![Rahul Gandhi slams Centre for fighting for blue ticks amid Covid-19 vaccine shortage - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/7/RAGA-SIXTEEN_NINE.jpg.webp?itok=jm906IW4)
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు పొందడంలో స్వావలంబన (ఆత్మనిర్భర్) సాధించాలం టూ దేశ ప్రజలను వదిలేసి, బ్లూ టిక్ కోసం మోదీ ప్రభు త్వం పోరాటం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చురకలంటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర అగ్ర నేతల అకౌంట్లకు బ్లూ టిక్‌లను ట్విట్టర్ తొలగించడం, ఆ వ్యవహారం వివాదా స్పదం కావడంతో తిరిగి పునరుద్ధరించడంపై రాహుల్ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందించారు. ‘ట్విట్టర్‌పై రాజకీయాలు చేయడం రాహుల్‌కు చాలా ముఖ్యమైన విషయం, ఆయన అతిపెద్ద వేదిక కూడా ఇదే’ అని ఎదురుదాడి చేశారు. ఢిల్లీలోని గోవింద్ వల్లభ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి తమ సంస్థలో పనిచేసే నర్సులు మలయాళంలో మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించడంపైనా రాహుల్ స్పందించారు. భారతీయ భాషల్లో ఒక్కటైన మలయాళంపై వివక్ష మానుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment