Son
-
కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి.. పెళ్లి సమయంలో..
మగపిల్లలు లేని తల్లిదండ్రులు తమకున్న ఆడపిల్లలనే మగపిల్లలుగా భావిస్తూ పెంచుతుంటారు. ఈ క్రమంలో వారికి తగినంత స్వేచ్ఛనిస్తూ, సమస్తం సమకూరుస్తుంటారు. దీంతోవారు తమకు మగపిల్లలు లేరనే లోటును మరచిపోతుంటారు. ఇదిలా ఉంచితే నేటి కాలంలో ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు చెందిన ఒక తండ్రి తన కుమార్తెలోనే కుమారుడిని చూసుకున్నాడు. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు గుర్రపు స్వారీ చేయడాన్ని చూస్తుంటాం. కానీ ఖాండ్వాలో ఒక వధువు గుర్రపు స్వారీ చేసింది. దీనిని ఆమె తన తండ్రి కోరికను నెరవేర్చేందుకే చేసింది. ఖాండ్వాకు 8 కి.మీ. దూరంలో ఉన్న సుర్గావ్ జోషి గ్రామానికి చెందిన రైతు నానాజీ చౌదరి కుమార్తె వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.నానాజీ చౌదరి తన కుమార్తెను కొడుకులా భావించి పెంచిపెద్ద చేశాడు. ఇప్పుడు తన కుమార్తె పెళ్లిలోనూ తనకు కుమారుడు ఉన్న ముచ్చటను తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో తన కుమార్తెను గుర్రంపైకి ఎక్కించి, ఊరేగింపుగా వివాహ వేదికవద్దకు తీసుకువచ్చాడు. ఆమె వెనుక కుటుంబ సభ్యులు నృత్యాలు చేసుకుంటూ వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. పెళ్లి కుమార్తె భాగ్యశ్రీ చౌదరి ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అజయ్ జిరాతిని వివాహం చేసుకున్నారు.ఈ సందర్భంగా వధువు బంధువు రవీంద్ర చౌదరి మాట్లాడుతూ భాగ్యశ్రీని ఆమె తండ్రి.. కుమారునిలా పెంచారని, పెళ్లిలో ఆమెను గుర్రంపైకి ఎక్కించాలని అనుకున్నారన్నారు. ఆయన కోరిన విధంగానే తామంతా గుర్రాన్ని తీసుకువచ్చి ఊరేగింపు వేడుక నిర్వహించామన్నారు. వధువు భాగ్యశ్రీ మాట్లాడుతూ తాను గుర్రంపై కూర్చుని ఊరేగింపుగా వివాహవేదిక వద్దకు చేరుకోవాలనేది తన తండ్రి కల అని, అది ఇప్పుడు నెరవేరిందన్నారు.ఇది కూడా చదవండి: ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం -
కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు!
పిల్లలకోసం, పిల్లల కోరికమేరకు కొండ మీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరించడానికి సన్నద్దమవుతారు. అలా 40 ఏళ్ల తండ్రి చేసిన సాహసం గురించి వింటే ఔరా అంటారు. నిబద్దతతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అంతటి ఆశ్చర్యకరమైన స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి మరి..సుమిత్ దబాస్ (40) రీటైల్ మేనేజర్‌గా పనిచ్తేస్తున్నారు. తన ఆరోగ్యం గురించి లేదా శరీరం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అప్పటికి అతను బరువు 90 కిలోలు. గతంలో ఉన్నంత బలం లేదు. అయితే ఏడేళ్ల కుమారుడి కోరిక మేరకు 40 ఏళ్ల వయసులో సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సిక్స్‌ప్యాక్ బాడీ సాధించాడు అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. క్రమశిక్షణతో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, వ్యాయామం సాయంతో అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ కొడుకు కోరిక ఏమిటంటేకానీ అతని కొడుకు నివాన్ ఒక రోజు తండ్రిని చూసి "నాన్న, మీ బలమైన శరీరాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు మళ్ళీ ఫిట్ బాడీని పొందగలరానా స్నేహితులకు చూపించాలని ఉంది’’ అన్నాడు. అంతే ఎలి అయినా సిక్స్ ప్యాక్‌తో ఫిట్ బాడీ సాధించాలనుకున్నాడు.సుమిత్‌కు క్రికెట్ అతనికి ఇష్టమైన ఆట. కానీ అంత పెద్ద భారీ కాయంతో క్రికెట్ ఆడే ఓపిక లేదు. ప్రొఫెషనల్ పర్సనల్ ట్రైనర్ అయిన సుమిత్, తన బరువు తగ్గే ప్రయాణంలో, మనస్తత్వాన్ని మార్చుకోవడం ముఖ్యమని కూడా అర్థమైంది. View this post on Instagram A post shared by Sumit Dabas (@sumitdabas2020)తొలి అడుగుతొలి ఆరు నెలలు విపరీతంగా కష్టపడ్డాడు. కానీ చాలా అర్థమైంది. జీవనశైలి మార్పులుతో 15 కిలోల బరువు తగ్గి 90 కాస్త 75కి వచ్చింది. కానీ ఇంకా తగ్గాలి. కండలు రావాలి. సిక్స్ ప్యాక్ బాడీ రావాలంటే, ప్రొఫెషనల్ ట్రైనర్ అవసరమని గ్రహించాడు.హేమంత్ అనే ఫిట్నెస్ కోచ్ ఆధ్వర్యంలో ట్రాక్‌లోకి వచ్చింది. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీల ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక వ్యాయామం విషయానికి వస్తే, సుమిత్ హెవీ ఎక్సర్సైజ్ల మక్కువ పెంచుకున్నాడు. ఇదే కండల నిర్మాణంలోనూ మొత్తం శారీరక రూపాన్ని అందంగా మార్చడంలో తోడ్పడింది అంటాడు కండలు తిరిగిన దేహంతో సుమిత్.మొత్తానికి ఏడాది కష్టం తరువాత ఇపుడు సుమిత్ బరువు 68 కిలోలు. తన కొడుకుకు గర్వకారణమైన తండ్రిగా నిలిచాడు. తన పిల్లలతో ఆడుకోవడమైనా, తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ ఆడటమైనా, గతంలో కష్టంగా కాకుండా, ఇష్టంగా,హాయిగా ఆడుతున్నాడు. ఈ వెయిట్ లాస్ జర్నీలో సహకరించిన కుటుంబానికి, కోచ్‌కీ సుమిత్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి దశలోనూ తన భార్య , కుమార్తె ప్రోత్సహించారని, నివాన్ ఉత్సాహం తన బరువు తగ్గే ప్రయాణాన్ని సులభతరం చేసిందని సుమిత్ చెప్పాడు.బరువు తగ్గాలనుకునే వారికి సుమిత్ ఇచ్చే చిట్కాలు ఏమిటి?చీట్ మీల్ తీసుకున్నా లేదా అప్పుడప్పుడు వ్యాయామం దాటవేసినా పెద్దగా బాధపడకండి. చేయాల్సిన దానిపై దృష్టిపెట్టి, ముందుకు సాగండి. పట్టుదలగా లక్ష్యం వైపు సాగండికుటుంబం, స్నేహితులు , కోచ్ సహాయం తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది...బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. సుదీర్ఘకాలంపాటు పట్టుదలగా క్రమశిక్షణతో చేయాలి.ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి, ఏ దశలోనూ ప్రయత్నాన్ని వదులుకోవద్దు. -
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ దావానలంలో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 30వేల మందికిపైగా నిరాశ్రయులు కావడం ఆందోళన రేపుతోంది.పాలిసాడ్స్ అగ్నిప్రమాదం మాలిబు, శాంటా మోనికా మధ్య సముద్రతీర ప్రాంతాన్నిదహించివేస్తోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, మంటలు 17 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి. వీటిని అదుపు చేసే ఆశలు కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇదే అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదంగా భావిస్తున్నారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.ఈ నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. వీరిలో చాలామంది తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్లను వీడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా,అతని భార్య జాస్మిన్ లాస్ ఏంజిల్స్‌లో ఇరుక్కున్న్టటు వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా సిద్దార్థ స్పందించాడు. ప్రస్తుతానికి తాను, తన భార్య జాస్మిన్, పెట్స్ సురక్షితంగా ఉన్నామని తెలిపాడు. అంతే కాదు, సహాయం కావాల్సిన వారు, దయ చేసి తమను సంప్రదించాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోరాడు. సహాయం అలాగే అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అటు జాస్మిన్ కూడా తన వంతుగా, విపత్తులో ప్రభావితమైన వారికి సహాయ సామగ్రి గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. (బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!)విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ , అతని భార్య జాస్మిన్ లండన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఈ జంట లాస్ ఏంజిల్స్‌లో వెకేషన్లో ఉన్నారు. ఈ సమయంలో పాలిసాడ్స్ అగ్నిప్రమాదం సంభవించిందిమరోవైపు ఈ ప్రమాదంలో ప్రియాంక చోప్రా ,నోరా ఫతేహి కూడా ప్రభావితమయ్యారు. ప్రియాంక పాలిసాడ్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అలాగే నోరా ఫతేహి తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నేను LAలో ఉన్నాను , ఫారెస్ట్ మంటలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు. ఐదు నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను త్వరగా నా సామాను అంతా సర్దుకుని ఇక్కడి నుండి ఖాళీ చేస్తున్నాను. నేను విమానాశ్రయం దగ్గరకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటా’’ అంటూ వెల్లడించింది.కాగా విజయ్ మాల్యా , అతని మొదటి భార్య సమీరా త్యాబ్జీ మాల్యా కుమారుడే సిద్ధార్థ. గత ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను పెళ్లాడాడు. విలాసవంతమైన హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ఎస్టేట్‌లో చాలా కొద్దిమంది హితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!) -
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనవడిని తమకు అప్పగించాలంటూ అతుల్ తల్లి అంజు దేవి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో.. నాలుగేళ్ల అతుల్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నదానిపై నిఖితా సింఘానియా తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఫరిదాబాద్(హర్యానా)లోని బోర్డింగ్స్కూల్లో చదువుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం నిఖిత షరతులతో బెయిల్ మీద ఉన్న దృష్ట్యా.. ఆ పిల్లాడిని బెంగళూరుకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాడాయన. అయితే.. వచ్చే విచారణ టైంలో ఆ చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే..అంజు దేవీ(Anju Devi) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆరేళ్లలోపు పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపడం ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని, కాబట్టి అతని సంరక్షణను నాయనమ్మకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని.. ‘‘ఆ చిన్నారి నాయనమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. ఒకరకంగా చూసుకుంటే పిటిషనర్ ఆ పిల్లాడికి కొత్త ముఖమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. అంజుదేవి తరఫు లాయర్ గతంలో ఆ నానమ్మ-మనవడు కలిసి దిగిన ఫొటోలను బెంచ్‌కు సమర్పించారు.అయితే నిఖితా సింఘానియా(Nikita Singhania) ఈ కేసులో దోషిగా ఇంకా నిరూపించబడాల్సి ఉందని, కేవల మీడియా కథనాల ఆధారంగా ఆమెను దోషిగా గుర్తించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున పిల్లాడి సంరక్షణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని పేర్కొంటూ.. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో..మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్(Atul Subash) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. అయితే.. వాళ్లకు కోర్టు తాజాగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఒకవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో, మరోవైపు కర్ణాటక హైకోర్టులో.. ఇంకోవైపు సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. -
కొడుకును చూసి మురిసిపోతున్న అమలాపాల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో.! (ఫోటోలు)
-
తల్లి చితికి నిప్పంటిస్తూ.. గుండెపోటుతో కుమారుని మృతి
ఒక్కోసారి మృతికి సంబంధించిన కొన్ని ఘటనలు రెండింతల విషాదాన్ని పంచుతాయి. ఒకేసమయంలో కుటుంబసభ్యులిద్దరు మృతి చెందడాన్ని ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. తన తల్లి చితికి నిప్పుపెడుతున్న ఒక కుమారుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, ఉన్నట్టుండి కింద పడిపోయాడు. చుట్టూ ఉన్నవారు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే అతను మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోగల సోహ్నాలో చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందడం స్థానికులకు త్రీవ విషాదాన్ని పంచింది. ఈ ఘటనల అనంతరం బంధువులు తొలుత తల్లికి ఆ తర్వాత కుమారునికి అంత్యక్రియలు నిర్వహించారు.సోహ్నా పఠాన్ వాడా నివాసి ధరమ్ దేవి (92) వయోభారంతో మృతి చెందారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె కుమారుడు సతీష్ (69) తల్లి చితికి నిప్పు పెడుతున్న సమయంలో ఛాతీ నొప్పికి లోనయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సతీష్‌ను పరిశీలించి, మృతిచెందినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ధరమ్ దేవి భర్త మరణించారు. తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ.. -
మంచు విష్ణు ముద్దుల తనయుడు.. బాల కన్నప్ప బర్త్‌డే (ఫోటోలు)
-
అనకాపల్లి జిల్లాలో దారుణం.. కొడుకును చంపిన తండ్రి
-
పరుచూరి రామకోటేశ్వరరావు- కొత్తపల్లి గీత కుమారుడి పెళ్లిలో సెలబ్రిటీలు (ఫోటోలు)
-
కాలం మారింది.. నాన్నను మార్చింది
నాన్న.. అమ్మలా మారుతున్నాడు. కోపం చిరాకు లేదు.. ఎక్కువటైం పిల్లలతోనే!. కాలం తెచ్చిన మార్పు.. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం!కుటుంబలో నాన్న అంటేనే ఒక ప్రత్యేక క్యారెక్టర్... నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక .. ఎప్పుడూ పనులు.. బాధ్యతలు.. కుటుంబ సమస్యలు.. అప్పులు.. వ్యవసాయం వంటి పనుల్లో బిజీ.. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హైడ్మాస్టర్ దగ్గర నిలబడినట్లే.. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్... నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంతబావున్ను.. నాన్న నన్ను తన భుజాలమీద ఎక్కించుకుని జాతరలో తిప్పుతూ.. జీళ్ళు కొనిపెడితే ఎంతబావుణ్ను... నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు.. కథలు చెప్పే రోజులు నాకు రావా ? ఇదీ సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990ల వరకూ నాన్న(Father) పరిస్థితి ఇదే.. ఇంట్లో అందరి బాధ్యతలూ మోస్తూ అందరికీ దూరంగా ఉండే ఒక సెమి విలనీ పాత్ర...ఎప్పుడూ పనులు.. బాధ్యతల్లో ఉంటూ అసలు పిల్లలతో టైం గడపడం.. వారిని ఆడించడం.. వారితో ముచ్చట్లు ఆడడం అనేది తనకు సంబంధం లేదనుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు.. బట్టలు.. పుస్తకాలు.. జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలోలేదు. పిల్లలకు స్నానం చేయడం.. వారిబట్టలు మార్చడం .. ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అసలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు.. సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్నీ ఉమ్మడికుటుంబాలు.. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని.. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది.. పిల్లల విషయంలో తండ్రిది ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే....కాలం మారింది .. నాన్నను మార్చింది1960 ల నుంచి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర.. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తోంది.. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం... పిల్లలపట్ల ఎనలేని ప్రేమ పొటమరిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం.. ఉమ్మడికుటుంబాల ప్రాబల్యం తగ్గడం.. ఎక్కడికక్కడ ఉపాదివేటలో పట్టణాలకు వలసవెళుతున్న కుటుంబాలు(Families) అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తోంది. పట్టణానికి చేరిన నాన్న.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు.. మామ్మలు లేరు.. తల్లి ఒక్కతీ పనులు చేసుకోదు .. చేసుకోలేదు.. దరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈక్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నాడు . గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జనరేషన్లకు ఊహాకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980ల్లో 43 శాతం మంది తండ్రులకు తమ పిల్లల \డైపర్లు మార్చడం అనేది తెలియదట ప్రస్తుతానికి అది 3 శాతానికి తగ్గింది. అంటే ఇప్పుడు తండ్రులు పిల్లల సేవల్లో(Father-Kids Relation) తల్లితోబాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట.నాన్నతోనే స్నేహం ఇప్పుడుఅప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లలపట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరీర్ సంబంధ సలహాలు ఇవ్వడం.. వారికి సైకిల్.. బైక్.. నేర్పడం.. వేలు పట్టుకుని నడిపించడం.. సాధ్యమైనంత ఎక్కువటైం పిల్లలతో గడపడం.. కథలు చెప్పడం.. టూర్లకు తీసుకెళ్లడం.. పిల్లలకు స్నానం చేయించడం.. వాళ్లతో పడుకోవడం.. ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు.. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్(Globalisation) తెచ్చిన మార్పులతో నాన్నల పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి..:::సిమ్మాదిరప్పన్న -
సుమ కనకాల తనయుడి కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
ఇద్దరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం: హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని..
తాండూరు రూరల్: అలిగి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే హత్య చేసేందుకు యత్నంచాడు ఓ తండ్రి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్ గ్రామానికి చెందిన హన్మంత్‌కు తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన శరణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు అరవింద్, ధర్మ, కార్తీక్ ఉన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మల్కాపూర్‌లో నివాసముంటున్నారు. నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న హన్మంత్ రెండేళ్ల నుంచి శరణమ్మను వేధిస్తున్నాడు. దీంతో ఆమె రెండు నెలల క్రితం ఇద్దరు కొడుకులు ధర్మ, కార్తీక్‌లను తీసుకొని కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలోని బాల్కి గ్రామంలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. పెద్ద కుమారుడు అరవింద్ తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్‌లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. భార్య వచ్చిన విషయం తెలుసుకున్న హన్మంత్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు ముగిశాక శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. ఎలాగైనా భార్యను ఇంటికి రప్పించాలని, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అరవింద్‌ను హత్య చేస్తే భార్య వస్తుందని హన్మంత్ కుట్ర పన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లి కత్తితో కుమారుడి మెడ, చేతులపై దాడి చేశాడు. గాయాలు భరించలేక బాలుడు గట్టిగా అరవడంతో ఇంటి పక్కనే ఉన్న అశోక్‌తోపాటు మరికొందరు వచ్చి తలుపులు పగలగొట్టి అరవింద్‌ను కాపాడారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో ఎస్ఐ విఠల్‌రెడ్డి బాలుడిని తాండూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్యం బాగున్నట్లు తెలిపారు. హన్మంత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
మోడల్ని పెళ్లి చేసుకున్న నటుడు జయరామ్ కొడుకు (ఫొటోలు)
-
Ayesha Takia: కుమారుడి బర్త్‌డే.. ఇలా అందంగా ప్లాన్ చేసిన సూపర్ హీరోయిన్ (ఫోటోలు)
-
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
తల్లి ఆవేదన.. పట్టించుకోని కొడుకులు
-
కుమారుడు హంటర్‌కు దేశాధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్. విమర్శించిన డొనాల్డ్ ట్రంప్
-
ఐఏఎస్ కృష్ణబాబును టార్గెట్ చేసిన అయ్యన్నపాత్రుడు కుమారుడు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబును స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ టార్గెట్ చేశారు. కృష్ణబాబుపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ పెట్టిన విజయ్.. పులివెందుల కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేశారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో కృష్ణబాబు పని చేశారంటూ పోస్ట్ పెట్టారు. విజయ్ బహిరంగ ఆరోపణలతో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు మనస్తాపం చెందారు. ఎన్నికల తర్వాత బిల్లులు చెల్లించలేదంటున్న కృష్ణబాబు.. ఫేజ్-2 మెడికల్ కాలేజీలకు ఫలితాల ముందు రూ. 125 కోట్లు చెల్లించామని.. అందులో పులివెందుల కాలేజీకి రూ.25 కోట్లు చెల్లించామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయ్ తప్పుడు ఆరోపణలపై కృష్ణబాబు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
తల్లి, కుమారుడి దారుణహత్య
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్‌బాబు (55) సంతానం. అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్‌బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్‌బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు. బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్‌బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు. -
మహేష్ బాబు మేనల్లుడి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది. వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరి్థంచారు. -
‘నువ్వు చచ్చినా పర్వాలేదు’.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుషం వెలుగుచూసింది. కొడుకు ఫోన్ వాడటానికి బాని, చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన ఘోర ఘటన శనివారం జరిగింది. కన్న కొడుకును దారుణంగా హత్య చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడైన తండ్రి.వివరాలు.. వృత్తిరీత్యా వడ్రంగి అయిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివిసిస్తున్నాడు. 14 ఏళ్ల కుమారుడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల మొబైల్ వాడకం ఎక్కువై చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్నేహితులతోనూ చెడు సావాసం చేస్తుండటం తండ్రికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అంతేగాక ఇటీవల ఆ ఫోన్ పనిచేయకపోవంతో దానిని రిపేర్ చేయించాడు తేజస్.. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కొడుకుతో గొడవకు దిగాడు.. ఇది కాస్తాపెరిగి పెద్దది కావడంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తేజస్‌ను కొట్టాడు. అక్కడితో ఆగకుండా గొడకేసి బాది ‘నువ్వు బతికినా, చచ్చినా నాకు పర్వలేదు’ అంటూ చితకబాదాడు. దీంతో విద్యార్ధి నొప్పి భరించలేక నేలపై పడిపోయాడు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పరిస్థితి విషమంగా మారింది. అయితే శ్వాస ఆగిపోయిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవికుమార్ ఇంటికి చేరుకోగా.. అప్పటికే కొడుకు అత్యంతక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.ఇక బాలుడి తలపై తీవ్రమైన అంతర్గత గాయాలు, అతని శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే బాలుడి మృతదేహానికి ఉన్న రక్తపు మరకలను తొలగించి, బ్యాట్‌ను దాచిపెట్టి హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడని, వెంటనే అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసి కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నమిదని తెలిపారు. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటంపై పిల్లవాడికి, తండ్రికి వాగ్వాదం జరుగుతోందని, అదే అతడి హత్యకు దారితీసినట్లు డీసీపీ లోకేష్ బీ పేర్కొన్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.