Shivpal Singh Yadav
-
జావెలిన్ త్రోయర్ శివ్పాల్పై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన భారత అగ్రశ్రేణి జావె లిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల శివ్‌పాల్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని 27వ స్థానంలో నిలిచాడు. 2019 ఆసియా చాంపియన్íÙప్లో అతను రజతం సాధించాడు. -
కమలం గూటికి బాబాయ్ శివపాల్ యాదవ్!
-
అఖిలేష్‌కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో అఖిలేష్ బాబాయ్ శివపాల్ సింగ్‌కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. శివపాల్ యాదవ్ గత రెండురోజులగా ఢిల్లీలో మకాం వేశారు. ఆపై బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ కూడా అయ్యారు. అయితే ఆ భేటీ మర్యాదపూర్వకమైందేనని మీడియాకు వివరించాడు శివపాల్ యావ్. కానీ, ఈలోపే ఆయనకు రాజ్యసభ సీటును బీజేపీ ఆఫర్ చేసిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన శివపాల్ యాదవ్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ కూటమితో కలిసి పోటీ చేశారు. అయితే ఆ తర్వాతి పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయని, ఈ తరుణంలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారని, లేదంటే రాజ్యసభ సీటు ఇస్తారనే సంకేతాలు అందుతున్నాయి. -
కుమ్ములాటలు షురూ.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సమాజ్‌వాదీపార్టీలో మళ్లీ కుటుంబ కలహాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. శాసనసభా పక్ష సమావేశానికి తనను పిలవలేదని అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ ఆరోపించారు. సైకిల్ గుర్తుపైనే తానూ గెలిచానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శివపాల్ ఆరోపణలపై ఎస్పీ వివరణ ఇచ్చింది. లక్నోలో జరిగింది ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశమని యూపీ ఎస్పీ చీఫ్ నరేషోత్తమ్ అన్నారు. సోమవారం సాయంత్రం భాగస్వామ్యపక్షాలతో అఖిలేష్ భేటీ అవుతారని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అఖిలేష్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయనను ఎస్పీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేష్ కర్హాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే అజంఘడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. చదవండి: (కోదండరామ్‌కు అరవింద్ కేజ్రీవాల్ ఆఫర్! ఆ పార్టీ విలీనం తప్పదా?) కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్‌వాది పార్టీలో కుటుంబ కలహాలు భగ్గుమన్నాయి. పార్టీపై ఆధిపత్యం కోసం శివపాల్, అఖిలేష్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో 2019లో ఎస్పీ నుంచి బయటకొచ్చిన శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని పెట్టారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు బాబాయ్, అబ్బాయ్‌కి మధ్య రాజీ కుదిరింది. దీంతో జశ్వంత్‌నగర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీచేసి శివపాల్ 90వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. అయితే తాజాగా సైకిల్ గుర్తుపై గెలిచిన తనను ఎస్పీ శాసనసభా పక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై శివపాల్ గుర్రుగా ఉన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శివపాల్ తెలిపారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ చీలిక తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి. -
ఉత్తరప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ
-
శివపాల్ సింగ్ యాదవ్ కొత్త పార్టీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్ సింగ్ యాదవ్ మంగళవారం కొత్త పార్టీని ప్రకటించారు.ఆగస్టులోనే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో మనస్పర్థల కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియాగా రిజిస్ట్రేషన్ చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలనుంచి పోటీచేస్తుందని చెప్పారు. -
'ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్'
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో అంతా సవ్యంగా ఉందని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం గురించి ఆయనను విలేకరులు ప్రశ్నించగా... 'ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్. నేతాజీ(ములాయం సింగ్) ఆదేశాలను పాటిస్తాన'ని సమాధానం ఇచ్చారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ములాయం ఎదుటే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ తలపడ్డారు. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. వేదికపైనే గట్టిగా కేకలు వేసుకున్నారు. అఖిలేశ్ అబద్దాలకోరు అని శివపాల్ ధ్వజమెత్తారు. అఖిలేశ్ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కోవాలని ములాయంకు సూచించారు. తన తండ్రి తప్పుకోమంటే సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధమని అఖిలేశ్ ప్రకటించారు. చివరకు ఇద్దరి మధ్య ములాయం సయోధ్య కుదిర్చారు. శివపాల్ సహా తొలగించిన మంత్రులను తిరిగి కేబినెట్ లో చేర్చుకునేందుకు అఖిలేశ్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ములాయం కుటుంబంలో రేగిన విభేదాలు సమాజ్ వాది పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. -
'ఒట్టు.. పార్టీని నిలువునా చీలుస్తానన్నాడు'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. సమాజ్ వాది పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడై తిరిగి పార్టీలోకి వచ్చిన అమర్ సింగ్ కాలిగోటికి కూడా అఖిలేశ్ సరిపోడని పరుష వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని వేళలా పార్టీకోసం కష్టపడ్డానని, తాను ఏం చేసినా నేతాజీ(ములాయం సింగ్)కోసమే చేశానని చెప్పారు. సమాజ్ వాది పార్టీని చీలుస్తానని, కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానని తనతో అఖిలేశ్ స్వయంగా అన్నాడని, ఈ విషయం తాను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నానని అన్నారు. అమర్ సింగ్ తిరిగి అడుగుపెట్టడం, మంత్రి పదవి నుంచి శివపాల్‌ను తొలగించడం వంటి పరిణామాల తర్వాత ఎస్పీ దాదాపు నిట్టనిలువునా చీలిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన శివపాల్.. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోపక్క, తాజాగా ఏర్పడిన వివాదం విషయంలో సోమవారం ములాయంతో శివపాల్, అఖిలేశ్ వేర్వేరుగా భేటీ అయ్యి పలు విషయాలు కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా ములాయం ముందు శివపాల్ భావోద్వేగానికి లోనయ్యారు. 'సమాజ్ వాది పార్టీకి నేను చేసిన సేవలు చిన్నవా?అఖిలేశ్‌ను సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు మద్దతిచ్చాను. కానీ, నన్ను ఎప్పుడైతే అధ్యక్షుడిగా చేశారో అతడు నా వద్ద ఉన్న ఇతర శాఖలు లాక్కున్నాడు. నేను అఖిలేశ్ కన్నా తక్కువ పనిచేశానా? ముఖ్యమంత్రిగా అతడు చెప్పిన ప్రతీది విన్నాను. అలాగే నేతాజీ చెప్పింది చేశాను. నేను అమర్ సింగ్ తో టచ్ లో ఉన్నది నిజమే. అయితే, ఈ విషయం నేను ఎప్పుడూ దాచలేదు' అని చెప్పాడు. అదే సమయంలో తండ్రి ములాయంకు అఖిలేశ్ కూడా గట్టి వివరణ ఇచ్చాడు. పార్టీ చీఫ్ (శివపాల్) ఏం చేశాడో అందుకు ప్రతిఫలమే ఇదంతా. నేను మీవల్లే(ములాయం వల్లే) ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఉన్నాను. మీకు వ్యతిరేకంగా కుట్ర చేసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించబోను. పార్టీనిగానీ, ములాయంను గానీ బలహీన పరచాలని కుట్ర చేసేవారిపై నేను వెంటనే చర్యలు తీసుకుంటాను' అని అఖిలేశ్ అన్నారు. కాగా, వీరిద్దరితో కలిసి ములాయం సాయంత్రం మరోసారి భేటీ అవనున్నారు.