బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ సొంత గూటికి చేరుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన శెట్టర్.. తిరిగి కమలం గూటికే చేరారు. మాజీ సీఎం యడ్యూరప్ప, ఇతర సీనియర్ నేతల ఆధ్వర్యంలో గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర నేతలతో భేటీ అయిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కాగా మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగదీష్ శెట్టర్ బీజేపీలో చేరడం ఆసక్తిగా మారింది. బహుశా ఆయన కాషాయ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.
చదవండి: బెంగాల్‌లోకి అడుగుపెట్టిన రాహుల్ యాత్ర
కాగా జగదీష్ శెట్టర్.. కర్ణాటకలో రాజకీయంగా ప్రభావవంతమైన లింగాయత్ వర్గానికి చెందిన నేత.. బీజేపి నుంచి తన సొంత నియోజకవర్గం హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శెట్టర్‌కు.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో అసంతృప్తి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పచ్చకున్నారు.
ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటి చేసిన తన పదవిని నిలబెట్టుకోలేకపోయారు. బీజేపీ నేత చేతిలో 34 వేల కోట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. తరువాత కాంగ్రెస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించింది
Comments
Please login to add a commentAdd a comment