siddha raghava rao
-
'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు'
విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 2020 నాటికి 50 శాతం ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డుప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వినియోగానికి ప్రజలు సహకరించాలని మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. -
‘మీ ఇంటికి- మీ భూమి’ని ప్రారంభించిన మంత్రి
ప్రకాశం(చీమకుర్తి): ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రంలో మీ ఇంటికి- మీ భూమి’ అనే రెవెన్యూ కార్యక్రమాన్ని మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఆయన కలెక్టర్ సుజాత శర్మతో కలసి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు రైతులకు ఈ- పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో భూమి వివరాలు సరిదిద్దుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం కింద ఆర్.ఒ.ఆర్, 1బి, ఆధార్ నెంబరు, సర్వే నంబరులలో సవరణల కోసం బహిరంగంగా దరఖాస్తులు స్వీకరిస్తారు. -
మనమూ ప్రవేశపన్ను వేద్దామా?
మల్లగుల్లాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విషయంలో తెలంగాణ ప్రభుత్వ బాటలో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏపీకి ఎంత ఆదా యం సమకూరుతుందనే అంశంపై రవాణాశాఖ ఆరా తీస్తోంది. తెలంగాణకు 3 నెలలకుగాను రూ.90 కోట్ల మేర ప్రవేశ పన్ను రూపం లో ఆదాయం సమకూరుతుందని అం చనా వేస్తుండగా, ఏపీకి ఎంతమేరకు ఆదా యం వస్తుందనే లెక్కల్లో రవాణా అధికారులు తల మునకలయ్యారు. తెలుగు రాష్ట్రాలు కలసి అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ పెద్దలు ఓ వైపు చెబుతూ తెలంగాణ విధానాన్ని అనుసరించ డం కరెక్టు కాదని పలువురు చెబుతున్నారు. తెలంగాణపై గవర్నర్‌కు శిద్ధా ఫిర్యాదు ఇదిలా ఉండగా ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు గురువారం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలసి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవేశపన్ను విధానంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే తాము కూడా అమలు చేయాల్సి ఉంటుందని గవర్నర్‌కు సూత్రప్రాయంగా తెలిపారు. అనంతరం తనను కలసిన విలేకరులతో మంత్రి శిద్ధా మాట్లాడుతూ.. జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించానని, గవర్నర్ సమస్యను పరిష్కరించకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
సంక్రాంతికి 2,835 అదనపు బస్సులు
ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,835 అదనపు బస్సులు నడుపుతున్నట్టు రాష్ట్ర రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు మంగళవారం తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు బస్సుల పేరుతో ప్రభుత్వమే 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేస్తోందన్న ప్రశ్నకు, ఒక్కపైసా కూడా ఎక్కువ వసూలు చేయట్లేదని బదులిచ్చారు. -
‘పచ్చ’ ముచ్చటకు రూ.10 కోట్లు
కార్మికుల సొమ్ముతో ఆర్టీసీ బస్సులకు పసుపు పచ్చ రంగు సాక్షి, హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే మరి! పల్లెవెలుగు బస్సులను ‘పచ్చ’ రంగుతో అలకరించేందుకు ఆర్టీసీ కార్మికుల సొమ్ముకు సర్కారు ఎసరు పెట్టింది. కొత్తగా ప్రవేశపెడుతున్న వాటితోపాటు పాత బస్సులకూ తమ పార్టీ రంగు పసుపు రంగులోకి మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి నాటికి రాష్ట్రంలోని 123 డిపోల్లోని పల్లెవెలుగు బస్సులతో పాటు హైటెక్, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు పసుపు పచ్చ రంగు పడనుంది. హైటెక్, లగ్జరీ బస్సులకు బోర్డర్ పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసి దాచుకున్న డబ్బును వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సరైన నిర్వహణ లేకుండా రంగులెందుకు? ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల నిర్వహణ సరిగా లేదు. సీట్లలో కూర్చొంటే నల్లులు బాధ తప్పడం లేదని స్వయానా రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బస్సుల రంగు కోసం నిధులు వినియోగించటం సరికాదని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించి ఆర్టీసీకి మొండిచేయి విమాన ఇంధనంపై వ్యాట్ శాతాన్ని ఇటీవలే ప్రభుత్వం 16 నుంచి 1 శాతానికి తగ్గించింది. దీనివల్ల రాష్ట్రంలో విమానయానం పెరుగుతుందని చెబుతోంది. ప్రభుత్వానికి ఏటా రూ.25 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంటోంది. ఆర్టీసీకి కూడా ఇంధన రాయితీ కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి కార్మిక సంఘాలు కోరుతున్నాయి. డీజిల్‌పై వ్యాట్ శాతం తగ్గించాలని కోరినా పట్టించుకోని ప్రభుత్వం సంపన్నులు ప్రయాణించే విమానాలపై మాత్రం ఇంధనం వ్యాట్ తగ్గించడాన్ని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. ఆర్టీసీకి నష్టాలు రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలేనని మండిపడుతున్నారు. -
నాకు స్పష్టమైన జవాబు కావాలి అధ్యక్షా!
రోడ్డు ప్రమాదాలపై అసెంబ్లీలో శోభానాగిరెడ్డి తనయ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అందర్నీ ఆకట్టుకున్నారు. దివంగత శోభా నాగిరెడ్డి స్థానంలో ఎన్నికైన అఖిల సోమవారం జీరో అవర్‌లో మాట్లాడారు. తన తల్లి మృతికి కారణమైన రోడ్డు ప్రమాదాలను తొలి అంశంగా ఎంచుకుని సభను ఆకట్టుకున్నారు. ఎంతో అనుభవజ్ఞులైన పెద్దల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతూనే తాను ఏ పరిస్థితుల్లో అసెంబ్లీకి ఎన్నికైందీ వివరించారు. ‘అమ్మ స్థానంలో ఉండి నేను ఈవేళ మాట్లాడుతున్నాను. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాగలమర్రి-నంద్యాల రోడ్డులో ఇటీవలి కాలంలో 12 ప్రమాదాలు జరిగాయి. అయినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చిన్నచిన్న కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై దారి మళ్లింపు గుర్తులు, గుంతల పూడ్చివేతలు, మరమ్మతులు చేపట్టమని మా అమ్మ ఎన్నో లేఖలు రాసింది. అయినా పట్టించుకోలేదు. ఫలితంగా అమ్మనే కోల్పోయా. నా అనుభవం మరెవ్వరికీ రాకూడదు. అందువల్ల చూస్తాం, చేస్తాం, సంబంధిత మంత్రికి చెబుతాం.. అని చెప్పకుండా సూటిగా నా ప్రశ్నకు సమాధానం కావాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో సంబంధిత మంత్రితో చెప్పించాలని కోరుతున్నా అధ్యక్షా..’ అంటూ ముగించినప్పుడు పార్టీలతో నిమిత్తం లేకుండా సభ్యులు అభినందించారు. రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల్ని వివరించారు. సభ్యురాలు చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సమస్య తీవ్రమైందని, ఆ అంశంపై మాట్లాడేందుకు అఖిల అర్హమైన సభ్యురాలని అన్నారు. -
హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం
మార్కాపురం: స్వార్థ రాజకీయాలతో పాటు తన కుమారుడిని ప్రధానిగా చేయాలనుకున్న సోనియా గాంధీ దుర్బుద్ధివల్ల రాష్ట్రం విడిపోయిందని.. దీనివల్ల అంతా కలిసి అభివృద్ధి చేసుకున్నా హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వాల్సి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వ్యాఖ్యానించారు. మార్కాపురం జెడ్పీ బాలుర పాఠశాలలో 2014 జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డు ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ అధ్యక్షత వహించిన సభలో మంత్రి శిద్దా మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ.. వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2010-11లో ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. బడి పిలుస్తోంది..రారూ. కార్యక్రమం వల్ల బడి బయట ఉన్న వేలాది మంది పాఠశాలల్లో చే రారని తెలిపారు. యర్రగొండపాలెం, దోర్నాల బస్టాండ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, మార్కాపురం-పొదిలి రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారో ప్రశ్నించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 2న ఒంగోలులో జిల్లా పరిషత్ హెచ్ఎంలతో సమావేశం నిర్వహించనున్నామని.. జెడ్పీ పాఠశాలల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దొనకొండ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే జంకె పశ్చిమ ప్రకాశం భాగంలో ఉన్న దొనకొండ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసేందుకు మంత్రి శిద్దా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని దీనికి తాము సహకరిస్తామని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులు, టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ బడ్జెట్లో వెలిగొండకు రూ. 76.80 కోట్లు మాత్రమే కేటాయించారని, 2015 నాటికి వెయ్యి కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధిపై చిన్న చూపు: ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ప్రకాశం జిల్లాకు ఒక్క జాతీయ స్థాయి సంస్థను కేటాయించకపోవటం దురదృష్టకరమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శిద్దా ఈ విషయాన్ని కే బినెట్ సమావేశంలో ప్రస్తావించాలని కోరారు. రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ జిల్లాకు 606 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయని చెప్పారు. సైన్స్ పట్ల ఆసక్తిని కనబరిచే విద్యార్థులకు ఇన్స్పైర్ ప్రాజెక్టు వరమన్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 5వేల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ పి.శ్రీనివాసరావు, మార్కాపురం, ఒంగోలు డిప్యూటీ డీఈఓలు కాశీశ్వరరావు, సాల్మన్, మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, ఆర్డీఓ కొండయ్య, కమిషనర్ ఎ.శ్రీనివాసరావు, ఎంపీపీ ఎల్.మాలకొండయ్య, ఎంఈఓ సీహెచ్‌పీ వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ విద్యాశాఖాధికారి వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జక్కా ప్రకాశ్, బాలుర, బాలికోన్నత పాఠశాలల హెచ్ఎంలు వై.సత్యనారాయణరెడ్డి, శార్వాణి, ప్రధానోపాధ్యాయుల సంఘం డివిజన్ అధ్యక్షుడు సీఎస్ మల్లికార్జున్, వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు బట్టగిరి తిరుపతిరెడ్డి, యూత్ అధ్యక్షుడు మందటి మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, కౌన్సిలర్లు వక్కలగడ్డ మల్లికార్జున్, చక్కా మధు, కనిగిరి బాల వెంకట రమణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ, పండిత పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవిచంద్ర, జీఎల్ రమేష్‌బాబు, ఎన్సీసీ అధికారి వెంగళరెడ్డి, సుధాకర్, జాతీయ సైన్స్ అవార్డు గ్రహీత టీ.జగన్నాథ్ పాల్గొన్నారు. -
డీజిల్ ధరలు పెరిగితే బస్సు చార్జీలూ భగ్గు!
కేంద్రం ధరలు పెంచినప్పుడల్లా తప్పదు: సిద్ధా రాఘవరావు సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు పెరిగితే ఇకపై ఆ సెగ నేరుగా బస్సు ప్రయాణికులకే తగలనుంది! కేంద్రం ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచినపుడల్లా ఆర్టీసీ చార్జీలు కూడా వాటంతట అవే సవ రణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. సంస్థ ఇంధన ఖర్చును తగ్గించేందుకు బయో డీజిల్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఆర్టీసీ(కేఎస్ ఆర్టీసీ) పనితీరును అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను వ్యక్తులు, సంస్థలకు లీజుకిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకుంటామన్నారు.పల్లె వెలుగు స్థానంలో చిన్న బస్సులు ప్రవేశ పెడతామన్నారు. -
బాధ్యతలు చేపట్టిన పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు
పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆదివారం సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణనీటి సరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కమిడి మృణాళిని, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా శిద్ధా రాఘవరావు, వ్యవసాయశాఖ మంత్రిగా పత్తిపాటి పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు.