సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,835 అదనపు బస్సులు నడుపుతున్నట్టు రాష్ట్ర రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు మంగళవారం తెలిపారు.
ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,835 అదనపు బస్సులు నడుపుతున్నట్టు రాష్ట్ర రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు మంగళవారం తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు బస్సుల పేరుతో ప్రభుత్వమే 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేస్తోందన్న ప్రశ్నకు, ఒక్కపైసా కూడా ఎక్కువ వసూలు చేయట్లేదని బదులిచ్చారు.