stephen
-
Ranji Trophy: చెలరేగిన ఆంధ్ర బౌలర్ స్టీఫెన్.. 5 వికెట్లు పడగొట్టి..
తిరువనంతపురం: ఆంధ్ర జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ చీపురపల్లి స్టీఫెన్ (5/51) ఐదు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ఆంధ్ర జట్టుతో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 59.2 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. రాజస్తాన్ జట్టులో రాజేశ్ బిష్ణోయ్ (54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు సాధించింది. జ్ఞానేశ్వర్ (1), కరణ్ షిండే (23; 3 ఫోర్లు) అవుటయ్యారు. గిరినాథ్ (36 బ్యాటింగ్; 3 ఫోర్లు), మనీశ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రహానే అజేయ సెంచరీ అహ్మదాబాద్‌లో సౌరాష్ట్రతో మొదలైన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. భారత క్రికెటర్ అజింక్య రహానే (108 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. సర్ఫరాజ్ (121 బ్యాటింగ్; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రహానే నాలుగో వికెట్‌కు 219 పరుగులు జోడించాడు. చదవండి: Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7 Ranji Trophy 2022: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం -
ఆంధ్రను గెలిపించిన స్టీఫెన్
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతా లో రెండో విజయం చేరింది. జార్ఖండ్ జట్టుతో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు చీపురపల్లి స్టీఫెన్ (3/23), హరిశంకర్ రెడ్డి (3/24) రాణించారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపో యింది. చివరి ఓవర్లో జార్ఖండ్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఐదు వికెట్లున్నాయి. అయితే జార్ఖండ్ ఒక్క పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు (రెండు వికెట్లు స్టీఫెన్, రెండు రనౌట్లు) కోల్పోయింది. ఆఖరి ఓవర్ వేసిన ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి జార్ఖండ్‌ను కట్టడి చేశాడు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు క్యాచ్‌లు తీసుకోవడంతోపాటు ఒక రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బార్ (45; 6 ఫోర్లు), శ్రీకర్ భరత్ (48; 5 ఫోర్లు), రికీ భుయ్ (15 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. -
సోషల్ మీడియా సత్యదూరమేనా?
అమెరికా సెనేట్ కామర్స్ కమిటీ ఇటీవలే ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ కంపెనీల సీఈఓలను పిలిపించి విచారిం చింది. సోషల్ మీడియా పాక్షిక దృక్పథం అంతు తేల్చాలని రిపబ్లికన్ పార్టీ, తప్పుడు సమాచారాన్ని తగ్గించేం దుకు తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలంటూ డెమోక్రాటిక్ పార్టీ ఈ సందర్భంగా వాదించాయి కానీ ఇరు పక్షాలూ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనే విస్మరించాయని చెప్పక తప్పదు. వాస్తవానికి హంటర్ బైడెన్ తప్పుల గురించి న్యూయార్క్ పోస్ట్‌లో వచ్చిన వివాదాస్పద కథనంపై టెక్ దిగ్గజ సంస్థలు వ్యవహరించిన తీరుకు సంబంధించి ఆ సంస్థల సీఈఓలను బాధ్యులను చేయాలని రిపబ్లికన్లు కాంక్షించారు. కాగా వారిపై రిపబ్లికన్లు దాడికి ప్రయత్నిస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపించారు. అంతా బాగుంది. అయితే సోషల్ మీడియా కంపెనీలు ప్రైవేట్ సంస్థలు అని గుర్తుంచుకునే మనం చర్చను ప్రారంభిద్దాం. పైగా తమ సైట్లలో కంటెంటును తమ ఇష్ట్రపకారం వాడుకునేందుకు వీలు కల్పిస్తున్న ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ను వారు కలిగి ఉన్నారని కూడా మనం మర్చిపోవద్దు. అవును, కచ్చితంగానే వారు మరింత సూత్రబద్ధంగా, సరిసమాన పద్ధతిలో వ్యవహరించాలని ఎవరైనా కోరుకోవచ్చు కానీ అవి ప్రైవేట్ సంస్థలు అని నేను మొదటే పేర్కొన్న విషయం మర్చిపోవద్దు. ఆన్లైన్లో తప్పుడు సమాచారం విపరీతంగా వ్యాపిస్తోందన్నది వాస్తవమే. ఈ సందర్భంగా ఇసాక్ అసిమోవ్ చెప్పిన జెన్నెరాట్స్ లాను గుర్తు తెచ్చుకుందాం. ‘తప్పుడు నాట కీయత అనేది పేలవంగా ఉండే వాస్తవాన్ని పక్కకు తోసివేస్తుంది’ సోషల్ మీడియాలో తప్పుడు నాటకీయత చాలా ఎక్కువగా రాజ్యమేలుతోంది. ప్రజలు కూడా బిట్లు బిట్లుగా చూపే సమాచారం వైపే ఆకర్షితులవుతున్నారు. దీంతో వాస్తవానికి సంబంధించిన మరో కోణం కనిపించకుండా పోతోంది. టెక్ దిగ్గజాలు మరీ అవాస్తవంగా కనిపిస్తున్న వాటిపై తీర్పు చెప్పడం ద్వారా అరుదుగా నైనా మంచి కనిపించే మార్గాన్ని మూసివేస్తున్నారన్నది కూడా నిజమే. కానీ, ప్రైవేట్ సంస్థలపై ఆంక్షలు.. ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకోవడంలో ప్రజలు లేక యూజర్ల ఆత్మవిశ్వాసానికి విఘాతం కలిగిస్తున్నాయి. జాన్ స్టూవర్ట్ మిల్ గతంలోనే.. ఎవరైనా తమ సొంత లోపరాహిత్యంపై మరీ ఎక్కువ విశ్వాసం ప్రదర్శించడాన్ని తప్పుపట్టారు. తమకు తాముగా పాక్షిక ముసుగులను ధరిస్తూ ఉన్నప్పటికీ, సోషల్ మీడియా సంస్థలు తప్పుడు సమాచారంపై తగు చర్యలు తీసుకోకపోవడమే అసలు సమస్య. కచ్చితమైన రాజ కీయ తాటస్థ్యం ప్రాతిపదికన వార్తలు పొందుపర్చినప్పటికీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేయడానికి వీలిస్తున్న ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించకుండా ఉండకూడదనే నిశ్చితవైఖరి కంపెనీల మౌలిక వైఖరి లోనే కనిపిస్తోంది. వాతావరణ మార్పు నుంచి కోవిడ్–19 దాకా వాతావరణ మార్పు నుంచి కోవిడ్–19 దాకా తమ యూజర్లు చూడటానికి వీలివ్వకూడదనేలా కొన్ని తీవ్రమైన వాదనలు ఉంటున్నాయని సోషల్ మీడియా కంపెనీలు తరచుగా భావిస్తున్నాయి. వాతావరణ మార్పు ప్రమాదకరమైన హానిని కలిగి స్తోందని, కరోనా వైరస్ గురించిన తప్పుడు సూచనలను ప్రచారంలో పెడితే ఆ వైరస్ భయంకరంగా వాప్తి చెందుతుందనే అంశంపై నాకు కూడా ఏకాభిప్రాయం ఉంది. అయితే ఇతరులను తమ సొంత బుద్ధిని ఉపయోగించగలిగిన మేధస్సు కలి గినవారిగా గుర్తించకూడదని విశ్వసించడం కూడా సోషల్ మీడియా పెనుగంతు వేయడానికి కారణమవుతోంది. అవును, ప్రజా వేదికలనేవి తప్పుడు సమాచారంతో నిండి ఉంటున్నాయి. తప్పుడు సమాచారానికి చికిత్స మంచి సమాచారాన్ని ఇవ్వడమే అనే విశ్వాసంతో శిక్షణ పొందిన తరానికి చెందిన వ్యక్తిని నేను. ప్రజలు కొన్నిసార్లు అసత్యాలవైపు ఆకర్షితులైనట్లయితే, ప్రజాస్వామ్యపు నిర్దిష్ట ఆచరణకు అది హాని కలిగిస్తుందనటంలో సందేహమే లేదు. ఈరోజుల్లో ప్రజాస్వామ్యం అంటే మనం ఎల్లప్పుడూ ఆలోచించేది, మన మనసులో ఉండేది ఓటింగ్ గురించి మాత్రమే. అయితే ఓటింగ్ అనేది ప్రజాస్వామ్యాన్ని విలువైనదిగా మార్చే ఒకానొక అంశం మాత్రమేననే ప్రామాణిక దృక్కోణాన్నే నేను గౌరవిస్తాను. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే స్వీయపాలన అనే ఉమ్మడి వ్యవస్థలో సరిసమానులుగా మనందరం భాగం పంచుకోవడమే. అధికారంలో ఉన్నవారు ప్రమాదకరమైన అంశంపై కూడా చర్చను తొక్కిపెట్టాలనుకోవడమే మరింత హానికరమైనది. ఇదే జరిగితే మనం ప్రజాస్వామ్యపు వ్యతిరేకకోణంలో వెళుతున్నట్లే అవుతుంది. తాము దేన్ని విశ్వసించాలో నిర్ణయిం చుకునే నైతిక హక్కును వ్యక్తులకు లేకుండా సెన్షార్షిప్ హరిస్తుంది. అదే సమయంలో ప్రజలకున్న ఆ నైతిక హక్కును ఉల్లంఘించే విషయంలో ప్రైవేట్ కంపెనీ ప్రశ్నించడానికి వీల్లేనంత స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటోంది. -స్టీఫెన్ ఎల్ కార్టర్ వ్యాసకర్త, ప్రొఫెసర్, యేల్ యూనివర్సిటీ -
మెరిసిన శశికాంత్, స్టీఫెన్
జైపూర్: పేస్ బౌలర్లు కోడిరామకృష్ణ వెంకట శశికాంత్ (4/50), చీపురుపల్లి స్టీఫెన్ (4/67) మరోసారి చెలరేగడంతో... రాజస్తాన్‌తో శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లకు 82 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓపెనర్ జ్ఞానేశ్వర్ (32 బ్యాటింగ్; 5 ఫోర్లు), రికీ భుయ్ (10 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రశాంత్ కుమార్ (31; 5 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (0) అవుటయ్యారు. మరో 70 పరుగులు చేస్తే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ కుదురుగా కనిపించలేదు. అశోక్ మేనరియా (74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. తాజా రంజీ సీజన్లో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం శశికాంత్, స్టీఫెన్‌లకు ఇది నాలుగోసారి కావడం విశేషం. హైదరాబాద్ వేదికగా కేరళతో ఆరంభమైన మ్యాచ్‌లోనూ హైదరాబాద్ బౌలర్లు ఆకట్టుకున్నారు. రవి కిరణ్ (3/24), సిరాజ్ (2/36) రాణించడంతో కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అంతకుముందు రోజు నగరంలో కురిసిన భారీ వర్షంవల్ల మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అంపైర్‌తో గిల్ వాగ్వాదం... ఢిల్లీతో రంజీ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్, భారత ‘ఎ’ జట్టు కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తనను అవుట్‌గా ప్రకటించిన ఫీల్డ్ అంపైర్‌తో గొడవకు దిగి విమర్శల పాలైయ్యాడు. గిల్ తన వ్యక్తిగత స్కోరు 10 వద్ద ఢిల్లీ మీడియం పేసర్ సుబోధ్ భాటి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీనిపై ఫీల్డర్లు అప్పీల్ చేయగా అంపైర్ మొహమ్మద్ రఫీ... గిల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన గిల్ అంపైర్ వద్దకు నేరుగా వెళ్లి బ్యాట్‌కు బంతి తగలలేదంటూ గొడవకు దిగాడు. దీంతో ఆ అంపైర్ స్క్వేర్ లెగ్ అంపైర్ పశి్చమ్ పాఠక్‌ను సంప్రదించి తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాడు. ఈ గొడవ కారణంగా మ్యాచ్ దాదాపు 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే గిల్ మరో 13 పరుగులు మాత్రమే జోడించి అవుట్ కావడం గమనార్హం. గిల్ ప్రవర్తనపై తాము మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడం లేదని ఢిల్లీ జట్టు మేనేజర్ వివేక్ ఖురానా, ఢిల్లీ క్రికెట్ సంఘం జనరల్ సెక్రటరీ వినోద్ తిహారా తెలిపారు. మహారాష్ట్ర 44 ఆలౌట్ సర్వీసెస్ తో జరుగుతోన్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో మహారాష్ట్ర 44 పరుగులకే కుప్పకూలింది. రంజీ చరిత్రలో మహారాష్ట్ర జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. 1941–1942 సీజన్లో నవా నగర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 39 పరుగులకే ఆలౌటైంది. సర్వీసెస్ బౌలర్ పూనమ్ పునియా 5 వికెట్లతో చెలరేగాడు. ఆట ముగిసే సమయానికి సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 141 పరుగులు చేసి 97 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
అదరగొట్టిన ఆంధ్ర
సాక్షి, ఒంగోలు టౌన్: సొంత మైదానంలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. శుక్రవారం ముగిసిన గ్రూప్–‘ఎ’ రంజీ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన ఆంధ్ర 9 వికెట్ల తేడాతో ఏడు సార్లు రంజీ చాంపియన్ అయిన ఢిల్లీని చిత్తు చేసింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (5/41), స్టీఫెన్ (5/91) చెలరేగడంతో ఢిల్లీ తన రెండో ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది 16 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 2.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా... సారథి హనుమ విహారి (4) త్వరగా అవుట్ అయ్యాడు. మనీశ్ (15 నాటౌట్; 3 ఫోర్లు), ప్రశాంత్ కుమార్ (1 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. ఓవర్‌నైట్ స్కోరు 89/6తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఢిల్లీని లలిత్ యాదవ్ (145 బంతుల్లో 55; 11 ఫోర్లు), వికాశ్ మిశ్రా (151 బంతుల్లో 36; 5 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఢిల్లీకి ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించారు. అర్ధ శతకంతో నిలకడగా ఆడుతున్న లలిత్ యాదవ్‌ను శశికాంత్ పెవిలియన్‌కు పంపగా... వికాశ్ మిశ్రాను స్టీఫెన్ వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్‌కు తెరపడటానికి ఎంతో సేపు పట్టలేదు. ఈ విజయంతో ఆంధ్ర ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. -
గొడుగే అతని ఆయుధం: కిల్లర్ గుట్టురట్టు
వేరువేరు ప్రాంతాల్లో మూడు దారుణ హత్యలు. ముగ్గురినీ ఎవరో పొడిచి చంపారు. దేనితో పొడిచారో పోలీసులు కూడా తేల్చలేకపోయారు. ఆ పోట్లు కత్తి, తల్వార్, బాకు, చాకు.. వీటితో పొడిచినట్లులేవు. హంతకుడు ఏదో ప్రత్యేకమైన ఆయుధం ఉపయోగించాడు. ఎంతకీ తేలకపోవడంతో రెండేళ్లుగా ఆ మూడు హత్యకేసులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అయితే బుధవారం చోటుచేసుకున్న మరో నేరంతో ఆ ఉదంతాలు, వాటి వెనకున్న అనూహ్యకారణాలు బయలుపడ్డాయి. హత్యలు ఎలా చెయ్యొచ్చో ఆన్ లైన్ లో తెలుసుకున్న ఆన్ లైన్ ట్రేడర్ రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై శివారులోని ఇజంబాకంలో బుధవారం స్టీఫెన్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. ఫిర్యాదుమేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగను పట్టుకున్నారు. ఇంతటితో కేసు ముగిసిపోలేదు. సీసీటీవీ ఫుటేజిలో.. మరో ముగ్గురు వ్యక్తులు అప్పుడప్పుడూ అక్కడికి వచ్చివెళుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు ఆ ముగ్గురినీ వేటాడి పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తోన్న ఆ ముగ్గురూ మొదట తాము అమాయకులమని బుకాయించినా, పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం కక్కేశారు. సిటీలో సంచలనం రేపిన నాటి మూడు హత్యల్లో తామూ భాగస్వాములమని ఒప్పకున్నారు. అసలు సూత్రధారి స్టీఫెనే అని చెప్పారు. దీంతో పోలీసులు స్టీఫెన్ ను అరెస్ట్ చేశారు. 'ఇంతకీ ఆ ముగ్గురిని దేనితో పొడిచి చంపావ్?..' పోలీసుల కరకు ప్రశ్నలకు స్టీఫెన్ సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు.. 'నేనొక ఆన్లైన్ ట్రేడర్ని. రియల్టర్‌ని కూడా. చాలా ఏళ్ల కిందటే నా భార్య విడాకులిచ్చేసి వెళ్లిపోయింది. అలా పోయింది ఊరుకోకుండా.. వాళ్లన్నయ్య జాన్ సాయంతో నాపై భరణం కేసు వేసింది. నిజానికి ఆమెకు కేసులు వేసేంత తెలివిలేదు. కానీ వాళ్ల అన్నయ్య జాన్ ఉన్నాడే.. వెనకుండి అంతా నడిపించేది వాడే. ఎలాగైనాసరే జాన్ ను అంతం చేయాలనుకున్నా. పోలీసులకు దొరకకుండా మర్డర్ చేసే విధానాల కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేశా. గొడుగుతో హత్య చేయడం ఎలానో నెట్ లో చూసే నేర్చుకున్నా. గొడుగు చివరికొన మొనదేలి ఉంటుందికదా.. దాన్ని ఇంకాస్త సాన పెట్టి, విషంపూసి జాన్ ఒంట్లోకి దించా. మిగిలిన ఇద్దరూ నా పాత స్నేహితులు. వాళ్ల భార్యలతో నేను చనువుగా ఉండటం వాళ్లకి ఇష్టంలేదు. అందుకే ఆ ఇద్దరినీ లేపేశా' అంటూ నేరాలను అంగీకరించాడు 'గొడుగు హంతకుడు' స్టీస్టీఫెన్. 2015 ఏప్రిల్, మే, అక్టోబర్ నెల్లో ఆ మూడు హత్యలు జరిగాయి. హత్యలకు సహకరించిన ట్యాక్సీ డ్రైవర్లు బాలాజీ, ఆనందన్, సతీశ్ కుమార్ లకు స్టీఫెన్ డబ్బులిచ్చి నోరు మూయించాడు. అరెస్ట్ సమయంలో స్టీఫెన్ ఇంటినుంచి పోలీసులు రెండు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు స్టీఫెన్, అతనికి సహకరించిన ముగ్గురు ట్యాక్సీ డ్రైవర్లను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. త్వరలోనే కేసును తీర్పు దశకు వెళ్లేలా కృషిచేస్తామని పోలీసుల తరఫు న్యాయవాది చెప్పారు. -
స్టీఫెన్‌కు నాలుగు వికెట్లు
సాక్షి, విజయనగరం: చీపురపల్లి స్టీఫెన్ (4/57) రాణించడంతో బరోడా జట్టు భారీస్కోరు చేయకుండా ఆంధ్ర నిలువరించింది. గురువారం మొదలైన రంజీ గ్రూప్ బి మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేసింది. కేదార్ దేవధర్ (168 బంతుల్లో 97; 14 ఫోర్లు) కొద్దిలో సెంచరీ కోల్పోగా... హుడా (0), యూసుఫ్ పఠాన్ (6), హార్ధిక్ పాండ్యా (1) విఫలమయ్యారు. స్వప్నిల్ సింగ్ (45 బ్యాటింగ్), పినాల్ షా (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయ్ కుమార్, శివ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. తన్మయ్, విహారి సెంచరీలు ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌తో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్-సి మ్యాచ్‌లో హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. తన్మయ్ అగర్వాల్ (270 బంతుల్లో 104 బ్యాటింగ్; 8 ఫోర్లు), విహారి (216 బంతుల్లో 101; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగులు చేసింది. తన్మయ్‌తో పాటు మిలింద్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే అక్షత్ రెడ్డి (20), సుమన్ (9) వికెట్లను కోల్పోయింది. అయితే తన్మయ్, విహారిలు మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివరకు 88వ ఓవర్లో రోనిత్ మోరె.. విహారిని అవుట్ చేసి ఈ జోడిని విడదీశాడు. మోరెకు 2 వికెట్లు దక్కాయి. -
వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అద్వానీ అర్హత
బ్యాంకాక్ : భారత బిలియర్డ్స్ మేటి ఆటగాడు పంకజ్ అద్వానీ.. సిక్స్-రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ పోటీలో పంకజ్ 5-2తో డిఫెండింగ్ చాంపియన్ స్టీఫెన్ ముగురే (యూకే)పై నెగ్గాడు. అంతకుముందు జరిగిన రౌండ్లో ఈ బెంగళూరు కుర్రాడు 5-0 అలెన్ ట్రిగ్‌ను చిత్తు చేశాడు. దీంతో తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. గత నెలలో కరాచీలో జరిగిన ఐబీఎస్ఎఫ్-6 రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పంకజ్‌కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. -
ఆపరేషన్ సాగిన తీరిలా...
-
సూత్రధారి బాసే !!
-
ఆ 50 లక్షలు’ ఏపీ సొమ్మే!
♦ స్టీఫెన్‌కు రేవంత్ ఇవ్వజూపిన మొత్తంపై అధికారుల అంచనా ♦ అవి ఏ ఖాతా నుంచి వచ్చాయో ఆరా తీస్తున్న ఏసీబీ ♦ ఐటీ శాఖతో కలసి దర్యాప్తు హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తును వేగవంతం చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి స్వయంగా అందజేసిన రూ. 50 లక్షల మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నోట్ల కట్టలపై ఉన్న బ్యాంకు స్లిప్పులు, డినామినేషన్ల ప్రకారం ఏ బ్యాంకు నుంచి అంత మొత్తాన్ని డ్రా చేశారనే అంశంపై ప్రత్యేకంగా ఓ బృందం దర్యాప్తు చేస్తోంది. సీజ్ చేసిన రూ. 50 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేయాలని ఐటీ శాఖ కోరినా, ఇప్పటికీ ఏసీబీ కస్టడీలోనే ఆ మొత్తాన్ని ఉంచి ఏయే బ్యాంకుల నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఐటీ శాఖ సహకారంతో ఏసీబీ రూ.50 లక్షల ఆపరేషన్ సాగిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి రెండు మూడు విడతలుగా ఒకేసారి లక్షల మొత్తంలో డ్రా చేస్తే తప్ప రూ. 50 లక్షలను తీసుకురాలేరని, ఏ బ్యాంకు నుంచి డబ్బు వచ్చిందో తేలితే డిపాజిటర్ల వివరాలను బట్టి ఖాతాల లెక్కలు కూడా తెలుస్తాయని అధికారులు యోచించి తదనుగుణంగా ముందుకు సాగుతున్నారు. నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ హారీ, ఉదయ్‌సింహల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ రికార్డులను బట్టి కూడా డబ్బు కట్టల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక విచారణ జరిపితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరిద్దరు బడా వ్యక్తుల నుంచే పెద్ద మొత్తంలో డ్రా అయినట్లు తేలిందని సమాచారం. తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉండే ఓ సినీ నిర్మాత, ఏపీకి చెందిన ఓ మంత్రికి సంబంధించిన వ్యక్తుల ఖాతాల నుంచే కాకుండా హవాలా పద్ధతిలో వచ్చిన మొత్తం కూడా ఈ నోట్ల కట్టల్లో ఉందని సమాచారం. -
ఎంత డబ్బు కావాలో చెప్పండి: రేవంత్
-
'నేనెక్కడికి పారిపోలేదు, ఫోన్ నెంబర్ తెలుసుగా'
హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ను బలిపశువును చేశారని ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ జరుసలేం అలియాస్ మత్తయ్య ఆరోపించారు. దళితుడైన స్టీఫెన్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో తాను ఎలాంటి మధ్యవర్తిత్వం నడపలేదని ఆయన తెలిపారు. స్టీఫెన్ సన్ను భయపెట్టి, రేవంత్ రెడ్డిని పట్టివ్వాలని బెదిరించారని, ఆ కుట్రలో తమ ఎమ్మెల్యేను పావుగా చేశారని అన్నారు. మరోవైపు తాను పరారీలో ఉన్నట్లు వచ్చిన వార్తలను మత్తయ్య తీవ్రంగా ఖండించారు. తాను అజ్ఞాతంలో లేనని, పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని, తన ఫోన్ కూడా ఆన్‌లోనే ఉందన్నారు. తన ఫోన్ నెంబర్ ఏసీబీ అధికారులకు తెలుసునని, అలాంటిది తనకు ఫోన్ చేసి మత్తయ్య ఎక్కడున్నావ్ అని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఏసీబీ అధికారులకు తనను అడిగే దమ్ము, ధైర్యం లేదా అని అడిగారు. దళిత క్రైస్తవ వ్యతిరేకి అయిన కేసీఆర్ కుట్రలో ఏసీబీ అధికారులు, పోలీసులు పావులుగా మారారని ఆరోపించారు. అగ్రవర్ణ, అధికార దాహం ఉన్న కేసీఆర్ తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తనను ముద్దాయిగా చేసి బలి చేస్తున్నారని మత్తయ్య మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రను ప్రజలకు తెలిపేందుకు తాను శిక్షకు సైతం సిద్ధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రేవంత్ 50 లక్షల రూపాయలను స్టీఫెన్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
రేవంత్‌పై కేసు నమోదు: ఏకే ఖాన్
హైదరాబాద్: ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ తెలిపింది. విచారణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్టు పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్.. స్టీఫెన్‌ను కోరినప్పటి సంభాషణలను రికార్డు చేశారు. అయితే పక్కా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే విచారణను ముమ్మరం చేసి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మీడియా ముందు వెల్లడించారు. స్టీఫెన్ రెండు రోజుల క్రితమే ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కానీ, పక్కా అధారాలతోనే చర్యలు తీసుకుందామనే తాము ఎదురుచూడాల్సి వచ్చిందని ఏకే ఖాన్ చెప్పారు. ఇదిలా ఉండగా, రేవంత్, స్టీఫెన్ సంభాషణకు సంబంధించి ఏసీబీ ఎలాంటి వీడియోలను విడుదల చేయలేదని ఏకే ఖాన్ పేర్కొన్నారు. ఐటీ డిపార్ట్ మెంట్ దీనిపై వివరాలు అడిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనతో అరెస్ట్ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు చెబుతానమన్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకొచ్చినట్టు తెలిపారు. వారినుంచి 50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. నిందితులపై 120 బి సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి జడ్డి ముందు ప్రవేశపెడతామని ఏకే ఖాన్ చెప్పారు. -
ఎంత డబ్బు కావాలో చెప్పండి: స్టీఫెన్‌తో రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత తనకే అప్పజేప్పారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేంద్ర రెడ్డిని కూడా తానే ఎంపిక చేసినట్టు ఆయన అన్నారు. ఈ సందర్భంగా రేవంత్.. స్టీఫెన్‌ల మధ్య సంభాషణ ఇలా సాగింది. రేవంత్.. స్టీఫెన్‌తో మాట్లాడుతూ.. తమ బాస్‌తో మాట్లాడి.. మీకు ఏం కావాలో ఫైనలైజ్ చేస్తానంటూ స్టీఫెన్‌ను ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మీకు ఇప్పుడు ఎంత డబ్బులు కావాలో చెబితే.. ఇప్పుడే ఇచ్చేస్తామని అన్నారు. మిగిలిన డబ్బులు ఎప్పుడు కావాలో చెప్పండి.. అప్పుడు ఇస్తామని చెప్పారు. మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ అసెంబ్లీ కూడా హైదరాబాద్‌లోనే ఉంది కనుక 10 ఏళ్లు ఇక్కడే ఉంటుందని చెప్పుకోచ్చారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదంటూ స్టీఫెన్ కు హామీఇచ్చారు. అందులోనూ జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువని, 17 మందిలో ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలియదంటూ వివరించారు. -
స్టీఫెన్‌కి డబ్బులు ఇస్తున్న రేవంత్‌రెడ్డి
-
స్టీఫెన్‌తో రేవంత్ సంభాషణల వీడియో
-
స్టీఫెన్‌తో రేవంత్ సంభాషణల వీడియో విడుదల
హైదరాబాద్: ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్.. స్టీఫెన్‌ను కోరినప్పటి సంభాషణలను రికార్డు చేశారు. రేవంత్, స్టీఫెన్‌ల మధ్య 22 నిమిషాల పాటు సంభాషణలు సాగాయి. వీటిని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు. మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువని, 17 మందిలో ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలియదంటూ వివరించారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదంటూ స్టీఫెన్ కు హామీఇచ్చారు. మీకు ఎంత డబ్బు కావాలో చెబితే ఇప్పుడే ఇచ్చెస్తాం, మా బాస్ తో మాట్లాడి మీకు ఏం కావాలో చెబితే ఫైనలైజ్ చేస్తానని రేవంత్ ఈ చర్చలో స్టీఫెన్ కు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు, ఎన్నికల ప్రక్రియ గురించి రేవంత్ ఈ భేటీలో స్టీఫెన్‌కు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రేవంత్ మాట్లాడారు. స్టీఫెన్‌ను ప్రలోభపెట్టిన సంభాషణలు ఈ వీడియోల స్పష్టంగా వినిపించాయి. రేవంత్ ఎమ్మెల్యేకు గాలం వేస్తున్న విషయం గురించే ముందే సమాచారం తెలుసుకున్న ఏసీబీ పక్కాగా ఆధారాలు సేకరించింది. రేవంత్.. స్టీఫెన్‌కు 5 లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఏసీబీ కార్యాలయానికి రేవంత్
-
ఏసీబీ కార్యాలయానికి రేవంత్ తరలింపు
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు డబ్బులు పంపిణీ చేస్తుండగా అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదివారం రాత్రి ఏసీబీ అధికారులు గాంధీ ఆస్పత్రిలో రేవంత్‌కు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కార్యాలయానికి తీసుకువెళ్లారు. రేవంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాసేపట్లో అరెస్ట్ చేసినట్టు ప్రకటించే అవకాశముంది. ఏసీబీ అధికారులు రేవంత్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్ కూడా ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు.ఈ కేసులో ఆయనను సాక్షిగా పరిగణించనున్నారు. -
'టీడీపీకి ఓటేస్తానని స్టీఫెన్ చెప్పారు'
-
'టీడీపీకి ఓటేస్తానని స్టీఫెన్ చెప్పారు'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ చెప్పారని టీడీపీ నేత పెద్డిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటు వేసేందుకు స్టీఫెన్ సంసిద్ధత వ్యక్తం చేశారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వెళ్లారని చెప్పారు. స్టీఫెన్‌తో రోడ్డు పక్కన మాట్లాడుతుంటే ఏదో నేరం చేసినట్టుగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చంపడానికి అరెస్ట్ చేశారా లేక భయపెట్టడానికా ఆయన ప్రశ్నించారు. తమకు బలం లేదని తెలిసినా సీఎం కేసీఆర్ ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టారని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యేకు 5 కోట్ల ఆఫర్.. రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలకు తెరలేపింది. ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో స్టీఫెన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దగ్గర ఫోన్ సంభాషణలున్నట్టు సమాచారం. పోలీసులు రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో విచారించారు. తెలంగాణ శాసనమండలిలో 6 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున ఐదుగురు, టీడీపీ-బీజేపీ కూటమి తరపున ఒకరు, కాంగ్రెస్ తరపున ఒకరు పోటీ చేస్తున్నారు. కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరికొంతమంది టీడీపీ ఎమ్మల్యేలు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తగిన సంఖ్యా బలం లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ను ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది. -
పస్తు మస్తుగా..!
ఈ ఫొటో చూడగానే ఏమనిపిస్తోంది? గ్లాస్‌ను ముట్టుకోకుండా, అది కింద పడకుండా ఆ పేపర్‌ను తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది కదూ! కొంత వరకు నిజమే. కానీ ఆ పేపర్‌ను ఎవరు ఎలా తీసినా, ఆ గ్లాస్ కింద పడి పగలదు..! ఎందుకంటారా? అసలు అది నిజం గ్లాసూ కాదు.. అందులో ఉన్నవి నీళ్లూ కాదు..! ఇదంతా త్రీడీ పెయింటింగ్ మాయ. స్టీఫెన్ పస్త్ అనే చిత్రకారుడు సాధారణ కాగితంపై త్రీడీ పద్ధతిలో గీసిన చిత్రం ఇది. రష్యాలో జన్మించి జర్మనీలో స్థిరపడిన స్టీఫెన్.. ఇలాంటి పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. ఈ చిత్రం వేయడానికి అతడికి మూడు గంటల సమయం పట్టింది. దీనిని ఎలా గీశాడో వీడియో తీసి యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేశాడు. మొత్తమ్మీద పస్త్ చిత్రం మస్తుగా ఉంది కదూ..! -
30 ఏళ్ల తర్వాత ‘తూర్పు’ క్రీడాకారుడు
క్రికెట్లో రాణిస్తున్న పేదింటి కుసుమం లెప్ట్ హ్యాండ్ బౌలర్‌గా ప్రతిభ కాకినాడ స్పోర్ట్స్ : అతడు పుట్టింది నిరుపేద కుటుంబంలోనే. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. చిన్నతనం నుంచీ క్రికెట్ అంటే అతడికి ప్రాణం. కృషి, పట్టుదల ఉంటే క్రికెట్లో రాణించవచ్చని నిరూపించాడు. వసీం అక్రం, జహీర్‌ఖాన్ తన ఆదర్శ బౌలర్లు. ఎడమ చేతి బౌలరుగా అంచెలంచెలుగా రాణిస్తూ దాదాపు 30 ఏళ్ల తరువాత జిల్లా నుంచి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై రికార్డు సృష్టించాడు. పెద్దాపురానికి చెందిన సీహెచ్ వీరరాఘవులు, మణిల కుమారుడు స్టీఫెన్. పెద్దాపురం ఏఆర్ కళాశాలలో ఇంటర్ చదివిన స్టీఫెన్ ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తున్నాడు. ఈ నెల 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగిన సుబ్బయ్య పిళ్ళై ట్రోఫీలో స్టీఫెన్ ఆంధ్రా తరఫున ఆడి హైదరాబాద్‌పై 3, కేరళపై 4, గోవాపై 3, కర్నాటకపై 1 చొప్పున వికెట్లు తీశాడు. తద్వారా ముంబైలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3 వరకూ జరగనున్న సౌత్‌జోన్ దియాధర ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఎంపిక పత్రాలను జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి కె.బాపిరాజుకు ఏసీఏ ఆపరేషన్స్ డెరైక్టర్, మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, కార్యదర్శి గోకరాజు గంగరాజు శనివారం అందజేశారు. స్టీఫెన్ 2010-11లో బీసీసీఐ బౌలింగ్ శిక్షణకు హాజరయ్యాడు. గతంలో అండర్-16, 19, 22, 25, రంజీ పోటీలకు జిల్లా నుంచి ఎంపికై ప్రతిభ చూపాడు. స్టీఫెన్‌ను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కేటీ మ్యాథ్యూస్, కార్యదర్శి కె.బాపిరాజు, కోశాధికారి సత్యనారాయణ, కోచ్ డి.రవికుమార్ అభినందించారు.