'జగన్‌ను విమర్శించేందుకే వాడుకున్నారు'
విజయవాడ: అధికార టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేగిన చిచ్చు కొనసాగుతూనే ఉంది. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగలేదని ఏపీలోని చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కక పోవడంపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు. గత వారం నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వైఎస్ జగన్‌ను విమర్శించేందుకే తనను వాడుకుని వదిలేశారని ఆయన సహచరుల వద్ద ఆవేదన చెందినట్టు సమాచారం.