లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ మరణించగా.. పలువురు పోలీసులు గాయపడ్డారు. కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా భావిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక, ఈ షాకింగ్ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, అఖిలేష్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇది ప్రజాస్వామ్యమా.. ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న కాదు, భద్రత ఎక్కువగా ఉండే చోట ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా కోర్టులో కాల్పుల ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడు. కాల్పులు జరిపిన నిందితుడు బ్రతకడు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు.. కోర్టు కాల్పుల ఘటనపై న్యాయవాదులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో లక్నో సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే పోలీసుల సమక్షంలోనే గ్యాగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని దుండగులు కాల్చి చంపారంటూ నిరసన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: పరీక్ష పత్రాల లీకేజ్‌ల కలకలం.. మొన్న టీఎస్‌పీఎస్సీ, నిన్న టెన్త్ క్లాస్, నేడు జేఈఈ అడ్వాన్స్..
Comments
Please login to add a commentAdd a comment