Jagadish Shettar
-
కాంగ్రెస్‌కు షాక్.. సొంత గూటికి మాజీ సీఎం జగదీష్ శెట్టర్
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ సొంత గూటికి చేరుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన శెట్టర్.. తిరిగి కమలం గూటికే చేరారు. మాజీ సీఎం యడ్యూరప్ప, ఇతర సీనియర్ నేతల ఆధ్వర్యంలో గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర నేతలతో భేటీ అయిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగదీష్ శెట్టర్ బీజేపీలో చేరడం ఆసక్తిగా మారింది. బహుశా ఆయన కాషాయ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. చదవండి: బెంగాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ యాత్ర కాగా జగదీష్ శెట్టర్.. కర్ణాటకలో రాజకీయంగా ప్రభావవంతమైన లింగాయత్ వర్గానికి చెందిన నేత.. బీజేపి నుంచి తన సొంత నియోజకవర్గం హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శెట్టర్‌కు.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో అసంతృప్తి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పచ్చకున్నారు. ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటి చేసిన తన పదవిని నిలబెట్టుకోలేకపోయారు. బీజేపీ నేత చేతిలో 34 వేల కోట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. తరువాత కాంగ్రెస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించింది -
పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తా
కర్ణాటక: తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది, స్పీకర్‌ను చేయడం పార్టీ ఇష్టం అని ఎమ్మెల్సీ జగదీశ్ శెట్టర్ అన్నారు. తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికై న తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలతో మాట్లాడానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించమన్నా తాను సమయాన్ని కేటాయిస్తానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. ఉత్తర కర్ణాటకలో 11 ఎంపీ స్థానాలు ఉండగా వీటిలో 6, 7 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ఈ ప్రాంత సమస్యలపై పరిషత్‌లో చర్చిస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్నో అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసేలా సంబంధిత మంత్రులతో చర్చిస్తానన్నారు. -
Karnataka: ఎన్నికల్లో ఓటమి.. జగదీష్ షెట్టర్‌కు కాంగ్రెస్ గుడ్ న్యూస్
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీష్ షెట్టర్‌కు కాంగ్రెస్ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. తర్వలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జగదీష్ షెట్టర్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆయనతోపాటు తిప్పనప్ప కమక్నూర్, ఎన్ఎస్ బోస్ రాజులను జూన్ 10 న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనికి ఆమోదముద్ర వేశారు. కాగా మొన్నటిదాకా తెలంగాణ ఇన్చార్జిగా పనిచేసిన బోస్ రాజుకు ఇటీవల సిద్ధరామయ్య కేబినెట్లో చోటుదక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ముగ్గురు బీజేపీ నేతలు లక్ష్మణ్ సవాదీ, బాపురావు చియాంచన్సూర్, ఆర్ శంకర్లకు మే 10 జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. దీనిని అవమానంగా భావించిన ముగ్గురు నేతలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ సైతం ఇదే కారణంతో కాషాయ పార్టీని వీడిఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. ఆ పార్టీ తరపున హుబ్బలి ధార్వాడ్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో లింగాయత్ నాయకుడికి ఎలా ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటు వేయనుండగా, అధికార పార్టీ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 135 సీట్లతో ఆధిక్యంలో ఉంది. జూన్ 30న ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: నితీష్‌కు ఎదురు దెబ్బ..మద్దతు ఉపసంహరించుకున్న జితన్ మాంఝీ పార్టీ -
నన్ను ఓడించాలని బీజేపీనే ఓడింది: షెట్టర్
కర్ణాటక: కాంగ్రెస్‌కు నేను ఎటువంటి షరతులు విధించకుండా చేరాను. నేను మంత్రి కావాలన్నది ప్రజల అభిలాష. అయితే కొన్ని కారణాల వల్ల అవకాశం దొరకలేదని మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ తెలిపారు. నగరంలోని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవే కాకుండా మరిన్ని పదవులు ఉన్నాయని ఏ పదవి ఇచ్చినా నిర్వహిస్తానన్నారు. మంత్రి వర్గ విస్తరణ అయ్యాక చర్చించుకుందామని, వ్యక్తిగతంగా తాను ఎటువంటి ఆశలకు పోలేదన్నారు. నన్ను ఒక్కడిని ఓడించబోయి బీజేపీనే ఓడిపోయిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది ఉందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానన్నారు. -
పార్టీ మారి పోటీ చేసిన 30 మంది నేతలకు పరాభవం
కర్ణాటక: విధానసభ ఎన్నికలలో కప్పల తక్కెడ నేతలకు ముఖభంగమైంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మారిన అనేక మంది ఓడిపోయారు. 30 నియోజకవర్గాలలో పార్టీలు మారిన నేతలు పోటీ చేశారు. వారిలో 8 మంది మాత్రమే గెలిచారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ సవది, బీజేపీ నుంచి జేడీఎస్‌లో చేరిన ఏ.మంజు గెలిచారు. కాగవాడలో రాజు కాగె బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి, అరసికెరెలో శివలింగేగౌడ జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి గెలిచారు. గుబ్బిలో ఎస్ఆర్ శ్రీనివాస్ జేడీఎస్ నుంచి కాంగ్రెస్ టికెట్ ద్వారా ఎన్నికయ్యారు. హగరి బొమ్మనహళ్లిలో నేమిరాజ నాయక్ బీజేపీ నుంచి జేడీఎస్ టికెట్ ద్వారా, మొళకాల్మూరులో ఎన్వై గోపాలకృష్ణ బీజేపీ నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పోటీచేసి ఎన్నికయ్యారు. చిక్కమగళూరులో హెచ్డీ తమ్మయ్య బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి గట్టెక్కారు. వీరికి చేదు ఫలితం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్‌కు హుబ్లీ సెంట్రల్ అనూహ్యంగా పరాభవం ఎదురైంది. ఇదేరీతిలో బీజేపీని వీడిన పుట్టణ్ణ (రాజాజీనగర), బాబురావ్ చించనూర్ (గురుమి ట్కల్)లో ఓడారు. కాంగ్రెస్ నుంచి జేడీఎస్‌లో చేరి పోటీచేసిన రఘుఆచార్(చిత్రదుర్గ), తేజస్వీ పటేల్ (చన్నగిరి), ఎల్ఎస్ పోట్నెకర్ (హళియాళ), మనోహర్ తహశీల్దార్ (హానగల్), మొయిద్దీన్ బావా(మంగళూరు ఉత్తర), సౌరభ్ చోప్రా (సవదత్తి యల్లమ్మ) ఓడారు. బీజేపీ నుంచి జేడీఎస్‌లో చేరిన ఎ.బీ మలకరెడ్డి (యాదగిరి), ఆయనూరు మంజునాథ్(శివమొగ్గ), భారతీ శంకర్ (వరుణ), ఎన్ఆర్ సంతోష్(అరసికెరె), వీరభద్రప్ప హలరవి (హుబ్లీ–ధారవాడ తూర్పు), దొడ్డప్పగౌడ నరిజోళ (జీవర్గి) సూర్యకాంత్ (బీదర్)లో ఓడిపోయారు. -
నన్ను ఒంటరిని చేసిందెవరు?!.. జగదీశ్ శెట్టర్ రాయని డైరీ..
పార్టీ ఆఫీసులో ఒంటరిగా కూర్చొని ఉన్నాను. నా వెనుక గోడపై మోదీజీ ఉన్నారు. అమిత్ షా ఉన్నారు. అయినప్పటికీ నేనివాళ ఒంటరినే! ముప్పై ఏళ్లుగా హుబ్లీ–ధార్వాడ్ సెంట్రల్లో గెలుస్తూ వస్తూ, ఇవాళ ఓడిపోవడం వల్ల నేను ఒంటరిని కాలేదు. ముప్పై ఏళ్లకు ముందు హుబ్లీ–ధార్వాడ్‌లో అడ్రెసే లేని బీజేపీకి... గెలుపునే అడ్రెస్‌గా ఇచ్చిన నన్ను కాదని పార్టీ వేరొకరికి టికెట్ ఇచ్చినందు వల్ల నేను ఒంటరిని కాలేదు. బీజేపీ నుంచి బయటికి వచ్చి, కాంగ్రెస్‌లో చేరి, నా కారుకు కాంగ్రెస్ జెండా తగిలించుకుని, నా కారు అద్దాలపై కాంగ్రెస్ స్టిక్కర్ అంటించుకుని ఎన్నికల ప్రచారంలో తిరిగినందుకు నేను ఒంటరిని కాలేదు. ఏడోసారీ నేనే గెలిస్తే యడ్యూరప్ప తర్వాత నేనే నంబర్ వన్ అవుతానన్న భయంతో పార్టీ జనరల్ సెక్రెటరీ నాకు కాకుండా, వేరొకరికి పార్టీ టికెట్ ఇప్పించుకున్నందుకు నేను ఒంటరిని కాలేదు. మరెందుకు ఒంటరినయ్యాను?! గెలుస్తూ గెలుస్తూ వచ్చి ఓడినందుకా? అయినా నేనెక్కడ ఓడిపోయాను! విజయమే తొలిసారి నా తోడు లేక ఒంటరిదయింది. బీజేపీ నాపై నిలబెట్టి గెలిపించుకున్న మహేశ్ 30 వేల ఓట్ల తేడాతో విజేత అయితే కావచ్చు. బీజేపీ ముప్పై ఏళ్ల నియమ ఉల్లంఘనకు కూడా అదే 30 వేల ఓట్ల దూరం. మరి నన్ను ఒంటరిని చేసిందెవరు?! ‘‘ఇకనైనా ఆ గోడకున్న మోదీ, అమిత్‌షాల ఫొటోలు తొలగిస్తారా?’’ అని రెండు పార్టీల వాళ్లూ అడుగుతున్నారు. నేను ఓడినందుకు బీజేపీ. నేను గెలవనందుకు కాంగ్రెస్. అంతటా ఓడిపోయి బీజేపీ ఇక్కడ గెలిచింది. అంతటా గెలిచి కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయింది. అప్పుడిక ఫొటోలు ఉంచేయడానికి, తీసేయడానికి పెద్ద తేడా ఏముంది? టికెట్ ఇవ్వనప్పుడే నేను ఫొటోలు తొలగించలేదు. ఓడినప్పుడు తొలగిస్తానా? ఓటమి కన్నా టికెట్ దక్కకపోవడం ఎక్కువ ఓటమి కాదా? ‘‘ఓటమిలో ఎక్కువ తక్కువలు ఉంటాయా?’’... నా బీజేపీ అంత రాత్మ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో అడుగుపెట్టి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ అంతరాత్మ నా రూపంలో లేదు. యడ్యూరప్ప ఆకృతిలో ఉంది. ‘‘శెట్టర్‌జీ.. పార్టీ మిమ్మల్ని వదులుకోలేదు! మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాను అంది. కేంద్ర మంత్రిని కూడా చేస్తానంది. స్వయంగా అమిత్‌షానే మీతో మాట్లాడారు. కానీ మీ దృష్టిలో ఆయన ఫొటోకు ఉన్న విలువ ఆయన మాటకు లేకుండా పోయింది. తప్పు చేశారు శెట్టర్‌జీ. కాంగ్రెస్‌లోకి మారి తప్పు చేశారు. కాంగ్రెస్‌కు మారుపేరు ‘ఖర్గే’ అని అనుకుని మీరు వెళ్లారు కానీ, సమన్యాయానికి మారుపేరు బీజేపీ అన్న సంగతిని మీరు మీ ఇగో వల్ల మర్చిపోయారు’’ అంది యడ్యూరప్ప ఆకృతిలోని నా అంతరాత్మ. ‘‘ఇగో కాదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్..’’ అన్నాను. ‘‘ఇగోకు పోయినవారంతా చెప్పే మాటే అది శెట్టర్‌జీ! చెప్పండి.. మీరు కోరుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లింది? విజయానికా, అపజయానికా? రాజ్యసభకా, మీ హుబ్లీ–ధార్వాడ్‌ను గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీకా?’’ అన్నారు యడ్యూరప్ప. నేనిక.. నాది కాని నా అంతరాత్మతో సంభా షణను కొనసాగించ దలచలేదు. కుర్చీలో గిర్రున్న వెనక్కు తిరిగి గోడపై మోదీజీ, అమిత్‌షాల ఫొటోల వైపు చూశాను. నాపై నాకెంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో, వాళ్లపైనా అంతే రెస్పెక్ట్ ఉంది. అంత పెద్ద నాయకు లను అక్కడి నుంచి కదల్చదలచలేదు నేను. పెద్ద నాయకులు!! అయినా ప్రజల్ని మించిన పెద్ద నాయకులు ఉంటారా? కర్ణాటక అంతటా బీజేపీ కూలిపోతున్న ప్పుడు హుబ్లీ–ధార్వాడ్‌ను మాత్రం వాళ్లెందుకు గట్టిగా పట్టు కుని ఉన్నట్లు?! నన్నెందుకు ఒంటరిని చేసినట్లు? సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం కానీ, అదెప్పుడూ మన చేతుల్లో ఉండదు. -మాధవ్ శింగరాజు రాయని డైరీ జగదీశ్ శెట్టర్ (కర్ణాటక మాజీ సీఎం) -
ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..రక్తంతో లేఖ
బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కచ్చితంగా గెలుస్తారని ఓ కార్యకర్త రక్తంతో పోస్టర్ రూపొందించాడు. అలాగే హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోస్టర్‌ను స్వయంగా తీసుకెళ్లి జగదీశ్ శెట్టర్‌కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ శెట్టర్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. అయితే హుబ్బళ్లి ధర్వాడ్ నిజయోజకవర్గంలో రెండో రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప శెట్టర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. శెట్టర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శెట్టర్ గెలుపు ఖాయమని రక్తంతో పోస్టర్ రూపొందించాడు . బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రతి సవాల్‌గా ఈ పోస్టర్లను గోడలపై అంటించాడు. చదవండి: ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. డీకే శివకుమార్ సెటైర్లు.. -
Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్ శెట్టర్..
బెంగళూరు: ‘అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య లింగాయత్ సీఎంలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ శెట్టర్ సమర్ధించారు. సిద్దరామయ్య కేవలం సీఎం బసవరాజ్ బొమ్మైను ఉద్ధేశించి మాట్లాడారని.. అందరు లింగాయత్ సీఎంల గురించి కాదని పేర్కొన్నారు. బొమ్మై మాత్రమే అవినీతిపరుడని అన్నారని, లింగాయత్‌లు మొత్తం అవినీతిపరులని అనలేదని తెలిపారు. షెట్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా మంది లింగాయత్ నాయకులు బీజేపీని విడిచిపెట్టారని తెలిపారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అంటే ఆ ప్రాంత ప్రజలను తక్కువ చూడటమేనని.. ఇది బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు తెలివైన వారని, బీజేపీకి ఓటు వేయకుండా తగిన బుద్ది చెప్పాలని కోరారు. కాగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేయాలని బీజేపీ ఆలోచిస్తుందంటూ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సిద్ధరామయ్య మాట్లాడుతూ..ఇప్పటికే లింగాయత్ ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆయనే మూలం’ అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటికే తన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య కూడా వివరణ ఇచ్చారు. తాను లింగాయత్ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదని, కేవలం సీఎం బసవరాజ్ బొమ్మైని మాత్రమే విమర్శించానని చెప్పుకొచ్చారు. చదవండి: కేరళకు తొలి వందేభారత్.. ప్రారంభించిన ప్రధాని మోదీ కాగా బీజేపీ నేత అయిన జగదీష్ శెట్టర్‌కు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. శెట్టర్‌ను కాదని మహేష్ తెంగినకాయ్ను బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. దీంతో కాంగ్రెస్ తరపున వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో హుబ్లీ-ధార్వాడ్-సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల వ్యవధిలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ప్రముఖ లింగాయత్ లీడర్లలో శెట్టర్ రెండో సీనియర్ నేత. అతనికంటే ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం, లక్ష్మణ్ సవేదీ హస్తం గూటికి చేరారు. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే -
బీజేపీకి రాజీనామా.. బీఎల్ సంతోషే కారణం: జగదీష్ శెట్టర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి రగడ తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించడంతో.. ఈ పార్టీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌లో చేరారు. బెంగుళూరు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో జగదీష్ శెట్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు రావడం వెనక బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్యే కారణమని ధ్వజమెత్తారు. బీఎల్ సంతోష్‌కు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని శెట్టర్ విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ రాకుండా చేసి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. బొమ్మై కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని తెలిపారు. తన స్థానంలో మహేష్ తెంగినాకైకు టికెట్ ఇవ్వడం కోసం బీఎల్ సంతోష్ తన మీద కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇలా చేశారని ధ్వజమెత్తారు. చదవండి: Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..? అదే విధంగా మైసూరు జిల్లా కృష్ణరాజ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ఎ రామదాస్‌ను కాదని కొత్త ముఖమైన శ్రీవాత్సకు బీజేపీ టికెట్ ఇచ్చారు. దీనిపై కూడా శెట్టర్ ఘాటుగా స్పందించారు. ‘రామదాస్ పరిస్థితి ఏమైందో చూడండి.. బీఎల్ సంతోష్ విధేయుడు కాదనే కారణంతో ఆయన్ను పక్కకు పెట్టేశారు. తన మాట వినే శ్రీవాస్తకు టిక్కెట్ ఇచ్చారు’ అని దుయ్యబట్టారు. బీఎల్ సంతోష్ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా నిమమించిన విఫలమయ్యారని శెట్టర్ విమర్శించారు. అయినా బీజేపీ అగ్ర నాయకులు ఆయన్ను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదన్నారు. సంతోష్‌కు పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యమని, ఇది బీజేపీ పరువును దిగజార్చుతుందని అన్నారు. ‘బీఎల్ సంతోష్‌ను కేరళ ఇన్‌ఛార్జ్‌గా నియమించినా రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా చేసినా కొన్ని సీట్లు మాత్రమే గెలిచింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన వ్యక్తి పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ(ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా) స్థానంలో ఉన్న వారికి సలహాలు ఇస్తున్నాడు.’ అని శెట్టర్ దుయ్యబట్టారు. కాగా గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, స్పీకర్‌గా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన జగదీష్ శెట్టర్‌కు పార్టీ నుంచి టిక్కెట్ దక్కలేదు. ఈసారి శెట్టర్‌ను కాదని మహేష్ తెంగినాకైను హుబ్లి-ధార్వాడ్ స్థానం నుంచి బరిలో దింపింది. దీంతో బీజేపీకి గుడ్‌బై చెప్పి.. అదే హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరిద్దరిలో గెలుపెవరిదో తేలాలంటే మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు ఎదురుచూడాల్సిందే. చదవండి: బీజేపీ మూడో జాబితా విడుదల.. -
Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ స్థానం ఆయనకే!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ పార్టీలో కల్లోలం మరింత పెరిగింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొత్త ముఖాలకు చోటిచ్చే ప్రయత్నంలో పలువురు సీనియర్లు, సిట్టింగ్‌లకు మొండి చేయి చూపడంతో ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 212 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది. చివరి విడతలో భాగంగా పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగ్థాన్, సేదన్, కొప్పల్, రోణ్, హుబ్లీ ధర్వాడ్ సెంట్రల్, హగరిబొమ్మనహళ్లి, హెబ్బాల్, గోవిందరాజ్ నగర్, మహదేవపుర, కృష్ణరాజ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పోటీ చేయాలనుకున్న హుబ్బళి సెంట్రల్ నియోజవర్గం నుంచి బీజేపీ జనరల్ సెక్రటరీ మహేష్ తెంగినాకైకి చోటు కల్పించింది. కాగా హుబ్బలి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ శెట్టర్.. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాషాయ దళాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా మహదేవపుర సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ లింబావలికి బీజేపీ హ్యండిచ్చింది. ఈ స్థానంలో ఆయన సతీమణి మంజులా పోటీలోకి దింపింది.. కొప్పల్ నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని బెదిరిస్తున్న కారడి సంగన్న అమరప్పకు కూడా పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయన కుమార్తె మంజుల అమరేష్‌కు కొప్పల్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గానూ బీజేపీ 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. 189 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా..రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా చివరి విడత విడుదల చేసింది. ఇక మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. -
బీజేపీ అవమానంపై షెట్టర్ భార్య కంటతడి
బెంగళూరు: బీజేపీ టికెట్ నిరాకరణతో నొచ్చుకున్న.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక కీలక నేతల సమక్షంలో ఆయన ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే.. పార్టీ మారిన గంటల వ్యవధిలోనే ఆయన సొంత నియోజకవర్గం హుబ్బలి-ధార్వాడ్‌కు చేరుకోగా.. అక్కడ ఆయనకు ఊహించని రీతిలో ఘనస్వాగతం లభించింది. జగదీష్ షెట్టర్ భార్య శిల్ప ఆయన్ని హత్తుకుని కంటతడి పెట్టగా.. మద్దతుదారులు పెద్ద ఎత్తున్న షెట్టర్ నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆమెను ఓదారుస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కోసం తన భర్త ఎంతో కష్టపడ్డారని, కానీ పార్టీ మాత్రం తన భర్తని ఘోరంగా అవమానించిందని వాపోయారామె. Video Credits: Public TV టికెట్ నిరాకరణ మాత్రమే కారణం కాదని.. బీజేపీ తన పట్ల వ్యవహరించిన తీరు కూడా తాను పార్టీ వీడేందుకు ఓ కారణమైందని జగదీష్ షెట్టర్ చెప్తున్నారు. ఒక సీనియర్ నేతగా బీజేపీ నాకు టికెట్ ఇస్తుందని భావించా. కానీ, నాకు అందుకు నిరాకరించింది. ఈ పరిణామం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. కనీసం నన్ను పార్టీ మారకూడదని సముదాయించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన జగదీష్ శివప్ప షెట్టర్.. లింగాయత్ వర్గానికి చెందిన బలమైన నేత. కర్ణాటకకు 15వ ముఖ్యమంత్రిగా(2012-13 మధ్య) పని చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. న్యాయవాద వృత్తిలో 20 ఏళ్లు కొనసాగి.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా, ఆపై యడియూరప్ప కేబినెట్లో మంత్రిగా పని చేశారు. కర్ణాటక బీజేపీ సంక్షోభంతో 2012 నుంచి ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థిగా నిల్చున్న ఆయన.. పార్టీ నైతిక ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా కొనసాగారు. -
కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదని బీజేపీకి ఆదివారం రాజీనామా చేసిన ఆయన.. ఆ మరునాడే హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. బెంగళూరులో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం చాలా ఏళ్లపాటు కృషి చేసిన తనకు.. ఈసారి టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానించడం షాక్‌కు గురి చేసిందని జగదీశ్ శెట్టర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన తాను కాంగ్రెస్‌లో చేరడం చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారని తెలిపారు. అలాగే తనను రాజీనామా చేయకుండా బీజేపీలో ఎవరూ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదని జగదీశ్ తెలిపారు. ఎలాంటి పదవి ఇస్తామని గానీ, పార్టీలో ఉండాలని గానీ ఏ స్థాయి నేత కూడా తనను సంప్రదించలేదని చెప్పారు. #WATCH | Former Karnataka CM Jagadish Shettar joins Congress, in the presence of party president Mallikarjun Kharge, KPCC president DK Shivakumar & Congress leaders Randeep Surjewala, Siddaramaiah at the party office in Bengaluru. Jagadish Shettar resigned from BJP yesterday. pic.twitter.com/vxqVuKKPs1 — ANI (@ANI) April 17, 2023 కాగా.. కర్ణాటకలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న ఒకే విడతలో జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో ఈసారి కాంగ్రెస్‌దే విజయమని తేలింది. చదవండి: రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు.. భద్రతా వైఫల్యంపై సిద్ధూ ఆందోళన -
కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ రాజీనామా
-
బీజేపీ హైకమాండ్ ఆయనకు బిగ్ ఆఫర్ ఇచ్చింది: సీఎం బొమ్మై
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటక రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీ సీనియర్లు, సిట్టింగులను కాదని కొత్త ముఖాలకు బరిలోకి దింపింది. ఈ క్రమంలో సీనియర్లు కాషాయ పార్టీకి షాకిస్తూ.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. ఆ పార్టీకి గుడ్ బై చెపారు. ఇక, ఆయన రాజీనామా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మాట్లాడుతూ.. మా పార్టీ హైకమాండ్ జగదీష్ షెట్టర్‌కు ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. షెట్టర్ కర్నాటకలో సీనియర్ నాయకుడు, కీలక నేత. అందుకే ఆయనకు పెద్ద పదవి ఇస్తామని జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం మేము మూడో జాబితాపై చర్చించాము. మా సిఫార్సులను పార్లమెంటరీ బోర్డుకు పంపించాము. అభ్యర్థులను వారే ఖరారు చేస్తారు. ఈ సందర్బంగా జగదీష్ షెట్టర్‌కు సీటుపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఇక, అంతకు ముందు.. బీజేపీ పెద్దలు మాజీ సీఎం షెట్టర్‌ను కలిసి గవర్నర్ లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను షెట్టర్ తిరస్కరించారు. తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నానని, పెద్ద పదవిపై ఆశ లేదని అన్నారు. ఇక, నాటకీయ పరిణామాల మధ్య జగదీష్ షెట్టర్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షెట్టర్.. కర్నాటకలోని కొందరు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంత మంది తమ స్వలాభం కోసం పార్టీని తప్పుగా నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై తప్పుగా నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇక, తాను కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. #KarnatakaElections2023| "We have discussed the third list, shortly it is going to come out. We've sent our recommendations to Parliamentary board & they will take a call...we've not discussed about Jagadish Shettar", says Karnataka CM Basavaraj Bommai after the BJP meeting over… pic.twitter.com/1GSjZnRFob — ANI (@ANI) April 16, 2023 -
కర్నాటక: రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు.. షెట్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా షెట్టర్ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా షెట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీష్ షెట్టర్ మాట్లాడుతూ.. బీజేపీని వీడకుండా ఉండేందుకు తనకు పార్టీ పెద్దలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే, రాజ్యసభ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. సీట్లు అడిగినా ఇవ్వలేదని ఫైరయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ హైకమాండ్ పలువురు సీనియర్లకు హ్యాండిచ్చింది. పార్టీ టికెట్లు లభించకపోవడంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా.. జగదీష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. -
Karnataka Polls: కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. మాజీ సీఎం రాజీనామా..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరుతున్నారు. తాజాగా కమలం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కూడా పార్టీని వీడారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్ హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం యువ నాయకులకు అవకాశం ఇవ్వాలని ఈయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. అయినా అధిష్ఠానం మాత్రం టికెట్ కేటాయించలేదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని జగదీశ్ చెప్పుకొచ్చారు. లింగాయత్ వర్గానికి చెందిన ఈయన ఎన్నికల ముందు పార్టీని వీడటం బీజేపీకి కచ్చితంగా నష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. జగదీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. టికెట్ ఖరారు చేసుకున్నాకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
Karnataka assembly elections 2023: టికెటివ్వకుంటే పాతిక సీట్లు గోవిందా
హుబ్బళ్లి(కర్ణాటక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టార్ ధిక్కారస్వరం వినిపించారు. ‘హూబ్లీ–ధార్వాద్ సెంట్రల్ టికెట్ నాకివ్వాల్సిందే. లేదంటే ఈసారి ఎన్నికల్లో పార్టీ 20 నుంచి 25 స్థానాల్లో ఓటమిని చవిచూస్తుంది’ అని షెట్టార్ శనివారం వ్యాఖ్యానించారు. నవ తరం, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పోటీచేయొద్దని సూచించింది. అలా షెట్టార్‌కు ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీనిని బేభాతరు చేస్తూ ధిక్కార స్వరం వినిపించారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళ్లికి వచ్చి షెట్టార్తో మంతనాలు జరిపారు. అయినా సరే వినని షెట్టార్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ సిట్టింగ్‌లను పక్కనబెడితే ఆ నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడకూడదు. ఒకవేళ పడితే అది ఆ ఒక్క స్థానానికే పరిమితం కాదు. ఉత్తర కర్ణాటకలో కనీసం 20–25 స్థానాల్లో ఓడిపోయే ప్రమాదముంది. ఈ మాట గతంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా చెప్పారు. వేచి చూస్తా. నాకు టికెట్ ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచిస్తా’ అని అన్నారు. -
కర్నాటక: బీజేపీకి కొత్త టెన్షన్.. సీనియర్ నేత దారెటు?
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఏ పార్టీలోకి వెళ్తారోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీలకు సిట్టింగ్‌లకు, సీనియర్లకు సీటు ఇవ్వకపోవడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక, బీజేపీ పలువురు సీనియర్లకు సీటు ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలువురు కాషాయ పార్టీకి షాకిస్తూ ఇతర పార్టీల్లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బీజేపీకి ఇచ్చిన రెండు రోజుల గడువు శనివారంతో ముగిసింది. ఈనేపథ్యంలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రంలోగా తన డెసిషన్ చెబుతానని తెలిపారు. కాగా, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే.. తన అనుచరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానని షెట్టర్ బాంబ్ పేల్చారు. అయితే, జగదీష్ షెట్టర్ కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో బలమైన నాయకుడు. ఆ ప్రాంతం బీజేపీకి కంచుకోటగా ఉంది. షెట్టర్ నాలుగు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. కాగా, షెట్టర్‌కు టికెట్ ఇవ్వకపోతే.. ఆ ప్రభావం దాదాపు 20-25 నియోజకవర్గాలపై ఉండే అవకాశం ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. మరోవైపు.. షెట్టర్ విషయంలో బీజేపీ హైకమాండ్ చర్యను ఖండిస్తూ హుబ్బళ్లి-ధార్వాడ్ సిటీ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న 16 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఇక, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ సహా 12 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా విడుదల చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 212 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇదిలాఉండగా, ఈ ఎన్నికల్లో షెట్టర్‌ను తన సీటు వదులుకోవాలని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ సూచించింది. దీంతో, షెట్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. #KarnatakaPollsWithTNIE Irked over delay in announcing ticket to senior leader @JagadishShettar 16 corporateres of the BJP have threatened to resign from HDMC by writing a letter to @BJPKarnataka president @nalinkateel. @XpressBengaluru @KannadaPrabha @Cloudnirad @ramupatil_TNIE pic.twitter.com/9M3PoTqzhg — Pramodkumar Vaidya (@pramodvaidya06) April 14, 2023 -
Karnataka: 23 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కాషాయదళంలో అసంతృప్తి రగడ మొదలైంది. బుధవారం విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ లభిస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు ఎదురవ్వడంతో రాత్రికి రాత్రి పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం, వంటివి చేస్తున్నారు. తాజాగా 23 మంది అభ్యర్థులతో బీజేపీ తన రెండో జాబితాను గురువారం విడుదల చేసింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో ఏడుగురికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు. 23 మందిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి అశ్విని సంపంగి పోటీ చేయనున్నారు. అభ్యర్థుల జాబితాను రెండు ఫేజ్‌లలో విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం బసవరాజ్ బొమ్మె పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 189 అభ్యర్థులతో బుధవారం మొదటి జాబితాను విడుదల చేయగా ప్రస్తుతం 23 మందిని ప్రకటించింది. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో మూడో జాబితా కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. నో ఛాన్స్ కాగా రెండో జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ పెట్టర్ పేరు లేదు. హుబ్బలి నుంచి ఆరుసఆర్లు గెలుపొందిన జగదీష్..ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఆయన పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు. షెట్టర్‌కు చివరి జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఒవేళ తనకు టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వారికి నిరాశ వరుణలో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న వి సోమన్న.. గుబ్బి స్థానం తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. అయితే బీజేపీ అందుకు అంగీకరించలేదు. గుబ్బి నియోజకవర్గం నుంచి ఎస్డి దిలీప్‌కుమార్‌ను పార్టీ బరిలోకి దింపింది. బైందూరు ఎమ్మెల్యే సుకుమార్ శెట్టికి ఈసారి నిరాశే ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గురురాజ్ గంటిహోళీకి అవకాశం ఇచ్చింది. అదే విధంగా అవినీతి ఆరోపణలపై అరెస్టైన బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పను పార్టీ పక్కకు పెట్టింది. చన్నగిరి నుంచి ఆయనను తప్పిస్తూ.. శివకుమార్‌కు సీటు ఇచ్చింది. ఇక దావణగెరె నార్త్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్, హావేరి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్కు పార్టీ మొండిచేయి చూపింది. వీరి స్థానాల్లో లోకికెరె నాగరాజ్, గవిసిద్దప్ప ద్యామన్నవర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల దాఖలు నేటి నుంచి (ఏప్రిల్ 13) ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. ఒక్కొక్కరిగా దూరం.. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా.. ఇందులో 52 మంది కొత్తవారికి ఈ సారి అవకాశం కల్పించింది. దీంతో టికెట్ కోసం అడుక్కుతినని చెబుతూ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి లక్ష్మణ సవది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళూరు సుళ్య టికెట్ చేజారడంతో మంత్రి ఎస్.అంగార రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్ప కూడా రాజకీయ విరమణ ప్రకటించడం తెలిసిందే.మరోవైపు అసమ్మతి చల్లార్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. . టికెట్ దక్కని నేతలు అసంతృప్తితో పార్టీకి దూరమవుతున్నారు. -
ఢిల్లీ వెళ్లిన కర్ణాటక మాజీ CM జగదీష్ షెట్టర్
-
కర్ణాటక బీజేపీకి వ్యతిరేకంగా.. రెబల్ స్వరం!
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల ఉందనగా.. కర్ణాటక బీజేపీలో రెబల్ సెగ తాకే సూచనలు అందుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగదీష్ షెట్లర్.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంకేతాలు అందించారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారాయన. హుబ్బళ్లి(హుబ్లీ-ధార్వాడ్) నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన షెట్టర్‌కు ఈసారి టికెట్ విషయంలో బీజేపీ ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న పార్టీ అధిష్టానం నుంచి పిలుపు అందుకున్న ఆయన.. ఇవాళ మీడియా ముందు తన అసహనం ప్రదర్శించారు. నేను బీజేపీ అధిష్టానాన్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను.. నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ప్రతీసారి 21 వేల ఓట్లకు పైచిలుకు ఆధిక్యంతో నెగ్గాను. నా కెరీర్లో ఎటువంటి మచ్చ లేదు. ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటప్పుడు నన్ను తప్పుకోమని, వేరే వాళ్లకు అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతారు?. అందుకే నన్ను పోటీకి అనుమతించాలని, లేకుంటే పార్టీకి మేలు జరగదు అని ఆయన మీడియా ఎదుట అసంతృప్తిగా మాట్లాడుతూ వెళ్లిపోయారు. ఒకవేళ పోటీకి అనుమతించకుంటే మాత్రం.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా? అనే ప్రశ్నకు.. దానికి సమాధానం బీజేపీ అధిష్టాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. బీజేపీ పట్ల విధేయతతో కొనసాగుతున్నా. తాజా సర్వేలు కూడా నా విజయావకాశాలను ధృవీకరించాయి. కానీ, అధిష్టానం నుంచి నాకు అందిన పిలుపు నన్ను నిరాశకు గురి చేసింది. టికెట్ ఇవ్వకుంటే కచ్చితంగా ఇండిపెండెంట్ క్యాండిడెట్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తా అని తెలిపారాయన. జగదీష్ శివప్ప షెట్టర్.. కర్ణాటకకు 15వ ముఖ్యమంత్రిగా(2012-13 మధ్య) పని చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. న్యాయవాద వృత్తిలో 20 ఏళ్లు కొనసాగి.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా, ఆపై యడియూరప్ప కేబినెట్లో మంత్రిగా పని చేశారు. కర్ణాటక బీజేపీ సంక్షోభంతో 2012 నుంచి ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థిగా నిల్చున్న ఆయన.. పార్టీ నైతిక ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా కొనసాగారు. కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. పార్టీ ఎన్నికల సంఘం ఈ వారంతంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈశ్వరప్ప ఇక పోటీ చేయరట! -
నడిచే దేవుడు కానరాలేదా?
రాష్ట్రంలో ఇప్పుడు భారతరత్న పురస్కారంపై వివాదం సాగుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌పై సీఎల్పీ నేత సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేయగా, బీజేపీ మంత్రులు అంతకంటే తీవ్రంగా ప్రతిదాడి సాగిస్తున్నారు. సాక్షి, హుబ్లీ (బెంగుళూరు): నడిచే దేవునిగా ప్రసిద్ధి చెందిన దివంగత తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని గుర్తుకు రాలేదా? పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో నిద్రపోయారా? అప్పుడు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయం అని రాష్ట్ర మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జగదీష్ శెట్టర్ కాంగ్రెస్‌పార్టీపై ధ్వజమెత్తారు. ఆదివారం హుబ్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామీజీకి భారతరత్న కచ్చితంగా లభించాల్సిందన్నారు. ప్రస్తుతం తాము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై డిమాండ్ చేస్తున్నామన్నారు. సిద్ధరామయ్యకు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. ‘సిద్ధరామయ్య కాంగ్రెస్‌లోకి ఇటీవలే వచ్చారు. ఎమర్జన్సీ సమయంలో ఇదే సిద్ధరామయ్య ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు’ అని ఎద్దేవా చేశారు. అపార ప్రజాసేవ చేసిన శివకుమారస్వామిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. బోఫోర్స్ కుంభకోణాన్ని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కానుకగా ఇస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమ పరిపాలనను అందిస్తున్నారని అన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్ గురించి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. గతంలో ఎలాంటి ప్రకటనలు చేశారో ఆత్మావలోకనం చేసుకుంటే నిరంకుశ ధోరణి ఎవరిదో తేటతెల్లమవుతుందన్నారు. మహదాయిపై చర్చకు సిద్ధం గోవాలో కాంగ్రెస్ ఊరుకుంటే మహదాయి సమస్య తీరుతుందన్నారు. మహదాయిలో గోవా కాంగ్రెస్ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తోందన్నారు. మహదాయిపై గోవా సీఎం చర్చలకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మహదాయిపై నోటిఫికేషన్ వెలవడనుందని ఆయన హామీ ఇచ్చారు. సమరయోధులను చులకన చేయొద్దు: సీనియర్ రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి చులకనగా మాట్లాడటం మాజీ సీఎం సిద్ధరామయ్యకు తగదని డిప్యూటీ సీఎం గోవింద కారజోళ అన్నారు. హుబ్లీలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య ముందు చరిత్రను తెలుసుకొని బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. భాషా ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటే మంచిదన్నారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన సిద్ధరామయ్య స్వాతంత్య్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసి చివరికి ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించిన వారి పట్ల గౌరవభావంతో మాట్లాడాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం మహానుభావులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఆయన గౌరవానికి మంచిది కాదన్నారు. -
రైతు ప్రాణం పోతున్నా పట్టదా?
► ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ ఇక్కడ సాధ్యం కాదా? ► సీఎం సిద్ధు మేల్కోవాలి ► బీజేపీ పక్ష నేత శెట్టర్ సాక్షి, బెంగళూరు: ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు సాధ్యమవుతున్న రైతుల రుణమాఫీ సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఎందుకు సాధ్యపడట్లేదో అర్థం కావడం లేదని విధానసభలో బీజేపీ పక్ష నేత జగదీశ్ శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. కరువు కారణంగా పంటలు ఎండిపోయి అప్పుల బాధతో రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం సిద్ధరామయ్య ఏమాత్రం చలనం లేకుండా కేవలం ఎన్నికలు, పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల రుణమాఫీపై కుంటిసాకులు చెబుతూ కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ సీఎం సిద్ధరామయ్య రుణమాఫీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా ఆయా ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేశాయని, కానీ ఇక్కడ సిద్ధరామయ్యకు అది ఎందుకు సాధ్యం కావడం లేదని శెట్టర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉపాధి కరువై రైతులు పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని, పశుగ్రాసం, నీరు లేక పశువులను కబేళాలకు తరలించే దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పారు. ఆత్మహత్యలు ఇక్కడే ఎక్కువ దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ చేయని సిద్ధరామయ్య ఎన్నికల్లో విజయమే పరమావధిగా ఇష్టారీతిలో భాగ్యలను ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని శెట్టర్ విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలోనే రైతుల ఆత్మహత్య కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రైతు ప్రాణాలు తీసుకుంటున్నాడని తెలిపారు. దీంతో రైతుల కుటుంబాలు వీధిన పడుతున్నారని రైతుల పిల్లలు అనాథలవుతున్నారని, ఇప్పటికైనా సీఎం సిద్ధరామయ్య నిద్రలోంచి బయటకు వచ్చి రుణమాఫీ చేయడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలను ఆదుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని శెట్టర్ హెచ్చరించారు. -
కేటాయింపు ఘనం.. ఖర్చు స్వల్పం
బడ్జెట్‌పై శెట్టర్ వాగ్బాణాలు నిధులను సమర్థంగా వినియోగించుకోలేని సర్కార్ గత బడ్జెట్లో 57 శాతం నిధులు మాత్రమే వినియోగం ఈ స్వల్ప కాలంలో నిధులు ఖర్చు చేయడం సాధ్యమేనా? త్వరగా ఖర్చు చేయాలని చూస్తే..నిధుల దుర్వినియోగం ఖాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదు.. ఖజానా ఖాళీ ప్రధాన రంగాలకు ప్రాధాన్యత కరువు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులైతే ఘనంగానే ఉన్నా, ఆ మొత్తాలను ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించ లేకపోతోందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ విమర్శించారు. శాసన సభలో సోమవారం ఆయన 2014-15 బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో జనవరి ఆఖరు వరకు 57 శాతం మాత్రమే ఖర్చయిందని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెలన్నర మాత్రమే ఉందని, ఈ స్వల్ప కాలంలో 43 శాతం నిధులను ఖర్చు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఈ మొత్తాన్ని ఖర్చు చేయజూస్తే డబ్బంతా మూడో వ్యక్తి పాలవుతుందని హెచ్చరించారు. ప్రధాన ఉద్దేశం నెరవేరదన్నారు. తన హయాంలో ఈ కాలానికి 70 నుంచి 80 శాతం నిధులను ఖర్చు చేశామని గణాంకాలతో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదని విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందా...అనే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడం లేదని, డబ్బు ఎక్కడి పోతున్నదో అంతుబట్టడం లేదని ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గత ఏడాది బడ్జెట్ రూపకల్పనలో సమయం లేకపోయిందని అనుకున్నామని, ఈ ఏడాది కావాల్సినంత సమయం ఉన్నా ప్రాధాన్యత రంగాలకు తగిన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు ప్రాధాన్యతనివ్వలేదని ఆరోపించారు. ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి విఫలమయ్యారని, పన్ను సేకరణ లక్ష్యాన్ని సాధించలేక పోయారని విమర్శించారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి, ఆంతరంగిక కలహాలు... తదితర కారణాల వల్ల ఆయన పాలనపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నారని ఆరోపించారు. తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారనే కీర్తిని గడించిన ముఖ్యమంత్రి, తన అనుభవాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారని నిష్టూరమాడారు.