‘మీ ఇంటికి- మీ భూమి’ని ప్రారంభించిన మంత్రి | Siddha raghava rao is inagurated mee intiki mee bhumi | Sakshi
Sakshi News home page

‘మీ ఇంటికి- మీ భూమి’ని ప్రారంభించిన మంత్రి

Published Mon, Aug 10 2015 4:10 PM | Last Updated on Wed, Aug 29 2018 8:01 PM

‘మీ ఇంటికి- మీ భూమి’ని ప్రారంభించిన మంత్రి - Sakshi

‘మీ ఇంటికి- మీ భూమి’ని ప్రారంభించిన మంత్రి

ప్రకాశం(చీమకుర్తి): ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రంలో మీ ఇంటికి- మీ భూమి’ అనే రెవెన్యూ కార్యక్రమాన్ని మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఆయన కలెక్టర్ సుజాత శర్మతో కలసి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు రైతులకు ఈ- పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంతో భూమి వివరాలు సరిదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం కింద ఆర్.ఒ.ఆర్, 1బి, ఆధార్ నెంబరు, సర్వే నంబరులలో సవరణల కోసం బహిరంగంగా దరఖాస్తులు స్వీకరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement