హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ చెప్పారని టీడీపీ నేత పెద్డిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటు వేసేందుకు స్టీఫెన్ సంసిద్ధత వ్యక్తం చేశారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వెళ్లారని చెప్పారు.
స్టీఫెన్తో రోడ్డు పక్కన మాట్లాడుతుంటే ఏదో నేరం చేసినట్టుగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చంపడానికి అరెస్ట్ చేశారా లేక భయపెట్టడానికా ఆయన ప్రశ్నించారు. తమకు బలం లేదని తెలిసినా సీఎం కేసీఆర్ ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టారని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
'టీడీపీకి ఓటేస్తానని స్టీఫెన్ చెప్పారు'
Published Sun, May 31 2015 8:36 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement