addanki
-
చరిత్రకు సాక్ష్యం.. క్రీస్తుపూర్వపు సమాధులు
అద్దంకి: పురావస్తులోనూ, ఇటు తెలుగు సాహిత్యంలోనూ బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం ఎంతో పేరెన్నికగన్నది. అద్దంకి, బల్లికురవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తుపూర్వం నాటి సమాధులు తరచూ వెలుగుచూస్తుండడంతో ఈప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుంచి 5వ శతాబ్ద ప్రాంతంలో నివసించిన వారి మృతదేహాలకు సంబంధించిన పెద్దపెద్ద సమాధుల (రాక్షస గూళ్లు)ను స్థానిక శాసన, పురావస్తు పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి గుర్తించి పురావస్తు శాఖకు సమాచారమిచ్చారు. పురాతన సమాధులున్న ప్రాంతాలివే.. అద్దంకి మండలంలోని దేవనువకొండ, పేరాయిపాలెం, అద్దంకి కొండ, ధర్మవరం (జంగమహేశ్వర అగ్రహారం), మణికేశ్వరం, రామకూరు, మార్టూరు మండలంలోని ద్రోణాదుల, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి గ్రామాల్లోని కొండ దిగువ భాగాల్లో క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 5వ శతాబ్ద కాలంలో నివసించిన మానవుల సమాధులు ఐదారేళ్లుగా బయటపడుతూ వస్తున్నాయి. నాటి మనుషుల ఎత్తు ఏడడుగుల పైనే.. క్రీస్తుం పూర్వం ఇక్కడ నివసించిన మనుషుల ఎత్తు ఏడడుగుల ఎత్తుకు పైమాటే అనేది ఇక్కడ లభించిన సమాధుల పొడవును బట్టి పరి«శోధకులు అంచనా వేస్తున్నారు. ఇవి ఏడడుగుల పొడవు, నాలుగడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉన్నాయి. సమాధికి మూడువైపులా పలకరాళ్లు, పైన ఒక పలకరాయి మూతపెట్టి.. సమాధి తలభాగంలో అప్పట్లో తయారుచేసిన కుండలో మరో చిన్న కుండ పెట్టి అందులో ఆనాడు వారు పండించిన కొర్రలు, జొన్నలు, రాగులను ఉంచారు. దీనిబట్టి ఆ రోజుల్లో ఇవే వారి ఆహారమని అర్థమవుతోంది. పోడు వ్యవసాయం.. ఇక అప్పట్లో అద్దంకి గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం మొత్తం అడవులతో నిండి ఉండేదని తెలుస్తోంది. ఇక్కడ నివసించిన సంచార జాతులు అడవుల్లోని చెట్లను నరుక్కుని అక్కడే ఉండేవారు. ఆధిపత్య పోరులో యుద్ధాలు జరిగే సమయంలో ముందుగానే సమాధులను తయారుచేసి ఉంచి, మరణించిన వారి మృతదేహాలను వాటిల్లో ఉంచేవారని తెలుస్తోంది. ఈ సమా«ధులపై మట్టివేసి పూడ్చిన తరువాత పైభాగంలో గుండ్రని ఆకారంలో రాళ్లను పాతేవారు. ఇదిలా ఉంటే.. క్రీస్తు పూర్వంలోనే నాగరికత ఉందని చెప్పడానికి ఈ సమాధులే నిదర్శనం. సమాధుల తలభాగంలో ఉంచిన మట్టి కుండలు (మృణ్మయ పాత్రలు) ఇప్పటికీ చెక్కుచెదరక (తవ్వకాల్లో పగిలిపోయాయి) ఉన్నాయి. ఈ కుండలు కొన్ని పూర్తిగా ఎర్రగానూ, మరికొన్ని సగభాగం వరకు ఎర్రగా ఉండి, మిగిలిన సగం నల్లగా ఉన్నాయి. పైభాగంలో నగిషీలు చెక్కిఉంచారు. తవ్వకాలు జరిపితే మరిన్ని ఆనవాళ్లు.. పురాతన సమాధులు బయటపడిన ప్రదేశాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే మరిన్ని ఆనవాళ్లు లభించడమే కాక, భావితరాలకు నాటి విశేషాలు అందించిన వారమవుతాం. అద్దంకి చరిత్ర ఇప్పటి తరానికే కాగా దేశం నలుమూలలా చాటి చెప్పాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం నడుం బిగించాలి. – విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, శాసన పరిశోధకుడు, రచయిత -
అద్దంకిలో టీడీపీ రౌడీ రాజకీయం
-
Addanki Siddham Sabha Photos: కిక్కిరిసిన రోడ్లు, జన సముద్రం (ఫొటోలు)
-
Top 5 Pictures Of The Day Addanki Siddham Sabha: దద్దరిల్లిన అద్దంకి సిద్ధం సభ (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ ‘సిద్ధం’ (ఫొటోలు)
-
త్వరలోనే మేనిఫెస్టో.. బాబుకి ఓటంటే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: అధికారమంటే నాకు వ్యామోహం లేదు. అధికారం పోతుందనే భయం లేదు. చెసేదే చెప్తాం. చెప్పామంటే చేస్తాం. హిస్టరీ బుక్‌లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే కోరిక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆదివారం సాయంత్రం మేదరిమెట్ల సిద్ధం సభ వేదికగా ప్రకటించారాయన. మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా హామీలు అమలు చేశాం. 2024 తర్వాత కూడా మనం చేస్తున్న మంచి కొనసాగాలి. దేవుడి మీద తప్ప మీ అన్న పొత్తులు జిత్తులు నమ్ముకోలేదు. 2019కి ముందు మీకు మంచి భవిష్యత్తు అందిస్తానని మాటిచ్చా. 99 శాతం హామీలు అమలు చేశాం. మన సంకక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు. నాపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని ఇంటికి తెచ్చుకోవడమే. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ సీట్లకు 25 సీట్లు తెచ్చుకోవడమే మన టార్గెట్. మన నేతలు ఇంటి ఇంటికి వెళ్లి జరిగిన మంచి చెబుతున్నారు. వాళ్లు మాత్రం రామోజీ, రాధాకృష్ణ, ఢిల్లీ గడపలు తొక్కుతున్నారు. పేదవారి భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్నే తెచ్చుకోవాలని మీరంతా చెప్పండి. మీ అన్న వస్తేనే పథకాలన్నీ అందుతాయని చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయట తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి చంద్రబాబు మేనిఫెస్టోకి.. శకుని చేతిలో పాచికలకు తేడా ఏముంది? మూడు పార్టీలు 2014లో హామీలు అమలు చేయలేదు. 2014లో ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు చేశారా?. చంద్రబాబుకు ఓటేయడమంటే.. పథకాల రద్దుకు ఓటేయడమే. మనం అమలు చేస్తున్న 8 పథకాల్ని ఎవరూ టచ్ చేయలేరు.. ఎవరైనా అమలు చేయాల్సిందే. చంద్రబాబు చెబుతున్న సూసర సిక్స్‌కు ఏటా 73వేల కోట్లు కావాలి. చంద్రబాబు ఇస్తున హమీల విలువు ఇప్పటికే రూ.లకక్షా యాభై వేల కోట్లు దాటుతున్నాయి. అబద్ధపు హామీలతో.. పొత్తుల డ్రామాతో మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు. జరగబోయేది.. మాట మీద నిలబడే వాళ్లకుXమాట తప్పడమే అలవాటుగా ఉన్నవాళ్లకు యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారుల్ని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నా. జరగబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి సిద్ధమా?. వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధమని చెప్పండి. కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్లు ప్రజలు మెచ్చిన పాలన మెప్పించేందుకు జగన్ అనే నేను మీ సేవకుడిగా సిద్ధం అని.. సీఎం జగన్ అద్దంకి సిద్ధం సభలో తన ప్రసంగం ముగించారు. -
నాకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సముద్రానికి సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో లక్షల మంది జనసందోహం నడుమ ప్రసంగించారాయన. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా? అని సీఎం జగన్ అనగానే.. లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా.. దక్షిణ కోస్తా సిద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని.. ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. -
జగన్ వన్స్‌మోర్ నినాదాలతో మారుమోగిన అద్దంకి సిద్ధం సభ (ఫొటోలు)
-
ఎంతమంది వచ్చినా జగనే మళ్లీ సీఎం: అనిల్ కుమార్ యాదవ్
సాక్షి, బాపట్ల: సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయని.. ఎన్ని పార్టీలు కూటమి కట్టినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేవని మాజీ మంత్రి, నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మేదరమెట్ల సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం అవుతారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
అద్దంకి సిద్ధం సభలో డ్రోన్ కలకలం
సాక్షి, బాపట్ల: ఆదివారం అద్దంకి మేదరమెట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో డ్రోన్ కలకలం రేగింది. మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచే ప్రకటించారు. ఆ సమయంలో సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఆ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక కాసేపటికే మైక్ అందుకుని ‘‘ఏయ్ పప్పూ... ఎక్కడో దూరంగా ఉండి.. డ్రోన్‌ను పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా. కార్యకర్తల నినాదాలతోనే ఈ షర్ట్ తడిచిపోవడం ఖాయం’’ అంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్‌ను ఉద్దేశించి సవాలు విసిరారు. -
Watch Video: అద్దంకి సిద్ధం సభలో సీఎం జగన్
-
బాపట్ల జిల్లా మేదరమిట్లలో "సిద్ధం" సభ: విజయసాయిరెడ్డి
-
నాడు నేడు పథకంపై ప్రశంసల జల్లు
-
అద్దంకిలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
అద్దంకి పొలం-ఖర్జూర ‘ఫలం’.. 40 ఏళ్లు దిగుబడి, ఎకరాకు 4 లక్షల ఖర్చు
పోషకాలు మెండుగా ఉండి చూడగానే నోరూరించే ఖర్జూరం అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఎడారి పంట అయిన ఈ ఖర్జూరాన్ని మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం సాగుచేస్తున్నప్పటికీ మనం వినియోగించే ఖర్జూరంలో మెజారిటీ వాటా దిగుమతులే. దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాలనుంచి భారత్ ఖర్జూరం దిగుమతి చేసుకుంటుంది. అయితే ఖర్జూరం పంటలో లాభ దాయకతను గుర్తించిన దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే దీని సాగుపై మక్కువ చూపిస్తుండటంతో సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతోంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వాణిజ్య ప్రాతిపదికన ప్రారంభమైన ఖర్జూరం సాగు ప్రస్తుతం బాపట్ల జిల్లాకు విస్తరించింది. అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు మండలాల్లో సుమారు 6.8 ఎకరాల్లో రైతులు ఖర్జూరం పంట సాగు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు 2.5 ఎకరాల్లో నాణ్యమైన బర్హీరకం సాగుచేస్తున్నాడు. దుబాయ్ నుంచి మొక్కలు తెచ్చి విక్రయించే తమిళనాడు వ్యాపారి నిజాముద్దీన్ దగ్గర మొక్కలు కొనుగోలుచేసినట్లు చిరంజీవి చెప్పారు. వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తేనే లాభం ఉంటుందని భావించి ఖర్జూరం సాగువైపు మొగ్గు చూపినట్లు తెలిపారు. చిరంజీవి తోట తోట ప్రస్తుతం నాలుగేళ్ల వయసులో ఉంది. అనుకూలమైన నేలలివే.. సారవంతమైన తువ్వ (తెల్ల) నేల, గరప, నల్ల నేల, బంక నేలలతోపాటు, పీహెచ్ విలువ 8 నుంచి 10 వరకు ఉన్న చౌడు భూముల్లోనూ ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటకి అనుకూలంకాదు. ఖర్జూరం వేసవిలో కాపుకి వస్తుంది. ఉషో్టగ్రత 25 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటే మంచి దిగుబడి వస్తుంది. అధిక వర్షాలు, చలిగాలులు ఖర్జూరం పంటకు ఇబ్బందికరం. దీనివల్ల మొక్కలు తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. నాటిన మూడేళ్లకు కాపు ఈత జాతికి చెందిన ఖర్జూరం మొక్క నాటిన మూడేళ్లకు కాపుకి వస్తుంది. ఇందులో ఆడ, మగ మొక్కలు ఉంటాయి. 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అవసరం. సాలుకు సాలుకు మధ్య మొక్కకు మొక్కకు మధ్య 24 అడుగుల ఎడంతో ఎకరాకు 78 మొక్కలు నాటుకోవచ్చు. మగ మొక్కలు తోటకు చుట్టూ అంచు వరుసలో నాటుతారు. మగ మొక్కలు కండెకు వచ్చిన తరువాత ఆ పుప్పొడిని భద్రపరుస్తారు. ఖర్జూరం మొక్క డిసెంబర్లో పూతకు వస్తుంది. ఆడ మొక్కలు పూతకు రాగానే ఆ పూతపై మొగ మొక్కల నుంచి సేకరించిన పుప్పొడిని చల్లుతారు. పూసిన మూడు నుంచి నాలుగు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి. ఐదు నెలలకు గెలలను కోసి విక్రయించుకోవచ్చు. ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షల వరకు వ్యయం అవుతుంది. మూడో ఏడాది నుంచి 40 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. తొలి నాలుగేళ్లు దిగుబడి తక్కువగా ఉంటుంది. ఖర్జూరం మొక్కలు నాటిన నుంచి ఏడేళ్ల వరకు అంతరపంటలుగా పప్పు ధాన్యాలు, పశువుల మేత వంటివి సాగుచేసుకోవచ్చు. గుంటూరుకు చెందిన వ్యాపారి బర్హీ రకం కాయలను కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతు చిరంజీవి చెప్పారు. ఈ రకం ఖర్జూరాన్ని ప్రాసెస్ చేయకుండానే తినవచ్చని తెలిపారు. ఒక్కో మొక్క రూ.4,500 అద్దంకి ప్రాంతానికి బాగా అనుకూలమైన రకం బర్హీ. ఇందులో పసుపు, ఎరుపు రకాలు బాగా తియ్యగా ఉంటాయి. వీటిని తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ దుబాయ్ నుంచి తెప్పిస్తాడు. నెల పాటు తన వద్ద మొక్కలను పెంచి ఒక్కో మొక్క రూ.4.500 చొప్పున విక్రయిస్తాడు. అదే విధంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు తెప్పించుకోవచ్చు. మొక్కల సంఖ్య, నాటే విధానం వివరాలు నర్సరీ నిర్వాహకులనుంచి తెలుసుకోవచ్చు. అనంతపురం రైతును స్ఫూర్తిగా తీసుకున్నా.. సంప్రదాయ వ్యవసాయ సాగులో ఏటా నష్టాలు వస్తున్నాయి. ఖర్జూరం సాగులో ఒక్కసారి పెట్టుబడి పెడితే నాలుగో సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల వరకు ఎటువంటి దిగులు ఉండదు. అయితే ఖర్జూరం మొక్కలను మన దేశంలో టిష్యూ కల్చర్ చేయకపోవడంతో ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో మొక్కల కొనుగోలుకు అధిక ఖర్చు అవుతోంది. ఉపాధి హామీ ద్వారా ఉద్యాన శాఖ పరిధిలో మొక్కలు ఇస్తే ఖర్జూరం సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. – చిరంజీవి, రైతు, తిమ్మాయిపాలెం అధిక ఉష్ణోగ్రతలు అనుకూలం ఉషో్టగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. వేసవిలో వర్షాలు పడితే కాపు రాదు. బాపట్ల జిల్లాలో ఇప్పుడిప్పుడే కొంతమంది రైతులు ఖర్జూరం సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మగ మొక్కల నుంచి పుప్పొడి సేకరించి, ఆడ మొక్కల పూతపై వేసే సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లు అవసరం. లేకపోతే రైతే ఆ పని నేర్చుకోవాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఖర్జూరం సాగులో మంచి లాభాలు వస్తాయి. – దీప్తి, అద్దంకి డివిజన్, ఉద్యానశాఖ అధికారి, బాపట్ల జిల్లా -
అమెరికా ఫ్లోరిడాలో తెలుగు వ్యక్తి మృతి
-
అమెరికాలో అద్దంకి వాసి మృతి.. కొడుకుని కాపాడి..
సాక్షి, బాపట్ల జిల్లా : ఉద్యోగ రీత్యా అమెరికాలో నివసిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి వాసి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన భారత కాలమానం ప్రకారం శనివారం జరిగింది. అందిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన పొట్టి రాజేశ్ కుమార్(42) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఫ్లోరిడాలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బీచ్‌కు వెళ్లాడు. బీచ్‌లో స్నానం చేస్తున్న కుమారుడు మునిగిపోతుండటంతో నీళ్లలోకి వెళ్లి కుమారుడిని రక్షించి తాను ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి మృతిచెందాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు మృతదేహాన్ని పట్టణానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు పేర్కొన్నారు. బుధవారం అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక పెండ్యాల ప్లాజాలో విలేకర్లతో ముచ్చటించారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ ఉండేదన్నారు. ‘శుభవేళ’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిశ్రమకు పరిచయమైనట్లు తెలిపారు. షకలక శంకర్ ప్రోత్సాహంతో ఓ తెలుగు చానల్ కామెడీ షోలో పాత్రలు పోషించానని, ప్రాధాన్యత లేని పాత్రలు రావడంతో 6 నెలల క్రితమే తప్పుకున్నాని చెప్పారు. చదవండి: బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్ విశాఖ జిల్లాలోని అక్కాయపాలెం తన స్వస్థలమని, పట్టుదలతోపాటు భార్య సహకారంతో ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన భార్య 18 ఏళ్లు టీచర్‌గా పనిచేస్తూనే ప్రోత్సహించిందన్నారు. ఇప్పటి వరకు 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించినట్లు వివరించారు. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు దక్కాయని తెలిపారు. తనకు రాని ఇంగ్లిష్ భాషతోనే అందరినీ ఆకట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సినీ రంగాన్ని ఎంచుకునే యువకులు ఏ శాఖలో ప్రతిభ ఉందో గ్రహించి శిక్షణ పొందితే విజయం సాధించవచ్చని సలహా ఇచ్చారు. ప్రతిభ ఉన్నవారిని ఎవరూ అడ్డుకోలేరని హాస్యన టుడు అప్పారావు స్పష్టం చేశారు. -
భార్యను వదిలి మరో మహిళతో పరార్.. ఇంటికి వచ్చిచూస్తే..
సాక్షి, ప్రకాశం(అద్దంకి): భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని గమనించిన భర్త.. ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో సోమవారం జరుగ్గా మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై శివరామిరెడ్డి తెలిపిన వివరాల మేరకు పర్చూరు మండలంలోని తన్నీరువారిపాలెం గ్రామానికి చెందిన చలంచర్ల ప్రసాదు, శ్రీలక్ష్మి (35) భార్యా భర్తలు. వీరిరువురూ సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామంలోని పూర్వీకులకు సంబంధించిన ఎకరం భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో భార్యను.. భర్త వదిలేసి వేరే మహిళతో సంబంధం పెట్టుకుని ఎటో వెళ్లి పోయాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చిన భర్త, భార్య మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉందని గ్రహించి, మనిద్దరం ఇక ఒకటిగా కలసి ఉందామని చెప్పి పొలం వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ పురుగుల మందును భార్య చేత తాగించి జారుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను చికిత్స కోసం తొలుత నరసరావుపేట వైద్యశాలకు, తరువాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆమె అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: (కడుపులో 108 డ్రగ్స్ క్యాప్యూల్స్.. అడ్డంగా బుక్కయ్యాడు..) -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, ప్రకాశం: అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూలీలు ఆటోలో గరటయ్య కాలనీ నుండి పంగులూరు మండలం చందలూరు మిర్చి కోతకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతులను కాకానిపాలెనికి చెందిన అనసూయ (55), మౌలా నగర్‌కు చెందిన షేక్ కరీమున్ (44) గా గుర్తించారు. చదవండి: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి మహమ్మారిని జయించిన ఆనందం.. అంతలోనే విషాదం -
Puppetry: తోలు బొమ్మలాట.. బతుకు బొమ్మలాట
జీవం లేని ఆ మూగ బొమ్మలు ఎన్నో విన్యాసాలు చేస్తాయి. మరెన్నో మాటలు మాట్లాడతాయి. జీవ నిబద్ధమైన రామాయణ, మహాభారత కథలను, మానవ బతుకు చిత్రాల్లో నీతిని కళ్లెదుట ఆవిష్కరిస్తాయి. కేతిగాడు, బంగారక్క, జుట్టు పోలిగాడు రూపంలో హాస్యాన్నీ పండిస్తాయి. వీటి కదలికల వెనుక.. అవి చెప్పే ఊసుల వెనుక బయటకు కనిపించని ఓ జానపదుడి కళాత్మకత దాగి ఉంటుంది. ఆదరణ తగ్గిన ఆ కళనే నమ్ముకుని నేటికీ కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు తహతహలాడుతున్నాయి. అద్దంకి: తోలు బొమ్మలాట అత్యంత పురాతన కళ. విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ భారతీయ జానపద కళా రూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొందింది. మన రాష్ట్రంలోని ప్రాచీన ఓడ రేవులైన కళింగ పట్నం, భీముని పట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపటా్నల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు ఈ కళారూపం కూడా పయనించింది. పర్షియా, టర్కీ మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలు బొమ్మలు అక్కడ నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడి నుంచి ఫ్రాన్స్‌లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. కాలానుగుణంగా ఆయా దేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ దీనికి మాతృక మాత్రం భారత దేశమే. ఇంతటి విశిష్టత పొందిన ఆ కళకు నేడు ఆదరణ తగ్గిపోయింది. అయినప్పటికీ తర తరాలుగా వారసత్వంగా వస్తున్న కళను కాపాడుకునేందుకు కొందరు కళాకారులు నేటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిణుకు మిణుకుమంటూనే.. ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తోలు బొమ్మలాట ప్రదర్శనలిచ్చే కుటుంబాలు సుమారు 500 వరకు ఉన్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో 10 కుటుంబాలు, దర్శిలో 10 కుటుంబాలు, ముండ్లమూరు మండలంలోని ఈదర, భీమవరం గ్రామాల్లో 10 కుటుంబాలు, నరసరావుపేటలోని సాతులూరులో 20 కుటుంబాలు, కోటప్పకొండలోని చీమలమర్రి, కొండమోడు వద్ద కొన్ని కుటుంబాలు ప్రాచీన కళను బతికిస్తున్నాయి. ఈ కుటుంబాలు ప్రస్తుతం వినాయక విజయం, రామాయణంలోని సుందరకాండ, మహిరావణ చరిత్ర, లక్ష్మణ స్వామి మూర్చ, రామరావణ యుద్ధం, ఇంద్రజిత్ యుద్దం, సీతా కల్యాణం, మహాభారతంలో పద్మవ్యూహం, విరాటపర్వం, కీచక వధ, కర్ణ, శల్య, సైంధవ, నరకాసురవధ వంటి కథలను ప్రదర్శిస్తున్నాయి. తోలు బొమ్మలాటనే నమ్ముకుని అద్దంకిలో ఉంటున్న రేఖనార్ కోటిలింగం కుటుంబం నేటికీ జీవనం సాగిస్తోంది. ఈ ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆ కుటుంబం కోరుతోంది. ఈ కళను వదల్లేం తోలు బొమ్మలాట మా తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. మరో వృత్తి చేయలేం. మా తాతల తండ్రులు మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకు వలస వచ్చారు. కళలకు నిలయమైన అద్దంకిలో ఆదరించే వారు ఎక్కువగా ఉంటారని మేమిక్కడ స్థిరపడ్డాం. కుటుంబం మొత్తం కళాకారులమే. ప్రదర్శనకు అవసరమైన బొమ్మలను మేక, గొర్రె చర్మంతో మేమే తయారు చేసుకుంటాం. ఒక్కో బొమ్మ తయారీకి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. భారత, రామాయణ పాత్రలకు సంబంధించిన పాత్రల బొమ్మలను ఆకర్షణీయంగా తెరవెనుక ఆడించడానికి వీలుగా తయారు చేసుకుంటాం. వాటికి దారాలు కట్టి, రేకులకు బిగించి నటనకు అనుగుణమైన కదలికలిస్తాం. మేం బతికున్నంత కాలం ఈ కళను వదల్లేం. జీవన భృతి కోసం మా పిల్లలు ఊరూరా తిరుగుతూ బీరువాలు, సోఫాలు, గ్యాస్ స్టవ్ మరమ్మతులు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కళకు వైభవం తెచ్చేందుకు కృషి చేయాలి – రేఖనార్ కోటిలింగం, తోలు బొమ్మలాట కళాకారుడు, అద్దంకి -
సెంటున్నర స్థలంలో ఇల్లు.. ప్రధాని మోదీ మెప్పు
సాక్షి, అద్దంకి: ‘‘సెంటు, సెంటున్నర స్థలంలో ఏం ఇల్లు పడుతుందండీ.. ఉండటానికేనా.. అంతా ఇరుకే..’’ అనే వారి నోటికి తాళం వేసేలా సెంటున్నర విస్తీర్ణంలో ప్రభుత్వం ఇచ్చిన నగదుతో పొందికగా ఇల్లు నిర్మించుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికై అందరి మన్ననలు అందుకుంటున్నారు అద్దంకి పట్టణానికి చెందిన మందలపు అనంత లక్ష్మి. జనవరి ఒకటో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆమెతో ఒంగోలు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడబోతున్నారు. ఆ గృహం విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఇంటి నిర్మాణ విశేషాలివీ.. అద్దంకి పట్టణానికి చెందిన మందలపు అనంతలక్ష్మి, తిరుపతయ్యలది చిన్న కుటుంబం. ఒకటిన్నర ఎకరం వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. గేదెలు పెంచుకుంటూ పాలపై వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి 2018లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(అర్బన్) కింద ఇల్లు మంజూరైంది. ఆ నగదుతోపాటు, పాలు పెరుగు అమ్మగా వచ్చిన నగదును జోడించి, సొంత భూమి సెంటున్నర స్థలంలో ముచ్చటగా పొందికైన గృహాన్ని సకాలంలో నిర్మించుకున్నారు. బయటి నుంచి చూస్తే అనంత లక్ష్మి గృహం ఆ ఏముంది సాధారణమైనదే కదా? ఇల్లు ఇరుకుగానే ఉంటుందిలే అనుకుంటారు.! కానీ ఇంట్లోకి వెళ్లి చూస్తే తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నంతలో విశాలంగా బెడ్ రూం, వరండా, హాల్, వంట గది, ముందు కొంచెం, వెనుక కొంచెం ఖాళీ స్థలంతో సుందరంగా అబ్బురపడేలా నిర్మించారు. సర్వాంగ సుందరంగా ఉన్న హాల్ ఇంటి కొలతలు.. నాలుగు వైపులా 12 అడుగులతో హాల్, 12 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవుతో వంట గది, ఎటు చూసినా 7 అడుగుల వెడల్పుతో ఉండే బెడ్ రూం, చిన్న వరండా, వెనుక ఖాళీ స్థలంలో అటాచ్డ్ బాత్రూం లెట్రిన్ నిర్మించుకున్నారు. మొత్తం 36 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు స్థలంలో నిర్మించిన ఈ ఇంటి వివరాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రం మొత్తం మీద పంపిన గృహాల్లో అద్దంకికి చెందిన అనంతలక్ష్మి గృహాన్ని వారు బెస్ట్ కన్స్ట్రక్షన్ హౌస్‌గా ఎంపిక చేశారు. జనవరి ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అవార్డు ఇవ్వనున్నారు. అన్ని వసతులతో నిర్మించుకున్నాం సెంటున్నర స్థలంలోనూ మంచి ఇల్లే నిర్మించుకోవచ్చు. ఇంటి విస్తీర్ణానికి మితం ఏముంది. మా ఇల్లు చాలా బాగుంది. నేను, మా భార్య, కుమారుడు ఆ ఇంట్లో హాయిగా ఉండేలా అన్ని వసతులతో నిర్మించుకున్నాం. – తిరుపతయ్య అవార్డు వస్తుందనుకోలేదు మేము గతంలో ఇల్లు లేక ఇబ్బందులుపడ్డాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో ఇల్లు మంజూరు కావడంతో మాకున్న సెంటున్నర స్థలంలో పొందికగా కట్టుకున్నాం. ఇంటి నిర్మాణ విశేషాలను చూసిన గృహ నిర్మాణ శాఖ మా ఇంటి ఫొటో పంపిందంట. దాంతో మాకు జాతీయ అవార్డు వచ్చిందని అధికారులు వచ్చి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. – మందలపు అనంత లక్ష్మి -
చులకన భావం; బావమరిదిపై బావలు దాడి
సాక్షి చీమకుర్తి: లెక్కలేని తనం, చులకన భావం, అహంకారం వెరసి నిండు ప్రాణం గాలిలో కలిసింది. మేనల్లుడిని ఒక దెబ్బ కొట్టినందుకు ఇద్దరు బావలు కలిసి బావమరిదిని తలపై ఇనుప పైపుతో బలంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన తాడి చిరంజీవి (30) తలపై తన బావలు వెలుగు శ్రీనివాస్, కోటిలు ఇనుప పైపు తీసుకొని బలంగా బాదారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా రాత్రి ఒంటి గంట సమయంలో ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ దాసరి రాజారావు తెలిపారు. మృతదేహాన్ని సీఐ సుబ్బారావు, ఎస్ఐ రాజారావు పరిశీలించారు. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య చదవండి: ‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’ గాయపడిన సాయి మణికంఠ సాక్షి, అద్దంకి : ఉన్న సమస్యను కూర్చొని మాట్లాడుకుందాం..అంటూ పిలిపించి యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఆ యువకుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జె.పంగులూరుకు చెందిన గుంజి సాయి మణికంఠ హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాలెపు శ్రీను కుమార్తె తనను ప్రేమించమంటూ సాయి మణికంఠ వెంట పడేది. ఆమె పదే పదే అలాగే చేస్తుండటంతో అతడు ఆమె తండ్రితో విషయం చెప్పి కుమార్తెను జాగ్రత్త చేసుకోమని కోరాడు. శ్రీను కుమార్తె అదే పనిగా మళ్లీ మణికంఠకు ఫోన్లు చేస్తోంది. కుమార్తెకు నచ్చజెప్పినా వినక పోవడంతో ఆమె తండ్రి హైదరాబాద్‌లో ఉన్న సాయి మణికంఠను ఊరికి రమ్మని కోరాడు. వస్తే తమ కుమార్తె విషయం మాట్లాడాలని చెప్పి పిలిపించాడు. యువకుడు అద్దంకి బస్టాండ్ వద్దకు రాగానే శ్రీను పథకం ప్రకారం కత్తితో దాడి చేశాడు. హఠాత్ పరిణామానికి భీతిల్లిన మణికంఠ బతుకు జీవుడా అంటూ పారిపోయి ఓ చోట దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. తేరుకున్న తర్వాత 108కి ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. -
హవ్వ.. నిరుపేదకు 12 ఎకరాలా?
సాక్షి, అద్దంకి: సెంటు భూమి లేని ఓ నిరుపేద పేరిట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఎకరాల భూమి ఉన్నట్లుగా మీ భూమి పోర్టల్‌లో చూపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి అమ్మ ఒడి పథకానికి అనర్హుడయ్యాడు. వివరాలు.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన దాసరి బుల్లెయ్యకు ఒక కుమారుడున్నాడు. అమ్మ ఒడి పథకం కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు రిజక్ట్ అయింది. ఎందుకైందని పరిశీలిస్తే నీ పేరిట 12 ఎకరాల భూమి ఉందని చెప్పారు. దీంతో అవాక్కయిన బల్లెయ్య మీ భూమి అడంగల్ వెబ్సైట్లో పరిశీలించగా, బుల్లెయ్య ఆధార్ నంబరుతో, ఖాతా నంబరు 2408 పేరుతో దక్షిణ అద్దంకిలోని వీరభద్రస్వామి దేవస్థానానికి చెందిన 1353/2, 1354 సర్వే నంబర్లకు సంబంధించి 12.64 ఎకరాలు భూమి ఉన్నట్లుగా చూపిస్తోంది. దీంతో బుల్లెయ్య లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తనకు సెంటు భూమి కూడా లేకున్నా ఇదేమిటని వాపోతున్నాడు. -
సినిమాను తలపించే బిల్డప్.. సొమ్ము స్వాహా!
సాక్షి, ఒంగోలు : అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఓ ఆగంతకుడు పోలీస్ కానిస్టేబుల్‌నంటూ లారీ డ్రైవర్ని చితకొట్టాడు. స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బైక్ ఎక్కించుకుని పర్సు కొట్టేశాడు. వివరాలు.. నెల్లూరు నుంచి కోదాడ వెళ్తున్న ఓ లారీ.. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద.. అద్దంకి నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆగింది. ఇంతలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ‘సీఐ వాహనంపైనే ఉమ్మేసి వస్తావా’ అంటూ చితకబాదాడు. స్టేషన్‌కి తీసుకెళ్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే.. అతనిపై దాడిచేసి పర్సు లాక్కెళ్లాడు. పర్సులో రూ.6 వేలు నగదు, ఏటీఎం కార్డు ఉందని డ్రైవర్ వాపోయాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు వెల్లడించాడు. -
సినిమాను తలపించే బిల్డప్.. సొమ్ము స్వాహా!
-
ఆస్తి రాయించుకుని అనాథను చేశారు
సాక్షి, అద్దంకి: మాయ మాటలతో మభ్యపెట్టి ఆస్తి రాయించుకుని ఆనక కొడుకులు తల్లిని నిలువునా బయటకు నెట్టేశారు. చేసేది లేక ఆ వృద్ధ తల్లి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగింది. ఈ సంఘటన పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం..కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన భోజనపల్లి ప్రసాదరావు, ధనలక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కోటేశ్వరరావు, శంకరరావు, వెంకట సుబ్బారావు, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. ప్రసాదరావు తనకు ఉన్న ఆస్తిని నాలుగు భాగాలుగా చేసి ముగ్గురు కుమారులు, భార్యకు సమానంగా రాసి ఇచ్చాడు. ప్రసాదరావు మరణంతో ఒంటరిగా ఉన్న తల్లిని పెద్ద కుమారుడు కోటేశ్వరరావు, చిన్న కుమారుడు వెంకట సుబ్బారావులు చేరదీసినట్లు నటించారు. తమ పిల్లల చదువు కోసం బ్యాంకులో రుణం కావాలంటే హమీ సంతకం పెట్టాలంటూ సుమారు 70 ఏళ్ల తల్లికి మాయమాటలు చెప్పారు. ఆమె వద్ద సంతకాలు తీసుకున్నారు. అనంతరం బంగారం, నగదు మొత్తం సుమారు రూ.25 లక్షల మేర ఆస్తిని అన్నదమ్ములిద్దరూ చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి ఆమెను సరిగ్గా చూడకుండా కొడుకులు, కోడళ్లు వేధించసాగారు. ఆ వృద్ధ తల్లి జరిగిన విషయం తెలుసుకునేలోపు ఆలస్యమైంది. తన ఆస్తి తీసుకుని మోసం చేస్తారా..అంటూ ధనలక్ష్మి తన కొడుకులు, కోడళ్లను నిలదీసింది. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఆమె దుస్తులు సైతం బయటకు విసిరేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ధనలక్ష్మి రెండో కుమారుడు శంకరరావు సాయంతో అద్దంకి మెయిన్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో చిన్న కుమారుడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. -
దీపం ఉండగానే.. ఇల్లు చక్కబెట్టుకున్న తమ్ముళ్లు!
టీడీపీ నేతలకు సర్కార్ భూములు మేతగా మారుతున్నాయి. గత ప్రభుత్వంలో అధికారం అడ్డు పెట్టుకుని సర్కార్ భూములు ఆక్రమించుకుని ఏకంగా చెరువులు తవ్వారు. అంతేకాకుండా మట్టి, ఇసుక విక్రయాలతో పాటు తవ్విన ఆ చెరువులను చేపల పెంపకానికి లీజుకిచ్చి అక్రమార్జనతో లక్షల రూపాయలు అప్పనంగా ఆర్జిస్తున్నారు. ఇదంతా అద్దంకి నియోజకవర్గం అద్దంకి, కొరిశపాడు మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అదంతా తమకేమీ తెలియదన్నట్లు అధికారులు వ్యవహరిస్తుడటం గమనార్హం. సాక్షి, అద్దంకి/మేదరమెట్ల: అధికారం అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ హయంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. సర్కార్ భూములను సైతం ఆక్రమించుకుని చెరువులుగా మార్చారు. చెరువులు తవ్వే క్రమంలో వచ్చిన మట్టి, ఇసుకను వదలకుండా అమ్ముకుని రూ.లక్షలకు లక్షలు ఆర్జించి జేబులు నింపుకుంటున్నారు. అంతటితో ఆగకుండా చెరువులను చేపల పెంపకానికి లీజుకిచ్చి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా ఆర్జన అద్దంకి, కొరిశపాడు మండలాల్లో యథేచ్ఛగా ఇప్పటికీ టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు. పట్టించుకోవాల్సిన మత్స్య, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యహరిస్తున్నారు. దీంతో వారి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 130 ఎకరాల ప్రభుత్వ భూముల్లో చెరువులు చెరువుల్లో నీరు–చెట్టు పేరుతో గత ప్రభుత్వ హయాంలో మట్టి, ఇసుకను విక్రయించిన టీడీపీ నేతలు గుండ్లకమ్మ ముంపు భూములనూ వదల్లేదు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో మంపునకు గురైన భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో ధేనువుకొండ, మణికేశ్వరం, అనమనమూరు, తమ్మవరం గ్రామాల పరిధిలో సుమారు 130 ఎకరాలకుపైగా ముంపు భూమిని ఆక్రమించారు, ఆక్రమణ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వారు. చెరువులను తవ్వే క్రమంలో వచ్చిన మట్టి, ఇసుకను వదలకుండా ట్రక్కు రూ.600 నుంచి రూ.1000కి విక్రయించి జేబులు నింపుకున్నారు. లీజుతో రూ.లక్షలు అక్రమార్జన రెండు మండలాల్లో కలుపుకుని ముంపు భూముల్లో 40 నుంచి 45 చెరువులు తవ్వారు. ఆ చెరువులను లీజుకిచ్చారు. లీజుకు తీసుకున్న వారు చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు. ఇలా ఒక్కో చెరువును ఆక్రమణదారులు ఏడాదికి రూ. 20 నుంచి రూ.25 వేల వరకు లీజు దారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ చెరువుల్లో లీజుదారులు ఎలాంటి అనుమతులు లేకుండా చేపల పెంపకం చేపడుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం ప్రభుత్వ భూముల్లో ఆక్రమంగా ఏర్పాట చేసిన చెరువుల్లో లీజుదారులు చేపల పెంపకం చేపట్టి చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలతో పాటు మాంస వ్యర్థాలు వేస్తున్నారు. ఈ నీటిని సమీపంలోని గుండ్లకమ్మ నీటిలో వదులు తుండటంతో నీరు కలుషితం అవుతోంది. ఇంజిన్‌తో చెరువులకు తరలిస్తున్న గుండ్లకమ్మ నీరు సాగు,తాగు నీరు చేపల చెరువులకు మళ్లింపు చేపల పెంపకం కోసం అనుమతులు లేకుండా తాగు, సాగు నీటిని యథేచ్ఛగా గుండ్లకమ్మ నది నీటిని మోటార్లతో తోడి చెరువులు నింపుకుంటున్నారు. దీంతో తాగు,సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాస్తవంగా చేపల చెరువుల యజమానులు చెరువులు నింపుకోవడం కోసం ముందుగానే సంబంధిత అధికారుల నుంచి ఏ నీటితో చెరువులు నింపుతారో తెలియజేసి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పట్టించుకోని అధికారులు ముంపు భూముల్లో అనుమతులు లేకుండా కట్టడాలు, మట్టి తవ్వకాలు జరపవద్దనే నిబంధన ఉన్నా ఆక్రమణదారులు లెక్క చేయడం లేదు. వందల ఎకరాల ముంపు భూములను ఆక్రమించుకుని చెరువుల ఏర్పాటుతో మట్టి ఇసుక, అమ్మకాలతో పాటు చేపల పెంపకానికి లీజుకిచ్చి దబ్బు దండుకుంటున్నా తమకేమీ తెలియదన్నట్లు అధికారులు వ్య్వహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
తెల్లారేసరికి విగతజీవులుగా..
సాక్షి, దర్శి (ప్రకాశం): పట్టణంలోని అద్దంకి రోడ్డు సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నపురెడ్డి వెంకటరెడ్డి (70), ఆదెమ్మ (51) దంపతులు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వెంకటరెడ్డి, ఆదెమ్మ దంపతులు ఆదివారం రాత్రి ఇంటి వెనుక వైపు రేకుల పంచలో పడుకుని నిద్రపోయారు. వారి కుమారుడు నారాయణరెడ్డి ఇంటి ముందు పంచలో పడుకున్నాడు. తెల్లవారి లేచే సరికి వెంకటరెడ్డి, ఆదెమ్మలు అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు. కుమారుడు పోలీసులకు సమాచారం అందించారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు వెంకటరెడ్డి దంపతులు వెనుక వైపు రేకుల పంచలో పడుకున్నారు. అయితే వారి మృతదేహాలు ఇంట్లో ఉన్నాయి. మంచంపై ఆదెమ్మ మృతదేహం ఉండగా నేలపై వెంకటరెడ్డి మృతదేహం కనిపించింది. బయట రేకుల పంచలో పడుకున్న ప్రాంతంలో రక్తం మరకలు కనిపించాయి. రక్తాన్ని తుడిచిన వస్త్రం ఆ ప్రాంతంలోనే పడి ఉంది. ఆదెమ్మ చేతి మణికట్టు వద్ద మారణాయుధంతో కోసినట్లు కనిపిస్తోంది. వెంకటరెడ్డి తలపై కొట్టిన గాయం, మెడపై, చేతి మణికట్టు వద్ద కోసిన గాట్లు కనిపిస్తున్నాయి. కుమారుడు బయట పడుకుని ఉండగానే నివాసంలోకి వెళ్లి ఎవరు హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనుక వైపు ఉన్న బీరువా తలుపు తెరిచి ఉంది. దీన్ని బట్టి డబ్బు కోసం బయటే హత్య చేసి మృతదేహాలు లోపలకు తీసుకొచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వృద్ధులకు హత్యతో ఉపయోగం ఎవరికి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరెడ్డి తలపై గాయాలు ఉండటంతో ఇది హత్యే అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతుడికి ఆదెమ్మ రెండో సంబంధం. వారి కుమారుడే నారాయణరెడ్డి. నారాయణరెడ్డికి వివాహామై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెంకటరెడ్డి దంపతులు తమ స్వగ్రామం మర్లపాలెం వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మృతుల పేరుపై ఎటువంటి పొలం, ఆస్తులు లేవని స్థానికులు చెప్తున్నారు. వృద్ధ దంపతులు అన్యోన్యంగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. డీఎస్పీ కె.ప్రకాశ్‌రావు, సీఐ మహ్మద్ మొయిన్, ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుమారుడు నారాయణరెడ్డి నుంచి పోలీసు అధికారులు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు నుంచి డాగ్ స్క్యాడ్ వచ్చి ఇంటి చుట్టూ కలియతిరిగింది. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. -
అద్దంకిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, అద్దంకి (ప్రకాశం): మహిళను వేధిస్తున్నాడన్న నెపంతో ఓ యువకుడిని కొందరు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసిన సంఘటన గురువారం పట్టణంలో కలకలం రేపింది. అందిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన వడూరి యువకుమార్ భీమవరానికి చెందిన రవిరాజ్‌లు కుటుంబ స్నేహితులు. వీరి మధ్య కొంతకాలం కిందట ఆర్థిక లావాదేవిలు నడిచాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి తణుకు పోలీసుస్టేషన్లో 2017లో రవిరాజు కుటుంబ సభ్యులు యువకుమార్‌పై కేసులు పెట్టారు. ఈ క్రమంలో రవిరాజ్ కుటుంబం రెండేళ్ల కిత్రం అద్దంకి వచ్చి నివాసం ఉంటూ ముండ్లమూరు మండలం అగ్రహారంలో చేపల చెరువులు వేసుకుంటూ జీవనం సాగిస్తోంది. యువకుమార్ తరుచూ రవిరాజ్ ఇంట్లోని మహిళకు ఫోన్ చేసి నగదు ఇవ్వాలంటూ వేధించటం ప్రారంభించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు రవిరాజ్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో యువకుమార్‌కు రవిరాజ్ ఫోన్ చేసి డబ్బులు తీసుకునేందుకు అద్దంకి రావాలని చెప్పాడు. అందులో భాగంగా గురువారం యువకుమార్ అద్దంకి వచ్చాడు. స్థానిక బంగ్లారోడ్ వద్ద వేచి ఉన్న రవిరాజ్‌తో పాటు మరికొందరు యువకుమార్‌ను కొట్టి కారులోఎక్కించుకుని దర్శి తరలించారు. అక్కడ పోలీసుస్టేషన్ నుంచి మళ్లీ రాత్రికి అద్దంకి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎస్ఐ శ్రీనివాసరావు యువకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
గొట్టిపాటి వర్గం దౌర్జన్యం
సాక్షి, అద్దంకి (ప్రకాశం): నియోజకవర్గంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతలు పలు చోట్ల బరితెగించారు. సంతమాగులూరు మండలంతో పాటు, బల్లికురవ మండలంలోని అడవిపాలెం, వేమవరం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఏజంట్లను సైతం బయటకు పంపి రిగ్గింగ్ చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేశారు. కొరిశపాడు మండలం మేదరమెట్లలో టీడీపీ నాయకులు ఓటర్లను భయపెట్టి వారి ఓట్లను లాక్కుని తామే వేసుకోవడానికి ప్రయత్నించారు. అద్దంకి మండలం బొమ్మనంపాడులో ఓట్లను తమకు చూపించి వేయాలని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో వైఎస్సార్ సీపీ నాయకులు పోలింగ్‌ను కొంతసేపు నిలిపేశారు. అద్దంకి పట్టణంలో ప్రకాశం జూనియర్ కళాశాలలో ఒక బూత్ వద్ద ఒక బూత్‌లో టీడీపీ నాయకులు ఓటర్ల వెంట వెళ్లి తామే ఓటు వేశారు. పలు చోట్ల టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులపై చేయి చేసుకున్న ఘటనలున్నాయి. సంతమాగులూరులో దాడులకు దిగిన టీడీపీ నాయకులు తెలుగుతమ్ముళ్లు ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను ఓటర్లను, బూత్ ఏజెంట్లను బెదిరించారు. ఇష్టానుసారంగా బూతు మాటలు మాట్లాడారు. పోలింగ్ బూత్‌లో వద్ద వైఎస్సార్ సీపీ నాయకులను బెదిరించి బలవంతంగా బూత్ నుంచి బయటకు పంపిన ఘటనలున్నాయి. మండల పరిధిలోని అడవిపాలెం, చవిటిపాలెం, తంగేడుమల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు. వారిని లోపలకి రానివ్వకుండా బెదిరించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పేక్షక్షపాత్ర వహించారు. అడవిపాలెంలో టీడీపీ నాయకులు వైస్స్రాŠ సీపీ నాయకులుపై దౌర్జన్యం చేసి బూత్‌ల్లో నుంచి బయటకు తరిమారు.వెబ్ కెమెరాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు. తంగేడుమల్లిలో మొత్తం 1700 ఓట్లు ఉన్నాయి. 900 ఓట్లు ఒక బూత్‌లో, 800 ఓట్లు మరో బూత్‌లో ఉన్నాయి. ఈ రెండు బూత్‌లో టీడీపీ నాయకులు ఓట్లన్ని టీడీపీకే వేసుకోవడానికి ప్రయత్నించావరు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లును బలవంతం చేస్తున్నారనే విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య అక్కడకు వచ్చి అధికారులను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా ఓటు వేసుకునే అర్హత లేదా అని అధికారులను నిలదిశారు. చవిటిపాలెంలోనూ టీడీపీ నాయకులు బలవంతంగా వైఎస్సార్ సీపీ ఏజెంట్లును బయటకు పంపించడానికి బెదిరింపులకు దిగి వారిపై దాడి చేశారు. సమీపంలోని ప్రైవేట్ కారు డ్రైవరు సెల్ చూసుకుంటుడగా ఫోటోలు తీస్తున్నారన్న అనుమానంతో టీడీపీ కార్యకర్తలు అతన్ని చితకబాదారు. మండలంలోని ఏల్చూరు, మక్కెనవారిపాలెం, కొప్పరం, వెల్లలచెరువు, పుట్టవారిపాలెం గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు సృష్టించారు. పోలీసులు వన్‌సైడ్ దాదాపు సంతమాగులూరు మండల పరిధిలోని పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి వారు ఎటువంటి గొడవులు, అలజడులు చేస్తున్నా పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు. ప్రతి గ్రామంలో పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి మౌనంగా ఉన్నారు. బెదిరింపులకు పాల్పడిన మక్కెనవారిపాలెం టీడీపీ నాయకులు మక్కెనవారిపాలెంలోని 43వ వార్డులో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరించి బలవంతంగా సైకిల్ గుర్తుపై ఓటు వేయించారు. ఈ ఘటనపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉండటంతో వారు దాడులకు పాల్పడినట్లు వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ సర్పంచ్‌పై టీడీపీ నాయకులు దాడి మండల పరిధిలోని పుట్టావారిపాలెంలో గురువారం జరిగిన ఎన్నికల్లో పుట్టావారిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అద్దంకి ఆంజనేయులుపై టీడీపీ వర్గీయుడు ఎంపీపీ కుమారుడు కర్రతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులును నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఓటు వేసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో స్వల్ప వివాదం జరిగి అతనిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. టీడీపీ నాయకులపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో టీడీపీ నాయకులు రిగ్గింగ్ పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు విలువలేకుండా పోయిందన్నారు. -
అద్దంకి అభివృద్ధి మీ చేతుల్లో..
సాక్షి, అద్దంకి (ప్రకాశం): ఐదేళ్లు మనలను పాలించే ప్రజాప్రతినిధులను ఈ ఒక్కరోజు మనం పాలించే రోజు. మన పాలకులను మనమే ఎన్నుకునే రోజు. అభివృద్ధికి పాటుపడని వ్యక్తిని మన ఓటు ద్వారా వ్యతిరేకించి రోజు. మనకు నచ్చిన వ్యక్తిని ఓటు ద్వారా అదే ఓటు ద్వారా ప్రజాప్రతినిధిగా ఎన్నుకునే రోజు రానే వచ్చింది. అవినీతి రహిత పాలనకు పట్టం కట్టే సమయం ఆసన్నమైంది. మన ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఓటేద్దాం. ఒక్క ఓటూ బీరు పోకుండా పోల్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఓటు వేసే ముందు ఐదేళ్ల పాటు ప్రజల సంక్షేమం కోసం పోరాడిని వైఎస్సార్ సీపీ ఉద్యమాలను, సామాన్యులపై టీడీపీ నియమించిన జన్మభూమి కమిటీలు పెత్తనాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. వచ్చే ఐదేళ్లలో అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించడానికి నడుం బిగించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గరటయ్య ఓటేసి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలను అనుభవిద్దాం. ఐదేళ్ల తరువాత అభివృద్ధి చెందిన అద్దంకిని చూసుకుందాం. ప్రతిపక్షంలో ఉండి కూడా ఐదేళ్ల పాటు ప్రజల సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాటాలు సాగించింది. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో చూసిన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానమని హామీ ఇచ్చారు. సామాన్యులపై తెలుగు తమ్ముళ్ల అరాచకం ♦ నియోజకవర్గంలో 2014 నుంచి 2019 ఎన్నికల వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేకపోయింది. ♦ జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు పథకాలు అందకుండా చేసింది. ఇసుకను దోచుకుంది. నీరు చెట్టు పేరుతో అవినీతికి పాల్పడింది. ♦ బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఎమ్మెల్యే రవికుమార్ అగ్రహారం భూములను సాగు చేసుకునే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చలేకపోయారు. ♦ పట్టణ పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తానన్న ఎమ్మెల్యే హామీ నెరవేరలేదు. ఖాళీగా ఉన్న చోట పేదలు గుడిసెలు వేసుకుంటే జైలులో పెట్టించిన ఘనత ఎమ్మెల్యే రవికుమార్‌కే దక్కుతుంది. ♦ అధికారం ఉన్నా కరణం, గొట్టిపాటి వర్గ రాజకీయాలతో నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడేలా చేసిన పేరుంది. ♦ ఐదు మండలాల్లో వర్గ రాజకీయాలతో రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయ అధికారులపై తమ పనులు చేయాంటూ ఒత్తిళ్లు తెచ్చి వారిని వేధించిన ఘనత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు చెందుంతుంది. ♦ బల్లికురవ మండలంలో కరణం, గొట్టిపాటి వర్గ రాజకీయాలతో మూడు సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన యూనిట్లు ఇప్పటికీ గ్రౌండింగ్ కాలేదు. ♦ బల్లికురవ మండలం వల్లాపల్లిలో భర్త బతికుండగానే మహిళలకు వితంతు పింఛన్లు తెప్పించిన ఘనత తెలుగు తమ్ముళ్లకే చెందుంతుంది. ♦ సమస్యలతో అల్లాడుతున్న ప్రజలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ♦ భవనాశి రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు. ♦ ఈ ఐదేళ్ల పాలనలో రైతులను ఆదుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే ఏ మాత్రం సహకరించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా సంక్షేమం కోస పోరాటం ♦ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన వ్యర్తిగా గుర్తింపు పొందారు. ♦ పార్టీ తరుపున అద్దంకిలో నియోజకవర్గ ఇన్చార్జిగా గరటయ్య ప్రతిపక్షం ఆగడాలను ఎండగడుతూ ప్రలజకు వెన్ను దన్నుగా నిలిచారు. ♦ ప్రత్యేక హోదా సాధన కోసం ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఐదేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ♦ నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి ఇబ్బందులపై అధికారులను నిలదీయడం, సంబంధిత సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కారం కోసం కృషి చేశారు. ప్రజా సమస్యలను పరిష్కారానికి గరటయ్య నిరంతరం కృషి చేశారు. ♦ ప్రతిపక్షం తలపెట్టిన ప్రతి ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ♦ అధికార పక్షం చేపట్టిన నీరు చెట్టు, ఇసుక అక్రమాల అవినీతీని ప్రజల్లో ఎండగట్టాడు. ♦ అధికార పక్షం ప్రభుత్వ పథకాల్లో పచ్చ చొక్కాలకే ప్రాధాన్యం ఇస్తుందన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లారు. -
టీడీపీ నాయకుల దౌర్జన్యం
సాక్షి, వెల్లలచెరువు (ప్రకాశం): టీడీపీ పార్టీ నాయకులు దౌర్జన్యం, అరాచకానికి అడ్డే లేకుండాపోతుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య మంగళవారం సాయంత్రం మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కొంచెం సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెల్లలచెరువులో సొసైటీ భవనానికి సమీప బజారులో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రచారానికి రావటంతో టీడీపీకి చెందిన చింతా రామారావు వర్గం రోడ్డుమీద అడ్డంగా నిలబడి వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రచారాన్ని ప్రశాంతంగా చేసుకోవడానికి సహకరించాలని టీడీపీ నాయకులను కోరినప్పటికీ వారు ఏ మాత్రం సహకరించకపోగా, గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి ఇరువర్గాలను చెదరకొట్టారు. టీడీపీకి సపోర్టు చేసిన పోలీసులు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి అడ్డుకున్న టీడీపీ నాయకులను చెదరకొట్టినట్లే కొట్టి మళ్లీ పోలీసులు వారిని అక్కడే ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు. కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే ప్రచారం చేయకుండా వెళ్లగొట్టారు. పోలింగ్ రోజు పరిస్థితి ఏంటి? ఎన్నికల ప్రచారంలోనే టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యం చేసిన సంగంతి తెలిసిందే.. గురువారం జరిగే ఎన్నికలు రోజు మాత్రం పోలీంగ్ పరిస్థితి ఏమిటని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి దౌర్జన్యాలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుల కోరుతున్నారు. -
గరటయ్యది ప్రజాసేవ.. గొట్టిపాటిది డబ్బుయావ
సాక్షి, అద్దంకి (ప్రకాశం): నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పోటీలో తలపడతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఓటర్ల తీర్పును కోరబోతున్న నేపథ్యంలో ఇద్దరి వ్యక్తిగతంతో పాటు రాజకీయ జీవితంపై విశ్లేషకులు, ప్రజలు తెలిపిన అభిప్రాయాలు. గరటయ్య అందరి బంధువయ్యా.. ♦ వైద్యునిగా జీవితాన్ని ప్రారంభించారు. ♦ ఎంతో మందికి ఉచిత సేవలందించి ప్రాణదాతగా నిలిచారు. ♦ నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం. ♦ మృధు స్వభావి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం. ♦ ముక్కు సూటి మనిషి, నిగర్వి, రాజకీయ దురంధరుడు. ♦ పల్లెలో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పిలిచేంత చనువు ఉంది. ♦ వర్గ రాజకీయాలను ఏ మాత్రం ప్రోత్సహించడనే మంచి పేరుంది. ♦ ప్రత్యర్థి వర్గం వారైనా సాయం కోరితే ఆదుకుంటాడు. ♦ పేదల, రైతుల పక్షపాతి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశారు. ♦ ఆయన ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించారు. ♦ గరటయ్య కాలనీ ఏర్పాటు చేసి పేదల మనస్సులో చిరస్థాయిగా నిలిచారు. ♦ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపించే తత్వం గరటయ్య సొంతం ♦ అవినీతి రహితుడిగా నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ♦ ముక్కు సూటిగా శత్రువుపై పోరాడే మనస్తత్వం ఉన్న నాయకునిగా అందరూ కొనియాడుతుంటారు. గొట్టిపాటి అవినీతిలో ఘనాపాఠి.. ♦ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్షతో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ♦ మొదటి నుంచి వ్యాపారమే పరమావధిగా భావించే వ్యక్తి. ♦ అభివృద్ధి పనులు చేశారని పేరున్నప్పటికీ తనసొంత ప్రయోజనం లేకుండా ఎటువంటి అభివృద్ధి పనుల చేయరు. ♦ పైకి మృధు స్వభావిగా కనిపించినా ప్రత్యర్థులపై దయాదాక్షిణ్యాలు చూపించరు. ♦ ధన బలంతో ఏదైనా సాధించవచ్చనే స్వభావం కలిగిన వ్యక్తి ♦ గెలుపు కోసం అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ♦ పేదల భూములను గ్రానైట్ కోసం లాక్కున్నాడనే ఆరోపణలు. ♦ తన వ్యాపారం కోసమే పార్టీ మారాడనే విమర్శలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. ♦ కరణం బలరాంతో దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ గొడవలు. ♦ ప్రజలు, రైతు సమస్యలపై అవగాహన తక్కువ. ♦ సాగు నీటి విషయంలో రైతులకు ఏ మాత్రం మేలు జరగలేదు. ♦ వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచి, టీడీపీలో ఉన్న మరో సీనియర్ నాయకునితో ఉన్న వర్గ విభేధాలు ♦ ఇరు వర్గీయులు మధ్య చోటు చేసుకున్న గొడవల్లో కార్యకర్తల ప్రాణాలు బలితీసుకున్నారు. -
నేను ఎమ్మెల్యేనైతే..!
సాక్షి, అద్దంకి (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల్లో 2019 బరిలో అద్దంకి నియోజకవర్గం నుంచి ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, బీజేపీల అభ్యర్థులు పోటీపడుతున్నారు. అభ్యర్థులు ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. 2019 రంగస్థలం రంజుగామారింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రచారం పర్వం పతాకస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు, వాటి అధినేతలు పోటీపడి ఒకరికి మించిమరొకరు హామీలిచ్చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం తామేమీ తీసిపోమన్నట్లు గెలిచిన తరువాత దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రజా రంజక పాలన అందిస్తామని చెప్తున్నారు. ఎవరికివారే తన గెలుపు ఖాయం అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హామీల ప్రాధాన్యతపై కొందరు అభ్యర్థులు తమ మనోగతాలు సాక్షితో పంచుకున్నారు. దీర్ఘకాలిక సమస్యలపై ప్రధాన దృష్టి నేను గతంలో నాలుగు సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా పనిచేశా. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగు, సాగు నీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. టీడీపీ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నేను మరలా ఎమ్మెల్యే అయితే దీర్ఘ కాలంగా అపరిషృతంగా ఉన్న పేద ప్రజలకు కావాల్సిన ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తా. తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని అగ్రహారం భూముల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పిస్తా. పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం పాలపొడి ప్యాక్టరీని పునరుద్ధరించి పశుపోషకులను ఆదుకుంటా. డ్వాక్రా మహిళలను అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని తయారు చేసి, ప్రతి మహిళకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించి, రెండు గేదెలను ఇచ్చి, నియోజకవర్గంలో లక్ష లీటర్ల పాల సేకరణ చేయడం ధ్యేయంగా పెట్టుకున్నా. కృష్ణా జలాలు సక్రమంగా రానందున అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కృషితో, గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించే విధంగా చూసి సాగరు కాలువ ద్వారా నియోజకవర్గంలో సాగు నీటి సమస్య లేకుండా చేస్తా. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులైన యర్రం చిన్పపోలిరెడ్డి, భవనాశి రిజర్వాయరు పూర్తి చేస్తా. సంతమాగులూరులో 1100 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు, జే పంగులూరు మండలంలోని కొండమూరు, కోటపాడు అలవలపాడు, కొండమంజులూరు చెరువులను మినీ రిజర్వాయరుగా చేసి, వాటిని గోదావరి జలాలతో నింపి తాగు, సాగు నీటిని పూర్తి చేస్తా. గుండ్లకమ్మ నదిపైన ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్‌ను ఏర్పాటు చేసి, ఎత్తిపోతల పథకాలకు నీరందించే విధంగా కృషిచేస్తా. పేదరికమే అర్హతగా పెట్టుకుని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తా. – డాక్డరు బాచిన చెంచుగరటయ్య, వైఎస్సార్ సీపీ అభ్యర్థి మోదీ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గంలో గుండ్లకమ్మ నది దగ్గరలో ఉన్నా.. తాగు, సాగు నీటి సమస్య ఉంది. దాన్ని పరిష్కరిస్తా. సాగరునీరు రావడం లేదు. రైతులకు నదిపై ఎత్తిపోల పథకం పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తా. గ్రామాలను కలిపే విధంగా రహదారుల అభివృద్ధి చేస్తా. ప్రల కోసం పార్టీ సిద్దాతాల ప్రకారం ఉచిత ఇల్లు, విద్యుత్ గ్యాస్ ఇస్తాం. మోదీ సహకారంతో ఇవన్నీ చేస్తాం. – ఉండవల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థి తాగు, సాగు నీటి సమస్య పరిష్కరిస్తా తాగు, సాగు నీటి సమస్య బాగా ఉంది. దానిని పరిష్కరిస్తా. రైతులను సంతోష పెట్టడమే ముఖ్య ఉద్దేశ్యం. రహదారులు, మౌలిక వసతుల కల్పన. భవనాశిని మినీ రిజర్వాయరుగా చేసి, పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తా. రైల్యే లైన్, బైపాస్ రహదారి ఏర్పాటుకు కృషిచేస్తా. అర్డీఓ కార్యాలయం, చారిత్రక మ్యూజియం ఏర్పాటు చేస్తా. – ఎన్. సీతారామాంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థి -
అద్దంకి వైఎస్ జగన్ ప్రచార సభలో జనకెరటం
-
ఓటు కోసం 70 కి.మీ ప్రయాణం..!
సాక్షి, అద్దంకి (ప్రకాశం): గుండ్లకమ్మ పునరావాస కాలనీల ప్రజల కష్టాలను తీర్చే విషయంలో ప్రభుత్వానికి తీరిక దొరకలేదు. పునరావాస కాలనీల్లో నివసించే ప్రజలు అసౌకర్యాల నడుమ అల్లాడుతున్నారు. అది అలా ఉంచితే.. ముంపు గ్రామాల ప్రజలు ఓటు వేసి ఇంటికి చేరుకోవడానికి 70 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అద్దంకి మండలంలోని ఉత్తర ధేనువకొండ గ్రామాన్ని గుండ్లకమ్మ ముంపు గ్రామంగా ప్రకటించారు. పునరావాసం కోసం అద్దంకి పట్టణ సమీపంలోని కొంగపాడు వద్ద బలరామకృష్ణపురం, వేలమూరిపాడు గ్రామ సమీపంలో వైఎస్సార్ పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ కాలనీల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడంతో చాలా మంది పాత ధేనువకొండలో నివాసం ఉంటున్నారు. రెండు కాలనీల్లో 120 కుటుంబాలకు చెందిన 250 మంది ఓటర్లు పునరావాస కాలనీల్లో అరకొర వసతుల మధ్య జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ లేదు.. బూత్ లేదు పునరావాస కాలనీల్లో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయలేదు. ప్రత్యేక పంచాయతీగా గుర్తించకపోవడంతో వారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు రానూపోనూ 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కాలనీలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
మళ్ళీ అదే రిపీట్ అవుద్ది..!
సాక్షి, అద్దంకి (ప్రకాశం): అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం.. రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా పేరున్న ప్రాంతం. రసవత్తర రాజకీయాలకు ఇక్కడ పెట్టింది పేరు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించింది. అనంతరం జరిగిన పరిణా మాలు కూడా వైఎస్సార్ సీపీకే అనుకూలంగా ఉండటంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీనే విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా వైఎస్సార్ సీపీకి కంచుకోటగా అద్దంకి మారడం తథ్యమని అంటున్నారు. 1955 నుంచి 13 సార్లు ఎన్నికలు... అద్దంకి నియోజకవర్గం 1955లో జనరల్ కేటగిరి నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ మూడుసార్లు గెలుపొందింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. ఇక్కడ మొదటిసారి 2014లో పోటీచేసిన వైఎస్సార్ సీపీ.. టీడీపీపై గెలుపొంది పార్టీ సత్తా చాటారు. గతంలో 95 శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2014 ఎన్నికల్లో పూర్తిగా వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకుగా మారింది. గతంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచినా.. రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ కనుమరుగైన నేపథ్యంలో ప్రస్తుతం ఆ స్థానాన్ని వైఎస్సార్ సీపీ దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ–టీడీపీ మధ్యే ప్రధాన పోటీ... వచ్చే నెల 11న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ సీపీ–టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే రవికుమార్ అనంతరం టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ తరఫున అతనే పోటీ చేస్తుండగా, వైఎస్సార్ సీపీ తరఫున సీనియర్ నాయకుడు బీసీహెచ్ గరటయ్య బరిలో ఉన్నారు. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపు సునాయాసమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు గతంలో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన గరటయ్య.. రెండు సార్లు పార్టీ నుంచి టికెట్ దక్కకపోయినప్పటికీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల హవా కొనసాగుతున్న సమయంలోనూ ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ప్రభావంతో పాటు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ హవాతో గరటయ్య విజయం ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. నియోజకవర్గ సంఖ్య 105 పోలింగ్ కేంద్రాలు 29,532 సమస్యాత్మక ప్రాంతాలు 39 మొత్తం ఓటర్లు 2,27,795 పురుషులు 1,12,325 స్త్రీలు 1,15,457 థర్డ్ జండర్ 13 నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ఫలితాల వివరాలు... ఎన్నికల సంవత్సరం గెలిచిన అభ్యర్థి, పార్టీ ప్రత్యర్థి, పార్టీ మెజార్టీ 1955 నాగినేని వెంకయ్య (కేఎల్పీ) పాటిబండ్ల రంగనాయకులు (సీపీఐ) 6,828 1962 పాటిబండ్ల రంగనాయకులు (సీపీఐ) పచ్చవ అప్పారావు (కాంగ్రెస్) 3772 1967 దాసరి ప్రకాశం (కాంగ్రెస్) నాగినేని వెంకయ్య (ఎస్‌డబ్ల్యూఏ) 2,068 1972 దాసరి ప్రకాశం (కాంగ్రెస్) నర్రా సుబ్బారావు (ఇండిపెండెంట్) 9,082 1978 కరణం బలరామకృష్ణమూర్తి (కాంగ్రెస్) బాచిన చెంచుగరటయ్య (జేఎన్పీ) 5,150 1983 బాచిన చెంచుగరటయ్య (ఇండిపెండెంట్) కరణం బలరాం (ఇండిపెండెంట్) 3,394 1985 బాచిన చెంచుగరటయ్య (టీడీపీ) జాగర్లమూడి హనుమయ్య (కాంగ్రెస్) 5,560 1989 జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) బాచిన చెంచుగరటయ్య (టీడీపీ) 7,082 1994 బాచిన చెంచుగరటయ్య (ఇండిపెండెంట్) జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) 7049 1999 బాచిన చెంచుగరటయ్య (టీడీపీ) జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) 249 2004 కరణం బలరాం (టీడీపీ) జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) 2,790 2009 గొట్టిపాటి రవికుమార్ (కాంగ్రెస్) కరణం బలరాం (టీడీపీ) 15,764 2014 గొట్టిపాటి రవికుమార్ (వైఎస్సార్ సీపీ) కరణం వెంకటేశ్ (టీడీపీ) 4,235 -
కన్నీళ్లనే మిగిల్చిన బాబు ప్రభుత్వం
సాక్షి, అద్దంకి (ప్రకాశం): టీడీపీ ప్రభుత్వం వృద్ధులకు పింఛన్ పెంచాం. అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పే మాటల్లో నిజంలేకుండా పోయింది. వృద్ధులకు ఆసరా కల్పించడం కోసం ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛన్ పథకం అర్హులకు అందనంత ఎత్తుకుపోయింది. అర్హత ఉన్నా జన్మభూమి కమిటీలు పేరు ప్రతిపాదిస్తేనే పించన్ మంజూరు కాని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 65 ఏళ్లు నిండిన వారు 5వేల మందికి పైగా ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకున్నా ఏదో ఒక సాకుతో వారికి పింఛన్ రాలేదు. విధి వంచించిన మహిళపై కరుణ లేదు.. జె.పంగులూరు: మండలంలోని ముప్పవరం గ్రామానికి చెందిన తిరుమల శెట్టి నాగేశ్వరమ్మ భర్త సింగయ్య వీరికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురుకి తన తహత కొద్ది కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసింది. కొన్ని సంవత్సరాలు కూతుళ్ల కాపురం సజావుగానే సాగింది. కుటుంబాలు చూసి వారి మనవళ్ళు చూసి తల్లిదండ్రులు ఎంతో సంబర పడ్డారు. కాని విధి అడిన వింత నాటకంలో వారి అనందరం ఎంతో కాలం నిలవలేదు. పెద్దకుమార్తె పి రమాదేవి చదలవాడ హనుమంతురావుకి ఇచ్చి వివాహం చేసింది. కాని హనుమంతురావు ప్రమాదంలో చనిపోయాడు. వీరి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వీరి పోషనం ప్రస్తుతం అమ్మ అయిన నాగేశ్వరమ్మ చూసుకోవాల్సి వస్తోంది. ఇక మూడో అమ్మాయి ఎస్.రమ్యకృష్ణ ను చిలకలూరిపెట్ట వద్దగల మిట్టపాలెంకు చెందిన నవీన్ కు ఇచ్చి వివాహం చేసింది. వీరి దంపతులకు ఒక అబ్బాయి. అబ్బాయి పుట్టిన సంవత్సరానికి మూడవ అల్లుడు నవీన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. భర్త మరణం తట్టుకో లేక రమ్యకృష్ణ మతి స్థ్ధిమితం కొప్పోయింది. రమ్యకృష్ణ తల్లి మతిస్థిమితం లేని రమ్యకృష్ణను, ముందు కుమార్తె అయిన ఇద్దరు మనవరాళ్లను, మనవడి పోషణ భారం నాగేశ్వరమ్మ పై పడింది. కూలి నాలి చేసుకొని ఇద్దరు మనవరాళ్ల్లను, కుమార్తెలు చూసుకుంలూ బాధపడుతూ నాగేశ్వరమ్మ కాలం వెళ్ల్లబుచ్చుతోంది. భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతున్నా రమ్యకృష్ణకు వితంతు పింఛన్ వచ్చిన దాఖలాలు లేవు. రేషన్ కార్డు కోసం, పింఛన్ కోసం ఎక్కని ఆఫీసు మెట్లు లేవు, మొక్కని నాయకుడు లేడు. ఎవ్వరూ మమ్మలను పటించు కోవటం లేదని రమ్మకృష్ణ తల్లి నాగేశ్వరమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వీరంతా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆర్హుడైన ప్రతి పేదవానికి కనీస అవసరాలు తీరతాయని నమ్ముతున్నారు. అర్హులకు అన్యాయం జరిగింది.. నా వయసు 70 సంవత్సరాలు, ఐదేళ్లుగా ప్రతి ఏటా పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నా. రాజకీయాలు చేసి నా పేరు జాబితాలో లేకుండా చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య పింఛన్ అర్హులకు అన్యాయం జరిగింది. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే నాకు పింఛన్ వస్తుందని ఆశపడుతున్నా. ఆయన మాటలను విశ్వసిస్తున్నా. 60 ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పడం వృద్ధులకు అసరాగా ఉంటుంది. - శివరాత్రి అంజయ్య, ముక్వేశరం, బల్లికురవ మండలం రాజశేఖరరెడ్డి హయాంలో చేతికిచ్చారు.. నాకు వేలుముద్ర పడటం లేదని పింఛన్ ఇవ్వడం లేదు. నా వయసు 85 సంవత్సరాలు రాజశేఖరరెడ్డి హయాంలో చక్కగా చేతికిచ్చారు. ఇప్పడేమో రకరకాల సాకులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నవ రత్నాల పథకంలో ఒకటైన పింఛన్ పథకం ప్రవేశపెడతానన్నాడు. ఆయన పింఛన్ రూ.3 వేలు చేస్తానని చెప్పాడు. ఆ మాటలను విశ్వసిస్తున్నాం. ఆ పార్టీ అధికారంలోకి రావాలని దేవుడ్ని వేడుకుంటున్నాం. –కూరపాటి కోటం రాజు, దేనువుకొండ, అద్దంకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోసం ఎదురు చూపులు.. అధికార పార్టీ అర్హులంటూ అర్హత ఉన్న వారికి పింఛన్ ఇవ్వలేదని వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. జగన్మోహన్రెడ్డి తాము అధికారంలోకి వస్తే నవరత్నా పథకాల్లో ఒకటిగా ప్రకటించిన రూ.3 వేల పింఛన్ చేస్తామని ప్రకటించాడని, ఆయన మాటలను విశ్వసిస్తున్నామంటున్నారు. -
జలయజ్ఞానికి టీడీపీ విఘ్నాలు..
ఇది నీటి కథ.. కన్నీటి కథ. ప్రజల కన్నీళ్లు తుడవడానికి నడుం బిగించిన మహా నాయకుడు కన్ను మూశాక, కసాయి పాలకుల ఏలుబడిలో అటకెక్కిన ఆనకట్టలు కథ. 5 ఏళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలు పడుతున్న వ్యథ. పొట్ట చేతబట్టుకుని ప్రజలు వలసపోకూడదని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు రైతు బాంధవుడు రాజశేఖరరెడ్డి. ఆయన మరణం రైతులకు తీరని శాపమే అయ్యింది. తర్వాత వచ్చిన పాలకులే ‘‘పచ్చ’’పాతం చూపిస్తుంటే కాలువల్లో పారాల్సిన నీళ్లు రైతుల కళ్లల్లో పారుతున్నాయి. జలదాత రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞాన్ని టీడీపీ నాయకులు విఘ్నాలు కలిగిస్తు ప్రజలకు సాగు, తాగు నీరు అందకుండా అడ్డుపడుతున్నారు. నీటి కష్టాలు తీరాలంటే ఆ పెద్దాయన బిడ్డ పాలన రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగనన్నతో రాజన్న పాలన చూడాలని ఆశ పడుతున్నారు. సాక్షి, అద్దంకి (ప్రకాశం): వర్షాధార భూములను ఆరుతడి, మాగాణి భూములుగా మార్చడం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా నియోజకవర్గంలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో భవనాశి మినీ రిజర్వాయర్, యర్రం చిన్నపోలిరెడ్డి పథకాన్ని చేపట్టారు. మిగిలిన మండలాల్లో ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో 25వేల ఎకరాల మెట్ట భూములను మాగాణి, ఆరుతడి పంట పండే భూములుగా చేయాలనేదే రాజశేఖర్‌రెడ్డి సంకల్పం. ఆయన అకాలం మరణం తరువాత గద్దెనెక్కిన అధికార టీడీపీ ఆ ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎక్కడ రాజశేఖర్‌రెడ్డికి పేరు వస్తుందని భయంతో ప్రాజెక్టులను వదిలేసింది. పాదయాత్ర సమయంలో అద్దంకి వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని తమ ఓటుతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు సాగని భవనాశి.. శింగరకొండ క్షేత్ర సమీపంలోని భవనాశి చెరువును విస్తరింపజేసి, బల్లికురవ మండలంలోని వెలమావారిపాలెం వద్ద గుండ్లకమ్మ నదికి అడ్డంగా చెక్ డ్యాం ఏర్పాటుతో, నీటిని కాలువ ద్వారా చెరువులకు నీరు మళ్లించి మినీ రిజర్వాయర్ చేయాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం ఉన్న 1797 ఎకరాల సాగు భూమితో పాటు, మరో 5 వేల ఎకరాల భూములను మాగాణి భూమూలుగా మారి రైతులు ఆర్థికంగా బలపడతారని సంకల్పించారు. రూ.27 కోట్ల నిధుల కేటాయింపుతో 2009లో మినీ రిజర్వాయరు పనులకు శంకుస్థాపన చేశారు. 2013లో పనులు ప్రారంభయమ్యాయి. ఆయన హఠన్మరణం తరువాత పరిణామాలు, 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో, ప్రాజెక్టుల పనులు పూర్తికాలేదు.ఏడాదికేడాది పనులు పూర్తి కాకపోవడంతో, ఇదే చెరువును సోర్స్‌గా చేసుకుని నిర్మించిన తారకరామ ఎత్తిపోతల పథకం మూలనపడింది. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రాజక్టులు పూర్తి చేస్తారని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఎత్తిపోతల పథకాలు వదిలేశారు.. బల్లికురవ: మండల పరిధిలోని నక్కబొక్కలపాడు గ్రామం పేరుకు సాగరు ఆయకట్టులో ఉన్న చివర భూములు కావడంతో ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదు. 2008లో డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కృషితో నక్కబొక్కలపాడు వాగు నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు రూ.7 కోట్లు నిధులు మంజూరు చేశారు. అప్పట్లోనే 90శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. తదనంతరం వచ్చిన టీడీపీ 10 శాతం పూర్తిచేకుండా ఐదేళ్లు పాలన పూర్తి చేసింది. ఈర్ల చెరువును 2009లో రిజర్వాయరుగా మార్చేందుకు రూ.50లక్షలు మంజూరు చేశారు. పనులు మాత్రం ముందుకు సాగలేదు. చినపోలిరెడ్డి పథకంలో నిర్లక్ష్యం.. మేదరమెట్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిలోకి రాగానే కొరిశపాడు మండలంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని రూ.177 కోట్ల వ్యయంతో 2004వ సంవత్సరంలో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.ఈ రిజర్వాయర్ 2008వ సంవత్సరాలనికి పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ పథకం పూర్తి చేసుకుంటే మండలంలోని పలు గ్రామాలకు సుమారు 20 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందిచే అవకాశం ఉంది. ఆయన అకాల మరణంతో పనులు నిలిపేశారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన స్థానిక శాసనసభ్యుడు అధికార పార్టీలోకి వెళ్లడంతో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ముంపుకు గురవుతున్న తూర్పుపాలెం గ్రామానికి గానీముంపుకు గురైన వ్యవసాయ భూములకు గానీ ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు.ఈ గ్రామంలో కేవలం రెడ్డి సామాజిక వర్గం వారు అధికంగా ఉండటంతో ఇక్కడ ఎలాంటి పరిహారం అందించలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఒంగోలు మాజీ ఎంపీ వైవీసుబ్బారెడ్డి తండ్రి పేరుతో పథకం నిర్మాణం ఉండటం వల్లనే అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. రావమ్మకుంట పూర్తయితే పచ్చని పొలాలు జే పంగులూరు: మండల పరిధిలోని 21 గ్రామాల్లో భూమి వర్షాధారంతో పండే మెట్ట భూమి. అలవలపాడులోని రావమ్మకుంటకు, కొండమూరు చెరువుకు పమిడిపాడు మేజరు నుంచి నీరు వచ్చేది. ఐదు సంవత్సరాలుగా మేజరుకు నీరు సక్రమంగా అందకపోవడంతో, చెరువులు వట్టిబోయాయి. చెరువులను రిజర్వాయర్లుగా మారిస్తే తిరిగి పూర్వ వైభవంతో మాగాణి పంట పండించుకుంటామని ప్రజా ప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంగులూరు మండలం మాగాణి, మెట్ట పంటలతో భూములు పచ్చాగా కళకళలాడాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. భవనాశి పూర్తయితే భూములు సస్యశ్యామలం భవనాశి మినీ రిజర్వాయరు పూర్తయితే వేలాది ఎకరాల భూములకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందుతుంది. ప్రాజెక్ట్ పూర్తయితే రాజశేఖరరెడ్డికి పేరొస్తుందని టీడీపీ నాయకులే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలు ఉపయోగపడే పథకాలపై ఇలా నిర్లక్ష్యం వహించడం టీడీపీ తగదు. ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిందే. - యర్రా అంజయ్య, గోవాడ జగనన్నను సీఎం చేస్తాం, జలాన్ని తెచ్చుకుంటాం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుని జగనన్నను సీఎం చేసుకుంటాం. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసుకుని సాగుకు, తాగుకు నీటిని తెప్పించుకుంటాం. జలదాత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాలు పూర్తి కావాలంటే వైఎస్సార్ సీపీ గెలవాల్సిందే. - చల్లగుండ్ల శ్రీనివాసరావు, నక్కబొక్కలపాడు పథకాన్ని నిర్వీర్యం చేశారు మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్లైనా పూర్తి చేయలేదు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకం కాబట్టి పథకం పూర్తి చేస్తే ఆయనకు పేరు వస్తుందని పట్టించుకోలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలకు ఏలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఇంత వరకు ముంపు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించలేదు. - లేళ్ల సుబ్బారెడ్డి, తూర్పుపాలెం, మేదరమెట్ల రావమ్మ కుంట పూర్తయితే వెయ్యి ఎకరాలకు నీరు పంగులూరు పరిధిలో మెట్ట భూములు ఎక్కువ, రావమ్మ కుంట చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే వెయ్యి ఎకరాలు సాగు భూమిగా మారుతుంది. తాగునీటికి కూడా ఇబ్బందులు తొలుగుతాయి. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్‌స్రాŠ సీపీ అధికారంలోకి వస్తే మా సమస్య తీరుతుందని నమ్ముతున్నాం. - శేఖర్‌బాబు, పంగులూరు -
అనుచర వర్గం... అవినీతి మార్గం
సాక్షి, అద్దంకి(ప్రకాశం): వాళ్ల అవినీతి ఆకాశమంత, వాళ్ల కబ్జాలు కడలంత, వాళ్ల దోపిడి ధరిత్రంత, వాళ్ల రాక్షసత్వం రావణుడే అసూయపడేంత. కొండలు కరిగించారు, ఇసుక తరలించారు గిరిజనుల భూముల్ని బదలాయించుకున్నారు. లోకమంతా పచ్చగా ఉండాలి అనేది ఆరోక్తి, పచ్చనేతలే పచ్చగా ఉండేలి అనేది అధికార పార్టీ రీతి ‘‘నారా’’జ్యం అంటున్న తెలుగు తమ్ములు అభివృద్ధి పేరుతో దోచుకున్న సొమ్ము కోట్లలోనే ఉంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లాకు చెందిన మంత్రి అండదండలు ఉండటంతో వారి అనుచర వర్గం చేసిన అవినీతి పతాకస్థాయికి చేరుకుంది. అధికార పార్టీ అండదండలతో అకమ్ర సంపాదనే ధ్యేయంగా తెలుగుతమ్ముళ్లు ఈ ఐదేళ్లలో దోచుకున్న సొమ్ముతో పాటు ప్రశ్నించిన వారిని బెదిరించిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. మండలంలో చక్రాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక క్వారీలో తవ్వాల్సిన దాని కన్నా ఎక్కువగా తవ్వి కోట్లాది రూపాయలు సంపాదించాడని ఎమ్మెల్యేతో పాటు ఆయన ఆనుచర వర్గంపై ఆరోపణలున్నాయి. ఈ అవినీతిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వర్గం నాయకులు, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమంగా ఇసుక తరలించే క్వారీలను గుర్తించారు. కానీ అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో తరువాత అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక మండల పరిధిలోని మోదేపల్లి, పేరాయిపాలెం గ్రామ సమీపంలోని ద్వార్నపు వాగు, చిలకలేరుల్లో సైతం ఇదే తరహా ఇసుక దోపిడీ చోటు చేసుకుంది. ధేనువకొండ సమీపంలోని కొండను సైతం అధికార పార్టీకి వారు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. బల్లికురవ మండలంలో.. బల్లికురవ: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువలేదు అన్న చందంగా అధికార అహంతో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఆర్అండ్బీ రహదారులను సైతం ఆధీనంలోకి తీసుకుని క్వారీయింగ్ చేస్తున్నారు. క్వారీల కోసం తిరిగే లారీలతో తారు రోడ్డు సైతం మట్టిరోడ్డుగా తయారైంది. గ్రానైట్ వృథా రాళ్లను రోడ్డు మార్జిన్లో పడేయటంలో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. బ్లాస్టింగ్ మోతలతో సమీప గృహాలు పగుళ్లిచ్చి ధ్వంసం అవుతున్నాయని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తమ క్వారీలకు మీ గృహాలే అడ్డంగా ఉన్నాయని వాటిని ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. 60 కుటుంబాలను ఊరికి దూరంగా నాసిరకం గృహాలు నిర్మించి ఇచ్చారు. ఆ ఇళ్లలలో తాముండబోమని చెప్పడంతో, ఎమ్మెల్యేకు చెందిన మనుషులు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని మళ్లీ బెదింరిపుకు దిగారు. అదేవిధంగా ఈర్లకొండ చూట్టూ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు బినామీల పేరులో క్వారీలున్నాయి. మంత్రి శిద్దా రాఘవరావుకు ఒక క్వారీ ఉంది. ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వారిద్దరూ క్వారీలు నిర్వహిస్తున్నారు. నలభై ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న మాపై జిల్లా మంత్రి అనుచరులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు. నీరు చెట్టు అంతా అవినీతిమయం.. జె.పంగులూరు: తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలో వందల కోట్లు అవినీతి చోటు చేసుకుంది. నీరు చెట్టుకింద చేసిన పనే చేస్తూ బిల్లు చేసుకుంటున్నారు. మండలంలో చిన్నమల్లవరం గ్రామానికి ఆనుకోని ఉన్న వాగుపై ఒక్క సంవత్సరం మూడుసార్లు మరమ్మతులు చేశారు.ఈ పనుల్లో గ్రామానికి చెందిన శ్మశానం కూడా 60 శాతం వాగులో కలుపుకున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులు ఇష్టానుసారంగ ప్రభుత్వ సొమ్మును దండుకున్నారు. ఇచ్చిందే తగుదు అన్నట్లు నీరు చెట్టు పనుల చేయకుండా కూడా బిల్లుల పొందిన దాఖాలాలు అనేకం. ఈ అవినీతి మండలంలోని ప్రతి గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిదులు కుమ్మకై ప్రభుత్వ సోమ్మును దర్జాగా దోచుకున్నారు. టీడీపీ పాలనలో పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, టీడీపీ కార్యకర్త మాత్రం పెద్దవాడయ్యాడు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది ఒక్క వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మేదరమెట్ల: గడచిన ఐదేళ్ల కాలంలో మండలంలోని పలు గ్రామాల్లో నీరు చెట్టు పేరుతో కోట్లాది రూపాయలను టీడీపీకి చెందిన వారు అక్రమంగా దండుకోవడంతో పాటు పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్రయోజనం పొందుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక శాసనసభ్యుడి అండదండలుండటంతోనే అక్రమాకు పాల్పడేవారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. నీరు చెట్టు పేరుతో మండలంలో చెరువుల్లో అధికార పార్టీకి చెందిన వారు, మట్టిని అమ్ముకుని కోట్లు కొల్లగొట్టారు. చెక్‌డ్యాంలు, సీసీ రహదారుల నిర్మాణాల్లో కమీషన్లు దండుకున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన చెక్డ్యాలకు సంబంధించి చేసిన పనుల్లో రూ.30 లక్షల వరకు అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన వారు, జిల్లా కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా, ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారపార్టీ అండదండలున్నాయనే విమర్శలకు బలాన్నిస్తోంది. అధికార పార్టీకి చెందిన వారు ఆక్రమించుకొని ఊర చెరువులో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటూ గ్రామానికి చెందిన కొందరు యువకులు కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. పీ. గుడిపాడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని సాగు చేస్తుండగా వారి భూములను వదిలిపెట్టి, సామాన్యులు సాగు చేసుకుంటున్న దొండ పందిర్లను ముందస్తు సమాచారం లేకుండా అధికారులు తొలగించారు. దీంతో ఆ రైతు భార్య మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైంది. ఇంలాంటి అక్రమాలకు ఆక్రమణలకు పాల్పడుతున్న తముళ్లకు కొమ్ముకాస్తుంది ఎమ్మెల్యేనే అనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా రైతుల పొలంలో బోర్లు వేసేందుకు ప్రభుత్వం జలసిరి పథకాన్ని రూపొందించిన ఘటన తెలిసిందే. ఐతే జలసిరి బోర్లు వేసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు రైతుల నుంచి కొంత సొమ్మును తీసుకున్నారని, అలాగే బ్యాంకుల ద్వారా అందజేసే రుణాలకు సంబందించి సిఫార్సులు చేయాలంటే కూడా అధికార పార్టీ నేతలకు తమ వాటా తముకు అందిచాలని సొంతపార్టీకి చెందిన వారే ఆరోపించిన ఘటనలు చాలనే ఉన్నాయి. ఈ ఐదేళ్లలో టీడీపీ నాయకులు అవినీతికి అంతే లేకుండా పోయింది. గిరిజన భూములు కొనుగోలు.. బల్లికురవకు చెందిన గిరిజనులకు ప్రభుత్వం సర్వే నంబరు 295, 296, 297లో 11 ఎకరాలను 11 మందికి భూమి కొనుగోలు పథకం ద్వారా అందజేసింది. ఆ భూములను అమ్మె హక్కు గిరిజనులకు లేదు. 2017 డిసెంబరులో అప్పటి తహశీల్దారు ఎస్వీ సుధాకర్ సహకారంతో ఈ భూములను బినామీ పేర్లతో ఎమ్మెల్యే కొనుగోలు చేశాడనే ఆరోపణ.లున్నాయి. ఈ భూమిలో ప్రస్తుతం గ్రానైట్ వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరు గారింది. గిరిజనులకు ఉపాధి కొరవడింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో.. యానాది సంఘం కాలనీలో 40 సంవత్సరాలుగా నివశిస్తున్నాం. క్వారీల పుణ్యమా అంటూ దుమ్ము దూళి బ్లాస్టింగ్ మోతలతో ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయండిని చాలా మంది అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరించారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టిచుకోలేదు. – ఆలకుంట అంకమ్మ రాజు, బల్లికురవ అకమ్రాలకు హద్దే లేదు పమిడిపాడు గ్రామంలో వాటర్‌షెడ్ పథకం, నీరు చెట్టు పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారే కానీ అక్రమాలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మండలంలో అధికార పార్టీ నేతలకే జలసిరి బోర్లు, రుణాలు మంజూరు చేశారు. అర్హులైన వారికి పలు ప్రభుత్వ పథకాలను మంజూరు చేయడంలో మొండిచేయి చూపించారు. – రావినూతల సుబ్బయ్య, పమిడిపాడు -
అంజన్న ఆలయాన్ని ఢీకొట్టిన లారీ..!
సాక్షి, ప్రకాశం : ఒంగోలు-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న ఓ లారీ అద్దంకి మండలం వెంకటాపురం గ్రామం వద్ద రోడ్డు పక్కన గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని బిహార్‌కు చెందినదిగా గుర్తించారు. మృతదేహాలు లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు సాయంతో బయటకు తీశారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అద్దంకి సీఐ హైమారావు తెలిపారు. -
అంజన్న ఆలయాన్ని ఢీకొట్టిన లారీ..!
-
తాగునీటి కోసం ఆందోళన
సాక్షి,మేదరమెట్ల( ప్రకాశం) : వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం ప్రజలు రోడెక్కాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ఉదాహరణ కొరిశపాడు మండలంలోని అనమనమూరు ముంపు గ్రామంలోని కొంతమందికి బొడ్డువానిపాలెం కొండసమీపంలో పునరావాసం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉంటున్నారు. గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న పైపులైను పది రోజుల క్రితం పగిలిపోవడంతో ఆ కాలనీ ప్రజలు, బొడ్డువానిపాలెం ఎస్సీకాలనీ వారు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేదరమెట్ల నుంచి అద్దంకి వెళ్లే రాష్ట్రీయ రహదారి నాలుగులైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇదే రోడ్డు పక్కన బొడ్డువానిపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా చేసే పైపులైను ఉంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఐదుసార్లు ఈ పైపులైను మరమ్మతులకు గురైందని, ప్రతిసారి తాము కొంతసొమ్ముతో మరమ్మతులు చేయించుకుంటున్నట్లు కాలనీ వాసులు చెపుతున్నారు. పదిరోజుల కిందట సుమారు 300 అడుగుల మేర తాగునీటి సరఫరాచేసే పైపులైను రోడ్డునిర్మాణంతో పూర్తిగా దెబ్బతింది. విషయం కాంట్రాక్టర్ దృష్టికి తీసుకుపోయారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మేదరమెట్ల వచ్చిన సమయంలో విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవలేదని కాలనీ వాసులు వాపోయారు. పనులు అడ్డుకున్న మహిళలు తాగునీటి పైప్‌లేన్ మరమ్మతుల విషయం ఎవరూ పట్టించుకుకోకపోవడంతో కాలనీకి చెందిన మహిళలు అద్దంకి రోడ్డులో నిర్మాణం చేస్తున్న పనులను బుధవారం మహిళలు అడ్డుకున్నారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ రెండు, మూడు రోజుల్లో పైపులైను మరమ్మతులు చేయించడం జరుగుతుందని కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇటీవల ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలనీలోని చేతి పంపులు, బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయని, పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తామే ట్యాంకర్‌ను ఏర్పాటు చేసుకొని తాగునీటి సరఫరా చేసుకుంటున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బొడ్డువానిపాలెం, అనమనమూరు ముంపు కాలనీకి తాగునీటి సమస్యపై శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆప్రాంత ప్రజానీకం కోరుతున్నారు. -
ఫ్రకాశం జిల్లా అద్దంకి టీడీపీలో ముసలం
-
నాదస్వర విద్వాన్ నాగూర్ కన్నుమూత
అద్దంకి: నాదస్వర విద్వాన్ నాగూర్ సాహెబ్ (90 ) గురువారం అద్దంకిలోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కశ్యాపురం గ్రామానికి చెందిన నాగూర్ సాహెబ్ తండ్రి ఖాశీం సాహెబ్ పేరు మోసిన నాదస్వర విద్వాంసులు. తల్లి హుస్సేన్భీ. 1930వ సంవత్సరంలో నాగూర్ సాహెబ్ జన్మించారు. ఆయన సోదరుడు దస్తగిరి సైతం నాదస్వర విద్వాంసులు. అద్దంకి ప్రాంతంలో ఇద్దరూ నాదస్వర ద్వయంగా పేరు గాంచారు. తొలి గురువు అయిన తండ్రి వద్దే సంగీతంలో ప్రాథమిక విద్యను నేర్చుకున్నారు. తరువాత మేనమామ నాగులుప్పలపాడు మండల గొనసపూడికి చెందిన మస్తాన్ సాహెబ్ దగ్గర ఉన్నత విద్యను నేర్చుకున్నారు. తమిళనాడులోని తంజావూరు గ్రామానికి చెందిన దొరై కణ్ణన్∙ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో 1965 నుంచి 2000 సంవత్సరం వరకు నాదస్వర కచేరీలు చేశారు. అక్కడ బీ హైగ్రేడు, ఏ గ్రేడు కళాకారునిగా గుర్తింపు పొందారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రముఖ నాదస్వర విద్వాంసుడు పద్మశ్రీ షేక్ చినమౌలానా స్మారక అవార్డును, నాదస్వర విద్వాన్, నాద కోవిద బిరుదులను అందుకున్నారు. ఈయన శిష్యుడు ప్రముఖ నాదస్వర విద్వాంసుడు చినమౌలానా మనవడు బాబుల్ మధురైలో గొప్ప విద్వాంసుడుగా పేరు పొందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సంగీత దర్శకుడు కె.విశ్వనాథ్‌చే నాదస్వర మణిరత్న బిరుదును పొందారు. సుమారు 5వేల మందికిపైగా ఔత్సాహిక కళాకారులకు హర్మోనియం, నాదస్వరం, ప్లూట్, క్లారినట్ వంటి ఎన్నో వాయిద్యాలను నేర్పారు. నాగూర్‌సాహెబ్‌కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఒక కుమారుడు ఎస్కే షాజహాన్ గూడూరులో ఎక్సైజ్ ఇన్చార్జ్ సీఐగా పనిచేస్తున్నారు. మరో కుమారుడు తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నాదస్వర కళాకారుడయ్యాడు. రెండున్నరేళ్లుగా అనారోగ్య కారణంగా వాయిద్యానికి దూరంగా ఉంటూ గురువారం తన స్వగృహంలో తదిశ్వాస విడిచారు. గాత్ర వాయిద్య కళాకారుల సంఘ నాయకుడు శేషగిరిరావు, కోలాటం కళాకారుడు జాన్ సాహెబ్, రంగస్థల కళాకారుడు అద్దంకి నాగేశ్వరరావు, కోటేశ్వరమ్మతోపాటు మరి కొందరు కళాకారులు, నూర్ భాషా సంఘ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. -
అద్దంకికి ఏం తక్కువ?
అద్దంకి:రెవెన్యూ డివిజన్ కావడానికి అన్ని అర్హతలున్న అద్దంకి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని పట్టణంతో పాటు, పరిసర మండలాల ప్రజలు కోరతున్నారు. గతంలో ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోకుండా, నేడు మార్టూరు, దర్శి రెవెన్యూ డివిజన్లు చేయబోతున్నామనే ప్రకటనలతో మరలా డివిజన్ విషయంలో ఆందోళనలు చేసేందుకు ప్రజలు, సంఘాలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే, రెవెన్యూ డివిజన్‌కు అన్ని అర్హతలున్న అద్దంకి పట్టణాన్ని డివిజన్‌గా ప్రకటించాలని పరిసర మండలాల ప్రజలు కోరుతున్నారు. గతంలో దీనిపై లక్ష పోస్ట్ కార్డు ఉద్యమం, రాస్తారోకోలు నిర్వహించారు. పరిసర పట్టణాలకుకేంద్ర బిందువుగా అద్దంకి.. పరిసర పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉన్న అద్దంకి. పురాతన కాలం నుంచి పరిపాలనకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ రాజుల కాలంలోనే రత్నాలు రాశులుగా పోసి విక్రయాలు జరిపినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రెడ్డి రాజుల మొదలుకుని, ఎందరో రాజులు పట్టణాన్ని రాజధానిగా చేసుకుని, కోట నిర్మాణంతో పరిపాలన సాగించారు. దీంతోపాటు నాటి నుంచి నేటి వరకూ వ్యవసాయ, వర్తక, వాణిజ్య, ఎగుమతులు, దిగుమతుల రంగంలో మంచి పేరు గడించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుతం కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లు ఉండగా, పరిపాలనా సౌలభ్యం కోసం, మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీంతో జిల్లాలో ఐదు డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ప్రస్తుత డివిజన్ల పరిస్థితి.. జిల్లాలో 56 మండలాలు, 12 నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కాపురం, కందుకురు, ఒంగోలు డివిజన్లు, మరో రెండు డివిజన్లు ఏర్పాటైతే, ఒక్కో డివిజన్లో 11 మండలాల వంతున నాలుగు, 12 మండలాలతో ఒక డివిజన్ ఏర్పాటు అవుతాయి. మూడో శతాబ్దం నుంచే రాజకీయ కేంద్రం అద్దంకి క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే రాజకీయ కేంద్రంగా, సైనిక స్థావరంగా ఉంది. రెడ్డి రాజుల రాజధాని మొదలు ఎన్నో రాజవంశాలు దీన్ని తమ రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాయి. 1200 ఏళ్ల నుంచి పట్టణంగా ... గుండ్లకమ్మ జీవ నది ఒడ్డున ఉన్న అద్దంకి, దాదాపు 1200 ఏళ్ల నుంచి పట్టణంగా ఉంది. గుర్తింపు ఇలా... 1955 నుంచి నియోజకవర్గ కేంద్రంగా ఉంది. 1950 నుంచి గ్రంథాలయం, 1950లోనే తాలూకా కేంద్రం ఏర్పాటైంది. 1870లో డిస్పెన్సరీ, ప్రస్తుతం అదే 30 పడకల అసుపత్రిగా అభివృద్ధి చెందింది. 1946 నుంచి హైస్కూల్, 1956లోనే ఎన్నెస్పీ ఈఈ కార్యాలయం, 1972 లో సబ్ జైలు, గతంలోనే ట్రజరీ, సబ్ రిష్ట్రార్ కార్యాలయం ఏర్పాటైంది. ఎక్కడా డిగ్రీ కళాశాల లేని రోజుల్లో అద్దంకిలో 1974లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఇంకా 6 జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక కళాశాల, రెండు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మరో జిల్లా పరిషత్ పాఠశాల, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే పేరు గాంచిన ప్రముఖ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఉంది. పరిసర మండలాలకు కేంద్రంగా అద్దంకి... భౌగోళిక చారిత్రక అంశాలను బట్టి పరిశీలిస్తే కొత్తగా ఏర్పాటు చేయబోయో రెండు డివిజన్లలలో ఒక దాన్ని, పరిసర పట్టణాలకు కేంద్రంగా(మధ్యలో) ఉన్న అద్దంకిలో ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలతో పాటూ, వివిధ మండలాల ప్రజలు కోరుతున్నారు. డివిజన్ అయితే కలిసే మండలాలు.. అద్దంకి డివిజన్ ఏర్పాటు చేస్తే అద్దంకి, జె.పంగులూరు, ఇంకొల్లు, మార్టూరు, ముండ్లమూరు, సంతమాగులూరు, కొరిశపాడు, యద్దనపూడి, బల్లికురవ, పర్చూరు మండలాలను కలిపి ఏర్పాటు చేయవచ్చనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు. గతంలోనే అద్దంకి డివిజన్ ప్రతిపాదన.. 2014కు ముందు స్థానిక ప్రజా ప్రతినిధులు అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందుకు అవసరమైన ఫైల్‌ను తయారు చేసి కలెక్టరుకు, సీఎంకు పంపారు. ఈ క్రమంలో అప్పట్లో ఉన్న మూడు డివిజన్లే సరిపోతాయనే ఉన్నతాధికారుల నివేదికతో ఆగింది. ప్రస్తుతం మరో రెండు రెవెన్యూ డివిజన్ల ప్రకటనతో అద్దంకి పరిసర మండలాల ప్రజలు, అద్దంకినే డివిజన్ చేయాలని కోరుతున్నారు. పోస్ట్ కార్డు ఉద్యమం, ధర్నాలు.. మునిసిపాలిటీగా అద్దంకి అవతరించడం, బల్లికురవ గ్రానైట్ ద్వారా, ప్రపంచ వ్యాప్త వ్యాపారం, వ్యవసాయు ఉత్పత్తుల దిగుబడి, వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతుల రంగంలో, ఆదాయ వనరులను కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ పట్టణ అభివృద్ధి కమిటీ ఇటీవల అద్దంకి –నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అదే విధంగా లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. వీటిని త్వరలో సీఎం చంద్రబాబు నాయుని వద్దకు చేర్చబోతున్నారు. ఈ క్రమంలో ఇన్ని వసతులున్న అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని రాజకీయ నాయుకులు, పరిసర మండలాల ప్రజలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలి అద్దంకిరూరల్: చరిత్ర ఉన్న అద్దంకిను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్రమ శిక్షణ సంఘ సభ్యుడు జ్యోతి హనుమంతరావు అన్నారు. అద్దంకి– నార్కేట్పల్లి రాష్ట్రీయ రహదారిని పట్టణంలో విస్తరణను సక్రమంగా జరగాలని కోరుతూ పట్టణ అభివృద్ధి కమిటీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బంగ్లారోడ్‌లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసమే దర్శి, మార్టూరులను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్. సీతారామాంజనేయులు మాట్లాడుతూ ఎంతో చారిత్రక చరిత్ర కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు, పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారం లభించే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. తొలిరోజు దీక్షలను జ్యోతి చంద్రమౌళి పూలమాలలు వేసి ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, సీపీఐ సీనియర్ నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు, డేవిడ్, వడ్లపల్లి ఆంజనేయులు, పవన్‌కుమార్ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ, యు. దేవపాలన, యర్రమోతు నాగేశ్వరరావు, చలమారెడ్డి పాల్గొన్నారు. -
అభిమాన తరంగం
అద్దంకి: ప్రజాసంకల్ప యాత్ర దర్శి నియోజకవర్గంలో ముగించుకుని, ఆదివారం ఉదయం అద్దంకి నియోజకవర్గంలోని కుంకుపాడు గ్రామం చేరుకుంది. నియోజకవర్గంలోకి అడుగిడుతున్న తమ అభిమాన నేత జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు, పరిసర గ్రామాల నుంచి వచ్చిన అభిమానులు, నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. నడిచే దారి పొడవునా పూలు చల్లారు. దీంతో రహదారులన్నీ పూల బాటలుగా మారాయి. కుంకుపాడు స్వాగత ద్వారం వద్ద మేళ తాళాలతో బాణా సంచా కాలుస్తూ.. ‘జై జగన్’ అంటూ.. అభిమానులు నిరాజనం పట్టారు. కుంకుపాడులో జెండా, వైఎస్సార్ విగ్రçహావిష్కరణతో పాటు, తిమ్మాయపాలెం గ్రామాల్లో పార్టీ జెండాలను జగన్ ఆవిష్కరించారు. ఆయనతో కలిసి మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెట్లు, చేమలను లెక్క చేయకుండా పరుగులు తీశారు. మోదేపల్లి పరిసర గ్రామాల నాయకులు కుంకుపాడులో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. గంటల తరబడి నిరీక్షణ.. తమ అభిమాన నేత ఎప్పుడొస్తాడా అంటూ స్త్రీలు, వృద్ధులు గంటల తరబడి ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురు చూశారు. అద్దంకి పట్టణంలో జగన్ ప్రసంగ సమయంలో బహుళ అంతస్తుల భవనాలపై ఎక్కి మరీ తమనేత ప్రసంగాన్ని విన్నారు. బహిరంగ సభ ప్రాంతం జన సంద్రంలాగా మారింది. రెడ్డిపాలెం నుంచి 200 బైకులతో ర్యాలీగా తరలి వచ్చారు. అడుగడుగునా వినతులు.. పాదయాత్రలో ఉన్న జగన్‌కు వివిధ రాకాల సమస్యలపై ప్రజలు దారి పొడవునా వినతులను అందజేశారు. కొటికలపూడి పునరావాస కాలనీ (రామచంద్రాపురం)లో ఎటువంటి మౌలిక వసుతులు కల్పించలేదని, సీపీఎస్ పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని, పనులు లేక ఇటుక బట్టీల కూలికి వచ్చిన తమకు పనులు కల్పించేలా చూడాలని గోదావరి జిల్లా వాసులు జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్, ఎంఆర్పీఎస్ నాయకులు తమ సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ఏపీ ఉద్యాన శాఖలో ఒక్క విస్తరణ నియామకం కూడా జరగలేదని, అద్దంకి హార్టీ కల్చర్ ఎంపీఈఓ స్వర్ణలత జగన్‌ను కలిసి వినతి పత్రాలు అందజేసింది. ఇదే విధంగా గిరిజన సమస్యలపై జేజేసీ నేతలు, పింఛన్ ఊడబెరికారంటూ వృద్ధులు, టీడీపీ నేతలు ఇల్లు తగుల బెట్టారంటూ జే పంగులూరు మండలం రామకూరుకు చెందిన ఆసోద బంగారుబాబు వినతిపత్రం అందజేశారు. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు అద్దంకి, కొరిశపాడు, జే పంగులూరు మండలాలకు చెందిన నాయకులు, జ్యోతి హనుమంతరావు, చింతల పేరయ్య, యర్రం బ్రాహ్మారెడ్డి, స్వయంపు హనుమంతరావు, మద్దినేని గోపి, స్టీరింగ్ కమిటీ నాయకుడు చిలకూరి సాంబశివరావు, బీవీకే రెడ్డి, రమాదేవి, హనుమాయమ్మ, అబీదా, గూడా శ్రీనివాసరెడ్డి, సోము పరమేశ్వరరెడ్డి, కొంచా శ్రీనివాసరెడ్డి, సింగమనేని నాగేశ్వరరావు, తిమ్మాయపాలెం గ్రామ మాజీ సర్పంచ్ అడుసుమల్లి బాలమురళీ కృష్ణ, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, శివారెడ్డి, సందిరెడ్డి హనుమంతరావు, మద్దిరెడ్డి సుబ్బారెడ్డి, ఏ రామాంజనేయులు, గంగినేని సుబ్బారావు, రాఘవ, మేదరమెట్ల సర్పంచ్ పేరం నాగలక్ష్మి, మండల నాయకులు మన్నె మదుసూధనరావు, కరణం సుబ్బయ్య, యర్రం రత్నారెడ్డి, మాజీ ఎంపీపీ అన్నెం అంజిరెడ్డి, పల్లెర్ల శ్రీనివాసరెడ్డి, వడ్లమూడి శ్రీనివాసరావు, షేక్ రసూల్ బాషా, జంపు వెంకట్రావు, యూ అంకాలరావు, హనుమంతరావు పాల్గొన్నారు. 300 వాహనాల్లో కదిలిన నేతలు సంతమాగులూరు: ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం అద్దంకి వచ్చిన సందర్భంగా జరిగిన జగన్ బహిరంగ సభకు సంతమాగులూరు మండలం నుంచి 300 వాహనాల్లో 5 వేల మందితో తరలివెళ్లినట్లు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అట్లా చిన్నవెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యర్రంరెడ్డి బ్రహ్మారెడ్డి, కొండలు, ఆదం రఫీ, మక్కెన శ్రీరామూర్తి, కొమ్మాలపాడు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. యాత్రకు తరలిన నేతలు.. బల్లికురవ: జగన్ పాదయాత్రకు బల్లికురవ మండలం నుంచి కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివెళ్లారు. మండల నాయకులు చింతలపేరయ్య, కల్లి అంజినీ ప్రసాద్‌రెడ్డి, షేక్ శ్రీనువలి, సింగరకొండ, అబ్దుల్లా, షఫీ, గోగినేని వీరాంజనేయులు, కోవూరి ప్రభాకరరావు, ఇప్పల వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అద్దంకి బహిరంగ సభకు 500 వాహనాలతో పాటు ద్విచక్రవాహనాలు ర్యాలీగా అద్దంకి బయల్దేరారు. జగన్‌తోనే.. రాజన్న రాజ్యం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గరటయ్య అద్దంకి: రాజన్న రాజ్యం కావాలంటే జగన్ సీఎం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచు గరటయ్య అన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో వర్షాలు లేవన్నారు. ఆయన అడుగు పెడితేనే వర్షాలు పడవని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. చంద్రబాబూ అదే నమ్ముతున్నాడన్నారు. నాగార్జున సాగరు నీరు ఇవ్వమంటే, వచ్చే ఏడాది తాగునీటి కోసం అని చెప్పటం, తన ప్రభుత్వంలో వర్షాలు పడవనే గట్గినమ్మకంతోనేనన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరైన పథకం పనులను నత్తనడకన సాగించకుండా, పూర్తిచేస్తే వేలాది ఎకరాల బీడు భూములు మాగాణి భూములుగా మారతాయన్నారు. గుండ్లకమ్మ వద్ద చెక్ డ్యామ్ ఏర్పాటుతో తిమ్మాయపాలెం, యర్రం చిన్నపోలిరెడ్డి ఎత్తిపోల పథకంతో, కోరిశపాడు మండంలో 20 వేల ఎకరాలు భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. అదే విధంగా భవనాశి రిజర్వాయరు పూర్తితో 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జే పంగులూరు మండలంలోని కొండమూరు, రావమ్మ కుంటను రిజర్వాయర్లుగా మారిస్తే మరో 5 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులను అదుకోవాల్సింది పోయి పీల్చి పప్పి చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక పాలన సాగుతోందని, ఆ పాలనకు చరమ గీతం పాడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. దానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలిపునిచ్చారు. -
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి రాయితీలు
-
మా ఊరే బృందావనం
ఆకు రౌడీగా.. విలన్‌గా.. గూండాగా.. తండ్రిగా.. స్నేహితుడిగా.. ఇలా వెండితెరపై విలక్షణ పాత్రలు పోషించి సినీ అభిమానులను మెప్పించారు ప్రముఖ నటుడు గిరిబాబు. మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. మెగాఫోన్ చేతపట్టి మరో మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. వందల సినిమాల్లో తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన గిరిబాబు సొంతూరు కొరిశపాడు మండలం రావినూతల. అసలు పేరు యర్రా శేషగిరిరావు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన గిరిబాబు.. ‘మా ఊరే నాకు బృందావనం’ అంటున్నారు. తన చిన్ననాటి సంగతులు, మధుర స్మృతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. – అద్దంకి - పల్లెటూరిలో పుట్టడం నా అదృష్టం - ఇప్పటికీ జొన్న సంగటి, చింతకాయ పచ్చడి తింటా - కోతికొమ్మచ్చి, బెచ్చాలాట ఆడే ఆ రోజులే వేరు - ‘సాక్షి’తో సినీ నటుడు గిరిబాబు మా ఊరు రావినూతల జిల్లాలో ఒక ఆదర్శ గ్రామంగా పేరుగాంచింది. నా బాల్యం నుంచి 29వ ఏట వరకు ఊర్లోనే ఉన్నా. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో మద్రాసు వెళ్లా. ఎందరో గొప్ప గొప్ప నటులతో నటించా. అదంతా మీకు తెలిసిందే. ఎంత పెద్ద నగరాల్లో ఉన్నా.. నాకు, నా కుటుంబ సభ్యులకు స్వగ్రామంపై మమకారం ఎక్కువ. వీలుదొరికినప్పుడల్లా ఊరికి వచ్చి స్నేహితులతో, బంధువులతో గడుపుతా. రాజకీయం, సినీ రంగం ఒక తాను ముక్కలే. ఈ రెండు రంగాల్లో ఎప్పుడూ స్వార్థంతో పరుగులు తీయడమే సరిపోతుంది. నిజమైన బంధాలు అక్కడ ఉండవు. అక్కడన్నీ నాటకాలే. నిజమైన బంధాన్ని పంచే స్నేహితులు, ఆత్మీయుల కోసం సొంత ఊరు వచ్చి అనుభూతులు మూటగట్టుకుని వెళ్తుంటా. గ్రామంలో ఎవరింట శుభకార్యం జరిగినా పిలుస్తారు, అందరిళ్లకూ వెళ్తా. అదే వారికీ నాకు ఉన్న అనుబంధం. నాకు జన్మనిచ్చిన భూమి మీద ప్రేమ ఎక్కువ. గ్రామస్తులందరి సహకారంతో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ వేసవి సెలవులుకు బృందావనం, ఊటీ, కొడైకెనాల్ వెళ్తుంటారు. మాకు మాత్రం మా సొంతూరే బృందావనం, ఊటీ, కొడైకెనాల్. ఏటా 20 రోజులపాటు కుటుంబ సమేతంగా ఊరికి వచ్చి ఉంటా. గతంలో అయితే మే నెల నుంచి జూన్ 10వ తేదీ వరకు ఇక్కడే ఉండేవాణ్ని. నా జీవితంలో సినిమా ఆవకాశం దక్కడం, చిత్ర పరిశ్రమలో నిరంతరం అవకాశాలు రావడం ఎప్పటికీ మరిచిపోలేను. మా అమ్మ, నా భార్య మరణం నా జీవితంలో విషాధకర సంఘటనలు. సంగటి, చింతకాయ పచ్చడి.. ఆ రుచే వేరు అప్పట్లో వరి అన్నం లేదు. రాత్రి సమయంలో వరిగ అన్నం, పప్పుచారు, ఉదయం జొన్న సంగటి, సజ్జ సంగటి తినేవాళ్లం. సంగటి, చింతకాయ పచ్చడి తింటే ఆ రుచే వేరు. పండుగలకు సోమి బువ్వ, ఆబువ్వ(వరి అన్నం) వండేవాళ్లు. నేను ఇప్పటికీ మా ఇంట్లో జొన్న సంగటి, చింతకాయ పచ్చడి తింటాం. మా ఊరిలో వండే పకోడీలు, అరిసెలు, గారెలు, పులి బొంగరాలు అంటే ఎంతో ఇష్టం. ఏటా 40 కేజీల చింత తొక్కు పెట్టించి హైదరాబాద్ తీసుకెళ్తా. చింతకాయ తొక్కు కోసం నా సహ నటులు ఎçప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. అందరికీ పెడతాం. అప్పుడీ హోటళ్లు, టిఫిన్లు లేవు మా ఊరికి వస్తే చాలు.. బాల్యం, అప్పుడు ఆడుకున్న ఆటలు, స్నేహితులతో చేసిన అల్లరి అన్నీ గుర్తొస్తాయి. పల్లెటూరులో పుట్టడం నా అదృష్టం. పల్టెటూరి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మిత్రులతో కలిసి కోతికొమ్మచ్చి, బెచ్చాల ఆట, బొంగరాలాట ఆడుకునేవాణ్ని. నాటి సంగతులను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటా. పట్టణంలో పెరిగిన వారికన్నా గ్రామాల్లో పెరిగిన వారు చాలా అదృష్ణవంతులు. దాదాపు ఏ వస్తువూ కొనుక్కునే పనిలేదు. బడి సెలవు రోజుల్లో పొలాలకు వెళ్లి తాటిచెట్లు ఎక్కి కాయలు కోసి తినేవాళ్లం. జెముడు కాయలు(నాగజెముడు కాయలు) భలే ఉండేవి. బాల్యం అంతా సరదా సరదాగా ఉండేది. అప్పుడీ హోటళ్లు, టిఫిన్లు లేవు. కలుషితం కాని, ప్రకృతి ప్రసాదించిన రకరకాల పళ్లను హాయిగా తినేవాళ్లం. నా చిన్న తనంలో పెళ్లిళ్లు ఐదు రోజులు జరిగేవి. పెళ్లి రోజుల్లో చేసే పనులకు ఒక అర్థం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. డిటెక్టివ్ నవలలు చదివేవాడిని.. ఖాళీ సమయాల్లో టీవీలో పాత సినిమాలు చూస్తుంటా. పుస్తకాలు, పేపర్లు చదువుతా. విశ్వనాథ సత్యనారాయణ అంటే చాలా ఇష్టం. ఆయన రాసిన సాహిత్యం నవలలు ఇష్టంగా చదువుతా. అప్పట్లో డిటెక్టివ్ నవలలు బాగా చదివేవాడిని. రామాయణ, మహాభారత, భాగవతాలు, చరిత్ర, పురాణాలు అంటే ఇష్టం. బీరువా నిండా పుస్తకాలున్నాయి. వెండి తెరపై దాదాపు అన్ని పాత్రల్లో నటించా. -
అద్దంకి టీడీపీలో బయటపడ్డ విభేదాలు
-
సొంత లాభం కోసం జనాల్ని గాలికొదిలేశారు
-
వడదెబ్బకు ఇద్దరు మృతి
అద్దంకి: ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. జిల్లలోని సంతమాగుళూరు మండలం వెల్లాలచెరువు గ్రామంలో గురువారం మధ్యాహ్నం వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మరణించారు. ఆటోలో వెళుతున్న చెన్నయ్య(75), సుబ్బులు(65) అనే వృద్ధులు ఎండవేడిమికి తట్టుకోలేక ఆటోలోనే ప్రాణాలు విడిచారు. -
బైకు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి
అద్దంకి రూరల్ (ప్రకాశం జిల్లా) : బైకు మీదనుంచి జారి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని యార్కెట్ యార్డు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. పట్టణంలోని రామ్‌నగర్ పుట్ట వద్ద నివాసం ఉంటున్న ఉసురుపాటి రాములు (40) కోరిశపాడు మండలం మద్దిపాడు పోలీస్‌స్టేషన్ లో కానిస్టేబులుగా పని చేస్తున్నాడు. మృతుని స్వస్థలం జె.పంగులూరు మండలం టీ. కొప్పెరపాడు గ్రామం ఉద్యోగ రీత్యా అద్దంకిలో 4 సంవత్సరాలనుంచి నివాసం ఉంటున్నాడు. మద్దిపాడులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేందుకు రోజు అద్దంకి నుంచి బైకుపై మద్దిపాడు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం అద్దంకి నార్కేట్పల్లి రాష్ట్రీయ రహదారి పట్టణంలోని మార్కెట్ యార్డుకు సమీపంలోకి రాగానే బైకు మీద నుంచి జారిపడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు తెలియజేయగా ఎస్ఐ రహమాన్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని మృత దేహాన్ని స్థానిక వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
అద్దంకిలో పొలిటికల్ వార్
= ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల ఫ్లెక్సీ చించివేత = కొంగపాడులో శిలాఫలకంపై ముద్రించిన ఎమ్మెల్యే పేరు కొట్టివేత అద్దంకి : అద్దంకి అధికార పార్టీలో ముఖ్య నేతల మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి ఫస్ట్ సమయంలో అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బలరామ్ వర్గీయుల మధ్య జరిగిన భీకర పోరు ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలకు కళ్లముందే కనిపిస్తోంది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఇరువర్గాలపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును ఇటీవలే ఇరువర్గాలు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే రవికుమార్‌ను సీఎం చంద్రబాబునాయుడు టీడీపీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అద్దంకిలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజకవర్గంలోని పలుచోట్ల ఇప్పటి వరకూ ఏదోఒక చోట గొడవ జరుగుతూనే ఉంది. ఇటీవల చిన్న కొత్తపల్లిలో రవికుమార్ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అలాగే 40 రోజుల క్రితం కొరిశపాడు మండలం మాలెంపాటివారిపాలెంలో రహదారి కోసం వేసిన శిలాఫకాలన్ని ఎవరో ధ్వంసం చేశారు. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా మండలంలోని మణికేశ్వరంలో బీటీ రహదారికి రవికుమార్ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అదే విధంగా కొంగపాడులో రహదారి శంకుస్థాపన కోసం ఆర్అండ్బీ శాఖ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో గొట్టిపాటి రవికుమార్ పేరులో కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. ఆకతాయిలు ఇలా చేస్తున్నారా? లేక గిట్టని వారు చేస్తున్నారా? అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఫ్లెక్సీల విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. గతంలో అద్దంకిలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, మరోసారి అటువంటి గొడవలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కరణమా..మజాకా!
► అద్దంకిలో హైడ్రామా ► కరణం, గొట్టిపాటిల మధ్య ► ఆగని అధిపత్య పోరు ► కరణం వర్గీయుల పింఛన్లను అడ్డుకున్న గొట్టిపాటి వర్గీయులు ► పింఛను దరఖాస్తులపై సంతకాలు పెట్టని ఎంపీడీఓ ► ఎంపీడీఓను నిలదీసి సంతకాలు చేయించిన బలరాం ► ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పాత టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అద్దంకిలోనే అమీతుమీకి సిద్ధపడతామని ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు పదే పదే చెప్పే మాటలు అక్షరాలా నిజమయ్యాయి. తన వర్గీయులకు అన్యాయం జరిగితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, అవసరమైతే ఎమ్మెల్యే గొట్టిపాటితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమని కరణం చెప్పకనే చెప్పారు. మంగళవారం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. మరోవైపు అద్దంకి నియోజకవర్గంలో అన్ని అధికారాలు ఎమ్మెల్యే గొట్టిపాటికి అప్పగించారని ప్రచారం చేసుకుంటున్న ఆయన వర్గీయులను ఈ ఘటన ఉలికిపాటుకు గురి చేసింది. అద్దంకిలో అధిపత్య పోరు ఆగదని మరోమారు రుజువైంది. వివరాలలోకెళితే.... తన వర్గీయులకు సంబంధించి 167 పింఛన్లను ఎందుకు మంజూరు చేయలేదంటూ ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి మంగళవారం అద్దంకి ఎంపీడీఓ హేమాద్రినాయుడును నిలదీశారు. మంగళవారం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ బలరాం తన వర్గీయులతో కలిసి ఎంపీడీఓ ఛాంబర్లోకి వెళ్లి కూర్చున్నారు. పింఛన్ల ఫైలుపై ఎందుకు సంతకాలు పెట్టలేదంటూ ఎంపీడీఓను నిలదీశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరుడు అయిన ఎంపీడీఓ ఏవో సాకులు చెప్పి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ‘ఎక్కడికి కూర్చో..’ అంటూ బలరాం గట్టిగా గదమాయించారు. దీంతో ఎంపీడీఓ కుర్చీలోనే కూర్చోండిపోయాడు. ముందు తన వర్గీయుల పింఛన్ పేపర్లపై సంతకాలు పెట్టాలంటూ కరణం ఎంపీడీఓను ఆదేశించారు. దీంతో ఎంపీడీఓ హేమాద్రినాయుడు కరణం వర్గీయులకు చెందిన 167 పింఛన్లపై సంతకాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారం అద్దంకితో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరణం బలరాం ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాడని తెలుసుకున్న ఆయన వర్గీయులు, జన్మభూమి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎంపీడీఓ ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులు కావడంతో అదే సమయంలో వారి ఛాంబర్లో కొందరు గొట్టిపాటి వర్గీయులు సైతం ఉన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో అధికారులు తమకే మాత్రం పలకడం లేదని కరణం వర్గీయులు పలువురు ఫిర్యాదు చేశారు. అర్హులైన అందరి పనులు చేసి పెట్టాలని ఈ సందర్భంగా కరణం అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ సంతకాలు పెట్టిన పింఛన్ల ఫైలును తీసుకొని బలరాం అక్కడ నుంచి వెళ్లిపోయారు. బలరాం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవడం పెద్ద ఎత్తున ఆయన అనుచరులు సైతం అక్కడకే తరలివచ్చారు. కరణం అక్కడకు ఎందుకు వచ్చాడో తెలుసుకునేందుకు కార్యాలయానికి వచ్చిన స్థానిక సీఐ హైమారావు సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు. ఎంపీపీ చాంబర్లో గొట్టిపాటి వర్గీయులు ఉండడం, ఎంపీడీవో చాంబర్లో బలరాం కూర్చుని ఉండడంతో, గత సంఘటనల దృష్ట్యా ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బయట ఎస్ఐలు, అబ్దుల్ రహమాన్, సంపత్‌కుమార్, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. బలరాం వర్గీయుల పింఛన్లను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు.. అద్దంకి మండలంలో బలరాం వర్గీయులకు చెందిన 167 పింఛన్లను మంజూరు చేయకుండా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు ఎంపీడీఓ హేమాద్రినాయుడుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మండల ఎంపీడీఓ గొట్టిపాటి వర్గీయుడు కావడంతో ఆ అధికారాన్ని అడ్డుపెట్టి వారు బలరాం వర్గీయుల పింఛన్లు మంజూరు కాకుండా చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికార పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా మంజూరు చేయించుకున్న 3 వేలకుపైగా పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో కరణం బలరాం అద్దంకి మండలానికి 167 పింఛన్లను జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయించారు. అయితే పింఛన్ల మంజూరుకు సంబంధించి ఎంపీడీఓ హేమాద్రినాయుడు సంతకాలు పెట్టాల్సి ఉండగా గొట్టిపాటి ఒత్తిడితో మూడు నెలలుగా సంతకాలు పెట్టలేదు. జన్మభూమి కమిటీ సభ్యులు కోరినా ఎంపీడీఓ ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కరణం బలరాం వర్గీయులు మంగళవారం ఉదయం మరోమారు బలరాంకు ఎంపీడీఓపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని హేమాద్రినాయుడుతో తమ వర్గీయుల పింఛను పేపర్లపై సంతకాలు పెట్టించారు. ఫలించని బాబు ఎత్తుగడ.. అద్దంకిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు సద్దుమణిగేలా కనిపించడం లేదు. సరికదా మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామని, మిగిలిన నేతలు తలదూర్చవద్దని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటనపై కరణం బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కరణంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని భావించిన చంద్రబాబు కల నెరవేరదని స్పష్టమవుతోంది. మంగళవారం అద్దంకి ఎంపీడీవో కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటన జిల్లాలో అధికార పార్టీ శ్రేణులను అవాక్కయ్యేలా చేసింది. -
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
అద్దంకి : పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు యువకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటన పట్టణంలోని నాగులపాడు రోడ్డులోని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌సమీపంలో శనివారం జరిగింది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు కారులో శనివారం అద్దంకి వచ్చారు. పట్టణంలోని శ్రీనగర్‌కు చెందిన బాజీని కారులో ఎక్కించుకుని నాగులపాడు రోడ్డు ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. అక్కడ బాజీని కిందకు దించి కొడుతున్నారు. వారి నుంచి తప్పించుకుని పక్కకు వచ్చిన బాజీ వెంటనే తన స్నేహితులైన పర్శు స్వరూప్, మహేంద్రలకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వారిద్దరూ బైకులపై అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు వీరిపై కూడా కత్తులతో దాడి చేయడం ప్రారంభించారు. ఇంతలో స్థానికులు రావడాన్ని గమనించి నిందితులు అదే కారులో పలాయనం చిత్తగించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన స్వరూప్‌ను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. బాజీ అనే యువకుడికి స్థానికంగా ఉండే నరేశ్, గౌతమ్, దేవరకొండ హరీశ్‌తో పాత గొడవలున్నట్లు సమాచారం. వారే హైదరాబాద్ నుంచి నాలుగురిని పిలిపించి దాడి చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అద్దంకిలో స్వల్ప భూప్రకంపనలు
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ వారంలో భూప్రకంపనలు సంభవించడం ఇది రెండో సారి అని స్థానికులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలు వల్ల ఏలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించ లేదని సమాచారం. -
ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారం
అద్దంకి కేశవరావు విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్సీ ఆర్ఎస్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి కొత్తపేట : సాహితీవేత్త, రచయిత, కవి దివంగత అద్దంకి కేశవరావు జీవితం, ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారమని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్), రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. కేశవరావు 98వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం, రచనల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానికప్రియదర్శినీ బాలవిహార్ ప్రాంగణంలో ప్రియదర్శినీ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రముఖ కవి, కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముందుగా గ్రామ సర్పంచ్ మిద్దే అనూరాధ, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రముఖ శిల్పి డి రాజ్‌కుమార్‌వుడయార్ రూపొందించి, సమర్పించిన అద్దంకి కేశవరావు విగ్రహాన్ని ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ఆర్ఎస్ ఆవిష్కరించగా, కేశవరావు రచించిన బుద్ధ జయంతి పుస్తకాన్ని ఎంపీపీ రెడ్డి అనంతకుమారి ఆవిష్కరించారు. బౌద్ధ గ్రంథాలయం బ్లాకును మరో ముఖ్య అతిథి అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ మాట్లాడుతూ తండ్రిగా, గురువుగా అద్దంకి కేశవరావు తన కుటుంబానికే కాక రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వారి ఎందరికో ఉత్తమ విద్య, విజ్ఞానాన్ని అందించారన్నారు. తండ్రి రచనలు వెలుగులోకి తెచ్చి, ఆయన ఆశయాలను బతికిస్తున్న బుద్ధచంద్రదేవ్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. పొట్లూరి మాట్లాడుతూ అతికొద్ది మంది అపూర్వ కవులలో కేశవరావు ఒకరని అన్నారు. జాతికి అనేక గ్రంథాలు, కవితలు, నవలలు అందించిన కేశవరావు తెలుగుజాతి చరిత్ర పురుషుడని అన్నారు. విగ్రహ శిల్పి రాజ్కుమార్వుడయార్ను అతిథులు ఘనంగా సత్కరించారు. ప్రియదర్శినీ బాలల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సభలో జెడ్పీటీసీ సభ్యుడు ధర్నాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, స్థానిక ఏరియా ఆసుపత్రి కమిటీ చైర్మన్ సలాది రామకృష్ణ, ఎంఈఓ వై సత్తిరాజు, జంగారెడ్డిగూడెం బీపీఈటీ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట్రావు, కళాసామితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు తదితరులు పాల్గొన్నారు. -
గొట్టిపాటి యాక్షన్.. కరణం రియాక్షన్
► అద్దంకి సీఐని బదిలీ చేయించిన రవికుమార్ ► రాత్రికి రాత్రే బదిలీని నిలిపివేయించిన బలరాం ► పతాకస్థాయికి టీడీపీ వర్గ విభేదాలు ఒంగోలు: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఆదివారం ఉదయానికి బదిలీ చేయించి యాక్షన్‌కు దిగితే.... అదే రోజు సాయంత్రానికే ఆ బదిలీ నిలిపివేయించి కరణం తన రియాక్షన్ చూపించారు. అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం తలకు చుట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే... అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇటీవలే అధికార పార్టీలో చేరారు.గొట్టిపాటి రాకను కరణం బలరామకృష్ణమూర్తి,ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి అద్దంకిలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గొట్టిపాటిని కరణం వర్గీయులు అడుగడుగునే అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే గొట్టిపాటి చాప కింద నీరులా తన పని చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగా ఏడాదిన్నరగా అద్దంకి సీఐగా పని చేస్తున్న బేతపూడి ప్రసాద్‌ను గొట్టిపాటి పట్టుపట్టి డీఐజీ ద్వారా బదిలీ చేయించారు. ఆదివారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును అద్దంకి సిఐగా బదిలీ చేయించారు. బేతపూడి ప్రసాద్ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపారు.ఐజీతో పాటు ఏకం గా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అంతే..! ఆదివారం సాయంత్రానికి సీఐ బదిలీ ఆగిపోయింది. ప్రసాద్ బదిలీని నిలిపివేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద వాపోయినట్లు సమాచారం. తొలి డిమాండే నెరవేరకపోతే మిగిలిన హామీలు ఏం నెరవేరుస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఐని బదిలీ చేస్తే చేతకాని వాళ్లలా కూర్చోలేమని అటు చంద్రబాబుకు ఇటు లోకేష్‌లకు కరణం తేల్చి చెప్పినట్లు సమాచారం. అవసరమైతే అమీతుమీకి సిద్ధమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పదేళ్లు జెండాలు మోసి కార్యకర్తలు అష్టకష్టాలు పడ్డారని విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని కరణం తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య పోరు పతాకస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అటు పార్టీ అధిష్టానం గొట్టిపాటికిచ్చిన హామీలను నెరవేర్చుకుం టుందా...? లేక పాత తరం సీనియర్ నేత కరణంకే ప్రాధాన్యతనిస్తుందా...? అన్నది వేచి చూడాల్సి ఉంది.....! -
గురుకుల బాలికల కళాశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం
ఈనెల 31 దరఖాస్తులకు తుది గడువు అద్దంకి : జిల్లాలోని గురుకుల బాలికల కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శింగరాయకొండ, కంభం, మార్కాపురం, అద్దంకి, యద్దపూడి, కొండపి, రాచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు 640 సీట్లు, దూపాడు, నాగులపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ఇంటరు మొదటి సంవత్సరంలో చేరేందుకు 160 సీట్లు ఖాళీగా ఉన్నట్లు సింగరకొండ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ , ఇంటరు ప్రవేశ కౌన్సిలింగ్ కో ఆర్డినేటరు పరుచూరి వాసవి మంగళవారం తెలియజేశారు. వీటిని కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు ఫారాలు సమీపంలో ఉన్న ఏ గురుకుల కళాశాల నుంచైనా పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలతోపాటు పదో తరగతి మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జెరాక్స్‌లను జతచేసి ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా అందజేయాలని తెలిపారు. మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థుల కోసం జూన్ 6వ తేదీన ఉదయం 10 గంటలకు అద్దంకిలోని సింగరకొండ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే సమయంలో విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు.. * ఈ సంవత్సరం పదో తరగతి పాసై ఉండి 2016 ఆగ స్టు 16 నాటికి 17 సంవత్సరాల వయసు లోపు వారై ఉండాలి. * తల్లిదండ్రుల సంవత్సరాదాయం ఒక లక్షకు మించి ఉండరాదు. * ప్రకటించిన సీట్లలో 75 శాతం ఎస్సీలకు, ఎస్సీ కన్వనర్టెడ్ క్రిస్టియన్లకు 12 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం 9704550083, 9704550087, 9704550088, 9704550089, 9704550090, 9704550091, 9704550092, 9704550093, 9704550094, 9704550095 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. -
తల్లీకూతుళ్ల ఆత్మహత్య
అద్దంకి (ప్రకాశం జిల్లా) : అద్దంకి మండలం దేనుగుకొండ గ్రామ పొలాల్లో శుక్రవారం తల్లీకూతుళ్లు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకి ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. మృతులు చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామానికి చెందిన పులి రాములమ్మ(35), అనిత(13)లుగా గుర్తించారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా...నలుగురి దుర్మరణం
అద్దంకి : వేగంగా వెళున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి సమీపంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం జేపీ గూడూరుకు చెందిన గునుపాటి వెంకటేశ్వరరెడ్డి(50) కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లాకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో.. ముందు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరెడ్డితో సహా కారులో ఉన్న బుజ్జమ్మ(55), రమణమ్మ(54), జ్యోతి(21) అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం తాగుతూ వ్యక్తి మృతి
ఒంగోలు : మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక సూర్యా వైన్స్ ముందు మద్యం తాగుతున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి వివరాలు సేకరిస్తున్నారు. వైన్స్ లోని మద్యాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. -
మోసం చేసిందనే మల్లీశ్వరిని చంపా: బాషా
అద్దంకి: 'భర్తను వదిలేసిన తర్వాత నాకు దగ్గరైంది. మొదట్లో అన్యోన్యంగానే ఉన్నాం. కానీ రానురానూ తాను విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎవరెవరితోనో మాట్లాడేది. ఎక్కడెక్కడికో వెళ్లేది. వద్దని ఎంత మొత్తుకున్నా వినేదికాదు. గట్టిగా అడిగితే నిన్నొదిలేసి హైదరాబాద్ వెళ్లిపోతానని బెదిరించేది. అంతే, పట్టలేని కోపంతో పక్కనున్న నవారు తీసుకొని తన గొంతు నులిమా' అంటూ మల్లేశ్వరిని ఎందుకు చంపాడో పోలీసులకు వివరించాడు బాషా. ప్రకాశం జిల్లా అద్దంకిలో సంచలనంరేపిన ఈ హత్యకేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామానికి చెందిన మల్లీశ్వరి(25)కి అద్దంకి మండలం మనికేషం గ్రామానికి చెందిన రామారావుతో వివాహమైంది. చాలా ఏళ్ల కిందటే వారు విడిపోయారు. భర్తతో తెగదెంపుల అనంతరం కొత్తదామవారిపాలెంకు చేరుకున్న మల్లీశ్వరి అక్కడ ఒంటరిగా నివసిచసాగింది. ఈ క్రమంలో ముజావర్ పాలెంకు చెందిన బాషా(30) అనే వ్యక్తితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగామారి ఇరువురూ సహజీవనం చేస్తున్నారు. తనతో కలిసి ఉంటూనే మరికొందరితోనూ దగ్గరగా ఉంటోందని మల్లేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు బాషా. చాలాసార్లు హెచ్చరించి చూశాడు. శనివారం రాత్రి కూడా ఇరువురి మధ్య ఇదేవిషయంలో ఘర్షణ జరిగింది. తనను అనుమానిస్తే హైదరాబాద్ వెళ్లిపోతానని మల్లేశ్వరి బెదిరించింది. దీంతో కోపోద్రిక్తుడైన బాషా ఇంట్లో ఉన్న నవారుతో ఆమెకు ఉరి వేసి.. ఏమి తెలియనట్లు నటించాడు. తాను రావడానికి ముందే మల్లీశ్వరి ఉరి వేసుకుందని చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి బాషాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మల్లీశ్వరిని తానే చంపానని బాషా అంగీకరించాడు. దీంతో బాషాపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. -
అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్ జామ్
వేములపల్లి: కనీస వేతనం సహా పలు డిమాండ్ల సాధనకు ఆశా వర్కర్లు మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సీపీఐ, సీపీఎం తదితర పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వందల సంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
లారీ ఢీకొని యువకుడు మృతి
అద్దంకి (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం ఉదయం లారీ ఢీకొని పిచ్చయ్య(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వేములకు చెందిన పిచ్చయ్య ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
ఎన్నారై జేబులో పర్సు చోరీ
ప్రకాశం (అద్దంకి) : అద్దంకిలోని సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన పోకూరి రామేశ్వరరావు అనే ఎన్నారై జేబులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పర్సు చోరీ చేశారు. ఆ పర్సులో రూ.15 వేల నగదు, రూ.25 వేల విలువైన అమెరికన్ డాలర్లతో పాటు ట్రైన్ టికెట్లు కూడా ఉన్నాయి. బాధిత ఎన్నారై ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ, బస్సు ఢీ: 15 మందికి గాయాలు
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో శనివారం చోటు చేసుకుంది. మండలంలోని చిన్నకొత్తపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులోని 15 మంది గాయపడ్డారు. వీరిలో పదిమంది తీవ్రంగా గాయాలు అయ్యాయి. బాధితులను గుంటూరు జిల్లా నర్సరావుపేటకు , అధ్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆదుకున్న మానవత్వం
అద్దంకి: ‘అంబా.. అంబా..’ (రక్షించండి) అంటూ పెద్దగా అరుపులు వినిపించడంతో ఏం జరిగిందోనని పరిగెత్తుకు వచ్చిన జనానికి 8 అడుగుల గోతిలో పడిన ఆవు కనిపించింది. ఈ సంఘటన అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక గంగాపార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానానికి ఆవు ఉంది. ఈ ఆవు దర్శి రోడ్డు పక్క ఉన్న ఓ ఇంటి సమీపంలో కంది పైరు మేయడం కోసం వెళ్లగా అక్కడే గొయ్యి తీసి పరదా కప్పి ఉన్న మరుగుదొడ్డి గుంతలో పడింది. అక్కడకు చేరిన గ్రామస్తులు ఆవును రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం చెందారు. దీంతో ఉప్పుటూరి చిరంజీవి అనే వ్యక్తికి ఫోన్ చేసి పొక్లెయిన్ తెప్పించి సమాంతరంగా మరో గుంత తవ్వి ఆవును తాడు వేసి బయటకు లాగారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆవు కృతజ్ఞత చూపులు చూస్తూ అక్కడి నుంచి కదిలింది. -
పాటలే కాదు..నటనలోనూ మేటే!
* ఇండియన్ ఐడెల్ శ్రీరామచంద్రమూర్తి అద్దంకి: శ్రీరామ చంద్ర పేరు వినగానే సంగీతాభిమానులు గర్వపడతారు. ఇండియన్ ఐడెల్ -2010 విజేతగా చరిత్ర సృష్టించిన ఆయన అద్దంకికి చెందినవారని తెలిసిందే. స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో శుక్రవారం విలేకర్లతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘అద్దంకి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి ఆటలు, స్నేహితులను ఎప్పటికీ మరచిపోలేను. పాటలతో పాటు నటనలోనూ గుర్తింపు పొందడం నా అదృష్టమే. జగద్గురు ఆదిశంకరాచార్య, ప్రేమ గీమా జంతానైలో నటించా. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాటలను వదలకుండా, ఆల్బమ్స్ చేస్తున్నందు వల్ల సన్ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అవకాశం వచ్చినా చేయలేదు. ఇప్పటికి 75 సినిమాల్లో ఆరు భాషల్లో 150పైగా పాటలు పాడా. మరిన్ని సినిమాల్లో నటించాలని ఉంది. అద్దంకిలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నా. నందమూరి కళాపరిషత్ పిలుపుతో అద్దంకి రావడం నాకు అనందాన్నిస్తోంది’ అని తెలిపారు. మన్నం త్రిమూర్తులు, రాయసం హనుమంతరావు, కోవి శ్రీనివాసరావు, శ్రీరామచంద్ర తండ్రి మంగమూరి రామకోటయ్య పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటిపై దాడి
రాళ్ల దాడిలో రవికుమార్ కారు పూర్తిగా ధ్వంసం రవి అనుచరుడికి తీవ్రగాయాలు కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు పరామర్శించిన వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా అద్దంకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, వారి అనుచరులు దాడికి దిగారు. ఈ దాడిలో రవి అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారును టీడీపీ వర్గీయులు పూర్తిగా ధ్వంసం చేశారు. వారి దౌర్జన్యాలను, దాడులను నిరసిస్తూ గొట్టిపాటి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే.. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు సంబంధిత సమస్యపై ఇటీవలి జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్వాసితుల అంశంపై చర్చించేందుకు కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కూడా తమ అనుచరులతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం పూర్తయి బయటకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటిని వెళ్లనీయకుండా కరణం వర్గీయులు అడ్డుగా నిలబడ్డారు. గన్‌మెన్ వారిని తప్పుకోమని కోరగా అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈలోగా అక్కడికి వచ్చిన కరణం బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్‌లు అనుచరులను రెచ్చగొట్టడంతో వారు రాళ్లతో దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు తమ వాహనాలను అడ్డంపెట్టి దాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్, గన్‌మెన్, పీఏలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఎమ్మెల్యేపై దాడిని అక్కడున్న రైతులు అడ్డుకున్నారు. దాడి తర్వాత కరణం వర్గీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. రవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించి, దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్లో రవిని పరామర్శించారు. నన్ను చంపడమే లక్ష్యంగా దాడి... తనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా తనపై దాడికి దిగారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రెండు నెలల కాలంలోనే తనపై మూడుసార్లు దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు.గతంలో తన అన్న గొట్టిపాటి కిశోర్‌ను హత్య చేశారని, ఇప్పుడు వరుసగా మూడుసార్లు తాను గెలవడంతో తనను అంతం చేసేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విర్రవీగుతున్నారని అన్నారు. ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ‘మీరే దగ్గరుండి చంపిస్తారా..?’ అంటూ ఈ సందర్భంగా రవికుమార్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వైఎస్సార్సీపీ పర్చూరు ఇన్చార్జి గొట్టిపాటి భరత్ సహా పలువురు నేతలు బైఠాయింపులో పాల్గొన్నారు. కరణం బలరామ్, వెంకటేష్‌లపై కేసు నమోదు గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పాల్పడిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లతో పాటు మరో 23 మందిపై ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో గాయపడిన మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మందపాటి సురేష్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 147, 324, 427, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మహిళా లెక్చరర్ ఆత్మహత్య
అద్దంకి (సంతమాగులూరు) : ఓ మహిళా లెక్చరర్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ ల్యాబ్‌లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కె.అంజనీదేవి(33) అనే మహిళ స్థానిక ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈమె స్వగ్రామం చీమకుర్తి. మూడేళ్ల క్రితం ఒంగోలుకు చెందిన దామా గోపీతో వివాహమైంది. ఏడాది నుంచి ఒంగోలు నుంచి రోజూ కళాశాలకు వచ్చి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో భర్తతో విభేదాలు వచ్చాయి. ఆరు నెలల నుంచి పుట్టిల్లు చీమకుర్తి నుంచి రోజూ అద్దంకి వచ్చి వెళ్తున్నారు. పది రోజుల క్రితం కళాశాల యాజమాన్యాన్ని కలిసి తాను రోజూ చీమకుర్తి నుంచి వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉందని, పట్టణంలో వసతి చూసుకునేంత వరకూ రాత్రి వేళల్లో కళాశాలలోనే ఉంటానని కోరారు. అందుకు యాజమాన్యం అంగీకరించింది. అప్పటి నుంచి అంజనీదేవి ఫిజిక్స్ ల్యాబ్‌లోని ఓ గదిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసం ఉంటున్న గది మంగళవారం తెరుచుకోలేదు. కళాశాల సిబ్బందికి అనుమానం వచ్చి గదిని బలవంతంగా తెరిచి చూడగా ఆమె ఫ్యాన్‌కు నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి ఎస్సై శివకుమార్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరకున్నారు. ఆమె మృతదేహాన్ని కిందికి దించి వివరాలు సేకరించారు. అంజనీదేవి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6.20 గంటలకు ఆమె తన తండ్రితో మాట్లాడినట్లు రికార్డయి ఉంది. లెక్చరర్ ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. -
కాలేజీ ల్యాబ్‌లో మహిళా లెక్చరర్ ఆత్మహత్య
ఒంగోలు : ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలోని పిజిక్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న అంజలిదేవి... ల్యాబ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం కళాశాల విద్యార్థులు, సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంజలిదేవి సోమవారం సాయంత్రమే ల్యాబ్‌లో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె అత్యహత్యకు గల కారణాల తెలియరాలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను, కళాశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం అంజిలి దేవి మృతదేహన్ని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య?
అద్దంకి : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో భావిలో శవమై తేలింది. భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పట్టణంలోని గుంజివారిపాలెంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. పంగులూరు మండలం కొప్పరపాడు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, లక్ష్మిల కుమార్తె రేణుక(24)కు పట్టణంలోని గుంజివారిపాలేనికి చెందిన మక్కెళ్ల పిచ్చియ్యతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రేణుక చిన్నప్పటి నుంచి రాజుపాలెం శాంతినగర్‌లో అమ్మమ్మ ధనమ్మ వద్ద పెరిగింది. పిచ్చియ్య వరంగల్ ప్రాంతంలో బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. రెండు నెలల క్రితం భార్య తన అమ్మమ్మ వద్దకు వచ్చి అక్కడే ఉంటోంది. దంపతుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఓ సారి రేణుక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భర్తను చూసేందుకు రేణుక అద్దంకిలోని గుంజివారిపాలేనికి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదుగానీ ఆమె తన భర్త ఇంటికి సమీపంలోని బావిలో శవమై తేలింది. స్థానికులు రేణుక మృతదేహాన్ని గమనించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. వారు వచ్చి తమ బిడ్డను ఆమె భర్తే చంపి బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంటిపై చీర, దుప్పటి ఉండటం.. వాటికి కొద్ది దూరంలో రక్తపు మరకలు, బావి గిలకకూ రక్తం అంటి ఉండటంతో ఆమెది హత్యేనని బంధువులు చెబుతున్నారు. రేణుకను హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతురాలి బంధువులు.. స్థానికులతో కలిసి భర్త పిచ్చియ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అత డిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. రేణుక ఎలా చనిపోయిందో పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
‘సాక్షి’ స్పెల్ బీకి విశేష స్పందన
అద్దంకి : ‘సాక్షి’ స్పెల్ బీ ఇండియా పోటీకి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ‘సాక్షి ’ నిర్వహిస్తున్న స్పెల్ బీ పోటీతో విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలపై పట్టు పెరిగి, సునాయాసంగా మాట్లాడడానికి వీలుకలుగుతోందని అద్దంకి డివిజన్లోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్, బెల్ అండ్ బెనెట్ తదితర పాఠశాలల విద్యార్థులు స్పెల్ బీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. మన మాతృభాష తెలుగు అయినప్పటికీ విద్యార్థులు ఒక్క తెలుగే నేర్చుకుంటే సరిపోదు. ప్రపంచ దేశాల ప్రజలు అధికంగా మాట్లాడే ఇంగ్లిష్ భాషపై పట్టుసాధించాలి. బాగా చదువుకుని విదేశాలకు వెళ్లాలన్నా, ఇక్కడకు వచ్చిన విదేశీయులతో మాట్లాడాలన్నా ఇంగ్లిష్ నేర్చుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేరుస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించిన ‘సాక్షి’.. విద్యార్థుల తల్లిదండ్రులకు తాము చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుని, ఎక్కువ ధర కలిగిన స్పెల్ బీ పుస్తకాన్ని అతి తక్కువ ధరకే విద్యార్థులకు అందజేస్తోంది. ఇంతటితో ఆగకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, నగదు బహుమతులను అందజేసి విద్యార్థుల్లో ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తోంది. ఇందులో భాగంగానే ‘సాక్షి’ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీన మొదటి దశ పరీక్ష, నవంబర్ 9న రెండో దశ పరీక్ష, నవంబర్ 23న మూడో దశ పరీక్ష, డిసెంబర్ 5వ తేదీన చివరి దశ స్పెల్ బీ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి విభాగంలో ఒకటి, రెండో తరగతి, రెండో విభాగంలో మూడు, నాలుగో తరగతి, మూడో విభాగంలో ఐదు, ఆరు, ఏడో తరగతి, నాలుగో విభాగంలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్పెల్‌బీ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. -
ఇచ్చేది గోరంత..చాకిరీ కొండంత
అద్దంకి: మొబైల్ బుక్ కీపింగ్ కోసం తీసుకున్న వీవోలకు ఐకేపీ శాఖ ఇచ్చేది గోరంత, చేయించుకునే పని కొండంత అన్న చందంగా తయారైంది. 2013 జూన్‌లో అప్పటి ప్రభుత్వం జీవో 59ని విడుదల చేసింది. దీని ప్రకారం వీవోలకు సెర్ప్ నుంచి నెలకు 2 వేల సేవా రుసుము ఇస్తామని ప్రకటించినా ఇంత వరకు ఇవ్వలేదు. వీవోల నియామకం ఇలా.. మొబైల్ బుక్ కీపింగ్ కోసం ఐకేపీ 2012లో ప్రతి వీలేజ్ ఆర్గనైజేషన్‌కు ఒకరు చొప్పున జిల్లాలోని 56 మండలాల్లో 2200 వీవోలను నియమించారు. అప్పట్లో వీరి పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల వివరాలను మొబైల్లో నమోదు చేసినందుకు ఒక్కో గ్రూపునకు 50 ఇచ్చేవారు. ప్రతి వీవోలో 25 నుంచి 30 డ్వాక్రా సంఘాలుండగా నెలకు ఒక సారి మొబైల్ బుక్ కీపింగ్ చేసినందుకు గాను వీరికి 1500 వచ్చేవి. అదనపు పనులు... మొబైల్ బుక్ కీపింగ్ కోసం తీసుకున్న వీవోల చేత ఈ పనితోపాటు తరువాత ప్రభుత్వం ద్వారా గ్రామ స్థాయిలో నడుస్తున్న పథకాల పనిలోనూ, బ్యాంక్ రుణాలు, రుణాల రికవరీ, స్త్రీ నిధి, ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జేబీవై, ప్రభుత్వ సంబంధ పనుల పత్రాల తయారీని కూడా చేయిస్తున్నారు. ఉపకార వేతనాల పంపిణీ, అర్హుల గుర్తింపు, ఇదంతా వీవోలకు అదనపు పనిభారమే. 2013లో జీవో నంబర్ 59 విడుదల.. గత ప్రభుత్వం 2013లో వీవోలకు అదనపు పనిభారం ఉందని తెలిసి వారి కోసం జీవో నంబర్ 59ని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి వీవోకు సెర్ప్ నుంచి *2 వేలు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి మొబైల్ బుక్ కీపింగ్ ద్వారా 50 వంతున వచ్చే 1500, వీవో పుస్తకాలు రాసినందుకు ఇచ్చే *300లతో కలుపుకుని మొత్తం *4 వేలు అందజేయాలనేది లక్ష్యం. కానీ సెర్ప్ ద్వారా ఇవ్వాల్సిన 2 వేలను 15 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఇవ్వకపోవడంపై వీవోలు ఆగ్రహించి సమ్మెలోకి వెళ్లారు. వీవోల డిమాండ్లు ఇవీ... అదనపు పనికి సర్వీస్ చార్జి, 15 నెలల వేతన బకాయిల విడుదల, ఉద్యోగ భద్రత, వీవోలను ఐకేపీ ఉద్యోగులుగా గుర్తించడం, రాజకీయ వత్తిళ్ల నుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు మేలు చేకూరుస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం వీవోల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీవోల పనిభారాన్ని గమనించి వారి డిమాండ్లను పరిష్కరిస్తుందో లేదో, వేచి చూడాల్సిందే. -
విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ
అద్దంకి : ఏ పంటయినా సరే విత్తన శుద్ధి చేస్తే కొన్ని రకాల తెగుళ్లను మొదట్లోనే నివారించవచ్చు. విత్తనాలను శుద్ధి చేయకుంటే పంట ఎదుగుదల, దిగుబడి తగ్గి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పంట దిగుబడి పెంచుకోవడానికి విత్తన శుద్ధి కూడా చక్కని మార్గం. విత్తనం ద్వారా సోకే రసం పీల్చే పురుగులను.. శుద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అదుపు చేసుకోవచ్చని అద్దంకి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు కుప్పయ్య(88866 12945) తెలిపారు. విత్తనాలను శుద్ధి చేసే విధానంపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : ఏఏ విత్తనాలను శుద్ధి చేసుకోవచ్చు ? జవాబు : అన్ని రకాల విత్తనాలను శుద్ధి చేయవచ్చు. ప్ర : వరిలో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి? జ : వరి విత్తనాలను రెండు పద్ధతుల్లో శుద్ధి చేసుకోవచ్చు. పొడి విత్తన శుద్ధి : వరి విత్తనాలను అంటుకుని ఉన్న శిలీంద్రాల నివారణ కోసం 2.గ్రా కార్బండిజమ్ మందును ఒక కిలో విత్తనానికి కలిపి 24 గంటల తర్వాత చల్లుకోవాలి. తడి విత్తన శుద్ధి : ఒక గ్రాము కార్బండిజమ్ మందును లీటరు నీటిలో కలిపి అందులో కిలో వరి విత్తనాలను 12-24 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మడిలో చల్లుకోవాలి. ప్ర : అపరాల పంటల్లో విత్తన శుద్ధి ఎలా? జ : కంది, మినుము, పెసర పంటలను రసం పీల్చే పురుగులు తొలి దశలోనే నష్టం చేస్తాయి. వీటిని నివారించాలంటే కిలో అపరాల విత్తనాలకు 30 మి.లీ కార్బోసల్ఫాన్ మందును లేదా 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మి.లీ మోనోక్రోటోఫాస్ మందును విత్తనానికి పట్టించిన తర్వాత, 2.5-3గ్రా. కాప్టాన్‌ను కలిపి శుద్ధి చేయాలి. పొలంలో విత్తే ముందు 200 గ్రా. రైజోబియం కల్చర్‌ను విత్తానానికి పట్టిస్తే అధిక దిగుబడి పొందవచ్చు. కిలో కంది విత్తనాలకు 8 గ్రా. ట్రైకోడెర్మావిరిడీని కలిపి శుద్ది చేసుకోవాలి. -
మీ సేవ ద్వారా బీఎస్ఎన్ఎల్ బిల్లులు!
అద్దంకి : జిల్లాలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల బిల్లులను త్వరలో మీ సేవ ద్వారా వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ మునీంద్రనాథ్ తెలిపారు. స్థానిక గీతా మందిరంలో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటు సమస్యలను తెలుసుకున్నారు. పలువురు వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సర్వీసు ఇటీవల సరిగా పనిచేయడం లేదని, టవర్ల సిగ్నల్స్ కొన్ని చోట్ల ఉండడం లేదని జీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై మునీంద్రనాథ్ మాట్లాడుతూ.. సిగ్నల్ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చోట కొత్త టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 50 టవర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. త్రీజీ సేవలను త్వరలో అందిస్తామని వెల్లడించారు. కొత్త టవర్ల ఏర్పాటు వల్ల పరిధి పెరగడంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను 198కి తెలియజేయాలని కోరారు. కొత్త టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్థానిక ప్రజలు అద్దెకు ఇస్తే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం హెచ్ఆర్ జీ సుబ్బారావు, డీజీఎం ఫైనాన్స్ జయకుమార్, ఎస్డీఈ సత్యవర్థన్, జేటీఓ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆధార్‌లో తప్పుల సవరణ ఇలా..
అద్దంకి: ఆధార్‌కార్డు బాధలు తప్పాయిరా దేవుడా అనుకుంటున్న లోపే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆధార్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడివారు అక్కడ ఆధార్ కార్డు నమోదు కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్డుల్లో వివిధ వివరాలు తప్పులుగా నమోదవుతున్నాయి. అయితే వీటిని సవరించుకొనేందుకు అవకాశం ఉంది. కానీ కార్డులో ఫొటో మాత్రం మార్పు చేయలేం. పేరు, స్త్రీ పురుష లింగాలు, పుట్టిన తేదీ, చిరుమనా, ఫోన్ నంబర్లను తిరిగి మార్పు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం... htpp:uidai.gov.in/updateyouradhaardata.htmను క్లిక్ చేయాలి. తరువాత కొన్ని ముఖ్య సూచనలు వస్తాయి. వాటిని బాగా చదవాలి. అనంతరం అప్డేట్, కరెక్షన్, రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ల మీద క్లిక్ చేయాలి. మీకు నచ్చిన ఆప్షన్లో ఆధార్ కార్డు నంబరును ఎంటర్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి. ఈ సమయంలో మీ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీనిని ఎంటర్ చేయగానే మీరు కార్డులో ఏమి మార్పు చేయదలచుకున్నారో ఆ వివరాలపై క్లిక్ చేయాలి. తరువాత సంబంధించిన ఫారం డిస్ప్లే అవుతుంది. ఆ ఫారాన్ని పూర్తి చేశాక సబ్మిట్, అప్డేట్, రిక్వెస్ట్ ఆప్షన్లను క్లిక్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఆప్షన్లో మార్పు చేయాలనుకుంటున్న పత్రాలను అప్లోడ్ చేయాలి. మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకుని ఎంటర్ చేయాలి. ఇప్పడు మీకు అప్డేట్ రిక్వెస్ట్ నంబరు వస్తుంది. ఈ నంబరులో మీ ఆధార్ కార్డులో ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానం (పోస్ట్ ద్వారా) htpp:uidai.gov.in/images/applicationform11102012pdfను క్లిక్ చేస్తే సంబంధిత ఫార ం వస్తుంది. దానిలో మీ వివరాలు నమోదు చేసి సంబంధిత దరఖాస్తును జతచేయాలి. నిర్దేశిత కాలంలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి. ఒక ఎన్వోలప్పై రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్డేట్ అండ్ కరక్షన్ అని రాసి పాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి. ఆన్ లైన్ విధానంలో ఫారం పూరించే సమయంలో కొన్ని ఆప్షన్లు, గ్రామం, పిన్‌కోడ్, టౌన్, సిటీ, జిల్లా, రాష్ట్రం వివరాలు రాకుంటే పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అటెస్ట్ చేయాల్సిన విషయంలో రెండు విధానాలూ ఒకేరకంగా ఉంటాయి. సూచనలు- జాగ్రత్తలు వన్‌టైమ్ పాస్‌వర్డ్‌కు కేవలం 15 నిముషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ఫారం పూర్తి చేసేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే, సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్ పెట్టి కీ బోర్డులోని ట్యాబ్బార్ను ప్రెస్ చేయాలి. ఇప్పడు కొన్ని ఆప్షన్లు వస్తాయి. వీటిలో సరైనది సెలక్ట్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల్లో ఒకరి సంతకం సరిపోతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు రిఫ్రెష్ చేయకూడదు. పేరుకు ముందు ఎలాంటి హోదాలు, వివరాలు చేర్చకూడదు. ఉదాహరణకు, డాక్టర్, శ్రీ, శ్రీమతి వంటివి. అడ్రెస్ స్పష్టంగా ఉండాలి. పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఒక్కసారే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబరు మార్పు మాత్రం ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుంది. -
రుణమాయ
అద్దంకి: తీసుకున్న రుణాలను నెలనెలా కంతుల వారీగా క్రమం తప్పకుండా చెల్లిస్తున్న డ్వాక్రా సంఘ మహిళలకు ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన రుణమాఫీ ప్రకటన ఆశలు రేకెత్తించింది. అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న బాబు మాటలు నమ్మిన మహిళలు..లక్ష రుణ మాఫీ ప్రకటనతో నట్టేట మునిగారు. కొందరు ఒకడుగు ముందుకేసి పొదుపు నగదు కూడా చెల్లించకుండా నిలిపేయడంతో వారికి బ్యాంకుల నుంచి రుణం వచ్చే అవకాశాలు కోల్పోయారు. లక్షకు పైగా రుణం తీసుకున్న సంఘాల మహిళలు నిలిచిన నాలుగు నెలల కంతులతోపాటు వడ్డీని కూడా చెల్లించాలని అధికారులు ఆదేశించడంతో ఖంగుతిన్నారు. వడ్డీ చెల్లించకుంటే వారికి తరువాత రుణాలు ఇవ్వమనే ప్రకటనతో తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ ప్రాంతాలతో కలిపి మొత్తం 55,563 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీరంతా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటనతో నాలుగు నెలలుగా వెయ్యి కోట్ల రూపాయల రుణాలు కంతులు చెల్లించకుండా నిలిపేశారు. అద్దంకి నియోజకవర్గంలో 5,150 గ్రూపులకు సంబంధించి రూ.100 కోట్ల రుణాల బకాయి నిలిచిపోయింది. ప్రతి స్వయం సహాయక సంఘంలో పది మంది మహిళలుంటారు. వీరికి సంఘ సీనియారిటీని బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తారు. తీసుకున్న రుణాన్ని సభ్యులు సమంగా పంచుకుని 60 నెలల్లో అంటే ఐదేళ్లలో నెలవారీగా కంతుల రూపంలో చెల్లిస్తారు. కంతులు చెల్లించిన వెంటనే ఏ నెలకు ఆనెల వడ్డీని వారి ఖాతాలకు జమ చేస్తారు. ఈ విధానాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. కానీ చంద్రబాబు మాయ మాటలు నమ్మడంతో నేడు వారిపై వడ్డీ భారం పడనుంది. రుణాలు మాఫీ అయ్యేది రూ.400 కోట్ల లోపే.. రాష్ట్రప్రభుత్వ ఇటీవల ప్రకటించిన లక్ష రూపాయల రుణ మాఫీ... లక్ష లోపు రుణం ఉన్న మహిళా సంఘాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ లెక్కన జిల్లాలో లక్ష రుణం తీసుకున్న సంఘాలు తక్కువగానే ఉంటాయి. లక్షకు పైన రుణం ఉన్న సంఘాల మహిళలకు ఈ మాఫీ వర్తించదు. అంటే జిల్లా వ్యాప్తంగా రుణమాఫీతో సుమారుగా రూ.400 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. వడ్డీ చెల్లించకుంటే తరువాత తీసుకున్న రుణానికి రాయితీ వర్తించదు..నాలుగు నెలలుగా నిలిచిన రుణాల కంతులకు వడ్డీతోపాటు చెల్లించకుంటే తరువాత ఆ సంఘాలకు వడ్డీ రాయితీ వర్తించదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై మహిళలకు ఐకేపీ అధికారులు అవగాహన కల్పించి ఆ ముప్పును తప్పిస్తే తప్ప వారికి వడ్డీ రాయితీ వ చ్చే అవకాశాలు మూసుకుపోనున్నాయి. గతంలో నిలిచిన సంఘాల రాయితీ నగదు హుళక్కేనా? గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక లోపాల కారణంగా కొన్ని సంఘాలకు వడ్డీరాయితీ నిలిచిపోయింది. ఇప్పటికీ వడ్డీ రాయితీ సొమ్ము వారి ఖాతాలకు జమ కాలేదు. ఈ క్రమంలో రుణమాఫీ ప్రకటనతో ప్రస్తుతం ఉన్న సంఘాలకు వడ్డీ రాయితీ వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. రుణ మాఫీపై స్పష్టత ఏదీ.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన చేసినా దానిపై స్పష్టత లేదు. ఇంత వరకు సంబంధిత శాఖ అధికారులకు విధివిధానాలతో కూడిన జీవోలు జారీ కాలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఐకేపీ అధికారులు మాత్రం నాలుగు నెలలుగా మహిళలు నిలిపేసిన రుణాల కంతులు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే వారికి తరువాత వడ్డీ లేని రుణం మంజూరు కాదని తేల్చి చెబుతున్నారు. -
విదేశాల్లో ఉన్నందువల్లే సమీక్షకు గైర్హాజరు
అద్దంకి : తాను విదేశాల్లో ఉన్నందువల్లే ఒంగోలులో గురువారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశానికి హాజరుకాలేకపోయానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. ‘నేను కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాను. సమావేశాలు జరిగే విషయం ముందుగా తెలియకపోవడం వల్ల రాలేకపోయానే తప్ప మరే కారణం లేదు. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశా. నేను సమావేశానికి రాని విషయాన్ని సాకుగా చూపి..ఎందుకు రాలేదు? వేరే పార్టీకి వెళతారా అంటూ కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. అటువంటి అసత్య ప్రచారాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. బలమైన ప్రతిపక్షంగా ఉండి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సార థ్యంలో ప్రజల సమస్యలపై పోరాడతాం. మళ్లీ ప్రజల మన్ననలు పొంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం’ అని చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్లపై రగడ
అద్దంకి, న్యూస్‌లైన్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో తలెత్తిన వివాదం శనివారం ఉపాధ్యాయుల ధర్నాకు దారితీసింది. అధికారులు రోజుకో మాట మార్చడంతో సుమారు 300 పోస్టల్ ఓట్లు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఏ మండలంవారు ఆ మండలంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయాలని అధికారులు తొలుత సూచించారు. దీంతో సుమారు 1000 వరకూ ఆయా మండలాల్లో పోలయ్యాయి. ఇంకా 300 పోస్టల్ ఓట్లు పోలవ్వాల్సి ఉన్నాయి. వీటిని అద్దంకిలోనే వేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు శుక్రవారం అద్దంకి రాగా వారికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాలెట్ ఓట్లు చేతికి ఇవ్వమని, పోస్టులో పంపిస్తామని అధికారులు సెలవిచ్చారు. దీంతో ఖంగుతిన్న ఉపాధ్యాయులు తహసీల్దార్ జీ సుజాత దృష్టికి తీసుకెళ్లగా శనివారం ఉదయం వస్తే బ్యాలెట్ పేపర్లు చేతికిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఉపాధ్యాయులు కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారులు కనిపించలేదు. ఉన్నతాధికారులకు ఫోన్ చేయగా బ్యాలెట్ పేపర్లు పోస్టులోనే పంపుతామ ని సెలవిచ్చారు. దీంతో ఆగ్రహించిన ఉ పాధ్యాయులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ వీవీ రమణకుమార్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సుజాతతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్వో ఆదేశాలు అలానే ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో శని, ఆదివారాలు సెలవులు కావడంతో పోస్టల్ బ్యాలెట్లు అందే అవకాశం లేదని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఓట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఓట్లు చెల్లకుండా పోతే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులు వెనుదిరిగారు. గంగాధర్, బాబూరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
ప్రచార హోరు
ఊపందుకున్న మున్సి‘పోల్స్’ ప్రచారం ఇక మిగిలింది రెండు రోజులే {పచారంలో వైఎస్సార్ సీపీ ముందంజ మద్యం, డబ్బు పంపిణీలో టీడీపీ కాంగ్రెస్ శ్రేణుల్లో నిస్తేజం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి మరో రెండు రోజుల్లో తెరపడనుండటంతో, అభ్యర్థులు ఓట్ల వేటలో తలమునకలై ఉన్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. చీరాల, మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకి, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. చీరాలలోని 33 వార్డులకు గాను 161 మంది, మార్కాపురంలో 30 వార్డులకు గాను 92 మంది, అద్దంకిలో 20 వార్డులకు గాను 68 మంది, కనిగిరిలోని 20 వార్డులకు 105 మంది, గిద్దలూరులో 20 వార్డులకు 88 మంది, చీమకుర్తిలోని 20 వార్డులకు 78 మంది మొత్తం 592 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమ కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. పార్టీ తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో పర్యటించారు. పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరించారు. వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారం చేపడుతున్నారు. ఆయన మంగళవారం మార్కాపురంలో ప్రచారం చేశారు. టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకులెవరూ ప్రచారానికి రాకపోవడంతో జిల్లాలోని నాయకులు మాత్రమే తూతూమంత్రంగా ప్రచారం చేస్తున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన డబ్బును పంచే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు ఓటర్లకు చీరలు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. కనీసం అన్ని వార్డుల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి, జేడీశీలం తదితరులు బస్సుయాత్ర చేస్తూ సోమవారం ఒంగోలు వచ్చారు. అంతమంది కలిసొచ్చినా.. ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించారు. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎటూ ప్రచారం చేయకుండా మౌనంగా ఉన్నారు. -
జనహోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర శనివారం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాలల్లో జరిగింది. బహిరంగ సభలు, రోడ్‌షోల్లో వేలాది మంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహానేత వైఎస్సార్ తనయకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర జిల్లాలో మూడోరోజు శనివారం అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో సాగింది. గుంటూరు జిల్లా నుంచి ఉదయం అద్దంకి చేరుకున్న షర్మిలకు సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. షర్మిల వెంట వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వేలాదిమందినుద్దేశించి ఆమె ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన మద్దతు వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అద్దంకి అభివృద్ధి చెందాలన్నా..ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న మృగాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ పాలన ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు పార్టీలో చేరారు. అద్దంకిలో సమావేశం ముగిసిన అనంతరం మార్గమధ్యంలో షర్మిల తనకోసం వేచి ఉన్న వికలాంగులను కలుసుకున్నారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకున్నారు. తిరిగి సాయంత్రం పర్చూరు వచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తన పాలనలో జరిగినవి చెప్పకుండా వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తాను చేపడతానని చెప్పుకుంటున్నాడని అన్నారు. పులిని చూసి నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా..నక్క నక్కే అవుతుంది కానీ పులికాదని అన్నారు. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి అపూర్వస్పందన లభించింది. సభానంతరం జనభేరి యాత్ర చీరాల చేరుకుంది. మార్గమధ్యంలో కారంచేడులో షర్మిల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. రాత్రి 9 గంటలకు చీరాల చేరుకున్న ఆమె పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. తొలుత నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని పాలన రాష్ట్రంలో వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పాలేటి రామారావు, పార్టీ నాయకులు అవ్వారు ముసలయ్య, కన్నేటి వెంకటప్రసాద్, వరికూటి అమృతపాణి తదితరులు పాల్గొన్నారు. అభిమానుల కోలాహలంతో దారిపొడవునా ఆమెకు ఘన స్వాగతం లభించింది. -
పరీక్షలు ప్రశాంతం
పరీక్షలు ప్రశాంతం అద్దంకి, : పట్టణంలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 1352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 852 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 500 మంది గైర్హాజరయ్యారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీ రవీందర్ పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్డీసీ రవీందర్ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని కట్టా రామకోటేశ్వరరావు కళాశాల సెంటర్లో 312 మందికి 190 మంది, గోవిందాంబికా పరమేశ్వరి కళాశాలలో 348 మందికి 225 మంది, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో 308 మందికి 189 మంది, విశ్వభారతిలో 264 మందికి 170 మంది, ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 120 మందికి 78 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా పరీక్షకు అనుమతించడంతో చాలా మందికి మేలు జరిగిందన్నారు. విశ్వభారతీ కళాశాలలో ఒక విభిన్న ప్రతిభా వంతునికి, కేఆర్కే డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసిన ఒక అంధ అభ్యర్థినికి ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు. కట్టా రామకోటేశ్వరరావు డిగ్రీ కళాశాలలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు పట్టణంలోని భవిష్య పాఠశాల యాజమాన్యం ఉచితంగా రెండు బస్సులు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎంపీడీఓ కృష్ణమోహన్, ఎంఈఓ విజయకుమార్ లైజనింగ్ అధికారులుగా, వ్యవసాయాధికారి కే రమేష్, పంచాయతీ రాజ్ ఏఈలు రామ్ కుమార్, జే రవిబాబు, ఎంవీ నాగేశ్వరరావు, ఈఓపీఆర్డీ కవితా చౌదరి అసిస్టెంట్ లైజనింగ్ అధికారులుగా వ్యవహరించారు. పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లోని కేఆర్కే డిగ్రీ కళాశాల సెంటర్‌ను, ప్రకాశం జూనియర్ కళాశాల సెంటర్లో పరీక్షలను జెడ్పీ సీఈఓ ప్రసాద్ పరీశీలించారు. -
అద్దంకిలో రక్త చరిత్ర
-
అద్దంకిలో ఫ్లెక్సీ వివాదం
-
ప్రకాశం జిల్లా వాసికి రూ.కోటి ఫెలోషిప్
హైదరాబాద్: ప్రతిభతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి ఫెలోషిప్‌నకు ఓ తెలుగు యువకుడు అర్హత సాధించాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కుమ్మిత రామకృష్ణారెడ్డి జపాన్‌లోని యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ పోస్ట్‌డాక్టొరల్ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. 200 మంది పోటీపడగా రామకృష్ణారెడ్డితో పాటు మరొకరు మాత్ర మే అర్హత సాధించారు. ఆయన ప్రస్తుతం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఫెలోషిప్ కింద ‘సోషల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి’ అంశంపై రెండేళ్ల పాటు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అత్యల్ప వృద్ధి ఉన్న పది దేశాల్లో పరిశోధన చేయనున్నారు. ఇందుకోసం ఆయనకు రూ.కోటి ఫెలోషిప్‌గా అందుతుంది. రామకృష్ణారెడ్డి ప్రకాశం జిల్లాలో ఇంటర్, కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. నిర్లక్ష్యానికి గురైన సామాజిక సమస్యల పరిష్కారానికి సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్ చేస్తున్న కృషిని అర్థం చేసుకుని, విభిన్న చర్యల ద్వారా సుస్థిర అభివృద్ధికి, ఐక్యరాజ్యసమితి విధాన రూపకల్పనకు తన పరిశోధన ఉపయోగపడుతుందని రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.