MLC polls
-
ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని తలదించు కునేలా చేసింది. ఈ ఎన్నికల్లో డబ్బు తీసుకుని కొందరు ఉపాధ్యాయులు ఓటు వేయడం ద్వారా పవిత్రమైన వృత్తినే కాక ప్రజాస్వామ్యాన్ని కూడా పరిహాసం చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక జాతీయ రాజకీయ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి ఓటుకు 5 వేల చొప్పున ఒక్కొక్క టీచర్‌కు పంచారనే ఆరోపణ బలంగా వ్యాప్తి చెందింది.నిజంగా ఈ డబ్బు తీసుకుని ఉపాధ్యాయులు (Teachers) ఓటు వేసి ఉంటే వారిలో ఏ స్థాయిలో నైతిక విలువలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టీచర్లు రేపటి భావిసమాజాన్ని ఎలా తయారు చేస్తారు? డబ్బులు ఇస్తే తీసుకోవడమే తలవంపులైతే... ఏకంగా ‘మాకు ఐదు వేలు కావాలి, రెండు వేలైతే ఓటు వెయ్యం’ అని బేరసారాలకు టీచర్లు దిగారంటూ వార్తలు వచ్చాయి. ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?గత దశాబ్ద కాలంగా తెలంగాణ (Telangana)లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కూడా కొందరు రాజకీయ నాయకుల్లాగానే డబ్బులు వసూలు చేయడం, పైరవీలు చేయడం లాంటి పనులతో కోట్లకు పడగెత్తారనే ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంతో హుందాతో, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసేవారన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.భారత సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ఉన్నత మైనదీ, గౌరవప్రదమైనదీ! జ్యోతిబా ఫూలే – సావిత్రీబాయి ఫూలే దంపతులు సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలి వెలుగును నింపడానికి ఉపాధ్యాయ వృత్తినే ఆయుధంగా చేసుకున్నారు. కందు కూరి వీరేశలింగం పంతులు వంటివారు సంఘసంస్కర్తగా, విద్యావ్యాపకునిగా చేసిన సేవ ఉపాధ్యాయుని విలువను తెలియచేస్తోంది. సమాజాన్ని మార్చే అద్భుత అవకాశం ఉన్న విద్యారంగంలో నాటి విలువలు అడుగంటాయి. దీనికి కారణం ఒక విధంగా కార్పొరేట్ శక్తులు విద్యారంగంలోకి ప్రవేశించడమే కావచ్చు. విద్యావ్యాపారంలో కోట్లు సంపాదించినవారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసి డబ్బును వెదజల్లి గెలవడం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.గత సంవత్సరం జరిగిన హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసిన ఓ వ్యక్తి కోట్లు ఖర్చుపెట్టి, టీచర్లను ఆర్థిక ప్రలోభాలకు గురిచేశారనే ప్రచారం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే!చదవండి: సమ సమాజమా? సంక్షేమ రాజ్యామా?ఈ పరిస్థితులను గమనిస్తుంటే రానున్న కాలాన్ని ఊహించడానికే భయమేస్తోంది. మేధా సంపత్తి, సేవా గుణం, వాక్చాతుర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు బదులు ఇక డబ్బున్న కార్పొరేట్ విద్యాలయాల మేనేజ్మెంట్లకు చెందినవారే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలుస్తారు కాబోలు! అలా వీరు గెలవకుండా ఉండాలంటే లక్షల రూపాయలు జీతంగా పొందే టీచర్లు... ఐదు, పదివేలకు కక్కుర్తిపడి ఓటును అమ్ముకోకుండా ఓటు వేయడమే మార్గం.– డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ -
జైమల్లన్న, జై రాకేశ్‌రెడ్డి, ఐ లవ్యూ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసే సమయంలో కొందరు అత్యుత్సాహంతో నినాదాలు రాయగా, ఇంకొందరు ఇతర అభ్యర్థుల ఫొటోలు నలిపేయడం, బ్యాలెట్ పేపరు వెనుక అంకెలు వేయడం, మరికొందరు ఐలవ్యూ అంటూ రాశారు. చెల్లని ఓట్లు 7.69 శాతం వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 7.69% ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 4, 63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 3,36,013 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొందరి అవగాహన రాహిత్యం, అత్యుత్సాహం కారణంగా 25, 824 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 3,10,189 చెల్లిన ఓట్లుగా అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి రౌండ్లో అధిక సంఖ్యలో చెల్లుబాటుకాని ఓట్లు బయటపడ్డాయి. కొందరు తొలి ప్రాధాన్యత ఓట్లు వేయకుండా ఇతర ప్రాధాన్యత ఓట్లు వేయడం, టిక్కులు పెaట్టడం చేశారు. బ్యాలెట్ పేపరుపై ఇష్టానుసారంగా రాతలు బ్యాలెట్పేపర్లపై ప్రాధాన్యతక్రమంలో అంకెలు మాత్రమే వేయాలి. ఇతర ఎలాంటి రాతలు రాయొద్దని ఎన్నికల అధికారులు పలుమార్లు చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోకుండా బ్యాలెట్ పేపర్లపై కొందరు జైమల్లన్న, జైరాకేశ్రెడ్డి అంటూ రాశారు. ఓ పట్టభద్రుడైతే బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థి ఫొటో కట్ చేసుకుపోయాడు. మరికొందరు పట్టభద్రులు బ్యాలెట్ పేపర్ వెనుక అంకెలు వేయగా, మరికొందరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో ప్రాధాన్యత ఓటు వేశారు. కొందరు పట్టభద్రులు ఒక అడుగు ముందుకేసి ఐలవ్యూ అంటూ రాసినట్టు తెలిసింది. -
Karnataka: ఎన్నికల్లో ఓటమి.. జగదీష్ షెట్టర్‌కు కాంగ్రెస్ గుడ్ న్యూస్
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీష్ షెట్టర్‌కు కాంగ్రెస్ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. తర్వలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జగదీష్ షెట్టర్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆయనతోపాటు తిప్పనప్ప కమక్నూర్, ఎన్ఎస్ బోస్ రాజులను జూన్ 10 న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనికి ఆమోదముద్ర వేశారు. కాగా మొన్నటిదాకా తెలంగాణ ఇన్చార్జిగా పనిచేసిన బోస్ రాజుకు ఇటీవల సిద్ధరామయ్య కేబినెట్లో చోటుదక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ముగ్గురు బీజేపీ నేతలు లక్ష్మణ్ సవాదీ, బాపురావు చియాంచన్సూర్, ఆర్ శంకర్లకు మే 10 జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. దీనిని అవమానంగా భావించిన ముగ్గురు నేతలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ సైతం ఇదే కారణంతో కాషాయ పార్టీని వీడిఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. ఆ పార్టీ తరపున హుబ్బలి ధార్వాడ్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో లింగాయత్ నాయకుడికి ఎలా ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటు వేయనుండగా, అధికార పార్టీ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 135 సీట్లతో ఆధిక్యంలో ఉంది. జూన్ 30న ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: నితీష్‌కు ఎదురు దెబ్బ..మద్దతు ఉపసంహరించుకున్న జితన్ మాంఝీ పార్టీ -
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఓటింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో జరిగిన ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదైంది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కర్నూలు, నంద్యాల, ఆదోనిలలో పోలింగ్ జరిగింది. ఆదోనిలో 391 ఓట్లకు గాను 389, నంద్యాలలో 307 ఓట్లకు గాను 304, కర్నూలులో 386 ఓట్లకు గాను 384 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగులో 304 ఓట్లకు గాను 304 ఓట్లూ పోలయ్యాయి. రాజంపేట డివిజన్లో 228 ఓట్లు ఉండగా వంద శాతం పోలింగ్ జరిగింది. కడపలో 308 ఓట్లకు గాను 307 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో 140 ఓట్లకు గాను 140, నాయుడుపేటలో 111 ఓట్లకు గాను 111, గూడురులో 182 ఓట్లకు గాను 182, నెల్లూరులో 261 ఓట్లకు గాను 260, కావలిలో 158 ఓట్లకు గాను 158 పోలయ్యాయి. -
టీడీపీ పోటీ చేయడం అనైతికం
కడప: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం అనైతికమని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి అన్నారు. టీడీపీకి బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు చెప్పారు. ఈసీపై తమకు నమ్మకముందని, శుక్రవారం జరిగే ఎన్నికలో తమదే విజయమని అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
ఉపాధిలో అంతులేని అవినీతి
రూ.2 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు తనిఖీల్లో గుర్తింపు దుత్తలూరు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవినీతికి అంతులేదు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని రాజకీయ నేతలు, అధికారులు, సిబ్బంది బొక్కేశారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేసి బినామీ మస్టర్లు వేసి కూలీల సొమ్ములను స్వాహా చేశారు. ఉదయగిరి: జిల్లాలో ఏ మండలంలో జరగని విధంగా దుత్తలూరు మండలంలో రూ.11కోట్లకు పైగా పనులు ఏడాది కాలంలో చేశారు. ఈ పథకం ప్రారంభించిన 2007 నుంచి ఈ ఆడిట్‌ను మినహాయిస్తే ఎప్పుడూ రూ.5 కోట్లకు మించి పనులు జరగలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అవినీతి బాగోతాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ అంశాలన్నింటినీ బలపరుస్తూ పదిరోజుల నుంచి జరిగిన సామాజిక క్షేత్ర స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవినీతి అక్షరాలా రూ.2కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే వాస్తవంగా ఈ అవినీతి అక్రమాలు రూ.3 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. ఈ అవినీతికి మూలకారుకులైన ఉపాధి సిబ్బంది, అధికారులను రక్షించే బాధ్యతను కొంతమంది అధికార పార్టీ నేతలు తీసుకోవడంతో అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు ఉంటాయో బహిరంగ చర్చావేదిక పూర్తి అయ్యేంత వరకు వేచి చూడాలి. కనిపించని అభివృద్ధి మండలంలో 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు కేవలం కూలీల పేరుతో జరిగిన ఖర్చు రూ.7.83 కోట్లుకాగా, సామగ్రి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.3.71కోట్లు. మొత్తంగా ఏడాది కాలంలో ఈ పథకంలో ఖర్చు చేసిన నిధులు రూ.11.53 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా గ్రామాల్లో అభివృద్ధి నామామాత్రమే. కూలీల చేత చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించి, బినామీ మస్టర్లు ద్వారా నేతలు స్వాహా చేశారు. కొన్ని గ్రామాల్లో అధికార అండదండలతో కూలీలను బెదిరించి వారి పేర్లతో మస్టర్లు వేసి అరకొరగా ఇచ్చి వారిచేతనే పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా నగదు డ్రా చేసి దిగమింగారు. దీంతో నిధులు అయితే మంచినీళ్లు మాదిరే ఖర్చు అయినా అభివృద్ధి కనిపించలేదు. పనులు చేయకుండానే నిధులు స్వాహా ఈ పథకంలో ఇంతవరకు జరిగిన క్షేత్ర స్థాయి తని ఖీల్లో పనుల కొలతల్లో తేడాలు, నాసిరకంగా పనులు, యంత్రాలతో పనులు చేయడంలాంటి అంశాలు మా త్రమే గుర్తించారు. వీటిపై రికవరీ పెట్టారు. కానీ ఈ మండలంలో పనులు చేయకుండానే నిధులు కాజేశారు. ముఖ్యంగా పంట సంజీవని పేరుతో ఫాంపాండ్స్ తీయకుండానే తీసినట్లు రికార్డుల్లో నమోదు చేసి నిధులు మింగారు. కొన్ని చోట్ల పనులను యంత్రాలతో చేయించారు. పనులు మంజూరు అయిన ప్రాంతా నికి గుంటలు ఉన్న ప్రాంతానికి సంబంధమే లేదు. నిబంధలకు విరుద్ధంగా చెరువులు, వాగులు, వంకలు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో గుంటలు తీశారు. వీటి ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ అవకతవకలు భైరవరం, బ్రహ్మశ్వేరం, ఏరుకొల్లు, రాచవారిపల్లి, నందిపాడు, నర్రవాడ, బోడవారిపల్లి, బండకిందపల్లి, దుత్తలూరు పంచాయతీల్లో చోటుచేసుకున్నాయి. సిబ్బంది చేతివాటం ఈ అవినీతి వ్యవహారంలో సిబ్బంది పెద్ద మొత్తంలో మింగేశారు. ఓ టీఏ ఏకంగా రూ.50 లక్షలు సంపాదిం చినట్లు చర్చించుకుంటున్నారు. మెటీరియల్ పనుల్లో జరిగిన అక్రమాలకు ఇప్పుటికే ఈసీ, ఏపీఓ, ఒక టీఏ ను సస్పెండ్ చేశారు. సామగ్రి పనులకు సంబం ధించి పే ఆర్డర్ ఇచ్చే కీలక స్థానంలో ఉన్న ఏంపీడీఓకు పాత్ర ఉన్నా అ«ధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా జిల్లా అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఎంపీడీఓ అవినీతి గురించి ప్రశ్నించే వారిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయ డం విశేషం. పాపంపల్లిలో నాబార్డు ద్వారా జరిగిన కుంటలను మళ్లీ చూపి ఉపాధి నిధులు స్వాహా చేసిన ట్లు ఆడిట్ బృందాలు గుర్తించాయి. రాచవారిపల్లెలో ఓ చెక్‌డ్యామ్‌కు పునాదులు లేకుండానే పైపైనే పనులు చేసి నిధులు దిగమింగినట్లు తనిఖీల్లో గుర్తించారు. దు త్తలూరులో సుమారు 30, భైరవరంలో 10, నందిపాడులో 9,పాపంపల్లిలో 4, బ్రహ్మేశ్వరంలో 15 గుంటలు తీయకుండానే నిధులు స్వాహా చేసినట్లు ఆడిట్ అధికారులు గుర్తించిట్లు విశ్వసనీయ సమాచారం. నేడు బహిరంగ చర్చావేదిక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాజిక తనిఖీ బృందాలు గ్రామసభలు జరపలేదు. పైగా మండల కేంద్రంలో నిర్వహించాల్సిన బహిరంగ చర్చావేదికను జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తారు. ఈ వేదిక సాక్షిగా అడిట్ బృందం బయటపెట్టే అవినీతిని కప్పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వేదికకు డ్వామా పీడీ హరిత వస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఉపాధి అధికారులు ఆమెను రాకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ అవినీతిలో భాగస్వాములున్నవారిపై చర్యలు ఉంటా యా! లేక తేలిపోతాయా! తేలాలంటే సోమవారం సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు. -
నన్నే టచ్ చేస్తారా.. మీసంగతి చూస్తా!
►పోలింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి వీరంగం ►నాకే రూల్స్ చెబుతారా.. అంటూ రుబాబు ►ఉదయం ఏవీఎన్ కాలేజీ వద్ద.. సాయంత్రం ప్రేమ సమాజం వద్ద.. ►యధేచ్ఛగా నిబంధనల అతిక్రమణ ►అడ్డొచ్చిన పోలీసు అధికారులపై ఆగ్రహం నిరంతరం వివాదాల్లో ఉండటం ఆయన శైలి.. ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంలోనూ తప్పలేదు ఆ లొల్లి.. దీనికి కేంద్ర బిందువు ఎమ్మెల్యే వాసుపల్లి.. తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద నిబంధనలు అతిక్రమిస్తున్న టీడీపీ–బీజేపీ కార్యకర్తలను నియంత్రించడానికి యత్నించిన పోలీసులపై రుబాబు చూపారు.. ‘నన్నే టచ్ చేస్తారా.. మీసంగతి చూస్తా’.. అని హెచ్చరించారు... సదరు వాసపల్లిగారే మరో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లబోగా అడ్డుకున్న అక్కడున్న పోలీసు అధికారులతోనూ వాగ్యుద్ధానికి దిగారు. పరుష పదజాలంతో రెచ్చిపోయారు. విశాఖపట్నం : వివాదాస్పద శైలితో అధికార దర్పం చూపించే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులపై తన ప్రతాపం చూపించారు. అ కారణంగా వారిపై విరుచుకు పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు సర్దిచెప్పే యత్నం చేసిన ఎస్సైలపై వీరంగం వేశారు. ఏవీఎన్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 9 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడి ఉండటంతో పాటు ఎన్నికల నియమావళికి విరుద్ధఃగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండాల్సినవారు పోలింగ్ కేంద్రానికి దగ్గరగా కుర్చీలు వేసుకుని కూర్చోవడం, ఇద్దరికి బదులు ఐదారుగురు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా వెళ్లమని సూచించారు. ఇందుకు ససేమిరా అన్న కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వాసుపల్లి.. వచ్చీ రావడంతోనే అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే ఎస్సై సురేష్ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ‘సర్.. మీరు పార్టీ కండువా వేసుకుని లోనికి రాకూడదు’.. అంటూ అనునయంగా నచ్చజెప్పే యత్నం చేశారు.. ఇందుకు ఎమ్మెల్యే ఆగ్రహిస్తూ.. ‘ఏం సురేష్ నీకు ఈ మధ్య ఎక్కువైంది.. నీ సంగతి చూస్తా’.. అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఎస్సై ఒకింత అనునుయంగా ఆయన దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చే యత్నం చేయగా.. ‘టచ్ చేసి మాట్లాడకు.. దూరంగా ఉండు’.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఏసీపీ నరసింహమూర్తి ఎమ్మెల్యే వద్దకు వచ్చి ‘సర్... మీకు తెలియని రూల్సా.. ప్లీజ్ కో ఆపరేట్ చేయండి’.. అని అనడంతో ఆ గొడవ సద్దు మణిగింది ప్రేమ సమాజంలోనూ అదే గొడవ.. సాయంత్రం 4.30 గంటలకు ప్రేమ సమాజం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎమ్మెల్యే వాసుపల్లి పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. ఆయన నేరుగా పోలింగ్ కేంద్రంలోనికి వెళ్తుండగా.. ఎస్సైలు మహేశ్వరరావు, లక్ష్మీనారాయణలు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఎస్సై లక్ష్మీనారాయణను ఉద్దేశించి ‘ఏంటయ్యా నువ్వు చెప్పేది.. నేను ఎమ్మెల్యేను లోనికి వెళ్తాను.. ఏం చేస్తావు’.. అని ప్రశ్నించారు. ఇందుకు ఎస్ఐ లక్ష్మీనారాయణ బదులిస్తూ ‘మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి సార్.. మీకేమైనా అభ్యంతం ఉంటే ఫిర్యాదు చేసుకోండి’ అని సూటిగా సమాధానమిచ్చారు. దీంతో ‘చేస్తాను.. చూస్తాను.. ఏం లోపలకు వెళ్లి రాకూడదా.. వెళ్లకూడదనే రూలేమైనా ఉందా.. నేను ఎలక్షన్ ఆఫీసర్లతో మాట్లాడాలమ్మా.. పోలింగ్ స్లోగా అవుతుందని ఫిర్యాదు వచ్చింది.. అందుకే వెళ్లాలి’ అని వాసుపల్లి చెప్పుకొచ్చారు. దీనికి పోలీసులు స్పందిస్తూ.: ‘మీ ఏజెంట్ చూసుకుంటాడు.. 200 మీటర్ల వరకూ ఎవరూ ఉండకూడదు.. మీరు లోపల తిరుగుతున్నారు’.. అని వ్యాఖ్యానించారు. అంతే వాసుపల్లి ఆగ్రహంతో ఊగిపోతూ.. రూల్స్ చెబుతున్నావేంటని రెచ్చిపోయారు. ఇక్కడ జరుగుతున్నవన్నీ మేం రికార్డు చేస్తున్నాం అని పోలీసులు వ్యాఖ్యానించడంతో చివరికి వెనక్కి తగ్గిన వాసుపల్లి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లారు. -
'జగన్‌ను విమర్శించేందుకే వాడుకున్నారు'
విజయవాడ: అధికార టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేగిన చిచ్చు కొనసాగుతూనే ఉంది. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగలేదని ఏపీలోని చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కక పోవడంపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు. గత వారం నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వైఎస్ జగన్‌ను విమర్శించేందుకే తనను వాడుకుని వదిలేశారని ఆయన సహచరుల వద్ద ఆవేదన చెందినట్టు సమాచారం. -
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
అమరావతి: అధికార టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చిచ్చురాజేసింది. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగలేదని ఏపీలోని చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు వారిని బుజ్జగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజుకు టికెట్ ఇవ్వడంపై అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు అప్పలనాయుడు సిద్ధంకాగా.. ఎంపీ రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇంఛార్జి మంత్రి పరిటాల సునీత ఆయన్ను బుజ్జగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు టికెట్ ఇవ్వడాన్ని బొడ్డు భాస్కరరామారావు వ్యతిరేకిస్తున్నారు. బొడ్డు భాస్కర రామారావు రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి పుల్లారావు ఆయన్ను బుజ్జగిస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే తనను మోసం చేశారని బొడ్డు భాస్కర రామారావు ఆరోపించారు. ఇక పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో అసమ్మతి సెగ రాజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్థసారధి, అంబికా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయగా.. నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కలేదు. టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మెజార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణిరెడ్డిని మీనాక్షి నాయుడు, ఫరూఖ్ వ్యతిరేకిస్తున్నారు. -
వార్షిక పరీక్షల షెడ్యూల్‌పై గందరగోళం
పరీక్షల తేదీల మార్పుపై విద్యాశాఖ తర్జనభర్జన సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు సంవత్సరాంతపు పరీక్షలపై గందరగోళ పరి స్థితి నెలకొంది. ఒకపక్క ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోపక్క పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే సమయంలోనే ఈ షెడ్యూల్ రావడంతో విద్యార్థులు, టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ తరగతుల పరీక్షా విధానంలో గతేడాది తీసుకొచ్చిన కొత్త విధానంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదీ అదే పరిస్థితి. వేసవి సెలవులకు ముందే పరీక్షలు గతంలో సంవత్సరాంతపు పరీక్షలు నిర్వ హించి వేసవి సెలవులు ఇచ్చేవారు. ఏప్రిల్ రెండో వారంలో పరీక్షలు మొదలుపెట్టి మూడోవారానికల్లా ముగించేవారు. వెంటనే సెలవులు ప్రకటించేవారు. అలాకాకుండా ముందుగానే పరీక్షలు నిర్వహించి ఫలితా లను విశ్లేషిస్తే.. విద్యార్థులకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుస్తుందని, వేసవి సెలవుల్లోపు మళ్లీ తరగతులు నిర్వహించి ఆ లోపాలను సరిదిద్దడానికి వీలుంటుందని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఆ మేరకు ఏప్రిల్‌లో కాకుండా మార్చి 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంతపు పరీక్షలు పూర్తి చేయాలని ఈ నెల 7న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి విద్యా ర్థులకు మార్చి 15 నుంచి 18 వరకు వార్షిక పరీక్షలు జరపాలని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఖాళీ అయ్యే ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గ స్థానాలకు మార్చి 9న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మార్చి 17వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఒకేసారి పదో తరగతికి, మిగతా తరగతులకు సంవత్సరాంతపు పరీక్షలు నిర్వహించడం తమకు ఇబ్బందిగా మారుతుందని టీచర్ల వాదన. -
ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ జిల్లా అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించిన టీఆర్ఎస్.. ఆదివారం మరో ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ రోజు కసరత్తు చేశారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్టు సమాచారం. జిల్లాల వారీగా ఈ రోజు ప్రకటించిన వారి పేర్లు: నిజామాబాద్- భూపతి రెడ్డి, ఖమ్మం-బాలసాని, ఆదిలాబాద్-పురాణం సతీష్, మెదక్-భూపాల్ రెడ్డి, కరీంనగర్-నారదాసు లక్ష్మణ్ రావు, భానుప్రసాద్ రావు -
ఏపీలోనూ ఓట్లకు కోట్లు ఎర!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతోంది. ఓట్లకు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రకాశం, కర్నూలు జిల్లాలలో తగిన బలం లేకపోయినా టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ రెండు చోట్లా కచ్చితంగా గెలవాలని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. ఏపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం నాటితో ముగిసింది. టీడీపీ 9, వైఎస్ఆర్ సీపీ ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకుంది. మరో రెండు స్థానాలకు మాత్రం పోటీ ఉండటంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాలలో జూలై 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ గెలవడానికి బలం లేకపోయినా స్థానిక ప్రజాప్రతినిధులకు ఎర వేస్తోంది. డబ్బులు ఆశ చూపడం, వినని వారిపై కేసులు పెడతామంటూ బెదిరింపు చర్చలకు పాల్పడుతున్నారు. ఎలాగైనా మండలిలో బలం పెంచుకోవాలని చూస్తున్న చంద్రబాబు, ఇక్కడ కూడా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహా పాచికలు విసురుతున్నారని అంటున్నారు. -
నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
విజయనగరం కంటోన్మెంట్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేస్తున్నట్టు కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. పోలింగ్ నిర్వహణకు విజయనగరం ఆర్డీఓ కార్యాలయం, పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయాలను గుర్తించామన్నారు. నామినేషన్లు జూన్ 9 నుంచి 16 వరకూ ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహాయింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జూన్ 17 న నామినేషన్ల స్క్రూట్నీ చేస్తామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. జూలై3 వతేదీ ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఏడవ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10వ తేదీ నాటికి ఎన్నికల విధులు పూర్తవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుష ఓటర్లు 272 మంది, మహిళలు 447 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మొత్తం 719 మంది ఓటు హక్కును వినియోగించేందుకు అవకాశముంది. విజయనగరండివిజన్లో 379, పార్వతీపురం డివిజన్లో 340 ఓటర్లున్నారు. ఈ ఎన్నికలకు జాయింట్ కలెక్టర్ బి రామారావు రిటర్నింగ్ అధికారిగా, జిల్లా రెవెన్యూ అధికారి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. జూలై 10 వరకూ ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమలు చేసే బాధ్యతను జెడ్పీ సీఈఓకు అప్పగించారు. డివిజన్ పరిధిలో ఆర్డీఓలు, మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఎన్నికల కోడ్ సరిగా అమలయ్యేలా పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతీ మండలానికి ఎన్నికల కోడ్ అమలు అధికారులుగా ఎంపీడీఓలను నియమించామని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు... 2ఈ ఫారం నింపి నామినేషన్ దాఖలు చేయాలి. అభ్యర్థిని కనీసం పది మంది ప్రతిపాదించాలి అభ్యర్థి ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలన్నారు. ప్రతిపాదించినవారు విజయనగరం లోకల్ అధారిటీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి నామినేషన్ల పేపర్లు స్వయంగా గానీ, ప్రతిపాదకుని ద్వారా గానీ నిర్దేశిత స్థలం, సమయానికి దాఖలు చేయాలి. ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్ల సెట్లు దాఖలు చేయవచ్చు మొదటి సెట్ నామినేషన్లతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి నామినేషన్ వేసే అభ్యర్థి తన రెండుఁరెండున్నర సెంటీమీటర్ల సైజు ఉన్న కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇవ్వాలి -
‘రేవంత్’ కేసులో అసలు దోషి బాబే: కవిత
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు పంచుతూ దొరికిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో సూత్రధారి, అసలు దోషి చంద్రబాబేనని నిజామాబాద్ ఎంపీ కె.కవిత ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహా రంలో చంద్రబాబును ఎ-1 ముద్దాయిగా చేర్చాలన్నారు. బుధవారం నిజామాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ఏపీలో తెలంగాణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఏడాది పాలనకు ఐదు మార్కులు వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సున్నా మార్కులు వేశారని, దానిని గుర్తుంచుకోవాలన్నారు. 5న దుబాయ్, అబుదాబిలో కవిత పర్యటన రాయికల్: దుబాయ్, అబుదాబిలో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ హాజరు కానున్నారు. దుబాయ్‌లో ఉదయం 9 గంటలకు, అబుదాబిలో సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌శర్మ, సల్లాఉద్దీన్, రమేశ్, పృథ్వీరాజ్ బుధవారం ‘సాక్షి’కి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. -
మండలి ఎన్నికలు నేడే
-
మండలి ఎన్నికలు నేడే
* ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ * ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం సోమవారం ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని ఒకటో నంబరు సమావేశ మందిరంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదివారం సాయంత్రం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసన సభా కార్యదర్శి రాజ సదారాం ఏర్పాట్ల గురించి వివరించారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కాగా, సీపీఎం, సీపీఐ తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. దీంతో 118 మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. పోలింగ్ ముగిశాక, ఇదే రోజు 5 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించి... రాత్రికల్లా విజేతలను ప్రకటిస్తారు. -
కేసీఆర్ కుట్రపన్ని రేవంత్‌ను అరెస్ట్ చేయించారు
ఏసీబీ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుట్రపన్ని రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విచారణ నిమిత్తం ముందుగా స్టీఫెన్‌ను ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన అధికారులు అరగంట వ్యవధిలో రాత్రి 8 గంట లకు రేవంత్‌నూ తీసుకువచ్చారు. వారిని వేర్వేరు గదుల్లో విచారిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింలు, పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయకుండా అడ్డుకునేందుకే రేవంత్‌ను అరెస్ట్ చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఏసీబీ డీజీని కలిసేందుకు అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏసీబీ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా, తన సోదరుడిని అక్రమంగా కేసులో ఇరికించారని, చంపేం దుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నిం చగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
రేవంత్‌పై కేసు నమోదు: ఏకే ఖాన్
హైదరాబాద్: ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ తెలిపింది. విచారణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్టు పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్.. స్టీఫెన్‌ను కోరినప్పటి సంభాషణలను రికార్డు చేశారు. అయితే పక్కా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే విచారణను ముమ్మరం చేసి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మీడియా ముందు వెల్లడించారు. స్టీఫెన్ రెండు రోజుల క్రితమే ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కానీ, పక్కా అధారాలతోనే చర్యలు తీసుకుందామనే తాము ఎదురుచూడాల్సి వచ్చిందని ఏకే ఖాన్ చెప్పారు. ఇదిలా ఉండగా, రేవంత్, స్టీఫెన్ సంభాషణకు సంబంధించి ఏసీబీ ఎలాంటి వీడియోలను విడుదల చేయలేదని ఏకే ఖాన్ పేర్కొన్నారు. ఐటీ డిపార్ట్ మెంట్ దీనిపై వివరాలు అడిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనతో అరెస్ట్ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు చెబుతానమన్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకొచ్చినట్టు తెలిపారు. వారినుంచి 50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. నిందితులపై 120 బి సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి జడ్డి ముందు ప్రవేశపెడతామని ఏకే ఖాన్ చెప్పారు. -
ఎంత డబ్బు కావాలో చెప్పండి: స్టీఫెన్‌తో రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత తనకే అప్పజేప్పారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేంద్ర రెడ్డిని కూడా తానే ఎంపిక చేసినట్టు ఆయన అన్నారు. ఈ సందర్భంగా రేవంత్.. స్టీఫెన్‌ల మధ్య సంభాషణ ఇలా సాగింది. రేవంత్.. స్టీఫెన్‌తో మాట్లాడుతూ.. తమ బాస్‌తో మాట్లాడి.. మీకు ఏం కావాలో ఫైనలైజ్ చేస్తానంటూ స్టీఫెన్‌ను ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మీకు ఇప్పుడు ఎంత డబ్బులు కావాలో చెబితే.. ఇప్పుడే ఇచ్చేస్తామని అన్నారు. మిగిలిన డబ్బులు ఎప్పుడు కావాలో చెప్పండి.. అప్పుడు ఇస్తామని చెప్పారు. మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ అసెంబ్లీ కూడా హైదరాబాద్‌లోనే ఉంది కనుక 10 ఏళ్లు ఇక్కడే ఉంటుందని చెప్పుకోచ్చారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదంటూ స్టీఫెన్ కు హామీఇచ్చారు. అందులోనూ జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువని, 17 మందిలో ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలియదంటూ వివరించారు. -
స్టీఫెన్‌తో రేవంత్ సంభాషణల వీడియో విడుదల
హైదరాబాద్: ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్.. స్టీఫెన్‌ను కోరినప్పటి సంభాషణలను రికార్డు చేశారు. రేవంత్, స్టీఫెన్‌ల మధ్య 22 నిమిషాల పాటు సంభాషణలు సాగాయి. వీటిని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు. మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువని, 17 మందిలో ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలియదంటూ వివరించారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదంటూ స్టీఫెన్ కు హామీఇచ్చారు. మీకు ఎంత డబ్బు కావాలో చెబితే ఇప్పుడే ఇచ్చెస్తాం, మా బాస్ తో మాట్లాడి మీకు ఏం కావాలో చెబితే ఫైనలైజ్ చేస్తానని రేవంత్ ఈ చర్చలో స్టీఫెన్ కు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు, ఎన్నికల ప్రక్రియ గురించి రేవంత్ ఈ భేటీలో స్టీఫెన్‌కు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రేవంత్ మాట్లాడారు. స్టీఫెన్‌ను ప్రలోభపెట్టిన సంభాషణలు ఈ వీడియోల స్పష్టంగా వినిపించాయి. రేవంత్ ఎమ్మెల్యేకు గాలం వేస్తున్న విషయం గురించే ముందే సమాచారం తెలుసుకున్న ఏసీబీ పక్కాగా ఆధారాలు సేకరించింది. రేవంత్.. స్టీఫెన్‌కు 5 లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఏసీబీ కార్యాలయానికి రేవంత్
-
ఏసీబీ కార్యాలయానికి రేవంత్ తరలింపు
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు డబ్బులు పంపిణీ చేస్తుండగా అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదివారం రాత్రి ఏసీబీ అధికారులు గాంధీ ఆస్పత్రిలో రేవంత్‌కు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కార్యాలయానికి తీసుకువెళ్లారు. రేవంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాసేపట్లో అరెస్ట్ చేసినట్టు ప్రకటించే అవకాశముంది. ఏసీబీ అధికారులు రేవంత్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్ కూడా ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు.ఈ కేసులో ఆయనను సాక్షిగా పరిగణించనున్నారు. -
'టీడీపీకి ఓటేస్తానని స్టీఫెన్ చెప్పారు'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ చెప్పారని టీడీపీ నేత పెద్డిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటు వేసేందుకు స్టీఫెన్ సంసిద్ధత వ్యక్తం చేశారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వెళ్లారని చెప్పారు. స్టీఫెన్‌తో రోడ్డు పక్కన మాట్లాడుతుంటే ఏదో నేరం చేసినట్టుగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చంపడానికి అరెస్ట్ చేశారా లేక భయపెట్టడానికా ఆయన ప్రశ్నించారు. తమకు బలం లేదని తెలిసినా సీఎం కేసీఆర్ ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టారని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్‌ను వదిలేయాలి
హైదరాబాద్: రేవంత్ రెడ్డికి ఏం జరిగినా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుదే బాధ్యత అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు అనంతరం టీ టీడీపీ నేతలు డీజీపీ అనురాగ్ శర్మ కలిశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా తెలంగాణ ద్రోహులేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చంపే ప్రయత్నం జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి వద్ద డబ్బే దొరకలేదని, ప్రభుత్వమే కుట్ర చేసిందని చెప్పారు. వెంటనే కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్ రెడ్డిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యేకు 5 కోట్ల ఆఫర్.. రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలకు తెరలేపింది. ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో స్టీఫెన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దగ్గర ఫోన్ సంభాషణలున్నట్టు సమాచారం. పోలీసులు రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో విచారించారు. తెలంగాణ శాసనమండలిలో 6 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున ఐదుగురు, టీడీపీ-బీజేపీ కూటమి తరపున ఒకరు, కాంగ్రెస్ తరపున ఒకరు పోటీ చేస్తున్నారు. కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరికొంతమంది టీడీపీ ఎమ్మల్యేలు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తగిన సంఖ్యా బలం లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ను ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది. -
'ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటాం'
-
'ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటాం'
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఐదో అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకుంటామని, అన్ని ఆలోచించే నిలబెట్టామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. శని, ఆదావిరాల్లో మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఆరు స్థానాలకుగాను టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్ ఓ స్థానానికి, టీడీపీ బీజేపీ కూటమి మరో స్థానానికి పోటీ పడుతున్నాయి. -
ఎమ్మెల్సీ పోలింగ్ @ 38%
పట్టభద్రులు బద్ధకించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. సగం మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. అయితే, గతంలో కంటే కాస్త మెరుగైన పోలింగ్ శాతం నమోదైంది. ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మొత్తం గ్రేటర్ పరిధిలో 38 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గతంలో కంటే 11 శాతం అధికం. ఇక పోలింగ్ అన్నిచోట్లా ప్రశాంతంగా ముగిసింది. 25న కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో ప్రశాంతంగా జరిగింది. గతంలో మాదిరిగానే ఈ ఎన్నికల పోలింగ్‌పై ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. ముఖ్యంగా యువత ఆసక్తి కనబరచలేదు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. నెమ్మదిగా సాగింది. పోలింగ్ సమయం ముగిసే సాయంత్రం 4 గంటల వరకు అదే పరిస్థితి. తొలి రెండు గంటల్లో సగటున 7 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం 38 శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల కంటే ఇది 11 శాతం అదనం. గడచిన ఆరేళ్లలో ఎన్నికలపై పలు అవగాహన కార్యక్రమాలు.. ఎన్నికల సంఘం విస్తృతప్రచారం నిర్వహించినప్పటికీ.. నగర ఓటర్లలో ఆశించినస్పందన కనిపించలేదు. శనివారం ఉగాది కావడం..ఆదివారం సెలవు కారణంగా సమీప జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు నగరానికి తిరిగి రాకపోవడం కూడా పోలింగ్‌పై కొంత మేర ప్రభావం చూపింది. జీహెచ్ఎంసీలోని కోర్ ఏరియా కంటే శివారు ప్రాంతాల్లో పోలింగ్ కొంత మెరుగ్గా ఉంది. అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల కోసం హోరాహోరీ ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ మేరకు పోలింగ్ జరగలేదు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మద్దతుదారులు ఆయా పోలింగ్ కేంద్రాల సమీపంలో కనిపించారు. ఆ రెండు పార్టీల మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు పోలింగ్‌సరళిని అంచనా వేసిన వారు అభిప్రాయపడుతున్నారు. నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల్లోని 435 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. 25న ఫలితం... మూడు జిల్లాల నుంచి బ్యాలెట్బాక్సులు ఓట్ల లెక్కింపు కేంద్రమైన నగరంలోని చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్‌కు అర్థరాత్రి వరకు చేరుకోగలవని నవీన్‌మిట్టల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు 25వ తేదీ బుధవారం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పత్రాలు అయినందున ఆలస్యం జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక రోజులోనే లెక్కింపు పూర్తియ్యేందుకు 28 టేబుళ్లు చేర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, టీఆర్ఎస్, బీజేపీల మధ్యే నువ్వానేనా అన్నట్లుగా పోటీ జరిగిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ దంపతులు ఉప్పర్‌పల్లిలోని పోలింగ్‌కేంద్రం(నెం.124)లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీలో మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సినీ రయిత పరుచూరి గోపాలకృష్ణలు ఓటు వేశారు. పోలింగ్ తీరు(శాతం) ఇలా... జిల్లా ఉ.10 గం. మ.12గం. మ.2గం. సా.4గం. హైదరాబాద్ 6 15 25 27 రంగారెడ్డి 7 8 27 37 మహబూబ్‌నగర్ 8 22 42 53 మూడు జిల్లాల్లో వెరసి (నియోజకవర్గంలో) అంతిమంగా సగటున 38 శాతం పోలింగ్ నమోదైంది.