సాక్షి, బాపట్ల: అధికారమంటే నాకు వ్యామోహం లేదు. అధికారం పోతుందనే భయం లేదు. చెసేదే చెప్తాం. చెప్పామంటే చేస్తాం. హిస్టరీ బుక్‌లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే కోరిక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆదివారం సాయంత్రం మేదరిమెట్ల సిద్ధం సభ వేదికగా ప్రకటించారాయన.
మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా హామీలు అమలు చేశాం. 2024 తర్వాత కూడా మనం చేస్తున్న మంచి కొనసాగాలి. దేవుడి మీద తప్ప మీ అన్న పొత్తులు జిత్తులు నమ్ముకోలేదు. 2019కి ముందు మీకు మంచి భవిష్యత్తు అందిస్తానని మాటిచ్చా. 99 శాతం హామీలు అమలు చేశాం. మన సంకక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు.
నాపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకోవడమే. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ సీట్లకు 25 సీట్లు తెచ్చుకోవడమే మన టార్గెట్. మన నేతలు ఇంటి ఇంటికి వెళ్లి జరిగిన మంచి చెబుతున్నారు. వాళ్లు మాత్రం రామోజీ, రాధాకృష్ణ, ఢిల్లీ గడపలు తొక్కుతున్నారు. పేదవారి భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్‌నే తెచ్చుకోవాలని మీరంతా చెప్పండి. మీ అన్న వస్తేనే పథకాలన్నీ అందుతాయని చెప్పండి.
ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి
సైకిల్ ఇంటి బయట
తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి
చంద్రబాబు మేనిఫెస్టోకి.. శకుని చేతిలో పాచికలకు తేడా ఏముంది? మూడు పార్టీలు 2014లో హామీలు అమలు చేయలేదు. 2014లో ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు చేశారా?. చంద్రబాబుకు ఓటేయడమంటే.. పథకాల రద్దుకు ఓటేయడమే. మనం అమలు చేస్తున్న 8 పథకాల్ని ఎవరూ టచ్ చేయలేరు.. ఎవరైనా అమలు చేయాల్సిందే. చంద్రబాబు చెబుతున్న సూసర సిక్స్‌కు ఏటా 73వేల కోట్లు కావాలి. చంద్రబాబు ఇస్తున హమీల విలువు ఇప్పటికే రూ.లకక్షా యాభై వేల కోట్లు దాటుతున్నాయి. అబద్ధపు హామీలతో.. పొత్తుల డ్రామాతో మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు.
జరగబోయేది.. మాట మీద నిలబడే వాళ్లకుXమాట తప్పడమే అలవాటుగా ఉన్నవాళ్లకు యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నా. జరగబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి సిద్ధమా?. వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధమని చెప్పండి. కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన మెప్పించేందుకు జగన్ అనే నేను మీ సేవకుడిగా సిద్ధం అని.. సీఎం జగన్ అద్దంకి సిద్ధం సభలో తన ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment