మరో ‘బ్లూ డ్రమ్’ తరహా హత్య.. తండ్రి ప్రాణాలు బలితీసిన కుమారుడు | 21 Year Old Has Been Arrested After Ends His Father Life Over Career Dispute In Lucknow, Police Investigating This Case | Sakshi
Sakshi News home page

మరో ‘బ్లూ డ్రమ్’ తరహా హత్య.. తండ్రి ప్రాణాలు బలితీసిన కుమారుడు

Feb 24 2026 2:51 AM | Updated on Feb 24 2026 12:11 PM

21 year old has been arrested in Lucknow

లక్నో:21ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేసిన ఘటనతో లక్నో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తండ్రికి కుమారుడ్ని డాక్టర్‌ని చేయాలని కోరిక. కుమారుడిది తనకు నచ్చిన రంగంలో స్థిరపడాలనే కోరిక. ఈ సంఘర్షణే చివరికి తండ్రి హత్యకు కారణమైంది.

పోలీసుల వివరాల మేరకు..49 ఏళ్ల మన్‌వేంద్ర సింగ్ లక్నోలో ఫార్మాస్యూటికల్, మద్యం వ్యాపారం చేస్తున్నాడు. అయితే,మన్‌వేంద్ర తన కుమారుడు అక్షత్‌ ప్రతాప్‌ సింగ్‌‌ను చేయాలనే కోరిక ఉండేది. ఇదే విషయంలో గతంలోనూ తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తండ్రిని విభేదించి రెండు మూడుసార్లు ఇంట్లో నుంచి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 21న సాయంత్రం 4.30 గంటల సమయంలో కుమారుడు అక్షత్‌కు తండ్రి మన్‌వేంద్ర సింగ్‌కు ఇదే విషయంపై మరోసారి వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగింది. ఈ క్రమంలో కోపోద్రికుడైన అక్షత్‌ ఇంట్లో ఉన్న రివాల్వర్‌ని తెచ్చి తండ్రిపై కాల్పులు జరిపాడు.

అనంతరం మూడో అంతస్తు నుంచి శరీరాన్ని కిందికి తీసుకువచ్చి, ఖాళీ గదిలో ముక్కలు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతని సోదరి చూసినా, ఆమెను బెదిరించి మౌనంగా ఉంచాడు.

శరీర భాగాలను ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి, కొన్నింటిని సమీప ప్రాంతంలో పారేశాడు. మిగతా భాగాలను ఇంట్లోని బ్లూ  డ్రమ్‌లో ఉంచాడు. పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని పిలిచి, ఇంట్లో సాక్ష్యాలు సేకరిస్తున్నారు. శరీర భాగాలను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అక్షత్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. లభించిన ఆధారాల ఆధారంగా సంబంధిత న్యాయ విభాగాల కింద కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లక్నో అషియానా ప్రాంత సీనియర్ అధికారి విక్రాంత్ వీర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement