ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ బాంబు పేల్చారు. ట్విటర్ బర్డ్ లోగోని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బర్డ్ లోగో స్థానంలో ‘ఎక్స్’లోగోను అప్‌డేట్ చేయనున్నట్లు ట్విట్ చేశారు.
లక్షల కోట్లు వెచ్చించి మరి ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఎలాన్ మస్క్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ట్విటర్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్, ఎక్కువ అక్షరాలతో ట్విట్‌తో పాటు పలు సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ట్విటర్ ప్రత్యేక సంస్థగా కాకుండా తాజాగా, ఏర్పాటు చేసిన ఎక్స్ కార్ప్ అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ట్విటర్ బర్డ్ లోగోని తొలగించి ఎక్స్’ను జత చేయనున్నారు. ఇక, మస్క్ నిర్ణయంతో ఇన్ని రోజులు యూజర్లను అలరించిన ఈ ట్విటర్ పిట్ట ఇకపై కనుమరుగు కానుంది.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023
ట్విటర్ పిట్ట పేరేంటో తెలుసా?
అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లారీ బర్డ్‌కి గుర్తుగా ట్విటర్ సంస్థ బర్డ్ లోగోను రూపొందించింది. ఆ లోగోకి లారీ అనే పేరు పెట్టింది. ఇదే విషయాన్ని ట్విటర్ మాజీ కో-ఫౌండర్ బిజ్ స‍్టోన్ ఓ సందర్భంలో తెలిపారు.
చదవండి👉 అందరూ ఐటీ ఉద్యోగులే, లక్షల్లో ప్యాకేజీలు..ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పరా! ప్లీజ్!
Comments
Please login to add a commentAdd a comment