
సాక్షి, అద్దంకి (ప్రకాశం): టీడీపీ ప్రభుత్వం వృద్ధులకు పింఛన్ పెంచాం. అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పే మాటల్లో నిజంలేకుండా పోయింది. వృద్ధులకు ఆసరా కల్పించడం కోసం ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛన్ పథకం అర్హులకు అందనంత ఎత్తుకుపోయింది. అర్హత ఉన్నా జన్మభూమి కమిటీలు పేరు ప్రతిపాదిస్తేనే పించన్ మంజూరు కాని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 65 ఏళ్లు నిండిన వారు 5వేల మందికి పైగా ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకున్నా ఏదో ఒక సాకుతో వారికి పింఛన్ రాలేదు.
విధి వంచించిన మహిళపై కరుణ లేదు..
జె.పంగులూరు: మండలంలోని ముప్పవరం గ్రామానికి చెందిన తిరుమల శెట్టి నాగేశ్వరమ్మ భర్త సింగయ్య వీరికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురుకి తన తహత కొద్ది కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసింది. కొన్ని సంవత్సరాలు కూతుళ్ల కాపురం సజావుగానే సాగింది. కుటుంబాలు చూసి వారి మనవళ్ళు చూసి తల్లిదండ్రులు ఎంతో సంబర పడ్డారు. కాని విధి అడిన వింత నాటకంలో వారి అనందరం ఎంతో కాలం నిలవలేదు. పెద్దకుమార్తె పి రమాదేవి చదలవాడ హనుమంతురావుకి ఇచ్చి వివాహం చేసింది. కాని హనుమంతురావు ప్రమాదంలో చనిపోయాడు. వీరి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వీరి పోషనం ప్రస్తుతం అమ్మ అయిన నాగేశ్వరమ్మ చూసుకోవాల్సి వస్తోంది. ఇక మూడో అమ్మాయి ఎస్.రమ్యకృష్ణ ను చిలకలూరిపెట్ట వద్దగల మిట్టపాలెంకు చెందిన నవీన్ కు ఇచ్చి వివాహం చేసింది. వీరి దంపతులకు ఒక అబ్బాయి. అబ్బాయి పుట్టిన సంవత్సరానికి మూడవ అల్లుడు నవీన్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. భర్త మరణం తట్టుకో లేక రమ్యకృష్ణ మతి స్థ్ధిమితం కొప్పోయింది.
రమ్యకృష్ణ తల్లి మతిస్థిమితం లేని రమ్యకృష్ణను, ముందు కుమార్తె అయిన ఇద్దరు మనవరాళ్లను, మనవడి పోషణ భారం నాగేశ్వరమ్మ పై పడింది. కూలి నాలి చేసుకొని ఇద్దరు మనవరాళ్ల్లను, కుమార్తెలు చూసుకుంలూ బాధపడుతూ నాగేశ్వరమ్మ కాలం వెళ్ల్లబుచ్చుతోంది. భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతున్నా రమ్యకృష్ణకు వితంతు పింఛన్ వచ్చిన దాఖలాలు లేవు. రేషన్ కార్డు కోసం, పింఛన్ కోసం ఎక్కని ఆఫీసు మెట్లు లేవు, మొక్కని నాయకుడు లేడు. ఎవ్వరూ మమ్మలను పటించు కోవటం లేదని రమ్మకృష్ణ తల్లి నాగేశ్వరమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వీరంతా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆర్హుడైన ప్రతి పేదవానికి కనీస అవసరాలు తీరతాయని నమ్ముతున్నారు.
అర్హులకు అన్యాయం జరిగింది..
నా వయసు 70 సంవత్సరాలు, ఐదేళ్లుగా ప్రతి ఏటా పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నా. రాజకీయాలు చేసి నా పేరు జాబితాలో లేకుండా చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య పింఛన్ అర్హులకు అన్యాయం జరిగింది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే నాకు పింఛన్ వస్తుందని ఆశపడుతున్నా. ఆయన మాటలను విశ్వసిస్తున్నా. 60 ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పడం వృద్ధులకు అసరాగా ఉంటుంది.
- శివరాత్రి అంజయ్య, ముక్వేశరం, బల్లికురవ మండలం
రాజశేఖరరెడ్డి హయాంలో చేతికిచ్చారు..
నాకు వేలుముద్ర పడటం లేదని పింఛన్ ఇవ్వడం లేదు. నా వయసు 85 సంవత్సరాలు రాజశేఖరరెడ్డి హయాంలో చక్కగా చేతికిచ్చారు. ఇప్పడేమో రకరకాల సాకులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నవ రత్నాల పథకంలో ఒకటైన పింఛన్ పథకం ప్రవేశపెడతానన్నాడు. ఆయన పింఛన్ రూ.3 వేలు చేస్తానని చెప్పాడు. ఆ మాటలను విశ్వసిస్తున్నాం. ఆ పార్టీ అధికారంలోకి రావాలని దేవుడ్ని వేడుకుంటున్నాం.
–కూరపాటి కోటం రాజు, దేనువుకొండ, అద్దంకి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోసం ఎదురు చూపులు..
అధికార పార్టీ అర్హులంటూ అర్హత ఉన్న వారికి పింఛన్ ఇవ్వలేదని వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే నవరత్నా పథకాల్లో ఒకటిగా ప్రకటించిన రూ.3 వేల పింఛన్ చేస్తామని ప్రకటించాడని, ఆయన మాటలను విశ్వసిస్తున్నామంటున్నారు.