lucknow
-
ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయణమనగానే ఎవరికైనా ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు లాంటి పెద్ద నగరాలు గుర్తుకువస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఇందుకోసం ఈ ఆయా నగరాలకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రాష్ట్రంలోని ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 487 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. ఇప్పుడు ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ విమానాశ్రయాలు యూపీలో ఎక్కడున్నాయనే వివరాల్లోకి వెళితే..అయోధ్యరామజన్మభూమి అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమైన దరిమిలా అక్కడ ‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో విదేశీ పర్యాటకులు నేరుగా అయోధ్యకు చేరుకోగులుగుతున్నారు.నోయిడా నోయిడాలోని జెవార్‌లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. 40.0919 హెక్టార్ల భూమిలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం సాగింది. ఇక్కడ ఐదు ఐదు రన్‌వేలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.కుషీనగర్కుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.లక్నో -వారణాసియూపీలోని లక్నో, వారణాసిలో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది
లక్నో: యూపీలోని లక్నోలో ఊహకందని ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆనందంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా హఠాత్తుగా ఒక చిరుత ప్రత్యక్షమయ్యింది. దానిని చూసినవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.లక్నోలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్డులో గల ఎంఎం లాన్లో బుధవారం రాత్రి ఒక వివాహ వేడుక జరుగుతోంది. అతిథులతో వాతావరణమంతా ఎంతో సందడిగా ఉంది. అయితే ఇంతలో ఊహకందని రీతిలో ఒక చిరుత అతిథుల మధ్యకు ప్రవేశించింది. ఈ ఘటన లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 11.40 నిముషాల సమయంలో ఒక చిరుత పెళ్లి వేడుకల్లోకి చొరబడింది. దానిని చూసి హడలెత్తిపోయిన అతిథులు అ విషయాన్ని పోలీసులకు ఫోన్లో తెలియజేశారు. వెంటనే పోలీసు సిబ్బంది, అటవీశాఖ అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ ఘటన గురించి డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ స్థానికుడు దీపక్ కుమార్ సోదరి వివాహం జరుగుతుండగా, ఈ ఘటన జరిగిందన్నారు. తమకు సమాచారం అందగానే ఒక పోలీసు బృందంతో పాటు అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నదన్నారు. వెంటనే వారు కల్యాణ వేదికను ఖాళీ చేయించారని, అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అతిథులు విందు ఆరగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదన్నారు. అటవీశాఖ అధికారులు మ్యారేజ్ హాలులోని రెండవ అంతస్తులో ఒక కుర్చీ వెనుక నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ హాలు తలుపులు మూసివేసి, దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కల్యాణ మండపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఖాళీ చేయించామన్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం
లక్నో : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బాధితులు ప్రయాణిస్తున్న వ్యాన్‌పై టయోటా ఇన్నోవో దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.గురువారం అర్ధరాత్రి ఉత్తర ప్రదేశ్ లక్నోలోని దేవా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు కిరణ్, ఆమె కుమారుడు కుందన్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు బంటీ యాదద్,శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను టయోటా మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న భారీ ట్రక్‌ను వ్యాన్ డీకొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలొదిలారు.రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయని, నలుగురు మరణించినట్లు పోలీస్ అధికారి పంకజ్ సింగ్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాల్ని ఈస్ట్ డీసీపీ శశాంక్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఓ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. ఆ వ్యాన్‌లో మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులు ప్రమాణిస్తున్నారు. అయితే ఆ వ్యాన్‌పైకి వెనుక నుంచి టయోటా ఇన్నోవా దూసుకొచ్చింది. ప్రమాదం తీవ్రతకు ఎదురుగా ఉన్న ట్రక్‌ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు’ అని తెలిపారు. సీఎం యోగి సంతాపంఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం యోగి ఆదేశాలకు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
అందుకే చంపేశా.. సంచలన విషయాలు వెల్లడించిన అర్షద్
‘మాకు సహాయం చేయమని చాలా మందిని అడిగాం, కానీ మాకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు నా సోదరీమణులు చనిపోతున్నారు. కొద్దిసేపట్లో నేను కూడా చచ్చిపోతాను. మాకు జరిగిట్టుగా భారతదేశంలోని ఏ కుటుంబం కూడా వేధింపుల బారిన పడకుండా చూడాలి. బతికుండగా మాకు న్యాయం జరగలేదు. కనీసం చనిపోయిన తర్వాతైనా మాకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మమ్మల్ని వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి. రాజకీయ నాయకులు, పోలీసులతో వారికి సంబంధాలున్నాయి. మా స్థలంలో సగం లాక్కున్నారు. మరో సగం కూడా గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు’- యూపీ రాజధాని లక్నోలో ఐదుగురు కుటుంబ సభ్యులను కిరాతంగా హత్య చేసిన అర్షద్(24) మాటలివి. తన తండ్రి సహాయంతో తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లను అర్షద్ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తాను హత్యలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించాడు.చెల్లెళ్లను అమ్ముకోవడం ఇష్టం లేకనే..ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ పట్టణం అర్షద్ స్వస్థలం. తమ పొరుగున్న వారు, ల్యాండ్ మాఫియాతో కలిసి వేధింపులకు గురిచేయడంతో విసిగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అర్షద్ వెల్లడించాడు. తనను, తన తండ్రిని కుట్రపూరితంగా దొంగ కేసుల్లో ఇరికించి.. తమ చెల్లెళ్లను అమ్మేయాలని చూశారని అతడు ఆరోపించాడు. దీంతో తన చెల్లెళ్లను చంపుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. వేధింపులు భరించలేక ఒక దశలో తామంతా మతం మారాలనుకున్నామని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అభ్యర్థించాడు. మాకెవరూ అండగా నిలబడలేదు‘ఇరుగుపొరుగు వారి వేధింపుల కారణంగా మా కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. మా అమ్మ, నా చెల్లెళ్లను నేనే చంపాను. నేను మాట్లాడిన ఈ వీడియో పోలీసులుకు దొరికినప్పుడు స్థానికులే బాధ్యులని వారికి తెలుస్తుంది. మా ఇంటిని కబ్జా చేసేందుకు నానారకాలుగా వేధించినా మేము గట్టిగా ప్రతిఘటించాం. కానీ మాకు ఎవరూ అండగా నిలబడలేదు. ఇల్లు వదిలిపెట్టి 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్‌పాత్‌పైనే నిద్రపోయాం. పిల్లలు చలిలో తిరగడం మాకు ఇష్టం లేదు. కబ్జాకోరులు మా ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ పత్రాలు మా దగ్గరే ఉన్నాయ’ని అర్షద్ తన వీడియోలో తెలిపాడు.ఈ హత్యలకు బాధ్యులు వారే..తమ కుటుంబ నాశనానికి రాణు, అఫ్తాబ్, అలీమ్ ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్, అజార్ అనే వ్యక్తులు కారణమని అర్షద్ ఆరోపించాడు. బంగ్లాదీశీయులమని తమపై అసత్య ప్రచారం చేశారని వాపోయాడు. ‘వాళ్లు ల్యాండ్ మాఫియా. ఆడపిల్లలను అమ్మేస్తారు. నన్ను, మా నాన్నను తప్పుడు కేసులో ఇరికించి.. మా చెల్లెళ్లను హైదరాబాద్‌లో అమ్మేయాలని ప్లాన్ చేశారు. వాళ్ల బారిని నుంచి తప్పించడానికి మాకు మార్గం మరో లేకుండా పోయింది. అందుకే మా నాన్న సహకారంతో నా సోదరీమణులను గొంతు, మణికట్టు కోసి బలవంతంగా చంపాల్సి వచ్చింది. వారి గౌరవాన్ని కాపాడటానికి మాకు ఇంత కంటే మార్గం తోచలేదు. నేను ఉదయం వరకు జీవించి ఉండకపోవచ్చు. మా స్థలాన్ని ప్రార్థనాలయానికి, వస్తువులను అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాల’ని అర్షద్ తెలిపాడు. తన వీడియోలో తల్లి, చెల్లెళ్ల మృతదేహాలను చూపించాడు.చదవండి: ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్షకొనసాగుతున్న విచారణహోటల్ శరణ్‌జిత్‌లో ఐదుగురు మహిళల హత్యలు జరిగాయని సెంట్రల్ లక్నో డిప్యూటీ పోలీసు కమిషనర్ రవీనా త్యాగి తెలిపారు. ఘటనా స్థలంలోనే నిందితుడు అర్షద్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని చెప్పారు. -
లక్నోలో దారుణం.. తల్లి సహా నలుగురు చెల్లెళ్ల హత్య
లక్నో: కొత్త ఏడాది వేడుకల వేళ ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్షద్ అనే వ్యక్తి తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హోటల్ గదిలో దారుణంగా హత్య చేశాడు. వీరి హత్యకు కుటుంబ వివాదాలే కారణంగా నిందితుడు అర్షద్ అంగీకరించినట్టు లక్నో పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నాకా ప్రాంతంలో ఉన్న హోటల్ శరంజిత్కు అర్షద్(24) సహా కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ క్రమంలో అర్షద్ తన తల్లి, నలుగురు చెల్లెళ్లను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఈ ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు అర్షద్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అర్షద్‌ను విచారించగా.. కుటుంబ వివాదాల కారణంగానే తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హతమార్చినట్లు ప్రాథమికంగా అంగీకరించాడు. మరణించిన వారిని తల్లి అస్మా, అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించినున్నట్టు డీసీపీ తెలిపారు.Lucknow, Uttar Pradesh: A murder was reported at Hotel Sharanjeet in Thana Naka.JCP Crime Bablu Kumar says, "We received information about five dead bodies in a hotel room at Naka police station. Immediately, the local police reached the spot, took possession of the bodies, and… pic.twitter.com/N6GmX8HCcU— IANS (@ians_india) January 1, 2025 -
UP : ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు చనిపోయారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. #UPDATE कन्नौज: SP अमित कुमार ने बताया, "लखनऊ-आगरा एक्सप्रेसवे पर बस-पानी के टैंकर की टक्कर में 8 लोगों की मौत हो गई है और 19 लोग घायल हुए हैं। सभी घायलों का सैफई मेडिकल कॉलेज में इलाज चल रहा है..." pic.twitter.com/yqTBgCNHQQ— ANI_HindiNews (@AHindinews) December 6, 2024కన్నౌజ్ జిల్లా కరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని సైఫై ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్,పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగే సమయంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సహాయక చర్యలు చేపట్టి ప్రమాద బాధితులకు తక్షణమే ఉన్నత వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాల్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని కన్నౌజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. -
పేద పిల్లల రిచ్ ఫ్యాషన్
లక్నోలోని నిరుపేద పిల్లలు ప్రముఖ డిజైనర్ సబ్యసాచి స్ఫూర్తితో పెళ్లి దుస్తులను రూపొందించారు. ఈ విషయాన్ని సూచిస్తూ తీసిన వీడియోను ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వారు రూపొందించిన బ్రైడల్ వేర్‌ను ధరించి, మోడలింగ్ చేసిన వాళ్లలోనూ పేద పిల్లలూ ఉన్నారు.ఫ్యాషన్ పరిశ్రమపై సబ్యసాచి ముఖర్జీ ప్రభావం అతని అద్భుతమైన డిజైన్ లకు మించి విస్తరించింది. దీంతోపాటు భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ హస్తకళనూ ్రపోత్సహిస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ ‘ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్’ మార్గదర్శకత్వంలో సబ్యసాచి కళాఖండాలు, అతని దిగ్గజ డిజైన్ లు ఇప్పుడు లక్నోలోని నిరుపేద పిల్లల బృందానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ నిరుపేద యువ డిజైనర్లు సగర్వంగా తమ క్రియేషన్ లను ధరించి కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో పోజులిచ్చారు. ’మేం లక్నో ఆధారిత ఎన్జీవోతో కలిసి 400 మంది నిరుపేద పిల్లలతో కలిసి పని చేస్తున్నాం. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం. ఈ దుస్తులను మా విద్యార్థులు రూపొందించారు. ఇందులో ప్రదర్శనలు ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల నుండి వచ్చినవారే. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులు, చుట్టుపక్కల వ్యక్తుల నుండి స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందే అన్ని దుస్తులను రీయూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సబ్యసాచి సోషల్ మీడియా అకౌంట్లో మోడల్ దుస్తులను చూసిన తర్వాత వారు ఇలాంటి డిజైన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్ ఎన్జీవో తెలిపింది. ప్రతిరోజూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శ్రద్ధగా కృషి చేస్తున్న 15 ఏళ్ల ఉత్సాహవంతమైన పిల్లలు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ కామెంట్స్ విభాగంలో హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం ద్వారా వారికి తన ఆశీస్సులను, ప్రశంసలను అందజేశాడు. అంతేకాదు, ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఈ పిల్లలకు మరింత శక్తి... ప్రేమ, ఆశీర్వాదాలు అందాలి..’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. -
యూపీలో ఉద్రిక్తత, ముగ్గురు మృతి.. 30మందికి పైగా పోలీసులకు గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరాన్ని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే బృందం సర్వే చేసేందుకు ప్రార్థనా మందిరంలోకి అడుగుపెట్టింది. అయితే, ఆ సర్వేను అడ్డుకునేందుకు వెయ్యికి మందికి పైగా స్థానికులు ప్రయత్నించారు. పోలీసుల్ని ప్రార్థనా మందిరంలోకి వెళ్లకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. అధికారుల వాహనాలకు నిప్పంటించారు. అయితే, స్థానికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు మరణించారు. 30మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి’ అని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం, పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఫ్యాషన్ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు
లక్నోకు చెందిన నిరుపేద యువతులు అద్భుతాలు సృష్టించారు. పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ల ప్రేరణతో అందమైన బ్రైడల్ డిజైనర్ దుస్తులను తయారు చేశారు. అదీ తమకు దానంగా వచ్చిన బట్టల నుంచి. అలా మనసు ఉండాలేగానీ, ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదని ఈ అమ్మాయిలు నిరూపించారు. వీరు సృష్టించిన డిజైన్లు, మోడలింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ స్ఫూర్తితో లక్నోలోని నిరుపేద పిల్లల బృందం తమ సృజనాత్మకతను గ్లామరస్ బ్రైడల్ వేర్‌గా అబ్బురపోయే డిజైన్లు, ఆకర్షణీయ మైన దుస్తులతో ఇంటర్నెట్లో సంచలనంగా మారారు. లక్నోకు చెందిన ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నిరుపేద పిల్లలు. వీరి ప్రతిభకు నెటిజన్లు ఔరా అంటున్నారు. సబ్యసాచి ముఖర్జీ ప్రేరణతోనే వీరు ఈ డిజైన్లను తీర్చిదిద్దారు. వివిధ సంస్థలు, వ్యక్తులనుంచి తమకు విరాళంగా ఇచ్చిన బట్టలు , మిగిలిపోయిన బట్టలు ఉపయోగించి డిజైనర్ ఐకానిక్ డిజైన్లకు పునఃసృష్టి చేశారు. అంతేకాదు వారు రూపొందించిన దుస్తులతో మోడలింగ్ చేయడం మరింత విశేషంగా నిలిచింది. అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, ప్రతిభతో వారంతా స్వయంగా సబ్యసాచిని ప్రశంసలను కూడా దక్కించుకున్నారు. తన ఇన్‌స్టాలో కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు.Forget spending lakhs on bridal wear. These 15+ year old amateur designers from Lucknow who come from under privileged backgrounds & live in a very modest neighbourhood, just turned donated clothes into fashion masterpieces inspired by Sabyasachi Creations.Their inventive and… pic.twitter.com/RlEszP4eA1— Lucknow Development Index (@lucknow_updates) November 8, 2024 దీనికి సంబంధించిన వీడియోను ఎన్జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “మేము లక్నోకు చెందిన NGO, 400+ మురికివాడల పిల్లలతో పని చేస్తున్నాము. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం ఈ డ్రెస్‌లను మా విద్యార్థులే డిజైన్ చేశారు. ఇందులో ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల ప్రాంతాలకు చెందిన వారే. ఈ పిల్లలు చాలా పేద మరియు నిస్సహాయ కుటుంబాల నుండి వచ్చారు. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించారు. వీరంతా స్థానికులు ,చుట్టుపక్కల వారినుంచి వచ్చిన దుస్తులతో వీటిని తీర్చిదిద్దారు. వీడియోలో కనిపిస్తున్న ఈ బాలికలు బస్తీలో నివసిస్తున్న 12 నుండి 17 ఏళ్ల వయస్సున్నబాలికలు’’ అని వివరించింది. ఈ వీడియోను 15 ఏళ్ల ఔత్సాహిక వీడియో గ్రాఫర్స్వ చిత్రీకరించారని కూడా వెల్లడించింది. View this post on Instagram A post shared by Sabyasachi (@sabyasachiofficial) కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో, సబ్యసాచి ఇటీవల తన 'హెరిటేజ్ బ్రైడల్' కలెక్షన్స్ మోడల్స్ వీడియోను పోస్ట్ చేశాడు: "ఎరుపు రంగు సీజనల్ కాదు.., ఐకానిక్." అని పోస్ట్ చేశారు. ఈ థీమ్‌తోనే అదే రంగులో లక్నో గాళ్స్ అదే డిజైన్స్‌ను పునఃసృష్టించారు. -
లక్నోలో ఎన్కౌంటర్.. ఒక దుండగునికి గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పోలీసులకు, దుండగులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు గాయపడ్డాడు. ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్థరాత్రి తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు నిందితులు పోలీసులను చూసి, తమ బైక్‌లను వెనక్కుతిప్పి పారిపోయారు. దీంతో పోలీసు బృందం వారిని వెంబడించింది. ఆలంనగర్ రైల్వే లైన్ సమీపంలో నిందితుల్లో ఒకడు బైక్‌పై నుంచి జారి కిందపడిపోయాడు. వెంటనే అతను పిస్టల్ తీసి, పోలీసులపైకి రెండు రౌండ్లు కాల్చాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.ఒక నిందితుని కాలికి బుల్లెట్ తగిలి గాయపడి, పోలీసులకు పట్టుబడ్డాడు. మరో బైక్‌పై వెళుతున్న నిందితులిద్దరినీ కూడా పోలీసులు వెంబడించి విజయవంతంగా పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పోలీసులు ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు, రెండు వినియోగించిన కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’ -
సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’
లక్నో: ఇతర మతానికి, విశ్వాసానికి సంబంధించిన సాధువులు, పూజారులపై కించపరిచే వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిని శిక్షించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రతీ మతాన్ని, విశ్వాసాన్ని గౌరవించాలని అన్నారు. రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర అధికారులతో సీఎం యోగి సోమవారం సమీక్ష నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా మత విశ్వాసాన్ని దెబ్బతీస్తే విధంగా సాధువులు, పూజారులు, దేవతలకు వ్యతిరేకంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వాళ్లు చట్ట వ్యతిరేక పరిధిలోకి వస్తారు. అలాంటివారిని కఠినంగా శిక్షిస్తాం. అన్ని వర్గాల, మతాల ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. నిరసనల పేరుతో అరాచకం, విధ్వంసం, దహనాలను సహించబోం. ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడటానికి ధైర్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు.ఇటీవల పూజారి యతి నర్సింహానంద్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలపై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపైపు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యతి నర్సింహానంద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యతి నర్సింహానంద్‌ను ఘజియాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన సహాయకులు తెలిపారు. అయితే.. ఆయన సహాయకులు చేసిన వ్యాఖ్యలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.చదవండి: అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్జండర్ల పూజలు -
యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం అత్యంత దారుణ హత్యకు గురైంది. గురువారం ఉపాధ్యాయుడికి ఇంట్లో చొరబడిన గుర్తుతెలియని దుండగులు నాలుగురు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్(35)గా గుర్తించారు. ఆయన పన్‌హౌనాలోని కాంపోజిట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. దుండగుల కాల్పల్లో సునీల్ భార్య పూనం (32), వారి కుమార్తె దృష్టి (6), ఏడాది వయసున్న కుమార్తె మృతి చెందారు.ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. టీచర్ భార్య ఆగస్టు 18న చందన్ వర్మా అనే వ్యక్తి రాయ్ బరేలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమకు, తమ కుటుంబానికి ఏమైనా జరిగినే చందన్ వర్మానే బాధ్యుడు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. ఆమెను వేధింపులకు గురిచేసినట్లు కూడా కేసులో ఆమె ప్రస్తావించటం గమనార్హం. అయితే ఈ హత్యకు సంబంధించి అనుమానితుడు చందన్ వర్మా ఆచూకీ ఇంకా దొరకలేదని, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కుటుంబ హత్యకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదని అన్నారు.పోలీసుల దర్యాప్తులో భాగంగా చందన్ వర్మా వాట్సాప్ చాట్ బయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్ అందులో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ ఐదుగురు చనిపోతారు" అని వర్మ వాట్సాప్ చాట్‌లో వ్రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు. -
ఐ ఫోన్ కోసం హత్య.. డబ్బులిస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి..
డెలివరీ ఏజెంట్ల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సరుకులు సరఫరా చేసే డెలివరీ ఏజెంట్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలకు గిరాకీ పెరిగింది. దీంతో వేలాది మందికి ఇది ఉపాధి మార్గంగా మారింది. ఆన్లైన్లో బుక్ చేసిన వాటిని వినియోగదారులకు సరైన సమయంలో చేరవేయడం డెలివరీ ఏజెంట్ల పని. అయితే చెప్పినంత ఈజీ కాదు ఈ జాబ్ చేయడం.సవాళ్లు ఎన్నో..విధి నిర్వహణలో డెలివరీ ఏజెంట్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమయానికి సరుకులు చేరవేయడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నగరాల్లో అయితే తీవ్రమైన ట్రాఫిక్‌ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకోసారి అడ్రస్ వెతుకులాటలోనే సమయం గడిచిపోతుంటుంది. లేటుగా వెళితే కస్టమర్లు నెగెటివ్ రేటింగ్ ఇస్తారనే భయంతో వేగంగా వెళుతూ ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. వీటితో పాటు దాడులు కూడా పెరిగాయి.ఐ ఫోన్ కోసం హత్యతాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఐ ఫోన్ కోసం ఓ డెలివరీ ఏజెంట్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్‌హాట్‌కు చెందిన గజేంద్ర ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ సేల్‌లో లక్షన్నర రూపాయల ఐ ఫోన్ ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. సెప్టెంబర్ 23న ఆర్డర్ ఇవ్వడానికి డెలివరీ ఏజెంట్ భరత్ సాహు వచ్చాడు.ఫోన్ తీసుకున్న గజేంద్ర, డబ్బులిస్తానంటూ అతడిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఫ్రెండ్‌తో కలిసి సాహును చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని కాల్వలో పడేశారు. సాహు కనిపించకపోవడంతో అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాస్ట్ డెలివరీ గజేంద్రకు చేశాడని విచారణలో తేలింది. దీంతో ఫోన్ నంబర్ ఆధారంగా అతడి ఫ్రెండ్ ఆకాశ్‌ను పట్టుకున్నారు. అతన్ని విచారించగా ఈ దారుణం బయటపడింది.గతంలోనూ దాడులుకాగా, డెలివరీ ఏజెంట్లపై దాడులు గతంలోనూ పలుచోట్ల చోటుచేసుకున్నాయి. 2021లో బెంగళూరులో దోపిడీ యత్నంలో ఫుడ్‌డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. డబ్బుల విషయంలో కస్టమర్‌తో గొడవ జరగడంతో డెలివరీ ఏజెంట్ ఒకరు కత్తిపోట్లకు గురయిన ఘటన 2022లో నోయిడాలో కలకలం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా యూపీ ఘటన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
కూర్చున్న చోటే కుప్పకూలిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాద ఘటన జరిగింది. గోమతినగర్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగిని ఆఫీసులోనే తన డెస్క్‌లో కుర్చీలో నుంచి కిందపడి కుప్పకూలి మరణించింది. గోమతి నగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాదఫ్ ఫాతిమా (45) అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూలానే మంగళవారం కూడా ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది.ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్టుండి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది. గమనించిన తోటి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పని ఒత్తిడి వల్ల టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చని సహోద్యోగులు చెబుతున్నారు.ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించామని తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.ఇక ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ సంఘటన దేశ ప్రస్తుత ఆర్థిక ఒత్తడిని ప్రతిబింబిస్తోందని, ఇలాంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయని తెలిపారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. దేశంలోని అన్ని కంపెనీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు. -
పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన ఉద్యోగి?
లక్నో: పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. పూణే ఉద్యోగి ఘటన మరవక ముందే.. లక్నోలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తూ కుర్చీలోనే ప్రాణాలు వదిలింది ఓ బ్యాంకు ఉద్యోగిణి!. ఉత్తర ప్రదేశ్ గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో మంచి పొజిషన్లోనే సదాఫ్ ఫాతిమా పని చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 24) డ్యూటీకి హాజరైన ఆమె కుర్చీలోనే కూలబడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే.. అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమెకు ఈ మధ్యే ప్రమోషన్ వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని ఆమె తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలపై సదరు బ్యాంకు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఆర్థిక లక్ష్యాల సాధన ఒత్తిడే.. ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని ఆరోపించారాయన. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్లను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అది ఉద్యోగులపై పడుతోంది. అందుకే ఇలాంటి మరణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశం. దీనిని అడ్డుకట్ట పడాలంటే.. ఆరోగ్యకరమైన పని వాతావరణం కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు.लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024 పని ఒత్తిడి కారణంగానే కేరళ కొచ్చికి చెందిన యువ సీఏ అన్నా సెబాస్టియన్ పెరియాళి కన్నుమూసిందన్న వార్త.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జులైలో పుణెలోని సంస్థ కార్యాలయంలో తన విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాసేపటికే మరణించారు. అయితే పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్ తల్లి అనితా తాజాగా ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి.. పని ఒత్తిడి అంశం అటు ఉద్యోగ వర్గాల్లోనూ.. ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ ఈ అంశంపై విచారణకు ఆదేశించగా.. మానవ హక్కుల కమిషన్ సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంది. -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. నలుగురి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్లో శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలడంతో సమీపంలో పారక్ చేసి లారీ కూడా నుజ్జునుజ్జయింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే శిథిలాల కింద మరికిందరు చిక్కుకొని ఉంటారి అధికారులు భావిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందికాగా బిల్డింగ్ కూలిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని తెలిపారు.#WATCH | Lucknow building collapse | Rescue operations to evacuate the trapped people are underway. Fire Department and NDRF teams are at the spot. The evacuated people are being sent to the hospital.So far, 4 people have been evacuated in the incident. pic.twitter.com/gN3GWrAQ4X— ANI (@ANI) September 7, 2024 -
Lucknow: 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై దాడి
లక్నో: కొందరు అల్లరిమూకలు వందేభారత్ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారనే వార్తలను అప్పుడప్పుడు మనం వింటుంటాం. తాజాగా గడచిన 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటి సంఘటన బుధవారం రాత్రి యూపీలోని లక్నో- పట్నా వందే భారత్‌పై జరగగా, రెండవ ఘటన గురువారం ఉదయం రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై జరిగింది.బుధవారం రాత్రి లక్నో నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై అల్లరి మూకలు భారీగా రాళ్లు రువ్వారు.ఈ దాడి కారణంగా రైలులోని సీ-5 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. యూపీలోని వారణాసి స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. రైల్వేశాఖ కూడా విచారణ చేపట్టింది.ఇదేవిధంగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందే భారత్ రైలుపై గురువారం ఉదయం రాళ్ల దాడి జరిగింది. 24 గంటల్లోనే రెండు వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలు నంబర్ 22350లోని బోగీ నంబర్ ఈ వన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఇందులో ఐదు, ఆరో నంబర్ సీట్ల సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన హజారీబాగ్‌లోని చార్హి- బేస్ రైల్వే స్టేషన్ మధ్య జరిగింది.ఈ రాళ్లదాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో రైలులో కూర్చున్న ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. -
‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై అఖిలేశ్‌కు సీఎం యోగి కౌంటర్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్ పేరుతో అఖిలేశ్ యాదవ్ బెదిరింపులను బుధవారం యోగి తోసిపుచ్చారు. బుల్డోజర్ను నడపడానికి ధైర్యం, తెలివి దృఢ సంకల్పం అవసరమని అన్నారు. ఎవరుపడితే వాళ్లు నడపలేరని, ముఖ్యంగా బుల్డోజర్ నడిపే శక్తి అఖిలేశ్ యాదవ్‌కు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని సీఎం యోగి మాట్లాడారు. ‘‘బుల్డోజర్ను నడపడానికి అందరికీ చేతులు సరిపోవు. వాటిని నడపాలంటే.. హృదయం, మనస్సు రెండూ అవసరం. బుల్డోజర్ లాంటి సామర్థ్యం, దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలరు. అల్లరిమూకల ముందు మాట్లాడేవారు కనీసం బుల్డోజర్ ముందు నిలబడలేరు’’ అని అన్నారు. ఇప్పటిదాకా ‘టిపు’గా ఉన్న అఖిలేశ్ యాదవ్ కొత్తగా సుల్తాన్‌లా మారడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇక.. ‘టిపు’ అనేది అఖిలేశ్ యాదవ్ నిక్ నేమ్‌గా తెలుస్తోంది.#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath speaks at the distribution of jobs appointment letters, he says, "...Not everyone's hands can fit on a bulldozer...Iske liye dil aur dimaag dodo chahiye. Bulldozer jaise shamta aur pratigya jismein ho wahi bulldozer chala sakta… pic.twitter.com/VpbzY8BQV9— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2024ఇదిలా ఉండగా.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. తాము 2027లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని బుల్డోజర్లను సీఎం యోగి సొంత నియోజకర్గమైన గోరఖ్‌పూర్‌కు పంపిస్తామని అన్నారు. -
యూపీ పల్లెల్లో ‘భేడియా’ టెర్రర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. భయం గుప్పిట గడుపుతున్నారు అక్కడి ప్రజలు. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గత 45 రోజుల్లో తోడేళ్ల గుంపు దాడిలో తొమ్మిది మంది బలయ్యారు. ఇందులో ఎనిమిది మంది చిన్న పిల్లలే కావడం గమనార్హం.గ్రామస్తుల భయాందోళనలతో.. తోడేళ్ల గుంపును తరిమికొట్టేందుకు జిల్లా అటవీశాఖ రంగంలోకి దిగింది. తోడేళ్లను తరిమికొట్టేందుకు ఏనుగు పేడ, మూత్రాన్ని అటవీ అధికారులు ఉపయోగిస్తున్నారు. సమీప గ్రామాల్లో తాజాగా.. ఇద్దరు చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. అప్రమత్తమై తల్లిదండ్రులు వాటి వెంటపడడంతో.. పిల్లలను వదిలేసి అవి పారిపోయాయి. తీవ్రమైన గాయలైన చిన్నారులకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై.. స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ రంగంలోకి దిగారు. గ్రామస్తులతో కలిసి రాత్రివేళలో ఆయన కాపల కాస్తున్నారు ‘‘అవి ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదు. గుంపుగా గ్రామాల మీద పడుతున్నాయి. ఇప్పటికే మూడు తోడేళ్లను జిల్లా అటవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవటంపై అవగాహన కల్పిస్తా. నేను నా కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాం’’ అని అన్నారు.VIDEO | Police and forest department team nabbed a wolf in UP's #Bahrainch, earlier today.The Uttar Pradesh government had launched 'Operation Bhediya' to capture a pack of wolves on the prowl in Mehsi tehsil in Bahraich district that has so far killed seven people.Six… pic.twitter.com/Nx5ZKFAT1e— Press Trust of India (@PTI_News) August 29, 2024ఉత్తరప్రదేశ్‌లో గ్రామాల్లో ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందకు సీఎం యోగి ప్రభుత్వం‘‘ఆపరేషన్ భేడియా’’ను కూడా ప్రారంభించింది. తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ పద్ధతులను ఉపయోగిస్తోందని యూపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు. -
వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్.. వరద నీటిలో మహిళపై వేధింపులు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కొందరు ఆకతాయిలు హద్దులు దాటి రెచ్చిపోయి ప్రవర్తించారు. పట్టపగలే బైక్‌పై వెళ్తున్న ఓ జంటను వేధింపులకు గురిచేశారు. వర్షపు నీటిలో బైక్‌పై వెళ్లున్న వారిపై నీళ్లు చిమ్ముతూ రక్షసానందం పొందారు. ఈ క్రమంలో మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయి ఉన్నాయి. లక్నోలో తాజ్ హోటల్ బ్రిడ్జ్ దగ్గర కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉంది. వరద నీటి కారణంగా బ్రిడ్జ్‌పై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయింది. ఆ బ్రిడ్జ్ పైనే వాహనదారులు నానా తిప్పలు పడుతూ వెళుతున్నారు. ఇక, ఆ బ్రిడ్జ్‌పై వరద నీరు మోకాలు లోతు ఉండటం చూసి కొందరు ఆకతాయిలు రోడ్డుపైకి చేరుకున్నారు. మోకాలి లోతు నీళ్లలో నిల్చుని ఒకరిపై ఒకరు ఆ వరద నీటిని చల్లుకున్నారు. Lucknow: A viral video shows people mistreating a woman during rain and causing a ruckus under the Taj Hotel bridge. Police intervened, dispersed the crowd, and are identifying those involved pic.twitter.com/7TJxUYKmIv— IANS (@ians_india) July 31, 2024 ఈ సందర్బంగా బ్రిడ్జి మీదుగా వచ్చేపోయే వాహనదారులపై నీళ్లు చల్లుతూ ఓవరాక్షన్ చేశారు. కాగా, ఆ సమయంలో అదే బ్రిడ్జ్ మీదుగా ఒక వ్యక్తి వెనుక కూర్చున్న మహిళతో కలిసి బైక్‌పై వస్తున్నాడు. బైక్‌పై ఒక మహిళ ఉందన్న విషయం కూడా మర్చిపోయి.. బైక్‌పై ఉన్న ఆ వ్యక్తిపై, ఆ మహిళపై నీళ్లు కొడుతూ ఆకతాయిలు రెచ్చిపోయారు. ఆ వాహనదారుడు నీళ్లు చిమ్మడం ఆపండని మర్యాదగా చెప్పాడు. ఆ మహిళ కూడా నీళ్లు కొట్టొదని చెప్పింది. అయినా సరే.. ఈ ఆకతాయిలు వాళ్ల మాటను లెక్కచేయలేదు. మరింత రెచ్చిపోయి బైక్‌పై ఉన్న ఇద్దరిపై నీళ్లు కొట్టారు. దీంతో.. ఆ వ్యక్తి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. అనంతరం, ఆ మహిళ నీళ్లలో పడిపోయింది. ఆమెను పైకి లేపి ఆ ఆకతాయిలను హెచ్చరించి సదరు వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆకతాయిలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం, రోడ్డుపై ఓవరాక్షన్ చేస్తున్న వారిపై లాఠీ ఝలిపించారు. बारिश के बीच जब पुलिस ने चटकाई लाठियां...#Lucknow #ViralVideos #Rain pic.twitter.com/ngPVuH5gWa— Ashish Mishra (@AshishMisraRBL) July 31, 2024 -
ఎస్పీ ఆఫీసు ఎదుట రాజ్యాంగ స్తూపం
లక్నో: లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రధాన కార్యాలయం ఎదుట రాజ్యాంగ స్తూపం(సంవిధాన్ మాన్స్తంభ్) ఏర్పాటైంది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్పీ నేతల సమక్షంలో ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒక స్తూపంపై రాజ్యాంగ ప్రతిని ఉంచడం ద్వారా రాజ్యాంగ స్తూపాన్ని ఆవిష్కరించారు. ‘ఒకప్పటి కొల్హాపూర్ మహారాజు చత్రపతి సాహూ తన సంస్థానంలో మహాత్మా జ్యోతిబా ఫూలే కలలుగన్న రిజర్వేషన్ల అమలును సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అందుకే జూలై 26వ తేదీన రాజ్యాంగ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు అనంతరం అఖిలేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
యూపీలో బీజేపీకి తగ్గిన సీట్లు.. ఆరు కారణాలు ఇవే!
లక్నో: లోక్ సభ ఎన్నికల్లో తమకు కుంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. గత లోక్ సభ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా సీట్లు తగ్గాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యానికి గల కారణాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌కు నివేదికి సమార్పించింది. ఈసారిగా ఓటమి, సీట్లు తగ్గుదలకు గల కారణాలను అందులో వివరించారు. ఈ నివేదికను అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లు ఆమేథీ, అయోధ్యల్లో మొత్తంగా సుమారు 40 వేల కార్యకర్తలు అభిప్రాయలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆశించి సీట్ల రాకపోవడానికి ఈ నివేదిక ఆరు ప్రధానమైన కారణాలను వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ లేకపోవటం. ప్రభుత్వం అధికారుల చేతిలో అధికారంలో ఉండటంతో పార్టీ కార్యకర్తల తీవ్రంగా అవమానంగా భావించారు. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయలేకపోయాయని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు.రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో సుమారు 15 సార్లు పేపర్ల లీక్ అయ్యాయి. దీన్ని ప్రతిపక్షలు ప్రజల్లో తీసుకువెళ్లటంలో విజయం సాధించారు. దీంతో బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు.ప్రభుత్వంలో పెద్దస్థాయిలో పోస్టులను కాంట్రాక్టుల ఉద్యోగులతో భర్తీ చేయిటంలో ప్రతిపక్షాల ఆరోపణలు మరింత బలం చేకూరి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.కూర్మీ, మౌర్య సామాజిక వర్గాలు ఓట్లు ఈసారి బీజేపీ పడలేదు. దీంతో పాటు దళిత ఓటర్లను కూడా బీజేపీ తమవైపు తిప్పుకోలేకపోయింది. బీఎస్పీతో ఓటు బ్యాంక్ ఉన్న దళితులను తమవైపుకోని కాంగ్రెస్ ఓటుషేర్‌ను పెంచుకుంది.ఎన్నికలకు ముందుగానే బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కార్యకర్తలు సైతం ఎన్నికల ప్రచారంలో నిర్లక్ష్యం వహించారు. పలు దశల్లో పోలింగ్ జరగటంతో కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతూ వచ్చింది.రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర నాయకులే వ్యాఖ్యలు చేయటంతో వాటిని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీజేపీ నేతలు వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోని ప్రతిపక్షాలవైపు మొగ్గుచూపారు.బీజేపీ 370 సీట్ల నినాదంతో ఎన్నికల బరిలోకి దిగగా.. 240 సీట్లకు పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలో వచ్చి మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లకు గతంలో 62 సీట్ల నుంచి 33 స్థానాలుకు తగ్గిపోయింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లను గెలుచుకుంది. దీనిపై ఇటీవల యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరీ, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి పార్టీ ఓటమిపై చర్చలు జరిపారు. -
గ్యాంగ్‌స్ట్‌ర్ అతిక్ అహ్మద్ ఆస్తి యూపీ ప్రభుత్వానికి బదిలీ
లక్నో: గ్యాంగ్‌స్ట్‌ర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ గతేడాది హత్యకు గురయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతిక్ సంబంధించి ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న రూ. 50 కోట్ల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకుంది. ప్రయాగ్‌రాజ్ కోర్టు అతిక్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రయాగ్‌రాజ్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది( క్రిమినల్) గులాబ్ చంద్రఅగ్రహారి తెలిపారు.2.377 హెక్టార్ల భూమిని అతిక్ నేరకార్యకలాపాల ద్వారా సంపాధించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి హుబాలాల్ అనే వ్యక్తి పేరు మీద ఉందని చెప్పారు. ఈ భూమిని పోలీసులు 2023 నవంబర్‌లో సీజ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ చట్టంలోని సెక్షన్ 14(1)కింద పోలీసులు ఈ భూమిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ భూమికి సంబంధించి యజమాని ఎవరనేదానిపై ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. దీంతో పోలీసు కమిషనర్ కోర్టు ఈ కేసు ప్రయాగ్‌రాజ్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో బుధవారం జడ్జి వినోద్ చౌరాసియా పోలీసు కమిషనర్ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. అతిక్ ఆస్తులను ఉత్తరపదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలని ఆదేశించారు.అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ సుమారు వందకుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదీకాక ఉమేష్ పాల్ హత్యకేసుతో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ హత్యకు గురయ్యారు. జర్నలిస్టులుగా నటిస్తూ దుండగులు అత్యంత సమీపంగా జరిపిన కాల్పుల్లో మృతిచెందారు. -
జాడ లేని పెళ్లికూతురు.. నిరాశతో తిరిగొచ్చిన పెళ్లికొడుకు
లక్నో: పాపం ఓ పెళ్లికొడుకు పెళ్లి చేసుకోవడం కోసం బంధుమిత్రులు, బాజా భజంత్రీలతో పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడే అతడికి పెద్ద షాక్ తగిలింది. వెళ్లినచోట ఎంత వెతికినా పెళ్లికూతురు ఇల్లు దొరకలేదు. పెళ్లి కూతురు, ఆమె అమ్మానాన్నలకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది.అక్కడ ఇరుగుపొరుగు వాళ్లను అడిగితే అసలు మీరు చెబుతున్నవారెవరు ఇక్కడ ఉండరు అని సమాధానం వచ్చింది. ఇంకేముంది పోలీసులకు ఫిర్యాదు చేసిన పెళ్లికొడుకు నిరాశతో వెనుదిరిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నోలోని రహీమామాబాద్ ప్రాంతంలో ఆదివారం(జులై 14) జరిగింది. ఉన్నావోకు చెందిన సోనూ అనే యువకుడికి కాజల్ అనే అమ్మాయికి చండీగఢ్‌లో పరిచయమైంది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. భాజాభజంత్రీలు అన్నీ రెడీ చేసుకుని వస్తే పెళ్లి చేసుకుందాం అని కాజల్ సోనూకు ఫోన్లో చెప్పింది. పెళ్లి ఏర్పాట్లు మొత్తం చేసేశామని కాజల్ తండ్రి కూడా సోనూకు ఫోన్లో చెప్పాడు. ఈ మాటలు నిజమని నమ్మిన సోనూ పెళ్లి చేసుకుందామని వెళ్లి పెళ్లికూతురు ఇల్లు దొరకక షాక్‌లో వెనుదిరిగి వచ్చాడు. -
18 ఏళ్ల తర్వాత తప్పిపోయిన సోదరుడిని కలిపిన ఇన్‌స్టా రీల్!
లక్నో: ఇంటి నుంచి తప్పిపోయిన పులువురిని సోషల్ మీడియా వాళ్ల కుటుంబాలకు చేరవేస్తోంది. తప్పినపోయిన వారు చేస్తున్న ఇస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు వైరల్‌గా మారటంతో వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తిపట్టి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉద్విగ్నభరిత సీన్స్‌ను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన సోదరుడిని ఒక అక్క ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశారు. ఆయనకు విరిగిన పన్ను ఉండటంతో తన సోదరుడేనని ఆమె గుర్తుపట్టారు. ఈ ఘటన ఆయన వెళ్లిపోయిన 18 ఏళ్ల తర్వాత జరగింది. ఇన్స్టాగ్రామ్ రీల్లో కనిపించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్లో ఒక రీల్స్ చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన ఆయన పన్ను చూసి 18 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి ముంబై వెళ్లిన తన సోదరుడు బాల్ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించారు. వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్న సంప్రదించారు. అనంతరం చిన్నప్పడు తను సోదరుడితో గడిపిన విషయాలు ప్రస్తావించారు. పాత విషయాలకు ఆయన కూడా స్పందించడంతో.. తన సోదరుడేనని రాజ్ కుమారి నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న ఆయన 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకున్నారు. తప్పిపోయిన తన సోదరుడిని సోషల్‌మీడియానే కలిపిందని రాజ్‌కుమారి ఆనందం వ్యక్తం చేశారు. -
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
Abha Sharma: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు
చిగుళ్ల వ్యాధి వల్ల 35 ఏళ్ల వయసులో పళ్లు కోల్పోయింది అభా శర్మ. 45 ఏళ్ల వయసులో ఆమెకు అవయవాలు కంపించే అరుదైన వ్యాధి వచ్చింది. అయినా నటి కావాలన్న కోరికను ఆమె చంపుకోలేదు. నాటకాల్లో పాత్రలు వేయసాగింది. ఇప్పుడు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్‌లో పల్లెటూరి అమ్మగా నటించి దేశం మొత్తానికి అభిమాన నటి అయ్యింది. 75 ఏళ్ల వయసులో విజయాన్ని చూసిన అభా శర్మ పరిచయం.ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఫుల్వారా’ అనే పల్లెటూళ్లో ఒక ముసలామె పంచాయతీ ఆఫీస్‌కు వచ్చి– ‘నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టాడు. నాకో ఇల్లు మంజూరు చేయి నాయనా’ అని పంచాయతీ ఆఫీసర్ని ప్రాధేయపడుతుంది.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఊరికి 11 ఇళ్లు మంజూరై ఉంటాయి. వాటిని ఎవరెవరికి ఇవ్వాలనేది సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్ నిర్ణయించాలి. ఈ ముసలామెకు ఇల్లు మంజూరు చేద్దామా అనుకుంటాడు ఆఫీసర్. కాని పల్లెల్లో అదంత సులభం కాదు. ‘నిజంగానే ముసలామెను కొడుకు తరిమి కొట్టాడా లేదా’ అనే ఎంక్వయిరీ జరుగుతుంది. ఊరి జనం కూడా ముసలామె ఇంటి మీద నిఘా పెడతారు. కొడుకు కాపురం ఒక గదిలో ఉంటే ముసలామె వేరొక గుడిసెలో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమని భావించిన ఆఫీసర్ ముసలామెకు ఇల్లు మంజూరు చేస్తాడు. కాని ఇదంతా అబద్ధమని తేలుతుంది. ‘పేదవాడైన నా కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చి వెళితే వాడు సుఖపడతాడని ఈ నాటకం అంతా ఆడాను’ అంటుంది ముసలామె. కాని ‘ఇంటి కోసమని నా కొడుకు, కోడలు, మనవణ్ణి వదిలి వేరే కుంపటి పెట్టి ఎలా బతకగలను’ అని బాధ పడుతుంది.ఒక వైపు పేదరికపు దీనత్వం, మరోవైపు బాంధవ్యాల దృఢత్వం... ఇవి ‘పంచాయత్ 3’ సిరీస్‌లోని ‘ఘర్’ అనే ఎపిసోడ్లో కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్‌లోని ‘అమ్మాజీ’గా నటించిన అభా శర్మ ఇప్పుడు దేశంలో చాలామందికి అభిమాన నటిగా మారింది.75 ఏళ్ల వయసులో...అభా శర్మది లక్నో. ఇప్పుడామె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె ఎర్రటి ఎండల్లో మధ్యప్రదేశ్‌లో ఔట్డోర్కు వెళ్లి షూట్ చేయడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక ఉంది. కాని మా అమ్మ పడనివ్వలేదు. నేను టీచర్‌గా పని చేస్తూ ఆ కోరికను మనసులోనే అదిమేశాను. కాని మా అమ్మ చనిపోయాక నా 47వ ఏట నటన మొదలెట్టాను. లక్నోలోని నాటక బృందాలతో నాటకాలు ఆడాను. నాకు 54 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. కాని ఇప్పుడు పంచాయత్ 3లో నేను చేసిన వేషం ప్రపంచమంతా చూసింది. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది. 75 ఏళ్ల వయసులో నేను ఇంత గుర్తింపు పొందడం చూశాక– ఎవరైనా సరే తమ కలలను చివరి వరకూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలని చె΄్పాలనిపించింది’ అని చెప్పింది అభా శర్మ.జీవితంలో సవాళ్లుతండ్రి చనిపోయాక అభా శర్మకు తల్లిని చూసుకునే బాధ్యత వచ్చింది. ఆమె కోసం అభా శర్మ వివాహం చేసుకోలేదు. కాని 35వ ఏట ఆమెకు చిగుళ్ల వ్యాధి వచ్చి పళ్లు ఊడిపోయాయి. అంటే కాలక్రమంలో కృత్రిమ పళ్లు పెట్టడానికి కూడా వీలు కాని స్థితి. సాధారణంగా స్త్రీలు ఇలాంటి స్థితిలో నలుగురి ముందుకు రావడానికి ఇష్టపడరు. కాని అభా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లిని చూసుకుంది. ఆమె మరణించాక నాటకాల్లోకి వచ్చింది. అయితే ఆమెకు శరీర అవయవాలు కంపించే అరుదైన వ్యాధి కూడా వచ్చింది. దాని వల్ల ఆమె మాట్లాడే విధానం చాలా స్లో అయిపోయింది. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ నటించాలనే పట్టుదలతో నటించి విజయం సాధించింది అభా శర్మ.పంచాయత్ అంటే...టి.వి.ఎఫ్. నిర్మాణ సంస్థ అమేజాన్ కోసం తీసిన కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికి రెండు సిరీస్‌లు ఘన విజయం సాధించి ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. భారతదేశంలోని చిన్న ఊళ్లలో మనుషుల అమాయకత్వం, వారి చిన్న చిన్న ఆకాంక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వారికి అందాల్సిన సాయాల్లో వచ్చే ఆటంకాలు... ఇవన్నీ ఈ సిరిస్‌లో సహజంగా చూపించడంతో సూపర్ హిట్ అయ్యింది. రఘవీర్ యాదవ్, నీనా గు΄్తా, జితేంద్ర కుమార్ ప్రధాన తారాగణం. -
గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్‌పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్‌షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్‌ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024 -
రాజ్‌నాథ్ సింగ్‌తో పోరుకు దిగిన నీలమ్ ఎవరు?
యూపీలోని లక్నో లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అయితే ఒకరి నామినేషన్‌పై చర్చ జరుగుతోంది. రాష్ట్రీయ ఉదయ్ పార్టీ నుంచి నీలమ్ శర్మ అనే మహిళ తన నామినేషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను బీజేపీ తరపున బరిలో దిగిన రాజ్‌నాథ్ సింగ్‌ను ఓడించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, పల్లవి పటేల్‌ల మద్దతు తమ పార్టీకి ఉందని ఆమె పేర్కొన్నారు. నీలమ్ శర్మ సామాజిక కార్యకర్తగా సేవలందించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నీలమ్ శర్మ గతంలో మేయర్ పదవికి కూడా పోటీ చేశారు.నీలమ్ శర్మ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. స్టయిలిష్ లుక్‌లో ఆమె కారు దిగగానే అక్కడున్నవారు ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె పోలీసులతో తాను లక్నో లోక్‌సభ స్థానం నుండి ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీరే నన్ను సన్మానిస్తారని ఆమె పోలీసులతో అన్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమ్ శర్మ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆమె తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని అమలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆమె నామినేషన్ చెల్లకపోవచ్చని సమాచారం. -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్‌నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్‌సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్‌నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు. ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు. సృజనతో అడుగు పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.. ’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది. అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు. 200 భవనాల జాబితా భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది. ‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్టాక్కి కన్వీనర్‌గా ఉన్నాను. లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్! 2018లో లేహ్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను. లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను. ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే. -
IPL 2024: లక్నోపై ఆర్సీబీ ఆధిపత్యం కొనసాగేనా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆర్సీబీ.. కేకేఆర్‌తో ఆడిన తమ చివరి మ్యాచ్‌లో హోం గ్రౌండ్లో పరాజయం చవిచూసింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉండగా.. లక్నో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ ఓటమితో ఆరో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ.. సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో ఓడి పంజాబ్‌పై గెలుపొందగా.. రాజస్థాన్ చేతిలో ఓడిన లక్నో.. పంజాబ్‌పై విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ఎదురెదురుపడగా.. మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ఓ మ్యాచ్‌లో లక్నో గెలుపొందాయి. ఐపీఎల్లో లక్నోపై ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. మెరుగ్గా కనిపిస్తున్న లక్నో.. అయితే ప్రస్తుత సీజన్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఆర్సీబీతో పోలిస్తే ఎల్ఎస్జీ పటిష్టంగా కనిపిస్తుంది. డికాక్, రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుశ్ బదోనిలతో కూడిన లక్నో బ్యాటింగ్ లైనప్ బలహీనమైన ఆర్సీబీ బౌలింగ్‌కు సవాలు విసురుతుంది. బౌలింగ్ విభాగంలోనూ లక్నో ఆర్సీబీ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. సంచలన పేసర్ మయాంక్ యాదవ్, నవీన్ ఉల్ హక్, మొహిసిన్ ఖాన్, రవి భిష్ణోయ్, కృనాల్‌తో లక్నో బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆర్సీబీ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఈ జట్టు పేపర్‌పై పటిష్టంగానే కనిపిస్తున్నా.. ఒక్క విరాట్ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాణించాడు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లు ఇప్పటివరకు బ్యాట్‌కు పని చెప్పలేదు. దినేశ్ కార్తీక్ ఆఖర్లో తన పాత్రను న్యాయం చేస్తున్నాడు. కోహ్లి, కార్తీక్ మినహా ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేవు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో ఆర్సీబీ చాలా పూర్‌గా ఉంది. సిరాజ్, యశ్ దయాల్, అల్జరీ జోసఫ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అత్యంత బలహీనమైనదిగా కనిపిస్తుంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. -
భార్యాపిల్లలను చంపి బ్యాగులో కుక్కిన భర్త.. విస్తుపోయే విషయం వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆదివారం(మార్చ్ 30) దారుణ ఘటన వెలుగు చూసింది. లక్నోలోని సర్వన్ నగర్లో నివాసం ఉంటున్న రామ్ లఖన్ తన భార్య ఇద్దరు పిల్లలను చంపి బ్యాగులో కుక్కి వారి మృతదేహాలను రెండు రోజుల పాటు వారి ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యల విషయం బయటపడింది. భార్యకు స్కార్ఫ్‌తో ఉరివేసి చంపి అనంతరం నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను రామ్‌లఖన్ హత్య చేశాడు. హత్యల తర్వాత రామ్‌లఖన్ పారిపోయాడు. సెల్‌ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే రామ్ లఖన్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య పిల్లలు తన పక్కనే నిద్రిస్తున్నారని అనుకోవడం కోసమే వారి మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకున్నానని రామ్‌లఖన్ విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. ఇదీ చదవండి.. ప్రాణం తీసిన బర్త్ డే కేక్ -
Mukhtar Ansari: అన్సారీపై విష ప్రయోగం?
లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్ తెలిపారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది. అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్తార్ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి జైలులో ముఖ్తార్ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదిక స్పందించారు. ‘ ముఖ్తార్ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 -
యాక్షన్ బచ్చన్
లక్నోలో ఫైట్స్ చేస్తున్నాడు మిస్టర్ బచ్చన్ . హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ లక్నోలోప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ జరుగుతోంది. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. -
అక్కడ మే 17 వరకు 144 సెక్షన్.. ఎందుకంటే..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మే 17 వరకు లక్నోలో 144 సెక్షన్ విధించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, హోలీ, రంజాన్‌తో సహా ముఖ్యమైన, మతపరమైన పండుగల దృష్ట్యా లక్నో నగరంలో 144 సెక్షన్ విధించినట్లు లా అండ్ ఆర్డర్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ తెలియజేశారు. లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి ఐదో దశలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. పోలీసుల నిషేదాజ్ఞల ప్రకారం.. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటానికి వీల్లేదు. పాదయాత్రలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడంపై నిషేధం. అలాగే లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ బ్యాండ్ల వినియోంగంపై నిషేధం ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా సామాజిక కార్యక్రమాలు, నిరసనలు లేదా నిరాహార దీక్షలు చేపట్టడానికి అనుమతి లేదు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రాపై బీజేపీ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. రాజ్‌నాథ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1991 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. -
మరో ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్‌ను ఇంకా విడుదల చేయలేదు. పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది. -
యూపీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం!
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లక్నో జిల్లా, కకోరిలో గల హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో మంగళవారం అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఇంతలో ఇంటిలోని సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒక జంటతో సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. హతా హజ్రత్ సాహెబ్ నివాసి ముషీర్ అలీ (50) జర్దోసీ పనితో పాటు పటాకుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఆయన ఇంటి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంతలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేంతలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ముషీర్, అతని భార్య హుస్నా బానో (45), వారి బంధువుల పిల్లలు రాయ (5), హిబా (2), హుమా (3) మంటల్లో సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బనోయి అజ్మత్ (30), అనమ్ (17)ఇన్షా (16), లకబ్ (18)లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
దిగ్గజ భారత చెఫ్ ఖురేషి అస్తమయం
న్యూఢిల్లీ: మొగలుల కాలంనాటి దమ్ పుఖ్త్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం ఇంతియాజ్ ఖురేషి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలి పోకుండా పిండి ముద్దను చుట్టే (ధమ్ ఫుఖ్త్) టెక్నిక్‌ను ప్రాచుర్యంలోకి తెచి్చన ఘనత ఆయనదే. ప్రాచీన అవధ్ వంటకాలనూ ఆయన కొత్త తరహాలో సృష్టించారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్‌లో చేరి ప్రధాన చెఫ్ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు తన వంటకాలు రుచు చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ పొందారు. ఈ అవార్డ్ అందుకున్న తొలి పాకశాస్త్ర ప్రవీణుడు ఖురేషీనే. -
జైలులో హెచ్ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే -
ఉద్యోగాల కోసం పూర్వ విద్యార్థుల సమ్మేళనమా?
మాములుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. ఎప్పుడో చిన్నప్పడూ కలిసి చదువుకున్న స్నేహితులంతా చాలా ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకుని భావోద్వేగం చెందుతారు. ఇది సహజం. పైగా చిన్ననాటి స్నేహితులు కావడంతో ఎవ్వరీ ముఖాలు ఎవ్వరూ గుర్తు పట్టాలేనంతగా మార్పు చెందుతాయి. పైగా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి పెద్ద పొజిషన్లో ఉండేవారు కొందరైతే, చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్లు మరికొందరూ. అదీగాక మన బ్యాచ్‌లో ఇంత గొప్పగా సెటిల్ అయినవాళ్లు కూడా ఉన్నారా? అని గొప్పగా ఫీలైపోతుంటాం కూడా. అలాంటి ఆత్మీయ సమ్మేళనం లక్నోలో ఎందుకోసం జరిగిందో వింటే షాకవ్వుతారు. వివరాల్లోకెళ్తే..ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, లక్నో (ఐఐఎం-ఎల్)లో 2011 బ్యాచ్‌కి చెందిన విద్యార్థుల పూర్వ సమ్మేళన సందేశం చాలా వింతంగా ఉంది. వారంతా కలుసుకుందామంటూ వాట్సాప్‌కి పంపించిన ఓ సందేశాన్ని లక్నోకి చెందిన పూర్వ విద్యార్థి రవి హండా నెట్టింట షేర్ చేశారు. నిజానికి ఐఐఎం లాంటి సంస్థల్లో కచ్చితంగా నూటికి నూరుశాతం ప్లేస్మెంట్ సంపాదించుకోగలరు విద్యార్థులు. కనీసం బయట ఎక్కడైనా కూడా ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుంది వానికి. ఎందుకంటే అవి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లు, పైగా అందులో చదివారంటే చాలు వెంటనే కంపెనీలు కళ్లకు అద్దుకుని మరీ తీసేసుకుంటాయనేది అందరి నమ్మకం. అలాంటిది లక్నో ఐఏఎంకి చెందిన 2011 బ్యాచ్‌లో దాదాపు 72 మందికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మన పూర్వ విద్యార్థులంతా ప్లేస్మెంట్లు కనుగొనేందుకైనా ఒక్కసారి కలుద్దాం అంటూ వాట్సాప్ మెసేజ్‌లు పెట్టుకున్నారు. పైగా 2024 బ్యాచ్‌మేట్స్‌కు తెలిసిన నెట్వర్క్ పరిధిలో ఏదైనా రిక్రూట్మెంట్స్ ఉంటే కనక్కుందామని కూడా ఆ సందేశంలో ఉంది. 2011 బ్యాచ్‌లోని 72 మంది ప్లేస్మెంట్లు కనుగునడం కోసం అంతా ఒకచోట చేరాలనేది ఆ సందేశం సారాంశం. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్‌గా మారింది. పైగా ఈ సందేశం ఒక్కసారిగా అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కో తీరులో స్పందించారు. ప్రస్తుతం బీ స్కూళ్ల పరిస్థితి ఇలా ఉందని ఒకరు కామెంట్ చేయగా, మరొకరూ మన అభివృద్ధి ఇలా ఉందంటూ ఆర్థిక వ్యవస్థను నిందించారు. అంతేగాదు నిరుద్యోగం ఎలా ఉందనేందుకు అద్దం పడుతుందంటూ కామెంట్ చేశారు. ఏదీఏమైనా ఉన్నత ఉద్యోగాల కోసం అయినా పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనం అవ్వుదామనడం అందర్నీ ఒక్కసారిగా కలవరిపర్చిందన చెప్పాలి. ఎందుకంటే బయట మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనేందుకు ఇదే నిదర్శనం. ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీలో ప్రతీ క్షణం పోటీ పడుతూ అప్డేట్ కాకపోతే త్వరగా సెటిల్ అవ్వడం అన్నది కష్టమని చెప్పకనే చెబుతోంది ఈ ఘటన. IIM Lucknow is reaching out to alumni to help them with placements. It is “crucial to maintain the legacy of IIM Lucknow’s 100% placement record”. It isn’t about 5-10 people but 72 candidates at IIM-L do not have a job. Imagine the status at other B-schools. pic.twitter.com/uYaTCmY3h7 — Ravi Handa (@ravihanda) January 31, 2024 (చదవండి: చింతపల్లికి వందేళ్లుగా వస్తున్న ఆ అతిధుల జాడేది..! రెండేళ్లుగా కనిపించని..) -
రైలు ప్రయాణికుడిని చితకబాదిన టీటీ.. వీడియో వైరల్
లక్నో: రైలు ప్రయాణికుడి పట్ల ఓ టీటీ రెచ్చిపోయాడు. విచక్షణ మర్చిపోయి అతడిని దారుణంగా చితకబాదాడు. వారి మధ్య ఏదో వైరం ఉన్నట్టుగా బాధితుడిని కొట్టాడు. ఇక, దీన్నింతా తోటి ప్రయాణికుడు వీడియో తీస్తుండగా అతడితో కూడా వాగ్వాదానికి దిగాడు. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ సదరు టీటీని సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం.. బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్ రైలులో టీటీ రెచ్చిపోయాడు. రైలు ప్రయాణికుడిపై టీటీ భౌతిక దాడికి దిగాడు. రైలులో 25 ఏళ్ల యువకుడు టికెట్‌తో రైలు నంబరు-15203లో ముజఫర్‌పూర్ నుంచి లక్నోకు ప్రయాణిస్తుండగా టీటీ దాడికి దిగాడు. ప్రయాణికుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అసలు ఎందుకు దాడి చేశాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా, ప్రయాణికుడు నీరజ్ కుమార్ టికెట్ కూడా తీసుకోవడం గమనార్హం. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, టీటీ చర్యపై నెటిజన్లతో సహా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లక్నో డివిజన్ డీఆర్ఎం టీటీని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. This video is said to be of Train number 15203 - Barauni Lucknow Express. You can see the ruthless TT is assaulting the poor passenger without any reason. The victim was repeatedly asking what’s his fault but the TT kept on beating him. .@AshwiniVaishnaw, please take immediate… pic.twitter.com/XKNiQhVqiT — Mahua Moitra Fans (@MahuaMoitraFans) January 18, 2024 -
‘సమాజ్‌వాది’ వస్తే.. సీఎంగా డింపుల్ యాదవ్?
యూపీలోని లక్నోలో గల సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర వెలసిన ఒక పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్‌ను యూపీకికి కాబోయే ముఖ్యమంత్రిగా చూపించారు. ఇంతేకాదు ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్ ఫొటోను అఖిలేష్ యాదవ్ కంటే పెద్దదిగా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ వెనుక కథనం అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర తరచూ పోస్టర్లు కనిపించడం సాధారణమే. అయితే తాజాగా వెలసిన డింపుల్ యాదవ్‌కు సంబంధించిన పోస్టర్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ హోర్డింగ్‌ను ఎస్పీ నేత అబ్దుల్ అజీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, డింపుల్ యాదవ్‌ను యూపీకి కాబోయే కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. జనవరి 15న డింపుల్ యాదవ్ పుట్టినరోజు. దీనికి ముందుగానే పార్టీ కార్యాలయం ముందు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అనేక అర్థాలకు అవకాశమిస్తోంది. దీనిని చూసిన కొందరు ఇకపై అఖిలేష్ యాదవ్ దేశరాజకీయాలపై దృష్టిపెడతారని, అతని స్థానంలో డింపుల్ యాదవ్ యూపీ బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుండగా అఖిలేష్ యాదవ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కన్నౌజ్, అజంగఢ్ లోక్‌సభ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
దేశంలో తొలి ఏఐ సిటీగా లక్నో
దేశంలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అభివృద్ధి చెందనుంది. లక్నోలోని నాదర్‌గంజ్ ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ అభివృద్ధి ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ అందింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీసీఎల్) ఏఐ సిటీ ప్రణాళిక అమలు ప్రక్రియను ప్రారంభించింది. యూపీసీఎల్.. నగర రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ కోసం ‘యూపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ (యూపీఈఎంపీ)’ కింద ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీలు, ఏజెన్సీల నుండి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కారణంగా ఐటీ కంపెనీలకు గ్రేడ్-ఏ సర్టిఫైడ్ కమర్షియల్ స్పేస్, అత్యాధునిక డేటా సెంటర్లు, గ్రేడ్-ఏ ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్, టెక్ ల్యాబ్‌ల నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. అలాగే ఈ సిటీలో నివాస సముదాయాలు, వినోద ప్రదేశాలు, వాణిజ్య స్థలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఐటి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్.. లక్నోలో అవసరమైన భూములను గుర్తించింది. ఇవి నాదర్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియాకు సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతం లక్నో అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్నో-కాన్పూర్ హైవేకి సమీపంలో ఈ ప్రాంతం ఉంది. ఇది కూడా చదవండి: అమెరికాలోనూ.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు! -
మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్ ఆనంద్
లక్నో: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి తన రాజకీయ వారుసుడిని ప్రకటించారు. ఆదివారం లక్నోలో బీఎస్పీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మినహా మిగతా దేశంలో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని ప్రకటించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్, ఫలితాలపై చర్చించారు. అదే విధంగా 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆకాశ్ ఆనంద్.. మాయావతి పాత్ర పోషించనున్నారు. గత ఏడాడి నుంచి ఆకాశ్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాయావతి చిన్న తమ్ముడి కుమారుడు. 2016లో పార్టీలో జాయన్ అయిన ఆనంద్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీలో స్టార్ క్యాంపేయినర్‌గా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 2022లో ఆయన రాజస్థాన్‌లోని అల్వార్‌లో 13 కిలో మీటర్ల ‘స్వాభిమాన్ సంకల్ప్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేశారు. 2018 రాజస్థాన్‌లో బీఎస్పీ గెలుచుకున్న 6 సీట్ల విజయం వెనకాల ఆనంద్.. కీలకమని పోల్ క్యాంపేయినింగ్ వ్యూహాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్! -
'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది!
లక్నో: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకు విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. విష్ణువు అనేక పేర్లలో ఏకనా ఒకటి. ఆ తర్వాత యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును ఖరారు చేశారు. అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. ఇందులో ఆసిస్ 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత జట్టు క్రిడాకారులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్‌కు హాజరైన ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే.. -
సుబ్రతారాయ్ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్, లక్నోలోని బైకుంత్ ధామ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన ఇరువురు కుమారులో అందుబాటులో లేకపోవడంతో సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గంగా నది ఒడ్డున యనవడు హిమాంక్ ఆయన చితికి నిప్పింటించారు. రాయ్ కుమారులు, సుశాంతో, శ్రీమంతోలు విదేశాల్లో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారని సన్నిహిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లండన్‌లో చదువుకుంటున్న హిమాంక్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. సుబ్రతా రాయ్ చిన్న కుమారు శ్రీమంతో పెద్ద కుమారుడు హిమాంక్ రాయ్ లండన్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. సుబ్రతా రాయ్ భార్య స్వప్న, అతని మేనకోడలు ప్రియాంక సర్కార్,ఇతరకుటుంబ సభ్యుల బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుకున్నారు. అటు రాయ్ మృతదేహాన్ని కూడా కూడా చార్టర్ విమానంలో లక్నోకు తరలించారు. సహారా సుబ్రతాకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు రాయ్‌కు కడసారి నివాళులర్పించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు ఆరాధన మిశ్రా మోనా, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, అమ్మర్ రిజ్వీ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు, మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్, యూపీ మంత్రి నితిన్ అగర్వాల్, స్మితా ఠాక్రే, బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, సున్నీ మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తదిరులు ఆయనను కడసారి దర్శించుకున్నారు. అలాగే కంపెనీకి చెందిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆయన అధికారిక నివాసానికి తరలి వచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్ సహారాజీ అంటూ నినదించారు. #WATCH | Lucknow, Uttar Pradesh: On Sahara Group Chairman Subrata Roy's demise, singer Sonu Nigam says, "Since 1997, I and Subrata Roy have had an association. I have spent a very good time with him. He is like my brother, father, and friend..." pic.twitter.com/vYYnNeICC2 — ANI (@ANI) November 16, 2023 VIDEO | Sahara group founder and chairman Subrata Roy‘s mortal remains being taken for the last rites ceremony at Sahara City in Lucknow. pic.twitter.com/QEngVKsEfS — Press Trust of India (@PTI_News) November 16, 2023 -
Khushi Pandey: ఖుషీతో దిల్ ఖుష్
చిన్నతనంలో తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారికి నొప్పి తెలియకుండా ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు. అయితే లక్నోకు చెందిన ఖుషీ అందుకు భిన్నం. తన తండ్రిలా మరెవరూ కష్టపడకూడదని తానే ఓ సామాజిక కార్యకర్తగా మారి సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఖుషీ పాండే. లక్నోకు చెందిన 23 ఏళ్ల ఖుషీ పాండే బాల్యం ఉన్నావ్ అనే ఊళ్లో గడిచింది. తన తండ్రి నుంచి చిన్ననాటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఖుషీ తండ్రికి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ పెన్సిల్ కొనే స్థోమత కూడా లేదప్పుడు. ఈ విషయం తెలుసుకుని,∙నాన్నలా మరెవరూ చదువుకోసం ఇబ్బంది పడకూడదు అనుకుంది. నిరుపేదలకు సాయం చేయాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. ఖుషీ పెద్దయ్యేసరికి నాన్న వాళ్ల లక్నోకి మకాం మార్చారు. అక్కడ ఓ షాపులో పనిచేస్తూ తరువాత కాంట్రాక్టర్‌గా మారారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా రావడంతో ఖుషీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో ఖుషీ ‘లా’ పూర్తయ్యాక, సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. చదువు పూర్తయ్యాక వెంటనే నిరుపేదలకు చదువు చెప్పడం ప్రారంభించింది. మురికివాడల్లోని పిల్లలను ఒక చెట్టుకింద కూర్చోబెట్టి సాయంత్రం రెండుమూడు గంటలు చదువు చెప్పేది. రోజుకి యాభై మంది వరకు ఖుషీ క్లాసులకు హాజరయ్యేవారు. తన దగ్గరకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తోంది. తాతయ్య మరణంతో... అది 2020 ... ఒకరోజు రాత్రి ఖుషీ వాళ్ల తాతయ్య షాపు నుంచి తిరిగి వస్తున్నారు. చీకట్లో సరిగా కనిపించక ఎదురుగా వచ్చే కారు తాతయ్య సైకిల్ని ఢీ కొట్టడంతో ఖుషీ తాతగారు అక్కడికక్కడే చనిపోయారు. తాతయ్యను ఎంతో ఇష్టపడే ఖుషీ ఈ చేదు సంఘటనను తట్టుకోలేకపోయింది. సైకిల్‌కు లైట్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనుకుని ప్రతి సైకిల్‌కు లైటు ఉండాలాని భావించింది. రోజూ కూలి పనిచేసుకునేవారు తమ సైకిళ్లకు లైట్లు పెట్టుకోవడానికి తగ్గ స్థోమత ఉండేది కాదు. దాంతో వాళ్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల ఖరీదు చేసే లైట్లను ఉచితంగా పంచింది. ఇలా ఇప్పటిదాకా 1500 మంది వాహనాలకు బ్యాటరీతో నడిచే లైట్లను అమర్చింది. లైట్లు అమర్చడానికి ‘ఇన్స్టాల్ లైట్స్ ఆన్ బైస్కిల్’ అని రాసిన ఉన్న ప్లకార్డు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఎంతోమందికి అవగాహన కల్పించింది. అప్పట్లో ఖుషీ చేసిన ఈ పనిని ఓ ఐఏఎస్ అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఎనభైమంది యువకులు ఖుషీతో కలిసి సైకిళ్లు, ట్రక్కులకు, ఇతర వాహనాలకు లైట్లు అమర్చడంలో ఖుషీకి సాయంగా నిలిచారు. పాఠాలతో పైసలు సంపాదించి... ఖుషీ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు నిధులు చాలా కావాలి. ఇందుకు తన తండ్రి, బంధువులు సమకూర్చిన మొత్తం ఏమాత్రం సరిపోలేదు. దాంతో యూట్యూబ్‌లో ‘లా’ తరగతులు చెప్పడంతోపాటు, ఇతర పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ్త నెలకు అరవై నుంచి డెబ్భై వేల వరకు సంపాదించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలకు అండగా... బాలికలకు శానిటరీ ప్యాడ్ ల గురించి అవగాహన కల్పించడం, విద్యుత్ సదుపాయం లేని వారికి సోలర్ ల్యాంప్స్ అందించడం, ‘జీవిక సాథీ’ ప్రాజెక్టు పేరుతో దివ్యాంగ మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు కుట్టుమిషన్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. -
ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత
లక్నో: వైద్య సదుపాయాల కొరతతో సాధారణ పౌరులకే కాదు ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేటు హాస్పిటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మౌలిక సదుపాయలు లేమి కారణంగా మాజీ ఎంపీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రిలో సరిపడా బెడ్స్ అందుబాటులో లేక, సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లోక్ సభ మాజీ ఎంపీ కుమారుడు మరణించాడు. లక్నోలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బీజేపీ మాజీ ఎంపీ భైరోన్ ప్రసాద్ మిశ్రా కొడుకు ప్రకాష్ మిశ్రా(41) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి 11 గంటలకు లక్నోలోని ఎస్‌పీజీఐ ఆసుప్రతి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. అయితే చికిత్స పొదుంతూ ప్రకాశ్ మిశ్రా మృతిచెందారు. కొడుకు మరణంతో కుంగిపోయిన ప్రసాద్ మిశ్రా.. ఆసుపత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో సరిపడ బెడ్స్ లేకపోవడమే కొడుకు మరణానికి కారణమని ఆయన ఆరోపించారు. అత్యవసర వైద్యాధికారి సైతం రోగిని కాపాడేందుకు ప్రయత్నించకుండా అలాగే ఉండిపోయారని విమర్శించారు. ఈ క్రమంలోనే కాసేపటికి తన కుమారుడు మరణించాడని మాజీ ఎంపీ పేర్కొన్నారు. చదవండి: అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం! కొడుకు మృతదేహంతో ఆసుప్రతి ఎమర్జెన్సీవార్డు వెలువల మిశ్రా ఆందోళన చేపట్టారు. తన కొడుకు చావుకు కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేసి తదుపరి విచారణ చేపట్టేవరకు తన నిరసన కొనసాగుతుందని తెలిపారు. ‘నేను నా కుమారుడిని కోల్పోయాను. ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా డ్యూటీ చేయడం లేదని నిరసనకు దిగాను. నేను నిరసన చేస్తున్నప్పుడు.. చాలా మంది వచ్చి, ఆ డాక్టర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలి,’ అని ప్రసాద్ మిశ్రా తెలిపారు. దీనిపై స్పందింంచిన ఆసుపత్రి యాజమాన్యం విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప ్రస్తుతం డాక్టర్‌ను సస్పెండ్ చేశామని ఆసుపత్రి చీఫ్ ఆరేకే ధీమాన్ తెలిపారు. కాగా కాగా మిశ్రా గతంలో బండా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎస్పీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఇది ఆసుపత్రి వైఫల్యం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఫల్యమని మండిపడ్డారు.. ఆసుపత్రులకు బడ్జెట్ ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రసాద్ మౌర్య.. మిశ్రా ఇంటికి వెళ్లి, ఆయన్ని పరామర్శించారు.కమిటీ వేసినట్టు, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
WC 2023: అద్భుతం చేశారు.. మా బ్యాటింగ్ బాలేదు.. ఇదంతా వాళ్ల వల్లే: రోహిత్ శర్మ
WC 2023- Ind vs Eng- Rohit Sharma Comments: ‘‘కఠిన పరిస్థితులు ఎదురైనపుడల్లా అనుభవజ్ఞులైన మా ఆటగాళ్లంతా సమష్టిగా పోరాడి జట్టును గెలిపించడంలో ముందుంటారు. ఈ మ్యాచ్‌తో ఆ విషయం మరోమారు రుజువైంది. పట్టుదలగా పోరాడి జట్టుకు విజయం అందించారు. టోర్నీ ఆరంభం నుంచి తొలి ఐదు మ్యాచ్‌లలో మేము సెకండ్ బ్యాటింగ్ చేశాం. కానీ ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. నిజానికి ఇంగ్లండ్ ఈరోజు అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈ పిచ్‌పై మేము ఈమాత్రం స్కోరు చేయగలిగాం’’ మా బ్యాటింగ్ బాలేదు ‘‘మా బ్యాటింగ్ ఈరోజు మరీ అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితుల్లో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పడంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మేము అది చేసి చూపించాం. అయితే, నాతో సహా అంతా ఆఖరి వరకు ఇంకాస్త పోరాడాల్సింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇంకో 30 పరుగులు చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా ఆట మొదలైన కాసేపటికే రెండు కీలక వికెట్లు కోల్పోయి కూడా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలగడం మాకు సానుకూలాంశం. ఈరోజు మా పేసర్లు నిజంగా అద్భుతం చేశారు’’ బంతి బాగా స్వింగ్ అయింది ‘‘నామమాత్రపు స్కోరుకు పరిమితమైన వేళ వాళ్లపైనే పూర్తి భారం పడినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు రాబట్టడంలో సఫలమయ్యారు. బంతి బాగా స్వింగ్ అయింది’’ బ్యాటర్లు రాణించడం ముఖ్యం ‘‘ఈ పరిస్థితులను తమకు పూర్తి అనుకూలంగా మార్చుకున్న మా బౌలర్లు బంతి ఎక్కడ పడుతుందో కూడా తెలియకుండా బ్యాటర్లను తికమకపెట్టారు. మా జట్టులో మెరుగైన స్పిన్నర్లు, సీమర్లు ఉన్నారు. ఇలాంటి పిచ్‌లపై ఆడిన అనుభవం వాళ్లందరికీ ఉంది. అయితే బ్యాటర్లు రాణించి మెరుగైన స్కోరు సాధించడం అన్నిటికంటే ముఖ్యం. అలాంటపుడు వాళ్లపై కాస్త ఒత్తిడి తగ్గి మరిన్ని అద్భుతాలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారన్న హిట్‌మ్యాన్.. తక్కువ స్కోరును డిఫెండ్ చేయడంలో తమ బౌలర్లు సఫలమయ్యారని ప్రశంసించాడు. అజేయంగా ఆరు విజయాలతో కాగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ప్రపంచకప్-2023లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆరంభం నుంచీ ఓటమన్నదే లేని రోహిత్ సేన ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(9), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(4) పూర్తిగా నిరాశ పరచగా.. రాహుల్(39)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌కు జతై 49 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది టీమిండియా. టీమిండియా పేసర్లు అదుర్స్ అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ షమీ 4 వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు. వీరి విజృంభణతో 129 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో టీమిండియా మరోసారి జయభేరి మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(87) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: విరాట్ కోహ్లి డకౌట్.. ఈజీ క్యాచ్ ఇచ్చి! ఇదే తొలిసారి! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..?
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌పై సోషల్‌మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు మ్యాచ్ జరుగుతున్న వైనాన్ని పక్కన పెట్టి బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్‌కు వేదిక అయిన అటల్ బిహారీ స్టేడియం నిర్వహణ తీరు పంట పొలాల కంటే అధ్వానంగా ఉందంటూ దుయ్యబడుతున్నారు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా రోహిత్ శర్మ క్యాచ్ పడుతూ లివింగ్‌స్టోన్ గాయపడిన తీరును ట్రెండ్ చేస్తూ బీసీసీఐని ఎండగడుతున్నారు. ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కఠినమైన పిచ్‌పై అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ క్యాచ్ అందుకునే క్రమంలో లివింగ్‌స్టోన్ కిందపడి గాయపడ్డాడు. లివింగ్‌స్టోన్ ఆ రీతిలో గాయపడటానికి మైదానంలోని పచ్చిక కారణం కావడమే బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. లివింగ్‌స్టోన్ కిందపడ్డ సమయంలో మైదానంలోని ఆ ప్రాంత పరిస్థితి పంట పొలాలను తలపించడంతో మన క్రికెటర్లు అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..? అంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ధర్మశాల వేదికగా జరిగిన బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయని గుర్తు చేస్తున్నారు. ఆ మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘన్ ఆటగాడు ముజీబ్ బౌండరీ ఆపే ప్రయత్నంలో మైదానంలోని పచ్చిక కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో ఆ గ్రౌండ్ నిర్వహణపై పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మశాల స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు పనికిరాదని బహిరంగ ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్‌స్టో (14), మలాన్ (16), రూట్ (0), స్టోక్స్ (0) ఔట్ కాగా.. బట్లర్ (5), మొయిన్ అలీ (4) క్రీజ్‌లో ఉన్నారు. బుమ్రా, షమీ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్! రోహిత్‌కు గాయం!
ICC ODI WC 2023- Rohit Sharma Injured?: వన్డే వరల్డ్‌కప్-2023లో డబుల్ హ్యాట్రిక్ విజయంపై విజయంపై కన్నేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ! కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. దీంతో అతడు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఐసీసీ టోర్నీలో ఇప్పటికే ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించిన టీమిండియా సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో ఆదివారం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. లక్నోలోని ఏక్నా స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి. కెప్టెన్‌గా రోహిత్‌కు వందో మ్యాచ్ ఇక విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా సారథిగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది వందవ మ్యాచ్. అయితే, ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ దూరమయ్యే పరిస్థితి వచ్చిందంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. మణికట్టుకు గాయం! ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు లక్నోలో శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా రోహిత్ మణికట్టుకు స్వల్ప గాయమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చే యోచనలో వార్తలు వినిపిస్తున్నాయి. మున్ముందు కీలక మ్యాచ్‌లు ఉన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బరిలోకి దిగుతాడు! ఈ క్రమంలో.. ఇప్పటికే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో దూరమైన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్ ఉంది. అదే విధంగా రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ శుబ్‌మన్ గిల్‌కు జోడీగా ఓపెనింగ్‌కు వస్తాడు. అయితే, గాయం చిన్నదే కావడంతో రోహిత్ శర్మ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా రోహిత్ గాయం గురించి బీసీసీఐ నుంచి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. చదవండి: హార్దిక్ వచ్చేంత వరకు అతడే.. ఇంగ్లండ్ డేంజరస్ టీమ్! కాబట్టి మేము.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ప్రపంచకప్ లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం
-
వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!
ప్రభుత్వం నన్ను విచారణాధికారిగా నియమించింది. నా కమిటీలో సభ్యులుగా ఒక ఎస్పీ, ఒక మహిళా డిఎస్పీ కూడా వున్నారు. ఆమె పేరు సౌమ్య. ముగ్గురం కారులో బయల్దేరాం. లక్నో నుంచి ఆరు గంటల ప్రయాణం. అది చిత్రకూట్ జిల్లా. దాని ముఖ్యాలయం కర్వీ. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. అల్పాహారం తీసుకొని, ఉదయం తొమ్మిది గంటలకు బయల్దేరాం. మాకు మార్గం చూపించేందుకు ఒక ఎస్సైను పైలెట్‌గా పెట్టారు. ఎటు చూసినా కొండలు. వింధ్యాచల పర్వతాలు. పచ్చటి చీర కట్టుకున్న కొండల మేనిపై సూర్యోదయ కిరణాలు మరింత తళతళలాడుతున్నాయి. రాళ్ళూ రప్పలతో ఎప్పుడూ ఎండిపోయిన ముఖంతో దీనంగా వుండే బుందేల్‌ఖండ్ నేల.. పచ్చని పొలాలతో, చెట్లతో యవ్వన చైతన్యంతో వెలుగుతోంది. ఆ ప్రకృతిని చూస్తుంటే, చాన్నాళ్ల నా కళ్ల ఆకలి తీరిపోయిందనిపించింది. కారు నత్తనడక నడుస్తోంది. డ్రైవర్ తప్పు కాదు. రోడ్డు లోపం అంతకన్నా కాదు. అన్నా ఆవుల వల్ల. వందల కొలది ఆవులు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటాయి. పాలివ్వని ఆవుల్ని యిలా గాలికి వదిలేస్తారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించే ముఖచిత్రం యిది. అన్నా ఆవులు, నీలి ఆవులు కలిసి పంటల్ని నాశనం చేస్తుంటాయి. రైతులు తమ కన్నీళ్లను కడుపులోనే దాచుకుంటున్నారు. మా కారు కొండల పాదాల వద్ద వున్న గుడిసెలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగింది. అక్కడి నుండి నడక. అక్కడ సుమారు వంద గుడిసెలు. మట్టితో కట్టినవి. విద్యుత్తు లేని వూరులుంటాయా అన్న అనుమానం రాకుండా అవి సాక్ష్యంగా నిలబడ్డాయి. శ్రీశ్రీ వర్ణించిన ‘భిక్షు వర్షీయసి’ ని గుర్తు చేస్తున్నట్లున్నాయి ఆ గుడిసెలు. నడుచుకుంటూ ఆ వూరి మధ్యలోంచి వెళ్తున్నాం. ఇళ్ల చూర్ల మధ్య ముఖాలు పెట్టి, మమ్మల్ని చూస్తున్నారు జనం. ఒకరిద్దరిని పిలిచి హిందీలో అడిగాం. ‘ఇవాళ పనిలోకి వెళ్ళలేదా?’ అని. ‘పని లేదు సాబ్ ’ హిందీలోనే నిర్లిప్త సమాధానం. పోలీసుల్ని చూసి వాళ్ళ కళ్లు భయపడలేదు. ఇందరు అధికారులు ఆ గుడిసెల దగ్గరకి ఎందుకు వచ్చారన్న ఆశ్చర్యం లేదు. నాకు ఆశ్చర్యమనిపించింది. ఏ హావభావాలు లేని వాళ్ళ పెదాలు చూసి. దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఘటన. విభిన్న విచారణ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘటన. అగ్ని పర్వతం పుట్టిన చోటును వీసమంతయినా కదపలేకపోయింది. వచ్చిన పని వెదుక్కుంటూ బాధితురాలు బబ్లీ ఇంటికి చేరాం. పన్నెండేళ్ల బాలికను తీసుకొని, వాళ్లమ్మ బయటకొచ్చింది. తల్లి కొంగు చాటున అమాయకంగా నిలబడింది. ఎటు చూసినా పేదరికం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మా కమిటీ సభ్యురాలు సౌమ్య ఆమెను వివరాలు అడుగుతున్నది. అన్నింటికీ వాళ్ళమ్మే సమాధానం చెబుతోంది. పని వెదుక్కుంటూ మీర్జాపూర్ జిల్లా నుండి ముప్పై ఏళ్ల క్రితం వలస వచ్చారట. వాళ్లందరికీ గుడిసెలు కట్టుకోవడానికి ఒక భూస్వామి మూడెకరాల పొలాన్ని కేటాయించాడట. ఒకరి తర్వాత ఒకరు చేరి, ఇప్పటికి వంద కుటుంబాలయ్యాయి. గత పదేళ్లలో ఇసుక తవ్వకాల పనులు బాగా ఎక్కువయ్యాయని చెప్పింది. అందులో కూలీ పని నిత్యం వుంటుందని చెప్పింది. ‘ఈ చిన్న పిల్లలు కూడా కూలి పనికి వస్తారా?’ అడిగాం. లేదు. వీళ్ళు ఇంటి దగ్గరే వుండి, వంట చేస్తారు.’ ‘వీళ్ళు ఇసుక పని దగ్గరకు అస్సలు రారా?’ ‘అప్పుడప్పుడు భోజనం తీసుకుని వస్తారు.’ ‘అంటే, రోజూ మీరు వెళ్ళేప్పుడే భోజనం తీసుకెళ్తారా?’‘అవును.’‘గుత్తేదారు జీతం యివ్వడానికి యిబ్బంది పెడతాడా?’‘ లేదు. ప్రతి సోమవారం పేమెంట్ చేస్తారు. ’‘ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఒక్కటే జీతమా?’‘ రోజుకి ఆడవాళ్ళకి రెండొందలు. మగవాళ్లకు మూడొందలు.’ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు అక్కడ పోగయ్యారు. ఆసక్తిగా వింటున్నారు. ‘ఎక్కువ జీతం ఎర చూపి, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ఎప్పుడైనా ప్రవర్తించారా?’ ‘లేదు సాబ్. అలాంటిదెప్పుడూ లేదు. పనిలో మేమందరం కలిసే వుంటాం. కలిసే వస్తాం’ అంది మరొక ఆమె. ‘ఈమెవరు?’ అని అడిగాను. ‘గుడియా వాళ్ళమ్మ’ అని బదులిచ్చింది మరొకామె. మేం దర్యాప్తు చేస్తున్న మరొక బాధితురాలు గుడియా. మహిళా అధికారి.. బబ్లీని దగ్గరకు పిలిచింది. బిక్కు బిక్కుమంటూ వచ్చింది. భోజ్‌పురిలో అడగడం మొదలు పెట్టింది. ‘ఎవరికీ భయపడనక్కర లేదు. జరిగింది జరిగినట్లు చెప్పమ్మా!’ మౌనంగా నిలుచుంది. ఏ ప్రశ్న లేని వుత్తరంలా వుంది ఆమె ముఖం. ‘మేమున్నాం. నీకే భయం లేదు. గుత్తేదారు నిన్నేం చేశాడో చెప్పు.’ ‘కుచ్∙నహీ కియా’ నూతిలో నుండి ఒడ్డుకు వచ్చినట్లుగా, ఆమె పెదాలను దాటి వచ్చింది ఆ మాట. మహిళా అధికారి మరింత సౌమ్యాన్ని ప్రదర్శించింది. ‘చెప్పమ్మా. ఆ రాక్షసుడు నీ చెయ్యి పట్టుకు లాగాడా?’‘ నహీ.. కుఛ్∙నహీ హువా.’ అదే వ్యక్తీకరణ. ‘గుత్తేదారిని ఎప్పుడన్నా చూశావా?’ ‘నహీ’ ‘నువ్వు ఆ ఇసుక తవ్వకం పని చేశావా?’ ‘నహీ.’ ‘నిన్ను గుత్తేదారు మనుషులెవరన్నా రమ్మన్నారా?’ ‘నహీ’ ‘మరి నువ్వు ఏం చేస్తావు?’ ‘ఖానా బనాతీ హూ’ ‘చదువుకున్నావా?‘ ‘నహీ’‘టీవీ వాళ్లకు అలా ఎందుకు చెప్పావు?’ ‘పైసా కే లియే’‘అలా చెబితే డబ్బులు యిస్తానన్నారా?’ ‘హా!’ అక్కడ నుండి బబ్లీ వాళ్లమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ‘ఈ వూరిలో చదువుకున్నవాళ్ళెవరైనా వున్నారా?’ అని అడిగాం. ‘ఆ! యిదిగో ఈ దుర్గే పెద్ద చదువు చదివింది’ అన్నారు. మూడేళ్ళ పాపను ఎత్తుకుని నిలబడ్డ దుర్గ గర్వంగా చూసింది. ‘ఏం చదువుకున్నావమ్మా?’ అడిగాను నేను. ముసి ముసిగా నవ్వుతోంది. పరవాలేదు, చెప్పమ్మా అన్నట్లుగా ఆమె వైపే చూస్తున్నాను. ‘పాంచ్’ అంది మెల్లగా ముసి ముసి నవ్వులో నుంచి బయట పడుతూ. నా గుండె ఆ క్షణం కొట్టుకోవడం మానేసింది. వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువు. ఆరా తీశాను. చదువు మీద వాళ్లకు నమ్మకం లేదు. చదువు కూడు పెట్టదంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆవారాగా తిరుగుతున్న చదువుకున్నోళ్లను లెక్కబెడుతున్నారు. ‘ఇంతకీ, ఏం జరిగిందో నువ్వు చెప్పు’ అంటూ ఆ చదువుకున్న అమ్మాయిని అడిగాను. ఏమీ జరగలేదంది. మా కమిటీలో మహిళా సభ్యురాలు సౌమ్య గుడియాను పిలిచింది. ఏం జరిగిందో చెప్పమని అడిగింది. ‘బతాదియానా’అంది మెల్లగా. ఎవరికి చెప్పావంటూ మళ్ళీ అడిగింది సౌమ్య. ‘బహుత్ బార్’ అంది. ఆ తర్వాత దేనికీ సమాధానం చెప్పలేదు. ‘అదేం చెబుతుంది చిన్నపిల్ల. నేను చెబుతాను రాసుకోవమ్మా’ అంటూ నోరు తెరచి బిగ్గరగా మున్నీదేవి కూతుర్ని వెనక్కి నెట్టి నిలబడింది. ‘నా పేరు మున్నీ. నాకు అక్షరం ముక్క రాదు. అయినా పూస గుచ్చినట్లు చెబుతాను’ అంటూ భోజ్‌పురిలో మొదలు పెట్టింది. ‘నాకు ఆరుగురు పిల్లలు. నా వయస్సెంతో నాకు తెలీదు. నేను అబద్ధం చెప్పను’ అంటూ ధారాప్రవాహంగా సాగిపోతున్నాయి ఆమె మాటలు. ‘మా వూరిలోకి ఒక సంస్థ నుంచి అంటూ ఒక మహిళ వచ్చింది. ఆమెతో పాటు ఒక వీడియో కెమెరా పట్టుకుని ఒక కుర్రాడు, మాట్లాడేది చేత్తో పట్టుకుని ఒక అమ్మాయి వచ్చారు.’ ఆమె గుక్క తిప్పుకోకుండా చెప్పుకు పోతోంది. ‘మొదట మా గుమ్మం దగ్గరికి వచ్చారు. సంస్థ తాలూకు మహిళ మీకు మేలు జరుగుతుందని మమ్మల్ని ప్రలోభ పెట్టింది. మేం చెప్పినట్లు కెమెరా ముందు చెప్తే, మీకు బోల్డు డబ్బులు వస్తాయంది. మావి కాలుతున్న కడుపులు కదా. పైగా చదువూ సంధ్యాలేని బతుకులు. ఎవరేది చెప్పితే, అది నమ్మేస్తాం. డబ్బు ఎర చూసే సరికి సరే అన్నాం.’ ఆమె గొంతులో కొంచెం బాధ, కొంచెం పశ్చాత్తాపం తొంగి చూశాయి. గొంతు సవరించుకుంది. ‘వాళ్ళు మా గుడియాకు ఎలా మాట్లాడాలో చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే కెమెరా ముందు చెప్పింది.’ ‘ఏం చెప్పింది?’ సౌమ్య అడిగింది. ‘జీతం కోసం శరీరం యివ్వాల్సి వస్తుందని. గుత్తేదారు మాతో పాటు, మా లాంటి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నాడని.’‘అందులో నిజం లేదా?’ సౌమ్య ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. నిమిషం పాటు మౌనం. ఆ తర్వాత అందుకుంది. ‘కేసులు పెట్టొచ్చు. మీరు కోల్ జాతి వాళ్ళు కాబట్టి దళిత చట్టం కింద పరిహారం వస్తుంది అని సంస్థ మహిళ నమ్మబలికింది.’‘మా ఇంటి దగ్గర నుండి బబ్లీ ఇంటికి వెళ్లారు. అవే మాటలు చెప్పించారు. దాన్నే టీవీల్లో తెగ చూపించారంట.’ఆమె సహజ వక్త. ఎక్కడ నొక్కి పలకాలో, ఎక్కడ తగ్గి పలకాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ గొంతు పెంచాలో స్వాభావికంగా చేస్తోంది. ‘ఇప్పటి దాకా మీలా ఐదు బృందాలు వచ్చాయి. అందరికీ చెప్పిందే చెబుతూ విసిగిపోయాం.’ మానవధికార సంఘం, చైల్డ్ లేబర్, మహిళా హక్కుల సంఘం, హైకోర్టు బృందం, జిల్లా కలెక్టరు బృందం వచ్చి వెళ్లినట్లు నాకు తెలుసు. ఈ అన్ని కమిటీలు కూడా టీవీలో, పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే వచ్చాయి. ఎవరి ఫిర్యాదు వల్లనో వచ్చినవి కావు. ‘ఆ సంస్థ వాళ్ళు మీకు డబ్బులేమైనా యిచ్చారా?’ అనడిగింది సౌమ్య. ‘చెరో రెండు వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. మీరే చెప్పండి యిప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు ఏం కాను?’ అంటూ ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఆమె మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి జారుకుంది. వూరంతా గాలించాం. సాక్ష్యం కోసం. ఆడ, మగా అంతా ఖాళీగా వున్నారు. గుసగుసలు. అక్కడక్కడ ఏవగింపులు. గుంపులు గుంపులుగా కూర్చున్నారు. కొరోనా భయం కూడా లేకుండా. ‘పనిలోకి వెళ్ళలేదు ఏం?’ అని ఒకరిద్దరి మగాళ్లను అడిగాం. ‘పని ఆగిపోయింది’ అన్నారు. టీవీలో వచ్చిన విషయం గురించి అడిగాం. ఒక్కరు కూడా దాన్ని సమర్థించలేదు. అబద్ధం అన్నారు. గుడిసెల మధ్యలో నుండి మాలో మేం మాట్లాడుకుంటూ మెల్లగా కారు దగ్గరికి వచ్చాం. నేను కారులో కూర్చుంటుండగా మున్నీదేవి వేగంగా నడుచుకుంటూ వచ్చింది. నా చేతిలో ఒక చిన్న భరిణ పెట్టింది. ‘ఏంటిది?’ అని అడిగాను. ‘కారులో కూర్చొని చూడండి’ అని వూరిలోకి వెళ్ళిపోయింది. మా కారు ఆ గుడిసెల్ని విడిచిపెడుతూ కదిలిపోయింది. భరిణ తెరచి చూశాను. ఇంకిపోయిన రెండు కన్నీటి బొట్లు..! (చదవండి: ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా) -
లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగిన రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి ఎక్కి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళ విద్యుదాఘాతానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడగా అందులో లోకోపైలట్ భాగోతం బయటపడింది. వీడియోలో ఢిల్లీ షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకోగానే అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన తర్వాత కిందకు దిగాడు. అంతలో మరో లోకో పైలట్ సచిన్ విధులు నిర్వహించేందుకు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతో రైలులోకి ఎక్కాడు. వీడియో కాల్లో బిజీగా ఉన్న సచిన్ భుజానికున్న బ్యాగును తీసి ఇంజిన్ రాడ్ పైన పెట్టాడు. ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలడంతో రైలు ముందుకు కదిలింది. मथुरा ट्रेन हादसे के समय मोबाइल देख रहा था ड्राइवर। CCTV से ट्रेन के प्लेटफॉर्म पर चढ़ने का राज खुला। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #MathuraJunction #TrainAccident #CCTV pic.twitter.com/muia6Zu2Gi — FirstBiharJharkhand (@firstbiharnews) September 28, 2023 ఇది గమనించకుండా సచిన్ వీడియో కాల్లో బిజీగా ఉన్నాడు. చూస్తుండగానే రైలు ప్లాట్‌ఫారంపైకి ఎక్కి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళా మాత్రం విద్యుదాఅఘాతానికి గురవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైలులోని ప్రయాణికులంతా రైలు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడి వారు. దీని కారణంగా మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్, దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచిన్ తోపాటు మరో నలుగురిని కూడా సస్పెండ్ చేసింది. यूपी के मथुरा में एक अजीबोगरीब हादसे में मथुरा जंक्शन रेलवे स्टेशन पर एक लोकल ट्रेन प्लेटफॉर्म से टकरा गई. किसी के हताहत होने की सूचना नहीं है.#Mathura #MathuraJunction pic.twitter.com/ODdtgKinUl — iMayankofficial 🇮🇳 (@imayankindian) September 26, 2023 ఇది కూడా చదవండి: పాముకాటుతో అటెండర్ మానస మృతి -
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. ఎమ్మెల్యే నివాసంలో సిబ్బంది ఆత్మహత్య
లక్నో: ప్రియురాలితో గొడవపడి బీజేపీ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. శ్రేష్టా తివారీ అనే 24 ఏళ్ల యువకుడు లక్నోలోని బక్షి కా తలాబ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా వద్ద మీడియా సెల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను ఓ యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు రావడంతో దూరం పెరిగింది. ఈ క్రమంలో శ్రేష్టా తివారీ ఆదివారం హజ్రత్‌గంజ్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఉండగా.. తన ప్రియురాలితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ప్రేయసికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయన్ని గుర్తించిన యువతి పోలీసులకు సమాచారం అందించింది. అలాగే ఆమె కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే తలుపులు లోపలి నుండి లాక్ చేయడంతో ఎంత కొట్టిగా డోర్స్ తీయలేదు. చివరికి పోలీసులు చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా.. తివారీ శవమై కనిపించాడు. అయితే ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఫ్లాట్‌లో తివారీ ఒంటరిగా ఉన్నారని పోలీసులు తెలిపారు.సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ పాండే పేర్కొన్నారు. తివారీ తన గర్ల్‌ఫ్రెండ్‌కు కి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని, కావున ఆమె మొబైల్ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. చదవండి: సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు -
కేంద్ర మంత్రి నివాసంలో యువకుడి అనుమానాస్పద మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి నివాసంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితితో మృతిచెందడం కలకలం రేపుతోంది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కుమార్ నివాసంలో తలకు బుల్లెట్ తగిలిన గాయాలతో రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లక్నోలోని బెగారియా గ్రామంలో శుక్రవారం ఉదంయ 4 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి కుమారుడు వికాస్ పేరుతో రిజిస్ట్రర్ అయిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుడిని వినయ్ శ్రీవాస్తవగా పోలీసులు గుర్తించారు. అతడు మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ స్నేహితుడిగా తెలిసింది. అయితే ఆ ఇంటిని ప్రస్తుతం మంత్రి ఉపయోగించడం లేదు. అంతేగాక శ్రీ వాస్తవ మరణించిన సమయంలో మంత్రిగానీ, అతని కొడుకు గానీ ఆ ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేరుకున్నారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న ఆరుగురిని ప్రశ్నిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆధారాలను సేకరించాయి. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ ఇదిలా ఉండగా మృతుడి సోదరుడు మాత్రం తన అన్నయ్య మరణంలో కుట్ర దాగుందని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందా అని ప్రశ్నించగా.. ‘మంత్రి కొడుకు వికాస్ ఎక్కడికి వెళ్లినా తన గన్ను వెంట తీసుకెళ్లేవాడు. అతను కచ్చితంగా పిస్టల్ తీసుకెళ్లి ఉండాల్సింది.. ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికైనా వెళ్లినా దాన్ని వెంట తీసుకెళ్లేవాడని ఖచ్చితంగా చెప్పగలను. నిన్న ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు.. ఇది పక్కా ప్లాన్.. మా అన్నయ్యను ఎందుకు, ఎవరు చంపారో తెలియాలి’ అని ప్రశ్నించాడు. మృతుడి సోదరుడి ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందించారు. వికాస్ గురువారం మధ్యాహ్నమే ఢిల్లీకి వెళ్లాడని తెలిపారు. ఇందుకు బోర్డింగ్ పాస్‌లు కూడా సాక్ష్యంగా చూపించారు. పిస్తోల్‌కు నేషనల్ లైసెన్స్ లేదని, అందుకే తన కొడుకు పిస్టల్ని తనతో తీసుకెళ్లలేదని చెప్పారు. జరిగింది విచారకరమని.. విషయం తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరుగుతోందని నిందితులను వదిలిపెట్టమని, దోషులెవరైనా శిక్షిస్తామని తెలిపారు. బాధితుడి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
మేనకోడలిపై మోహంతో భార్యపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
లక్నో: యూపీలోని బుడౌన్ బుడౌన్‌లో ఓ మహిళా దారుణానికి ఒడిగటింది. తాగొచ్చి తన మేనకోడలిని లొంగదీసుకునే ప్రయత్నిస్తూ తనని తరచూ వేదిస్తున్నందుకు అతడి భార్య మిథ్లేశ్ దేవి(40) భర్త గొంతు కోసి చంపేసింది. కేసు దర్యాప్తు చేసిన యూపీ పోలీసులు చాకచక్యంగా అసలు నిజాన్ని రాబట్టారు. బుడౌన్‌లో ఆట వస్తువులను తయారు చేసే తేజేంద్ర సింగ్(43) ఆగస్టు 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బిల్సి పట్టణంలోని తన ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి నుంచి తేజేంద్ర సింగ్ భార్య తడబడుతూ ఒకదానితో ఒకటి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానమొచ్చిందని తర్వాత ఆమెను విడిగా విచారణ చేయగా హత్య తానే చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. తన మేనకోడలిని లొంగదీసుకోవడానికి తేజేంద్ర ప్రయత్నించేవాడని తనని ఒప్పించమని తరచూ వేధించేవాడని భర్త వేధింపుల నుండి విముక్తి పొందాలని ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఓ రోజు అతడు బాగా మద్యం సేవించి రావడంతో నిద్రిస్తున్న సమయంలో కొడవలితో గొంతు కోసి చంపినట్లు మిథ్లేశ్ దేవి నేరాన్ని అంగీకరించిందని వివరించారు బుడౌన్ ఎస్పీ ఓపీ సింగ్. ఇది కూడా చదవండి: HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం.. -
బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్..
లక్నో: యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్ ఒక ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన సంఘటన పెను సంచలనంగా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటుంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గి రాజుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ అమానుషంగా వ్యవహరించి పసి మనసుల్లో మత విద్వేషాలను నాటే ప్రయత్నం చేసిందని తెలిపారు యూపీ పోలీసులు. వీడియో ఆధారంగా యూపీ పోలీసులు టీచర్‌పైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. How humiliating for a small child to be put through this at a young age. Making the Muslim boy stand in front of the whole class and getting the Hindu kids to come and slap him. That teacher needs a slap tbh pic.twitter.com/n1KDWtTTwQ — Abu Hafsah (@AbuHafsah1) August 25, 2023 పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. టీచర్ కొట్టించిన బాలుడు ముస్లిం. టీచర్ కచ్చితంగా మతపరమైన దూషణలు చేసినట్టు వీడియోలో స్పష్టమైందని అయితే ఆమె నైజం ఏమిటన్నది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముస్లిం విద్యార్థి గణిత పట్టికలను నేర్చుకోలేదని మతపరమైన దూషణ చేస్తూ తోటి విద్యార్థులను ఆ బాలుడిపై దాడి చేయమని ఉసిగొల్పారన్నారు. బాలల హక్కుల సంఘం కూడా టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యం రాజీకి వచ్చిందని తాము కట్టిన ఫీజును కూడా తిరిగి చెల్లించిందని ఇకపై తమ బిడ్డను ఆ పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై స్పందించే ఉద్దేశ్యం తనకు లేదని దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవిత్రమైన పాఠశాలలో పిల్లల మనసుల్లో విద్వేషాలను నాటడం కంటే దేశద్రోహం మరొకటుండదు. ఇది దేశాన్ని బుగ్గిపాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పోసిన ఆజ్యమే. చిన్న పిల్లలు దేశ భవిష్యత్తు. వారిని ద్వేషించకుండా ప్రేమతత్వాన్ని నేర్పాలని అన్నారు. मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना - एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता। ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है। बच्चे भारत का भविष्य हैं - उनको नफ़रत नहीं, हम सबको मिल… — Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023 మరో ఎంపీ జయంత్ సింగ్ స్పందిస్తూ.. హింసను రెచ్చగొడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా మతవిద్వేషాలు ఎంత లోతుగా పాతుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూడాలని.. పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. Muzaffarnagar school video is a painful warning of how deep rooted religious divides can trigger violence against the marginalised, minority communities. Our MLAs from Muzzafarnagar will ensure that UP Police files a case suomoto & the child’s education is not disrupted! — Jayant Singh (@jayantrld) August 25, 2023 ఇది కూడా చదవండి: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో ఘోర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. యూపీలో తీర్ధయాత్రకు వచ్చిన ఓ యాత్రికుడు ఆదమరచి ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలుడిని పట్టపగలు అందరూ చూస్తుండగా అదేపనిగా ఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటిబయటకు రావడంతో నెటిజన్లు, పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తీర్ధ యాత్రికుడు ఓంప్రకాష్(54) అనేక మార్లు నేలకేసి కొట్టాడని.. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆ వ్యక్తిని పట్టుకుని దేహ శుద్ధి చేసి తమకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికులు ఆ వ్యక్తిని చితకొట్టడంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడని అతడిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుడు స్పృహలోకి వస్తే తప్ప బాలుడిని ఎందుకు చంపాడన్న కారణాలు తెలియవని అన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యాత్రికుడు సప్తకోసి యాత్ర నిమిత్తం అక్కడికి వచ్చాడని బాలుడిని ఎందుకలా కొట్టి చంపాడన్న కారణాలు మాత్రం తెలియడం లేదని అన్నారు. చనిపోయిన బాలుడి తండ్రి అక్కడే ఒక జనరల్ స్టోర్స్ నడుపుతూ ఉంటాడని తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి ఇది కూడా చదవండి: 'వండర్లా'లో అపశ్రుతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. -
ఇన్‌స్టాలో భార్యకు విపరీతమైన ఫాలోవర్స్ .. అనుమానంతో భర్త కిరాతకం
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసి అసూయ, అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా చంపాడు భర్త... కన్న పిల్లల ఎదుటే భార్య గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలు.. లక్నోలోని పారా ప్రాంతంలో వ్యాపారవేత్తకు భార్య 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి భార్య గృహిణి. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతేగాక ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య తనను బ్లాక్చేయడంతో భర్తకు కోపం వచ్చింది. తన భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని, తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను సోషల్ మీడియా ఫాలోవర్స్ కలుస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. ఈ విషయం భార్య, భర్తల మధ్య గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆదివారం పిల్లలతో కలిసి కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. నిందితుడు మధ్యలో సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు. అక్కడ తన భార్యతో సోషల్ మీడియా వ్యవహారంపై వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్ చేసుకుని ఉండిపోయాడు. ఊహించని ఘటనతో పిల్ల్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. అనుమానాస్పదంగా కారు పార్కింగ్ చేయడంతో పెట్రోలింగ్ బృందం ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీలు చేపట్టగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని దారుణంగా చంపాడని కుమార్తె, కుమారుడు తెలిపారు. వారి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన
లక్నో: మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్రం పోసిన సంఘటన మరువక ముందే ఆగ్రాలో అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఉన్న ఓ వ్యక్తిపై మూత్రం పోస్తూ వీడియో తీసుకున్నాడు మరో ప్రబుద్ధుడు. మానవత్వానికి కళంకంగా నిలిచే సంఘటనలు ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకంటూనే ఉన్నాయి. సమాజంలో ఇప్పటికీ వివక్షలు చాపకింద నీరులా ప్రబలుతూనే ఉన్నాయి. మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి అమానుషంగా గిరిజనుడిపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగడంతో సదరు నిందితుడు కటకటాల పాలవడమే కాకుండా అతని ఇల్లు కూడా నేలమట్టం చేశారు. ఒకపక్క ఇటువంటి చర్యలపై చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది వాటిని ఖాతరు చేయడం లేదు. మధ్యప్రదేశ్ ఉదంతం గురించి తెలిసి కూడా ఆగ్రాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని కాలితో నిర్దాక్షిణ్యంగా తన్నుతూ ముఖం మీద మూత్రం పోశాడు. దీన్ని అతని స్నేహితుడు వీడియో తీశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మూత్రం పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని వెతుకులాట కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో ఇప్పటిది కాదని మూడు నాలుగు నెలల క్రితం వీడియో అని ఇప్పుడు వైరల్ అయ్యిందని చెబుతూ మూత్రం పోసిన వ్యక్తిని ఆదిత్యగా, వీడియో తీసిన వ్యక్తి అటుస్ గా గుర్తించినట్టు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ -
తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి..
లక్నో: యూపీలోని లక్నోలో ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని అతని ముగ్గురు పిల్లల మీద చూపిస్తూ వారిని కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశాడు ఓ మూర్ఖుడు. అదృష్టవశాత్తు ఆ పిల్లలకు ఎటువంటి హానీ జరగలేదు. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై పిల్లల్ను ఆసుపత్రికి తరలించగా ప్రమాదమేమీ లేదని చిన్న చిన్న గాయాలు మాత్రం తగిలాయని తెలిపారు వైద్యులు. మలిహాబాద్ సమీపంలోని సింధర్వ గ్రామం కాజీఖేడలో సీతారాం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సీతారాంకు అతని బంధువు గోవింద్ యాదవ్ తో తరచుగా గొడవలు జరిగేవి. ఇటీవల వారి మధ్య వివాదం మరింత ముదరడంతో సీతారాంపై ఉన్న కోపాన్ని అతని పిల్లలపై ప్రదర్శించాడు గోవింద్. జులై 13న సీతారాం ముగ్గురు పిల్లలు శివాని (8), స్నేహ(4), కృష్ణ(3) మార్కెట్ కు వెళ్తుండగా అటుగా స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన గోవింద్ వారిని చంపాలనే ఉద్దేశ్యంతో నిర్దయాక్షిణ్యంగా కారుతో గుద్దించేశాడు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. అక్కడున్నవారు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి నిందితుడు పారిపోకుండా పట్టుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా సేకరించారు పోలీసులు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్ -
కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..?
లక్నో: నిరుద్యోగి ఆయిన ఒక కార్మికుడి కంపెనీ టర్నోవర్ రూ.2. 5 కోట్లు దాటింది కానీ అతడు టాక్స్ కట్టడం లేదంటూ అతడికి నోటీసులు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. రోజుకి రూ. 300 సంపాదించుకునే కూలీని, అంత మొత్తాన్ని ఎక్కడ నుండి తెచ్చి కట్టాలని వాపోతున్నాడు ఆ కార్మికుడు. బులంద్ షహర్ కు చెందిన 22 ఏళ్ల దేవేంద్ర కుమార్ కు చాలా కాలంగా ఉద్యోగం లేదు. ఏవో కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు కానీ అక్కడ ఎక్కువకాలం స్థిరంగా లేడు. ప్రస్తుతానికైతే అతడు నరౌరాలో ఒక టౌన్ షిప్ ప్రాజెక్టులో దినవారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి రెండు వ్యాపారాలున్నాయని, వాటి నుంచి అతడు ఏడాదికి రూ.2.5 కోట్లు ఆదాయం పొందుతున్నాడని తెలుపుతూ జీఎస్టీ నోటీసులు జారీ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. నిందితుడు దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం నోయిడాలో నేనొక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్యాకర్ గా పని చేసేవాడిని. అక్కడి కాంట్రాక్టర్లు నాకు జీతం ఇవ్వడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని కోరారు. మార్చి 13, 16న అల్లాగే ఏప్రిల్ 4న రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ నుండి, అలీగఢ్ ఆదాయపు పన్ను కార్యాలయం నుండి ఘజియాబాద్ లోని మా ఇంటికి నోటీసులు వచ్చాయి. జేకే ట్రేడర్స్ అనే నా కంపెనీ టర్నోవర్ రూ.136.60 లక్షలని, అలాగే సర్వశ్రీ జేకె ట్రేడర్స్ అనే నా మరో కంపెనీ టర్నోవర్ 116.24 లక్షలని రెండిటికీ కలిపి మొత్తం రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టాల్సి ఉందని నోటీసుల్లో ఉంది. జీఎస్టీ నెంబర్ ఆధారంగా చూస్తే అది జితేందర్ సిసోడియా అనే వ్యక్తి పేరు మీద ఉందని.. మా పాత కంపెనీ యజమాని, జితేందర్ ఇద్దరూ కలిసి ఏదైనా మతలబు చేసి ఉంటారని ఆరోపించాడు. ఏమి చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించానని.. బులంద్ షహర్, నోయిడా, ఘజియాబాద్ తిరిగి తిరిగి చివరకు గౌతమ్ బుద్ధా జిల్లాలోని సెక్టార్-63 పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని ఇంతవరకు దానికే రూ.40000 ఖర్చు చేశానని భోరుమన్నాడు. ఇది కూడా చదవండి: పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే.. -
పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని..
యూపీలోని లక్నోలో శునకాల వీరంగంతో జనం ఏ స్థాయిలో భయపడుతున్నారంటే చివరికి ఇంటిని కూడా అమ్మేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. లక్నోలోని జానకీపురంలో ఉంటున్న ఒక వృద్ధ జంట ఎదురింటిలోని కుక్కలకు భయపడి తమ ఇంటిని విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే లక్నోలోని జానకీపురం ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జంట ఇటీవలే స్థానికంగా ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అయితే వారు ఈ ఇంటిలోకి అడుగుపెట్టగానే వారికి కుక్కల బెడద మొదలయ్యింది. దీంతో వారు తాము ఉంటున్న ఇంటిని వెంటనే అమ్మివేయాలని భావిస్తూ, ఇంటి బయటి గేటుకు ‘ఇల్లు అమ్మబడును’ అనే బోర్డు తగిలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలోని వారు ఏకంగా 34కు మించిన కుక్కలను పెంచుతున్నారని,ఈ కుక్కలు రోజుంతా ఈ ప్రాంతంలో తిరుగుతూ అందరినీ వెంబడిస్తున్నాయని, చిన్నారులను భయపెడుతున్నాయని, కరుస్తున్నాయని తెలిపారు. వీటికి భయపడే ఆ వృద్ధ దంపతులు తమ ఇంటిని విక్రయించాలనుకుంటున్నారని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ అధికారులు ఆ కుక్కల యజమానికి నోటీసు అందించారు. కాగా లక్నోలో పెంపుడు కుక్కలు మనుషులపై దాడులకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక పిట్‌బుల్ డాగ్ తన యజమానిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఇదేవిధంగా రిటైర్డ్ టీచర్ సుశీల్(82) కూడా శునకాల దాడిలో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో.. -
మ్యాంగో మ్యాన్
ఒకే మామిడి చెట్టుకు 300 కాయలు కాస్తాయి. అయితే ఆ కాయలు ఒక్కోటి ఒక్కో రకం. ఒక కొమ్మకు రసాలైతే ఒక కొమ్మకు తోతాపురి.. ఇలా ప్రపంచంలో ఏ చెట్టూ కాయదు. దీనిని సాధ్యం చేసి ‘మ్యాంగో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు లక్నోకు చెందిన కలీముల్లా ఖాన్. జీవితం మొత్తాన్ని మామిడి సాగుకు అంకితం చేసిన కలీముల్లా మామిడి తోట ఒక దర్శనీయ స్థలం. ‘ప్రపంచంలో మామిడి పండు అంత అందమైన పండు మరొకటి లేదు’ అంటారు కలీముల్లా ఖాన్. ఆయనికిప్పుడు 80 దాటాయి. లక్నో నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మలిహామాద్లో ఆయన మామిడి ఉద్యానవనం ఉంది. ‘ఇది ప్రపంచ మామిడి చెట్లకు కాలేజీ లాంటిది. ఎవరైనా మామిడి పండ్ల గురించి ఇక్కడ చదవాల్సిందే’ అంటాడాయన. మలిహాబాద్ ఉత్తరప్రదేశ్‌లో మామిడితోటలకు ప్రసిద్ధి. కలీముల్లా కుటుంబం కూడా మామిడి తోటల పెంపకంలో తాత తండ్రుల కాలం నుంచి ఉంది. ‘నేను సెవెన్త్ ఫెయిల్ అయ్యాను. మా ఊళ్లో పిల్లల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు రానీయరు తల్లిదండ్రులు. అలా పెరిగాను. కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి మామిడి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్ల వయసులో అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాను. కాని ఆ రోజు నుంచి భారీ వర్షం. దేవునికి ఇష్టం లేదనుకున్నాను. ఆ మొక్క బతకలేదు. కాని అంటు కట్టే విధానంతో కొత్త కొత్త మామిడి రకాలు సృష్టించాలన్న నా పిచ్చి పోలేదు. 1970లో నా పెళ్లయ్యింది. అప్పుడే ఈ మామిడి తోటలో ప్రయోగాలు మొదలెట్టాను’ అంటాడాయన. ఒకేచెట్టుకు 315 రకాలు ఒకేచెట్టు కొమ్మలకు రకరకాల పండ్ల అంటు కడుతూ చెట్టును విస్తరించడమే కాదు, దాని ప్రతికొమ్మకూ కొత్తరకం కాయలను సృష్టించాడు కలీముల్లా. ‘ఇన్ని రకాల కాయలు ఒకే చెట్టుకు కాసినప్పుడు మనుషులందరూ ఒకేరీతిన ఎందుకు కలిసి ఉండకూడదు’ అని ప్రశ్నిస్తాడాయన. ‘నేను సృష్టించిన ఒకరకం కాలాపహాడ్ పండును జుర్రుకుంటే మూడు రకాల రుచులు వస్తుంది’ అంటాడాయన. కొన్ని రకాల అంటు మామిళ్లకు కలీముల్లా ‘అమితాబ్, ‘సచిన్’, ‘నమో’ అనే పేర్లు పెట్టాడు. కరోనాలో సేవచేసి మరణించిన డాక్టర్లకు నివాళిగా ఒక మామిడిరకాన్ని సృష్టించి ‘డాక్టర్’వెరైటీ అని నామకరణం చేశాడు. కలీముల్లాకు 2008లో పద్మశ్రీ వచ్చింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నాకు 400 అవార్డులు ఉద్యానవన విభాగంలో వచ్చాయి. చాలా వాటిని మా పిల్లలు వెళ్లి తీసుకొస్తుంటారు అంటాడాయన. ‘నాకు మన దేశం అంటే ప్రేమ. అమెరికా నుంచి చాలామంది వచ్చి నా విధానాలు తెలుసుకుని వెళ్లారు. మన దేశం వాళ్లే నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడం లేదని అనిపిస్తోంది. నా జ్ఞానాన్ని నా వాళ్లకు పంచాలనే నా తపన అని భావోద్వేగంతో అంటాడు కలీముల్లా. ‘మా తోటకు రండి. మామిడి తినిపోండి’ అని సదా ఆహ్వానిస్తుంటాడాయన. -
తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకోపైలట్ అలర్ట్ చేయడంతో..
లక్నో: ఇటీవలే ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లో లోకోపైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. యూపీలో ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్లో తీవ్రమైన ఎండ వేడి వల్ల లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోయాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మెయిన్ లైన్లో మరో రైలు నిలిచి ఉంది. దీంతో రైలు పట్టాలు కరిగిన లూప్ లైన్‌పై నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. ఈ నేపథ్యంలో కరిగిన ఆ రైలు పట్టాలు వ్యాపించడంతో వంకరుగా మారాయి. ఈ క్రమంలో రైలు పట్టాలు జరగడం గమనించిన నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ వెంటనే ఆ రైలును నిలిపివేశాడు. అనంతరం, స్టేషన్‌లోని సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో, వెంటనే స్పందించిన స్టేషన్ మాస్టర్ ఆ లూప్‌లైన్ మీదుగా ఎలాంటి రైళ్లు వెళ్లకుండా రైల్వే సిబ్బందిని అలెర్ట్ చేశారు. వెంటనే, స్టేషన్‌కు రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైలు పట్టాలను సరి చేసే పనులు చేపట్టారు. అయితే లూప్ లైన్‌లోని రైల్వే ట్రాక్ నిర్వాహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయాలని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేష్ సప్రా ఆదేశించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ब्रेकिंग लखनऊ निगोहां रेलवे स्टेशन पर बड़ा हादसा टला, गर्मी की वजह से रेल ट्रैक हुआ टेढ़ा, मिस एलाइनमेंट लूप लाइन से निकली नीलांचल एक्सप्रेस ड्राइवर की सूझबूझ से बड़ा हादसा टला, मौके पर रेलवे अधिकारी मौजूद, ट्रैक की मरम्मत जारी। pic.twitter.com/zex2qPbfE0 — Dev verma journalist (@Devanan48102501) June 17, 2023 ఇది కూడా చదవండి: వీడియో: ఎంపీ, మంత్రి మధ్య వాగ్వాదం.. కలెక్టర్‌ను ఒక్కతోపు తోయడంతో.. -
ఆమె సేవ అనూహ్యం
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు. -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
అతనికి కుటుంబమే ప్రాణం.. మరి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడంటే..
లక్నో సిటీ సివిల్ కోర్టులో బుధవారం విచారణ జరుగుతుండగానే కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే డాన్ అక్కడికక్కడే చనిపోయాడు. మూడు దశాబ్దాలుగా దాదాపు పాతిక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు సంజీవ్ జీవా. కానీ, ఒకప్పుడు అతనికి కుటుంబమే ముఖ్యంగా ఉండేంది. దానిని పోషించుకునేందుకు కాంపౌండర్ పని కూడా చేశాడు. అలాంటోడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు?.. అతని నేరచరిత్ర నెత్తుటి మరకలతో ఎలా సాగిందో చూస్తే.. అది 90వ దశకం ప్రారంభం కాలం అది. పశ్చిమ యూపీలోని ముజఫ్ఫర్ నగర్లో శంకర్ హాస్పిటల్ ఉండేది. అక్కడ కంపౌండర్‌గా పనిచేసే ఒక యువకుడు అందరికి మందులు పొట్లాలు కట్టేవాడు. చేసేది కంపౌండర్ పనే అయినా అందరూ అతన్ని ‘డాక్టర్’ అనే సరదాగా పిలిచేవారు. ఆ టైంలో అతనికి కుటుంబం తప్ప మరో ఊసు ఉండేది కాదు. వాళ్ల కోసం పగలురాత్రి తెగ కష్టపడేవాడు. అయితే.. ఆ డబ్బు సులువుగా వచ్చే మార్గం ఏంటో త్వరలోనే అతను అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా అతనిలో నేర స్వభావం బయటపడడం ప్రారంభమైంది. తాను, తన కుటుంబం బతకాలంటే డబ్బు కావాలి. అది ఎంత ఖర్చు చేసినా తరగనంత. అందుకోసం నేరవృత్తిని ఎంచుకున్నాడు. తన డాక్టర్‌కు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ఒక వ్యాపారిని బెదిరించడం ద్వారా ఆ యువకుడు తన నేరసామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. అక్కడతో ఆగలేదు… తరువాతి కాలంలో తన డాక్టర్నే కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశాడు. సంజీవ్ జీవా పూర్తి పేరు సంజీవ్ మహేశ్వరి . యూపీలోని ముజఫ్పర్ నగర్‌కు చెందిన వ్యక్తి. తన నేర సామ్రాజ్యం ప్రారంభంలోనే కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 90వ దశకం చివరికి వచ్చేనాటికి సంజీవ్ కలకత్తాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి 2కోట్లు డిమాండ్ చేశాడు. అప్పట్లో కిడ్నాపర్ డిమాండ్ చేసే డబ్బు విలువను బట్టి ఆ గ్యాంగ్ ఎంత పెద్దదో డిసైడ్ చేసేవారు. తరువాతి కాలంలో తనదంటూ ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్న సంజీవ్… విదేశాల నుంచి ఆయుధాలను తీసుకువచ్చాడు. యూపీలోని షామ్లీ జిల్లాలో పోలీసులు చెక్‌పోస్టు వద్ద అనిల్ అనే ఒక రౌడీ దగ్గర నుంచి ఏకే-47తోపాటు 1300బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ యూనివర్సిటీ డీన్ హత్యకేసులో నిందితుడు. అనిల్‌కు ఈ ఆయుధాలు అమ్మింది సంజీవ్ అని పోలీసులు తేల్చారు. ముజఫ్పర్నగర్ కేంద్రంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన సంజీవ్ … మెల్లిగా కాంట్రాక్టు కిల్లింగ్లను ప్రారంభించాడు. సంజీవ్ నేర ప్రపంచంలో బ్రహ్మదత్త ద్వివేది హత్య సంచలనం సృష్టించింది. 90వ దశకంలో యూపీ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా బ్రహ్మదత్త ద్వివేదికి పేరుంది. బీఎస్పీ రాజకీయాలను మలుపు తిప్పిన గెస్ట్‌హౌజ్ సంఘటనలో మాయావతికి ద్వివేది సహాయం చేశారు. కవిగా, సిద్ధాంత కర్తగా బ్రహ్మదత్తకు బీజేపీలో మంచి గుర్తింపు ఉండేది. బీజేపీ నాయకుడైనప్పటికీ… మాయావతి ఆయనను సోదరుడిగా భావించేది. ఫిబ్రవరి 1997లో తన ఇంటి దగ్గర నుంచి వెలుతున్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ద్వివేది అక్కడికక్కడే చనిపోయారు. అద్వానీ, వాజ్‌పేయి హుటాహుటిన లక్నో వచ్చి ద్వివేది అంత్యక్రియల్లోపాల్గన్నారంటే.. ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. ఫరూకాబాద్ ఎమ్మెల్యే విజయ్‌సింగ్ తో పాటు సంజీవ్ జీవా కూడా ఇందులో దోషిగా కోర్టు తేల్చింది. ఈ కేసులో సంజీవ్ జీవాకు యావజ్జీవా కారాగార శిక్షపడింది. అయితే సంజీవ్ జీవా మాత్రం పోలీసులకు చిక్కలేదు. మున్నా బజరంగీతో చేరడం ద్వారా సంజీవ్ తన నేరసామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. 2005నాటికి సంజీవ్ జీవా బీఎస్పీ ఎంపీగా ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీతో జీవా చేతులు కలిపాడు. ఇదే సమయంలో జరిగిన కృష్ణానంద్ రాయ్ హత్యతో సంజీవా ఫేమస్ అయిపోయాడు. మహమ్మదాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణానంద్ రాయ్ బీజేపీలో కీలకమైన నేత. 2005 నవంబర్‌లో రాయ్ తన ఇంటి నుంచి ఒక కార్యక్రమానికి వెళ్లివస్తుండగా నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఆయనను అడ్డుకున్నారు. ఏకంగా ఏకే-47 ఆయుధాలతో దాదాపు 500బుల్లెట్లు ఫైర్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ వాహనం పూర్తిగా బుల్లెట్లతో జల్లెడలా మారిపోయింది. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారి శరీరాల నుంచి దాదాపు 50బుల్లెట్లు బయటకు తీశారు. కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మున్నాబజరంగీని జైలులో హత్య చేశారు. లోక్‌సభ సభ్యుడు ముఖ్తార్ అన్సారి కేసు నుంచి తప్పించుకోగలిగారు. ఇక సంజీవ్ జీవా ఈ కేసులో కీలక నిందితుడని విచారణలో తేలింది. ప్రస్తుతం జైలులో ఉన్న సంజీవాను కోర్టులో జడ్జి ముందు విచారణ జరుగుతుండగానే.. లాయర్ల దుస్తుల్లో వచ్చి మరీ కాల్చి చంపారు. సంజీవా భార్య పాయల్ చౌదరి ఆర్ఎల్డీ పార్టీ నుంచి ముజఫ్ఫర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తన భర్తకు ప్రాణహాని ఉందని సంజీవ్ భార్య ఆ మధ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏది ఏమైనా సంజీవ్ చావుతో… యూపీ రక్తచరిత్రలో ఓ అంకం ముగిసినట్లయ్యింది. :::ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న కాదు.. కాల్పులపై అఖిలేష్ ఫైర్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ మరణించగా.. పలువురు పోలీసులు గాయపడ్డారు. కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా భావిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ షాకింగ్ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, అఖిలేష్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇది ప్రజాస్వామ్యమా.. ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న కాదు, భద్రత ఎక్కువగా ఉండే చోట ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కోర్టులో కాల్పుల ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడు. కాల్పులు జరిపిన నిందితుడు బ్రతకడు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు.. కోర్టు కాల్పుల ఘటనపై న్యాయవాదులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో లక్నో సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే పోలీసుల సమక్షంలోనే గ్యాగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని దుండగులు కాల్చి చంపారంటూ నిరసన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: పరీక్ష పత్రాల లీకేజ్‌ల కలకలం.. మొన్న టీఎస్పీఎస్సీ, నిన్న టెన్త్ క్లాస్, నేడు జేఈఈ అడ్వాన్స్.. -
Lucknow: జడ్జి ఎదుటే గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు
క్రైమ్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం రేగింది. బుధవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ మరణించగా.. పలువురు పోలీసులకు గాయలైనట్లు సమాచారం. కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా భావిస్తున్నారు పోలీసులు. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన అదనపు సమాచాంర అందాల్సి ఉంది. Disclaimer: ఇందులోని ఫొటోలు, దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు #WATCH | Uttar Pradesh: Gangster Sanjeev Jeeva shot outside the Lucknow Civil Court. Further details awaited (Note: Abusive language) pic.twitter.com/rIWyxtLuC4 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023 Gangster Sanjeev Jeeva shot dead by unknown assailants outside a Lucknow court. More details are awaited. pic.twitter.com/8xvaTNoQjw — Press Trust of India (@PTI_News) June 7, 2023 -
పర్వతాలు పిలిచాయి
‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్ మ్యూర్. ఒకానొక సమయంలో శాలిని సింగ్‌కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్‌లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్.... లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్ పీజీ కాలేజీలో శాలిని సింగ్ బీఏ స్టూడెంట్. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని. 19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు. ఎన్సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్‌లో శాలిని సింగ్ సీనియర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జమ్ములోని పహల్గామ్లో గత సంవత్సరం బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్డ్ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని. ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్ పునీత్ శ్రీవాస్తవ. ‘శాలిని విజయం ఎన్సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని. ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది శాలిని సింగ్ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని! -
ఉత్కంఠ పోరులో లక్నో సంచలన విజయం.. ప్లేఆఫ్‌కు ఆశలు సజీవం
ఉత్కంఠ పోరులో లక్నో సంచలన విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 178 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 59, టిమ్ డేవిడ్ 19 బంతుల్లో 32 నాటౌట్ రాణించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు చెరో రెండు వికెట్లు తీయగా.. మోసిన్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేఆఫ్‌కు మరింత దగ్గరైంది. సూర్య క్లీన్‌బౌల్డ్.. ముంబై ఇండియన్స్ 125/3 యష్ ఠాకూర్ బౌలింగ్‌లో స్కూప్‌షాట్ ఆడబోయి సూర్యకుమార్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 15 ఓవరల్లో మూడు వికెట్లు నష్టపోయి 125 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 12, టిమ్ డేవిడ్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. రోహిత్ శర్మ(37) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై 37 పరుగులు చేసిన రోహిత్ శర్మ రవి బిష్ణోయి బౌలింగ్‌లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 92 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఇషాన్ కిషన్ 53 పరుగులతో ఆడుతున్నాడు. టార్గెట్ 178.. ముంబై ఇండియన్స్ 6 ఓవర్లలో 58/0 178 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 29, రోహిత్ శర్మ 26 పరుగులతో ఆడుతున్నారు. స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 178 ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ (47 బంతుల్లో 89 నాటౌట్, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. కృనాల్ పాండ్యా 49 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్, స్టోయినిస్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో బెహండార్ఫ్ రెండు వికెట్లు తీయగా.. పియూష్ చావ్లా ఒక వికెట్ తీశాడు. స్టోయినిస్ ఫిఫ్టీ.. లక్నో 162/3 మార్కస్ స్టోయినిస్ ఫిఫ్టీతో మెరవడంతో లక్నో 19 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అంతకముందు కెప్టెన్ కృనాల్ పాండ్యా 49 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 14 ఓవర్లలో లక్నో100/3 14 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 44, మార్కస్ స్టోయినిస్ 32 పరుగులతో ఆడుతున్నారు. 9 ఓవర్లలో లక్నో 63/3 9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 23, మార్కస్ స్టోయినిస్ 17 పరుగులతో ఆడుతున్నారు. తడబడిన లక్నో.. 6 ఓవర్లలో 35/2 ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తడబడుతోంది. 4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. డికాక్ 16, కృనాల్ పాండ్యా 13 పరుగుఉలతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం లక్నో వేదికగా 63వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్ ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మధ్వల్ #MumbaiIndians skipper Rohit Sharma wins the coin flip & elects to chase in a crucial #TATAIPL clash 💥 Stream #LSGvMI, LIVE & FREE with #IPLonJioCinema for any sim card!#IPL2023 #EveryGameMatters | @mipaltan @ImRo45pic.twitter.com/hbVFsh2F5p — JioCinema (@JioCinema) May 16, 2023 ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది. గెలిచిన జట్టు ప్లేఆఫ్‌కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఇరుజట్లు గతంలో రెండుసార్లు తలపడగా లక్నోనే విజయం వరించింది. -
ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరిగిందా? అందుకే టాప్ టీమ్స్ అలా
-
ఆగిపోయిన మ్యాచ్
-
రంగస్థలం
లక్నో సాంస్కృతిక వైభవ మణిపూసలలో రంగస్థలం ఒకటి. ఆ వెలుగు మరింత ప్రజ్వరిల్లేలా ఔత్సాహికులు నాటకరంగంలో భాగం అవుతున్నారు. అయితే రంగస్థలం అంటే యువతరం మాత్రమేనా? ‘కానే కాదు’ అంటోంది ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ. రచనల నుంచి నటన వరకు పెద్దలలోని సృజనాత్మక శక్తులను రంగస్థలంపైకి సాదరంగా తీసుకురావడానికి ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ పేరుతో నాటకరంగ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది... థియేటర్ గ్రూప్ ‘మంచ్కీర్తి సమితి’ లక్నో (ఉత్తరప్రదేశ్)లో నిర్వహించిన ‘30 డేస్ 30 ప్లేస్’ కు అనూహ్యమైన స్పందన లభించింది. విశేషం ఏమిటంటే ఆ జామ్ ప్యాక్డ్ థియేటర్లలో ఎక్కువమంది వృద్ధులు కనిపించారు. నాటకాలు చూస్తున్నప్పుడు వారిలో వయసు భారం మాయమైపోయింది. ప్రదర్శన పూర్తయిన తరువాత టీ తాగుతూ వారు ఆ నాటకాన్ని లోతుగా విశ్లేషించుకునే దృశ్యాలు ఎన్నో కనిపించాయి... దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్నోకు చెందిన ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో సీనియర్ సిటీజన్లతో నలభైరోజుల పాటు థియేటర్ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘వారి కోసం వారి చేత’ ట్యాగ్‌లైన్‌తో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లలో రచన, నటన, దర్శకత్వం, సంగీతం... మొదలైన అంశాలలో శిక్షణ ఉంటుంది. దీంతో పాటు తమ ఏరియాలో తమ వయసు ఉన్న వ్యక్తులను సమీకరించి ‘స్టోరీ టెల్లింగ్’లాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చెబుతారు. ‘సీనియర్ సిటిజన్స్ కోసం థియేటర్ అనేది మంచి కాన్సెప్ట్. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త శక్తిని ఇస్తుంది’ అంటున్నాడు థియేటర్ డైరెక్టర్ సలీమ్ ఆరీఫ్. ‘నాటకరంగం అనేది అత్యంత ప్రభావశీలమైనది. ఈ బలమైన మాధ్యమం పెద్దల నీడలో మరింత బలం పుంజుకుంటుంది. వయసు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవ జ్ఞానం నాటకాల్లో ప్రతిఫలిస్తుంది. వృద్ధులు అనగానే ప్రేక్షకుల్లో కూర్చుని నాటకం వీక్షించడానికే పరిమితం కానవసరం లేదు. ఇప్పుడు వారిని రంగస్థలం ప్రేమగా, అభిమానంగా ఆహ్వానిస్తోంది’’ అంటున్నాడు రంగస్థల ప్రముఖుడు సంగమ్ బహుగుణ. పెద్దల చేత రూపుదిద్దుకుంటున్న నాటకాలు, పెద్దలు నటించే నాటకాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం.. ఒంటరి ఏకాంతాలు, వయసు సమస్యలు, కుటుంబ సమస్యలు... ఇలా ఏవోవో సమస్యలు ఉండబోతున్నాయా? ‘కానే కాదు’ అంటుంది పీపుల్స్ ఇన్షియేటివ్. వారు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. తాము నడిచొచ్చిన బాటను గుర్తు చేస్తూ ఈ తరానికి సానుకూలశక్తిని పంచుతారు. ఇంతకంటే కావాల్సినదేముంది! నాటకాల పాఠశాల వయసు పైబడినంత మాత్రాన అది నటనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిరూపిస్తున్న ప్రతిభావంతులలో సోహైలా కపూర్ ఒకరు. ఘనమైన ఖాన్దాన్ నుంచి వచ్చిన కపూర్ నటి, రచయిత్రి, మోడ్రన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. ఈ తరం నటులతో కలిసి రంగస్థలం, జీ థియేటర్లలో నటిస్తోంది కపూర్. ఆమెతో నటించడం అంటే ఔత్సాహిక నటులకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్నంత అదృష్టం. దిల్లీలో పుట్టిన కపూర్ హైస్కూల్ రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ‘వయసు పైబడగానే విషాదం మూర్తీభవించే పాత్రలకు మాత్రమే మహిళా నటులు పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. వృద్ధాప్యం అంటే విషాదం మాత్రమే కాదు. ఎన్నో బలమైన పాత్రలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. వోటీటీ పుణ్యమా అని సీనియర్ నటీమణులకు మూస పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలలో నటించే అవకాశం దొరుకుతుంది’ అంటోంది కపూర్. -
Yogi Adityanath Death Threat: సీఎం యోగిని హత్య చేస్తానంటూ బెదిరింపులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. లక్నోకు చెందిన ఓ వ్యక్తి యూపీ ఎమర్జెన్సీ నెంబర్ 112కి మెసేజ్ చేశాడు. సీఎం యోగిని త్వరలో చంపుతానంటూ సందేశంలో పేర్కొన్నాడు. దీంతో 112 ఆపరేషన్ కమాండర్ విషయాన్ని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐపీసీ సెక్షన్లు 506, 507, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కేరళ పర్యటన వేళ ఆయన ఆత్మాహుతి బాంబు దాడిలో చంపుతామంటూ ఓ వ్యక్తి బెదిరించడం కలకలం రేపింది. కొచ్చికి చెందిన జేవియర్ అనే వ్యక్తి ఈ మేరకు కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్‌కు లేఖ పంపాగా.. ఆయన దానిని పోలీసులకు అందజేశారు. అయితే వారం తర్వాత ఆ లేఖ గురించి మీడియాకు సమాచారం పొక్కింది. దీంతో గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బయటపెట్టారంటూ బీజేపీ, కేరళ పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రధాని కేరళ రెండో రోజుల పర్యటన కోసం భారీగా పోలీసులను మోహరించారు. -
ఏక్నాథ్ షిండే అయోధ్య పర్యటన: 'మా నమ్మకాలకి సంబంధించింది'
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే అయోధ్యలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటను విషయమై సర్వత్ర విమర్శలు రావడంతో అది తన నమ్మకానికి సంబంధించిన విషయం అని ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన అయోధ్య పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రమే ముంబై విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి విమానంలో లక్నోకు వెళ్లి..అయోధ్యలోని రామమందిరంలో ప్రార్థనలు చేయనున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా షిండే అయ్యోధ్యలో పర్యటించినున్నారు. షిండే ఆదివారం మధ్యాహ్నానికి అయోధ్యకు చేరకుని నిర్మాణంలో ఉన్న రామ మందిరం దర్శనం చేసుకుని సాయత్రం సరయునదికి మహా హరతి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేగాదు ఆదివారం రాత్రికే ముంబైకి తిరిగి చేరుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయంలో విలేకరులతో కాసేపు ముఖ్యమంత్రి షిండే ముచ్చటించారు. అయోధ్య పర్యటనపై వచ్చి విమర్శల గురించి విలేకరులు ప్రశ్నించగా..తన చేతల ద్వారానే దానికి సమాధానం ఇస్తానని చెప్పారు. మమ్మల్నే లక్ష్యంగా చేసుకునే ముఖ్యమంత్రి, పైగా ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రానివారు తొలిసారిగా ప్రజను కలవాలని వెళ్లడం మంచిదే అని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షిండే విలేకరులకు ఇలా బదులిచ్చారు. అయోధ్య పర్యటన గురించ ప్రస్తావిస్తూ.. అది తన విశ్వాసానికి సంబంధించిన విషయం అని నొక్కి చెప్పారు. రామ మందిర నిర్మాణాన్ని వేగవంతం చేసినందుకు మోదీకి ధన్యవాదాలు అని కూడా చెప్పారు. గత నవంబర్‌లో షిండే తన మద్దతుదారులతో కలిసి ఇలానే కామాఖ్య ఆలయాన్ని సందర్శించినప్పుడూ కూడా ఇలానే తీవ్ర స్థాయిలో విమర్శులు రావడం గమనార్హం. (చదవండి: ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!) -
యూట్యూబర్ అదితి అగర్వాల్ సక్సెస్ జర్నీ..మీరు ఫిదా!
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిఅనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఔత్సాహిక టీనేజర్లు,యువభారతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వంటలు, చిట్కాలు, యోగాలు, కిచెన్ గార్డెనింగ్ దగ్గర్నించి, బిజినెస్, రాజకీయాలు ఇలా పలు కేటగిరీల్లో సక్సెస్ఫుల్ యూటూబర్లుగా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఢిల్లీకి చెందిన భువన్ బామ్ నుండి ముంబైకి చెందిన ప్రజక్తా కోలి వరకు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ అదితి అగర్వాల్. అద్దె ఇంట్లో మొదలు పెట్టిన ప్రయాణంలో ఇపుడు సొంత ఫ్లాట్‌తో పాటు దాదాపు 70 లక్షల మంది మద్దతుతో ఈ స్థాయికి చేరడం వెనుక ఏళ్ల కష్టం ఉంది. యూట్యూబ్‌లో క్రాఫ్టర్ అదితిగా దూసుకుపోతోందిఅదితి అగర్వాల్. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అదితి ప్రయాగ్‌రాజ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశాక అలహాబాద్ యూనివర్శిటీ నుండి డిగ్రీని చేసింది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అదితి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక విధంగా చెప్పాలంటే అదితి ప్రయాణం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఊహాత్మకంగా, ఆకర్షణీయంగా కార్డులు తయారు చేయడం అదితికి చాలా ఇష్టం. అలా ఎనిమిదో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె ఓ కార్డును రూపొందించింది. అది చూసిన టీచర్లంతా ఫిదా అయిపోయారు. అక్కడనుంచి ప్రేరణకు తోడు 11వ తరగతిలో, అదితికి కార్డ్ ఆర్డర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలి సంపాదనగా 300 రూపా యలుఆర్జించింది. ఇది ఇలా ఉండగా, అదితి తన 12వ తరగతిలో NIFT పరీక్షకు హాజరై 205 మార్కులు సాధించింది, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలలో చేరలేదు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) దీంతో తన స్పెషల్ ఇంట్రస్ట్ గిప్ట్స్, కార్డుల మేకింగ్‌లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. 2015లో ఫేస్బుక్లో అదితి కార్డ్ జోన్ పేజీని ప్రారంభించింది. ఆ మరుసటి రోజే ఆమెకు 800 రూపాయల ఆర్డర్ వచ్చింది. తానే స్వయంగా కార్డులను డెలివరీ చేసింది. ఈ ప్రయాణం అంతఈజీగా ఏమీ సాగలేదు. కానీ పట్టువదలకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ పోయింది అదితి. 2017లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే ప్రతిరోజూ ఆమె ఒక వీడియోను అప్లోడ్ చేసేది. సోదరి సాయంతో వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. మదర్స్ డే , ఫాదర్స్ డే ఇలా ఏ అకేషన్‌ను వదులుకోలేదు. రకారకాల గిఫ్ట్స్, కార్డ్‌లను ఆన్లైన్లో విక్రయించడంతో అదితి వీడియోలను అప్లోడ్ చేసేది. అలా కార్డ్ మేకింగ్ వీడియోను వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో మరింత పాపులారీటి పెరిగింది. ఫలితంగా 2018లో లక్షమార్క్‌ను దాటిన అదితి ఛానెల్ సబ్స్క్రైబర్లు 2020 నాటికి 2.60 లక్షలకు చేరుకుంది. ఈ సక్సెస్‌తో 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అదితి 2020లో లక్నోలో రెండు పడకగదుల ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఈలోపు కరోనా రావడంతో 2021లో లక్నోకి మకాం మార్చింది. అదితి ఛానెల్‌పై కోవిడ్-19 ప్రభావం కరోనా సమయంలో, అదితి ఛానెల్ కంటెంట్‌కు ఆదరణ కాస్త తగ్గింది. దీంతో 2.60 లక్షల మంది సభ్యులు 2.54 లక్షలకు పడిపోయారు. ఈ సమయంలో కాస్త నిరాశ పడినా, ఆ తర్వాత అదితి తన తల్లి సపోర్ట్‌తో ప్రతిరోజూ వీడియోలు అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. చివరికి వీడియో ఒకటి వైరల్ కావడంతో కేవలం 15 రోజుల్లో సబ్స్క్రైబర్లు 10 లక్షల మంది చేరారు. ప్రస్తుతం అదితి యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుండటం విశేషం. ఈ రోజు సంపాదన 6 అంకెలలో. అదితికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.9 లక్షల మంది, ఫేస్బుక్లో 2.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రేసు గుర్రంలా పరిగెట్టాల్సిందే యూట్యూబర్ కావాలనుకునే వారికి టిప్స్ ఇస్తూ..సక్సెస్ రావాలంటే లాంగ్ రేసు తప్పదని, చాలామందికి సడెన్‌గా సక్సెస్ వచ్చినా మాయమైపోతుందని, దాన్ని నిలుపు కోవడం ముఖ్యమని సూచిస్తుంది. అందుకే రేసు గుర్రంలా మారితే గొప్ప విజయాన్ని అందుకోలేమని చెబుతుంది అదితి. తనకు కూడా సక్సెస్ రావడానికి ఆరేళ్లు పట్టిందంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) YouTube ప్రశంసలు అనేక ఈవెంట్లకు ఆహ్వానం అదితి విజయాన్ని యూట్యూబ్ కూడా ప్రశంసించింది. DIY ఈవెంట్‌కి ఆహ్వానాన్ని అందుకుంది. ఇంకా మెటా అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చింది.