rajyasabha seat
-
కర్నాటక: రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు.. షెట్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా షెట్టర్ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా షెట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీష్ షెట్టర్ మాట్లాడుతూ.. బీజేపీని వీడకుండా ఉండేందుకు తనకు పార్టీ పెద్దలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే, రాజ్యసభ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. సీట్లు అడిగినా ఇవ్వలేదని ఫైరయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ హైకమాండ్ పలువురు సీనియర్లకు హ్యాండిచ్చింది. పార్టీ టికెట్లు లభించకపోవడంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా.. జగదీష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. -
నగదు ఇస్తే గవర్నర్ పదవి !
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో నగదు ముట్టజెప్తే రాష్ట్ర గవర్నర్ పదవి, రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యేలా చేస్తామని పలు పదవులు ఎరచూపిన ఒక ముఠా గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రట్టుచేసింది. మొత్తంగా రూ.100 కోట్ల మేర నగదు వసూళ్లకు ఈ ముఠా ప్రణాళిక సిద్ధంచేసుకుందని సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల పలు చోట్ల దాడులు చేపట్టింది. ఈ ముఠాకు సంబంధించి మహా రాష్ట్రలోని లాతూర్‌లో కమలాకర్ ప్రేమ్‌కుమార్ బంద్గర్, కర్ణాటకలోని బెల్గామ్‌లో రవీంద్ర విఠల్ నాయక్‌ను, ఢిల్లీలో మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బోరాలను సీబీఐ అరెస్ట్‌చేసింది. ముఠాలో ముఖ్యుడైన కమలాకర్ మిగతావారితో కలిసి పలువురు వ్యక్తులకు పదవులు ఇప్పిస్తామని ఆశచూపాడని సీబీఐ కేసులు పెట్టింది. గవర్నర్ పదవి, రాజ్యసభ సభ్యునిగా ఎంపిక, కేంద్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్ పదవులు ఇప్పిస్తామని పలువురు ప్రముఖులను ఈ ముఠా సంప్రదించింది. పలు కేసుల దర్యాప్తు తమకు అనుకూలంగా సాగాలంటూ పోలీసులనూ కమలాకర్ బెదిరించాడని పేర్కొంది. అరెస్ట్ అయిన అందరికీ సీబీఐ కోర్టు బెయిల్ మంజూరుచేయడం గమనార్హం. -
రూ.100 కోట్లకు రాజ్యసభ సీటు లేదా గవర్నర్ పదవి! రాకెట్ గుట్టు రట్టు
సాక్షి,న్యూఢిల్లీ: రూ.100 కోట్లిస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని దందా నడుపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని పట్టుకుంది. రూ.100 కోట్లిస్తే గవర్నర్ పదవి కూడా ఇప్పిస్తామని నిందితులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు వారాలుగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వెళ్తున్న కాల్స్‌పై నిఘా వహించిన అధికారులు ఎట్టకేలకు నలుగురు నిందితులను గుర్తించి పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన కర్మలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్గార్, కర్ణాటకకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్, అభిషేక్ బూరాగా గుర్తించారు అధికారులు. వీరంతా చాలా కాలంగా ఈ రాకెట్ నడుపుతున్నారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు, గవర్నర్ పదవితో పాటు ప్రభుత్వ సంస్థలకు ఛైర్మన్‌గా నియమిస్తామని నమ్మించి మోసానికి పాల్పడుతున్న తెలుస్తోంది. అంతేకాదు తాము సీబీఐ అధికారులమని చెప్పి పోలీసు శాఖలో అధికారులను కూడా బురిడీ కొట్టించి పనులు చేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు ప్రేమ్‌కుమార్ తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని చెప్పి అభిషేక్ బూరాతో కలిసి కుట్రలు చేసినట్లు సీబీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. చదవండి: కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి! -
నాలుగు స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
-
కమలం గూటికి బాబాయ్ శివపాల్ యాదవ్!
-
అఖిలేష్‌కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో అఖిలేష్ బాబాయ్ శివపాల్ సింగ్‌కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. శివపాల్ యాదవ్ గత రెండురోజులగా ఢిల్లీలో మకాం వేశారు. ఆపై బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ కూడా అయ్యారు. అయితే ఆ భేటీ మర్యాదపూర్వకమైందేనని మీడియాకు వివరించాడు శివపాల్ యావ్. కానీ, ఈలోపే ఆయనకు రాజ్యసభ సీటును బీజేపీ ఆఫర్ చేసిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన శివపాల్ యాదవ్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ కూటమితో కలిసి పోటీ చేశారు. అయితే ఆ తర్వాతి పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయని, ఈ తరుణంలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారని, లేదంటే రాజ్యసభ సీటు ఇస్తారనే సంకేతాలు అందుతున్నాయి. -
ఓటుకు కోట్లు కేసును చేపట్టినందుకేనా...?
టీడీపీ దళిత నేత, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్యకు సీఎం చంద్రబాబునాయుడు మొండి చెయ్యి చూపించారు. రాజ్యసభ పదవికి వర్ల రామయ్య పేరును పరిశీలించిన చంద్రబాబు, చివరకు ఆయన్ను పక్కన పెట్టి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు కట్టబెట్టారు. దీంతో దళిత, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. వర్ల రామయ్య ఆగ్రహంతో రగిలిపోయారు. సాక్షి, విజయవాడ: టీడీపీలో కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారని ఆ పార్టీకి చెందిన దళిత, బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌లతో సమానంగా వర్ల రామయ్యకు రాజ్యసభ సీటును ఎందుకివ్వరని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి వర్ల రామయ్య పార్టీ అభివృద్ధికి కష్ట పడుతున్నారని ఆయనకు ఇచ్చే గుర్తింపు ఇదేనా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో లాబీయింగ్‌లు, బలమైన శక్తులకే కీలకమైన పదవులు దక్కుతాయనే విషయం మరొకసారి నిరూపితమైందని ఆ పార్టీలోని వర్గాలు అంటున్నాయి. సీఐగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి టీడీపీలో చేరిన వర్ల రామయ్యకు 2009 ఎన్నికల్లో చివర నిమిషంలో తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో పామర్రు అసెంబ్లీ సీటు ఇస్తే ఉప్పులేటి కల్పన చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్సీ పదవిని ఆశించినప్పటికీ చివరకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి పామర్రు సీటు కూడా ఇచ్చే అవకాశం లేకపోవడంతో రాజ్యసభ సీటును వర్ల ఆశించి భంగపడ్డారు. చంద్రబాబును ఆకట్టుకునేందుకు.... టీడీపీ అధినేత చంద్రబాబును ఆకట్టుకునేందుకు వర్ల రామయ్య విశ్వ ప్రయత్నం చేశారు. ఇటీవల విజయవాడలో మాదిగల మహాసభను నిర్వహించి మాదిగ హక్కుల పోరాట సమితికి చెందిన ఇద్దరు కీలకనేతల్ని టీడీపీలో చేర్పించారు. అదే సభలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ఆయన దళితులకు న్యాయం చేస్తారంటూ స్తుతించారు. సీటు వస్తుందనే నమ్మకంతో ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో ఆయనకు సీటు రాలేదని తెలుసుకుని నీరుకారిపోయారు. తన కుటుంబసభ్యులతో కలిసి వెనుతిరిగి వెళ్లిపోయారు. పార్టీ నిర్ణయం తనకు బాధ కలిగిస్తోందని ఆయన మీడియాతో బహిరంగంగానే చెప్పారు. ఓటుకు కోట్లు కేసును చేపట్టినందుకేనా...? చంద్రబాబు ఇరుక్కున్న ఓటుకు కోట్లు కేసును హైకోర్టు న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ వాదిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రవీంద్రకుమార్‌కు రాజ్యసభ సీటు ఇచ్చారని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన రవీంద్రకుమార్ గతంలో బెజవాడ బార్ అసోసియేషన్లోనూ పనిచేశారు. ఆయన టీడీపీకి చేసిన సేవ కంటే చంద్రబాబుకు సహాయం చేసినందుకే ఈ పదవి దక్కిందని భావిస్తున్నారు. -
మోగిన రాజ్యసభ నగారా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 2న పదవీకాలం ముగియనున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 23న జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రెండేళ్ల రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సభ్యులతోపాటు.. ఇటీవల సభ్యత్వానికి రాజీనామా చేసిన, మృతిచెందిన సభ్యుల ఖాళీలను కలుపుకుని 17 రాష్ట్రాల్లో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం పెరగనుంది. 58 స్థానాలు ఏప్రిల్ 2న ఖాళీ అవనుండగా.. కేరళ ఎంపీ వీరేంద్ర కుమార్ గతేడాది డిసెంబర్లో రాజీనామా (ఏప్రిల్ 2022 వరకు సమయం ఉన్నప్పటికీ) చేసిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణల్లో.. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 18 రాజ్యసభ స్థానాలుండగా.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 11కు, తెలంగాణకు 7 సీట్లను లాటరీ పద్ధతిలో నిర్ణయించారు. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జాబితా ప్రకారం.. ఏప్రిల్ 2 తర్వాత ఏపీ నుంచి ముగ్గురు ఎంపీల (దేవేందర్ గౌడ్, రేణుక చౌదరి, చిరంజీవి) పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీల (సీఎం రమేశ్, రాపోలు ఆనంద భాస్కర్) సభ్యత్వం ముగియనుండగా.. జూలై 2017న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు. జాబితాలో మహామహులు.. పదవీకాలం ముగుస్తున్న సభ్యుల్లో కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, థావర్‌చంద్ గెహ్లాట్, రాందాస్ అథావలే తదితరులున్నారు. కాంగ్రెస్‌తోపాటు పలు ప్రాంతీయ పార్టీనుంచి కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10సీట్లలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది. యూపీ (10 స్థానాలు), బిహార్, మహారాష్ట్ర (చెరో ఆరు), పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ (ఐదేసి), కర్ణాటక, గుజరాత్ (తలో నాలుగు) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్తాన్ (చెరో మూడు), జార్ఖండ్‌లో రెండు, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలో ఒకటి చొప్పున మొత్తం 59 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
'కేజ్రీవాల్.. నువ్వు చనిపోయినవాడితో పెట్టుకోవద్దు'
సాక్షి, న్యూఢిల్లీ : ఒప్పందాలు పొసగనప్పుడు పార్టీలో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ అన్నారు. రాముడు, గౌతమ బుద్ధుడితోపాటు ప్రతి ఒక్కరు తమ యుద్ధం తామే చేసుకున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ రాజ్యసభ సీట్ల వ్యవహారం గత కొద్ది రోజులుగా చడీచప్పుడు లేకుండా ముందుకెళుతున్న ఆమ్‌ఆద్మీపార్టీలో ఒక్కసారిగా అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. ఈ సీట్ల పంపకం కారణంగా ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో తనకు సీటు కేటాయించకపోవడంపై ఆయన బహిరంగంగా కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. బుధవారం ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీ రాజ్యసభ స్థానాలకోసం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మూడు కూడా ఆప్ గెలుచుకునేందుకు అవకాశం ఉన్నవే. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్డీ గుప్తా అనే ముగ్గురుకి రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ నిజాలు మాట్లాడినందుకు తనను ఇలా శిక్షించారని అన్నారు. ఇలా జరుగుతుందని కూడా తాను ముందే ఊహించానని అన్నారు. గత ఏడాదిన్నర కిందట తనను చూస్తూ కేజ్రీవాల్ ఓనవ్వు నవ్వుతూ తనను రాజకీయంగా దెబ్బకొడతామని అన్నారని చెప్పారు. ఒప్పందాలు కుదరనప్పుడు పార్టీలో కలిసి ఉండటం సాధ్యం కాదని చెప్పారు. 'నేను చనిపోయినవాడినని, నన్ను వీరజవానుగా మిగిలిపోనివ్వనని కేజ్రీవాల్ అన్నారు. కానీ, ఈ రోజు నేను చెబుతున్నాను.. ఆయన(కేజ్రీవాల్) చనిపోయిన శరీరంతో జోక్యం చేసుకోవద్దు.. దుర్వాసనను వెదజల్లవద్దు' అని విశ్వాస్ అన్నారు. కాగా, కుమార్ విశ్వాస్ మద్దతుదారులు పార్టీ ఆఫీసు ముందు పెద్ద మొత్తంలో చేరి తమ నేత విశ్వాస్ను పార్లమెంటుకు పంపించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. కాగా, తనపై కుట్రలు చేశారని కుమార్ విశ్వాస్‌పై కేజ్రీవాల్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
గుజరాత్ రాజ్యసభ సీట్లు తేడా కొడతాయా..?
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్‌లో ఉన్న బీజేపీ ఆశించిన సీట్లు దక్కకపోవడంపై మాత్రం అసంతృప్తితో రగులుతూనే ఉంది. ఈ పరిణామం వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే గుబులు కమలనాధుల్లో వ్యక్తమవుతోంది. గుజరాత్ అసెంబ్లీలో 100లోపు స్ధానాలకే బీజేపీ పరిమితం కావడంతో గుజరాత్ నుంచి అన్ని రాజ్యసభ స్ధానాలను నిలుపుకోవడం ఆ పార్టీకి సంక్లిష్టంగా మారింది. గుజరాత్ నుంచి బీజేపీ నుంచి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరి పదవీకాలం 2018 ఏప్రిల్ 2న ముగుస్తుంది. గుజరాత్ అసెంబ్లీలో ఆ పార్టీకి 99 మంది సభ్యులుండటంతో బీజేపీ రెండు సీట్లను మాత్రమే (ఒక్కో రాజ్యసభ స్ధానానికి 36 మంది ఎమ్మెల్యేలు) నిలబెట్టుకునే అవకాశం ఉంది. మిగిలిన రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పరమవనున్నాయి. ప్రస్తుతం గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన 11 మంది సభ్యుల్లో తొమ్మిది మంది బీజేపీకి చెందినవారే. వచ్చే ఏడాది జరిగే ద్వైవార్షిక ఎన్నికల అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఏడుకు పడిపోనుంది. అయితే యూపీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన విజయాలతో బీజేపీ రాజ్యసభలో తన సభ్యుల సంఖ్యను పెంచుకోనుంది. యూపీ నుంచి ఏడు సీట్లు, మహారాష్ట్ర నుంచి రెండు సీట్లను గెలుపొంది ఎన్డీఏ తన రాజ్యసభ సభ్యుల సంఖ్యను 84 నుంచి దాదాపు 100 సీట్లకు పెంచుకోనుంది. -
రాజన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేది ఆ పార్టీనే?
న్యూఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సీటు ఆఫర్ చేయబోతుంది. రాజ్యసభ సభ్యుడిగా రాజన్‌ను పేరును ఆప్ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులను త్వరలోనే రాజ్యసభకు పంపించబోతున్నారు. వీరి పదవీ కాలం జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. ఉన్న మూడు ఖాళీలకు పార్టీలో ఉన్న నేతలను కాకుండా బయట నుంచి ప్రొఫెషనల్స్‌ను రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్ నిర్ణయిస్తున్నట్టు తెలిసింది. సెంట్రల్ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండోసారి ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ కొనసాగింపును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, ఆయన పదవిని పొడిగించలేదు. ఈ క్రమంలో ఆయన తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృతిని ఎంచుకున్నారు. ఖాళీ కాబోతున్న ఈ మూడు రాజ్యసభ సీట్ల కోసం పోటీ బాగానే ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ ఆప్ నేత కుమార్ విశ్వాస్ కూడా రాజ్యసభ పదవికి పోటీ పడుతున్నారు. -
మరో 'సారీ'!
మంత్రి యనమలకుమళ్లీ భంగపాటు పెద్దల సభలో ఈసారీ దక్కని సీటు చేయిచ్చిన చంద్రబాబు చిక్కాలకూ నిరాశే సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలో అన్నింటా నంబర్-2 అని చెప్పుకునే రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి మరోసారి భంగపాటు తప్పలేదు. పెద్దల సభకు వెళ్లాలన్న ఆయన చిరకాల కోరిక తీరకుండానే.. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామంతో యనమల వర్గం డీలా పడింది. టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న యనమలకు ఈసారి రాజ్యసభ సీటు ఖాయమని జిల్లాలో ఆయన వర్గం విస్తృత ప్రచారం చేసుకుంది. చివరకు అదంతా ప్రచారానికే పరిమితమైంది. మూడు దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్న యనమల.. గతంలో తునిలో ప్రజా వ్యతిరేకత ఎదురైన సందర్భంలోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. పెద్దల సభలో ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇందుకు చంద్రబాబు ఆశీస్సులు కూడా ఉంటాయన్న నమ్మకంతోనే ఆయన ఆ రోజు ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారని పార్టీ నేతలు చెబుతారు. యనమల ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పటివరకూ రెండుసార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆ రెండుసార్లు కూడా యనమలకు రాజ్యసభ స్థానం ఖాయమనే ప్రచారం తొలినుంచీ జరిగి, చివరకు ఆశలు ఆవిరైపోవడం రివాజుగా మారింది. షరా మామూలుగానే మొండిచేయి ఆవిర్భావం నుంచీ టీడీపీలో ఉన్న యనమల రెండుసార్లు పీఏసీ చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2009లో ఓటమి తరువాత తన రాజకీయ వారసుడిగా వరుసకు సోదరుడైన కృష్ణుడిని 2014 ఎన్నికల్లో బరిలోకి దింపారు. గతంలో తునిలో తన ఓటమికి కృష్ణుడి ఏకపక్ష విధానాలే కారణమని తెలిసి కూడా.. వారసుడిగా ఆయననే బరిలోకి దింపి, ఫలితాల్లో బోర్లా పడ్డారు. అంతకుముందే యనమలను ఎమ్మెల్సీని చేయడంతో రాజ్యసభ ఆశలకు నీళ్లొదులుకోవాల్సిందేనని చెప్పకనే చెప్పినట్టయింది. అయినప్పటికీ రాజ్యసభ తాజా ఎన్నికల్లో బీసీ కోటాలోనైనా యనమలకు బెర్తు ఖాయమని ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే అవకాశం ఉన్న మూడింటిని సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఎన్డీఏ నుంచి సురేష్‌ప్రభుకు టీడీపీ కేటాయించింది. షరా మామూలుగానే యనమలకు మొండిచేయి చూపింది. చిక్కాలకూ చేయి! రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ యనమల, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు చిక్కాల రామచంద్రరావుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ దఫా కూడా జిల్లా నుంచి వారిద్దరి పేర్లూ తెరపైకి వచ్చాయి. ‘యనమల రాజ్యసభకు వెళ్లిపోతారు. జిల్లా రాజకీయాల్లో ఆయన వేలుపెట్టరు. జిల్లా అంతా నీ కనుసన్నల్లోనే ఉంటుంద’ని టీడీపీలోకి వెళ్లిపోయిన సందర్భంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు పార్టీ పెద్దలు చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి యనమలకు రాజ్యసభ సీటు ఖాయమనుకున్నారు. కానీ చివరకు నిరాశే ఎదురైంది. టీడీపీ రాజకీయాల్లో తలపండిన యనమల ఈ విషయాన్ని ముందే తెలుసుకుని ఉంటారు. అందుకే జిల్లాలో సీనియర్, కాపు సామాజికవర్గానికి చెందిన చిక్కాల పేరును రాజ్యసభకు పరిశీలించాల్సిందిగా అధిష్టానానికి చెప్పి ఉంటారని అంటున్నారు. వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా, పేరొందిన చిక్కాల రాజ్యసభ సీటుకు అన్నివిధాలా అర్హుడేనని పార్టీ నేతలు అంటున్నారు. కానీ ఈ రెండు అంశాలనూ ఏనాడూ పరిగణనలోకి తీసుకోని పార్టీ అధినేత చంద్రబాబు నైజాన్ని దగ్గరగా చూసి కూడా చిక్కాల పేరును యనమల ప్రతిపాదించడం విస్మయం కలిగిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ముఖ్యులు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.