Akilesh Yadav
-
కాంగ్రెస్‌కు షాక్..! ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కు తాము మద్దతిస్తున్నట్లు ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్(Akilesh Yadav) ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ కాంగ్రెస్‌కు కాకుండా ఆప్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. అఖిలేష్ మద్దతు తెలపడంపై కేజ్రీవాల్(Kejriwal) స్పందించారు. అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అఖిలేష్ తమ కోసం ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారని, తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆప్ ఇటీవల నిర్వహించిన మహిళా అదాలత్ కార్యక్రమంలోనూ అఖిలేష్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణ పోరు జరగనుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్,బీజేపీ మధ్యే ఉండనుంది. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది.ఇదీ చదవండి: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
‘ఎస్పీ’ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
లక్నో:ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది.నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ) వద్ద సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్‌కు వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ ఆరోపించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు.శుక్రవారం(అక్టోబర్11) జయప్రకాష్‌నారాయణ్ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్ యాదవ్ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్‌గేట్ వద్ద పోలీసులు రెండు అడ్డుతెరలు ఏర్పాటు చేయడంపై అఖిలేష్ మండిపడ్డారు.ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జేపీఎన్ఐసీకి వెళ్లేదారిలో శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సెంటర్ మెయిన్‌గేట్ వద్ద బారికేడ్లు ఉంచారు.సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేష్ -
సొంత పార్టీని యోగి ఫూల్ చేశారు: అఖిలేష్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యోగి అంటున్నట్లు తానెవరినీ ఫూల్స్ చేయలేదని, లోక్‌సభ ఎన్నికల్లో యోగి ఆయన సొంత పార్టీ అధిష్టానాన్నే ఫూల్‌ను చేశారని అఖిలేష్ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్‌వాదీ ఫ్లోర్‌లీడర్(ఎల్వోపీ)గా మాతా ప్రసాద్ పాండేను నియమించడంపై అఖిలేష్‌పై యోగి సెటైర్లు వేశారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభం సందర్భంగా ప్రసాద్పాండేకు స్వాగతం చెబుతూనే ఎల్వోపీ పదవి ఇవ్వకుండా మామ శివపాల్‌యాదవ్‌ను అఖిలేష్ ఫూల్‌ను చేశారన్నారు. అఖిలేష్ ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడని చురకలంటించారు.అయినా మామ శివపాల్‌కు మోసపోవడం అలవాటైపోయిందన్నారు. దీనికి స్పందించిన అఖిలేష్ తానెవరినీ ఫూల్‌ను చేయలేదని, యోగి ఏకంగా ఆయన పార్టీ హైకమాండ్‌నే ఫూల్‌ను చేశారని కౌంటర్ ఇచ్చారు. ఇక శివపాల్ యాదవ్ ఇదే విషయమై స్పందిస్తూ 2027లో యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమాజ్‌వాదీపార్టీలో అందరం సమానమేనన్నారు. -
జగన్‌కు మా మద్దతు.. రాజకీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాం: అఖిలేష్ యాదవ్
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్ జగన్‌ను కలిసిన ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. తన పార్టీ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులను వీడియోల ద్వారా అఖిలేష్‌కు జగన్ వివరించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే.. నాకు ఇన్ని వాస్తవాలు తెలిసి ఉండేది కాదు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక విషయం స్పష్టం చేయదల్చాను. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఎదుటివారు చెప్పేది వినాలి. అంతేకానీ, వారి ప్రాణాలు తీయకూడదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు.. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తరవాత అర్ధమైంది. పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.ఇది నిజం.. నిన్నటి వరకు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబుగారు సీఎంగా ఉన్నారు. రేపు మళ్లీ జగన్‌గారు ముఖ్యమంత్రి కావొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్ సంస్కృతిని మా సమాజ్‌వాదీ పార్టీ ఏనాడూ సమర్థించలేదు. దాన్ని తప్పు పడుతున్నాం. చివరకు ప్రభుత్వ పెద్దలు.. అలా బుల్డోజర్ సంస్కృతిని పెంచి, పోషిస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చారు?. అలా చేసి ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా? అది సరికాదు. ప్రజలు సంతోషంగా జీవించాలి. ఎవరైతే ప్రజలను భయపెడుతుంటారో.. వారు మంచి ముఖ్యమంత్రి కారు. అలాగే అది సుపరిపాలన కాదు. మంచి ప్రభుత్వం కాదు. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. ఆ పని చేసే వాళ్లు ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరు... వైఎస్ జగన్ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలంతా ఆయన వెంట నడుస్తున్నారు. ఇది గొప్ప విషయం. జగన్ కూడా ఎప్పుడూ కార్యకర్తలతో మమేకం అవుతారు. అలాంటి నాయకుడు ఈరోజు, తమ కార్యకర్తలో కోసం పోరాడుతున్నారు. రేపు వారే పోరాడి, మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న విధ్వంసాన్ని మీరు అందరికీ చూపాలి. బుల్డోజర్ సంస్కృతి అనేది ఎప్పుడూ, ఎక్కడా మంచిది కాదు. మేం యూపీలో దాన్ని చూశాం. వ్యక్తుల ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మా యూపీలో చూశాం. అంత కంటే మరో దారుణం కూడా చూశాం. ఫేక్ ఎన్కౌంటర్. ఏకంగా పోలీస్ కస్టడీలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఎవరైనా పోలీస్ కస్టడీ సురక్షితం అనుకుంటారు. కానీ, మా దగ్గర ఏకంగా పోలీస్ కస్టడీలోనే ఎన్కౌంటర్ చేశారు... ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. అదే పరిస్థితి మా యూపీలో కూడా చూశాం. మాకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నా కూడా.. ప్రభుత్వంతో పోరాడాము. అంతేకానీ, ప్రభుత్వం ముందు తల వంచలేదు. ఆ తర్వాత మా పార్టీ నుంచి 37 మంది ఎంపీలు గెల్చారు. కాంగ్రెస్ నుంచి కూడా ఆరుగురిని గెలిపించాం. ప్రజల వెంట ఉన్నవారిని, వారు ఎప్పుడైనా ఆదరిస్తారు. కాబట్టి, రేపు వైఎస్ జగన్‌ను ప్రజలే గెలిపించుకుంటారు.బీజేపీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేరమయ రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి ఘటనలను సమర్థించొద్దు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌కు మా మద్దతు ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రేపు మరెవరికైనా జరగొచ్చు. అన్యాయానికి వ్యతిరేకంగా మేమెప్పుడూ పోరాడతాం. అలాంటి వారికి అండగా నిలబడతాం’’ అని అఖిలేష్ ప్రసంగించారు.రాజకీయ టెర్రరిజంపై పోరాడతాంవైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు తెలిపింది. అనంతరం ఆ పార్టీ ఎంపీ వహాబ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ టెర్రరిజాన్ని సహించం. వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి రాజకీయ టెర్రరిజంపై పోరాడతాం. రాజకీయ టెర్రరిజాన్ని ఎదుర్కొవడంలో వైఎస్ జగన్‌కు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం’ అని అన్నారు. -
బీజేపీకి 8 సార్లు ఓటు! యూపీ యువకుడు అరెస్ట్
లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర పదేశ్‌కు చెందిన ఓ యువ ఓటర్ చేసిన పనికి పోలీసుల చేత అరెస్ట్ అయ్యాడు.నాలుగో విడత పోలింగ్‌లో యూపీలోని ఫరూఖాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓ యువ ఓటరు ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు షేర్ చేయడంతో పోలీసులు స్పందించారు.BIG EXPOSE 🚨⚡Akhilesh Yadav has shared this video from Uttar Pradesh in which a boy has voted 8 times for BJP with different slips Hi @ECISVEEP when are you going to wake up from your sleep? This is violation of election code, and must go for repolling on this booth. pic.twitter.com/Z06u9xqDor— Amockxi FC (@Amockx2022) May 19, 2024 ఏఆర్ఓ ప్రతీత్ త్రిపాఠి ఫిర్యాదు ఆధారంగా నయా గావ్ పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువకుడిని రాజన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.అతను ఫరూఖాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్‌కు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంపై 8 సార్లు నొక్కి ఓటు వేసిననట్లు వీడియోలో తెలుస్తోంది.ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్పందించారు. ‘ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనించాం. జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటారు’అని అన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రంలోని అధికారులను పోల్ ప్యానెల్ సస్పెండ్ చేసింది. ‘ప్రియమైన ఎలక్షన్ కమిషన్, మీరు ఇది చూశారా? ఒక వ్యక్తి 8 సార్లు ఓటు వేశాడు. ఇది స్పందించాల్సి సమయం’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో పేర్కొంది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం దినికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అదేవిధంగా ‘ఈ ఘటనను ఎన్నికల సంఘం తప్పుగా భావిస్తే.. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే బీజేపీ బూత్ కమిటి నిజమైన లూటీ చేసే కమిటీ అని అర్థమవుతుంది’అని అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
‘75 ఏళ్లకు రిటైర్ కానని మోదీ చెప్పలేదు’.. కేజ్రీవాల్ విమర్శలు
లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయస్సు, రిటైర్మెంట్పై విమర్శలు సంధించారు. ఇప్పటి వరకు పీఎం మోదీ.. తాను 75 ఏళ్ల వయస్సు దాటాక రిటైర్ కానని, ఎక్కడా స్పష్టం చేయలేని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఆప్, సమాజ్‌వాదీ పార్టీ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో పాటు కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు.‘ప్రధాని మోదీ తనకు 75 ఏళ్లు దాటాక, తాను పదవీ విరమణ చేయనని.. ఎప్పుడూ స్పష్టం చేయలేదు. 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలనే నిబంధనను మోదీ ఉల్లంఘించరని దేశం మొత్తం నమ్మకంతో ఎదురుచూస్తోంది’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.‘బీజేపీ అమిత్ షాను ప్రధాని చేయటం కోసం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం.. సీనియర్ నేతలైన శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారిని పక్కకు పెట్టింది. దీనికి అడ్డుగా ఉన్న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను కూడా మరో 2-3 నెలల్లో బీజేపీ పక్కకు పెడుతుంది’ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.ఇక.. ఇటీవల తిహార్ జైల్ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఓర్యాలీలో పాల్గొని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.‘ ఈసారి బీజేపీ గెలిస్తే.. అమిత్ షాను ప్రధానిగా చేయాలని బీజేపీ ప్రణాళిక వేస్తుంది. ఎందుకుంటే 2025 వరకు మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. దీంతో బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం మోదీ.. ఏ పదవీ చేపట్టకుండా రిటైర్ అయిపోతారు. తర్వాత అమిత్ షా పీఎం అవుతారు’అని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ‘నరేంద్ర మోదీ 2029 వరకు అంటే.. పూర్తి ఐదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత కూడా బీజేపీ పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మోదీ వయస్సుపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు’ అని అమిత్ షా స్పష్టం చేశారు. -
పోలింగ్ బూత్‌లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మద్దతు దారులు పోలింగ్ బూత్‌లను లూటి చేస్తున్నారంటూ ఉత్తర్ ప్రదేశ్ సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న 10 లోక్‌సభ స్థానాల్లో మూడో విడతలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో తన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మైన్‌పురి నియోజకవర్గంలో ఎటావాలో ఓటు వేశారు.రైతులు ప్రాణాలు కోల్పోయారనిఅనంతరం బీజేపీపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. బీజేపీలో అధికార పోరు నడుస్తోందని, అందుకే ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతికేరంగా వెయ్యి మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.లఖింపూర్ ఖేరీ హింసాకాండపైఈ సందర్భంగా 2021లో జరిగిన లఖింపూర్ ఖేరీ హింసాకాండను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో ఉన్న ఓ నలుగురు అగంతకులు రైతులను ఢీకొట్టారని ఆరోపించారు. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ద్వజమెత్తారు. ఐదు లక్షల ఓట్లతో డింపుల్ యాదవ్ కాగా, సైఫాయిలో ఓటు వేసిన ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని కాపాడే పోరాటమని, మైన్‌పురి స్థానంలో డింపుల్ యాదవ్ ఐదు లక్షల ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
కొవిషీల్డ్ వివాదం.. బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఫైర్
లక్నో: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదంపై సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ప్రజలకు గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సైంటిస్టులు తేల్చితే దీనికి బాధ్యులెవరని అఖిలేశ్ ప్రశ్నించారు. సామాన్య ప్రజల జీవితాలను కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని మండిపడ్డారు. ఈ విషయమై బుధవారం(మే1) అఖిలేశ్ ఇటావాలో మాట్లాడారు. వ్యాక్సిన్ల విషయంలో బీజేపీ పెద్ద నేరం చేసిందన్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం కంటే పెద్ద నేరమన్నారు. ‘‘ఏక్ మే ఔర్ బీజేపీ గయ్’’ అని ఎద్దేవా చేశారు.మరోవైపు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా కొవిషీల్డ్ వివాదంపై స్పందించారు. ఒకపక్క కొవిషీల్డ్‌తో ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కేంద్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పడమేంటన్నారు. యువత గుండె జబ్బులతో కుప్పకూలడానికి వ్యాక్సిన్‌కు లింక్ ఉందన్న ప్రచారం జరుగుతోందని చెప్పారు. కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమేనని వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకా ఒప్పుకోవడంతో వివాదం రేగింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 90 శాతం మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్నే తీసుకోడం గమనార్హం. — ANI (@ANI) May 1, 2024 -
UP: లోక్‌సభ బరిలో అఖిలేశ్.. మళ్లీ అక్కడి నుంచే
లక్నో: సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ సీటు నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేత రాంగోపాల్‌యాదవ్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించారు. అఖిలేశ్ కన్నౌజ్ నుంచి గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఎంపీగా పోటీ విషయాన్ని అఖిలేశ్‌ను మీడియా అడగ్గా నామినేషన్ వేసినపుడు తెలుస్తుందన్నారు.కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున తొలుత తేజ్‌ప్రతాప్ యాదవ్ బరిలో ఉంటారని ప్రకటించారు. అయితే తేజ్‌ప్రతాప్ అభ్యర్థిత్వాన్ని పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోవడంతో అఖిలేశ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.గతంలో ఎస్పీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లడంతో ఎంపీ పదవికి దూరమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది.ఇదీ చదవండి.. కేరళలో ముగియనున్న ఎన్నికల ప్రచారం -
కన్నౌజ్ నుంచి తేజ్ కాదు..అఖిలేష్?
లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేయనున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ తన మేనల్లుడు తేజ్ ప్రతావ్ యాదవ్‌ను ఇటీవల కన్నౌజ్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కన్నౌజ్ ఎస్పీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేష్ ఇక్కడి నుంచి పోటీచేసే విషయమై ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.ఏప్రిల్ 25న కన్నౌజ్ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయవచ్చని నేతలు అంటున్నారు. కన్నౌజ్ సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. అయితే గత రెండు దఫాల్లో ఈ స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది. 2019లో డింపుల్ యాదవ్ ఈ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. తాజాగా పార్టీ ఇక్కడ నుండి తేజ్ ప్రతావ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు అఖిలేష్ తమ కంచుకోటను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజ్ ప్రతాప్ యాదవ్ పేరు ప్రకటించిన తరువాత, స్థానిక నేతల అఖిలేష్ యాదవ్‌పై ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ నేపధ్యంలో అఖిలేష్ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తేజ్ ప్రతాప్ యాదవ్‌తో చర్చించనున్నారట. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న అఖిలేష్ కన్నౌజ్ నుంచి పోటీ చేయడం ఖాయమనే మాట వినిపిస్తోంది. -
‘మా విశ్వాసంపై దాడి’.. రాహుల్, అఖిలేష్‌పై ప్రధాని మోదీ విమర్శలు
లక్నో: ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో శుక్రవారం పాల్గొని మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ‘ప్రతి పక్షాలు మా(బీజేపీ) విశ్వాసంపై దాడి చేసి.. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు చేస్తున్నాయి. మరోసారి ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువరాజులు కొత్త సినిమా తీస్తున్నారు. అయితే ఇప్పటికే వారు తీసిన సినిమాను తిరస్కరించారు. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు ముసుగులోనే ప్రతీసారి ప్రతీపక్షాలు ఉత్తరప్రదేశ్ ప్రజలను ఓట్ల అడుగుతారు. ..ప్రతిపక్ష నాయకులకు మా విశ్వాసంపై దాడి చేస్తున్నారు. కానీ వాటికి మాపై దాడి చేసే అవకాశమే లేదు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి భారత్ మాతాకి జై అనడానికి కూడా ఇబ్బంది పడతాడు. అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తిరస్కరించాయి. ప్రతి రోజు ప్రతిపక్ష పార్టీలు రాముడిని, సనాతన ధర్మాన్ని దూషిస్తాయి. సమాజ్‌వాదీ పార్టీ నేతలు రాముడి భక్తులను కపటంతో కూడిన వ్యక్తులని బహిరంగా వ్యాఖ్యానిస్తారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. -
బీజేపీ 150 సీట్లకే పరిమితం: రాహుల్ గాంధీ
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కాంగ్రెస్, ఎస్పీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేను. 15-20 రోజుల క్రితం బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నా. కానీ, బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుంది. బీజేపీ కేవలం 150 సీట్లలో మాత్రమే గెలుస్తుంది. మాకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. మాది ఉత్తరప్రదేశ్‌లో చాలా బలమైన కూటమి. మాకు మంచి ఫలితాలు వస్తాయి. గత పదేళ్లలో ప్రధాని మోదీ నోట్లరద్దు చేశారు. బడా వ్యాపారవేత్తల కోసం తప్పడు జీఎస్టీ అమలు చేసి ఉపాధి తగ్గించారు. యువతకు ఉపాధి కోసం మేము 23 విప్లవాత్మకమైన ఆలోచనలు చేశాం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసినవారికి అప్రెంటిస్‌షిప్ హక్కును కల్పిస్తాం. యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తాం. కోట్లాది మంది యువతకు ఈ హక్కులు కల్పిస్తాం. పేపర్ లీకులు జరగకుండా చట్టం చేస్తాం’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మోదీ అవినీతికి ఛాంపీయన్ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పథకమని అన్నారు. అదేవిధంగా అవినీతిలో ప్రధాని మోదీ ఒక ఛాంపీయన్ అని మండిపడ్డారు. ప్రధాని స్క్రిప్ట్ ఆధారంగా ఇంటర్వ్యూలో మాట్లడారని ఎద్దేవా చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడారు. అందులో ఎన్నికల బాండ్ల గురించి ప్రస్తావించారు. ఎన్నికల బాండ్లు రాజకీయాల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చామని సమర్థించుకున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది. పారదర్శకత కోసమే అయితే బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఎందుకు దాచారు. ఏయే తేదీల్లో విరాళాలు అందజేశారో ఎందుకు దాచారు’అని రాహుల్ గాంధీ నిలదీశారు. #WATCH | Ghaziabad, UP: On the upcoming Lok Sabha elections, Congress MP Rahul Gandhi says "I do not do prediction of seats. 15-20 days ago I was thinking BJP would win around 180 seats but now I think they will get 150 seats. We are getting reports from every state that we are… pic.twitter.com/tAK4QRwAGl — ANI (@ANI) April 17, 2024 సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి అనేది ఒక కొత్త ఆశాకిరణమని తెలిపారు. మెనిఫెస్టోలో పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. రైతుల ఆదాయం పెంచాలని, పేదరికం నిర్మూలించాలని ఇండియా కూటమిలో అన్ని రాజకీయ పార్టీలు పంటలకు ఎంఎస్పీ మద్దతు ధర కల్పిస్తామని చెబుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రతిపక్షాల ఇండియా కూటమి ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీని తుడిచిపెడుతుందని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. #WATCH | Ghaziabad, Uttar Pradesh: SP chief Akhilesh Yadav says, "INDIA alliance is the new hope in the elections and as Rahul ji said that there are many things in his manifesto by which poverty can be eradicated. Adding to that I want to say that the day the farmers of our… pic.twitter.com/QyJL3Y7oEs — ANI (@ANI) April 17, 2024 -
బీజేపీలో సస్పెన్స్.. బ్రిజ్ భూషణ్‌కు టికెట్ దక్కేనా?
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్, రాయ్‌బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ మే 3. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ.. మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు. బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు.. కైసర్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్‌గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు బ్రిజ్‌భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ఎస్పీలో సందిగ్ధం.. ‘కైసర్‌గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కైసర్‌గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్‌కు దక్కేనా..? బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్‌సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
రాహుల్, అఖిలేష్‌లది ఓ ఫెయిల్యూర్ సినిమా: మోదీ
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్‌లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడించటమే టార్గెట్‌గా ఇండియా కూటమిలో ఎస్పీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్, ఎస్పీ పొత్తు ఒక ఫెయిల్యూర్ సినిమా వంటిదని మోదీ ఎద్దేవా చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ పెట్టుకున్న పొత్తు ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. ఇద్దరు బాలురి (రాహుల్, అఖిలేష్)సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. ‘బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే 400 సీట్లు గెలువకుండా ప్రతిపక్షాలు పోటి చేస్తున్న మొదటి ఎన్నికలు ఇవి. సమాజ్‌వాదీ పార్టీ.. కాగ్రెస్ కోసం గంట గంటకు అభ్యర్థులను మార్చుకునే స్థితిలోకి వెళ్లిపోయింది. వారి బలమైన స్థానాల్లో సైతం పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఎస్పీ ఉంది. ఇద్దరు బాలురి(రాహుల్, అఖిలేష్) సినిమా గతంలో ఫెయిల్యూర్ అయింది. అయినా మళ్లీ ఇప్పుడు జతకట్టారు’ అని మోదీ అన్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు ఇద్దరు సుమారు ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రాలో రోడ్డు షోలో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక..లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పోత్తులో భాగంగా మొత్తం 80 సీట్లలో ఎస్పీ-63 స్థానాల్లో, కాంగ్రెస్-17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. -
అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు
లక్నో: యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. యూపీ అక్రమ మైనింగ్ కేసులో రేపు విచారణకు తమ ఎదుట హాజరు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మైనింగ్‌లకు సంబంధించి ఈ-టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే..సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీసుల్లో కోరింది. మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ.. 2012-16 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాధికారులు అడ్డగోలుగా అక్రమ గనులకు అనుమతులు మంజూరు చేశారని.. చట్టవిరుద్ధంగా లైసెన్లను రెన్యువల్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. -
రాహుల్ యాత్రకు ఆహ్వానం లేదు: అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే యాత్రకు రావాల్సిందిగా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఎన్నో పెద్ద ఈవెంట్లు జరుగుతుంటాయని, అన్నిటికి తమను పిలవరని అన్నారు. వెంటనే దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాంరమేష్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ న్యాయ యాత్ర షెడ్యూల్ ఇంకా ఖరారవలేదు. ఒకట్రెండు రోజుల్లో టూర్ షెడ్యూల్ ఫైనల్ అవుతుంది. న్యాయ యాత్రకు అఖిలేశ్ హాజరైతే ఇండియా కూటమి ఇంకా బలోపేతం అవుతుంది’ జైరాం రమేష్ అన్నారు. రెండవ విడత మణిపూర్ నుంచి వరకు ప్రారంభమైన రాహుల్‌గాంధీ న్యాయ యాత్ర ఐదు రాష్ట్రాల్లో టూర్ పూర్తి చేసుకుంది. యాత్రలో ఈసారి ఎక్కువ భాగం రాహుల్‌గాంధీ బస్సులోనే పర్యటించారు. ఈ నెల 16న న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇండియా కూటమి ఉంటుందా? అఖిలేశ్ కీలక ట్వీట్
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టు ఇందుకు కారణమవుతోంది. ‘ఇండియా కూటమిలో భాగంగా ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తుకు మంచి ప్రారంభం లభించింది. యూపీలో 11 బలమైన సీట్లను కాంగ్రెస్‌కు ఇస్తున్నాం‘ అని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నిజానికి కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీని యూపీలో అడిగింది 13 సీట్లు. దీనికి అఖిలేశ్ ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్‌కు కేవలం 11 సీట్లే ఆయన ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ 13 సీట్ల కోసం కాంగ్రెస్ పట్టుపడితే పొత్తు వ్యవహారంలో మొదటికే మోసం వస్తుందన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అఖిలేశ్ పోస్టుపై యూపీ కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్ అవినాష్ పాండే స్పందించారు. ‘సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకంలో చర్చల్లో మంచి పురోగతి ఉంది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ పోస్టు తాను కూడా చూశానని అయితే ఆయన వ్యాఖ్యలపై మరింత సమాచారం ఏదీ లేదు’అని పాండే అన్నారు. కాగా, బిహార్ లాంటి కీలక రాషష్ట్రంలో జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ ఇప్పటికే ఇండియా కూటమిని వీడుతున్నట్లు స్పష్టమైపోయింది. ఆయన బీజేపీతో మళ్లీ జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై ఎటూ తేల్చలేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల వరకు ఇండియా కూటమిలో ఎన్ని పెద్ద పార్టీలు మిగులుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదీచదవండి.. తొమ్మిదోసారి నితీశ్ ప్రమాణస్వీకారం నేడే -
‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’
లక్నో: ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూపంలో మరో భారీ షాక్ తగలనున్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇప్పటికే కూటమి నుంచి బయటకు వచ్చి.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పంజాబ్‌లో ఆప్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు మరో కీలకమైన పార్టీ జేడీ(యూ) కూడా కూటమి నుంచి వైదొలగనుందని తెలుస్తోంది. బిహార్ సీఎం నితీష్ కుమారు దీని కోసం పావులు కదపుతున్నారని సమాచారం. దాని కోసం ఆయన ప్రస్తుత సీఎం పదవి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి మళ్లీ 9వ సారి సీఎం ప్రమాణస్వీకారం చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరైనా ప్రధానమంత్రి పదవికి అర్హులేనని తెలిపారు. ఇక.. కూటమిలో ఎవరినైనా ప్రధాని చేయటానికి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. అటువంటి స్వేచ్ఛ ప్రతిపక్షాల కూటమిలో ఉంటుందని చెప్పారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఉంటే ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లో తాను ఎప్పుడు పాల్గొంటాననే విషయాన్ని సరైన సమయలో వెల్లడిస్తానని అన్నారు. నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న వార్తలపై అఖిలేష్ యాదవ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటగా నితీష్ కుమార్ చొరవ తీసుకొని మరీ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆయన కూటమిలోనే ఉంటే ప్రధాని అవుతారని అన్నారు. చదవండి: బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న కాదు.. కాల్పులపై అఖిలేష్ ఫైర్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ మరణించగా.. పలువురు పోలీసులు గాయపడ్డారు. కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా భావిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ షాకింగ్ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, అఖిలేష్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇది ప్రజాస్వామ్యమా.. ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న కాదు, భద్రత ఎక్కువగా ఉండే చోట ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కోర్టులో కాల్పుల ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడు. కాల్పులు జరిపిన నిందితుడు బ్రతకడు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు.. కోర్టు కాల్పుల ఘటనపై న్యాయవాదులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో లక్నో సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే పోలీసుల సమక్షంలోనే గ్యాగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని దుండగులు కాల్చి చంపారంటూ నిరసన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: పరీక్ష పత్రాల లీకేజ్‌ల కలకలం.. మొన్న టీఎస్పీఎస్సీ, నిన్న టెన్త్ క్లాస్, నేడు జేఈఈ అడ్వాన్స్.. -
జనవరి 18న బీఆర్ఎస్ భేరీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలో నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో భారీ జన సమీకరణపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తక్కువగానే ఉంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కారు జోరుగా పరుగెత్తితే.. ఖమ్మంలో మాత్రం చతికిలపడింది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, ఆ తర్వాత మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ పట్టు బిగిస్తూ వచి్చంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా ఖమ్మం నుంచే కదం బీఆర్ఎస్ కదం తొక్కేలా చేయాలని అధినాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. ఖమ్మం వేదిక నుంచే వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. భారీ జన సమీకరణపై నజర్.. ఈ నేపథ్యంతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున సభకు భారీయెత్తున జనాన్ని సమీకరించడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి ఈ సభకు జన సమీకరణ చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలకు చేరువగా, మమేకమయ్యేలా.. రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న సీఎం కేసీఆర్.. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇందుకు సమాయత్తం చేస్తూనే, తాను స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాలను కూడా పరుగులెత్తించాలని నిర్ణయించారు. ప్రజలకు చేరువగా, వారితో మమేకమయ్యేలా వీటిని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికార యంత్రాంగంతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ప్రజల్లోకి ప్రజా ప్రతినిధులు.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమైతే రాష్ట్రంలో ఈ సంవత్సరాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్ నెలను టార్గెట్‌గా పెట్టుకొని మూడు నెలలకు ముందే ఎన్నికలకు సిద్ధమయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పట్నుంచే ప్రజల్లోకి వెళ్లి మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. గ్రామ వార్డు సభ్యుడి నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేల వరకు.. సంక్రాంతి తరువాత నుంచి ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. బలమైన కార్యవర్గాల నియామకం! టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో పారీ్టకి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో బలమైన కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేసీఆర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గంతో పాటు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణ, ఏపీకి చెందిన ముఖ్య నాయకులు కొందరికి ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల బాధ్యతలను అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అలాగే రాష్ట్ర కమిటీలోకి తీసుకునేందుకు కొందరు ముఖ్యమైన నాయకులను ఎంపిక చేసినట్లు తెలిసింది. -
ములాయం ప్రాభవం కొనసాగేనా?
యాదవుల పార్టీగా మొదలైన సమాజ్ వాదీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం సింగ్ యాదవ్ మార్చివేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్ వాదీ రంగం మీద ఉందంటే దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలాలను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. ములాయం అనంతర సమాజ్ వాదీలో ఈ గుణాలు కొరవడుతున్నందున యాదవులు వేరే రాజకీయ వేదికలను వెతుక్కునే వీలు ఏర్పడుతోంది. అదే జరిగితే సమాజ్‌వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం ముగిసిపోతాయి. భారతదేశంలో 1970ల అనంతరం సోషలిస్టు ఉద్యమానికి సంబంధించి అత్యంత సుపరిచితుడైన నేత ములాయం సింగ్ యాదవ్. ఆయన అస్తమ యంతో భారత రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసిపోయింది. ములాయం 1950లలో స్కూల్ టీచర్‌గా పని చేశారు. 1967లో తొలుత ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ తన అగ్రకుల (ప్రధానంగా బ్రాహ్మణుల) పునాదితో ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న కాలం. 1974లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ ప్రధాన ప్రతిరూపంగా ములాయం ఆవిర్భవిం చారు. కాలం గడిచేకొద్దీ యాదవ కుల నేతగా, దాని పొడిగింపుగా వెనుకబడిన కులాల నేతగా ములాయం తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో, తక్కిన దేశంలో కూడా చాలా విషయా లకు ఆయన గుర్తుండిపోతారు. కానీ ఆయన ప్రధాన విజయం, యూపీ రాజకీయాల్లో యాదవ ఆధిపత్యాన్ని సంఘటిత పర్చడమే. కాంగ్రెస్ పార్టీకి ఇది తెలిసి ఉండదని చెప్పలేము. ఎందుకంటే అత్యంత ఆధిపత్యం, దూకుడుతనం, రాజకీయ జాగరూకతతో కూడిన యాదవ కుల ప్రాధాన్యతను ఆ పార్టీ గుర్తించింది. అనేకమంది నాయకుల పూర్వ వైభవం దీనికి సాక్షీభూతంగా నిలుస్తుంది. వీరిలో మొదటివారు చంద్రజిత్ యాదవ్. ఈయన 1967లో, 1971లో లోక్‌సభలో అజాంగఢ్ ఎంపీగా వ్యవహరించారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ తన ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి గట్టిగా ప్రయత్నించిన మరొక యాదవ నేత బలరాం సింగ్ యాదవ్. ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ సభ్యుడిగా, కేంద్ర ఉక్కు, గనుల శాఖా మంత్రిగా చాలాకాలం ఈయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. కాంగ్రెస్‌తో 38 సంవత్సరాల అనుబంధం తెగదెంపులు చేసుకుని 1997లో పార్టీని వదిలిపెట్టేశారు. ములాయంకు అపరిమితా నందం కలిగిస్తూ సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందాక యూపీలో యాదవ సామాజిక వర్గం బలం మరింత పెరిగింది. దీనితో కొత్తగా ఏర్పడిన జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రామ్ నరేశ్ యాదవ్‌ను ఎంపిక చేసుకోవలసి వచ్చింది. అయితే ఈయన రాజకీయంగా దుర్బలుడు కావడంతో ములాయం ప్రభ ముందు వీగిపోయారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో యాదవ కుటుంబాలను ఏకం చేయడంలో ములాయం అవిశ్రాంతంగా కృషి చేశారు. రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని యాదవుల మధ్య పెద్దగా సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి కావు. ఈ రెండు ప్రాంతాల్లో గ్రూపులుగా విడిపోయి ఉండటం కంటే రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు బలం పెంచుకోవలసిన అవసరం ఉందని నచ్చజెప్పడంలో కూడా ములాయం విజయం సాధించారు. ములాయంపై ప్రజా విశ్వాసం ఎంతగా పెరిగిందంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పదిసార్లు గెలుపొందుతూ వచ్చారు. అలాగే ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఈ కాలం పొడవునా, ఆయన తన సమీప, దూరపు కుటుంబ సభ్యులను తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి చేరేలా సిద్ధం చేస్తూ వచ్చారు. ఒక సమయంలో ఇలా రాజకీయాల్లో చేరిన ఆయన బంధువుల సంఖ్య మూడు డజన్లకు మించి ఉండేదని చెప్పుకొనేవారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లోనూ, తన ఓటు పునాదిని బలోపేతం చేసుకోవడంలోనూ ములాయం అంకిత భావానికి ఇది కొలమానంగా చెప్పవచ్చు. అదే సమయంలో బిహార్‌లో జేపీ ఉద్యమం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, కర్పూరీ ఠాకూర్, నితీశ్ కుమార్ వంటి పలువురు నేతలు పుట్టుకురాగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ములాయం ఏకైక నేతగా ఆవిర్భవించారు. జనతా, జనతాదళ్, లోక్ దళ్ ఎక్కడున్నా సరే... యాదవ నేతలు ఆయన వెన్నంటే నిలిచేవారు. పొత్తులు పెట్టుకోవడంలో, వాటిని విచ్ఛిన్నపర్చడంలో ములాయం సత్తాను ఇతర నేతలందరూ ఆమోదించాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ వంటి అన్నిపార్టీలలో తనకు ప్రయోజనం కోరుకున్న ప్రతి సందర్భంలోనూ ములాయం ఈ శక్తిని ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలోనే ములాయం మూడుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో బీజేపీతో పొత్తు కలిపి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పర్చడం ములాయం రాజకీయ దురంధరత్వానికి మచ్చుతునక. తర్వాత 1991 నుంచి రామాలయ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బీఎస్పీతో పొత్తుతో 1993లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతితో దశాబ్దాలపాటు వ్యక్తిగత స్థాయిలో బద్ధ శత్రుత్వం కొనసాగింది. తర్వాత కాంగ్రెస్ మద్దతుతో 2003లో ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ వెనువెంటనే విదేశీ మూలాలున్న వ్యక్తి ప్రధాని కాకూడదనే దృక్ప థంతో సోనియాగాంధీ అభ్యర్థిత్వాన్నే అడ్డుకున్నారు. రాజకీయంగా ములాయం వేసిన కుప్పిగంతులను మల్లయుద్ధ విన్యాసాలుగా పేర్కొనేవారు. ఈ కుప్పిగంతులు యూపీ రాజకీయాల్లో కీలకమైన రాజకీయశక్తిగా నిలబెట్టడంలో ములాయంకు ఎల్లవేళలా తోడ్పడ్డాయి. ముస్లిం–యాదవ సమ్మేళనంతో ఎన్నికల్లో గెలుపొందడంపై ఆరోపణలను ఎదుర్కొన్నారు. కానీ మైనారిటీలను బుజ్జగిస్తున్నారని వచ్చిన ఆరోపణలు ములాయంకు ఎన్నడూ హాని చేకూర్చలేదు. 1990లలో యూపీలో పోలీసు, పురపాలన యంత్రాంగంలో యాదవుల ఆధిపత్యాన్ని పెంచి పోషించారని వచ్చిన ఆరోపణలు కూడా రాజకీయంగా దెబ్బతీయలేక పోయాయి. ఈ అన్ని ఆరోపణలూ వాస్తవానికి ములాయం స్థాయిని అజేయశక్తిగా పెంచాయి. దీనివల్ల ఆయన ప్రాభవం ఉత్తరప్రదేశ్‌ను దాటి ఆయన పార్టీని జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించే వరకు తీసుకుపోయింది. అయితే, 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనయుడు అఖిలేశ్ యాదవ్‌కు కట్టబెట్టాలని ములాయం తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ నిర్ణయాలపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసింది. పార్టీలోని శక్తి కేంద్రాల మధ్య కీలుబొమ్మలా ఉంటున్నారని వ్యాపించిన పుకార్ల మధ్యనే 2012 నుంచి 2017 వరకు అఖిలేశ్ యూపీని పాలించారు. దీనివల్ల అటు పార్టీలోనూ, ఇటు కుటుంబంలోనూ పతనం మొదలైంది. ఈ నేప థ్యంలో ములాయం యూపీ వ్యవహారాల నుంచి మరింతగా దూరం జరిగారు. అదే సమయంలో అఖిలేశ్ ప్రాభవం పెరిగింది. అప్పటి నుంచి ములాయం తన మునుపటి వ్యక్తిత్వానికి కేవలం ఒక ఛాయలా కొనసాగుతూ వచ్చారు. అలాంటి పరిస్థితిలోనూ లాలూ ప్రసాద్ యాదవ్‌తో, ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలగడం ద్వారా ములాయం తన రాజకీయ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్ వాదీ మాత్రమే రంగం మీద నిలబడగలిగిందంటే దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలా లను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. కేవలం యాదవుల పార్టీగా మొదలైన సమాజ్‌వాదీ పార్టీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం మార్చి వేశారు. ములాయం అనంతర సమాజ్ వాదీ పార్టీలో ఈ గుణాలు కొరవడుతున్నందున, యాదవులు తమ రాజకీయ పలుకుబడిని మరెక్కడైనా చూపించుకునే వీలుంది. అదే జరిగిన పక్షంలో సమాజ్ వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం కచ్చితంగానే ముగిసి పోతాయి. రతన్ మణి లాల్ వ్యాసకర్త కాలమిస్టు, టీవీ కామెంటేటర్ (‘ద డైలీ గార్డియన్’ సౌజన్యంతో) -
ములాయం హెల్త్ కండీషన్ సీరియస్.. హుటాహుటిన ఆసుపత్రికి అఖిలేష్!
Mulayam Singh.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ములాయంను గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయితే, కొద్దిరోజులుగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. కాగా, మూలయంకు డాక్టర్ సుశీల కటారియా ఆధ్వర్యంలో వైద్య చికిత్స జరుగుతోందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇక, ములాయం సింగ్ హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ హుటాహుటిన ఢిల్లీ నుంచి ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం. #SamajwadiParty founder Mulayam Singh Yadav shifted to ICU at Gurugram's Medanta hospitalhttps://t.co/dVN0bXMzca — TIMES NOW (@TimesNow) October 2, 2022 -
CM KCR: ఏకమై ఎండగడదాం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో అన్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. బీజేపీ బాధిత పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ చేపడితే తప్ప దీనిని ఎదుర్కోలేమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఐదు రోజులుగా ఢిల్లీ ఉన్న సీఎం కేసీఆర్‌తో శుక్రవారం అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్‌లు భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ సైతం సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన భేటీలో జాతీయ రాజకీయాలు, ముఖ్యమైన ఇతర జాతీయ అంశాలపై చర్చ జరిగింది. త్రైపాక్షిక ఒప్పందాలంటూ ఆర్థిక కట్టడి విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఇటీవల రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లోకి కేంద్రం చొచ్చుకొచ్చిన తీరును ఇరువురు నేతలకు కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించుకుంటున్న సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక సాయం అందించని కేంద్రం, కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న రుణాలపైనా ఆంక్షలు విధిస్తోందని చెప్పారు. రుణాలు, రుణాలపై వడ్డీలను రాష్ట్రమే చెల్లిస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే లక్ష్యంతో ఎన్నడూ లేనివిధంగా త్రైపాక్షిక ఒప్పందాలంటూ కొత్త నిబంధనలు తెచ్చి ఆర్థిక కట్టడి చేస్తోందని వివరించారు. విపక్షాలు ఒక్కతాటిపైకి రావాల్సిందే.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విఫలమై, ఉద్యోగ కల్పనలో చేతులెత్తేసి, పరిమితులకు మించి అప్పులు చేస్తున్న కేంద్రం.. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను శ్రీలంకతో పోల్చడం ఏంటనే భావనను ఎస్పీ నేతలు సైతం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రభుత్వాలను ఈడీ, సీబీఐ కేసులతో భయపెట్టడం, లేదంటే చీలికలను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టడం పరిపాటిగా మారిందని, దీన్ని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్రలో చీలికలకు బీజేపీ ప్రోత్సాహం, పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడులు, గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం, జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలపైనా నేతల మధ్య చర్చ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మతపరమైన అంశాలను ఎగదోస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్న తీరుపైనా చర్చించారు. భావసారూప్య పార్టీలన్నీ ఉద్యమించాలి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న తీరుపైనా నేతల మధ్య చర్చ జరిగింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు అంశాలపై చర్చను కోరుతున్న విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేయడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయా అంశాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేయకుండా.. ప్రశ్నించే ఎంపీల గొంతు నొక్కడం అప్రజాస్వామికమని అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా విపక్షాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బీజేపీ తీరును ప్రతి వేదికపై తిప్పికొట్టాల్సిందేనని, దీనికై భావ సారూప్య పార్టీలన్ని ఉమ్మడిగా ఉద్యమించాల్సిందేనని నేతలు నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎస్పీ నేతలు చెప్పినట్లు సమాచారం. -
బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో.. బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బిజెపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్, ఆజాంఘడ్ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అఖిలేష్ యాదవ్ అహంభావి. కనీసం.. ప్రజలను కూడా కలవలేకపోయాడు. దేశంలోని ముస్లింలు తమకంటూ ఒక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు ఒవైసీ. UP by-poll results show Samajwadi Party is inacapable of defeating BJP, they don't have intellectual honesty. Minority community shouldn't vote for such incompetent parties. Who is responsible for BJP's win, now, whom will they name as B-team, C-team:AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/OSdkdkDWOT — ANI (@ANI) June 26, 2022