అఖిలేష్‌కు బీజేపీ చెక్‌.. రాజ్యసభకు శివపాల్‌? | BJP Checkmate To Akhilesh: Shivpal Singh May Goes Rajya Sabha | Sakshi
Sakshi News home page

యూపీ పోలిటికల్‌ టర్న్‌: అఖిలేష్‌కు బీజేపీ చెక్‌.. రాజ్యసభకు శివపాల్‌?

Published Thu, Mar 31 2022 1:52 PM | Last Updated on Thu, Mar 31 2022 2:29 PM

BJP Checkmate To Akhilesh: Shivpal Singh May Goes Rajya Sabha - Sakshi

యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ ఎత్తుగడ వేసింది.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో అఖిలేష్‌ బాబాయ్‌ శివపాల్‌ సింగ్‌కు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. 

శివపాల్‌ యాదవ్‌ గత రెండురోజులగా ఢిల్లీలో మకాం వేశారు. ఆపై బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ కూడా అయ్యారు. అయితే ఆ భేటీ మర్యాదపూర్వకమైందేనని మీడియాకు వివరించాడు శివపాల్‌ యావ్‌. కానీ, ఈలోపే ఆయనకు రాజ్యసభ సీటును బీజేపీ ఆఫర్‌ చేసిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన శివపాల్‌ యాదవ్‌.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్‌ కూటమితో కలిసి పోటీ చేశారు. అయితే ఆ తర్వాతి పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయని, ఈ తరుణంలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారని, లేదంటే రాజ్యసభ సీటు ఇస్తారనే సంకేతాలు అందుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement