‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’ | Rahul Gandhi raises security concerns over Arogya Setu app | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’

Published Sun, May 3 2020 5:55 AM | Last Updated on Sun, May 3 2020 5:56 AM

Rahul Gandhi raises security concerns over Arogya Setu app - Sakshi

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో భారీగా డౌన్‌లోడ్‌ అవుతున్న యాప్‌ ఆరోగ్యసేతు ‘గోప్యత’పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అనుమానం వ్యక్తంచేశారు. సర్వేలైన్స్‌ విధానం కలిగిన ఈ యాప్‌ ప్రస్తుతం ప్రైవేట్‌ ఆపరేటర్‌ చేతుల్లో ఉందని, ఈ నేపథ్యంలో యాప్‌ గోప్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. మనలను మనం సురక్షితంగా ఉంచుకోవడం కోసం టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చని, అయితే ప్రజల అనుమతి లేకుండా వారిని ట్రాక్‌ చేస్తారన్న భయం రాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement