నెల్లూరు(దర్గామిట్ట): బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో మార్చి 3న సిద్ధం సభను విజయవంతంగా నిర్వహిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని తెలియజేసేలా సభ ఉంటుందని చెప్పారు. సిద్ధం సభ విషయమై నగరంలోని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు.
తిరుపతి, ప్రకాశం, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయకర్తలు పాల్గొన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు సిద్ధం సభలు భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించామని, మేదరమెట్లలో నిర్వహించే ఆఖరి సభకు 15 లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సభలో సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్ల 10 నెలల కాలంలో అందించిన పాలన, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తమ పాలనలో అందించిన మేలును వివరిస్తారని చెప్పారు.
భీమిలి, ఏలూరు తర్వాత రాప్తాడులో జరిగిన సభ అజరామరమని, ప్రజలను ఉత్తేజ పరిచేలా ఉందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో తయారవుతోందని, త్వరలో విడుదలవుతుందని తెలిపారు. నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్య ర్థిగా శరత్ చంద్రారెడ్డి పోటీ చేయరన్నారు. త్వరలోనే జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిని, నెల్లూరు ఎంపీ అభ్య ర్థిని ప్రకటిస్తామన్నారు.
ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లçపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీ«ధర్, సమన్వయకర్తలు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మహ్మద్ ఖలీల్, దద్దాల నారాయణయాదవ్, తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చెవిరెడ్డి అభినవ్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మేయర్ స్రవంతి,పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment