mee bhoomi
-
హవ్వ.. నిరుపేదకు 12 ఎకరాలా?
సాక్షి, అద్దంకి: సెంటు భూమి లేని ఓ నిరుపేద పేరిట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఎకరాల భూమి ఉన్నట్లుగా మీ భూమి పోర్టల్‌లో చూపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి అమ్మ ఒడి పథకానికి అనర్హుడయ్యాడు. వివరాలు.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన దాసరి బుల్లెయ్యకు ఒక కుమారుడున్నాడు. అమ్మ ఒడి పథకం కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు రిజక్ట్ అయింది. ఎందుకైందని పరిశీలిస్తే నీ పేరిట 12 ఎకరాల భూమి ఉందని చెప్పారు. దీంతో అవాక్కయిన బల్లెయ్య మీ భూమి అడంగల్ వెబ్సైట్లో పరిశీలించగా, బుల్లెయ్య ఆధార్ నంబరుతో, ఖాతా నంబరు 2408 పేరుతో దక్షిణ అద్దంకిలోని వీరభద్రస్వామి దేవస్థానానికి చెందిన 1353/2, 1354 సర్వే నంబర్లకు సంబంధించి 12.64 ఎకరాలు భూమి ఉన్నట్లుగా చూపిస్తోంది. దీంతో బుల్లెయ్య లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తనకు సెంటు భూమి కూడా లేకున్నా ఇదేమిటని వాపోతున్నాడు. -
మీ భూమి జాగ్రత్త
రాష్ట్రంలో చిన్న రైతుల భూములకు రక్షణ కరువైంది. ఒకవైపు భూసేకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల ఎకరాలు గుంజుకుంటుండగా మరోవైపు అధికార పార్టీ నాయకులు రెవెన్యూ రికార్డులను మార్చేసి ఇతరుల భూములను దర్జాగా కాజేస్తున్నారు. అసైన్డ్ భూములు సైతం వారి చేతుల్లోకే చేరిపోతున్నాయి. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం దాతలు ఇచ్చిన ఈనాం భూముల్లోనూ టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోతు న్నారు. ’మీభూమి’ వెబ్సైట్లో భూ యజమానుల వివరాలు రాత్రికిరాత్రే మారిపోవడం రైతులను కలవరపెడుతోంది. పట్టాదారు పాసుపుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు ఉన్నప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో మాత్రం ఇతరుల పేర్లతో ప్రత్యక్షమవు తున్నాయి. స్థానికంగా నివాసం లేని వారి భూములపై కన్నేసిన కబ్జాదారులు కొందరు అధికారుల సాయంతో రికార్డులను తారుమారు చేస్తున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. లక్షల ఎకరాల ప్రైవేట్ భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడం ’మీభూమి’ డొల్లతనాన్ని రుజువు చేస్తోంది. ఈ వెబ్‌ల్యాండ్‌ను ప్రామాణికంగా తీసుకుని పంట రుణాలు ఇవ్వలేమని ప్రభుత్వ రంగ బ్యాంకులే తేల్చి చెబుతున్నాయి. రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకం (ఎఫ్ఎంబీ), భూ అనుభవ రికార్డు (అడంగల్) మధ్య 33 లక్షల ఎకరాలకు పైగా భూముల్లో తేడా ఉండటం రెవెన్యూ రికార్డులు తప్పులతడకలుగా ఉన్నాయనేందుకు నిదర్శనం. భూ వివాదాలు పెరిగి శాంతిభద్రతల సమస్యకు దారి తీయడానికి ఇది కూడా కారణం. రెవెన్యూశాఖ వద్దే భూ రికార్డులు సక్రమంగా లేకుంటే ఇంతకంటే దారుణం ఏముంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెబ్‌ల్యాండ్, భూదార్ అంటూ సర్కారు మాయమాటలు చెబుతూ సామాన్యుల భూ యాజమాన్య హక్కుల భద్రతను దెబ్బ తీస్తోందని రెవెన్యూ, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూ యజమానులకు స్థిరాస్తిపై రక్షణ లేకుండా పోవడంపై ‘సాక్షి’ అందించనున్న వరుస కథనాల్లో ఇది మొదటిది... సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల భూ యాజమాన్య హక్కుల భద్రత డొల్లగా మారిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లో రెవెన్యూ శాఖకు చెందిన ’మీభూమి’ వెబ్‌ల్యాండ్‌లో రాత్రికి రాత్రే భూ యాజమాన్య హక్కులు మారిపోతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తమ భూమి తమ పేరుతోనే ఉందా? లేక ఇతరుల పేరుతో మారిపోయిందా? అని నిత్యం వెబ్‌ల్యాండ్‌లో సరిచూసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని భూ యజమానులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. రికార్డులను ట్యాంపరింగ్ చేస్తూ విలువైన భూములను ల్యాండ్ మాఫియా కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలో భూములను రక్షించుకునేందుకు సామాన్యులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గిరిజన రైతును బలితీసుకున్న టీడీపీ నేత భూదాహం అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల భూ దాహానికి ఓ గిరిజన రైతు బలైపోయాడు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం వేపచెర్ల తాండాకు చెందిన రైతు కేశవ్ నాయక్, శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతమ్మ పేరుతో సర్వే నంబరు 507–2లో 3.21 ఎకరాల భూమిని డీపట్టా కింద ఇచ్చారు. వారు అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శాంతమ్మ పేరుతో బ్యాంకులో రుణం కూడా తీసుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కృష్ణానాయక్ ఆ భూమిని తన పేరుతో ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు. తమ భూమిని టీడీపీ నాయకుడు కృష్ణానాయక్ పేరుతో వెబ్‌ల్యాండ్‌లో ఎలా మార్చారని బాధితురాలి భర్త కేశవ్ నాయక్ రెవెన్యూ అధికారులను సంప్రదించగా తమ చేతిలో ఏమీ లేదని చెప్పారు. బ్యాంకు రుణం చెల్లించాలని నోటీసు జారీ కావడం, రుణం రెన్యువల్ చేయించుకోవాలంటే భూమి తన భార్య పేరుతో లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక కేశవ్‌నాయక్ ఈ ఏడాది ఏప్రిల్ 15న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ♦ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అత్త పేరుతో ఉన్న భూమి వెబ్‌ల్యాండ్‌లో రాత్రికి రాత్రే ఇతరుల పేరుతో మారిపోయింది. ప్రభుత్వ విప్ కుటుంబానికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల భూములకు ఇక రక్షణ ఎక్కడుందని ఆయన ఇటీవల అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. ♦ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన శాంతమ్మకు ప్రభుత్వం ఇచ్చిన 3.21 ఎకరాల అసైన్డ్ భూమి స్థానిక టీడీపీ నేత కృష్ణానాయక్ పేరుతో వెబ్‌ల్యాండ్‌లోకి మారిపోయింది. దీన్ని సరిదిద్దాలంటూ శాంతమ్మ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన పెద్ద కర్రెన్నకు ఉన్న రెండెకరాలు సైతం రెవెన్యూశాఖ వెబ్‌ల్యాండ్‌లో ఇతరుల పేరుతో కనిపిస్తోంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ♦ నివాసం ఉంటున్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లో మీకు భూమి ఉందా? అయితే జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే ఇతరులు తమ పేర్లతో మార్చుకుని దొడ్డిదారిన హక్కుదారులయ్యే ప్రమాదం పొంచిఉంది. ♦ అర్ధబలం, అంగబలం ఉన్నవారి భూముల జోలికి ఎవరూ రారు. ♦ సామాన్యులు తమ భూమిని కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండటం తప్పదు. ♦ కరువు వల్ల వలస వెళ్లి పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న సన్న, చిన్నకారు రైతులు కూడా తమ భూముల విషయంలో ఓ కంట కనిపెడుతూ ఉండాలని జరుగుతున్న పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ♦ రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డుల వెబ్‌ల్యాండ్ ’మీభూమి’లో అనుభవదారులుగా మీపేర్లే ఉన్నాయా? మారాయా? అనే విషయాన్ని తరచూ పరిశీలిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఇతరుల భూములను తమ పేర్లతో మార్చుకుని విక్రయ రిజిస్ట్రేషన్లు చేసిన సంఘటనలు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ♦ అసైన్డ్ భూములను సైతం జిరాయితీ పట్టాల ఖాతాలో వేసి యజమానుల పేర్లు మార్చేస్తున్నారు. ♦ రాష్ట్రంలో భూములున్నా ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిన వారు మరింత జాగ్రత్త వహించాలి. వంశపారంపర్యంగా భూమి సంక్రమించినా సరైన రికార్డులు లేనివారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. భూ మాయలు మా ఖాతా నంబరుపై వేరొకరి పేరు.... నాకు కర్నూలు జిల్లా నరసాపురం సర్వే నెంబరు 531సీ2బిలో రెండు ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు ఖాతా నంబరు 292 కింద పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం (1బి) కూడా 2015లో ఇచ్చారు. ఈ భూమిని ఇప్పుడు నాపేరుతో కాకుండా ఇదే ఖాతా నంబరుతో ఇతరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారు. న్యాయం కోసం తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. –పెద్ద కర్రెన్న, ఎం.పెండేకల్, బేతంచెర్ల మండలం, కర్నూలు జిల్లా భూమి వివరాలు ఆన్లైన్లో లేవు.. మాకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సర్పరాజపురం రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు 327 ఏ2లో 1.53 ఎకరాల భూమి ఉంది. దీనికి పట్టాదారు పాసుపుస్తకం (పట్టా నెంబరు 95) కూడా ఇచ్చారు. మా భూమి ఇప్పుడు ఆన్లైన్లో కనబడటం లేదు. ఆన్లైన్లో భూమి వివరాలు లేనందున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు. రెవెన్యూ అధికారులు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. – పి.మధుసూదన్, ఎం.పెండేకల్, బేతంచెర్ల మండలం, కర్నూలు జిల్లా భూమి నావద్ద ఉండగానే అడంగల్‌లో మార్చేశారు.. నాకు శ్రీకాకుళం మండలం వాకలవలసలో భూమి ఉంది. ఈ భూమికి 24 ఖాతా నెంబరుతో పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది. ఈ ఏడాది బ్యాంకు రుణం కోసం మీసేవ నుంచి అడంగల్ తీసుకోగా నాపేరిట ఉండాల్సిన భూమిని ఇతరులు కొనుగోలు చేసినట్లుగా చూపిస్తోంది. నేను అమ్మకుండానే నాభూమిని ఎవరైనా ఎలా కొంటారు? భూమిని తిరిగి నా పేరిట మార్చాలని తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఏదో ఒక నెపం, కొర్రీలతో దాటవేస్తున్నారు. – కూన నీలయ్య, రైతు, శ్రీకాకుళం మండలం, -
రెవెన్యూ సదస్సులకు సిద్ధం కండి
కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు(అగ్రికల్చర్): రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారానికి జూలై మొదటి లేదా రెండో వారాల్లో ‘మీ ఇంటికి మీ భూమి’ తరహలో సదస్సులు నిర్వహిస్తున్నామని, వీటికి అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ సత్య నారాయణ సూచించారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రెవెన్యూ అధికారుల సదస్సులో కలెక్టర్ పాల్గొని వివిధ అంశాలపై సూచనలు ఇచ్చారు. డివిజన్ వారిగా ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ భూములను నమోదు చేయాలని సూచించారు. 2014 తరువాత ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల్లో అనర్హులు ఉంటే గుర్తించి పట్టాలను రద్దు చేయాలని వివరించారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ..రెవెన్యూ రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయన్నారు. తహసీల్దార్లు జవాబుదారి తనంతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్లు డిజిటల్ కీ లను కంప్యూటర్ అపరేటర్లకు అప్పగించకుండా సొంతంగా నిర్వహించడంతో చాలా వరకు సమస్యలు తగ్గుతాయని పలువురు డిప్యూటీ కలెక్టర్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ2–రామస్వామి, ఆర్డీఓలు హుస్సేన్‌సాహెబ్, ఓబులేష్, రామసుందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, సత్యనారాయణ, సత్యం, అన్ని మండలాల తహసీల్దార్, డీటీలు పాల్గొన్నారు. -
ఇంటికి చేరని రేషన్
- మీ ఇంటికి ... మీ రేషన్ అమలు అంతంతే - మంత్రి సొంత మండలంలోనూ అధ్వానం - 26 మంది ఉంటే 6 మందికే అందిన వైనం అనంతపురం అర్బన్ : జిల్లాలో మీ ఇంటికి.. మీ రేషన్ పంపిణీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. చౌక దుకాణాలకు వచ్చిన రేషన్ తీసుకోలేని కార్డు దారుల ఇంటికి వీఆర్ఓలు నేరుగా వెళ్లి రేషన్ అంచాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ విధానం ఇప్పుడు మొక్కుబడి మారింది. పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత మండలం రామగిరిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1,246 మందిలో 836 మంది పంపిణీ జిల్లా వ్యాప్తంగా 63 మండలాల పరిధిలో ప్రస్తుత నెలలో 1,286 మంది లబ్ధిదారులకు మీ ఇంటికి... మీ రేషన్ ద్వారా సరకులను వీఆర్ఓలు అందించాల్సి ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 836 మంది మాత్రమే సరుకులను వీఆర్ఓలు అందజేశారు. 410 మందికి సరుకులు అందలేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత మండలం రామగిరిలోనూ మీ ఇంటికి... మీ రేషన్ సక్రమంగా అమలు కాలేదు. అక్కడ 26 మందికి మీ ఇంటికి– మీరేషన్ కింద సరుకులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఆరుగురికి మాత్రమే పంపిణీ చేశారు. మరికొన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గార్లదిన్నె మండలంలో ఇద్దరు ఉంటే ఇక్కడ మాత్రమే ఆ ఇద్దరికి అందజేశారు. పదహైదు మండలాల్లో ఫర్వాలేదు అనే విధంగా పంపిణీ జరిగింది. దీన్ని బట్టి చూస్తే విధానం అమలులో చిత్తశుద్ధి లోపించిందనేది స్పష్టమవుతోంది. మచ్చుకు కొన్ని మండలాల్లో పంపిణీ మండలం వీఆర్ఓలకు అప్పగించిన కార్డులు వీఆర్ఓలు పంపిణీ చేసింది సరుకులు అందని సంఖ్య అనంతపురం 147 104 43 ధర్మవరం 60 36 24 గుంతకల్లు 51 13 38 రామగిరి 26 6 20 అమరాపురం 24 7 17 బొమ్మనహళ్ 25 15 10 రొద్దం 34 19 15 తాడిపత్రి 35 21 14 మడకశిర 25 12 13 -
త్వరలో 250 సర్వేయర్ల పోస్టుల భర్తీ
విజయవాడ : త్వరలో 250 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రెండేళ్ల కాలంలో రెవెన్యూ శాఖలో 13 రకాల సంస్కరణలు తీసుకువచ్చామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కొన్నిచోట్ల రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు జరుగుతుందన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. వెబ్ ల్యాండ్ కీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వద్ద ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయని కేఈ అన్నారు. భూముల వివరాలు నేరుగా తెలుసుకునేందుకే మీభూమి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. -
త్వరలో మీ ఇంటికి– మీ భూమి
అనంతపురం అర్బన్ : ‘ మూడోవిడత మీ ఇంటికి– మీ భూమి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది. గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించండి. కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు లైసెన్డ్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోండి.’’ అని సర్వేయర్లను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం స్థానిక డ్వామా హాల్లో సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ మచ్ఛీంద్రనాథ్లో కలిసి మీ ఇంటికి– మీ భూమి అంశంపై సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఏసీ మాట్లాడుతూ మీ ఇంటికి– మీ భూమిలో వచ్చే సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. భూ లోక్ అదాలత్‌లో సర్వే సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనేదానిపై శాఖ అధికారులు, సర్వేయర్లకు స్పష్టత ఉండాలన్నారు. జిల్లాలో 24 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాల్లో గౌరవ వేతనం లైసెన్డ్స్ సర్వేయర్లకు సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇదివరకు వేలుగులో పనిచేసిన సర్వేయర్లకు ఈటీఎస్, ఆటోకాడ్లో శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. మీ కోసం, మీ సేవలో వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. మొక్కుబడి సర్వేను సహించను ప్రజాసాధికార సర్వే మొక్కుబడిగా చేస్తే సహించబోనని అధికారులకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం చెప్పారు. తప్పుల్ని సరిచేసి ఈనెల 10లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి సర్వేపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో తప్పులు చేసిన ఎన్యుమరేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. సూపర్వైజర్లు తప్పని సరిగా వంద శాతం ఈకేవైసీని ఈ నెల 10లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. -
‘మీ ఇంటికి మీ భూమి’లో మెుదటిస్థానం
15 నాటికి సాధికార సర్వే మెుదటిదశ పూర్తి జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ గొల్లప్రోలు: ‘మీ ఇంటికి మీభూమి’ కార్యక్రమం నిర్వహణలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందిందని, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెండో స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయ నిర్మాణానికి ఆయన బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సిబ్బంది చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. ఆన్లైన్ ద్వారా 1,80,600 దరఖాస్తులు రాగా 73 వేల దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కృతమయ్యాయన్నారు. వివిధ కారణాలతో 30,800 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిపారు. ఆన్లైన్ నమోదు, కుటుంబతగాదాలు, ప్రత్యేక కారణాలతో పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆన్లైన్ పనుల్లో సిబ్బంది ప్రలోభాలకు గురవడం వంటి ఆరోపణలు సత్యదూరమన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రెవెన్యూపరమైన సమస్యలను పరిష్కరించడానికి అధికారుల బృందం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పిఠాపురం నియోజకరవర్గానికి సంబంధించి గొల్లప్రోలు మండలంలో చెందుర్తి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. 7, 8, 9 తేదీలలో ఆయా గ్రామాలకు సంబంధించి డెస్క్‌వర్క్ నిర్వహించడం, 10, 11 తేదీలలో సమస్యలను గుర్తించడం, 13న డిప్యూటీ కలెక్టరు ఆధ్వర్యంలో తహసీల్దార్, మండలసర్వేయర్, వీఆర్ఓలు, మీసేవా ఆపరేటర్లు బృందంగా ఏర్పడి తక్షణం సమస్యలు పరిష్కరించడం జరుగుతాయన్నారు. మొదటి దశ ప్రజాసాధికారసర్వే ఈనెల 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఇప్పటి వరకూ 12 మండలాల్లో వందశాతం పూర్తయిందన్నారు. ఇంతవరకూ 28,76,093 కుటుంబాలను సర్వే చేసినట్టు చెప్పారు. 11 ఏజెన్సీ మండలాలు, నెట్‌వర్క్‌లేని మండలాల్లో సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. రెండవ విడతగా కొత్తపల్లి, తాళ్లరేవు, రౌతులపూడితో పాటు కోనసీమలోని 6 మండలాల్లో సర్వే ప్రారంభమైందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వై.జయ, డిప్యూటీ తహసీల్దార్ రామరాజు తదితరులు ఉన్నారు. -
మీ ఇంటికి...మీ రేషన్ అమలు అం‘తంతే’
► పండుటాకులకు అందని సరుకులు ► ఈ నెల 1,343 మంది పంపిణీ చేయని వైనం జిల్లాలో నిస్సహాయులు – 4,190 వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా పంపిణీ– 2,837 సరుకులు అందని నిస్సహాయులు– 1,343 అనంతపురం అర్బన్: నిస్సహాయులు చౌక దుకాణానికి వచ్చి సరుకులు తీసుకుని పోలేని పరిస్థితి. దీంతో చాలా మందికి సమస్యగా మారింది. ఈ క్రమంలో చౌక దుకాణానికి రాలేని వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా ఇలాంటి వారికి రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లాలో ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. జూన్ నెల వరకు సవ్యంగానే సాగింది. అయితే ప్రస్తుత (జూలై) నెలలో మాత్రం నిర్లక్ష్యం చోటు చేసుకుంది. పర్యవసానంగా రేషన్ దుకాణాలకు వెళ్లేలేని స్థితిలో ఉన్న వృద్ధులకు రేషన్ అందలేదు. జిల్లా 1,343 మందికి అందలేదు జిల్లాలో 4,190 మంది నిస్సహాయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరిMీ ప్రతి నెలా 7వ తేదీ నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి వీఆర్ఓలు సరుకులు అందజేయాలి. అయితే ప్రస్తుత నెలలో వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా నిస్సహాయులకు సరుకులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. సీఎం డ్యాష్ బోర్డులో అధికారులు ఉంచిన అధికారిక సమాచారం ప్రకారం 4,190 నిస్సహాయుల్లో 2,847 మందికి మాత్రమే రేషన్ అందించారు. 1,343 మందికి ఇవ్వలేదు. అటు రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకోక, ఇటు వీఆర్ఓలు ఇవ్వకపోవడంతో చాలా మంది సరుకులు పొందలేకపోయారు. జిల్లాలోని 63 మండలాల్లో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా అన్ని మండలాల్లోనూ ఈ నెల పూర్తి స్థాయిలో నిస్సహాయులకు సరకులు అందజేయలేదు. సాంకేతిక కారణాలతో రేషన్ దూరం సాంకేతిక కారణాలను చూపిస్తూ కొందరు నిస్సహాయులకు రేషన్ ఇవ్వడం లేదు. వేలిముద్రలు సరిపోలడం లేదని కొందరికి, ఆధార్ అనుసంధానం కాలేదంటూ మరికొందరికి రేషన్ ఇవ్వడం లేదు. రేషన్ కార్డు ఉండి, వేలిముద్రలు సరిపోలని, ఆధార్ అనుసంధానం కాని వారికి వీఆర్ఓ అథెంటికేషన్ ద్వారా సరుకులు అందజేయాలని మంత్రే స్వయంగా చెప్పినా, వారికి మాత్రం సరుకులు అందడం లేదు. కొందరు రేషన్ షాపుల్లో తీసుకున్నారు నిస్సహాయులుగా ఉన్నవారు కొందరు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకున్నారు. మాకు తెలిసినంత వరకు సరుకులు అందలేదనే ఫిర్యాదులు రాలేదు. ఇప్పటికీ రేషన్ అందని వారికి తక్షణం అందించాలని అధికారులను ఆదేశిస్తాం. – ప్రభాకర్‌రావు, డీఎస్ఓ మచ్చుకు కొన్ని మండలాలు మండలం నిస్సహాయులు ఈ నెల రేషన్ అందుకున్నది రేషన్ అందని వారు కుందుర్పి 254 112 142 ధర్మవరం 298 134 164 అనంతపురం 213 172 41 అమరాపురం 70 38 32 బొమ్మనహాళ్æ 24 10 14 గోరంట్ల 90 48 42 గుమ్మగట్ట 24 11 13 పెనుకొండ 44 22 22 -
పంటలు లేకనే రైతుల ఆత్మహత్యలు: చంద్రబాబు
అనంతపురం: పంటలు పండకనే రాష్ట్ర రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపురులో నిర్వహించిన 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్టాడెల్టాకు నీరందంచి, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తామని చెప్పారు. ఏపీలో 24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. త్వరలో పోలీస్, ఆరోగ్యశాఖలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. -
'రికార్డుల్లో తప్పులకు తహశీల్దార్లదే బాధ్యత'
కర్నూలు రూరల్ : మండల పరిధిలోని భూ రికార్డుల్లో తప్పిదాలు జరిగితే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గురువారం ఆయన కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో జరిగిన 'మీ ఇంటికి- మీ భూమి' కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలని, వివాదాలు రాకూడదని చెప్పారు. రైతులు తమ భూముల వివరాలను సక్రమంగా నమోదయ్యేలా చూసుకోవాలని కోరారు. -
'తెల్లరేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖపట్నం పట్టణంలో ఆయన మంగళవారం దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సౌకర్యంతో రిజిస్ట్రేషన్ తో పని లేకుండానే పెద్దల నుంచి భూమి పిల్లలకు సంక్రమిస్తుంది. తెల్లరేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం లాగ వాడుకోవడానికి వీలుందన్నారు. ఆధార్ ఉంటే నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏపీకి కనీసం ఐదేళ్లైనా ప్రత్యేక హాదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. -
రిజిస్ట్రేషన్ లేకుండా.. వారసత్వం
-
రిజిస్ట్రేషన్ లేకుండా.. వారసత్వం
* త్వరలో చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి * విశాఖలో ‘మీ ఇంటికి మీ భూమి’ ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: తండ్రి సంపాదించిన భూమిని పిల్లలు రిజిస్ట్రేషన్ లేకుండా వారసత్వంగా పొందేలా చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని సోమవారం అనకాపల్లి సమీపంలోని శంకరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే తమ భూమి వివరాలను తెలుసుకునే అవకాశాన్ని ‘మీ ఇంటికి మీ భూమి’ ద్వారా కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ర్టంలో 2.24 కోట్ల సర్వే నంబర్లుండగా..72 లక్షల మంది పట్టాదారులున్నారని చెప్పారు. వీరికి చెందిన భూమి వివరాలు సేకరించి మీ భూమి వెబ్సైట్లో పొందుపరిచేందుకు ఈ నెలాఖరు వరకు అధికారులు సర్వే చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్‌తో రెవెన్యూ రికార్డుల అనుసంధానం చేపట్టామన్నారు. తెల్లరేషన్‌కార్డునే ఆదాయ ధ్రువీకరణపత్రంగా చూపించవచ్చని, ఆధార్‌కార్డులుంటే నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. విశాఖలో నల్లబెల్లంపై దీర్ఘకాలంగా ఉన్న నిషేధం ఎత్తివేత విషయంలో నిబంధనలు సడలిస్తామన్నారు. ఈ సందర్భంగా ‘మీ ఇంటికి- మీ భూమి’ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. విభజన హామీలు నిలబెట్టుకోండి.. విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీకి కనీసం ఐదేళ్ల పాటైనా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరినీ కలుస్తామని చెప్పారు. ఆశా వర్కర్ల నిరసన..: వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభించే సమయంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచాలని.. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని వినతిపత్రమిచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అనుమతించలేదు. దీంతో స్టాల్స్ ప్రారంభించే సమయంలో సీఎం ఎదుట వారు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నినాదాలు చేయొద్దు.. మీలో ఎవరైనా వచ్చి వినతి పత్రమివ్వండని మంత్రులు సూచించడంతో నాయకులు వచ్చి సమస్యలు తెలపగా సీఎం వినతిపత్రం తీసుకుని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ర్ట మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జడ్పీ చైర్పర్సన్ భవానీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
‘మీ ఇంటికి- మీ భూమి’ని ప్రారంభించిన మంత్రి
ప్రకాశం(చీమకుర్తి): ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రంలో మీ ఇంటికి- మీ భూమి’ అనే రెవెన్యూ కార్యక్రమాన్ని మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఆయన కలెక్టర్ సుజాత శర్మతో కలసి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు రైతులకు ఈ- పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో భూమి వివరాలు సరిదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం కింద ఆర్.ఒ.ఆర్, 1బి, ఆధార్ నెంబరు, సర్వే నంబరులలో సవరణల కోసం బహిరంగంగా దరఖాస్తులు స్వీకరిస్తారు. -
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 10 వ తేదీ నుంచి 'మీ భూమి మీ ఇంటికి' కార్యక్రమం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అందులోభాగంగా 20 రోజులపాటు రెవెన్యూ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. కర్నూలు జిల్లాలోపరిశ్రమల ఏర్పాటు కోసం 33 వేల ఎకరాల భూములు కేటాయించామని కేఈ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా తహసీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వనజాక్షి తనకు అందిన బెదిరింపు లేఖను విచారణాధికారికి అందజేయాలని సూచించారు. తహశీల్దార్ వనజాక్షికి రక్షణ కల్పించమని ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. దాంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మతో ప్రభుత్వం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. -
ఒక్క క్లిక్‌తో భూమి లెక్కలు
‘మీభూమి’ పోర్టల్ ప్రారంభించిన సీఎం సాక్షి, హైదరాబాద్: భూముల సమగ్ర వివరాలకు సంబంధించిన ‘మీభూమి’ వెబ్ పోర్టల్‌ను, ఆండ్రాయిడ్ అప్లికేషన్ (యాప్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. రెవెన్యూ శాఖ అధికారులకే పరిమితమైన ‘మీభూమి’ పోర్టల్ ఇప్పుడు ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది. మీభూమి వెబ్పోర్టల్కోసం www.meebhumi.ap.gov.in కు లాగిన్ అవ్వాలి. -
భూముల వివరాలిక రహస్యం కాదు
- త్వరలో ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ పోర్టల్ హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల వివరాలు ఇక రహస్యం కాదు..! ఆ వివరాలన్నిటినీ కంప్యూటీకరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘మీ భూమి’ పేరుతో త్వరలో సీఎం చంద్రబాబు ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. www.meebhumi.apgov.org.in అనే వెబ్సైట్లో భూముల వివరాలను పొందుపరిచింది. వివరాల్లో ఏ తప్పులున్నా.. సంబంధిత వ్యక్తులు మండల తహసీల్దార్‌కు వినతిపత్రమిస్తే 45 రోజుల్లోగా సరిచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.