బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీష్ షెట్టర్‌కు కాంగ్రెస్ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. తర్వలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జగదీష్ షెట్టర్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆయనతోపాటు తిప్పనప్ప కమక్నూర్, ఎన్‌ఎస్ బోస్ రాజులను జూన్ 10 న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనికి ఆమోదముద్ర వేశారు.
కాగా మొన్నటిదాకా తెలంగాణ ఇన్చార్జిగా పనిచేసిన బోస్ రాజుకు ఇటీవల సిద్ధరామయ్య కేబినెట్‌లో చోటుదక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ముగ్గురు బీజేపీ నేతలు లక్ష్మణ్ సవాదీ, బాపురావు చియాంచన్‌సూర్, ఆర్ శంకర్‌లకు మే 10 జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. దీనిని అవమానంగా భావించిన ముగ్గురు నేతలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇక లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ సైతం ఇదే కారణంతో కాషాయ పార్టీని వీడిఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. ఆ పార్టీ తరపున హుబ్బలి ధార్వాడ్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో లింగాయత్ నాయకుడికి ఎలా ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటు వేయనుండగా, అధికార పార్టీ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 135 సీట్లతో ఆధిక్యంలో ఉంది. జూన్ 30న ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
చదవండి: నితీష్‌కు ఎదురు దెబ్బ..మద్దతు ఉపసంహరించుకున్న జితన్ మాంఝీ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment