమర్చారు.
  • సీఎం వైయస్ జగన్ కార్యకర్తలకు మరింత చెరువ కావడానికి వీలుగా ర్యాంప్ లు ఏర్పాటు చేశారు.
  • ఇదే సభలో సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫేస్టో లో కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది.
  • ఇటు వరుస సిద్ధం సభలతో వైఎస్సార్ సీపీ దూసుకుపోతుండగా అటు ప్రత్యర్ధి టీడీపీ, జనసేన కూటమి ఇలాంటి సభ ఒక్కటి కూడా నిర్వహించలేకపోవడం వారి అనైక్యతను, ప్రజల్లో వారికున్న బలాన్ని తేటతెల్లం చేస్తోంది.
  • ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తూ.. వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి
  • పొత్తులు, బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది.
  • మేదరమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజల్లో సీఎం వైయస్ జగన్ కు ఉన్న ఆదరణ మరోమారు తెలుస్తుంది . దీంతరువాత ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారవుతుంది. 
  • మరోవైపు ఇప్పటికే ఆంధ్రాలో మళ్ళీ జగనే వస్తారనే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్, బిజెపి .. ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తోంది.
  • అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పథకాలతో అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిలువరించడం కష్టమని ఇప్పటికే టీడీపీ, జనసేన క్యాడర్ అభిప్రాయపడుతోంది.

✍️సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement