మస్క్‌ కొడుకుని చూశారా? బుడతడు భలే ఉన్నాడే... | Elon Musk Shares Son's Pic In Front X Logo - Sakshi

Elon Musk Son: మస్క్‌ కొడుకుని చూశారా? బుడతడు భలే ఉన్నాడే...

Published Sun, Aug 27 2023 7:21 PM | Last Updated on Mon, Aug 28 2023 10:57 AM

Elon Musk Shares Sons Pic In Front X Logo - Sakshi

ప్రపంచ టాప్‌ బిలియనీర్‌, టెస్లా, ఎక్స్‌ (ట్విటర్‌) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలాన్‌ మస్క్‌ కొడుకుని ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో ఇక్కడ చూడండి..  

తన సోషల్‌ మీడియా సంస్థకు చెందిన ‘ఎక్స్’ లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్ ఏఈఏ-12 (పేరు) ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్ చేశారు ఎలాన్‌ మస్క్‌. ముద్దులొలుకుతున్న మస్క్ కొడుకు ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఖాకీ రంగు నిక్కరు, టెస్లా లోగోతో ఉన్న వైట్‌ టీషర్ట్‌ వేసుకున్న ఈ మూడేళ్ల బుడతడు బోసినవ్వులతో కెమెరాకు ఫోజుచ్చాడు. ఈ ఫొటోకు 75 మిలియన్లకు పైగా వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బుడతడు భలే ఉన్నాడే అంటూ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

ఎక్స్‌ ఏఈఏ-12 (X AE A-XII) 2020లో జన్మించాడు. కెనడియన్ మ్యుజీషియన్‌ గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్‌కి ఈ బాలుడు మొదటి సంతానం. విచిత్రంగా ఉన్న ఈ పిల్లాడి పేరు గురించి తల్లి గ్రిమ్స్‌ గతంలో వివరణ ఇచ్చినా చాలా మందికి సరిగ్గా అర్థం కాలేదు. కొత్తగా బావుందని మాత్రం అందరూ కితాబు ఇచ్చారు.

మస్క్‌- గ్రిమ్స్‌ జంట 2022లో సరోగసి ద్వారా ఎక్సా డార్క్ సైడెరెల్ మస్క్ అనే కుమార్తె పొందారు. 2018 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట 2021 సెప్టెంబర్‌లోనే విడిపోయారు. తర్వాత 2021 నవంబర్‌లో షివోన్ జిలిస్‌తో కవలలను కన్నారు. కాగా కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌తో మస్క్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement