blue ticks
-
ట్విటర్ బ్లూటిక్ లేదా మీకు, అయితే ఈ వార్త మీకోసమే!
న్యూఢిల్లీ: నాన్ వెరిఫైడ్ ట్విటర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యను పరిమితం చేయడానికి చూస్తోంది. బ్లూ టిక్ లేని యూజర్ల మెసేజ్‌లకు ఇకపై పరిమితిని విధించనున్నారు. ఒకే రోజులో డైరెక్ట్ మెసేజ్‌పై లిమిట్ విధించేందుకు ట్విటర్ యోచిస్తోంది. ఈ పరిమితి దాటిన తరువాత మరిన్ని మెసేజ్‌లను సెండ్ చేసేందుకు వెరిఫై చేసుకోండి అనే మెసేజ్ దర్శనమివ్వనుంది. లీకర్ అలెశాండ్రో పలుజ్జీ ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. రోజుకి ఒక నాన్వెరిఫైడ్ యూజర్ సెండ్ చేసే డైరెక్ట్ మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) లీకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, పరిమితిని చేరుకున్న తర్వాత, నాన్-ట్విటర్ బ్లూ వినియోగదారులు "మరిన్ని సందేశాలపంపానుకుంటే వెరిఫై చేసుకోండి అనే సందేశాన్ని రానుంది. అంతే కాదు ఈ పరిమితి రోజుకు 500 DMలు అని, ఇది అమల్లోకి వచ్చార ఈ పరిమితి తగ్గుతుందని కూడా ఆయన భావించారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) కాగా ట్విటర్లో కంటెంట్ క్రియేటర్లకు వారి రిప్లయ్స్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా త్వరలో చెల్లింపులను ప్రారంభిస్తుందని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. #Twitter is working to limit the number of DMs you can send per day before having to sign up for @TwitterBlue 👀 pic.twitter.com/R9UDmd4OAo — Alessandro Paluzzi (@alex193a) June 12, 2023 -
‘సెలబ్రిటీ’ ఖాతాలకు మళ్లీ బ్లూ టిక్
న్యూఢిల్లీ: చందా మొత్తాన్ని చెల్లించలేదంటూ చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లో బ్లూ టిక్‌ను తొలగించిన ట్విట్టర్ యాజమాన్యం ఆదివారం కొందరికి బ్లూ టిక్‌ను పునరుద్ధరించింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ ఖాతాలకే ఈ మినహాయింపు ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీసహా ప్రముఖ భారతీయ నటులు, రాజకీయనేతలు, క్రీడాకారుల బ్లూ టిక్‌ను ఇటీవల తొలగించగా ఆదివారం ఆ టిక్ మళ్లీ ప్రత్యక్షమైంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం వల్లే వీరందరికి బ్లూ టిక్ ఇచ్చారా ? లేక సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా అనేది తెలియరాలేదు. ‘చందా కట్టకున్నా ఆదివారం బ్లూ టిక్ మళ్లీ వచ్చేసింది. మిస్టర్ మస్క్ మీరే నా తరఫున చందా రుసుం కట్టేశారా? ’ అంటూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్వీట్‌చేశారు. అయితే లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు మాత్రమే వెరిఫైడ్ స్టేటస్(బ్లూ టిక్) హోదా కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే, దివంగతుల ఖాతాలకు టిక్ ప్రత్యక్షమవడం గమనార్హం. మైఖేల్ జాక్సన్, చాడ్విక్ బోస్‌మ్యాన్, కోబె బ్రయాంట్ తదితర సెలబ్రిటీల ఖాతాలు ఇందులో ఉన్నాయి. కాగా బ్లూ టిక్ కోసం చందా కట్టే ప్రసక్తే లేదని ప్రకటించిన కొందరు ప్రముఖుల తరఫున తానే నగదు చెల్లించి టిక్ పునరుద్ధరించినట్లు ట్విట్టర్ యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. దిగ్గజ నటుడు విలియం శాట్నర్ తదితరుల తరఫున మస్క్ రుసుం చెల్లించారు. -
ట్విటర్ యూజర్లకు శుభవార్త!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అధికారిక ట్విటర్ అకౌంట్లకు తొలగించిన ‘బ్లూటిక్’ వెరిఫికేషన్ మార్క్‌లను మళ్లీ పునరుద్దరించారు. ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్కు ఛార్జీలు తీసుకొచ్చిన మస్క్..నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించకపోతే వెరిఫికేషన్ మార్క్ తొలగిస్తామని చెప్పారు. అనుకున్నదే తడువుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ ఖాతాల వెరిఫికేషన్ మార్క్‌ను తొలగించారు. ఫలితంగా ప్రజాప్రతినిధుల నుంచి సినీ ప్రముఖులు వరకు ట్విటర్ బ్లూ మార్క్‌ను కోల్పోయారు. అయితే ఈ నేపథ్యంలో బ్లూ మార్క్‌ను తొలగించిన అకౌంట్లకు మళ్లీ పునరుద్దరించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో సబ్స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లు సైతం ఉన్నాయి. బ్లూటిక్ వెరిఫికేషన్ ఉన్న అకౌంట్లకు వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలను మస్క్ రీస్టోర్ చేశారు. ఇదే ఫైనల్ ఫేక్ అకౌంట్లను గుర్తించేందుకు వీలుగా ట్విటర్ సంస్థ తొలిసారిగా 2009లో బ్లూ టిక్ ఖాతాలను ప్రవేశపెట్టింది. వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించలేదు. కానీ 2022లో ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన మస్క్.. ట్విటర్ బ్లూ టిక్ అకౌంట్లకు ఛార్జీలు చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీలపై ఈ ఏడాది ఏప్రిల్ 11న మస్క్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి వెరిఫికేషన్ బ్యాడ్జీలను తొలగిస్తామని పేర్కొన్నారు. Tomorrow, 4/20, we are removing legacy verified checkmarks. To remain verified on Twitter, individuals can sign up for Twitter Blue here: https://t.co/gzpCcwOXAX Organizations can sign up for Verified Organizations here: https://t.co/YtPVNYypHU — Twitter Verified (@verified) April 19, 2023 ‘బ్లూటిక్’ వెరిఫికేషన్ మార్క్‌ల పునరుద్దరణ ట్వీట్లో మస్క్ చెప్పినట్లుగానే వెరిఫికేషన్ బ్యాడ్జీలను డిలీట్ చేశారు. దీంతో సెలబ్రిటీ ట్విటర్ యూజర్లు మస్క్‌పై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్బిలాంటి వారు సైతం తాము ట్విటర్ బ్లూ కోసం డబ్బులు చెల్లించినా..బ్యాడ్జీని ఎందుకు తొలగించారంటూ మస్క్‌పై కామెంట్ల వర్షం కురిపించారు. తాజాగా అధికారిక అకౌంట్లకు బ్లూ చెక్ మార్క్‌లు ప్రత్యక్షమయ్యాయి. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్! -
రాహుల్ నుంచి అమితాబ్ వరకు...
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్‌ను మన దేశంలో చాలా మంది ప్రముఖులు కోల్పోయారు. సబ్స్క్రిప్షన్ చెల్లించకపోవడంతో భారత్‌లో రాహుల్ గాంధీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్ల నుంచి బ్లూ టిక్‌లను తొలగించారు. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడానికి బ్లూటిక్ కావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలన్న నిబంధన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అలా డబ్బులు చెల్లించని వారి ఖాతాల నుంచి బ్లూటిక్‌లను తొలగించే కసరత్తు ట్విటర్ ప్రారంభించింది. దీంతో వేలాది మంది సెలబ్రిటీలు బ్లూటిక్‌ను కోల్పోయారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ, యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్ సహా పలువురు సీఎంలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, అనుష్క శర్మ తదితరులు బ్లూ టిక్ కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు. బ్లూ టిక్ కోల్పోయిన అంతర్జాతీయ ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. ట్విటర్లో బ్లూ టిక్ స్టేటస్ సింబల్‌గా మారింది. బ్లూటిక్కు వెబ్‌లో రూ.650, మొబైల్ ఫోన్లలో ఉండాలంటే నెలకి రూ.900 ఫీజుగా నిర్ణయించారు. ఏడాదికి ఒకేసారి కడితే రూ6,800 డిస్కౌంట్ రేటు పెట్టారు. దీనిపై గందరగోళం నెలకొనడంతో కొన్నాళ్లు దీనిని నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ బ్లూ టిక్లపై దృష్టి సారించారు. డబ్బులు కట్టినా.. ఏమిటిది ? బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కి వింత అనుభవం ఎదురైంది. సబ్స్క్రిప్షన్ కట్టినప్పటికీ ఆయన ఖాతా నుంచి బ్లూ టిక్‌ను తొలగించారు. దీనిపై అమితాబ్ ఫన్నీగా ట్వీట్ చేశారు. ‘‘హే ట్విటర్ బ్రో, వింటున్నావా ? నేను ఇప్పటికే డబ్బులు కట్టాను. నా పేరు ముందు ఆ బ్లూ టిక్ మళ్లీ పెట్టు. దాని వల్ల అది నేనేనని ప్రజలు గుర్తిస్తారు’’ అని ట్వీట్ చేశారు. నటుడు ప్రకాశ్ రాజ్ బై బై బ్లూ టిక్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. బ్లూ టిక్ లేకపోయినా తన జీవన ప్రయాణంలో సంగతులు, తన మదిలో భావాలు అందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు. -
ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!
న్యూఢిల్లీ:సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ యూజర్లకు మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే బ్లూటిక్ పోవడంతో హతాశులైన యూజర్లు చాలామందికి ఇపుడిక ట్విటర్ లోడ్ కూడా కావడం లేదు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులకు మైక్రో బ్లాగింగ్ సేవలు అందుబాటులో లేవు. ప్రధానంగా డెస్క్‌టాప్ యూజర్లకు ‘దిస్ పేజ్ ఈజ్ డౌన్’ అనే సందేశం కనిపిస్తోంది. అయితే తొందరలోనే లోపాన్ని సవరిస్తామనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీంతో ట్విటర్ మీకు పనిచేస్తోందా అంటూ నెటిజన్లు తెగ ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్! ట్విటర్-డౌన్ ట్విటర యాప్ లేదా వెబ్సైట్ (డెస్క్‌టాప్, మొబైల్ రెండూ)చాలావరకు పని చేయలేదు. మొబైల్ సైట్‌ని యాక్సెస్ చేసినప్పుడు, ప్రస్తుతం ‘మీ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ సైట్‌ని చేరుకోవడం సాధ్యం కాదు’ అని లాంటి మెసేజెస్ కనిపించింది. ఈ సమస్య ఎంత విస్తృతంగా వ్యాపించిందనే దాని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీకి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కాగా శుక్రవారం ఉదయం నుంచి సెలబ్రిటీలకు బ్లూటిక్ తీసివేయడంతో కలకలం రేగింది. దీంతో యూజర్లు జోక్స్, మీమ్స్‌తో ట్విటర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. Elon Musk be like.#BlueTick pic.twitter.com/hlB9NxDKgd — Farhan Khan (@babarazam215) April 21, 2023 ట్విటర్‌ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత చేసిన పలు మార్పుల్లో భాగంగా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్లూటిక్ కావాలనుకునే యూజర్లు బ్లూటిక్ కోసం నెలవారీ రుసుము చెల్లించాలి. -
Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశాడు. సబ్స్క్రిప్షన్ చార్జీలు చెల్లించని యూజర్ల అకౌంట్లన్నింటికీ బ్లూ టిక్‌లు తొలగించింది ట్విటర్. ఇందులో టాప్ సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, హై-ప్రొఫైల్ బిజినెస్మేన్లు ఉన్నారు. నెలవారీ రుసుము 8 డాలర్లు (సుమారు రూ. 660) చెల్లించని హై-ప్రొఫైల్ యూజర్ల ఖాతాలకు సంబంధించిన బ్లూటిక్‌లను ట్విటర్ తొలగించింది. వెరిఫైడ్ బ్లూటిక్ కావాలంటే కచ్చితంగా సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించాలని లేకుంటే ఏప్రిల్ 20 నుంచి బ్లూటిక్‌లను తొలగిస్తామని గత కొన్ని రోజులుగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ హెచ్చరిస్తూనే ఉన్నారు. గడువు తేదీ అయిపోగానే సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించని అకౌంట్లన్నికీ వెరిఫైడ్ బ్లూటిక్ టిక్‌ను ట్విటర్ తొలగించింది. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ ఇంకా పలువురు బడా వ్యాపారవేత్తలు తమ ట్విటర్ అకౌంట్లకు బ్లూటిక్‌ను కోల్పోయారు. తమ బ్లూ టిక్ అలాగే ఉండాలనుకునేవారు నెలకు సుమారు రూ.660 చొప్పున చెల్లించి ట్విటర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఇక వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ఉంచుకోవాలనుకునే సంస్థలు నెలవారీ రుసుము 1,000 డాలర్లు (రూ. 82వేలకు పైగా)తో పాటు 50 డాలర్లు (సుమారు రూ. 4,100) అదనంగా చెల్లించాలి.ట్విటర్ 'వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్' కోసం గోల్డ్ టిక్‌లను, ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు గ్రే టిక్‌లను ట్విటర్ అందిస్తుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
సినీ తారలకు ట్విటర్ షాక్.. చిరంజీవితో సహా బ్లూటిక్ తొలగింపు!
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎక్కువగా అప్డేట్స్ ఇస్తుంటారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సందడి చేస్తుంటారు. అయితే వారి అఫీషియల్ అకౌంట్స్‌కు బ్లూ టిక్ సింబల్ ఉంటుంది. అయితే తాజాగా ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ సెలబ్రీటీలకు షాకిచ్చారు. సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించిని వారి బ్లూ టిక్స్‌ను తొలగించారు. ఇలా బ్లూ టిక్ తొలగించిన వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఉండడం విశేషం.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌లు తొలగిస్తోంది. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఇప్పటికే ప్రకటించిన విధంగా నెలవారీ లేదంటే ఏడాది చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్‌లు ఎగిరిపోయాయి. అయితే, ఇలా బ్లూ టిక్‌లు కోల్పోయిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉండడం విశేషం. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు అలాగే ఉన్నాయి. అయితే వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ విషయాకొనిస్తే.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా సైతం తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. సౌత్‌లో ముఖ్యంగా తమిళ స్టార్ రజినీకాంత్, విజయ్, శింబు లాంటి పెద్ద హీరోలకు సైతం బ్లూ టిక్ లేకుండా పోయింది. Bye bye #BlueTick …. It was nice having you….my journey ..my conversations..my sharing…will continue with my people … you take care #justasking — Prakash Raj (@prakashraaj) April 20, 2023 బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిందే: ఎలన్ మస్క్ ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌లు కావాలనుకుంటే వెబ్ కోసం అయితే నెలకు రూ.650, యాప్ కోసమైతే నెలకు రూ.900 చెల్లించాలి. ఏడాదికైతే రూ.6500 డిస్కౌంట్ ఆఫర్‌ను ట్విట్టర్ అందిస్తోంది. దీనికి ఈ ఏడాది ఏప్రిల్ 20 చివరి తేదీగా ప్రకటించింది. ఈ లోపల బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోనివారు బ్లూటిక్ కోల్పోతారని ప్రకటించారు. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ చెప్పినట్లుగానే సెలబ్రిటీలు తమ ట్విట్టర్ బ్లూ టిక్‌లను కోల్పోతున్నారు. -
ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ పెయిడ్ సబ్క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత వెరిఫైడ్ బ్లూటిక్‌లను బంద్ చేసిన ట్విటర్ సబ్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించినవారికి బ్లూటిక్‌లు అందిస్తోంది. అయితే కొంతమందికి మాత్రం ఉచితంగా బ్లూటిక్‌లు అందిస్తోంది. (ఈవీల జోరు.. అమ్మకాల హుషారు! ఎంతలా కొన్నారంటే..) ట్విటర్ గతంలో ఉన్న బ్లూ టిక్‌లను ఏప్రిల్ 1 నుంచి తొలగించి కొత్త సబ్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ప్రసిద్ధ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ దాని వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను కోల్పోయింది. తమ ఉద్యోగుల ఖాతాలను వెరిఫై చేసేందుకు చెల్లించబోమని వైట్‌హౌస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాపార సంస్థలు తమ ఖాతాలను వెరిఫైడ్‌గా మార్చుకోవడానికి ప్రతి నెలా సుమారు రూ. 82,000 చెల్లించాలి. అయితే కొన్ని సంస్థలు నెలవారీ ఛార్జీలను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చని తెలుస్తోంది. ట్విటర్‌ను ఎక్కువగా వినియోగించే 500 మంది ప్రకటనకర్తలకు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను ఉచితంగా అందిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... ఫాలోవర్లు అధికంగా ఉన్న అగ్రశ్రేణి 10,000 సంస్థలకు కూడా ట్విటర్ ఉచితంగా వెరిఫైడ్ టిక్‌లు అందిస్తోంది. (ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా? ) మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాని ప్రకటనల ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. కొన్ని భారీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు తమ క్లయింట్లకు ట్విటర్ వినియోగంపై జాగ్రత్తలను సూచించాయి. ఈ నేపథ్యంలో వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను ఉచితంగా అందిస్తే ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్విటర్ కొంతమంది ప్రకటనకర్తలకు ఈ ఉచిత వెరిఫైడ్ మార్క్‌లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
ట్విటర్ యూజర్లకు భారీ షాక్!
యూజర్లకు ట్విటర్ భారీ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి బ్లూటిక్ వెరిఫికేషన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 తర్వాత బ్లూటిక్ వెరిఫికేషన్ కావాలంటే నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ట్విటర్ బాస్‌గా కొత్త అవతారం ఎత్తిన వెంటనే ఎలాన్ మస్క్ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే బ్లూటిక్ వెరిఫికేషన్ అందిస్తారు. మిగిలిన యూజర్లకు తొలగించనుంది. బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం ఎంత చెల్లించాలంటే ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. గతంలో బ్లూటిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను మీడియా సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ఎంటర్టైన్మెంట్ విభాగంతో పాటు ఆయా రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించే వారికి మాత్రమే ఉచితంగా ఇచ్చింది. ఈ ఫీచర్ వల్ల అకౌంట్లకు భద్రతతో పాటు కొన్ని అదనపు ఫీచర్లు వినియోగించుకునే సౌకర్యం ఉండేంది. అయితే బాస్‌గా మస్క్ ట్విటర్ ఫ్రీ బ్లూటిక్ సేవల్ని తొలగించారు. పెయిడ్ సర్వీసుల్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్విటర్ బ్లూ బ్లూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు నెలకు రూ. 900 చెల్లించాల్సి ఉంది. ట్విటర్ వెబ్ వినియోగదారులు రూ.600 సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉండగా.. సంవత్సర చందాదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ట్విటర్ పేర్కొంది. ట్విటర్ బ్లూకి మరిన్ని మార్పులు ట్విటర్ తన బ్లూ సబ్‌స్క్రిప్షన్‌లో కొన్ని మార్పులు చేసింది. తాజా నివేదికల ప్రకారం, సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. గతంలో కొత్త ట్విటర్ అకౌంట్‌కు బ్లూ టిక్ పొందాలంటే 90 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయాన్ని 30 రోజులకు తగ్గించింది. -
Twitter Blue plans షురూ: ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోతే!
సాక్షి,ముంబై: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ ఇండియాలో బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ సేవల్ని లాంచ్ చేయగా తాజాగా ఇండియాలో కూడా మొదలు పెట్టింది .దీని ప్రకారం ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే ట్విటర్ చందాదారులు తమ ఖాతా ధృవీకరణకోసం ఈ బ్లూ టిక్ మార్క్‌ను పొందొచ్చు. ఈ బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం నిర్దేశిత చందా చెల్లించిన యూజర్లు ఎవరైనా బ్లూ టిక్ మార్క్ పొందొచ్చు. చందా చెల్లించిన అనంతరం ప్రొఫైల్ పక్కన బ్లూటిక్ మార్క్ కనిపిస్తుంది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూల్స్ ►బ్లూటిక్ మార్క్ పొందాలంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు నెలకు రూ.900 ఖర్చు అవుతుంది. అలాగే వెబ్సైట్ సబ్స్క్రిప్షన్ కావాలంటే నెలకు రూ. 650 , సంవత్సరానికి రూ. 6800 చెల్లించాలి. ► బ్లూటిక్ మార్క్ పొందాలంటే దరఖాస్తు తేదీకి కనీసం 90 రోజులముందు ట్విటర్లో ఉండాలి. ► బ్లూటిక్కు సబ్‌స్క్రైబ్ చేసిన తర్వాత, ప్రొఫైల్ ఫోటో, డిస్ప్లే పేరు లేదా వినియోగదారు పేరుకు మార్పులు చేస్తే తిరిగి ఖాతా ధృవీకరించబడే వరకు వెరిఫికేషన్ మార్పు కోల్పోతారు. ఈ వ్యాలిడేషన్ సమయంలో ఎలాంటి మార్పులకు అనుమతి లేదు. ► వినియోగదారులు తమ ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్ ముగియకముందే సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించాలి లేదా రద్దు చేసుకోవాలి. ఆటో రెన్యూవల్కి 24 గంటల ముందే రద్దు చేసుకోవాలి. లేదంటే ఇప్పటికే చెల్లించిన డబ్బు వాపసు లభించదు ► ప్రొఫైల్‌కు బ్లూ టిక్ మార్క్ వల్ల లాభాలు: చందాదారులు ట్వీట్లను రద్దు చేయడం, ట్వీట్లను సవరించడం, కొన్ని ఫీచర్లకు ముందస్తు యాక్సెస్, చాట్లలో ప్రాధాన్యత కలిగిన ర్యాంకింగ్‌లతో పాటు ఎక్కువ , అధిక నాణ్యత గల వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యం వంటి అనేక సేవలను పొందుతారని ట్విటర్ వెల్లడించింది. ముఖ్యంగా ట్వీట్ చేసిన తర్వాత 30 నిమిషాల్లోపు ఐదు సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే బ్లూటిక్ సబ్స్క్రైబర్లు మిగిలిన వారితో పోలిస్తే దాదాపు సగం ప్రకటనలనుంచి కూడా విముక్తి. అంతిమంగా ప్రీమియం ఫీచర్ల ద్వారా యూజర్లకు మరింత సౌలభ్యమైన సేవలను అందించడమే లక్ష్యం అని ట్విటర్ పేర్కొంది. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను అమెరికా కెనడా, జపాన్, ఇండోనేషియా, న్యూజిలాండ్, బ్రెజిల్,యూఏ సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఆస్ట్రేలియాదేశాల్లో బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అమల్లోఉంది. -
ప్రభుత్వాలకు ట్విటర్ గ్రే టిక్..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ తాజాగా ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక ఖాతాలకు బూడిద రంగు (గ్రే) టిక్ మార్కును, కంపెనీలకు బంగారు వర్ణం (గోల్డెన్) టిక్ మార్కును కేటాయించడం ప్రారంభించింది. మిగతా వెరిఫైడ్ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్ ఉంటుంది. కొత్త మార్పుల ప్రకారం భారత ప్రభుత్వ హ్యాండిల్, ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండిల్ టిక్ మార్క్‌ను బ్లూ నుంచి గ్రేకు మార్చింది. ప్రధాని ట్విటర్ ఖాతాకు 8.51 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెలకు 8 నుంచి 11 డాలర్ల వరకూ చార్జీలతో ట్విటర్ బ్లూ సర్వీసు అందిస్తున్న కంపెనీ ప్రస్తుత సబ్‌స్క్రయిబర్స్ తమ సబ్‌స్క్రిప్షన్‌ను అప్‌గ్రేడ్, రద్దు లేదా ఆటో – రెన్యూ చేసుకోవచ్చని పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రిటన్ దేశాల్లో ట్విటర్ బ్లూ సర్వీస్ అందుబాటులో ఉంది. చదవండి: 8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్‌మెంట్‌తో కేంద్రం ఆదాయం -
ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ ఫాట్పారం ట్విటర్ అకౌంట్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇప్పటిదాకా ఉన్న వెరిఫికేషన్ మార్క్ బ్లూ టిక్ ..ఇపుడు మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీనికి వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉటుంది. ఐఫోన్ యూజర్లు మాత్రం 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్లూ చెక్‌మార్క్‌తో పాటు, ప్రత్యేక ఫీచర్లు ఉన్న ట్విటర్ బ్లూ సేవలను కూడా పొందవచ్చని సంస్థ తెలిపింది. బ్లూ సేవలను ప్రత్యేక రుసుం చెల్లించిన ఎవరికైనా ఇవ్వనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం (డిసెంబరు13)న షురూ అయింది. ట్విటర్ టేకోవర్ తరువాత బిలియనీర్ ఎలాన్ మస్క్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ఒకటి వెరిఫికేషన్ ఫీజు. అలాగే ఆయా వర్గాల వారీగా టిక్ కలర్ మార్పు. ఇప్పటికే ఒకే వెరిఫికేషన్ టిక్ (బ్లూ) ఉన్న సంగతి తెలిసిందే. తాజా మార్పుల ప్రకారం ఇపుడిక సెలబ్రిటీల వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ కలర్ టిక్‌ను కేటాయించ నున్నట్టు మస్క్ ప్రకటించారు. we’re baaaack! Twitter Blue is now available for $8/month on web or $11/month on iOS – we’ve made some upgrades and improvements 🧵 pic.twitter.com/uRMuwCSElb — Twitter Blue (@TwitterBlue) December 12, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమ్మకానికి ట్విటర్ ఆఫీస్ వస్తువులు.. ఎలాన్ మస్క్ మరీ దిగజారిపోతున్నారా?
గత యాజమాన్యం ట్విటర్లో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి భోజనం ఖర్చు రూ.32వేలు కాగా.. ఏడాదికి 13 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మస్క్ ట్విటర్ బాస్‌గా తన మార్క్ చూపించుకునేందుకు తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టే ట్విటర్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ప్రతి వస్తువును వేలానికి పెట్టారు. ఆ వేలం జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలోని 265 కిచెన్ అప్లయెన్సెస్, ఆఫీస్ ఫర్నీచర్‌ను ఆక్షన్‌కు.. వాటిల్లో సింక్ లేకపోవడం గమనార్హం. ఇక ఈ వేలంలో ఒక్కో వస్తువు ప్రారంభం ధర 25డాలర్లుగా నిర్దేశించినట్లు వేలం నిర్వహించే శాన్‌డియోగో కేంద్రంగా ఉన్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్ వెల్లడించింది. వేలంలో ఉన్న వస్తువులు ఇవే మస్క్ వేలానికి ఉంచిన ట్విటర్ ఆఫీస్‌కు చెందిన వస్తువుల్లో ఆఫీస్ చైర్లు, ఎస్ప్రెస్సో మెషీన్లు, కాఫీ గ్రైండర్లు, స్టీమ్ టిల్టింగ్ కెటిల్స్, పిజ్జా తయారు చేసుకునే వస్తువులు, ఎలక్ట్రిక్/బేకరీ ఓవెన్లు, ఫ్రీజర్లు (బార్ రిఫ్రిజిరేటర్‌తో సహా), మొబైల్ హీటెడ్ క్యాబినెట్లు, ఐస్ మేకింగ్ మెషీన్లు, ఫ్రయ్యర్లు, లేజర్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. రోజుకు రూ.32 కోట్ల నష్టం వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) కథనం ప్రకారం.. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ ఆదాయం భారీగా పడిపోయింది. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడం..ప్రపంచ దేశాలకు దిగ్గజం కంపెనీలు ట్విటర్లో ఇచ్చే ప్రకటనల్ని నిలిపివేశాయి. దీంతో ట్విటర్ రోజు 4 మిలియన్ (రూ.32 కోట్లు) డాలర్ల నష్టం వాటిల్లినట్లు డబ్ల్యూఎస్‌జే తెలిపింది. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకేనా అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మస్క్ ట్విటర్ బ్లూ లాంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో మాదిరిగా ఫ్రీగా కాకుండా.. ట్విటర్ సంస్థకు చెందిన క్యాంటిన్లో నచ్చిన ఫుడ్ తినాలంటే 8 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఇప్పుడు ఆఫీస్‌లో వినియోగించుకునే వస్తువుల్ని అమ్మకానికి పెట్టడంతో మస్క్ మరింత దిగజారుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే ఈవేలానికి ట్విటర్ ఆర్ధిక పరిస్థితులకు సంబంధం లేదని వేలం పనులు చూస్తున్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్కు చెందిన నిక్ డోవ్ తెలిపారు. -
ట్విటర్ బ్లూటిక్ ఒక్కటే కాదు! ఎవరెవరికి ఏ కలర్ అంటే?
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్త బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజును రీలాంచ్ చేయనున్నారు. ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్ ట్విటర్ బ్లూ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని మస్క్ శుక్రవారం తెలిపారు. అయితే వివిధ వర్గాలకు వేరు వేరు కలర్స్ టిక్ మార్క్‌ను ప్రకటించడం గమనార్హం. కంపెనీలకు గోల్డ్ కలర్ మార్క్, ప్రభుత్వానికి గ్రే కలర్, సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు బ్లూ కలర్ చెక్ మార్క్ కేటాయిస్తున్నట్టు మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. వెరిఫికేషన్ ఫీజును తాత్కాలికంగా డిసెంబర్ 2న ప్రారంభించ బోతున్నట్టు తెలిపారు. దీనిపై ట్విటర్ యూజర్ ట్వీట్‌కు స్పందిస్తూ బ్లూటిక్ సర్వీసును పునః ప్రారంభించడంలో ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరిన మస్క్ ఈ వివరాలు అందించారు. అయితే వీటికి వేర్వేరు ఫీజు నిర్ణయిస్తారా, ఒకటే ఉంటుందా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. (లంబోర్గినీ సూపర్ ఎస్యూవీ వచ్చేసింది: కళ్లు చెదిరేలా!) మూడు రకాల ఖాతాల మధ్య తేడాను గుర్తించడానికే వివిధ రంగుల చెక్ మార్కులను ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు నకిలీ ఖాతాలకు చెప్పేలా ఆయా ఖాతాలను మాన్యువల్‌గా ధృవీకరించనున్నట్టు కూడా తెలిపారు. బాధాకరమే అయినా తప్పనిసరి నిర్ణయం అంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అలాగే బ్లూటిక్ మార్క్ గతంలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పాత్రికేయులు,ఇతర ప్రజా ప్రముఖుల ధృవీకరించబడిన ఖాతాల కోసం రిజర్వ్ చేసినట్టు గుర్తు చేశారు. (సినీ నటి కాజల్ అగర్వాల్ కొత్త అవతార్: అదేంటో తెలుసా?) కాగా ట్విటర్ టేకోవర్ తరువాత మస్క్ తీసుకున్న పలు సంచలన నిర్ణయాల్లో బ్లూటిక్ వెరి ఫికేషన్ ఫీజు కూడా ఒకటి. తొలుత నెలకు 8 డాలర్లు బ్లూ చెక్ సబ్స్క్రిప్షన్ సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి మస్క్, నకిలీ ఖాతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడంతో దీన్ని ఇప్పటికి రెండు సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. Sorry for the delay, we’re tentatively launching Verified on Friday next week. Gold check for companies, grey check for government, blue for individuals (celebrity or not) and all verified accounts will be manually authenticated before check activates. Painful, but necessary. — Elon Musk (@elonmusk) November 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కాస్త సమయం ఇవ్వాలి.. ఎలాన్ మస్క్ పిచ్చికి’.. హర్ష గోయెంకా ట్విట్ వైరల్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌పై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్ నిర్ణయాలు ట్విటర్‌ను మరింత గందర గోళంలోకి నెట్టేయొచ్చు. అలా అని ఆయన్ను తప్పు పట్టలేం అంటూ హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బాస్‌గా మస్క్ ట్విటర్లో అడుగు పెట్టిన నాటి నుంచి ఏదో ఒక నిర్ణయంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదు. పైగా అందుకు సహకరించని మేనేజర్ స్థాయి ఉద్యోగుల్ని సైతం ఇంటికి పంపించేస్తున్నారు. మరోవైపు ట్విటర్ బ్లూ పేరు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా వరుస నిర్ణయాలతో ఆ సంస్థను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ తరుణంలో మస్క్‌పై వస్తున్న విమర్శల్ని గోయెంకా సమర్ధిస్తున్నారు.‘ఎలాన్ మస్క్ లాంటి జీనియస్‌ని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం అతని (మస్క్‌ను ఉద్దేశిస్తూ) పిచ్చికి వెనక ఖచ్చితంగా ఏదో మర్మం ఉండే ఉంటుంది. పేపాలు,దిబోరింగ్ కంపెనీ, టెస్లా, స్పేస్ ఎక్స్ ఇలా సంస్థ ఏదైనా సరే..ఆయన ఎన్నో సార్లు కాలం కంటే చాలా ముందున్నారు. మస్క్ వద్ద కచ్చితంగా ట్విటర్ విషయంలోనూ ఏదో గేమ్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం అది మనకు అర్థం కాకపోవచ్చు, ఇప్పట్లో దాన్ని అంచనా కూడా వేయలేం. ట్విటర్ పని అయిపోయింది అనే ముందు ఆయనకు కొంత సమయం ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా మస్క్‌పై వస్తున్న విమర్శల్ని కొట్టిపారేశారు. We are underestimating the genius of Elon Musk. There must be a method to his madness. Whether it was Tesla, SpaceX or Boring co, he was ahead of his times. He surely has a game plan with #Twitter which we just can’t comprehend. Let’s give him time before we predict its death. — Harsh Goenka (@hvgoenka) November 19, 2022 చదవండి: Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్ -
బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి సబ్స్క్రిప్షన్ ఆధారిత 'బ్లూ వెరిఫికేషన్' ప్లాన్‌ను మరోసారి వాయిదా వేసుకున్నారు. తాజాగా 'బ్లూ వెరిఫైడ్' బ్యాడ్జ్ పునఃప్రారంభించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. “బ్లూ వెరిఫికేషన్ రీలాంచ్‌ను ఆపివేయడం వల్ల ఫేక్ అకౌంట్ల తొలగింపుపై పూర్తి విశ్వాసం వచ్చేంత వరకు దీన్ని వాయిదా వేస్తున్నానన్నారు. అలాగే వ్యక్తుల కోసం కాకుండా సంస్థల కోసం వేర్వేరు కలర్స్‌లో వెరిఫికేషన్ ఉంటే బావుంటుందేమో అంటూ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ప్పుడు రీలాంచ్ చేసేదీ ప్రకటించ లేదు. మరోవైపు గత వారంలో 1.6 మిలియన్ల యూజర్లను ట్విటర్ సాధించిందనీ, ఇది "మరో ఆల్ టైమ్ హై" అని మస్క్ ట్వీట్ చేశారు. కాగా నెలకు 8 డాలర్లు బ్లూటిక్‌ను ఫీజును ప్రకటించిన మస్క్ నకిలీ ఖాతాల బెడద కారణంగా దీన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఆ తరువాత నవంబరు 29 నుంచి పునఃప్రారంభించనున్నట్టు తెలిపారు. కానీ దీని మరోసారి బ్రేకులు వేయడం గమనార్హం. Holding off relaunch of Blue Verified until there is high confidence of stopping impersonation. Will probably use different color check for organizations than individuals. — Elon Musk (@elonmusk) November 22, 2022 Twitter added 1.6M daily active users this past week, another all-time high pic.twitter.com/Si3cRYnvyD — Elon Musk (@elonmusk) November 22, 2022 -
బ్లూటిక్ బాదుడు పక్కా, ముహూర్తం ఫిక్స్: మస్క్ క్లారిటీ
న్యూఢిల్లీ: ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ బాదుడుపై ట్విటర్ కొత్తబాస్, బిలీయనీర్ ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరునుంచి (నవంబరు 29) బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు మొదలవుతుందని మస్క్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) తాత్కాలికంగా నిలిపివేసిన బ్లూ చెక్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ నవంబర్ 29న పునఃప్రారంభిస్తున్నట్టు మస్క్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇది మాత్రం పక్కా అంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాదు తమ సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ట్విటర్ ధృవీకరించని ఖాతాలు పేరు మార్చుకుంటే బ్లూటిక్ కోల్పోతారని కూడా తెలిపారు. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్ మస్క్ నెలకు 8 డాలర్ల బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ప్రకటించారు. అయితే నకిలీ ఖాతాల బెడద కారణంగా బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు అమలు నిర్ణయాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid — Elon Musk (@elonmusk) November 15, 2022 -
మీకు ట్విటర్ పేరడీ అకౌంట్స్ ఉన్నాయా? నా సలహా ఇదే
‘బ్లూటిక్’ సబ్స్క్రిప్షన్ పునరుద్ధరించే అంశంపై ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే ఎవరికైనా బ్లూట్ టిక్ వెరిఫికేషన్‌ను బ్యాడ్జీని అందిస్తామని కొద్ది రోజుల క్రితం మస్క్ ప్రకటించారు. కొన్ని దేశాల్లో ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రారంభించారు. ఫలితంగా వారం రోజుల వ్యవధిలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్‌ను వాయిదా వేస్తున్నట్లు మస్క్ తెలిపారు. ఒరిజనల్ సంస్థలు, వ్యక్తుల పేర్లమీద కొంతమంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని, వాటి వల్ల ఏ అకౌంట్ ఒరిజినల్, ఏ అకౌంట్ డూప్లికేట్ అనేది గుర్తించడం కష్టంగా మారింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాజాగా బ్లూటిక్‌పై పాల్ జమిల్ అనే యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ రిప్లయి ఇచ్చారు. వారం రోజుల్లోగా బ్లూటిక్ సేవల్ని పునరుద్దరిస్తామని చెప్పారు. అంతేకాదు ప్రముఖుల, పాపులర్ పేర్లతో పేరడీ అకౌంట్లు క్రియేట్ చేసి..కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లకు సలహా ఇచ్చారు. పేరడీ ట్విటర్ అకౌంట్లు ఉన్న వారు.. బయోలో కాకుండా యూజర్ నేమ్‌లో పేరడీ అనే పదాన్ని జత చేయాలని సూచించారు. -
బ్లూ టిక్‌పై డబ్బులు..సమర్ధించిన మస్క్ సలహాదారుడు శ్రీరామ్ కృష్ణన్
ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్లూటిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని చేసిన ప్రకటనపై మండి పడుతున్నారు. అయినా విమర్శల్ని పట్టించుకోని మస్క్ ట్విటర్ బోట్ అభివృద్ధి, ట్రోల్స్‌ను అరికట్టేందుకు ఏకైక మార్గమని సమర్ధించుకున్నారు. తాజాగా ట్విటర్లో మస్క్ సలహాదారుడు, భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ సైతం సంస్థ చేస్తున్న మార్పులు సరైనవేనని అన్నారు. పెయిడ్ వెరిఫికేషన్‌పై యూజర్లు చేస్తున్న విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్‌పై ట్విటర్ 8 డాలర్లు వసూలు చేయడాన్ని సమర్దిస్తూ.. అందుకు నాలుగు కారణాల్ని వెల్లడించారు. ఆ కారణాలు ఇలా ఉన్నాయి ► ప్రముఖుల పేర్లతో ఉపయోగించే పేరడీ అకౌంట్లను గుర్తించి వారి చర్యలు తీసుకోవచ్చు ► ట్విటర్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన యూజర్లు చాలా మంది ఉన్నారని, కాని ఇకపై అలాంటి వారిని వెరిఫై చేయమని చెప్పారు. ప్రముఖులు, సాధారణ యూజర్లు.. ఇలా స్థాయితో సంబంధం లేకుండా 8 డాలర్ల చెల్లించిన వారికి వెరిఫికేషన్ ఇస్తామని అన్నారు. ► ప్రస్తుతం ట్విటర్లో తీవ్రమైన స్పామ్ సమస్యలు ఉన్నాయని కృష్ణన్ చెప్పారు. విటాలిక్ ,ఎలన్ మస్క్‌లు బ్లూ టిక్ వెరిఫికేషన్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు గుర్తించారు. బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇవ్వడం వల్ల ఆ దాడుల సంఖ్యను తగ్గించవచ్చు. ► చివరగా, ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ అనేది ఏ యూజర్ ఎవరి గురించి ఏం చెప్పారు అనే అంశంపై స్పష్టత ఇస్తుంది. నకిలీ సమాచారాన్ని ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టే ట్విటర్ 8 డాలర్లు వసూలు చేస్తున్నట్లు కృష్ణన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. Several of the critiques of the $8 / verification are logically inconsistent. “verification solves for impersonation, this will cause more” 1. using a CC/mobile checkout dramatically increases friction. And everyone caught impersonating will lose their money. — Sriram Krishnan - sriramk.eth (@sriramk) November 6, 2022 2. there are lots of people who should be verified ( and often impersonated) and aren’t. And vice versa. The current path on any social network is opaque and easily gamed. $8 gives a consistent path for anyone regardless of their level of notability ( which is subjective). — Sriram Krishnan - sriramk.eth (@sriramk) November 6, 2022 చదవండి👉 ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభం.. భారత్‌లో ఎప్పుడంటే?
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభమైంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేకి చెందిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూకి సైనప్ కావొచ్చంటూ ఐఫోన్ యూజర్లకు నోటిఫికేషన్ పంపించింది. ఈ సందర్భంగా ఓ ట్విటర్ యూజర్ భారత్‌లో ఈ పెయిడ్ వెర్షన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందించారు. మరో నెలలో ప్రారంభం కావొచ్చని అన్నారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి బ్లూ చెక్‌మార్క్‌తో పాటు యాడ్స్ తక్కువ డిస్ప్లే చేయడంతో పాటు అదనపు ఫీచర్లను అందిస్తామని వెల్లడించారు. .@elonmusk When can we expect to have the Twitter Blue roll out in India? #TwitterBlue — Prabhu (@Cricprabhu) November 5, 2022 అంతేకాదు ట్విటర్లో వర్డ్స్ పరిధిని పెంచనున్నట్లు మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. ట్విటర్లో సుదీర్ఘ సందేశాలు పోస్ట్ చేసేందుకు వీలులేదు. అలాంటి ఇబ్బందులను తొలగించడానికే పెద్ద పెద్ద మెస్సేజ్‌లను సైతం పోస్ట్ చేసేలా మార్పులు చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. చదవండి👉 ట్విటర్ తొలగింపులు, మాజీ ఉద్యోగులకు కొత్త చిక్కులు -
‘ఇదేం బాదుడు రా నాయనా’..ట్విటర్ యూజర్ల నుంచి 3 ఫీచర్లపై అదనపు ఛార్జీలు!
ట్విటర్ బాస్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు బ్లూటిక్ వెరిఫికేషన్‌పై 8 డాలర్లు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన మస్క్.. తాజాగా మరో మూడు ఫీచర్లు వినియోగించిన యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచి ఆ సంస్థలో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ వెరిఫికేషన్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. తాజాగా సంస్థ ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాలని కోరడంతో పాటు..ట్విటర్లో మూడు ప్రధానమైన బేసిక్ ఫీచర్లను వినియోగించే ట్విటర్ యూజర్ల నుంచి అదనంగా కొంత మొత్తం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారంటూ ఆ నివేదికలు పేర్కొన్నాయి. డైరెక్ట్ మెసేజ్ (డీఎం)ని చెల్లింపు ఫీచర్‌గా మార్చడం గురించి సలహాదారులతో మస్క్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. హై ప్రొఫెల్ ట్విటర్ యూజర్లు ఇతర ట్విటర్ యూజర్లకు పర్సనల్‌గా మెసేజ్ పంపాలనుకుంటే..వారి వద్ద నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రస్తుతానికి, ‘హై-ప్రొఫైల్ యూజర్లు’ ఏ కేటగిరీలో వస్తారనే అంశంపై స్పష్టత లేదు. వినియోగదారులు ట్విటర్లో వీడియోలు చూడాలనుకుంటే..అందుకోసం కొంత మొత్తాన్ని ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంది. వీడియోలను అప్లోడ్ చేయడానికి, వాటిని చూసేందుకు ప్రయత్నించే వీక్షకుల నుంచి ఛార్జీలు వసూలు చేసేలా మస్క్ ఒక ఫీచర్‌పై వర్క్ చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. పేవాల్డ్ వీడియో అని పిలిచే ఈ ఫీచర్‌ను మరో రెండు మూడు వారాల్లో సిద్ధం చేయాలని మస్క్ కోరుకుంటున్నట్లు నివేదించింది. అలాగే, టైం డ్యూరేషన్ ఎక్కువ ఉన్న వీడియోలు లేదా ఆడియోను పోస్ట్ చేయాలనుకునే వారు ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వరుసగా మూడు ఫీచర్లను వినియోగించుకున్న యూజర్లు అదనపు చార్జీల బాదుడు భరించాల్సిందే. -
అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే
న్యూయార్క్: అంతర్జాల ప్రపంచంలో అత్యంత ఆసక్తిదాయకమైన వేదిక అంటూ ఏదైనా ఉందంటే అది ట్విట్టర్ మాత్రమేనని ఆ సంస్థ నూతన అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ ఖాతా అధీకృతమైనదని తేల్చి చెప్పే ‘బ్లూ’ టిక్ గుర్తు సదుపాయంతో కొనసాగే ప్రీమియం ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్ల రుసుము అమలుచేయాలన్న ఆలోచనల నడుమ తన ట్విట్టర్ సంస్థ ప్రాధాన్యతను మస్క్ గుర్తుచేశారు. ‘ ట్విట్టర్ అనేది ఇంటర్నెట్లో అత్యంత ఇంట్రెస్టింట్ ప్లేస్. అందుకే నేను చేసిన ఈ ట్వీట్‌ను వెంటనే ఇప్పటికిప్పుడే చదివేస్తున్నారు’అని అన్నారు. ‘బ్లూ టిక్కు చార్జ్ చేస్తే అత్యంత క్రియాశీలకమైన వ్యక్తులు ఇకపై ట్విట్టర్‌ను వదిలేస్తారు. డబ్బులు రాబట్టేందుకు మీడియా, వ్యాపార సంస్థలే ఖాతాలు కొనసాగిస్తాయి. చివరకు ట్విట్టర్ ఒక బిల్బోర్డ్లాగా తయారవుతుంది’ అని బ్లూ టిక్ యూజర్ కస్తూరి శంకర్ ట్వీట్ చేశారు. ‘ తాము ఏ(సెలబ్రిటీ) ఖాతాను ఫాలో అవుతున్నామో సాధారణ యూజర్లకు తెలుసు. ప్రత్యేకంగా బ్లూ టిక్ అక్కర్లేదు’ అని మరొకరు ఎద్దేవాచేశారు. -
ఇక అమ్మకానికి ట్విట్టర్ ‘బ్లూ టిక్’
న్యూయార్క్: ట్విట్టర్లో యూజర్ నేమ్ అధికారికమైనది, ప్రముఖమైనదని నిర్ధారించే వెరిఫికేషన్ బ్లూ టిక్ కోసం ఇక నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే. సంస్థ కొత్త బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (51) తీసుకున్న ఈ మేరకు ప్రకటించారు. ‘‘ప్రజలకు అధికారం! బ్లూ టిక్కు నెలకు 8 డాలర్లు’’ అంటూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ఈ చార్జీ కొనుగోలు శక్తి ప్రాతిపదికగా ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ‘‘బ్లూ టిక్ యూజర్లకు ఇకపై రిప్లైలు, మెన్షన్లు, సెర్చ్‌ల్లో జర్లకు మరింత ప్రయారిటీ దక్కుతుంది. స్పామ్లు, స్కామ్‌ల బెడద తగ్గడమే గాక పెద్ద వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేసుకోవచ్చు. యాడ్లు సగానికి తగ్గుతాయి’’ అంటూ తాను కల్పించబోయే సౌకర్యాలను ఏకరువు పెట్టారు. ఇకనుంచి రాజకీయ నాయకుల మాదిరిగా ఇతర ప్రముఖులకు కూడా పేరు కింద సెకండరీ ట్యాగ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కానీ ఆయన తాజా నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వ్యాపార ధోరణికి పరాకాష్ట అంటూ యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘బ్లూ టిక్ కొనసాగాలంటే ఇకపై నేను నెలకు 20 డాలర్లు చెల్లించాలా? ఏమన్నా అర్థముందా?’’ అంటూ 70 లక్షల మంది ఫాలోవర్లున్న రచయిత స్టీఫెన్ కింగ్ అసంతృప్తి వెలిబుచ్చారు. నిజానికి ట్విట్టరే తనకు ఎదురు డబ్బులు చెల్లించాలంటూ ట్వీట్ చేశారు. బదులుగా మస్క్ కూడా, ‘‘మేం కూడా బిల్లులు చెల్లించాలిగా! కేవలం ప్రకటనలపై ఆధారపడి సంస్థను నడపలేం’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఎవరైనా యూజర్ 8 డాలర్లు చెల్లించి తన డిస్ప్లే నేమ్‌ను ఎలాన్ మస్క్ అని మార్చుకుని నీ ప్రొఫైల్ పిక్నే పెట్టుకుని అచ్చం నీలా ట్వీట్లు చేయడం మొదలు పెడితే అప్పుడేం చేస్తావ్?’’ అంటూ రుబియూ5 అనే యూజర్ మస్క్‌ను ప్రశ్నించాడు. కానీ మస్క్ మాత్రం తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. ‘‘ఎవరెన్ని విమర్శలైనా చేయండి. నెలకు 8 డాలర్లు మాత్రం కట్టి తీరాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ తన చేతుల్లోకి వస్తూనే సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దెతో పాటు మరో ఇద్దరు అత్యున్నతాధికారులను వివాదాస్పద రీతిలో మస్క్ ఇంటికి పంపడం తెలిసిందే. నకిలీ ఖాతాల బెడదను నివారించేందుకు ట్విట్టర్ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో 2009లో బ్లూ టిక్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. -
మస్క్ క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూటిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూటిక్‌ను నిలుపుకోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.700) చెల్లించాల్సి ఉంటుందని ట్విటర్ ఏకైక డైరెక్టర్ మస్క్ మంగళవారం ప్రకటించారు. దేశంలోని కొనుగోలు శక్తి ప్రకారం ధరలను సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు బ్లూటిక్ యూజర్లు అదనపు ప్రయోజనాలు పొందుతారని ముఖ్యంగా స్పామ్, స్కామ్‌ల నుంచి తప్పించుకోవడానికి అవసరమైన రిప్లైలు పొందడంలో ప్రాధాన్యత, ప్రస్తావనలు, సెర్చ్‌లో ప్రాధాన్యత లభిస్తుందని మస్క్ ప్రకటించారు. అంతేకాదు పెద్ద వీడియోను, ఆడియోను కూడా పోస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు తమతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణ కర్తలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఇలా వచ్చే ఆదాయం కంటెంట్ క్రియేటర్ల చెల్లింపులకు తోడ్పడు తుందని కూడా మస్క్ ట్వీట్ చేశారు కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న తక్షణమే మస్క్ అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్ , పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను పునరుద్ధరిస్తున్నానని చెప్పిన మస్క్, నెలకు 20 డాలర్ల ఫీజును వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత డైరెక్టర్ల బోర్డును రద్దు చేసి ప్రస్తుతం ట్విటర్ ఏకైక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా బ్లూటిక్ ఫీజును నెలకు 8 డాలర్లుగా నిర్ణయించారు. అయితే ఈ బ్లూటిక్ బాదుడుపై చాలామంది యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. You will also get: - Priority in replies, mentions & search, which is essential to defeat spam/scam - Ability to post long video & audio - Half as many ads — Elon Musk (@elonmusk) November 1, 2022 This will also give Twitter a revenue stream to reward content creators — Elon Musk (@elonmusk) November 1, 2022 -
మస్క్ పంజరంలో మాటల పిట్ట
అనేక నెలల నాటకీయత అనంతరం ఎట్టకేలకు ట్విట్టర్ అమ్మకం పూర్తయింది. ఎప్పుడెలా ప్రవర్తి స్తారో అంతుచిక్కని అంతర్జాతీయ వ్యాపారి, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ చేతికి అక్టోబర్ 27న ఈ సుప్రసిద్ధ సామాజిక మాధ్యమ వేదిక వచ్చింది. 4400కోట్ల డాలర్లకు జరిగిన కొనుగోలులో ఇది అంతిమ ఘట్టంగా కనిపించవచ్చు. కానీ, ఇక నుంచే అసలు కథ! తక్షణ వార్తలకూ, అభిప్రాయ వినిమయానికీ అంతర్జాతీయంగా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సోషల్ మీడియా బుజ్జిపిట్ట భవితపై చర్చ మళ్ళీ మొదలైంది. యాజమాన్యం మార్పుతో సమాచార ప్రమాణాలు క్షీణిస్తాయా అనే శంక రేగుతోంది. ముప్పాతిక శాతం ఉద్యోగాల ఊచకోత మొదలు ధ్రువీకృత ఖాతాదార్లకిచ్చే బ్లూ టిక్ మార్క్కై నెలకు 20 డాలర్ల రుసుము ప్రతిపాదన వరకు మస్క్ చేష్టలు గగ్గోలు పుట్టిస్తున్నాయి. ► వర్తమాన స్థితిని మిత్రులతో పంచుకోవాలన్న జాక్ డోర్సీ ఆలోచనతో 2006లో ట్విట్టర్ మొదలైంది. మైక్రో బ్లాగింగ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్‌గా అమెరికాలో ఏర్పాటైన ట్విట్టర్ ఇప్పుడు 130 కోట్లకు పైగా ఖాతాలతో దానికదే ఓ పెద్ద వ్యవస్థ. ప్రపంచంలో అత్యధికులు వాడుతున్న మొబైల్ యాప్‌లలో 6వ స్థానం ఈ మాటల పుట్టదే. 280 అక్షరాల ట్వీట్‌తో భావావేశాలను వ్యక్తీకరించే ఈ వేదిక వినియోగం భారత్‌తో పాటు జపాన్, జర్మనీ, ఉత్తర అమెరికాల్లో ఎక్కువ. రోజూ 24 కోట్ల మంది దీన్ని చూస్తారని ఓ లెక్క. కొన్నాళ్ళుగా అనేక వివాదాలెదుర్కొన్నా, ప్రత్యామ్నాయ సమాచార, భావప్రకటన వేదికగా అపరిమిత ప్రభావం చూపిన ఘనత ఈ టీనేజ్ యాప్‌దే! రాకెట్ సంస్థ స్పేస్ ఎక్స్, విద్యుత్ కార్ల సంస్థ టెస్లా, బ్రెయిన్చిప్ అంకురసంస్థ న్యూరాలింక్, సొరంగ నిర్మాణ సంస్థ బోరింగ్ కంపెనీ – ఇలా మరో 4 సంస్థలు నడుపుతున్న మస్క్ అత్యధిక ఫాలోయర్లతో ట్విట్టర్లో 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడదే ట్విట్టర్‌కు అధినేతయ్యారు. ► ఏప్రిల్‌లో కొనుగోలు ప్రతిపాదన చేసి, ఆ తర్వాత ముందు వెనకలాడి, చివరకు ట్విట్టర్ బల వంతంపై కొనుగోలు ప్రక్రియ పూర్చి చేసిన మస్క్ అంతా అవగానే అన్న మాట – ‘పంజరంలోని పక్షికి స్వేచ్ఛ దొరికింది. శుభ సమయం వచ్చేసింది’. వస్తూనే ఆయన సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా పలువురికి ఉద్వాసన పలికి, బోర్డు మొత్తాన్నీ రద్దు చేశారు. తోకలేని తుర్రుపిట్ట ‘పబ్లిక్’ లిస్టెడ్ కంపెనీ నుంచి ‘ప్రైవేట్’కు మారింది. అంటే, సదరు వేదికపై విచక్షణాధికారం ఆయనదే! బయటి పర్యవేక్షణ, పరిశీలన తగ్గనున్నాయి. అంటే గతంలోనే పారదర్శకత, జవాబుదారీతనం లేదని విమర్శలెదుర్కొన్న ట్విట్టర్లో అవి మరింత క్షీణించవచ్చు. కానీ, విభిన్న అభిప్రాయాలున్నవారితో సమాచార నియంత్రణ మండలి పెడతానంటున్నారు. వివాదాలతో ట్విట్టర్లో శాశ్వత నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆ మండలిలో ఉంటారట. తన కొత్త ముంజేతి చిలక భావస్వేచ్ఛకు ప్రతిరూపమన్న మస్క్ మాట ఆచరణ సాధ్యమేనా? ► నియంత్రణను సడలిస్తే... అనధికార ఖాతాలతో, పెద్ద సంఖ్యలో తనంత తానే పోస్టులు పంపే ఇంటర్నెట్ ప్రోగ్రామైన ‘స్పామ్ బోట్’లతో విద్వేషపరులు ట్విట్టర్‌ను ఇష్టానికి ఆడించగలుగుతారు. ఈ విద్వేష వ్యాఖ్యాతల హోరులో అసలు యూజర్ల స్వరం వినిపించకుండా పోతుంది. మరోపక్క ఇప్పటి దాకా ఉచితమైన ధ్రువీకృత బ్లూటిక్ నెలవారీ రుసుము కట్టకుంటే పోతుంది. ధ్రువీకృత ఖాతా లేకపోయేసరికి ప్రముఖులు, బ్రాండ్లు, ప్రభుత్వ అధికారుల పేర్లతో నకిలీ ఖాతాదారులు ఏదేదో పోస్ట్ చేస్తారు. తప్పుడు వార్తలు మరింతగా ప్రజల్లో వ్యాపిస్తాయి. అందుకే, అటు ట్రంప్‌ను చేరదీయడం, ఇటు బ్లూటిక్కు నెలవారీ రుసుము ట్విట్టర్‌కు తిరోగమన చర్యలే! 40 దేశాల్లో తన సంస్థల వ్యాపారమున్న మస్క్ ఆ ప్రభుత్వాలకు చీకాకు కలిగేలా ట్విట్టర్లో స్వేచ్ఛను అనుమతించ డమూ అనుమానమే. ఆర్థిక ప్రయోజనాల్నీ, భావస్వేచ్ఛనూ సమతౌల్యం చేసుకోక తప్పదు. ► యాప్‌లో మార్పులు తేవడంలో, పెద్ద సంఖ్యలో పోస్ట్‌లు చేసే స్పామ్ ఖాతాలను తొలగించ డంలో నత్తనడక నడుస్తున్నారంటూ మస్క్ కొద్ది నెలలుగా ట్విట్టర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు వచ్చీరాగానే తనదైన ముద్రకు ప్రయత్నిస్తున్నారు. ఆయన బృందాలు ట్విట్టర్ సాఫ్ట్వేర్ కోడ్‌నూ, పనిలోని వివిధ అంశాలనూ ఆకళింపు చేసుకొనే పనిలో పడ్డాయి. వారంలో 7 రోజులూ, రోజుకు 12 గంటలు పనిచేసి, గడువులోగా ఇచ్చిన పని పూర్తిచేయకుంటే ఉద్యోగాలు ఊడతాయనే భయం తెచ్చారు. తన ఇతర కంపెనీల్లోని నమ్మకస్థుల్ని పదుల సంఖ్యలో ట్విట్టర్లో పనికి దింపి, సోర్స్‌కోడ్ సహా అన్నీ చకచకా నేర్చేసుకొమ్మంటున్నారు. కార్ల కంపెనీ నిపుణుడికి కంటెంట్ కథెలా తెలుస్తుందని ఆలోచించట్లేదు. రాత్రికి రాత్రి ట్విట్టర్ రూపుమార్చేయాలని ఆత్రపడుతున్నారు. ► తోటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌ల స్థాయి మార్కెట్ విలువకు చేరుకోలేక, గత పదేళ్ళలో 8 ఏళ్ళు ఈ తుర్రుపిట్ట నష్టాలే చవిచూసింది. కాబట్టి ప్రతిభావంతుడైన వ్యాపారిగా మస్క్ తొందర అర్థం చేసుకోవచ్చు. కానీ, ట్విట్టర్‌ను కొనేశా కాబట్టి ఏదైనా చేస్తా, అన్ని నిబంధనలకూ అతీతుణ్ణి అనుకుంటే కష్టం. రథసారథిగా ఈ పిచ్చి మారాజు చేపట్టే చర్యలు రేపు ఎదురుతన్నే ప్రమాదం ఉంది. ఈ ఇష్టారాజ్యపు చేష్టలన్నీ మాటల పిట్ట గొంతుకు ఉరి బిగించి, బెదిరిన వాణిజ్య ప్రకటన కర్తలు దూరం జరిగినప్పుడు వీడని నీడలా వెంటాడతాయి. ట్విట్టర్ సంస్థాపకుడు జాక్ కొత్తగా మొదలెట్టిన వికేంద్రీకృత సోషల్ నెట్వర్క్ బ్లూస్కై లాంటి వాటి నుంచి పోటీ సరేసరి. వరస చూస్తుంటే, ఈ వ్యవహారంలో తలబొప్పి కడితే కానీ తత్త్వం బోధపడేలా లేదు! -
మేము ట్విటర్‌లా ఫీజుల వసూలు చేయం.. ఇటు వచ్చేయండి!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది వైరల్‌గా మారుతుంది. ఆయన చేసే ప్రతీ పనిలో తన ట్రేడ్‌మార్క్‌ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి విమర్శలకు కూడా దారి తీస్తుంటాయి. తాజాగా ట్విటర్ టేకోవర్ తర్వాత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు మస్క్. ట్విటర్లోని బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో అది నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా దీనిపై కూ(koo) సీఈవో, సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ స్పందించారు. ఇటు వచ్చేయండి! ట్విట్టర్‌కు పోటీగా ఉన్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ (Koo) యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్టింట బ్లూ టిక్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కూ సంస్థ సీఈఓ రాధాకృష్ణ దీనిపై ట్వీట్ చేశారు. అందులో తాము ట్విటర్‌లా కాదని తెలుపుతూ.. ‘వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ‘కూ’ నెలకు రూ. 1,600 వసూలు చేయదని #switchtokoo" అని ట్వీట్ చేశారు. మరి ఈ ట్విట్ యూజర్లను ఆకర్షిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేసిన ఎలాన్ మస్క్ అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. ఇక భవిష్యత్తులో మరెన్ని మార్పులు వస్తాయో చూడాలి. చదవండి: ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు -
ట్విటర్ బ్లూటిక్ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పలు మీమ్స్, సెటైర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నెలకు 20 డాలర్లు (రూ.1600కుపై మాటే) చెల్లించడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. దీని బదులు నెలకు 1600 సిప్ (సిస్టంఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చు అని ఒకరు మండిపడ్డారు. బ్లూటిక్కా? అసవసరమే లేదు. అదేమీ సర్టిఫికేట్ కాదుగా..అసలు నేను ఎపుడూ అడగలేదు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. (ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు) Blue Tick folks now be like “I will give it up, I never asked for it, yeh koi certificate nahi hai.” 😂 — Shiv Aroor (@ShivAroor) October 31, 2022 Now opening a SIP of Rs 1600 pm which I saved by not having a blue tick. — Gabbbar (@GabbbarSingh) October 31, 2022 I’ve got your Blue Tick right here pic.twitter.com/hlCOzOumwe — cosmic jester (@cosmicjester) October 31, 2022 కాగా బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు తరువాత సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ట్విటర్ చేతికి రాగానే సీఈవో పరాగ్ అగర్వాల్ సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేసిన మస్క్ సంస్థలో ఉద్యోగులను తొలగించే ప్రణాళిల్లోఉన్నట్టు పలు నివేదికలుకోడై కూస్తున్నాయి. అయితే ఈ వార్తలను మస్క్ తిరస్కరించినప్పటికీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. సరికొత్తగా బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ వెర్జ్ రిపోర్ట్ చేసింది. నవంబర్ 7లోగా ఈ కొత్త వెరిఫికేషన్ రీవాంప్ను రూపొందించాలని, లేదంటే వేటు తప్పదని మస్క్ తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. -
ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ కొనుగోలు చేసినప్పటినుంచి ప్రతీ రోజు ఏదో ఒక సెన్సేషన్తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మస్క్ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తాజాగా తెలుస్తోంది. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని యోచిస్తున్నన్నారన్న వార్త ట్రెండ్ అవుతోంది. ఇప్పటిదాకా బ్లూటిక్ అంటే గౌరవంగా, అఫీషియల్ ఖాతాగా భావించేవారు. ఇపుడిక వారికి నెలకు సుమారు రూ. 1640 భారంగా మారనుంది. ఈ వార్తలతో ‘ట్విటర్ బ్లూ’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. (Bluetick ట్విటర్ బ్లూటిక్ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు) SOURCES: The new twitter blue verification feature will have 69 tiers, with the top tier giving you a crown icon and the power to ban any user. It will cost $420,000,000. Elon Musk told Twitter employees if they don’t finish it by Monday, he will blast Nickelback in the office. — Shibetoshi Nakamoto (@BillyM2k) October 31, 2022 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్ ట్విటర్ యూజర్లకు గట్టి షాక్ ఇవ్వనున్నారట. ముఖ్యంగా ట్విటర్‌కు బాగా ఎడిక్ట్ అయిన బ్లూ టిక్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్ల నుంచి సబ్స్క్రిప్షన్ ఛార్జీలను వసూలు చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారట. ది వెర్జ్ నివేదిక ప్రకారం బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం వినియోగ దారుల నుంచి నెలకు 20 డాలర్లు (19.99) వసూలు చేయనున్నారట. దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, బ్లూటిక్ ఉన్న యూజర్లు ఈ కొత్త నిబంధన ప్రకారం చెల్లింపు చేయాల్సిందే. ఇందుకుగాను యూజర్లకు 90 రోజులు గడువు ఇస్తారు. గడుపులోపు చెల్లించకపోతే సదరు యూజర్లు ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను కోల్పోతారు. అంతేకాదు ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి ఉద్యోగులకు నవంబర్ 7 వరకు గడువిచ్చారు. లేదంటే వారికి ఉద్వాసన తప్పదని కూడా హెచ్చరించినట్టు సమాచారం. Oh no, all our diabolical plans have been revealed!! — Elon Musk (@elonmusk) October 31, 2022 అయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సబ్స్క్రిప్షన్ పద్దతి అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో నెలకు 5 డాలర్లు వసూలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రీమియం, హెవ్వీ ట్వీటర్లను కోల్పోతోందన్న నివేదికల మధ్య ఈ సర్వీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎలా అందుబాటులోకి తెచ్చేలా మొత్తం పేమెంట్ స్ట్రక్చర్ప్లాన్ను ఎలా మారుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. -
వాట్సాప్‌లో మూడో బ్లూటిక్ ఆప్షన్.. క్లారిటీ
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈలోపు మరో కొత్త ఫీచర్ అంశం తెర మీదకు వచ్చింది. మూడో బ్లూటిక్ ఆప్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉందంటూ కొన్ని టెక్ బ్లాగులు రాసుకొచ్చాయి. దీనిపై వాట్సాప్ బ్లాగ్ స్పందించింది. మూడో టిక్ దేనికంటే.. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా సందేశాలు పంపినప్పుడు.. సెండ్ అయ్యాక సింగిల్ గ్రేటిక్, అవతలి వాళ్లకు రిసీవ్ అయినా, లేదంటే ప్రైవసీలో ఉండి ఆ సందేశాన్ని చూసినా డబుల్ గ్రేటిక్ పడుతుంది. ఒకవేళ ప్రైవసీలో లేకుండా చూస్తే డబుల్ బ్లూటిక్ పడుతుంది. అయితే యూజర్ పంపిన మెసేజ్‌ను అవతలి వాళ్లు స్క్రీన్ షాట్ తీస్తే మూడో టిక్ పడుతుందని, తద్వారా అవతలివాళ్లకు తెలిసిపోతుందనేది ఆ బ్లాగ్ కథనాల సారాంశం. అయితే వాట్సాప్ అప్డేట్ ఫీచర్లపై పక్కాగా అందించే అధికారిక బ్లాగ్ బేటాఇన్ఫో ఈ కథనాల్ని ఫేక్‌గా తేల్చేసింది. మూడో టిక్ ఆప్షన్ తేవట్లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెకానిజం కోసం వాట్సాప్ ఓనర్కంపెనీ మెటా ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని స్పష్టత ఇచ్చింది. చదవండి: గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌కి అడ్మిన్ బాధ్యుడు కాదు! -
మరోసారి ట్విటర్ ఖాతాలకు బ్లూటిక్ నిలిపివేత..!
అమెరికన్ మైక్రో-బ్లాగింగ్ సైట్, సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది. వెరిఫికేషన్ రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ట్విటర్ ఖాతాల బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడంలేదు. గతవారంలో పలు ఫేక్ ట్విటర్ ఖాతాలను తప్పుగా వెరిఫికేషన్ చేసి బ్లూటిక్‌ను ఇచ్చినట్లు ట్విటర్ నిర్థారించింది. ఇటీవల కాలంలో ట్విటర్ ఖాతాల ధృవీకరణ కోసం అప్లై చేసి ఉంటే వారికి బ్లూటిక్ వెరిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ.. "రాబోయే కొద్ది వారాల్లో బ్లూటిక్ వెరిఫికేషన్‌కు వచ్చే దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ట్విటర్ తన బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2017 సంవత్సరంలో, ఈ ఏడాది మొదట్లో కూడా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసింది. తాజాగా ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది. -
ధోనికి షాక్ ఇచ్చిన ట్విటర్; అభిమానుల ఆగ్రహం
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ట్విటర్ షాక్ ఇచ్చింది. ధోని అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ టిక్‌మార్క్‌ను తొలగించింది. అయితే ట్విటర్ ఆ టిక్‌ను ఎందుకు తొలగించిందనే దానిపై స్పష్టత రాలేదు. ధోనీ ట్విటర్లో కొంతకాలంగా యాక్టివ్‌గా లేకపోవడంతోనే ఇలా జరిగి ఉంటుందని సమాచారం. ధోని ఈ ఏడాది జనవరి 8న చివరి ట్వీట్ చేశాడు. అప్పటినుంచి ధోని ట్విటర్లో యాక్టివ్‌గా లేడు. ట్విటర్ రూల్స్ ప్రకారం ఆరు నెలల పాటు ఒక వ్యక్తి అకౌంట్లో లాగిన్ కాకుంటే సదరు సంస్థ బ్లూ టిక్ తొలగిస్తుంది. ఒకవేళ బ్లూ టిక్ మళ్లీ కావాలంటే వెరిఫికేషన్ కోరుతుంది. అయితే ధోని ట్విటర్‌కు బ్లూ టిక్ తొలగించడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బ్లూటిక్‌ను యాడ్ చేయాలంటూ ట్విటర్ సంస్థను డిమాండ్ చేశారు. తన రిటైర్మెంట్ విషయాన్ని కూడా ధోని ట్విటర్లో కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతేగాక తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా ధోని ఇన్స్టాలోనే షేర్ చేస్తూ వచ్చాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోని ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. -
అవును! అప్పుడు పొరపాటు జరిగింది : ట్విట్టర్
గతంలో తమ వల్ల పొరపాటు జరిగిందంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఒప్పుకుంది. ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోమంటూ యూజర్లకు హామీ ఇచ్చింది. ఇకపై మరింత నాణ్యతతో సేవలు అందిస్తామని పేర్కొంది. ఫేక్ అకౌంట్లు మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియాగా సంచలనం సృష్టించిన ట్విట్టర్ గతంలో ఫేక్ ఖాతాలను వడబోసేది. అయితే ఈ వడపోత కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్విట్టర్ 2017 నుంచి ఈ పని నిలిపేసింది. అయితే అప్పటికే అనేక ఫేక్ అకౌంట్లు ట్విట్టర్లో ఉండిపోయాయి. వీటి వల్ల యూజర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. తప్పు జరిగింది దాదాపు నాలుగేళ్ల తర్వాత 2021 మే నుంచి మరోసారి వెరిఫికేషన్ ప్రోగ్రామ్ చేపట్టింది ట్విట్టర్. ఈ సందర్భంగా ట్విట్టర్ ప్రతినిధులు స్పందిస్తూ ... గతంలో పొరపాటుగా కొన్ని ఫేక్ అకౌంట్లకు తాము అనుమతి ఇచ్చామని, వెరిఫికేషన్‌లో జరిగిన తప్పులే ఇందుకు కారణమని తెలిపారు. ఇకపై ఫేక్ అకౌంట్లకు ఎట్టి పరిస్థితుల్లో వెరిపై చేసి బ్లూ టిక్ ఇచ్చే ప్రశ్నే లేదని తెలిపారు. ఇవి నిబంధనలు మానిప్యులేషన్, స్పామ్ పాలసీ ప్రకారం ఫేక్ అకౌంటర్లను శాశ్వతంగా తొలగిస్తున్నామని, అదే విధంగా వాటికి జారీ చేసిన వెరిఫైడ్ బ్యాడ్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ట్విట్టర్. ఫేక్ ఖాతా కాదు అనేందుకు ట్విట్టర్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం గత ఆరు నెలలుగా ఖాతా ఉపయోగంలో ఉండాలి. దీంతో పాటు ఖాతాకు సంబంధించిన ఈమెయిల్, ఫోన్ నంబరు వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ నేమ్, ఇమేజ్‌లు కూడా ఉండాలి. అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిటీస్ ఉండాలి. ఈ నియమాలు పాటించే ఖాతా దారులకు వెరిఫైడ్ బ్యాడ్జీని జారీ చేస్తుంది ట్విట్టర్. లేని పక్షంలో ఫేక్‌గా గుర్తించి ఖతాలు స్తంభింప చేస్తుంది. -
ప్రజలకు టీకాలివ్వడం మాని.. ‘బ్లూటిక్’ కోసం కేంద్రం పోరాటం
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు పొందడంలో స్వావలంబన (ఆత్మనిర్భర్) సాధించాలం టూ దేశ ప్రజలను వదిలేసి, బ్లూ టిక్ కోసం మోదీ ప్రభు త్వం పోరాటం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చురకలంటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర అగ్ర నేతల అకౌంట్లకు బ్లూ టిక్‌లను ట్విట్టర్ తొలగించడం, ఆ వ్యవహారం వివాదా స్పదం కావడంతో తిరిగి పునరుద్ధరించడంపై రాహుల్ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందించారు. ‘ట్విట్టర్‌పై రాజకీయాలు చేయడం రాహుల్‌కు చాలా ముఖ్యమైన విషయం, ఆయన అతిపెద్ద వేదిక కూడా ఇదే’ అని ఎదురుదాడి చేశారు. ఢిల్లీలోని గోవింద్ వల్లభ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి తమ సంస్థలో పనిచేసే నర్సులు మలయాళంలో మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించడంపైనా రాహుల్ స్పందించారు. భారతీయ భాషల్లో ఒక్కటైన మలయాళంపై వివక్ష మానుకోవాలన్నారు. -
ఉపరాష్ట్రపతి ఖాతా: ట్విటర్ దుందుడుకు చర్య
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ దుందుడుకు చర్య సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూటిక్‌ను తాజాగా తొలగించింది. 6 నెలలుగా ఆయన ఖాతా యాక్టివ్‌గా లేని కారణంగా అన్ వెరిఫై చేసి బ్లూ మార్క్ తొలగించినట్టు ట్విటర్ వెల్లడించింది. శనివారంఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వినియోగదారు పేరు మార్చినా లేదా ఖాతా యాక్టివ్‌గా లేకపోయినా ఎలాంటి నోటీసు లేకుండా ఎప్పుడైనా 'ధృవీకరించబడిన' బ్లూ బ్యాడ్జ్ చిహ్నాన్ని తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ఉపరాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ నుండి బ్లూ బ్యాడ్జ్ తొలగించడంపై బీజేపీ ముంబై అధికార ప్రతినిధి సురేష్ నఖువా గ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'భారత రాజ్యాంగంపై దాడి' అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జూలై 23, 2020 న పోస్ట్ చేసిన చివరి ట్వీట్ చేయగా, సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖాతాకు 931,000 మందికి పైగా అనుచరులున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి ట్విటర్‌కు కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఈ వార్ మరింత ముదిరిన సంగతి తెలిసిందే. దిగొచ్చిన ట్విటర్ అటు బీజేపీ శ్రేణులు, ఇటు నెటిజనుల నుంచి తీవ్ర ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో ట్విటర్ దిగొచ్చింది. ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతా బ్లూ మార్క్ టిక్‌ను పునరుద్ధరించింది. -
వాట్సాప్‌లో ఈ రహస్య ఫీచర్ తెలుసా?
వాట్సాప్‌లో మనం పోస్ట్ చేసిన మెసేజ్ ఎవరైనా చదివారా లేదా అని తెలుసుకోవటానికి ఏం చేస్తాం. మెసేజ్ దగ్గర బ్లూటిక్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటాం. మన మెసేజ్‌కు అవతలి వారు రెస్పాండ్ అవుతారా లేదా అన్నది పక్కనపెడితే వాళ్లు మన మెసేజ్ చదివారన్నది మాత్రం తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్ చదివారో లేదో తెలుసుకోవటం కష్టం. అసలు బ్లూటిక్స్ గురించి చెప్పాలంటే.. ఈ ఫీచర్‌ను వాట్సాప్ 2014లో వాడుకలోకి తెచ్చింది. బ్లూటిక్స్ పడ్డాయంటే ఎదుటివ్యక్తి మన మెసేజ్ చదివాడని అర్థం. ఆ తర్వాత వాట్సాప్ వన్‌టిక్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తిని మన మెసేజ్ చేరగానే వన్‌టిక్ పడుతుంది. అయితే దాన్ని తర్వాత గ్రే కలర్లోకి మార్చేసింది. బ్లూటిక్ ఆప్షన్ ఆఫ్ చేసిన వ్యక్తి మీ మెసేజ్ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్ మెసేజ్ చేయండి. ఆ వ్యక్తి మీ వాయిస్ రికార్డింగ్ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్ పడిపోతాయి. అతడు బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసినప్పటికి వాయిస్ మెసేజ్ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్ పడిపోతాయి. ఇది ఒకరకంగా వాట్సాప్‌లోని లోపమని చెప్పొచ్చు. గత సంవత్సరమే ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది. -
యూజర్లందరికీ ట్విటర్ బ్లూ టిక్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్విటర్ ఎంతో ప్రాముఖ్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ విషయాన్నైనా ఇటీవల అధికారికంగా ప్రకటించడానికి ట్విటర్‌నే ప్రధాన సాధనంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ట్విటర్‌ను ఉపయోగించనంతగా మరోదాన్ని ఉపయోగించరు. ట్విటర్ ద్వారానే విలువైన విషయాలను షేర్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టు ట్విటర్ కూడా వారికి ఆ అకౌంట్ వాళ్లదే అని తెలిసేటట్టుగా వెరిఫికేషన్ టిక్ కూడా ఇస్తోంది. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ టిక్‌ను యూజర్లందరకూ ఇస్తోంది. యూజర్ల గుర్తింపును నిర్థారిస్తూ.. ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతోంది. గతేడాది రద్దు చేసిన ఈ ప్రక్రియను, ఇప్పుడు మళ్లీ చేపడుతున్నట్టు తెలిపింది. తొలుత ఈ బ్లూ టిక్ ఉండటాన్ని.. కొందరు స్టేటస్ సింబల్‌గా భావించేవారు. కానీ ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ టిక్‌ను ఇక అందరికీ ఇస్తోంది. సంబంధిత వినియోగదారుని అకౌంట్ అతనిదే అని ధ్రువీకరిస్తూ ఈ బ్లూ టిక్ మార్క్ ఇస్తారు. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన సర్వీసులు అందించే దానిలో తాము ఒకరిగా ఉండాలనుకుంటున్నామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే చెప్పారు. అయితే ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ గుర్తింపు ఐడీ కార్డు, ఫేస్బుక్ ప్రొఫైల్, ఫోన్ నంబర్ వంటివి ఏమైనా అందించాలా అన్న విషయాలేవి ట్విటర్ తెలుపలేదు. 2009లో తొలుత ఈ వెరిఫికేషన్ కోడ్ ప్రక్రియను ట్విటర్ చేపట్టింది. తొలినాళ్లలో సినిమా వాళ్లకు, క్రీడాకారులకు, వీఐపీలకు మాత్రమే ఈ టిక్ మార్క్ ఇచ్చింది. ఆ తర్వాత జర్నలిస్టులకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. అయితే గతేడాది కొత్త దరఖాస్తుదారులకు ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను ఇవ్వడాన్ని ట్విటర్ రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు ప్రారంభించింది. ప్రస్తుతం సామాన్యులకు కూడా ఈ టిక్ మార్కును అందిస్తోంది. సామాన్యులకు కూడా ఈ టిక్ మార్కును అందించడంతో, ఫేక్ అకౌంట్స్ కట్టడయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ముఖ్యగమనిక: మీ మెసేజిని చదివేశారు
మీరు వాట్సప్ వాడుతున్నారా? అయితే ఈమధ్య అందులో మీరు పంపిన మెసేజిల పక్కన రెండు నీలిరంగు టిక్ మార్కులు వస్తున్నాయి కదూ. వాటికి అర్థం ఏంటో మీకు తెలుసా? మీరు పంపిన సందేశాన్ని అవతలివాళ్లు చదివారని. ఒక టిక్ వచ్చిందంటే అవతలి వాళ్లకు అది వెళ్లిందని అర్థం. అదే రెండు టిక్ మార్కులు ఉన్నాయంటే మాత్రం అవతలివాళ్లు దాన్ని చదివేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి ముందు, మన స్నేహితుల టైంలైన్లో 'లాస్ట్ సీన్' అనే విభాగంలో ఏ సమయం ఉందో చూసుకుని, దాన్ని బట్టి మన సందేశం చదివారో లేదో తెలుసుకోవాల్సి వచ్చేది. ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఇప్పటికే మిగిలిన కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఉన్న రెండు నీలిరంగు టిక్ మార్కుల విధానాన్ని వాట్సప్ కూడా అందిపుచ్చుకుంది. ఇది చాలా సులభంగా, కచ్చితంగా ఉంటుందని వాట్పప్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు 60 కోట్ల మంది యూజర్లున్నారు.