ప్రఖ్యాత కళాకారులతో హైదరాబాద్‌లో తొలిసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ | India Art Festival At Kings Kohinoor (Crown) Convention with Eminant artists | Sakshi
Sakshi News home page

ప్రఖ్యాత కళాకారులతో హైదరాబాద్‌లో తొలిసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్

Published Thu, Jun 6 2024 12:09 PM | Last Updated on Thu, Jun 6 2024 12:20 PM

India Art Festival At Kings Kohinoor (Crown) Convention with Eminant artists

జూన్ 7-9 వరకు  హైదరాబాద్‌లో  ఆర్ట్‌ ఫెస్టివల్‌ 

250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యా లరీలు, 3500 కళాఖం డాలు

కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7నుం చి మూడు రోజుల పాటు జరగనుంది. ఇండియా ఆర్ట్ ఫెస్టిల్‌ను తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నా యి. ఇప్పటివరకూ  ప్రతి ఏటా  ఢిల్లీ, బెంగళూరు , ముంబై తదితర నగరాల్లో  ఈ ఫెస్టివల్ నిర్వహించగా ఇపుడు హైదరాబాద్‌ వేదికగా నిలుస్తోంది. 

దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొం టున్నా రు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుందని ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. విశేష చారిత్రక, సాంస్కృతిక చరిత్ర  ఉన్న హైదరాబాద్‌లో మొదటిసారి ఇం డియా ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పా టు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

అర్ట్‌ ఫెస్టివల్‌ విశేషాలు 
దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మందికళాకారులు , గ్యా లరీ ఎగ్జిబిట్ లు, ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. జోగెన్ చౌదరి, మను పరేఖ్, కిషన్ ఖన్నా , శక్తి బర్మ న్, సీమా కోహ్లీ, పరేష్ మైతీ, యూసుఫ్ అరక్కల్, S G వాసుదేవ్, అం జోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టీ.వైకుంఠం , లక్ష్మ ణ్ ఏలే , అశోక్ భౌమిక్, లాలూ ప్రసాద్ షా, గురుదాస్ షెనాయ్, వినీతా కరీం , జతిన్ దాస్, పి. జ్ఞాన, రమేష్ గోర్జాల, ప్రసన్న  ఎం నారాయణ్ తదితరుల కళాఖండాలు కొలువుదీరతాయి.

ప్రముఖ కళాకారులు గుర్మీత్ మార్వా, లాల్ బహదూర్ సింగ్, రాయ్ కె జాన్, ఎం.వీ రమణా రెడ్డి, పిజెస్టాలిన్, ఆసిఫ్ హుస్సేన్, వివేక్ కుమావత్, భాస్కర్ రావు, యూసుఫ్, అమిత్ భర్, సుజాతా అచ్రేకర్, సుప్రియ అంబర్, తౌసిఫ్ ఖాన్, కప్పరి కిషన్, జి. ప్రమోద్ రెడ్డి, రమణారెడ్డి, కాంత ప్రసాద్, ఔత్సాహిక కళాకారులు ప్రవీణ పారేపల్లి, ఓం తాడ్కర్, పంకజ్ బావ్డేకర్, దేవ్ మెహతా, ప్రవీణ్ కుమార్, సత్య గౌతమ్ తదితరుల కళాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు. 

హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ బ్రీజ్ ఆర్ట్ గ్యా లరీ, స్నే హ ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్ గ్యా లరీ, సారా అరక్కల్ గ్యాలరీ, న్యూ ఢిల్లీ నుంచి ఆర్ట్ హట్, గ్యా లరీ పయనీర్, ఎమినెంట్ ఆర్ట్ గ్యాలరీ, పాస్టెల్ టేల్స్ , స్టూడియో 3 ఆర్ట్ గ్యాలరీ, ఉచాన్, ముంబై నుంచి బియాండ్ ది కాన్వా స్, బొకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ, హౌస్ ఆఫ్ ఎనర్జీ, దేవ్ మెహతా ఆర్ట్ గ్యా లరీ, మ్రియా ఆర్ట్స్ , ట్రెడిషన్స్ ఆర్ట్ గ్యా లరీ, కలాస్ట్రో ట్, రిగ్వే ద ఆర్ట్ గ్యా లరీ, స్టూడియో పం కజ్ బావ్డేకర్, ది బాం బే ఆర్ట్ సొసైటీ, తేలా ఆర్ట్ గ్యాలరీ పాల్గొంటాయి. 

అలాగే  జ్ఞాని ఆర్ట్స్ (సిం గపూర్), ఎక్స్ క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ (బరోడా), ది ఇండియన్ ఆర్ట్ కాటేజ్ (కోల్ కతా), కాన్వా స్ డ్రీమ్స్ ఆర్ట్ గ్యా లరీ (నాగ్ పూర్), ఎం నారాయణ్ స్టూడియో (పుణె) తదితర ఆర్ట్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటాయి.  కళాఖండాల ప్రదర్శనతో పాటు వివిధ రకాల ఫ్యూజన్ షోలు, సంగీత కచేరీలు, లైవ్ పెయింటింగ్  ప్రదర్శన కూడా ఉంటుంది.

భారతదేశ గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే చలన చిత్రం "ది ఎటర్నల్ కాన్వాస్ - 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్", హైలైట్‌గా నిలవనున్నాయి. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2024 వైవిధ్యం, సృజనాత్మక , కళాత్మక వ్యక్తీకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 

కళాభిమానులు, ఆర్ట్ కలెక్టర్స్ ఈ ప్రత్యేక సాంస్కృ తిక కార్యక్రమాన్ని చూసేందుకు బుక్ మై షోలో టికెట్స్ (299 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.

ఈవెంట్ వివరాలు:
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ :  జూన్ 7-9వ తేదీ వరకు
వేదిక: కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్, పిల్లర్ 68, పివి నర్సిం హారావు ఎక్స్ ప్రెస్ వే, రేతిబౌలి, హైదరాబాద్
సమయం : ఉదయం 11:00 నుం డి రాత్రి 8:00 వరకు
మరింత సమాచారం కోసం IAF డైరెక్టర్ రాజేంద్ర : 7400009978, 9820737692
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement