![Jagadish Shettar Says BJP Offered Rajya Sabha Seat For Me - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/16/Shetter.jpg.webp?itok=y29iX9MP)
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా షెట్టర్ రాజీనామా చేశారు.
ఈ సందర్బంగా షెట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీష్ షెట్టర్ మాట్లాడుతూ.. బీజేపీని వీడకుండా ఉండేందుకు తనకు పార్టీ పెద్దలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే, రాజ్యసభ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. సీట్లు అడిగినా ఇవ్వలేదని ఫైరయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ హైకమాండ్ పలువురు సీనియర్లకు హ్యాండిచ్చింది. పార్టీ టికెట్లు లభించకపోవడంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా.. జగదీష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment