Elon Musk Shares Aerial View Of Twitter Headquarters With X Logo - Sakshi
Sakshi News home page

మస్క్‌ వీడియో సంచలనం: మేజికల్‌ అంటున్న నెటిజన్లు

Published Sat, Jul 29 2023 4:55 PM | Last Updated on Sat, Jul 29 2023 5:23 PM

Elon Musk Shares Aerial View Of Twitter Headquarters With X Logo - Sakshi

Twitter new logo 'X' ట్విటర్ బాస్ ఎలాన్‌ మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయంపై తన కొత్త లోగో ‘X’ ఆవిష్కారానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. జెంబోలోగో ఏరియల్‌ వ్యూ విజువల్స్‌ వీడియోను మస్క్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి. అలా పోస్ట్‌ చేశారో లేదో, ఈ వీడియో  5 వేలకు కామెంట్లు, 9 వేల 7వందలకు పైగా రీట్వీట్లు 4.3 మిలియన్‌  వ్యూస్‌తో ఇది వైరల్‌గా మారింది.  దీంతో  కారు లోపల నుండి రికార్డ్ చేసిన మరొక వీడియోను కూడా   షేర్‌ చేశారు  మస్క్‌. 

"ఈ రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో మా ప్రధాన కార్యాలయం." మస్క్‌ ఒక వీడియోను పోస్ట్‌ చేశారుమస్క్‌.  అయితే శాన్ ఫ్రాన్సిస్కో నగరం డౌన్‌టౌన్ భవనంపై అమర్చినఅక్షరం లోగోపై దర్యాప్తు ప్రారంభించిన సమయంలో ఈ వీడియోను షేర్‌  చేయడం గమనార్హం. నగర అధికారుల ప్రకారం, ఏదైనా సైన్ బోర్డు లేదా లోగోను మార్చడానికి ముందు ఒక వ్యక్తి (లేదా కంపెనీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

ఏరియల్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించింది. కొంతమంది వినియోగదారులు దీనిని సూపర్ హీరో చిత్రం బ్యాట్‌మ్యాన్‌తో పోల్చారు. ఏరియల్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంటి. చాలామంది ది వినియోగదారులు దీనిని సూపర్ హీరో చిత్రం బ్యాట్‌మ్యాన్‌తో పోల్చారు. మరికొంతమి మాజికల్‌ అంటూ కమెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement