Musk's Indian-Origin Advisor Defends Twitter's $8 Fee for Blue Tick Verification
Sakshi News home page

బ్లూ టిక్‌పై డబ్బులు..సమర్ధించిన మస్క్‌ సలహాదారుడు శ్రీరామ్ కృష్ణన్

Published Tue, Nov 8 2022 10:46 AM | Last Updated on Tue, Nov 8 2022 12:09 PM

Indian Origin Advisor Sriram Krishnan Defended Twitter Blue Tick Verification Subscription - Sakshi

ట్విటర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్లూటిక్‌ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని చేసిన ప్రకటనపై మండి పడుతున్నారు. అయినా విమర్శల్ని పట‍్టించుకోని మస్క్‌ ట్విటర్‌ బోట్ అభివృద్ధి, ట్రోల్స్‌ను అరికట్టేందుకు ఏకైక మార్గమని సమర్ధించుకున్నారు. తాజాగా ట్విటర్‌లో మస్క్‌ సలహాదారుడు, భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ సైతం సంస్థ చేస్తున్న మార్పులు సరైనవేనని అన్నారు. 

పెయిడ్‌ వెరిఫికేషన్‌పై యూజర్లు చేస్తున్న విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు. బ్లూటిక్‌ వెరిఫికేషన్‌పై ట్విటర్‌ 8 డాలర్లు వసూలు చేయడాన్ని సమర్దిస్తూ.. అందుకు నాలుగు కారణాల్ని వెల్లడించారు. ఆ కారణాలు ఇలా ఉన్నాయి

ప్రముఖుల పేర్లతో ఉపయోగించే పేరడీ అకౌంట్‌లను గుర్తించి వారి చర్యలు తీసుకోవచ్చు  

ట్విటర్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సిన యూజర్లు చాలా మంది ఉన్నారని, కాని ఇకపై అలాంటి వారిని వెరిఫై చేయమని చెప్పారు. ప్రముఖులు, సాధారణ యూజర్లు.. ఇలా స్థాయితో సంబంధం లేకుండా 8 డాలర్ల చెల్లించిన వారికి వెరిఫికేషన్‌ ఇస్తామని అన్నారు. 

ప్రస్తుతం ట్విటర్‌లో తీవ్రమైన స్పామ్‌ సమస్యలు ఉన్నాయని కృష్ణన్ చెప్పారు. విటాలిక్ ,ఎలన్ మస్క్‌లు బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ అకౌంట్‌లు హ్యాక్‌ అయినట్లు గుర్తించారు. బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ఇవ్వడం వల్ల ఆ దాడుల సంఖ్యను తగ్గించవచ్చు.  

చివరగా, ట్విటర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ అనేది ఏ యూజర్‌ ఎవరి గురించి ఏం చెప్పారు అనే అంశంపై స్పష్టత ఇస్తుంది. నకిలీ సమాచారాన్ని ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టే ట్విటర్‌  8 డాలర్లు వసూలు చేస్తున్నట్లు కృష్ణన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

చదవండి👉 ట్విటర్‌లో మస్క్‌ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement