logo
-
ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!
ఇటీవల కాలంలో మన నగరాల్లో కూడా చిన్ని చిన్న మ్యూజిక్ బ్యాండ్లు వచ్చాయి. ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు కూడా. అయితే పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఎప్పటి నుంచే ఉంది. అక్కడ పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించే రాక్ మ్యూజిక్‌కి క్రేజ్ ఎక్కువ. 60ల కాలంలో ఓ ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్ ఉండేది. ఇప్పటికీ వివిధ పాటల ఆల్బమ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది ఒక ఐకానిక్ మ్యూజిక్ బ్యాండ్. దీని నుంచి విడుదలై ప్రతి మ్యూజిక్ హిట్. అలాంటి ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ లోగో డిజైన్ చూస్తే కంగుతింటారు. ఆ డిజైన్‌కి ప్రేరణ మన హిందువుల ఆరాధ్య దైవమైన కాళిమాత అట. 1962లో, ది రోలింగ్ స్టోన్స్ పేరుతో బ్రిటిష్ రాక్ బ్యాండ్ స్థాపించారు కొందరూ పాప్ గాయకులు. ఆ బ్యాండ్‌లోని సభ్యులు మిక్ జాగర్, కీత్ రిచర్డ్స్, బ్రెయిన్ జోన్స్, బిల్ వైమాన్, చార్లీ వాట్స్ తదితరులు. బ్రిటన్‌లో 1963 ఆ టైంలో వీరి బ్యాండ్ నుంచి విడుదలైన 'కమ్ ఆన్' అనే మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. దీంతో తమ బ్యాండ్ అని తెలిసేలా ఓ ప్రత్యేక లోగో ఉంటే బాగుంటుందని బ్యాండ్ సభ్యులు భావించారు. కానీ సరిగ్గా ఆ టైంలో ఉన్న యూరోపియన్ పర్యటన ఉండటంతో ఫేమస్ బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాన్ పాస్చేచే హడావిడిగా యూరప్‌లో ఉండే మిస్టీరియస్ స్టోన్స్నే లోగోగా డిజైన్ చేయడం జరిగింది. అయితే బ్యాండ్‌కి అనతి కాలంలో మంచి పేరు రావడంతో తమ మ్యూజిక్ మ్యాగ్జైన్ కవర్‌పేజీ గ్రాఫిక్‌ని డిజైన్ చేసేలా జాన్ పాస్చేకే మళ్లీ పని పురమాయించారు బ్యాండ్ సభ్యులు. అప్పుడే మంచి లేబుల్‌తో కూడిన లోగో ఉండాలి. అంది తమ బ్యాండ్ దర్పాన్ని, గొప్పతనాన్ని తెలియజేసేట్టు ఉండాలనుకున్నారు బ్యాండ్ సభ్యులు. ఆ దిశగా రాక్ అండ్ రోల్ బ్యాండ్ రోలింగ్ స్టోన్స్ లోగోని ఆవిష్కరించమని పాస్చేకి చెప్పారు. అయితే ఆ బ్యాండ్ సభ్యుల్లో ఒకరైన మిక్ జాగర్‌ని కాళి దేవత రూపం ఎంతగానో ఆకర్షించింది. ఆ రూపం చిహ్నమైన నాలుక, పెదాలనే లోగోగా తీసుకుంటే అనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్నే డిజైనర్ జాన్ పాస్చేకే చెప్పి డిజైన్ చేయించాడు. ఆ బ్యాండ్ ధరించే టీ షర్ట్‌లపై కూడా ఆ లోగోనే ఉంటుంది. ఇక జాగర్‌కి హిందూ దేవత కాళిమాత గురించి ఎలా తెలిసిందంటే..తన తమ్ముడు ద్వారా తెలుసుకున్నాడు. ఆయన భారతదేశ పర్యటనలు చేస్తుంటాడు. అలా అతడు భారత్ నుంచి తెచ్చిన కొన్ని పుస్తకాలను జాగర్‌కి ఇస్తుండేవాడు. అందులో కనిపించిన కాళి మాత రూపం జాగర్‌ని బాగా ఆకర్షించింది. దీంతో ఆమె చిహ్నలతోనే లోగో తయారు చేయాలనే ఆలోచన జాగర్‌కి తట్టడం జరిగింది. ఆయన కోల్‌కతాలో కాళీ పూజలు చేసి వచ్చి మరీ ఈ లోగోని డిజైన్ చేయించుకున్నారట. ఈలోగో కాళిమాత విగతమైన నాలుక, పెదాలతో ఉంటుంది. అయితే అందరూ మత్రం ఆబ్యాండ్ అసలు సభ్యలైన గాయకుడు జాకర్ పెదాలుగా భావిస్తుంటారు. అసలు కాళీమాత అంటే.. ధిక్కారణ, స్థితిస్థాపకత, శక్తిని సూచిస్తుంది. అలానే తమ బ్యాండ్ ఉనికిని చాటుకుంటూ.. ప్రజలను ఆకట్టుకునేలా.. శక్తిమంతమైన మ్యూజిక్‌ని అందించే బ్యాండ్ అని అర్థం ఇచ్చేలా ఈ విధంగా లోగోని డిజైన్ చేయించినట్లు తెలిపారు. అందుకుగానూ డిజైనర్ పాస్చేకి అప్పట్లో సుమారు రూ. 5 వేల రూపాయలకు పైనే చెల్లించారట. అయితే 1976లో ఆ లోగో ఆ బ్యాండ్ అధికారిక చిహ్నంగా మారడంతో పాస్చేకి దాదాపు రూ.27 లక్షలు చెల్లించి మరీ కాపీరైట్ హక్కలును తీసుకుంది ది రోలింగ్ స్టోన్స్ బ్యాండ్.(చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
ఇకపై టీజీ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖ సిబ్బంది, అధికారులు ధరించే యూనిఫాంకు సంబంధించిన.. పోలీస్ టోపీ, బెల్ట్, బ్యాడ్జీలపై టీఎస్‌కు బదులుగా టీజీ అని ఉండేలా లోగోలో మార్పు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాడ్జీలపై టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండేలా మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. -
మారిన బీఎస్ఎన్ఎల్ లోగో: కొత్తగా ఏడు సర్వీసులు
ప్రభుత్వ రంగ నెట్వర్క్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) కొత్త లోగోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ఆవిష్కరించారు. కొత్త లోగో విశ్వాసం, బలం, దేశవ్యాప్తంగా చేరువ కావడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.కొత్త లోగోమారిన కొత్త బీఎస్ఎన్ఎల్ లోగో గమనించినట్లయితే.. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారతదేశ చిత్రపటం ఉండటం గమనించవచ్చు. దానిపైన తెలుగు, ఆకుపచ్చ రంగులో కనెక్టివిటీ సింబల్స్ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అనేది నీలి రంగులో ఉంది. దానికి కింద కెనెక్టింగ్ భారత్ అనేది కూడా కాషాయ రంగులోనే ఉంది.ఏడు కొత్త సర్వీసులుస్పామ్-రహిత నెట్వర్క్: ఈ కొత్త సర్వీస్ వినియోగదారులను అవాంఛిత కాల్లు, మెసేజ్‌ల నుంచి బయటపడేస్తుంది. క్లీన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి దీనిని పరిచయం చేయడం జరిగింది.బీఎస్ఎన్ఎల్ వైఫై నేషనల్ రోమింగ్: వినియోగదారులు అదనపు ఛార్జీల గురించి చింతించకుండా దేశవ్యాప్తంగా వైఫై యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయంలో కనెక్ట్ అయి ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ: ఈ సర్వీస్ ఫైబర్ టు ది హోమ్ (FTTH) కనెక్షన్లతో వినియోగదారుల కోసం 500 ప్రీమియం ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. తద్వారా యూజర్ మంచి ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు.ఎనీ టైమ్ సిమ్ కియోస్క్: ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీనికోసం ప్రత్యేక కేంద్రాలను యెఫ్తాను చేయనున్నారు.డైరెక్ట్-టు-డివైస్ సర్వీస్ (D2D): ఈ సర్వీస్ ద్వారా శాటిలైట్ టు డివైజ్ కనెక్టివిటీ పొందవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఎస్ఎంఎస్ సేవలను ఆస్వాదించవచ్చు.పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్: బిఎస్ఎన్ఎల్ అత్యవసర సమయంలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి కమ్యూనికేషన్, పబ్లిక్ సేఫ్టీ ఫీచర్లతో భద్రతమైన నెట్‌వర్క్‌ను అందిస్తుంది.గనులలో ప్రైవేట్ 5జీ: ఈ సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ మైనింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన 5జీ కనెక్టివిటీను అందిస్తుంది. రిమోట్ లొకేషన్లలోని కార్మికులకు కమ్యూనికేషన్ మరియు భద్రతను మెరుగుపరుస్తుంది.Today at #BSNL HQ, New Delhi, Hon'ble MoC Shri @JM_Scindia Ji, along with Hon'ble MoSC Shri @PemmasaniOnX Ji and Secretary DoT Shri @neerajmittalias Ji, unveiled BSNL’s new logo, reflecting our unwavering mission of "Connecting Bharat – Securely, Affordably, and Reliably." pic.twitter.com/EFvYbVASGx— BSNL India (@BSNLCorporate) October 22, 2024 -
ఫుట్‌బాల్ టీమ్‌ను దత్తత తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడల అభివృద్ధికి ఇప్పటికే ప్రకటించిన పలు ప్రణాళికలతో పాటు మరిన్ని కొత్త అంశాలతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే చీఫ్ మినిస్టర్స్ (సీఎం) కప్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ‘పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు’ అనే నినాదంతో త్వరలోనే జరగనున్న ఈ టోర్నీకి సంబంధించిన లోగో, మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాలుగు దశల్లో జరిగే టోర్నీ అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను టోర్నీ మస్కట్‌గా ఉంచి దానికి ‘నీలమణి’ అని పేరు పెట్టారు. ఇటీవల కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన సమయంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధికారులతో చర్చించామని.. దానికి అనుగుణంగా భారత్ అండర్–17 ఫుట్‌బాల్ టీమ్‌ను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన, గత ఏడాది జరిగిన సీఎం కప్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలిపి మొత్తం రూ.1.02 కోట్లు, రూ.52 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఈ కార్యక్రమంలో సీఎం అందజేశారు. ప్రతిభకు గుర్తింపుగా బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌లను ప్రభుత్వ ఉద్యోగంతో గౌరవించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కార్యక్రమంలో నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. భవిష్యత్తులో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, శాసన సభ్యులు వివేక్, రాంచంద్ర నాయక్, ప్రభుత్వ సలహాదారులు జితేందర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, పార్లమెంటు సభ్యులు అనిల్‌కుమర్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ జితేందర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి వాణిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారిలతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. -
TGSRTC ఫేక్ ప్రచారంపై సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్ సైతం కథనాలిచ్చాయి. అయితే TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. .. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. #TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024 అత్యుత్సాహంతో కొన్ని వెబ్సైట్లు అలా లోగోను డిజైన్ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. -
గ్లాసు గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం
-
నైపుణ్య శిక్షణలో విశ్వరూపం
సాక్షి, విశాఖపట్నం: ‘యువత మన భవిష్యత్తు. చదువులు, నైపుణ్య శిక్షణలో సమూల మార్పులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాం. రాబోయే రోజుల్లో నైపుణ్య శిక్షణలో విశ్వరూపం చూపిద్దాం. అందుకే ఈ ‘భవిత’ కార్యక్రమం’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడాప్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమాన్ని మంగళవారం విశాఖలోని పీఎంపాలెం వి–కన్వెన్షన్ హాల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, విడదల రజని, పారిశ్రామిక ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... జాబ్ ఓరియెంటెడ్‌గా రాష్ట్ర్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చి అనుసంధానించే కార్యక్రమ్రాన్ని నిర్వహిస్తున్నాం. ఏ చదువైనా జాబ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. క్వాలిటీ చదువులు మనకు అందుబాటులో లేకపోతే పూర్తిగా వ్యర్థమైపోయినట్లే. అందుకే జాబ్ ఓరియెంటెడ్‌గా క్వాలిటీ చదువులతో మార్పులు తెస్తున్నాం. నాణ్యమైన విద్యని స్కూల్స్ నుంచి కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు.. అన్ని చోట్లా అందిస్తూ అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేయడం నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా ఎలా ముందుకు వెళ్తున్నామో అందరికీ తెలిసిందే. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్, టోఫెల్ శిక్షణ, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్ ద్వారా విద్యలో నాణ్యత పెంచుతున్నాం. డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఇలాగే అడుగులు వేస్తున్నాం. ♦ తొలిసారిగా కాలేజీల్లో కరిక్యులమ్ మార్చడం, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, తప్పనిసరి ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ వర్టికల్స్, క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగం చేయడం లాంటివన్నీ చేస్తున్నాం. హార్వర్డ్, ఎల్సీఈ, ఎల్బీఎస్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల కోర్సులను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం. వాటి ద్వారా దరఖాస్తు చేసుకుంటే మంచి జీతాలతో ఉన్నత ఉద్యోగాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తరహా మార్పు ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడి దగ్గర నుంచే మొదలవుతోందని గర్వంగా చెబుతున్నా. ♦ ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్ కాలేజీల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. వచ్చే టర్మ్‌లో ఈ మార్పులు విశ్వరూపం దాలుస్తాయి. తొలిసారిగా 158 పారిశ్రామిక సంస్థలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కలిపి మొత్తం 208 ఇన్స్టిట్యూషన్లు మన పిల్లల ట్రైనింగ్, కోర్సుల్లో భాగస్వాములై శిక్షణ అందించి ఉద్యోగాలిచ్చే కార్యక్రమం జరుగుతోంది.దాదాపు 87 పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే 2019కి ముందు (టీడీపీ హయాంలో) అక్రిడిటేషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీ కేవలం ఒక్కటి మాత్రమే ఉండటం దురదృష్టం. కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువులు ఎలా ఉన్నాయి? అక్రిడిటేషన్ ఉందా? అనేది కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఎన్బీఏ అక్రిడిటేషన్‌ని 32 పాలిటెక్నిక్ కాలేజీలు పొందాయి. క్వాలిటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేస్తాం. హబ్ ద్వారా ఒకే చోట ఐటీఐ, పాలిటెక్నిక్, పదోతరగతి డ్రాపవుట్స్ కోసం ట్యూటరింగ్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో స్కిల్ కాలేజీ ఉంటుంది. వీటన్నింటి పైన ఒక స్కిల్ యూనివర్సిటీ కోర్సుల్ని డిజైన్ చేస్తుంది. పరిశ్రమల్ని కాలేజీల్లో భాగస్వాముల్ని చేస్తుంది. చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం వచ్చేలా అడుగులు పడుతున్నాయి. ♦ ఇప్పటివరకూ 53 వేల మంది శిక్షణ పూర్తి చేసుకొని 26 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన భవిత కార్యక్రమం ఇకపై పైలట్‌గా కాకుండా ప్రతి నియోజకవర్గంలో విస్తరించే దిశగా శ్రీకారం చుడుతున్నాం. సీఎం సమక్షంలో ఎంవోయూలు ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి నైపుణ్య శిక్షణ అందించేందుకు పలు సంస్థలు ఆరు ఎంవోయూలు చేసుకున్నాయి. ♦ విశాఖ పోలీస్ కమిషనరేట్‌తో మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యుర్షిప్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వైజాగ్ పోలీస్ వర్క్‌ఫోర్స్ నైపుణ్య సామర్థ్యాలు పెంపొందించేలా జాయింట్ సర్టిఫికేçÙన్ కోర్సులు అందించేలా సహకారం అందించనున్నారు. ♦ ఏపీఎస్ఎస్డీసీతో హియర్ టెక్నాలజీస్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు లొకేషన్ సొల్యూషన్స్ కోసం ప్లాట్ ఫామ్ అందించేలా 60–90 రోజుల సర్టిఫికేషన్ కోర్సు అందించేందుకు ఒప్పందం జరిగింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ, తాజ్హోటల్స్, ఎస్ఐహెచ్ఎం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పర్యాటకం,హాస్పిటాలిటీ రంగంలో శిక్షణ అందించడం, ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు, ఉపాధి అవకాశాలు సృష్టించేలా ఒప్పందం కుదిరింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ, డిక్సన్ టెక్నాలజీస్, నాలుగు ఐటీఐలు, మూడు పాలిటెక్నిక్ కాలేజీల మధ్య ఎలక్ట్రానిక్, మెకానికల్ రంగంలో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ల్యాబ్ ఏర్పాటు చేయడం, పరిశ్రమకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి పొందేలా ట్రైనింగ్ ఇవ్వడం మొదలైన అంశాల్ని అందించేలా ఎంవోయూ జరిగింది. ♦ వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఎంవోయూ జరిగింది. కాలేజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపించనున్నారు. వీల్స్ ఇండియా ద్వారా అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అందించనున్నారు. ♦డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ఎడ్యుకేషన్, అవెరా ఏఐ మొబిలిటీ మధ్య ఈవీ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపనకు మార్గం సుగమం చేసేలా, పరిశ్రమలు సందర్శించేందుకు ఏర్పాటు చేసేలా ఎంవోయూ జరిగింది. ♦ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(డీఈటీ), ఎల్ అండ్ టీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీఐ కోర్సులతో సమానంగా ఈ లెర్నింగ్ మాడ్యుల్స్ అందించడం, ఎల్ అండ్ టీ బృందం ద్వారా విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాన్ని ఈ ఎంవోయూ ద్వారా అందించనున్నారు. 10 స్కిల్ సెంటర్లకు శంకుస్థాపన.. ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ.7 కోట్లతో 10 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.44.32 కోట్లతో 43 పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణ పనులను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.43.77 కోట్లతో 22 ఐటీఐల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భవిత కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు భవిత లోగో, యాంథమ్, స్కిల్ యూనివర్స్ యాప్, ఫ్లాగ్‌ని ఆవిష్కరించారు. అంతకు ముందు వీ కన్వెన్షన్‌కు చేరుకున్న సీఎం తొలుత స్కిల్ ఇన్స్టిట్యూట్స్ స్టాల్స్‌ని సందర్శించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీలు తయారీ, విమాన విడిభాగాల తయారీ శిక్షణ తదితర స్టాల్స్‌ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. -
సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌తో వస్తోన్న కలర్ ఫోటో హీరోయిన్!
కలర్ ఫోటో , గామి చిత్రాల ఫేమ్ చాందినీ చౌదరి మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో సీ స్పేస్ బ్యానర్‌పై యేవమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలై చేతుల మీదుగా ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ప్రమోషన్లలో ఇది ఒక వినూత్న ప్రయత్నంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా యూజర్స్ దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చాందినీ నటన హైలెట్‌గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి నీలేష్ మండాలపు సంగీతం అందించారు. ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట, భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by YEVAM (@yevam_movie) -
లోగో రీబ్రాండింగ్ చిక్కులు: మస్క్‌కు షాకిచ్చిన మార్కెటింగ్ ఏజెన్సీ
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్లో మరోసారి చిక్కుల్లోపడ్డాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఐకానిక్ ‘బర్డ్ లోగో’ను మార్చిదాని ప్లేస్‌లో ‘ఎక్స్’గా మారుస్తూ ఈ ఏడాది జూలైలో మాస్క్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మార్కెటింగ్ ఏజెన్సీ ఎక్స్ అనే కంపెనీ కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. ట్రేడ్‌మార్క్ , సర్వీస్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ట్విటర్ లోగో రీబ్రాండ్ తరువాత ఇలాంటి కోర్టు కేసును ఎదుర్కోవడం ఇదే తొలిసారి. (ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!) ఫ్లోరిడాకు చెందిన అడ్వర్టైజింగ్ , సోషల్ మీడియా సర్వీస్ కంపెనీ ఎక్స్ ..ట్విటర్ పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ ట్రేడ్‌మార్క్ "X" గుర్తును ఉపయోగించి మార్కెటింగ్, విక్రయించడం లేదా పంపిణీ లాంటి వాటినుంచి ఎక్స్‌ను నిషేధించాలని కోరుతోంది. అంతేకాదు మస్క్ ఎక్స్ సేవలు, ప్రకటనలు తమ వినియోగదారులు గందరగోళానికి గురయ్యారని ఎక్స్ పేర్కొంది. తన నష్టాలకు లేదా ప్రతివాది లాభాలకు మూడు రెట్లు సమానమైన పరిహారాన్ని అందించాలని కోరింది. ఈ ప్రమాదాన్ని ముందేఊహించిన ట్రేడ్ మార్క్ నిపుణులు తాజా పరిణామంతో ఇప్పటికే లాభాలు క్షీణించి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మస్క్‌కు మరింత దెబ్బేనని భావిస్తున్నారు. కాగా గతేడాది ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టాడు. భారతీయ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించడం, వేలాదిమంది ఇతర ఉద్యోగుల తొలగింపులు, ట్విటర్ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు, కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు లాంటివి ఉన్నాయి. తాజాగా గేమ్ స్ట్రీమింగ్, ప్లాట్‌ఫారమ్‌ని సరిచేయడానికి లైవ్ షాపింగ్ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది. -
Facebook New Logo: ఫేస్బుక్ లోగో మారిందోచ్.. తేడా గుర్తించగలరా?
Facebook logo changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్) లోగోను కూడా తొలగించి దాని స్థానంలోకి సాధారణ ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చింది. తాజాగా మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebook) కూడా తమ లోగోలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ సూక్ష్మ మార్పులను చాలా మంది గమనించలేకోపోయారు. తదేకంగా గమనించే కొందరు యూజర్లు మాత్రం పసిగట్టేశారు. ఫేస్బుక్ కొత్త లోగో తమ “ఐడెంటిటీ సిస్టమ్” అప్డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్బుక్ లోగోను మెటా సర్దుబాటు చేసింది. ట్విటర్ లాంటి భారీ మార్పు కాకుండా సూక్ష్మమైన సర్దుబాటును మాత్రమే ఫేస్బుక్ చేసింది. అయితే తదేకంగా గమినిస్తే తప్ప లోగోలో ఏమి మారిందో గుర్తించడం కష్టం. ఫేస్బుక్ బ్రాండ్‌కు డిఫైనింగ్ మార్క్‌ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్‌గా, సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్బుక్ డిజైన్ డైరెక్టర్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం మారింది? ఫేస్బుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘f’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. అయితే ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఫాంట్ ఇప్పటికీ Facebook Sansగానే ఉంది. ఇది ‘f’ అక్షరాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. (Google AI Chatbot Bard: గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!) ఇది "ఫేస్బుక్ కోసం రిఫ్రెష్ చేసిన గుర్తింపు వ్యవస్థ" మొదటి దశలో భాగమని మెటా పేర్కొంది. ఈ మార్పును వివరిస్తూ మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటన చేసింది. ఫేస్బుక్ యాప్‌లో రియాక్షన్లకు మరింత వైవిధ్యత తీసుకురావడానికి రియాక్షన్స్ కలర్ ప్యాలెట్‌ను అప్డేట్ చేసినట్లు ప్రకటించింది. కొత్త లోగోపై ట్రోల్స్ ఫేస్బుక్ కొత్త లోగోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘తేడా గుర్తించండి.. చూద్దాం’ అంటూ ఒకరు, ‘మరింత నీలం’ అంటూ మరొకరు..యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది అత్యంత భారీ మార్పు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. -
మస్క్ కొడుకుని చూశారా? బుడతడు భలే ఉన్నాడే...
ప్రపంచ టాప్ బిలియనీర్, టెస్లా, ఎక్స్ (ట్విటర్) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలాన్ మస్క్ కొడుకుని ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో ఇక్కడ చూడండి.. తన సోషల్ మీడియా సంస్థకు చెందిన ‘ఎక్స్’ లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్ ఏఈఏ-12 (పేరు) ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు ఎలాన్ మస్క్. ముద్దులొలుకుతున్న మస్క్ కొడుకు ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఖాకీ రంగు నిక్కరు, టెస్లా లోగోతో ఉన్న వైట్ టీషర్ట్ వేసుకున్న ఈ మూడేళ్ల బుడతడు బోసినవ్వులతో కెమెరాకు ఫోజుచ్చాడు. ఈ ఫొటోకు 75 మిలియన్లకు పైగా వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బుడతడు భలే ఉన్నాడే అంటూ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. ఎక్స్ ఏఈఏ-12 (X AE A-XII) 2020లో జన్మించాడు. కెనడియన్ మ్యుజీషియన్ గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్‌కి ఈ బాలుడు మొదటి సంతానం. విచిత్రంగా ఉన్న ఈ పిల్లాడి పేరు గురించి తల్లి గ్రిమ్స్ గతంలో వివరణ ఇచ్చినా చాలా మందికి సరిగ్గా అర్థం కాలేదు. కొత్తగా బావుందని మాత్రం అందరూ కితాబు ఇచ్చారు. మస్క్- గ్రిమ్స్ జంట 2022లో సరోగసి ద్వారా ఎక్సా డార్క్ సైడెరెల్ మస్క్ అనే కుమార్తె పొందారు. 2018 నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట 2021 సెప్టెంబర్‌లోనే విడిపోయారు. తర్వాత 2021 నవంబర్‌లో షివోన్ జిలిస్‌తో కవలలను కన్నారు. కాగా కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌తో మస్క్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. pic.twitter.com/gcSXLMwsua — Elon Musk (@elonmusk) August 25, 2023 -
ఆప్కాబ్ లోగోను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
ట్విట్టర్ పేరు మార్పు నా చావుకొచ్చింది.. ఆ రోజు నుండి నిద్ర లేదు..
వాషింగ్టన్: ట్విట్టర్ పేరు మార్చడమేమో గానీ అది నా చావుకొచ్చిందంటున్నాడు ఒక యూజార్. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా నివాసముండే క్రిస్టోఫర్.J .బీలే కొత్తగా ఏర్పాటు చేసిన 'X' లోగో నుండి వచ్చే లైటింగ్ నాకు నిద్ర లేకుండా చేస్తోందని అదే X (ఒకప్పటి ట్విట్టర్) వేదికగా వీడియోతో సహా విషయాన్ని పోస్ట్ చేసి ఆవేదన వెళ్లగక్కాడు. Imagine no more. This is my life now. https://t.co/k5QfAm8yuG pic.twitter.com/e7ECCM2NUD — Christopher J. Beale (@realchrisjbeale) July 29, 2023 ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే పాపులర్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ హస్తగతం చేసుకున్న తర్వాత పిట్ట బొమ్మను తొలగించి ఆ స్థానంలో 'X' అనే లోగోను పరిచయం చేశారు. ట్విట్టర్ పేరు మార్పు గురించి ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన నాటి నుండి సోషల్ మీడియా మాధ్యమంలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అత్యధికులు దీన్ని ఎగతాళి చేస్తూనే కామెంట్లు చేస్తుండగా అతి తక్కువ మంది మాత్రమే ఇది చాలా బాగుందని కితాబిచ్చారు. అయితే కాలిఫోర్నియాలోని ట్విట్టర్ హెడ్ క్వార్ట్రర్స్ ఎదురుగా నివాసముంటున్న క్రిస్టోఫర్.J .బీలే మాత్రం ఈ లోగో మార్పు వలన నాకు నిద్ర ఉండటం లేదని ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పైన అమర్చిన రేడియంట్ లైట్ గడియగడియకు వెలుగుతూ ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ పైన దాని ప్రతిబింబం పడటంతో అసలు నిద్ర పట్టడంలేదు. నా బెడ్రూమ్ నుంచి చూస్తే ఇదిగో ఇలా ఉండి.. ఇది నా పరిస్థితి అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. Here’s another angle I forgot I had that shows the X strobing. Also, my apartment building needs a bath. pic.twitter.com/t66erPuDlL — Christopher J. Beale (@realchrisjbeale) July 29, 2023 దీనికి జత చేస్తూ ప్రతిరోజూ తన అనుభవాలను కూడా పంచుకున్నాడు. పగలంతా ఆ లైట్ల పనితీరును టెస్ట్ చేస్తారు. రాత్రయ్యే సరికి కళ్ళు జిగేల్ మనే లైటింగ్ నేరుగా నా బెడ్రూమ్లోకి వస్తుంది చూడండి అంటూ రాశాడు. అనేక మంది X యూజర్లు ఈ వీడియోల సమాహారంపై స్పందిస్తూ ఎలాన్ మస్క్ పై కామెంట్ల రూపంలో విమర్శల్ని కురిపిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది.. -
మస్క్ వీడియో సంచలనం: మేజికల్ అంటున్న నెటిజన్లు
Twitter new logo 'X' ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంపై తన కొత్త లోగో ‘X’ ఆవిష్కారానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. జెంబోలోగో ఏరియల్ వ్యూ విజువల్స్ వీడియోను మస్క్ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి. అలా పోస్ట్ చేశారో లేదో, ఈ వీడియో 5 వేలకు కామెంట్లు, 9 వేల 7వందలకు పైగా రీట్వీట్లు 4.3 మిలియన్ వ్యూస్‌తో ఇది వైరల్‌గా మారింది. దీంతో కారు లోపల నుండి రికార్డ్ చేసిన మరొక వీడియోను కూడా షేర్ చేశారు మస్క్. "ఈ రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో మా ప్రధాన కార్యాలయం." మస్క్ ఒక వీడియోను పోస్ట్ చేశారుమస్క్. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నగరం డౌన్‌టౌన్ భవనంపై అమర్చినఅక్షరం లోగోపై దర్యాప్తు ప్రారంభించిన సమయంలో ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం. నగర అధికారుల ప్రకారం, ఏదైనా సైన్ బోర్డు లేదా లోగోను మార్చడానికి ముందు ఒక వ్యక్తి (లేదా కంపెనీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఏరియల్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించింది. కొంతమంది వినియోగదారులు దీనిని సూపర్ హీరో చిత్రం బ్యాట్మ్యాన్తో పోల్చారు. ఏరియల్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంటి. చాలామంది ది వినియోగదారులు దీనిని సూపర్ హీరో చిత్రం బ్యాట్మ్యాన్తో పోల్చారు. మరికొంతమి మాజికల్ అంటూ కమెంట్ చేశారు. pic.twitter.com/Io9Mk7PYUH — Elon Musk (@elonmusk) July 29, 2023 Our HQ in San Francisco tonight pic.twitter.com/VQO2NoX9Tz — Elon Musk (@elonmusk) July 29, 2023 -
ట్విట్టర్ పక్షులకు వీడ్కోలు చెప్పేస్తా
న్యూయార్క్: ట్విట్టర్.. ఈ సోషల్ మీడియా వేదిక గురించి తెలియని నెటిజన్లు ఉండరు. నీలి రంగు ట్విట్టర్ పిట్ట అందరికీ సుపరిచితమే. ఈ పిట్ట ఇకపై కనిపించదు. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని, బిలియనీర్ ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించారు. తమ యాప్ లోగోను మార్చనున్నట్టు ఆదివారం వెల్లడించారు. ట్విట్టర్‌ను రీబ్రాండ్ చేయనున్నట్టు తెలియజేశారు. చైనాకు చెందిన వియ్‌చాట్ తరహాలో అన్నింటికీ పనికొచ్చే ‘ఎక్స్’ యాప్‌ను రూపొందించాలని ఆయన కొంత కాలంగా యోచిస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా వేదికగానే కాకుండా ఆన్లైన్ చెల్లింపులకు, ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి పనికొస్తుంది. చాలా రకాల సేవలు అందించేలా ఎక్స్ యాప్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్‌ను త్వరలో ‘ఎక్స్’ యాప్‌గా రీబ్రాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘త్వరలోనే మేం ట్విట్టర్ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా నీటి రంగు ట్విట్టర్ పక్షులకు వీడ్కోలు పలుకనున్నాం’ అని ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఎక్స్ యాప్‌నకు కొత్త లోగోను సూచించాలని ఆయన కోరారు. ఎలాన్ మస్క్ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. సంస్థలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ బిజినెస్ పేరును ఎక్స్ కార్పొరేషన్‌గా మార్చారు. ట్విట్టర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్స్ కార్పొరేషన్లో చట్టబద్ధంగా విలీనమైంది. -
బాంబు పేల్చిన ఎలాన్ మస్క్.. కనుమరుగు కానున్న ట్విటర్ పిట్ట!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ బాంబు పేల్చారు. ట్విటర్ బర్డ్ లోగోని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బర్డ్ లోగో స్థానంలో ‘ఎక్స్’లోగోను అప్డేట్ చేయనున్నట్లు ట్విట్ చేశారు. లక్షల కోట్లు వెచ్చించి మరి ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఎలాన్ మస్క్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ట్విటర్ పెయిడ్ సబ్స్క్రిప్షన్, ఎక్కువ అక్షరాలతో ట్విట్‌తో పాటు పలు సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ట్విటర్ ప్రత్యేక సంస్థగా కాకుండా తాజాగా, ఏర్పాటు చేసిన ఎక్స్ కార్ప్ అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ట్విటర్ బర్డ్ లోగోని తొలగించి ఎక్స్’ను జత చేయనున్నారు. ఇక, మస్క్ నిర్ణయంతో ఇన్ని రోజులు యూజర్లను అలరించిన ఈ ట్విటర్ పిట్ట ఇకపై కనుమరుగు కానుంది. Like this but X pic.twitter.com/PRLMMA2lYl — Elon Musk (@elonmusk) July 23, 2023 ట్విటర్ పిట్ట పేరేంటో తెలుసా? అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లారీ బర్డ్‌కి గుర్తుగా ట్విటర్ సంస్థ బర్డ్ లోగోను రూపొందించింది. ఆ లోగోకి లారీ అనే పేరు పెట్టింది. ఇదే విషయాన్ని ట్విటర్ మాజీ కో-ఫౌండర్ బిజ్ స్టోన్ ఓ సందర్భంలో తెలిపారు. చదవండి👉 అందరూ ఐటీ ఉద్యోగులే, లక్షల్లో ప్యాకేజీలు..ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పరా! ప్లీజ్! -
బ్యాంకుల్లో రూ.5 లక్షల బీమాపై అవగాహన అవసరం
ముంబై: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 31లోగా తమ వెబ్సైట్లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లలో తన లోగో, క్యూఆర్ కోడ్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆర్బీఐ అనుబంధ విభాగం– డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది. ఈ బీమా పథకం వాణిజ్య బ్యాంకులుసహా లోకల్ ఏరియా బ్యాంకులు (ఎల్ఏబీ), చెల్లింపుల బ్యాంకులు (పీబీ), చిన్న ఆర్థిక బ్యాంకులు (ఎస్ఎఫ్బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) సహకార బ్యాంకులలో డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ సంప్రదింపులతో తాజా సూచనలు చేస్తున్నట్లు డీఐసీజీసీ సర్కులర్ వివరించింది. ఎందుకంటే... ► చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించింది. ► లోగో, క్యూర్ కోడ్ ప్రదర్శన వల్ల డీఐసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే బ్యాంకులను కస్టమర్ సులభంగా గుర్తించడానికి వీలవుతుందని, అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారం సకాలంలో వారు పొందగలుగుతారని తెలిపింది. బీమా కవరేజ్ బ్యాంకులు 2,027 డీఐసీజీసీ నమోదిత బీమా బ్యాంకుల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 2,027. ఇందులో 140 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 43 ఆర్ఆర్బీలు, రెండు ఎల్ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్ఎఫ్బీలు, 1,887 సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ బీమా ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షలు. ఇందుకు సంబంధించి కవరవుతున్న ఖాతాల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 294.5 కోట్లు. బీమా కవరవుతున్న డిపాజిట్ల విలువ రూ.83,89,470 కోట్లు. -
సహకార రంగంలో పత్రిక సాహసోపేతం
విజయవాడ, మే 29: సహకార రంగం ఒకప్పుడు రాజకీయాలను శాసించే దశలో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సహకార వ్యవస్థకు సహకారభూమి పక్షపత్రిక నూతన జవసత్వాలు అందించాలని సి. రాఘవాచారి మీడియా కమిషన్ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సూచించారు. సహకార రంగంలోని సానుకూల అంశాలతో పాటు లోటుపాట్లను కూడా సహకారభూమి పత్రిక అందించాలని చెప్పారు. విజయవాడ శ్యామ్ నగర్ ఎన్జీవో కాలనీలోని సహకారభూమి కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన సహకారభూమి లోగోను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభకు సహకారభూమి వ్యవస్థాపక అధ్యక్షులు, కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కొమ్మినేని మాట్లాడుతూ.. సహకార రంగం ఒకప్పుడు రాజకీయాలను శాసించే దశలో ఉందని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. సహకార రంగంలో పత్రిక తీసుకురావడం ఒక సాహసోపేతమైన చర్య అనీ, దీనిని జయప్రదం చేసేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. మరో ముఖ్య అతిథి, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనాథ్ రెడ్డి సహకారభూమి కార్యాలయం ముందు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సభలో ఆయన మాట్లాడుతూ.. సహకారమంటే అపకారం కాదని, సహకార రంగంపై ఉన్న ఈ అపవాదును పోగొట్టేలా సహకార వ్యవస్థను తీర్చిదిద్దాలని హితవు పలికారు. పరస్పర సహకారంతోనే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సహకార రంగ ప్రగతిని, సంక్షేమాన్ని కాంక్షిస్తూ త్వరలో విడుదల కానున్న సహకారభూమి పత్రిక చిరకాలం సేవలు అందించాలని అభినందనలు తెలిపారు. తప్పులు చేయడం మానవ సహజమని, వాటిని తగ్గించేందుకు జరిగే ప్రయత్నం హర్షణీయమన్నారు. తమ సిబ్బందికి ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని పంపించి జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. సహకారభూమి పక్షపత్రికకు తాము అన్నివిధాలా సహకరిస్తామని, అన్ని ప్రాథమిక సహకార సంఘాలకు ఈ పత్రిక చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు. తమ ఆప్కాబ్ సిబ్బందికి సహకారభూమి పత్రిక మార్గదర్శకత్వం వహించేలా ఉండాలని, సహకారం అంటే స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. సభాధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ సహకార రంగానికి జవసత్వాలు కల్పించేందుకు ఈ పత్రిక ఉపయోగపడాలని కోరారు. ఇప్పుడు ఉన్న సిబ్బందికి సమగ్ర సమాచారం అందడం లేదని, ఏ జీవోలో ఏముందో తెలియడం లేదన్నారు. ఈ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉందని, ఈ లోటును ఈ పత్రిక భర్తీ చేయాలని ఆకాంక్షించారు. కొన్ని లక్షల మంది ఉన్నా సహకార వ్యవస్థకు సమగ్ర సమాచారం అందించే పేపరు, పత్రిక లేకపోవడం పెద్దలోటేనని, ఈ లోటును సహకారభూమి తీర్చాలని ఆకాంక్షించారు. సహకారభూమి పత్రికు తాము అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సహకార ధర్మపీఠం సంపాదకులు, సహకార రంగ నిపుణుడు భూమయ్య సహకారం రంగ పితామహుడు రామదాసు పంతులు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సభలో భూమయ్య మాట్లాడుతూ.. సహకార చట్టాల మార్పు తీరుతెన్నులను, వస్తున్న మార్పులను వివరించారు. సహకార వ్యవస్థకు కొత్త విధానాలు నిబంధనలు తీసుకొస్తామని చెపుతూ ఇప్పుడున్న చట్టాలను నిర్వీర్యం చేసే పరిస్థితి రానున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సహకారభూమి లాంటి పత్రికలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకారభూమి వ్యవస్థాపకులు దాసరి కేశవులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ ఎల్లారావు, సహకారభూమి పత్రిక సంపాదకులు అక్బర్ పాషా, సహకార రంగ ప్రముఖులు సాంబిరెడ్డి, వ్యవస్థాపక సభ్యులు కేవి కృష్ణ, కేఎస్ జ్యోతి శ్రీ, సిహెచ్ త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు. సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యదర్శి రత్నప్రసాద్ వందన సమర్పణ చేశారు. -
తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఖరారు చేసింది. ఇందులో తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించడంతో పాటు దశాబ్ది ఉత్సవాలకు చిహ్నంగా 10 సంఖ్యతో లోగో డిజైన్ చేశారు. లోగో మధ్యలో తెలంగాణా తల్లి, పై భాగంలో ఎగురుతున్న రాష్ట్ర అధికార పక్షి పాలపిట్ట తీసుకున్నారు. 10 భాగాలుగా ..ఒక్కో భాగంలో ఒక్కో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల బొమ్మ ఉండగా, 10 సంఖ్యలోని 1 లో తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పొందుపరిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, , మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, జంటనగరాల తలమానికం హైదరాబాద్ మెట్రో రైల్, వ్యవసాయం టీ-హబ్, రాష్ట్రం ఏర్పడ్డ తరవాత ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి కోతలు లేకుండా ప్రజలకు, ఉచితంగా రైతులకు కరెంటు అందిస్తోన్న విద్యుత్ రంగానికి స్థానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను లోగోలో పొందుపరిచారు. -
పిట్టా పోయి కుక్క వచ్చే
-
మళ్ళీ మారిన ట్విటర్ లోగో.. ఎలాన్ మస్క్ ప్లానా? లేక అజ్ఞాత వ్యక్తి కోరికా?
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫారం ట్విటర్ సీఈఓ 'ఎలాన్ మస్క్' గత సోమవారం ట్విటర్ లోగో బ్లూ బర్డ్ స్థానంలో క్రిప్టో కాయిన్ 'డోజ్ కాయిన్' మార్చిన విషయం అందరికి తెలిసిందే. ట్విటర్ లోగో స్థానాన్ని కైవసం చేసుకున్న డోజ్ కాయిన్ ధర ఒక్క రోజులోనే ఏకంగా 30 శాతం పెరిగిపోయింది. అయితే మళ్ళీ డోజ్ కాయిన్ లోగో స్థానంలో 'బ్లూ బర్డ్'ని చేర్చారు. దీనితో డోజ్ కాయిన్ ధర 9 శాతం క్షిణించింది. ఎలాన్ మస్క్ చాలా కాలంగా డోజ్ కాయిన్‌కు మద్దతుదారుగా ఉన్నారు, ఇందులో భాగంగానే చాలా సందర్భాల్లో బహిరంగంగా మద్దతు కూడా అందించారు. 2013లో మస్క్ సరదాగా డోజ్ కాయిన్ సృష్టించడంతో పాటు ఈ కాయిన్ టెస్లా ఇంక్ లో చెల్లింపులకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ పునరుద్ధరణపై అప్పట్లో బ్లూమ్ బర్గ్ అడిగిన ప్రశ్నకు ట్విటర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ట్విటర్ లోగోను మార్చిన తరువాత డోజ్ కాయిన్ గరిష్టంగా పెరిగినప్పటికీ, మళ్ళీ పడిపోయింది. ప్రస్తుతం 13.7 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో డోజ్ కాయిన్ ఏడవ అతి పెద్ద క్రిప్టోకరెన్సీగా ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విటర్ లోగోను డోజ్ కాయిన్ గా మార్చడానికి ముందు దీని మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉండేది. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) ట్విట్టర్ సంస్థను మస్క్ కొనుగోలు చేయడానికి ముందు ఒక వ్యక్తి బ్లూ బర్డ్ స్థానంలో డోజ్ కాయిన్ మార్చాల్సిందిగా కోరాడు. అయితే అతని కోరిక మేరకు ఇప్పడూ లోగో మార్చినట్లు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ట్వీట్ చేశారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి కోరికను మస్క్ ఇంత సీరియస్ గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
SEBI: అన్ని వివరాలూ వెల్లడించాలి
న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాలిచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, పరిశోధనా అనలిస్టులకు సంబంధించి పారదర్శకత పెంచే దిశగా సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రకటనల్లో సెబీ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి పేరు, లోగో, పూర్తి చిరునామా, టెలిఫోన్ నంబర్లను వెల్లడించాలని పేర్కొంది. సెబీ ఇచ్చిన రిజిస్ట్రేషన్ కానీ, బీఎస్ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ సభ్యత్వం కానీ, రాబడులు, పనితీరుకు భరోసాగా, హామీగా చూడొద్దంటూ విధిగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. వారు ప్రచురించే పబ్లికేషన్లు, కేవైసీ పత్రాలు, క్లయింట్లతో చేసుకునే ఒప్పంద పత్రాలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే అన్ని రకాల సంప్రదింపుల్లోనూ ఈ వివరాలు ఉండాలని సెబీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే ప్రకటనల్లో సెబీ లోగో వాడకుండా నిషేధం విధించింది. కొంత మంది పెట్టుబడుల సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు తమ ప్రకటనలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే సంప్రదింపులు, ఒప్పందాల సమయంలో సెబీ వద్ద నమోదు చేసుకున్న పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు బ్రాండ్ లేదా లోగోను వాడుతున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశించింది. -
ట్విట్టర్ లోగో మారింది.. పక్షి స్థానంలో వేటకుక్క
ట్విట్టర్ లోగో మారింది.. పక్షి స్థానంలో వేటకుక్క -
చెప్పిందే చేశా: డోజీ లోగోపై మస్క్ వివరణ, నెటిజన్ల మీమ్స్ వైరల్
సాక్షి, ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ అనూహ్యంగా లోగోను మార్చడం పెద్ద దుమారాన్ని లేపింది. ట్విటర్‌కు ఇప్పటిదాకా ఉన్న బ్లూ బర్డ్ లోగోను స్థానంలో అకస్మాత్తుగా వచ్చిన ‘డోజీ ’ లోగోను చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు లోగో ఇలా మార్చాడో లేదో మస్క్ మద్దతున్న క్రిప్టో కరెన్సీ Dogecoin దాదాపు 30 శాతం పెరిగింది. దీంతో ట్విటర్లో నాన్‌స్టాప్ మీమ్స్‌తో సందడి చేశారు. ఇది ఇలా ఉంటే క్లాసిక్ బర్డ్లోగోమార్చడంపై ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాగ్దానం చేసినట్టుగానే అంటూ ఈ సందర్బంగా 2022, మార్చి 26 నాటి పాత చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. అందులో ఓ యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను డాగ్ గా మార్చాలని అడగడాన్ని మనం గమనించావచ్చు. ఈ క్రమంలో అప్పుడు చెప్పినట్టు ట్విటర్ లోగోను మార్చినట్టు చెప్పాడు. అంతేకాదు పనిలో పనిగా ఇక ఆపండి అబ్బాయిలూ అంటూ మీడియాపై సెటైర్లు కూడా వేశాడు. అయితే ఈ లోగో శాశ్వతంగా ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో అయినఎలాన్ మస్క్ గత ఏడాది నవంబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేశాడు. కొత్త బాస్‌గా ట్విటర్.2లో అనేక కీలక మార్పులతో వార్తల్లో నిలిచాడు మస్క్. సీఈవో సహా ఇతర కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగింపు మొదలు, ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజు దాకా ప్రతీ మార్పుతో తనదైన శైలిని చాటుకుంటున్నాడు మస్క్. జపాన్ జాతికి చెందిన ‘షిబా ఇనూ’ అనే కుక్క ఫొటోనే డోజీగా పిలుస్తుంటారు. 2013 లో మొదటి సారి డోజీకాయిన్ క్రిప్టో కరెన్సీకి డోజీని లోగోగా క్రియేట్ చే'సిన సంగతి తెలిసిందే. Twitter logo be like 💢#TwitterLogo #DOGE #Twitter #ElonMusk #Dogecoin #DogecoinToTheMoon #Memes pic.twitter.com/smS3uoeWwM — Vinny Bhardwaj (@vinnybhardwaj_) April 4, 2023 I wish the media would stop flattering me all time … it’s a bit much guys ☺️ — Elon Musk (@elonmusk) April 3, 2023 -
పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!
ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై పడ్డాడు. ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్‌లో కాదులెండి.. డెస్క్‌టాప్ వెర్షన్లో మాత్రమే ఇలా చేశాడు. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) pic.twitter.com/wmN5WxUhfQ — Elon Musk (@elonmusk) April 3, 2023 ట్విటర్ వెబ్సైట్లో హోం బటన్‌గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టోకరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్‌లో కనిపిస్తోంది. (జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!) ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్‌ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అలాగే 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను ‘డాగ్’గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరిగింది. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 -
విశాఖ.. కళాత్మక కీర్తి పతాక
సాక్షి, విశాఖపట్నం: వైవిధ్యభరితమైన విశాఖ వైభవాన్ని విదేశాలకు ఘనంగా చాటిచెప్పే అవకాశం జీ–20 సదస్సుతో సాక్షాత్కరించింది. దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో జరుగుతున్న సన్నాహక సదస్సుల్లో భాగంగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు అత్యంత కళాత్మకంగా నిలుస్తున్నాయి. జీ–20 దేశాల జెండాల వైభవంతో పాటు వసుదైక కుటుంబమనే థీమ్‌ను విశ్వవ్యాప్తం చేస్తూ.. భారతీయ సంప్రదాయాల డిజైన్లు, మ్యూరల్ ఆర్ట్స్‌ను గుంటూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్ జాన్ రత్నబాబు బండికొల్ల ప్రపంచానికి పరిచయం చేశారు. రత్నబాబు కళాప్రతిభని చూసి విదేశీ ప్రతినిధులు అచ్చెరువొందుతున్నారు. విభిన్నంగా విశాఖ సదస్సు ఇప్పటివరకూ 20కి పైగా నగరాల్లో ఈ సన్నాహక సదస్సులు జరిగాయి. వీటన్నింటితో పోలిస్తే విశాఖ సదస్సు విభిన్నమైనదిగా గుర్తింపు పొందింది. సభా ప్రాంగణంతో పాటు నగరమంతా మురిసిపోయేలా రూపొందించిన డిజైన్లు అతిథులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీన్ని కళాత్మక సదస్సుగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన జాన్ రత్నబాబు ఏయూలో బీఎఫ్ఏ చేశారు. ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జీ–20 విశాఖ లోగో కూడా అద్భుతః జీ–20 థీమ్ అయిన వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్ (వసుదైక కుటుంబం)ని చాటిచెప్పేలా జాన్ లోగో డిజైన్ చేశారు. ♦ ఒక గ్లోబ్లో అక్షర క్రమంలో జీ–20 దేశాల జాతీయ జెండాలను ఆయా దేశాల ప్రజలు పట్టుకుని ఉన్నట్లుగా చిత్రీకరణ చేశారు. మధ్యలో మన జాతీయ వృక్షం మర్రిచెట్టు, జాతీయ పక్షి పురివిప్పిన నెమలిని కూడా చిత్రీకరించారు. ఈ మర్రి వృక్షానికి జీ–20 దేశాల జాతీయ పక్షులు, పుష్పాలు జోడించారు. ♦ అదేవిధంగా వృక్షం చివర్లో వన్ ఫ్యామిలీకి గుర్తుగా నెమలి పింఛాలు, మర్రి వృక్షం మొదట్లో ఒక తండ్రి, తల్లి మధ్యలో బాలుడు, వారి ఇల్లుని, వన్ ఫ్యూచర్‌కి సింబాలిక్‌గా సీతాకోక చిలుకల పెయింటింగ్ వేశారు. ♦ సదస్సుకు ఆహ్వానం పలుకుతున్న విశాఖనగరానికి చిహ్నంగా సముద్రం, డాల్ఫిన్ నోస్, లైట్‌హౌస్, పక్కనే చర్చి, మధ్యలో గుడి, మసీద్‌ను వేశారు. ♦ మొత్తంగా త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసి.. ప్రతి ఒక్కరూ వహ్వా అనేలా రూపొందించారు. ఈ తరహా డిజైన్లను ఎవరూ రూపొందించలేదని విదేశీ ప్రతినిధులు చెప్పారు. నగర వీధుల్లో వాల్ పెయింటింగ్స్ ఆకట్టుకునేలా చిత్రించారు. ఎప్పుడూ రాని సంతృప్తి ఇప్పుడు వచ్చింది విజువల్ ఆర్టిస్ట్‌గా 150కి పైగా అంతర్జాతీయ అవార్డులు సాధించినా రాని సంతృప్తి.. జీ–20 సదస్సు ప్రధాన లోగో డిజైన్ చేసినప్పుడు వచ్చింది. ప్రముఖుల నుంచి అందుతున్న ప్రశంసలు ఆత్మసంతృప్తినిస్తున్నాయి. విశాఖలో మొత్తం 2000 డిజైన్లతో కాన్సెప్ట్‌లను వాల్‌పెయింటింగ్స్‌గా మలిచాం. 34 రోజుల పాటు శ్రమించి విశాఖను కళాత్మక నగరంగా మలిచాం. – జాన్ రత్నబాబు బండికొల్ల, అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్ -
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్‌కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్‌కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
హైదరాబాద్‌లో తానా మహాసభల సన్నాహక సమావేశం జయప్రదం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023లో ఫిలడెల్ఫియాలో జూలై నెలలో నిర్వహించే 23వ తానా మహాసభలను పురస్కరించుకుని ఇండియాలో మొట్టమొదటిసారిగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో జరిగిన ఈ సమావేశానికి మంచి స్పందన వచ్చింది. తానా నాయకులతోపాటు దాతలు, సినీ నటీనటులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తానా బోర్డ్ డైరెక్టర్ జాని నిమ్మలపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి వ్యాపారవేత్తలు రామకృష్ణ బొబ్బ, సుధాకర్ కొర్రపాటి దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీ నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా మహాసభల లోగోను, ప్రోమోను మురళీ మోహన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు తానా అంటే చాలా ఇష్టం అని ఇప్పటివరకు 20 సార్లు వారి మహాసభలకు హాజరయ్యానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. ఫిలడెల్పియాలో జూలై నెలలో నిర్వహిస్తున్న తానా మహాసభలకు అందరూ రావాల్సిందిగా ఆహ్వానించారు. వ్యాపార ప్రముఖులతోపాటు, రాజకీయ, సినీతారలు, సాహితీవేత్తలు ఇతరులు అందరూ ఈ మహాసభల విజయవంతానికి సహకరించి తానా ఆతిధ్యాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. దాతలు ఇస్తున్న సహకారం మరువలేనిదంటూ తానాకు సహకరిస్తున్న దాతలను ఆయన ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. \ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి మహాసభలకు సంబంధించిన విశేషాలను వివరించి అందరూ ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తానా బోర్డ్ డైరెక్టర్ జాని నిమ్మలపూడి సేకరించిన కోటి రూపాయలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రతాపరెడ్డి కూడా కీలకపాత్ర పోషించారని జాని నిమ్మలపూడి తెలిపారు. తానా నాయకులు లక్ష్మీ దేవినేని, శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం చౌదరి గూడె, సురేష్ పుట్టగుంట, రవి మందలపు, సునీల్ పంత్ర, శ్రీనివాస్ ఓరుగంటి, ఉమ కటికి, రాజా కసుకుర్తి, సురేష్ కాకర్ల, హితేష్ వడ్లమూడి, శశాంక్ యార్లగడ్డ, శ్రీనివాస్ కూకట్ల, టాగూర్ మలినేని, రఘు ఎద్దులపల్లి, సుమంత్ పుసులూరి తదితరులతోపాటు సినీ రంగ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ మహాసభల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్‌హాం ప్యాలెస్‌లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
మహిళలకు గొప్ప సందేశాత్మకంగా 'లవ్'
Love Movie Logo Launched By Director Nag Ashwin: రామరాజు, సోనాక్షీ వర్మ, అభి, ప్రీతీ సింగ్, శ్రీకృష్ణ, డాక్టర్ మారుతి సకారం ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘లవ్’. శ్రీనారాయణ దర్శకత్వంలో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – ‘‘గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథతో రానున్న సినిమా ఇది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుతున్నా. అలాగే ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశా’’ అని తెలిపారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. మహిళలకు సంబంధించిన ఓ గొప్ప సందేశం అంతర్లీనంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. చదవండి: రొమాంటిక్ వెబ్‌సిరీస్‌గా 'ఎమోజీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన లవ్‌బర్డ్స్! -
లోగో మారిందెలాగో..
మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లోగోల్లో ఒకటి. ఎరుపు మీద పసుపుపచ్చ రంగులో అందరికీ తెలిసిందే. కానీ.. అరిజోనాలోని సెడోనాలో ఉన్న ఓబ్రాంచ్లో మాత్రం మెక్‌డొనాల్డ్స్ లోగో నీలిరంగులో ఉంటుంది. ప్రపంచమంతటా బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే... అక్కడ మాత్రమే నీలి రంగులో ఎందుకుంది? ఎందుకో తెలుసా? సెడోనా... ఎర్రరాతి పర్వతాలు, సహజ అందాలతో అలరారే అద్భుతమైన నగరం. అలాంటి నగర ప్రశాంతతకు అంతరాయం కలిగించే ఏ నిర్మాణాలను, కట్టడాలను స్థానిక అధికారులు అనుమతించరు. నగరంలో ఏం నిర్మించాలన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మెక్‌డొనాల్డ్స్ 1993లో సెడోనాలో తన అవుట్‌లెట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా స్థానిక అధికారులు దాని పసుపురంగు లోగోపై అభ్యంతరం చెప్పారు. దానికి బదులుగా ఆహ్లాదకరంగా ఉండే నీలిరంగును వాడాలని సూచించారు. టీంతో అధికారుల ఆదేశాల మేరకు మెక్‌డొనాల్డ్స్ అలాగే ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదికూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికి వచ్చినవారెవరూ అరుదైన ఈ లోగోముందు ఫొటో తీసుకోకుండా వెళ్లరు. -
8 ఏళ్ల తర్వాత గూగుల్ మరో కీలక నిర్ణయం..!
ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ విషయంలో టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత మొదటిసారిగా క్రోమ్ లోగోను స్వల్పంగా మారుస్తోంది. రీడిజైన్‌కు సంబంధించి గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఈ మేరకు “ క్రోమ్ కొత్త ఐకాన్‌ను మీరు ఇవాళ గమనించే ఉంటారు. 8 ఏళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం” అని వెల్లడించారు. పాత క్రోమ్ లోగో మాదిరి కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేవు. లోగోలో వినియోగించిన నాలుగు రంగులు మునుపటి కంటే చాలా మెరుస్తూ ఉన్నాయి. మధ్యలోని నీలిరంగు వృత్తం కొంచం పెద్దదిగా కనిపిస్తుంది. విండోస్‌తో సహా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కోసం ఈ లోగోను తయారు చేసినట్లు ఎల్విన్ హు పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల అందరికీ ఈ లోగోలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా, 2008లో క్రోమ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలుత 2011, 2014 ఏడాదిలో లోగోలో మార్పులు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. Some of you might have noticed a new icon in Chrome’s Canary update today. Yes! we’re refreshing Chrome’s brand icons for the first time in 8 years. The new icons will start to appear across your devices soon. pic.twitter.com/aaaRRzFLI1 — Elvin 🌈 (@elvin_not_11) February 4, 2022 (చదవండి: హ్యుందాయ్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు) -
‘ఇది మీ ఆకాశం’.. బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కొత్త మంత్రం
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ .. తమ ట్యాగ్‌లైన్, ఎయిర్‌క్రాఫ్ట్ లివెరీ (రంగులు, గ్రాఫిక్‌లు మొదలైనవి)ని బుధవారం ఆవిష్కరించింది. నారింజ, ఊదా రంగులు, ’ఉదయించే అ’ చిహ్నంతో వీటిని రూపొందించింది. ఉదయించే సూర్యుడి స్నేహపూర్వక అనుభూతిని, సునాయాసంగా ఎగరగలిగే పక్షి సామర్థ్యాలను, విమాన రెక్కల విశ్వసనీయతను చిహ్నం ప్రతిబింబిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ’ఇది మీ ఆకాశం’ పేరిట రూపొందించిన ట్యాగ్‌లైన్.. సామాజిక–ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుం డా అందరికీ విమానయానాన్ని అందుబాటులోకి తేవాలన్న తమ బ్రాండ్ ఆకాంక్షకు స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొంది. Unveiling ‘The Rising A’ of Akasa Air Inspired by elements of the sky, The Rising A symbolises the warmth of the sun, the effortless flight of a bird, and the dependability of an aircraft wing. Always moving upwards. Always inspiring to rise. pic.twitter.com/vzMDT9gEmv — Akasa Air (@AkasaAir) December 22, 2021 -
యాపిల్ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..!
స్మార్ట్ ఫోన్లలో రారాజు ఐఫోన్. ఫోన్లు ఎన్ని ఉన్నా ఐఫోన్ తర్వాతనే ఏదైనా. అటు ఫీచర్లు, ఇటు సెక్యూరిటీ విషయంలో మిగిలిన ఫోన్ల కంటే ఐఫోన్ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఇన్ని హంగులున్న ఈ ఐఫోన్ ధర మాత్రం ఎక్కువే. అందుకే ఆ ఫోన్ సామాన్యులకు అందని ద్రాక్షాగా మిగిలిపోయింది. దీనికి తోడు ఆండ్రాయిడ్ వెర్షన్ కంటే యాపిల్ ఐఓఎస్ వెర్షన్ ను ఆపరేట్ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ ఆ ఫోన్లను వినియోగించే వారికి ఫోన్లో ఉండే ఫీచర్లు గురించి తెలియదంటే నమ్మశక్యం కాదు, కానీ ఇది వాస్తవం..! అయితే అటువంటి ఐఫోన్లో ఓ సూపర్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఫోన్ లోపల కాదు. బయటే? అదెలా అంటారా? ఐఫోన్ లోగో యాపిల్ ఐఫోన్లో యూజర్లను ఎట్రాక్ట్ చేసేది లోగోనే. తాజాగా లోగోను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేసింది యాపిల్ సంస్థ. ఫోన్లపై దిష్టిబొమ్మలాగ ఉండేలోగోలు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయా అనే అనుమానం రావొచ్చు. యూకేకి చెందిన ప్రముఖ మీడియా 'డైలీ రికార్డ్' కథనం ప్రకారం.. యాపిల్ సంస్థ గతేడాది సెప్టెంబర్ 16న ఐఓఎస్ 14ను అందుబాటులోకి తెచ్చింది. యాక్సిలేటర్ ఆధారంగా పనిచేసేలా ఐఫోన్ 8 నుంచి ఆపై మోడల్స్ అన్నింటిలో బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆ ఫీచర్ ఉన్న ఐఫోన్పైన ఉండే లోగోను రెండు లేదా మూడుసార్లు టచ్ చేస్తే చాలు ఫోన్‌లోపల ఉండే అప్లికేషన్లు డీఫాల్ట్‌గా పనిచేస్తాయని డైలీ రికార్డ్ తన కథనంలో పేర్కొంది. ఐఫోన్లో బ్యాక్ ట్యాప్ ఉపయోగించి ఇంకేం చేయొచ్చో? యాపిల్ లోగోను 'బ్యాక్ ట్యాప్'గా ఉపయోగించడం ద్వారా వాల్యూమ్‌ను తగ్గించడం, పెంచడం, స్క్రీన్షాట్లను తీయడం, హోమ్ స్క్రీన్‌కి వెళ్లడం లేదంటే సెట్టింగ్‌లో మీరు సెలక్ట్ చేసుకున్న యాప్స్‌లలో ఎంటర్ అవ్వొచ్చు. అంతేకాదు మాగ్నిఫైయర్, వాయిస్ ఓవర్, అసెస్టీవ్ టచ్, సిరి షార్ట్‌కట్, రీచబిలిటీ వంటి ఫీచర్లను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మీరు ఐఫోన్‌ను వినియోగిస్తుంటే మీరు ఐఫోన్ 8 కానీ, ఆ తర్వాత సిరీస్ ఫోన్లను వినియోగిస్తుంటే ఈ బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఫోన్లో లేటెస్ట్ ఓస్ వెర్షన్‌ను అప్డేట్ చేసి ఉండాలి. 'బ్యాక్ ట్యాప్' ఫీచర్‌ను వినియోగించడం చాలా సులభం. మీ ఐఫోన్లో సెట్టింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి >> క్లిక్ చేస్తే యాక్సెసిబిలిటీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది >> అందులో టచ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి >> క్లిక్ చేస్తే మీరు బ్యాక్ ట్యాప్ ఆప్షన్‌లోకి వెళతారు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
Mi బ్రాండ్ పేరు మారుతోంది ? కొత్తగా నేమ్ ఇదే ?
ఇండియాలో హయ్యస్ట్ అమ్మకాలు సాధించిన ఎంఐ బ్రాడ్ పేరు మారబోతుంది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు నాణ్యతతో అందిస్తూ ఇండియా మార్కె్ట్లో చెరగని ముద్ర వేసింది ఎంఐ బ్రాండ్. స్మార్ట్ఫోన్లతో మొదలు పెట్టి టీవీలు, వాచీలు, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇలా అనేక విభాగాలకు విస్తరించిన ఎంఐ బ్రాండ్, దాని లోగో ప్రస్తుతం ఉన్న రూపంలో భవిష్యత్తులో కనిపించదు. Mi ఎలా వచ్చింది. ఎంఐ బ్రాండ్‌తో మనకు లభించే ఫోన్లు, ల్యాప్‌ల్యాప్‌లను తయారు చేసే కంపెనీ పేరు షావోమి. ఇంగ్లిష్‌లో Xiaomiగా రాస్తారు. ఇందులో చివరి రెండు అక్షరాలైన Mi అక్షరాలనే లోగోగా మార్చి షావోమి చైనా, ఇండియాతో పాటు ఏషియా మార్కెట్లో తిరుగులేని బ్రాండ్‌గా మారింది. ఎంఐ బ్రాండ్ ఎప్పటి నుంచి షావోమి నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ 2011 ఆగస్టులో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్న మోడల్స్ వచ్చాయి. ఇందులో ఎంఐ నోట్ సిరీస్‌కి ఇండియాలో మంచి ఆధరణ లభించింది. తాజాగా షావోమి సంస్త చైనాలో మిక్స్ 4 పేరుతో కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ సందర్భంగా ఫోన్‌పై ఎంఐకి బదులు షావోమి అని ముద్రించింది. అంతేకాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు వచ్చే ఎంఐ లోగో బదులు షావోమి లోగోను పొందు పరిచింది. మిగిలిన చోట ఎప్పుడు ప్రస్తుతం చైనాలో ఎంఐ బ్రాండ్ స్థానంలో షావోమి బ్రాండ్ నేమ్, లోగోను ఉపయోగిస్తున్నామని, త్వరలోనే ఇతర మార్కెట్ రీజియన్లలో కూడా ఎంఐ బదులు షావోమి లోగో, బ్రాండ్ నేమ్‌ను ప్రవేశపెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ప్రొడక్టులపై ఎంఐ బదులుగా షావోమి అని ఉంటుందని వెల్లడించారు. అమ్ముడైన ఫోన్లు ఎన్ని 2011లో షావోమి సంస్థ నుంచి తొలి ఫోన్ ఎంఐ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయి. టెక్ దిగ్గజ కంపెనీలైన శామ్సంగ్, ఆపిల్లను సైతం ఎంఐ వెనక్కి నెట్టింది.తాజాగా ఈ కంపెనీ బ్రాండ్ నేమ్‌ని ఎంఐ నుంచి షావోమికి మారుతోంది. చదవండి: Work From Home: ఐటీ కంపెనీలకు కర్నాటక సర్కార్ రిక్వెస్ట్ -
తెలుగు గడ్డపై హీరో మోటర్ కార్ప్ గిన్నీస్ రికార్డ్
World's Largest Motorcycle Logo: ప్రపంచంలోనే అతి పెద్ద బైకుల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటర్ కార్ప్ మరో రికార్డు సాధించింది. ఆ కంపెనీకి చెందిన 100 మంది సిబ్బంది 90 రోజుల పాటు శ్రమించి హీరో పేరును గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించారు. తెలుగు నేలను వేదికగా హీరో సంస్థ ఈ ఘనత సాధించింది. చిత్తూరులో హోండా కంపెనీ నుంచి హీరో విడిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని హీరో అరుదైన కార్యక్రమం చేపట్టింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాను వేదికగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్ సైకిల్ లోగోను ఏర్పాటు చేసి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. గిన్నీస్ రికార్డ్ చిత్తూరులో ఉన్న హీరో మోటార్ కార్ప్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్ప్లెండర్ ప్లస్ బైకులను హీరో లోగో ఆకారంలో ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ సమీపంలో నేలను చదును చేశారు. ఆ తర్వాత హీరో లోగో ఆకారంలో రోజుకు కొన్ని బైకులను పార్క్ చేశారు. దీని కోసం హీరోకు చెందిన వంద మంది సిబ్బంది 90 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. ఈ లోగో ఆకారంలో 1845 బైకులను నిలిపి ఉంచారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని షూట్ చేసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకు పంపించారు. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం లార్జెస్ట్ మోటార్ సైకిల్ లోగోగా గిన్నీస్ గుర్తించింది. పదికోట్ల బైకులు హీరో కంపెనీ నుంచి పది కోట్ల బైకులు అమ్మడంతో పాటు హీరో పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్టు హీరో మోటార్ కార్ప్ గ్లోబల్‌హెడ్ మాలో ఏ మాసన్ తెలిపారు. ఈ లోగో ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఆగస్టు 9న హీరో రిలీజ్ చేసింది. - సాక్షి, వెబ్‌డెస్క్ What happens when 100 brilliant minds come together? A world record is made. With 90 days of planning and 300 hours of dedication. Watch the video to know more. pic.twitter.com/QAdK4CijUO — Hero MotoCorp (@HeroMotoCorp) August 10, 2021 -
కేంద్రం ప్రభుత్వం కొత్త పోటీ.. 15 లక్షలు గెలుచుకునే అవకాశం!
సాక్షి, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆగస్టు 15లోగా కేంద్రం ఇటీవల మౌలిక సదుపాయల కల్పన కోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పుడీ డీఎఫ్ఐ... తీరు తెన్నులు, లక్ష్యాలను స్ఫూరించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేది సాయంత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. బహుమతులు ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 5 లక్షల వంతున మొత్తం రూ. 15 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొంది. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు రూ. 2 లక్షల వంతున బహుమతులు అందివ్వనున్నారు. ఇలా పంపండి దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థం అయ్యేలా, పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపివ్వాల్సి ఉంటుంది. డీఎఫ్ఐ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ యాక్ట్ 2021 ద్వారా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపింది. డీఎప్ఐ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగు పరచడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. సుమారు 1.11 లక్షల కోట్ల వ్యయంతో 7,000 ప్రాజెక్టులు చేపట్టబోతుంది. ఈ పథకం ద్వారా దేశ రూపురేఖలు మారిపోతాయని కేంద్రం చెబుతోంది. .@FinMinIndia in association with @mygovindia is announcing a contest to crowdsource the name, tagline and logo of the new Development Financial Institution. Cash prizes of up to Rs 5 lakh in each category! Last date for entries is 15.08.2021. https://t.co/uK5AojlWlB (1/2) — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 The setting up of a Development Financial Institution was announced by Finance Minister Smt @nsitharaman in Budget 2021-22. Both Houses of Parliament passed the National Bank for Financing Infrastructure and Development (NaBFID) Bill 2021 in March 2021. (2/2) pic.twitter.com/8AFa26Bdxf — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 -
‘ఉస్మానియా’ లోగోను ప్రభుత్వం మార్చలేదు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లోగోను తమ ప్రభుత్వం మార్చలేదని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోగోను టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సెక్యులర్ నాయకుడని, అన్ని మతాలను సమానంగా గౌరవించే వ్యక్తి అని పేర్కొన్నారు. లోగోపై నిగ్గు తేల్చే బాధ్యతలను ఉస్మానియా ఉర్దూ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్‌కు అప్పగించగా ఆయన పలు వివరాలు వెల్లడించారని తెలిపారు. 1951 సంవత్సరంలో లోగోలో కొంతమార్పు జరిగిందని, 1960లో లోగోను పూర్తిగా మార్చేశారని, ఐతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 1960 సంవత్సరం తరువాత వర్సిటీ ధ్రువపత్రాలు ఉన్నవారు ‘లోగో’ను గమనించవచ్చని, నిరాధారమైన వార్తలను నమ్మవద్దని హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
Hanuma vihari: ఫౌండేషన్ లోగో చూశారా!
సాక్షి,న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి పలువురి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌లో హనుమ విహారి అనేక మంది బాధితులకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. ఈ క్రమంలో హనుమ విహారి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఫౌండేషన్ లోగోను ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ లోగోను పరిచయం చేస్తూ "మనం అందరికీ సాయం చేయలేకపోవచ్చు.కానీ ప్రతీవాళ్లు కొందరికి సాయం చేయొచ్చు’’ రోనాల్డ్ రీగన్ మాటలను కోట్ చేశారు. ‘అందరం ఐక్యమవుదాం. కలిసికట్టుగా సాయపడదాం’ అని విహారి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా తన ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ, రక్తదానం లాంటి విశేష సేవలను అందిస్తున్నారు హనుమ విహారి. ఇంకా కేన్సర్ పీడితులు, అనేక మంది చిన్నారులకు సాయం అందిస్తూ భరోసానిస్తున్నారు. 24 గంటలూ బాధితులకు అండగా ఉంటూ ఆయన అందిస్తున్న సేవలు ఆయన ట్విటర్ టైం లైన్ పరిశీలిస్తే అర్థమవుతాయి. అంతేకాదు తనతోపాటు సాయం చేసేలా పదిమందిని ప్రోత్సహిస్తుండటం విశేషం. Hi All- "We can't help everyone, but everyone can help someone" by Ronald Reagan.🙂 On this note happy to introduce our logo. Let us unite together and reach our help and efforts to needy people. Team Hv 🤝🏻@Hanumavihari pic.twitter.com/cblAvHLFAy — Hanuma Vihari Foundation (@HanumaVihariFdn) June 11, 2021 చదవండి: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి హనమ విహరి ఆర్ధిక సాయం పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
సోషల్ మీడియాలో రచ్చ: సీక్రెట్‌గా లోగో మార్చిన అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ మొబైల్ యాప్ ఐకాన్ లోగోలో సీక్రెట్‌గా మార్పులు చేసి కొత్త లోగోను ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ మధ్య మింత్రా లోగో వివాస్పందంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరిచేలా ఆ లోగో ఉందని ఆరోపించడంతో దానిని కాస్తా మార్చి కొత్త లోగోను విడుదల చేశారు. అయితే ఆ పాత లోగోలో ఏముందని పరీక్షించి చూడగా అసలు సంగతి బయటపడింది. దీంతో నెటిజన్లు మిగతా షాపింగ్ యాప్‌ల లోగోలను కూడా గమనించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అమెజాన్ మొబైల్ యాప్ లోగోపై ఓ కన్నేసారు. బ్రౌన్ కాటన్ బాక్స్‌పై బ్లూ కలర్ టేప్ అతికించినట్లు ఉండి కింద స్మైల్ షేర్ బాణం ఉంటుంది. అది చూసిన కొందరూ నెటిజన్లు.. ఈ లోగో నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ మీసంలా ఉందంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. i keep thinking the new amazon app logo is aang from avatar 😭 pic.twitter.com/YkIdcvNruh — 𝑁𝑜𝑘𝑒𝑠🃏 (@ixNOKES) March 2, 2021 దీంతో అమెజాన్ లోగో ప్రపంచ వ్యాప్తంగా నెట్టింట వైరల్‌గా మారింది. అతేగాక పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో దీనిపై రచ్చ జరిగింది. ఇది కాస్తా అమెజాన్ కంట పడింది. వెంటనే స్పందించిన అమెజాన్ సీక్రెట్‌గా లోగోలో చిన్న మార్పు చేసింది. కొత్త లోగోలో ఆ బ్లూ టేపును కాస్తా పైకి మడిచినట్లుగా మార్చి విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్లను తృప్తి పరిచేందుకు మా సంస్థ తరచూ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని పేర్కొన్నారు. అయినప్పటికి ఈ కొత్త లోగో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అవతార్: ది లాస్ట్ ఎయిర్ బెండర్ ఆంగ్ తలపై ఉండే గుర్తులా ఉందంటూ నెటిజన్లు మళ్లీ పోల్చడం ప్రారంభించారు. Does the new Amazon app logo look like Aang or am I crazy pic.twitter.com/CcCJ1Yw0KF — 💙 Leebobawitz 💙 (@leebobawitz) February 26, 2021 చదవండి: స్వీట్ బాక్సులు పంచారు, వీధి మొత్తం దోచేశారు అమెజాన్ పార్సిల్ అనుకుంటున్నారా.. కాదండోయ్! పవర్ స్టార్ సినిమాను దక్కించుకున్న అమెజాన్! -
ఎలా చూస్తే అలా.. ఆ సంకేతం మార్పు
‘పొలిటికల్ కరెక్ట్‌నెస్’ అనే మాట ఒకటి ఉంది. ఏ భావననైనా.. అది అక్షరం అయినా, చిత్రం అయినా, మాట అయినా.. సంస్కారవంతంగా వ్యక్తం చేసేలా జాగ్రత్త పడటమే పొలిటికల్ కరెక్ట్‌నెస్. సాటి మనిషి మనోభావాలు దెబ్బతినకుండా ఎరుక (లేక) స్పృహ కలిగి ఉండటం అది. బెంగళూరులోని ప్రసిద్ధ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ లోగో విషయంలో ఇలాంటి పొలిటికల్ కరెక్ట్‌నెస్ లేదని ‘అవెస్టా ఫౌడేషన్’ అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి ఒకరు డిసెంబరులో ఫిర్యాదు చేయడంతో మింత్రా రెండు రోజుల క్రితం తన లోగోను మార్చుకుంది. పాత లోగోని ఒక భాగం స్త్రీ జననావయవాన్ని సంకేత పరుస్తోందని ఆ ప్రతినిధి అభ్యంతరం. (చదవండి: ఎస్బీఐ : యోనో బంపర్ ఆఫర్లు) దాంతో లోగోను పూర్తిగా మార్చకుండానే ‘ఆ’ సంకేతాన్ని మార్పు చేయడంతో మింత్రా తన ఉనికిని నిలుపుకోగలిగింది. అయితే.. పొలిటికల్ కరెక్ట్‌నెస్ పేరుతో ప్రతి విషయాన్నీ వేరే కోణంలోంచి చూడటం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఇలాగైతే ఎన్నని మార్చుకుంటూ పోవాలి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అందు నిదర్శనంగా కొన్ని కంపెనీల లోగోలను, వాటిలో ‘కనిపిస్తున్న’ అభ్యంతరాలను నెటిజెన్లు ట్వీట్ చేశారు. -
సరికొత్తగా అమెజాన్ లోగో
ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏ చిన్న వస్తువు కొనలన్నా ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గ్గజం 'అమెజాన్'లో కొనేస్తున్నాం. ఇప్పుడు పట్టణాల నుంచి పల్లె ప్రాంతాల కూడా అమెజాన్ సేవలు విస్తరించాయి. అంతలా నెటిజన్లకు దగ్గరైన అమెజాన్ గత కొన్నేళ్లుగా ఒకే లోగోతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న లోగోలో అమెజాన్ పేరు, నీలి రంగులో షాపింగ్ కార్టు బొమ్మ మనకు కనిపిస్తాయి. పలు యాప్ స్టోర్‌ల్లో కూడా అదేవిదంగా మనకు కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇకపై మరో కొత్త అవతార్‌తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. యాపిల్ యూజర్లు కొందరు కొత్త అమెజాన్ ఐకాన్ ను గుర్తించారు. కొత్త ఐకాన్(క్రింద)లో పేరు లేకుండా బ్రౌన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అమెజాన్ సంతకం బాణం/ స్మైల్ లోగో డిజైన్‌ను రూపొందించారు. మొత్తంగా లోగో డిజైన్ ‘షిప్పింగ్ బాక్స్’లను పోలి ఉండేలా తీర్చిదిద్దారు.(చదవండి: వన్‌ప్లస్ ప్రియులకి గుడ్ న్యూస్) -
భూమికి ట్యాగ్‌లైన్, లోగోలతో భరోసా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూములను సంపూర్ణంగా సర్వే చేసి యజమానులకు వాటిపై శాశ్వత హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమానికి మంచి పేరు, ట్యాగ్‌లైన్, లోగో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సర్వే నంబరుకు కచ్చితమైన హద్దుల నిర్దారణ, రైతులకు శాశ్వతహక్కుల కల్పన లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూముల సమగ్ర రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అమలు చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుని ముందుకెళుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా రీసర్వే యజ్ఞానికి శ్రీకారం చుడుతుండటం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద సాహసోపేత కార్యక్రమం అయినందున ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా ప్రజలకు దీని ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత పేర్లు ఇవే... ఈ బృహత్తర కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా కొన్ని పేర్లను ప్రతిపాదించారు. ‘స్వక్షేత్ర’, ‘క్షేత్రఘ్న’, ‘స్వధాత్రి’, ‘స్వభూమి’, ‘వసుంధర’, ‘వసుధ’, ‘క్షేత్రపతి’, ‘భూమిదారు’ తదితర పేర్లను ప్రాథమికంగా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. మరికొన్ని పేర్లనూ పరిశీలించి అందులో ఒకదానిని ముఖ్యమంత్రి ఆమోదించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు ప్రతిపాదనలు ట్యాగ్ లైన్ కోసం ఏడు ప్రతిపాదనలను రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. ‘మీ భూమికి మా హామీ’, ‘మీ భూమికి భద్రత’, ‘మీ భూమి పదిలం’, ‘మీ భూమికి శాశ్వత హక్కు‘, ‘ప్రతి క్షేత్రం పదిలం’, ‘మీ భూమికి మా భరోసా’, ‘ప్రతి క్షేత్రం క్షేమం’ అనే అంశాలను ట్యాగ్‌లైన్ కోసం ప్రాథమికంగా ప్రతిపాదించారు. రైతుపై నయాపైసా భారం ఉండదు రీ సర్వే కోసం ఎంత ఖర్చయినా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, భూ యజమానులపై నయాపైసా భారం కూడా వేయరాదని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నంబరు రాళ్ల ఖర్చును రైతులే చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినా అది కూడా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాడు... గతంలో భూమి కొలతలు, సబ్ డివిజన్ చేయించుకోవాలంటే చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చేది. ముందుగా మీసేవ కేంద్రంలో డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాల్సి వచ్చేది. ముడుపులు ఇవ్వనిదే సర్వేయరు వచ్చి భూమి కొలతలు వేయని పరిస్థితి. సర్వేయర్ల కొరతవల్ల నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. నేడు... వైఎస్ జగన్ సర్కారు రాగానే 11,500 పైగా గ్రామ సర్వేయర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించింది. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయరు ఉన్నారు. ఎవరు భూమి కొలతలు వేయించుకోవాలన్నా గ్రామ/ వార్డు సచివాలయంలో అర్జీ ఇస్తే చాలు. వెంటనే సర్వేయరు వచ్చి పని పూర్తి చేస్తారు. ఇప్పటి వరకూ విదేశాలకే పరిమితమైన కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) అనే అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూసర్వేకు కార్యాచరణ రూపొందించాం రాష్ట్రంలో 120 ఏళ్ల నుంచి భూముల సర్వే జరగలేదు. దీనివల్ల చాలాచోట్ల సరిహద్దు రాళ్లు లేవు. పెద్ద సంఖ్యలో పొలంగట్ల వివాదాలు ఉన్నాయి. రికార్డులు సక్రమంగా లేనందున రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందువల్లే రికార్డులను స్వచ్ఛీకరించి ట్యాంపర్డ్ ఫ్రూఫ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన మార్గనిర్దేశం ప్రకారం భూ సర్వేకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. - వి. ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి. -
న్యూలుక్లో ఫేస్బుక్ మెసెంజర్
ప్రపంచ సాంకేతిక దిగ్గజం ఫేస్బుక్ మెసెంజర్‌ను కొత్త అవతారంలో తీసుకురానుంది. అంతే కాకుండా దానికి చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్కర్లు, సరిపడా ప్రతిస్పందనలను ప్రవేశపెట్టనుంది. ‘భవిష్యత్ మెసెజింగ్‌కు అనుగుణంగా మార్పులు ఉంటాయి. ఈ మధ్యే ఇన్ స్టాగ్రామ్ తో మెసెంజర్ అనుసంధానం జరిగింది' అని ఫేస్బుక్ వెల్లడించింది. ఫేస్బుక్ మెసెంజర్ కొత్త లోగో దాని సాంప్రదాయ సాలిడ్ బ్లూ(నీలం) రంగు నుంచి కొద్దిగా మారనుంది. దానికి బదులుగా, ఇది ఇన్స్టాగ్రామ్ లోగో మాదిరిగా నీలం- నుండి- పింక్ ప్రవణతకు రూపుదిద్దుకోనుంది. త్వరలో వినియోగదారులు ఇన్కమింగ్ సెల్ఫీ స్టిక్కర్ల ఫీచర్లను ఉపయోగించగలుగుతారు. అది వారి సెల్ఫీలతో పాటు స్టిక్కర్లను తయారుచేయడానికి వీలు కల్పిస్తుంది. ఫేస్బుక్ కూడా డార్క్ మోడ్ లక్షణాన్ని విడుదల చేస్తుంది, దీని ద్వారా మీరు చాట్ నుండి నిష్క్రమించినప్పుడు లేదా అవి చూసిన తర్వాత సందేశాలు అదృశ్యమవుతాయి. "మా క్రొత్త లోగో భవిష్యత్ మెసెజింగ్ విషయంలో జరగాల్సిన మార్పును ప్రతిబింబిస్తుంది. మీరు సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మరింత డైనమిక్, ఆహ్లాదకరమైన, సమ్మిళిత మార్గం దిశగా మళ్లనుంది. ఈ మార్పు మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. కేవలం మెసేజులు మాత్రమే పంపుకునే దశ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో వివిధ యాప్‌లు, పరికరాల ద్వారా హ్యాంగవుట్ అయ్యేందుకు నూతన మార్పులు వీలు కల్పిస్తాయి” అని మెసెంజర్ వైస్ ప్రెసిడెంట్ స్టాన్ చుడ్నోవీస్కీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. గత నెలలోనే ఫేస్బుక్ మెసెంజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించింది. దీంతో మెసెంజర్ లేదా ఇన్స్టాలలో దేన్నుంచైనా దేనికైనా సందేశాలు పంపుకునే వీలుంది. (చదవండి: యూజర్లకు షాక్.. ఐఫోన్ 12లో అవి మిస్) -
లోగో గీస్తే.. బహుమతి మీదే
సాక్షి, విశాఖపట్నం: మీరు మంచి డిజైనరా.. లోగో డిజైన్లు అద్భుతంగా గీయగలరా.. అయితే మంచి లోగో గీయండి.. నగదు బహుమతి సొంతం చేసుకోండి.. అంటూ అద్భుతమైన అవకాశం ఇస్తోంది విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ. విశ్వాన్ని, విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఒకే ప్రాంతంలోకి తీసుకొచ్చేలా ఏపీ నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి గతేడాది డిసెంబర్ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నగర శివారులోని కాపులుప్పాడలో ఈ పార్కును నిర్మించనున్నారు. పదిహేనెకరాల విస్తీర్ణంలో నేచురల్ హిస్టరీ పార్క్ రూపుదిద్దుకోనుంది. వీఎంఆర్డీఏ, నేచురల్ హిస్టరీ మ్యూజియం సొసైటీ సంయుక్తంగా ఈ పార్కును నిర్మించనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించారు. రూ.88 కోట్లతో పార్కుని తీర్చిదిద్దాలని ప్రాథమిక అంచనా. ఈ పార్కు సందర్శకులకు వైజ్ఞానిక ఆనందంతో పాటు శాస్త్రీయ అవగాహన అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. లోగో రూపకల్పన పోటీలు కైలాసగిరిపై ఏర్పాటు చేయనున్న ప్లానిటోరియం భవన డిజైన్‌పై వీఎంఆర్డీఏ పోటీలు నిర్వహించగా దేశంలోని వివిధ నగరాల నుంచి మంచి స్పందన లభించింది. పదమూడు ఎంట్రీలు రాగా.. అందులో ఒకదాన్ని ఎంపిక చేసి.. అదే మోడల్‌కు నిపుణులతో మెరుగులు దిద్ది.. ప్లానిటోరియం బిల్డింగ్ మోడల్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే తరహాలో నేచురల్ హిస్టరీ పార్కు లోగో రూపకల్పన కోసం వీఎంఆర్డీఏ పోటీ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న పార్కుకు సృజనాత్మకంగా, అర్థవంతంగా లోగో తీర్చిదిద్దే ఔత్సాహికుల్ని ఆహ్వానిస్తోంది. డిజిటల్ రూపంలో లేదా డ్రాయింగ్ రూపంలో అందించాలని వీఎంఆర్డీఏ కమిషనర్ పి.కోటేశ్వరరావు కోరారు. మీ డిజైన్లను www.vmrda.gov.in కుపంపించవచ్చు. ఈ పోటీల్లో మొదటి విజేతకు రూ.50,000, రెండో విజేతకు రూ.25,000 బహుమతి అందించనున్నారు. మరిన్ని వివరాలకు 9866076922 నంబర్లో సంప్రదించాలని కమిషనర్ కోటేశ్వరరావు సూచించారు. -
స్పాన్సర్ స్థానంలో స్వచ్ఛంద సంస్థ!
కరాచీ: కరోనా దెబ్బ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై భారీగా పడింది. క్రీడలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. స్పాన్సర్షిప్ అందించే విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆ జట్టుకు అండగా నిలిచేందుకు ఎవరూ రాలేదు. సుదీర్ఘ కాలంగా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ‘పెప్సీ’ ఇటీవలే తప్పుకుంది. కొత్తగా బిడ్లను ఆహ్వానిస్తే ఒకే ఒక కంపెనీ ముందుకొచ్చింది. అయితే ‘పెప్సీ’ ఇచ్చిన మొత్తంలో 30 శాతం మాత్రమే ఇస్తామనడంతో పీసీబీకి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో స్పాన్సర్ లేకుండానే టీమ్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే డబ్బులు రాకపోయినా స్వచ్ఛంద సంస్థకు ప్రచారం ఇచ్చినట్లుగా ఉంటుందని భావించిన పీసీబీ... మాజీ క్రికెటర్ అఫ్రిదికి చెందిన ‘షాహిద్ అఫ్రిది ఫౌండేషన్’ లోగో ముద్రించిన జెర్సీలను ధరించాలని నిర్ణయించింది. కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించింది. తనను పాక్ బోర్డు ఇలా గౌరవించడం పట్ల అఫ్రిది ఆనందం వ్యక్తం చేశాడు. -
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’
లండన్: అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. ఇప్పుడు క్రికెట్ మైదానంలో దానికి సంఘీభావం తెలిపేందుకు వెస్టిండీస్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జూలై 8 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో విండీస్ క్రికెటర్లు తమ జెర్సీ కాలర్‌పై ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విండీస్ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆగిపోయింది. ఇప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ‘బయో సెక్యూర్ బబుల్’ వాతావరణంలో వెస్టిండీస్‌కు సొంతగడ్డపై ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్ బోర్డు సిద్ధమైంది. విరామం తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కానుంది. ‘జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి ప్రచారం చేసే, దానికి సంఘీభావం తెలిపే బాధ్యత మాకుందని భావిస్తున్నాం. క్రికెట్ చరిత్రలో ఇదో చారిత్రాత్మక ఘట్టం. మేం క్రికెట్ ఆడటానికే ఇంగ్లండ్‌కు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో మాకు బాగా తెలుసు. శరీరం రంగు కారణంగా ఒకరిపై అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం ఎంత బాధగా ఉంటుందో వెస్టిండీస్ క్రికెటర్లకు బాగా తెలుసు. వర్ణం కారణంగా అసమానతలు ఉండరాదనేది మా కోరిక. సమాన హక్కులు సాధించడం కోసం అందరూ ప్రయత్నించాలి’ అని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ వ్యాఖ్యానించాడు. విండీస్ ఆటగాళ్లు ధరించబోయే లోగోను అలీషా హోసానా డిజైన్ చేయగా... ఇటీవల మళ్లీ ప్రారంభమైన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో 20 జట్ల ఆటగాళ్లు కూడా ధరించారు. సరిగ్గా ఆ లోగోకే ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు... ‘ఐసీసీ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ నిబంధనల ప్రకారం రాజకీయ, మతపరమైన, జాతి వివక్షకు సంబంధించిన సందేశాలు ఎలాంటివి కూడా ప్రదర్శించేందుకు అనుమతి లేదు’... ఇలా ఐసీసీ తమ నిబంధనల్లో స్పష్టంగా చెప్పింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ధోని తన వికెట్ కీపింగ్ గ్లవ్స్‌పై డాగర్ గుర్తు ముద్రించి ఉన్న ‘బలిదాన్ బ్యాడ్జ్’ను ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని తర్వాతి మ్యాచ్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది. ఇంకాస్త వెనక్కి వెళితే భారత్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ‘ఫ్రీ పాలస్తీన్, సేవ్ గాజా’ అంటూ రిస్ట్ బ్యాండ్ ధరించగా రిఫరీ డేవిడ్ బూన్ తీసేయించారు. ఇంగ్లండ్ బోర్డు దానిని రాజకీయపరమైంది కాదు మానవత్వానికి సంబంధించి అని మొయిన్ అలీని సమర్థించినా ఐసీసీ అంగీకరించలేదు. ఇప్పుడు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ వీటికి ఎలా భిన్నమో ఐసీసీనే చెప్పాలి. ఎలా చూసుకున్నా తాజా అమెరికా అంశానికి కూడా ఆటలతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా బయట ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా... మైదానంలోకి వచ్చేసరికి ఏ క్రీడలోనైనా అంతా ఒక్కటే అంటూ బరిలోకి దిగడం ప్రాథమిక స్ఫూర్తి. ఇటీవలి పరిణామాలపై ఐసీసీ స్పందిస్తూ ‘నిబంధనల ప్రకారం అన్నింటిని ఒకే గాటన కట్టకుండా తమ విచక్షణ మేరకు ఆయా సందర్భానుసారం నిబంధనల విషయంలో కాస్త సడలింపు ఇస్తాం’ అని ప్రకటించింది. మొత్తంగా చూస్తే జాతి వివక్షను వ్యతిరేకించే విషయంలో తామెక్కడ వెనకబడిపోతామో అనుకొని దీనికి అనుమతి ఇచ్చినట్లు అర్థమవుతోంది. అన్నట్లు జట్టు మొత్తం నల్లవారితోనే నిండిన వెస్టిండీస్ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అంటూ సంఘీభావం తెలపడం కంటే శ్వేత జాతీయులతో నిండిన ఇంగ్లండ్ టీమ్ అలా చేసి ఉంటే భిన్నంగా ఉండేదేమో. -
మహిళా కమిషన్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
-
మహిళా కమిషన్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ నేలపై అద్బుతాలు సృష్టించాలి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విత్తనాలకు సంబంధించిన బ్రాండ్ లోగోను గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వపరంగా నాణ్యమైన వితనోత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని రకాల సానుకూలంగా ఉన్న తెలంగాణ నేలపై అద్బుతాలు సృష్టించాలని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ ఉత్పత్తి చేసే విత్తనాలకు మంచి డిమాండ్ ఉందని, అంతేకాక ఇతర దేశాలకు విత్తనాల ఎగుమతిని పెంచడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు. తాను కేవలం మంత్రి మాత్రమే కాదని.. ఒక విత్తన రైతు కూడా అని సమావేశంలో చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్గ్రంలో విత్తనాల ఉత్పత్తికి అవసరమైన అన్నిరకాల సానుకూలతలు ఉన్న కారణంగానే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకెళ్లి ప్రపంచానికి రాష్ట్రం పేరు తెలిసేలా చేయాలన్నారు. క్రాప్ కాలనీలతో వ్యవసాయాన్ని బలోపేతం, అభివృద్ధి చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మొక్కజొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమలో మొక్కజొన్న వినియోగం ప్రధానమైనదని తెలిపారు. అదేవిధంగా మసాల దినుసులకు సంబంధించిన విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్‌లో పదకొండు సెంటర్లు పెట్టి ఉల్లి అమ్ముతున్నామని, రైతులకు ఉల్లి వితనోత్పత్తిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. -
ట్రాప్‌లో పడేస్తారు
‘‘ట్రాప్’ సినిమా ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులందర్నీ ట్రాప్‌లో పడేస్తుందనిపించింది’’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ జంటగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ట్రాప్’. స్వర్ణలత నిర్మించారు. ప్రేమ కవితాలయ పతాకం లోగోను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ‘ట్రాప్’ లోగోను నిర్మాత సురేష్ చౌదరి, టీజర్‌ను రచయిత మోహన్ వడపట్ల, ట్రైలర్‌ని బాలకిషన్ విడుదల చేశారు. ‘‘హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందరూ మంచి సపోర్ట్ అందించారు’’ అన్నారు స్వర్ణలత. ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు విఎస్ ఫణీంద్ర. కాత్యాయనీ శర్మ పాల్గొన్నారు. -
లోగో పెట్టండి... సత్కారం పొందండి
సాక్షి, ఒంగోలు టౌన్: ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీకి సంబంధించిన లోగోను ఆసక్తి కలిగిన కళాకారులు పంపించాలని యూనివర్శిటీకి చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) జీ. సోమశేఖర ఒక ప్రకటనలో కోరారు. లోగోకు సంబంధించి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఆశయాలకు అనుగుణంగా ఆయా కళాకారులు, మేధావుల నుంచి వారి ఆలోచనల మేర లోగో తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వవిద్యాలయ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా లోగో ఉండాలన్నారు. ఎంపికైన లోగోను తయారుచేసిన కళాకారులను విశ్వవిద్యాలయ అధికారులు సత్కరించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగినవారు యూనివర్సిటీకి సంబంధించిన లోగోను ఈనెల 30వ తేదీలోపు soanuongoe@gmai.com మెయిల్‌కు పంపించాలని ఆయన కోరారు. -
రైల్వే కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగో
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహా త్ముడిని స్మరిస్తూ అన్ని రైలు కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగోతో పాటు జాతీయ జెండాను ముద్రించనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. దీనికి సంబంధించి ‘స్వచ్ఛతా పక్వారా’పేరుతో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీని కోసం మహాత్మునితో ప్రత్యేక అను బంధం ఉన్న ప్రాంతాల్లోని 43 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. -
రజనీ ‘బాబా ముద్ర’.. మా లోగో ఒక్కటే
న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘బాబా ముద్ర’ ఓ స్టార్టప్ కంపెనీకి లోగోగా ఉండటం ఆ కంపెనీకి సమస్యగా మారింది. కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్ ఇటీవల ప్రకటించడం, పార్టీ చిహ్నంగా బాబా ముద్ర ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుండటం తెలిసిందే. సోషల్ మీడియా యాప్ అయిన వోక్స్‌వెబ్ అనే స్టార్టప్ కంపెనీకి కూడా దాదాపుగా ఇలాంటి లోగోనే ఉంది. దీంతో వోక్స్‌వెబ్ రజనీకాంత్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అని కొందరు తమను అడుగుతున్నారనీ, రజనీతోగానీ ఆయన స్థాపించే పార్టీతోగానీ తమకు ఏ సంబంధం లేదని వోక్స్‌వెబ్ వ్యవస్థాపకుడు యశ్ మిశ్రా చెప్పారు. రజనీ వర్గంలోని సంబంధిత వర్గాలకు తాము ఓ లేఖ కూడా రాసినప్పటికీ ఇంకా తమకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మిశ్రా వెల్లడించారు. బాబా ముద్రను పార్టీ చిహ్నంగా వాడకుండా ఉండేలా, లేదా కొన్ని మార్పులు చేసుకుని వాడేలా రజనీని కోరతామని ఆయన చెప్పారు. -
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లోగో వివాదం
2018లో లండన్‌లో జరగబోయే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు సంబంధించి కొత్తగా విడుదల చేసిన లోగోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చదరంగానికి ఇంత అసభ్యతను జోడించడం ఏమిటంటూ ప్రపంచవ్యాప్తంగా గారీ కాస్పరోవ్వంటి దిగ్గజాలు సహా పలువురు విరుచుకు పడ్డారు. నవంబర్ 18నుంచి మాగ్నస్ కార్ల్సన్...క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచే చాలెంజర్తో తలపడతాడు. ‘చెస్‌ను ప్రపంచంలో ఎవరైనా గేమ్‌ల కోసమే చూస్తారు. దీనిని అర్ధరాత్రి మాత్రమే చూడగలిగే టీవీ షోగా మార్చకండి. నాకు తెలిసిన చెస్‌లో 8గీ8 గళ్లు ఉంటాయి. ఇక్కడ 6గీ6 కనిపిస్తున్నాయి’ అని దీనిపై విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. అయితే నిర్వాహకులు మాత్రం ఈ లోగోతోనే ప్రచారానికి సిద్ధమైనట్లు ప్రకటించేశారు. -
పవర్ బ్యాంక్ పేరుతో బురిడీ
చిట్టినగర్(విజయవాడవెస్ట్): సార్ పవర్ బ్యాంక్ హోనా.. రూ. 8 వందలది.. నాలుగు వందలకే ఇస్తాం.. సార్.. మేము ఢిల్లీలో కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఇలా తిరుగుతూ అమ్ముకుంటాం సార్.. అంటూ ఆ మహిళలు నకిలీ పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... ప్రతి నిత్యం తమ మాటల చాతుర్యంతో వందల సంఖ్యలో పవర్ బ్యాంక్‌లను ఫోన్ వినియోగదారులకు అంటకడుతున్నారు. అయితే మార్కెట్లో వేల రూపాయలలో ఉండే పవర్ బ్యాంక్ తక్కువ ధరకు వస్తుందని చెప్పి వెనుక ముందు ఆలోచించకుండా వందలాది రూపాయలు పెట్టి పవర్ బ్యాంక్‌లను కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పవర్ బ్యాంక్‌ను పరిశీలిస్తే అందులో కేవలం సాదారణ మొబైల్ ఫోన్లో ఉండే తక్కువ రకం బ్యాటరీ ఉంటుంది. అంతా కలుపుకుంటే రూ.50 లోపే ఉంటుంది. గుట్టు రట్టు చేసిన పోలీసులు..... ముగ్గురు.. నలుగురు మహిళలు ఇటువంటి పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తూ శుక్రవారం పంజా సెంటర్, చిట్టినగర్, సాయిరాం థియేటర్, పాలప్రాజెక్టు మీదగా కబేళా సెంటర్‌కు చేరుకున్నారు. అయితే నైనవరం ఫ్లై ఓవర్ వద్ద పోలీసు సిబ్బంది ఈ పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తున్న మహిళల మాటలపై అనుమానంతో వాటిని పరిశీలించారు. చివరకు అవి నకిలీవి అని తేలడంతో భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఒక్క రోజు వీరు సుమారు రెండు వందలకు పైగా ఈ నకిలీ పవర్ బ్యాంక్‌లను విక్రయించినట్లు చెబుతున్నారు. -
హైదరాబాద్ కుర్రాడు.. కుంభస్థలాన్ని కొట్టాడు..!
న్యూఢిల్లీ : చక్రధర్ ఆళ్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విద్యార్థి పేరు మారు మోగిపోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు చక్రధర్ రూపొందించిన లోగోను వినియోగించనుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు(నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) లోగో కోసం కేంద్ర ప్రభుత్వం mygov.inలో ఆహ్వానాలను పిలిచింది. దీంతో అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో చదువుకుంటున్న చక్రధర్ కూడా తాను తయారు చేసిన లోగోను ప్రభుత్వానికి పంపారు. ఇలా మైగావ్ నిర్వహించే పోటీల్లో పాల్గొనడం చక్రధర్‌కు ఇది తొలిసారేమీ కాదు. ఇప్పటివరకూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 31 పోటీల్లో పాల్గొన్నారు చక్రి. 30 ప్రయత్నాల్లో అదృష్టం కలిసిరాలేదు. నిరాశ చెందక.. 31వ సారి కూడా ప్రయత్నించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు చిరుతపులి పరుగెడుతున్నట్లు రూపొందించిన లోగోను ఎంట్రీగా మైగావ్‌లో అప్లోడ్ చేశారు. వేలాదిగా వచ్చిన ఎంట్రీల నుంచి బుల్లెట్ ట్రైన్ లోగోగా చక్రధర్ రూపొందించిన లోగోను ప్రభుత్వం ఎంపిక చేసింది. బుల్లెట్ ట్రైన్ లోగోగా తన డిజైన్ ఎంపిక కావడంపై స్పందించిన చక్రధర్.. తాను చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. బుల్లెట్ ట్రైన్‌కు తన లోగో ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. డిజైన్ చూడటానికి సింపుల్‌గా కనిపించినా దాని వెనుక అంతరార్థం చాలా ఉందని చెప్పారు. చిరుత వేగానికి ప్రతీక కాగా, దానిపై ఉన్న రైలు ఆకారం నమ్మకానికి(వేగం+నమ్మకం) నిదర్శనమని వెల్లడించారు. చక్రధర్ సొంత ఊరు హైదరాబాద్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుండగా.. తల్లి ఓ స్కూల్లో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. లోగోలు తయారుచేయడంలో తనకు ఉన్న అమితాసక్తి కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు తనను ‘లోగోమ్యాన్’గా పిలుస్తుంటారని చక్రధర్ తెలిపారు. -
రాజుగారి గది-2 ఓ ఇంట్రస్టింగ్ న్యూస్
హైదరాబాద్: ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్. చిత్ర దర్శకుడు ఎస్ తమన్ ఈ శుభవార్తను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘రాజుగారి గది-2’. లోగోను ఈ రోజు సా. 7గం.లకు రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. దీంతో తమన్ సంగీతం కోసం...బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఈ చిత్ర హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున కాబోయే కోడలు ఎక్సైటింగ్ అంటూ థమన్ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు. అంతేనా.. మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు సుబ్బరాజు తదితరులు ఈ కోవలో ఉన్నారు. కాగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినమాలో ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13 విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 7pm !! #rgg2 @iamnagarjuna @Samanthaprabhu2 @PVPCinema 💪exciting !! https://t.co/Tu0GnlCoGd — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 25, 2017 -
అల్లోపతి వైద్యులకూ ప్రత్యేక లోగో
చండీగఢ్: అల్లోపతి డాక్టర్ల వినియోగం కోసం భారత వైద్య మండలి ఓ లోగోకు పేటెంట్ సంపాదిం చింది. కొత్త లోగోలో.. ఎర్రని ప్లస్ గుర్తులో కూపర్ ఫాంట్లో ఇంగ్లిష్ అక్షరాలు డీఆర్ రాసి ఉన్నాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల తో పోల్చితే అల్లోపతి వైద్యులను ప్రత్యేకంగా గుర్తించేందుకే ఈ లోగోను తీసుకొచ్చామని చండీగఢ్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమనీక్ సింగ్ బేడీ చెప్పారు. ఈ గుర్తు సాయంతో రోగులు సులభంగా నిష్ణాతులైన వైద్యులను గుర్తించవచ్చని సింగ్ తెలిపారు. కేంద్రప్రభుత్వ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఈ లోగోను ఐఎంఏ మేధోసంపత్తి హక్కుగా నమోదుచేసింది. -
టీమిండియా జెర్సీపై ఇంకా ఆ లోగో ఏమిటి?
న్యూఢిల్లీ:బ్రిటీష్ కాలంనాటి స్టార్ ఆఫ్ ఇండియాను పోలివుండే చిహ్నాన్ని భారత క్రికెట్ జట్టు ఇంకా తమ జెర్సీలపై ధరించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ప్రశ్నించింది. యూనియన్ ఆఫ్ ఇండియా సింబల్ బదులు బ్రిటీష్ కాలం నాటి ఆ లోగోను పోలిన జెర్సీని ఉపయోగించడాన్ని తప్పుబట్టింది. 1928లో బ్రిటీష్ పరిపాలనలో ఆ తరహా లోగో తయారు చేయబడిన విషయాన్ని సీఐసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇంకా ఆనాటి స్టార్ ఆఫ్ ఇండియా లోగోను ఎందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఉపయోగిస్తుందని ప్రశ్నించింది. దేశంలో బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ పరిధిలోకి వచ్చే విషయాన్ని సీఐసీ మరోసారి స్పష్టం చేసింది. ఇక్కడ బీసీసీఐని ఆర్టీఐ చట్ట పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ మేరకు నెలరోజుల్లో సమాధానం ఇవ్వాలని సీఐసీ ఆదేశాలు జారీ చేసింది. -
కొత్త లోగోతో ఎస్బీఐ
నేటి నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ నేడు (ఏప్రిల్ 1) ప్రారంభం కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కాగలదని అంచనా. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇవి ఎస్బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. విలీనంలో భాగంగా అనుబంధ బ్యాంకులు ప్రకటించిన విఆర్ఎస్ పథకానికి దాదాపు 6వేల మంది ఉద్యోగులు అంగీకరించే అవకాశం ఉన్నట్లు ఎస్బీఐ ఎండీ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. మరోవైపు, అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది. పాతదానికి స్వల్ప మార్పులు చేసి బ్యాక్ గ్రౌండ్ కలర్‌ను దట్టమైన నీలి రంగులోకి మార్చడం ద్వారా కొత్త లోగోను రూపొందించడం జరిగింది. గతంలో బ్యాక్‌గ్రౌండ్ తెల్లరంగులో ఉండేది. కొత్తగా ట్యాగ్‌లైన్ ఫాంట్‌ను కూడా మార్చారు. బ్యాంకు కొత్త లోగోను డిజైన్ స్టాక్ అనే కంపెనీ రూపొందించింది. దిగ్గజ బ్యాంకుగా మారనున్న ఎస్బిఐ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీని డిజైనింగ్ జరిగింది. అనుబంధ బ్యాంకుల విలీనంతో రూ. 42 లక్షల కోట్ల డిపాజిట్లు, 2.77 లక్షల మంది ఉద్యోగులు, 24,000 పైచిలుకు శాఖలతో ఎస్బీఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల జాబితాలోకి చేరనుంది. -
ఐపీఎల్-10 లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: దేశవాళి క్రికెటర్లను సంపన్నులుగా మార్చే ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) పదో సీజన్ లోగోను మంగళవారం ఆవిష్కరించింది. లోగోను పది ఐపీఎల్ టోర్నమెంట్లు ప్రతిబింబించే విధంగా బ్యాట్స్‌మన్ ఆడే స్టిల్, స్పాన్సర్ కంపెనీ వివో పేరు కనిపించేటట్లు అందంగా రూపొందించింది. ఐపీఎల్ ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ బ్యాట్స్మన్లతో ఐపీఎల్ పదో సీజన్ ప్రేక్షకులను అలరించనుంది. 38 నగరాల అభిమానులు ఒకే స్టేడియంలో మ్యాచ్‌లన్ని జరుగుతున్నట్లు ఆనందించే విధంగా మల్టీ సిటీ ట్రోఫి వివో ఐపీఎల్-10 సిద్దమైంది. -
‘స్టార్‌మా’ కొత్త లోగో : చిరంజీవి
-
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కులోగో డిజైన్ పోటీ
న్యూఢిల్లీ: డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కొత్తగా ఏర్పాటు చేయనున్న పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్ కోసం మైగౌవ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక పబ్లిక్ కంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి రూ. 50,000 ప్రైజ్ మనీని అందిస్తోంది. పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఔత్సాహికులకు ఈ కంటెస్ట్ జూలై 9 వరకు అందుబాటులో ఉంటుందని పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమౌతాయని అం చనా. ప్రముఖ డిజైనర్లు, నిపుణులతో కూడిన ఒక కమిటీ వచ్చిన ఎంట్రీస్లో 20 ఉత్తమ డిజైన్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. విజేత కోసం వీటిని తర్వాత మైగౌవ్ ప్లాట్ఫామ్లో ఓటింగ్‌కు పెడతారు. దేనికైతే అధిక ఓట్లు వస్తాయో.. దాన్ని రూపొందించిన వారిని విన్నర్‌గా ప్రకటించి.. వారికి ప్రైజ్ మనీని అందజేస్తారు. -
దక్షిణాసియా క్రీడల మస్కట్‌గా టిఖోర్
ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు క్రీడలు గువాహటి, షిల్లాంగ్ ఆతిథ్యం గువాహటి: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు జరిగే దక్షిణాసియా క్రీడల మస్కట్, లోగోలను కేంద్ర క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మేఘాలయ క్రీడా మంత్రి జెనిత్ సంగ్మా పాల్గొన్నారు. పోటీలు గువాహటి (అస్సాం), షిల్లాంగ్ (మేఘాలయ) నగరాల్లో జరుగుతాయి. మస్కట్‌గా ‘టిఖోర్’ (ఒంటి కొమ్ముతో ఉండే ఖడ్గమృగం)ను ఎంపిక చేశారు. లోగోలో పోటీల్లో పాల్గొనే దేశాల సంఖ్యను సూచిస్తూ ఎనిమిది పూరేకులను పొందుపరిచారు. ఓవరాల్‌గా ఎనిమిది దేశాలకు చెందిన 4500 మంది అథ్లెట్లు, అధికారులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. పది రోజుల పాటు 23 ఈవెంట్స్‌లో పోటీలు జరుగుతాయి. చివరిసారి దక్షిణాసియా క్రీడలు 2010లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగాయి. భారత్ 90 స్వర్ణాలు, 55 రజతాలు, 30 కాంస్య పతకాలతో కలిపి ఓవరాల్‌గా 175 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. -
వివాదాస్పద లోగో రద్దు
జపాన్ ఒలింపిక్ లోగో వివాదాల్లోచిక్కుకుంది. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రముఖ డిజైనర్ కెన్జిరో సోనో రూపొందించిన లోగో వివాదాస్పదమైంది. దీంతో టోక్యో ఒలింపిక్ కమిటీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లోగోను వాడద్దంటూ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ జపాన్ నేషనల్ మీడియా ఈ విషయాలను దృవీకరించింది. జూన్ లో లాంఛ్ చేసిన ఈ డిజైన్.. తన ధియేటర్ కంపెనీ లోగోను కాపీకొట్టి రూపొందించారని బెల్జియన్ డిజైనర్ ఒలివర్ డెబి ఆరోపించాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ముందుకు తీసుకెళ్లాడు. టోక్యో లోగో టీ ఫర్ టోక్యో, టుమారో, టీమ్ అని తెలిపేలా రూపొందించారు. వీటిపైన హార్ట్ బీట్ కు గుర్తుగా ఎర్ర బిందువు ఏర్పాటు చేశారు. మరో వైపు నలుపు బ్యాగ్రౌండ్ పైన తెలుపు అక్షరాలతో రూపొందించిన బెల్జియన్ ధియేటర్ లోగో దాదాపు ఇలాంటి ఆకారంలోనే ఉంది. ఐఓసీ అధికారులు మాత్రం దీనిపై పెదవి విప్పటం లేదు. -
స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్: 'స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగోను అనురాగ్ శర్మ గురువారం ఆవిష్కరించారు. అనంతరం మింట్ కాంపౌండ్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు చెత్తను పోలీసులు శుభ్రం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరిట తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తన భాగ్యనగరంలో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, తెలంగాణ కేబినెట్, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న విషయం విదితమే. -
వావ్.. డూడుల్
డూడుల్... గూగుల్ సెలబ్రేషన్ విత్ ఫన్. అది ఏ దేశం పండుగైనా కావచ్చు గూగుల్ తన లోగోతో ఆ వేడుకల్లో పాలుపంచుకుంటుంది. ప్రముఖ ఆర్టిస్టులు, మార్గదర్శకులు, శాస్త్రవేత్తల జయంతి కావచ్చు... లోగోతో వారికి నివాళి అర్పిస్తుంది. యానివర్సరీలను సెలబ్రేట్ చేస్తుంది. ఈరోజు ‘నేషనల్ డూడుల్స్ డే’ సందర్భంగా డూడుల్ ఆవిర్భావం, ప్రస్థానం గురించి... మొదలైందిలా... గూగుల్ వ్యవస్థపాకులైన లారీ, సెర్జీలకు 1998లో ఈ డూడుల్ ఆలోచన పుట్టింది. సాన్ ఫ్రాన్సిస్కో పండుగ అయిన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ రోజు గూగుల్‌లోని రెండో ‘ఓ’ వెనుకగా ఆ ఫెస్టివల్ సింబల్‌ను చేర్చారు. అలా సృష్టించిన లోగో అందరినీ ఆకట్టుకుంది. రెండు సంవత్సరాల తరువాత బాస్టిల్ డే (ఫ్రాన్స్ నేషనల్ డే)రోజున వెబ్ మాస్టర్ డెనిస్ హాంగ్‌తో మరో డూడుల్‌ను తయారు చేయించారు. గూగుల్ యూజర్స్నుంచి మంచి స్పందన వచ్చింది. వెంటనే డెనిస్ హాంగ్ చీఫ్ డూడ్లర్గా డూడుల్స్ టీమ్‌ని నియమించింది గూగుల్. ఆరోజునుంచి రెగ్యులర్‌గా డూడుల్స్ మొదలుపెట్టారు. తరువాత కాలంలో ఒక్క యూఎస్‌లోనే కాదు... అంతర్జాతీయంగా ఈ డూడుల్స్కి డిమాండ్ పెరిగింది. మేథోమదనం... ఇప్పుడు డూడుల్స్ రూపొందించడానికి క్రియేటివ్ టీమ్ ఉంది. ఈ టీమ్ ఇప్పటివరకు 2000 డూడుల్స్‌ను తయారు చేసింది. గూగుల్ టీమ్ తరచూ కూర్చుని ఏయే డూడుల్స్ తయారు చేయాలనే అంశంపై మేథోమదనం చేస్తుంది. వచ్చిన ఆలోచనలకు డూడుల్స్ రూపం ఇచ్చేందుకు గూగుల్ ఎంప్లాయిస్ నుంచే కాదు... యూజర్స్ నుంచి కూడా ఆహ్వానిస్తుంది. వచ్చిన వాటినుంచి గూగుల్‌ను ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకునే డూడుల్స్‌ను ఎంపిక చేస్తుంది. యూజర్స్ పంపడమెలా? యూజర్స్నుంచి ఐడియాస్ తీసుకోవడానికి గూగుల్ ఎప్పుడూ ముందే ఉంటుంది. డూడుల్ టీమ్‌కు కొన్ని వందల రిక్వెస్ట్స్ వస్తుంటాయి. మీరూ మీకు వచ్చిన ఆలోచనలను గీసి proposals@google.com కు ఈ-మెయిల్ చేయవచ్చు. ఇండియన్ డూడుల్స్... ప్రతి ఏటా మన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజులను ఇండికేట్ చేస్తూ డూడుల్స్‌ను తయారు చేస్తుంది గూగుల్. మొన్న జరిగిన ఘనతంత్ర వేడుకల సందర్భంగా శకటంలా తయారు చే సిన డూడుల్ భారతీయులను అమితంగా ఆకర్షించింది.ఇక మన చిల్డ్రన్స్ డేతో పాటు ప్రముఖ యానివర్సరీలనూ సెలబ్రేట్ చేస్తోంది డూడుల్. కట్టా కవిత -
ఆర్ఎంఎస్ పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి కల్చరల్: తిరుపతి నగరంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్న అఖిల భారత ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభల పోస్టర్లు, లోగోను గురువారం ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే స్వగృహంలో యూనియన్ నాయకులు ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగభూషణం మాట్లాడుతూ యూనియన్ స్థాపించి 60 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలు వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి హాజరవుతారని పేర్కొన్నారు. అఖిల భారత ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శ్రీధర్‌బాబు, కన్నయ్య, ఆర్ముగం, చంద్రశేఖర్, కొండయ్య, మోహన్‌కుమార్ పాల్గొన్నారు. -
‘మనం’ లోగో రూపకర్త ప్రేమ్‌రాజ్
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన మనం సినిమా లోగోను ఆత్మకూరు మండలం నాగయ్యపల్లె గ్రామానికి చెందిన గిన్నారపు ప్రేమ్‌రాజ్ రూపొందించారు. అక్కినేని నాగేశ్వర్రావు చివరి చిత్రం ఇదే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్రావు, నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా, సమంత, శ్రేయ హీరోయిన్లుగా చేశారు. ప్రేమ్‌రాజ్ కొంత కాలంగా సినిమా లోగోలు తయారు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటింగ్) చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ కాశిబుగ్గకు చెందిన అనిల్ ఈ సినిమాకు పోస్టర్ డిజైనర్‌గా చేయడం వల్ల లోగోను రూపొందించి అవకాశం తనకు దక్కిందన్నారు. ఇంతపెద్ద సిని మాకు లోగో తయారు చేయడం అదృష్టంగా భావి స్తున్నానని తెలిపారు.