
సాక్షి, అద్దంకి: సెంటు భూమి లేని ఓ నిరుపేద పేరిట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఎకరాల భూమి ఉన్నట్లుగా మీ భూమి పోర్టల్‌లో చూపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి అమ్మ ఒడి పథకానికి అనర్హుడయ్యాడు. వివరాలు.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన దాసరి బుల్లెయ్యకు ఒక కుమారుడున్నాడు. అమ్మ ఒడి పథకం కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు రిజక్ట్ అయింది. ఎందుకైందని పరిశీలిస్తే నీ పేరిట 12 ఎకరాల భూమి ఉందని చెప్పారు.
దీంతో అవాక్కయిన బల్లెయ్య మీ భూమి అడంగల్ వెబ్‌సైట్‌లో పరిశీలించగా, బుల్లెయ్య ఆధార్ నంబరుతో, ఖాతా నంబరు 2408 పేరుతో దక్షిణ అద్దంకిలోని వీరభద్రస్వామి దేవస్థానానికి చెందిన 1353/2, 1354 సర్వే నంబర్లకు సంబంధించి 12.64 ఎకరాలు భూమి ఉన్నట్లుగా చూపిస్తోంది. దీంతో బుల్లెయ్య లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తనకు సెంటు భూమి కూడా లేకున్నా ఇదేమిటని వాపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment