
పస్తు మస్తుగా..!
ఈ ఫొటో చూడగానే ఏమనిపిస్తోంది? గ్లాస్‌ను ముట్టుకోకుండా, అది కింద పడకుండా ఆ పేపర్‌ను తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది కదూ! కొంత వరకు నిజమే. కానీ ఆ పేపర్‌ను ఎవరు ఎలా తీసినా, ఆ గ్లాస్ కింద పడి పగలదు..! ఎందుకంటారా? అసలు అది నిజం గ్లాసూ కాదు.. అందులో ఉన్నవి నీళ్లూ కాదు..! ఇదంతా త్రీడీ పెయింటింగ్ మాయ.
స్టీఫెన్ పస్త్ అనే చిత్రకారుడు సాధారణ కాగితంపై త్రీడీ పద్ధతిలో గీసిన చిత్రం ఇది. రష్యాలో జన్మించి జర్మనీలో స్థిరపడిన స్టీఫెన్.. ఇలాంటి పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. ఈ చిత్రం వేయడానికి అతడికి మూడు గంటల సమయం పట్టింది. దీనిని ఎలా గీశాడో వీడియో తీసి యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశాడు. మొత్తమ్మీద పస్త్ చిత్రం మస్తుగా ఉంది కదూ..!