మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే అయోధ్యలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటను విషయమై సర్వత్ర విమర్శలు రావడంతో అది తన నమ్మకానికి సంబంధించిన విషయం అని ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన అయోధ్య పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రమే ముంబై విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి విమానంలో లక్నోకు వెళ్లి..అయోధ్యలోని రామమందిరంలో ప్రార్థనలు చేయనున్నారు.
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా షిండే అయ్యోధ్యలో పర్యటించినున్నారు. షిండే ఆదివారం మధ్యాహ్నానికి అయోధ్యకు చేరకుని నిర్మాణంలో ఉన్న రామ మందిరం దర్శనం చేసుకుని సాయత్రం సరయునదికి మహా హరతి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేగాదు ఆదివారం రాత్రికే ముంబైకి తిరిగి చేరుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో ముంబై విమానాశ్రయంలో విలేకరులతో కాసేపు ముఖ్యమంత్రి షిండే ముచ్చటించారు. అయోధ్య పర్యటనపై వచ్చి విమర్శల గురించి విలేకరులు ప్రశ్నించగా..తన చేతల ద్వారానే దానికి సమాధానం ఇస్తానని చెప్పారు. మమ్మల్నే లక్ష్యంగా చేసుకునే ముఖ్యమంత్రి, పైగా ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రానివారు తొలిసారిగా ప్రజను కలవాలని వెళ్లడం మంచిదే అని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో షిండే విలేకరులకు ఇలా బదులిచ్చారు. అయోధ్య పర్యటన గురించ ప్రస్తావిస్తూ.. అది తన విశ్వాసానికి సంబంధించిన విషయం అని నొక్కి చెప్పారు. రామ మందిర నిర్మాణాన్ని వేగవంతం చేసినందుకు మోదీకి ధన్యవాదాలు అని కూడా చెప్పారు. గత నవంబర్‌లో షిండే తన మద్దతుదారులతో కలిసి ఇలానే కామాఖ్య ఆలయాన్ని సందర్శించినప్పుడూ కూడా ఇలానే తీవ్ర స్థాయిలో విమర్శులు రావడం గమనార్హం.
(చదవండి: ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!)
Comments
Please login to add a commentAdd a comment