Art Gallery
-
మాదాపూర్ స్టేట్ ఆర్ గ్యాలరీలో అన్ డిసిఫర్డ్ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
ప్రఖ్యాత కళాకారులతో హైదరాబాద్‌లో తొలిసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7నుం చి మూడు రోజుల పాటు జరగనుంది. ఇండియా ఆర్ట్ ఫెస్టిల్ను తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నా యి. ఇప్పటివరకూ ప్రతి ఏటా ఢిల్లీ, బెంగళూరు , ముంబై తదితర నగరాల్లో ఈ ఫెస్టివల్ నిర్వహించగా ఇపుడు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొం టున్నా రు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుందని ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. విశేష చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో మొదటిసారి ఇం డియా ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పా టు చేస్తున్నామని ఆయన తెలిపారు. అర్ట్ ఫెస్టివల్ విశేషాలు దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మందికళాకారులు , గ్యా లరీ ఎగ్జిబిట్ లు, ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. జోగెన్ చౌదరి, మను పరేఖ్, కిషన్ ఖన్నా , శక్తి బర్మ న్, సీమా కోహ్లీ, పరేష్ మైతీ, యూసుఫ్ అరక్కల్, S G వాసుదేవ్, అం జోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టీ.వైకుంఠం , లక్ష్మ ణ్ ఏలే , అశోక్ భౌమిక్, లాలూ ప్రసాద్ షా, గురుదాస్ షెనాయ్, వినీతా కరీం , జతిన్ దాస్, పి. జ్ఞాన, రమేష్ గోర్జాల, ప్రసన్న ఎం నారాయణ్ తదితరుల కళాఖండాలు కొలువుదీరతాయి.ప్రముఖ కళాకారులు గుర్మీత్ మార్వా, లాల్ బహదూర్ సింగ్, రాయ్ కె జాన్, ఎం.వీ రమణా రెడ్డి, పిజెస్టాలిన్, ఆసిఫ్ హుస్సేన్, వివేక్ కుమావత్, భాస్కర్ రావు, యూసుఫ్, అమిత్ భర్, సుజాతా అచ్రేకర్, సుప్రియ అంబర్, తౌసిఫ్ ఖాన్, కప్పరి కిషన్, జి. ప్రమోద్ రెడ్డి, రమణారెడ్డి, కాంత ప్రసాద్, ఔత్సాహిక కళాకారులు ప్రవీణ పారేపల్లి, ఓం తాడ్కర్, పంకజ్ బావ్డేకర్, దేవ్ మెహతా, ప్రవీణ్ కుమార్, సత్య గౌతమ్ తదితరుల కళాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు. హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ బ్రీజ్ ఆర్ట్ గ్యా లరీ, స్నే హ ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్ గ్యా లరీ, సారా అరక్కల్ గ్యాలరీ, న్యూ ఢిల్లీ నుంచి ఆర్ట్ హట్, గ్యా లరీ పయనీర్, ఎమినెంట్ ఆర్ట్ గ్యాలరీ, పాస్టెల్ టేల్స్ , స్టూడియో 3 ఆర్ట్ గ్యాలరీ, ఉచాన్, ముంబై నుంచి బియాండ్ ది కాన్వా స్, బొకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ, హౌస్ ఆఫ్ ఎనర్జీ, దేవ్ మెహతా ఆర్ట్ గ్యా లరీ, మ్రియా ఆర్ట్స్ , ట్రెడిషన్స్ ఆర్ట్ గ్యా లరీ, కలాస్ట్రో ట్, రిగ్వే ద ఆర్ట్ గ్యా లరీ, స్టూడియో పం కజ్ బావ్డేకర్, ది బాం బే ఆర్ట్ సొసైటీ, తేలా ఆర్ట్ గ్యాలరీ పాల్గొంటాయి. అలాగే జ్ఞాని ఆర్ట్స్ (సిం గపూర్), ఎక్స్ క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ (బరోడా), ది ఇండియన్ ఆర్ట్ కాటేజ్ (కోల్ కతా), కాన్వా స్ డ్రీమ్స్ ఆర్ట్ గ్యా లరీ (నాగ్ పూర్), ఎం నారాయణ్ స్టూడియో (పుణె) తదితర ఆర్ట్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటాయి. కళాఖండాల ప్రదర్శనతో పాటు వివిధ రకాల ఫ్యూజన్ షోలు, సంగీత కచేరీలు, లైవ్ పెయింటింగ్ ప్రదర్శన కూడా ఉంటుంది.భారతదేశ గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే చలన చిత్రం "ది ఎటర్నల్ కాన్వాస్ - 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్", హైలైట్‌గా నిలవనున్నాయి. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2024 వైవిధ్యం, సృజనాత్మక , కళాత్మక వ్యక్తీకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. కళాభిమానులు, ఆర్ట్ కలెక్టర్స్ ఈ ప్రత్యేక సాంస్కృ తిక కార్యక్రమాన్ని చూసేందుకు బుక్ మై షోలో టికెట్స్ (299 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.ఈవెంట్ వివరాలు:ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ : జూన్ 7-9వ తేదీ వరకువేదిక: కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్, పిల్లర్ 68, పివి నర్సిం హారావు ఎక్స్ ప్రెస్ వే, రేతిబౌలి, హైదరాబాద్సమయం : ఉదయం 11:00 నుం డి రాత్రి 8:00 వరకుమరింత సమాచారం కోసం IAF డైరెక్టర్ రాజేంద్ర : 7400009978, 9820737692 -
రూ.12.5 కోట్ల బుద్ధుడి విగ్రహం చోరీ.. కానీ అమ్మడం కష్టమేనట!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఆర్ట్ గ్యాలరీలో 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్ కాంస్య బుద్ధ విగ్రహం ఇటీవల చోరీకి గురైంది. ఆ చోరీకి సంబంధిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ గ్యాలరీలో 113 కిలోల బరువున్న ఈ శిల్పం చోరీకి గురైందని లాస్ ఏంజిల్స్ పోలీసు విభాగం మీడియాకు తెలిపింది. గ్యాలరీ గేట్‌ను బద్దలు కొట్టి ట్రక్కుతోపాటు లోపలికి దుండగుడు ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ చూపిస్తోంది. ఈ పురాతన బుద్ధుడి విగ్రహం 1603-1867 నాటిదని గ్యాలరీ యజమాని ఫయేజ్ బరాకత్ చెప్పారు. అద్భుతమైన ఈ కళాఖండం 55 సంవత్సరాల క్రితం ఆయన స్వాధీనంలోకి వచ్చింది. ఇలాంటిది మరెక్కడైనా ఉంటుందని తాను అనుకోనని గ్యాలరీ డైరెక్టర్ పాల్ హెండర్సన్ న్యూయార్క్ పోస్ట్‌తో తెలిపారు . నాలుగు అడుగుల పొడవు, లోపుల బోలుగా ఉండే ఈ కాంస్య విగ్రహం చాలా ప్రత్యేకమైందని, దీన్ని చోరీ చేసిన వ్యక్తి అమ్మడం చాలా కష్టమని ఆయన అన్నారు. -
కదల్లేని స్థితిలో మహిళ.. డోర్ పగలగొట్టి వెళ్లిన పోలీసులు షాక్..!
లండన్: ఓ మహిళ కుర్చీలో కూర్చొని టేబుల్‌పై తలెపెట్టి రెండు గంటలుగా అపస్మారక స్థితిలో ఉంది. రోడ్డుపై వెళ్లే ఓ వ్యక్తి ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమచారం అందించాడు. దీంతో హుటాహుటిన అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ మహిళను కాపాడేందుకు డోర్లు పగలగొట్టారు. దగ్గరకు వెళ్లి ఆమెను చూశాక షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె మహిళ కాదు.. ఓ కళాకారుడు చెక్కిన శిల్పం. అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఆ బొమ్మ అచ్చం నిజమైన మహిళ లాగానే ఉండటం చూసి నమ్మలేకపోయారు. పసుపు రంగు స్వెటర్, నల్ల రంగు ప్యాంటు వేసుకున్న ఈ బొమ్మను చూస్తే ఎవరైనా నిజంగా మహిళే అనుకుంటారు. లండన్ సోహోలోని లాజ్ ఎంపోరియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచిన ఈ శిల్పాన్ని అమెరికాకు చెందిన ఓ శిల్పి చెక్కాడు. ప్యాకింగ్ టేప్, ఫోమ్‌ను ఉపయోగించి ఈ బొమ్మను తీర్చిదిద్దాడు. గ్యాలరీ ఓనర్ స్టీవ్ లాజారైడ్స్ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ బొమ్మకు క్రిస్టినా అనే పేరు కూడా పెట్టారు. అయితే నవంబర్ 25న ఎంపోరియంలో పనిచేసే మహిళ గ్యాలరీకి తాళం వేసి టీ పెట్టుకునేందుకు పైకి వెళ్లింది. ఈ సమయంలోనే ఓ వ్యక్తి బొమ్మను చూసి అమ్మాయి అనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వాళ్లు వచ్చి డోర్‌ను పగలగొట్టారు. టీ కోసం పైకి వెళ్లిన మహిళ.. శబ్దాలు విని కిందకు వచ్చింది. పోలీసులను చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక షాక్ అయింది. గతంలోనూ ఓసారి ఈ బొమ్మను చూసి నిజమైన మహిళ అనుకుని వైద్య విద్యార్థులు సాయం చేసేందుకు ప్రయత్నించారు. తీరా అది శిల్పం అని తెలిసి నవ్వుకున్నారు. చదవండి: 165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే -
రాష్ట్రంలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తాం
చైతన్యపురి (హైదరాబాద్): తెలంగాణలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీనగర్ కాలనీలో పద్మశ్రీ గజం గోవర్ధన నివాసంలో ఏర్పాటు చేసిన చేనేత ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్సీ ఎల్‌రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలు, మగ్గాల గురించి కేటీఆర్‌కు గోవర్ధన వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..చేనేత కళను, చేనేత కళాకారులను ప్రోత్సహించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుదేనని తెలిపారు. పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబాలకు నేతన్న ధీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, చేయూత, చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాలపై 40% రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. చేనేత ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించటం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నానని, ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత కళాకారుల సంక్షేమానికి పాటుపడుతున్న గజం గోవర్ధనను ఆయన అభినందించారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, చేనేత కళాకారులు పాల్గొన్నారు. -
పుష్ప, RRR, ఆచార్య : ఆర్టిస్ట్ సమంతా అద్భుతమైన పాట వింటే..
సాక్షి, హైదరాబాద్: భారతీయ సినిమాలో గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆర్ట్ రూపంలో దర్శనమిస్తే ఎలా ఉంటుంది. వెండి తెరపై ఒక మూవీని అవిష్కరించే అన్ని క్రమాలను ఒక థీమ్‌గా ఎంచుకుని కళాకారులు పనిచేస్తే. ఈ ఆలోచనే అద్భుత కళాఖండాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ కార్టూనిస్టు, దర్శకులు బాపు, రమణలు సినిమా మొత్తాన్ని పర్ఫెక్ట్గా బొమ్మలు గీసుకొని ఆ తరువాత సినిమా తీసేవారట. అలాగే తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు, సినిమా తయారయ్యేందుకు సంబంధించి వివిధ దశలు, రంగాలు, స్టార్ హీరోలు, లెజెంట్రీ నటీ నటుల పట్ల గౌరవ సూచకంగా ఆర్ట్ క్యూరేటర్ అన్నపూర్ణ మడిపడగ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొలువు దీరిన వినూత్నమైన , అద్భుతమైన చిత్రాలను ‘చిత్రం’ షోలో చూద్దాం. ఆర్టిస్టులు రకరకాల థీమ్‌లతో బొమ్మలు వేయడం, వాటిని ప్రదర్శనకు పెట్టడం అందరికీ తెలుసు. ఇందులో ప్రతీ ఆర్టిస్టుకు వారికంటూ ఒక ప్రత్యేక శైలి( సిగ్నేచర్) ఉంటుంది. దాని ఆధారంగా తమ ప్రతిభకు అద్దంపడుతూ అద్భుతమైన ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. వీటిని పరిశీలిస్తే.. ఇలా కూడా ఆర్ట్ వర్క్‌ను రూపొందించవచ్చా అని ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌ను సక్సెస్ చేస్తూ, ఔరా అనిపించే ఎగ్జిబిషన్స్‌తో ఆకట్టుకుంటూ, గొప్ప మహిళా ఆర్ట్ క్యూరేటర్‌గా పాపులర్ అయిన అన్నపూర్ణ మడిపడగ ఎగ్జిబిషన్ విశేషాలను సాక్షి.కామ్‌తో పంచుకున్నారు. భారతీయ సినిమాకు సంబంధించిన థీమ్‌తో దీన్ని రూపొందించడం విశేషం. సినిమాలోని 24 క్రాప్ట్స్ ఇన్స్పిరేషన్తో ఆ ఆర్ట్స్‌ను రూపొందించామని అన్నపూర్ణ వివరించారు. యాక్రిలిక్, ఆయిల్, వుడ్, సీడీలు, ఫ్లోర్ టైల్స్, 24 కారెట్స్ గోల్డ్, పెన్సిల్ స్కెచ్, ఇలా విభిన్న మీడియమ్స్పై దేశవ్యాప్తంగా 30 మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కోసం ఆర్టిస్ట్‌ల తపన గురించి వివరించారు. అలాగే కళకు జెండర్ లేదని, చాలామంది మహిళా ఆర్టిస్టులు కూడా అద్బుతమైన ఆర్ట్స్ రూపొందించారని అన్నారామె. అలాగే తమ ఎగ్జిబిషన్‌కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, రెండేళ్ల తమ శ్రమ ఫలించిందంటూ అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. కోలకతా బైస్డ్ ఆర్టిస్ట్ దెబాషిస్ సమంత బాలీవుడ్ లెజెండ్రీ మూవీ ‘పాకీజా’ కి ట్రిబ్యూట్‌గా ఒక కళాఖండాన్ని రూపొందించారు. అంతేకాదు తన అభిమాన హీరోయిన్ మీనాకుమారీపై ప్రేమతో సమంతా పాట పాడి మరీ మ్యూజికల్ ట్రిబ్యూట్ అందించారు. సంవత్సరన్నర నుంచి 40 రోజుల పాటు శ్రమించి తమ బుర్రకు, కుంచెకు పదును పెట్టి అద్బుతమైన కళా ఖండాలను ప్రదర్శించారు. ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషన్ మూవీలు, పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య థీమ్‌లను తీసుకుని డిఫరెంట్ ఆర్ట్ వర్క్ తీర్చిదిద్దారు. హ్యాండ్ మేడ్ పోస్టర్స్ థీమ్‌తో వీటిని ప్రదర్శించడం హైలైట్. ఫస్ట్ విమెన్ ఆఫ్ ఇండియన్ విమెన్ అనే కాన్సెప్ట్‌తో సినిమా రంగంలో మహిళ సేవలకు గౌరవ సూచకంగా నిలిచిన ఆర్ట్‌పీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాక్షి కార్టూనిస్ట్ శంకర్ రూపొందించిన కార్టూన్స్ మరో ఆకర్షణ. ముఖ్యంగా సినిమాలోని స్టోరీ బోర్డును ఎంచుకుని నగేష్ గౌడ్ అలనాటి రెండు బ్టాక్ బస్టర్ మూవీలు అడవి రాముడు, భక్తకన్నప్ప పెయింటింగ్స్ రూపొందించారు. ఒక స్టోరీ బోర్డులాగా తీర్చి దిద్దినట్టు నగేష్ గౌడ్ వెల్లడించారు. ఎంతో కమిట్మెంట్, డెడికేషన్, తపన ఉంటే ఇలాంటి అద్భుతాలు వెలుగులోకి రావు నిజంగా ఆర్టిస్టులకు ధన్యవాదాలు అంటూ విజిటర్స్ ఎంజాయ్ చేశారు. -
ఆరేళ్ల బాలుడిని, వంద అడుగుల పైనుంచి..
లండన్: ఆరేళ్ల పిల్లవాడిని అన్యాయంగా వంద అడుగుల పై నుంచి కింద పడేసి, పగలబడి నవ్విన 18 ఏళ్ల యువకుడికి లండన్ కోర్టు శుక్రవారం 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ‘అదేంటి మా పిల్లవాడిని అలా పడేస్తున్నావు నీకేమైనా పిచ్చా?’ అంటూ ఆ ఆరేళ్ల పిల్లవాడు అడ్డు పడబోతుంటే ‘అవును నాకు పిచ్చే. టీవీలో నేను కనబడాలని పిచ్చి’ అంటూ 18 ఏళ్ల జాంటీ బ్రేవరి, సినిమాలో విలన్లా పగలబడి నవ్వాడట. 2019, ఆగస్ట్ 4వ తేదీన జరిగిన ఈ సంఘటనపై లండన్‌లోని ఓల్డ్ బెయిలీ జడ్జి జస్టిస్ మాక్గోవన్ నేడు తీర్పు చెప్పారు. పర్యాటక ప్రాంతమైన లండన్‌లోని ‘టేట్ మోడ్రన్ వ్యూయింగ్ గాంట్రీ’లో నిలబడిన ఫ్రాన్స్‌కు చెందిన ఆరేళ్ల బాలుడి వద్దకు జాంటి బ్రేవరి వెళ్లి అతన్ని అమాంతంగా పైకెత్తి రేలింగ్ పై నుంచి వంద అడుగుల కిందకు పడేశాడు. అదృష్టవశాత్తు ఆ బాలుడు బతికాడుగానీ, శరీరంలో పలు ఎముకలు విరగడంతోపాటు మెదడుకు గాయమైంది. ప్రస్తుతం ఆ పిల్లవాడు వీల్ చేర్‌కు పరిమితం అయ్యాడు. అతడు కోలుకొని నడవడానికి మరో రెండేళ్లు పడుతుందని వైద్యులు తెలిపారు. పిల్లవాడు పడుతున్న బాధను, ఆ పిల్లవాడికి జరిగిన దారుణానికి తల్లడిల్లుతున్న వారి తల్లిదండ్రుల ఆందోళనను అర్థం చేసుకోని దోషికి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి తెలిపారు. (‘అండర్వేర్ వేసుకోను.. మాస్క్ ధరించను’) పిల్లవాడిని కిందకు పడేస్తోన్న సీసీటీవీ ఫుటేజ్‌లను కోర్టులో చూపించాల్సిన అవసరం లేదని, అలాగే టీవీలలో చూపించరాదని జడ్జి అధికారులను ఆదేశించారు. టీవీలో తాను కనిపించడం కోసమే తాను అలా చేశానన్న నేరస్థుడి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని జడ్జి ఈ ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే) -
‘దయచేసి టచ్ చేయండి’
మీరు నేను చేసే శిల్పాలను, కళాకృతులను చూసి, అనుభవ పూర్వకంగా మీరే వాటి గురించి తెలుసుకోండి అంటున్నాడు ఆర్టిస్ట్ హర్షా దురుగడ్డ. కళా ప్రదర్శనల్లో సాధారణంగా చిత్రాలను, శిల్పాలను ముట్టుకోవద్దు అనే సూచనలే ఉంటాయి. ఇందుకు భిన్నంగా హర్షా ‘దయచేసి టచ్ చేయండి’ అని చెబుతున్నాడు. కలప, లోహం, ఫ్లైవుడ్ తదితర సంప్రదాయ ముడి పదార్థాలను మిల్లింగ్, చెక్కడం ద్వారా ఈ కళాకృతులను తయారు చేశారు హర్ష. కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో డిసెంబర్ 7న, సాయంత్రం 6 గంటలకు ‘ఫ్రాగ్మెంట్స్ ఇన్ మోషన్’ పేరుతో ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది. -
తడి ఆరని వర్ణాలు
ఎనభై ఏళ్ల క్రితం బెంగాల్‌లోని విక్టోరియన్ కాలపు నిర్జీవ చిత్ర సంప్రదాయాన్ని బ్రేక్ చేసి, చిత్రకళకు కొత్తపుంతలు అద్దిన ఓ చిత్రకారుడి వర్ణ ఖండాలను సింగపూర్లోనిఓ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శించడం అంటే.. ఆయనకే కాదు, భారతీయ కళా నైపుణ్యానికే అదొక పురస్కారం. హేమేంద్రనాథ్ మజుందార్ (1898–1948) బెంగాలీ చిత్రకారుడు. తాను మంచి మంచి బొమ్మలు వేయాలనుకుంటే తండ్రి మాత్రం అందుకు వ్యతిరేకించాడు. ఆయనను ఎదిరించి కలకత్తా ఆర్ట్ స్కూల్లో చేరిపోయారు. అక్కడ నుంచి జూబిలీ అకాడమీకి వెళ్లి మరింత నేర్చుకున్నారు. ఇంగ్లండు నుంచి చిత్రకళకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు తెప్పించుకున్నారు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో వెలితి అనిపించేది. మనుషుల బొమ్మలను సహజంగా ఉండేలా చిత్రీకరించాలనే కోరిక బలంగా నాటుకుంది ఆయనలో. 1920లో అతుల్ బోస్ అనే సాటి కళాకారుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ కలకత్తా గవర్నమెంట్ ఆర్ట్ స్కూల్లో కలిశారు. చూసిన ప్రతి బొమ్మను, దృశ్యాన్ని... అన్నిటినీ కుంచెలో ముంచి చూపారు. బెంగాల్లో ప్రసిద్ధంగా ఉన్న విక్టోరియన్ ‘నిర్జీవ లేఖనాన్ని’ కూడా చిత్రీకరించారు. ఆ విధానాన్ని మార్చాలనే లక్ష్యంతో ఒక సొంత స్కూల్‌ని పెట్టారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అనే ఒక పత్రికనూ స్థాపించారు. దీని ద్వారా చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావించారు. విస్తృతమైన అంశాలను ఇందులో పాఠ్యాంశాలుగా పెట్టారు. కళలకు సంబంధించిన వార్తలు, గాసిప్స్, ట్రావెలాగ్, చిన్న కథలు, హాస్యం అన్నీ పరిచయం చేశారు. మజుందార్ వేసిన మొట్టమొదటి మేజర్ పెయింటింగ్.. పల్లి ప్రాణ్ (పల్లె ప్రాణం). ఆ వరుసలోనే వెట్ శారీ ఎఫెక్ట్.. అంటూ కొన్నిటిని చిత్రీకరించి, పబ్లిష్ చేశారు. ఆర్థిక కారణాల వల్ల వారి స్కూల్ కొన్నిరోజులకే మూత పడింది, ఆ తరువాత సొసైటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని రెండో వెంచర్ ప్రారంభించారు. ఇంగ్లండ్‌లో కొంతకాలం ఉండి వచ్చారు. మజుందార్ మహిళల మీద వరుసగా రకరకాల అంశాలను చిత్రీకరించారు. మహిళల టాయిలెట్స్, పగటి కల కనడం.. ఇలాంటివి కూడా ఉండేవి. మరో చిత్రంలో అమ్మాయి వెనుకకు తిరిగి ఉన్న రూపాన్ని చూపారు. ఇందులో ఆమె యువతిగా ఉన్నప్పుడు ఆమె శరీరం ఎలా ఉన్నది, ఆమె కండరాలు, ఆమె ఎముకల నిర్మాణం కూడా చూపారు. ద వూండెడ్ వానిటీ, బ్లూ సారీ, హార్మొనీ, ఇమేజ్ అని ఆయన వేసిన పెయింటింగ్స్‌లో చాలావరకు అమ్మాయిలను దిగంబరంగానే చూపారు. వాటర్ కలర్స్ ఉపయోగించారు వాటికి. బోంబే ఆర్ట్ సొసైటీలో మజుందార్‌కి మూడు సంవత్సరాలు వరుసగా మూడు బహుమతులు వచ్చాయి. స్మృతి అనే పెయింటింగ్‌కి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇలా మూడుసార్లు ఆయనకే రావడాన్ని కొందరు విమర్శకులు తప్పుపట్టారు. 1940లలో మజుందార్ అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు గడించారు. జైపూర్, బికనీర్, కోటా, కశ్మీర్, మయూర్భంజ్, పటియాలా మహారాజులు తమ దగ్గర పనిచేయమని కోరుకున్నారు. పటియాలా మహారాజు భూపేంద్రనాథ్ సింగ్ ఆయనను తన ఆస్థాన చిత్రకారుడిగా ఐదు సంవత్సరాల పాటు నియమించుకున్నారు కూడా. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ’æలో ఉన్న సాంటియో గ్యాలరీలో ఈ నెల 17 వరకు వారం పాటు ఆయన చిత్రాలను ప్రదర్శించారు. – జయంతి -
ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు!
శంకర్ గీతకు కంట్రోల్ ఉండదు. కంట్రోల్ తప్పడం కాదది.. కంట్రోల్లో పెట్టడం! అది కార్టూనింగ్. వంకరగా అతడు ఒక్క గీత గీశాడంటే.. ఎవరు ఏమిటో చక్కగా దిగిపోద్ది. అది క్యారికేచరింగ్. పైనున్నాయన బొమ్మను చేసి ప్రాణం పోస్తే.. ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు. అదొక తాండవం. శంకర తాండవం. భుజానికో గుడ్డ సంచీ తగిలించుకుని అందులో తన ఆశల గీతలను దాచుకుని ఎన్ని మెట్లెక్కాడో తెలియదు కానీ, హృదయాన్ని ముంచెత్తుతోన్న రంగురంగుల స్వప్నాలను ఎక్కడైనా ఒలకబోసుకుందామని ఎన్నిసార్లో ప్రయత్నించారు పామర్తి శంకర్. ఆ తపనతోనే వృత్తిరీత్యా కార్టూనిస్టు, ప్రవృత్తిరీత్యా క్యారికేచరిస్ట్ అయిన శంకర్ అనతి కాలంలోనే అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకోగలిగారు. అలా రెండు దశాబ్దాల పాటు తను వేసిన ప్రతి పెన్సిల్ గీతా, ప్రతి సిరాచుక్కనీ ఒకచోటకు చేర్చి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆర్ట్ గ్యాలరీలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’ పేరుతో ప్రదర్శనకు ఉంచారు శంకర్. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాను తలచుకున్నప్పుడల్లా జాతి వివక్షకు వ్యతిరేకపోరాట చిహ్నంగా అంతర్జాతీయ బహుమతి గెలుచుకున్న శంకర్ గీసిన మండేలా బిగిపిడికిలి గుర్తురావాల్సిందే ఎవ్వరికైనా. ఎంఎస్ సుబ్బులక్ష్మి గానామృతం రుచిమరిగిన కోయిలమ్మ సహా సుబ్బులక్ష్మి బొమ్మ శంకర్ క్యారికేచర్ దాహార్తికో మచ్చుతునక. ప్రాణాలన్నీ ఉగ్గదీసుకుని షెహనాయ్లోకి ఊదుతున్నట్టున్న బిస్మిల్లాఖాన్ షెహనాయ్ మన చెవుల్లో రింగుమంటూంటుంది. కారల్ మార్క్స్ గడ్డం, ఎంఎఫ్ హుస్సేన్ ఆర్టు, కేసీఆర్ సిగలో తురిమిన తెలంగాణ, పాటల జలపాతాల్లా తోచే గోరటి వెంకన్న కళ్లు, అరుంధతీరాయ్ సిగలో పుష్పంగా మారిన సాహిత్యం, పీవీనరసింహారావు మూతి ముడుపు, రజనీకాంత్ స్టైలూ, మైకేల్ జాక్సన్ వొంటి విరుపూ ఇలా చెప్పుకుంటూ పోతే శంకర్ క్యారికేచర్ల ప్రత్యేకతలు శంకర్‌లోని రాజకీయ, సామాజిక, ఆర్థికావగాహనని సాక్షాత్కరిస్తాయి. ‘‘ఈనెల 21న ముగియనున్న ఈ ఎగ్జిబిషన్ ఏ ఒక్క కార్టూనిస్టుని తయారుచేసినా నాకదే సంతృప్తి’’ అంటోన్న శంకర్ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న కొన్ని అనుభూతులు. మీ మదిలో మెదిలిన తొలి పెన్సిల్ గీత? నిజం చెప్పాలంటే మట్టిబొమ్మలతో నా ప్రయాణం మొదలైంది. స్కూల్ డేస్‌లోనే రంగులతో స్నేహం ఏర్పడింది. చిన్నప్పుడే సైన్‌బోర్డు ఆర్టిస్టుగా చేరాను. ఆ తరువాత స్కూల్లో పిల్లలకు డ్రాయింగ్ నేర్పే టీచర్ వృత్తిలోకి మారాను. మూడు పీరియడ్స్ మినహా మిగిలిన సమయమంతా లైబ్రరీలో గడిపేవాడిని. ప్రకాష్ షెట్టీ, అజిత్ నారాయణ్ క్యారికేచర్లు చూసేవాడిని. ఏదో వెలితి నన్ను వెంటాడుతూ ఉండేది. నాక్కావాల్సింది ఇది కాదు అన్న భావన నాలో అశాంతిని రేపేది. అప్పటికే నల్లగొండ గోడలపై వెలిసే ఆర్టిస్ట్ మోహన్ ఉద్యమపొలికేకల పోస్టర్లు నన్ను అమితంగా ఆకర్షించేవి. ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్‌కి ప్రయాణమయ్యేవాడిని. ఆర్ట్ ఎగ్జిబిషన్స్, సండేమార్కెట్‌లో పుస్తకాలు కొనుక్కోవడం, ఎంఏడి (మాడ్) కార్టూన్ మాగజైన్స్ చూడటం, మోర్ట్ డ్రక్కర్ క్యారికేచర్స్, సెర్జో ఆర్గాన్స్, డాన్ మార్టిన్, పాల్కోకర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్టూనిస్టులను చూస్తూండేవాడిని. ఆ స్ఫూర్తితోనే వారపత్రికల్లో అప్పుడప్పుడూ సోషల్ కార్టూన్స్‌ని పంపేవాణ్ణి. అలా అలా డైలీ పాకెట్ కార్టూన్‌కి ఫిదా అయిపోయాను. పత్రికారంగంలోకి ఎలా వచ్చారు? అమెచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కార్యకర్తగా ఉన్నప్పుడు పూర్వపు ఆంధ్రజ్యోతిలో తిరుపతి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ కార్టూనిస్ట్ కాంపిటీషన్స్‌లో నేను సెలక్ట్ అయ్యాను. అయితే ఇంటి దగ్గర్నుంచి చేస్తానన్నాను. కానీ పొలిటికల్ కార్టూన్లు ఇంటినుంచి వేయడం కుదరదన్నారు. మీ రంగుల కల రాజధానికెలా చేరింది? అయితే సీజనల్‌గా కాదు పూర్తికాలం కార్టూనిస్టుగా ఉండాలన్న తపన, జిజ్ఞాస ఎలాగైనా హైదరాబాద్‌కి వెళ్లిపోవాలన్న కోర్కెకు బలంచేకూర్చింది. అదే నాన్నకి చెప్పాను. మహా మహా ఆర్టిస్టులే రోడ్ల మీద క్రీస్తు బొమ్మలూ, ఆంజనేయస్వామి బొమ్మలూ వేసుకుని అడుక్కుతింటూంటే హైదరాబాద్ వెళ్లి నువ్వేం చేస్తావురా? నువ్వింకా హైదరాబాద్‌కి వెళ్లదల్చుకుంటే నా శవంపై నుంచి దాటి వెళ్లు అన్న నాన్న కరెంటు నర్సయ్య మాటలకు కట్టుబడి, నల్లగొండ మట్టిపై మమకారాన్ని వదులుకోలేక చాలా ఏళ్లు నన్ను కనిపెంచిన ఆ నల్లనిరాళ్లలో ఉండిపోయా ను. ఉద్యోగంలో తృప్తిలేదు. కార్టూన్ల దాహం తీరలేదు. ఇక లాభంలేదనుకుని ఒకానొక రోజు భుజానికి గుడ్డసంచీ తగిలించుకుని, దాని నిండా నేను గీసిన కార్టూన్లు నింపుకుని ఆర్టిస్టు మోహన్‌గారిని వెతుక్కుంటూ హైదరాబాద్ చేరాను. నా గీతను ఇష్టపడిన మోహన్‌గారు నన్ను అక్కున చేర్చుకున్నారు. క్యారికేచర్లలోకి ఎలా అడుగుపెట్టారు? తెలుగు మహాసభల కోసం ప్రత్యేక సంచిక వేస్తూ మోహన్‌గారు నాకోసం ప్రత్యేకించి శంకర భాష్యం పేరుతో ఒక పేజీని కేటాయించారు. భానుమతి, బాల్‌థాకరే, రాజేంద్రప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల క్యారికేచర్లు అందులో పబ్లిష్ అవడం నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ మెదిలే తొలి అనుభవం. చెదిరిన జుట్టుతో అత్యంత సహజంగా వేసిన బాలగోపాల్ క్యారికేచర్, రైతు భుజంపై చేయివేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యారికేచర్, ఎంఎఫ్ హుస్సేన్, విన్నీ మండేలా, రావు బాల సరస్వతి, కిషోర్ కుమార్, ఆరుద్రల క్యారికేచర్లు నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ∙కార్టూనిస్టుగా తొలి అనుభూతి? ఉద్యోగం కోసం కార్టూన్లతోనే మూడు పేజీల బయోడేటా తయారుచేసుకుని నా కార్టూన్లన్నింటినీ సంచిలో పెట్టుకుని మళ్లీ కార్టూనిస్ట్ ఉద్యోగ వేటలో పడ్డాను. వార్తాపత్రికలో రామచంద్రమూర్తిగారికి నా కార్టూన్లిచ్చి వచ్చాను. నల్లకుంటలో బస్‌కోసం ఎదురుచూస్తుంటే అనుకోకుండా పాన్‌డబ్బా ముందు వేళ్లాడదీసిన నా కార్టూన్... ఒకటి కాదు వరసగా పది పేపర్లు. ఆశ్చర్యపోయాను. నా కార్టూన్ ఫ్రంట్ పేజ్‌లో. ఆనందానికి అవధుల్లేవు. అలా మొదలై ఇప్పుడు ప్రముఖ దినపత్రిక ‘సాక్షి’లో కార్టూనిస్టు స్థాయికి చేరాను. ఓసారి రాజకీయవేత్తలందరితో వేసిన ఓ క్యారికేచర్ తెల్లారి ఫ్రంట్ పేజ్ బ్యానర్‌గా మార్చిన సాక్షి ఎడిటర్ మురళిగారిని ఆశ్చర్యంగా అడిగాను సర్ ఇది లోపలి పేజీ కోసం వేసిందని. ‘‘అది బ్యానర్లో ఉండాల్సిన క్యారికేచర్లే మాకు తెలుసు’’ అని మురళిగారు అన్న మాట వృత్తిపరంగా నాకెంతో సంతృప్తినిచ్చిన మరో సందర్భం. అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి -
థర్మాకోల్.. కళాకృతులు జిగేల్!
హైదరాబాద్ : థర్మాకోల్‌తో రూపుదిద్దుకున్న వివిధ ఆకృతులు కళాభిమానులను కట్టిపడేస్తున్నాయి. ప్రముఖ థర్మాకోల్ కళాకారుడు ఎండి.సయీద్ వీటిని తీర్చిదిద్దారు. ఇవి ఇప్పటికే దేశ విదేశాల కళాభిమానులను రంజింపజేశాయి. చార్మినార్, ఇసుర్రాయి, గిర్నీ, చార్మినార్, కమాండో నైఫ్, గిటార్, మైక్రోస్కోప్, టెలిస్కోప్ తదితర ఆకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు సుమారు 85 కళాకృతులను థర్మాకోల్‌తో తీర్చిదిద్దినట్లు సయీద్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటున్న నేపథ్యంలో వీటి ప్రదర్శన తనకు భారంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభు త్వం తనను ఆదుకోవాలని ఆయన కోరారు. -
ఖైదీ..కళ
జైల్లోని ఖైదీలు.. కుంచెతో అద్భుతాలుచేస్తున్నారు. జీవితసారాన్ని తెలుసుకుంటూ కళాత్మక రంగంలో రాణిస్తున్నారు. నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, జైళ్ల శాఖ సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమంతో ఇది సాధ్యమవుతోంది. ఖైదీల జీవితాల్లోసరికొత్త మార్పుకు కారణమవుతోంది. కారాగారాల్లో కటకటాలను తడుముతూ గడిపే చేతులు... కుంచెను పట్టాయి. కుటుంబానికి, సమాజానికి దూరంగా భారంగా నడుస్తున్న బతుకులకు కళ జీవం పోస్తోంది. బాహ్య ప్రపంచంతో వారిని అనుసంధానిస్తోంది. 2016లో నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్ గ్యాలరీప్రారంభించిన ఓ వైవిధ్యభరితమైన కార్యక్రమం... ఖైదీల ‘కల’లకు సరికొత్త ‘కళ’ను అద్దుతోంది. సాక్షి, సిటీబ్యూరో : బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలోకి అడుగిడితే మనల్ని ఆకట్టుకునేవి చిత్రాలు మాత్రమే కాదు... అవి గీసిన చేతుల కథలు కూడా. నగరంలోని చంచల్‌గూడ, చర్లపల్లి కారాగారాలకు చెందిన 21 మంది ఖైదీలకు ఇప్పుడు చిత్రలేఖనం అనేది జీవితాల్లో చిత్రమైన మార్పుకు కారణంగా మారింది. ప్రస్తుతం ఖైదీలు గీసిన చిత్రాలను బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన మే 7 వరకు కొనసాగుతుంది. అమ్మకంతో ఆదాయం.. జైళ్లలోని ఖైదీల్లో మార్పు కోసం కళాకృతి ఆర్ట్ గ్యాలరీతో కలిసి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆధ్వర్యంలో 2016లో ‘జైల్లో ఆర్ట్ క్లాసెస్’కు నాంది పలికారు. అప్పటి నుంచి ఇది బలోపేతమవుతూ వచ్చింది. ఈ చిత్రాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల కుటుంబాలకు అందజేస్తున్నారు. వారానికి రెండుసార్లు చిత్రకారుడు సయ్యద్ షేక్ ఈ రెండు జైళ్లను సందర్శిస్తారు. ఖైదీలకు చిత్రాలు గీయడం నేర్పిస్తారు. ‘ఈ కాన్సెప్ట్ గురించి తొలుత రేఖా లహోటి (కళాకృతి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు) నన్ను సంప్రదించినప్పుడు చాలా భయపడ్డాను. చేయనని చెప్పేశాను. అయితే ఆమె నాకు విడమరిచి చెప్పారు. ఇది కేవలం శిక్షణ ఇవ్వడం కాదని, జీవితాలను మలచడమని ఆమె వివరించారు. మొత్తానికి నన్ను ఒప్పించారు. తొలి దశలో ఖైదీలు దగ్గరకు వస్తుంటే నేనంత దూరం జరిగిపోయేవాణ్ని. అయితే ఆ తర్వాత్తర్వాత ఈ అవకాశం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. ఇది నాకు ఒక జీవిత కాలంలోనే అత్యంత సంతృప్తిని అందించిన అనుభవం’ అని చెప్పారు సయ్యద్ షేక్. కళాఖండాలు...కారాగారాలు ఆ చిత్రాలను చూస్తే... ఎలాంటి ముందస్తు అనుభవం లేకుండా గీసిన చిత్రాలంటే అసలు నమ్మలేం. చేయి తిరిగిన చిత్రకారుడి ప్రతిభ అంత చక్కగా ఉంటాయవి. ‘వాళ్లు గతంలో ఎప్పుడూ కాన్వాస్ మీద చిత్రాలు గీసిన వారు కానప్పటికీ... వాళ్లలో కొంత మందికి జైలుకి రాకముందు కార్పెంటర్స్‌గా, సైన్బోర్డ్ వర్కర్స్‌గా, వాల్ పెయింటర్స్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయా వృత్తుల వ్యాపకాల పరంగా కొంత సృజనాత్మక సామర్థ్యాలు ఎలాగూ అవసరం. కాబట్టి.. అలా కొందరు తేలికగానే చిత్రకారులైపోయారు. మరోవైపు సహజంగానే కొందరు ఏక సంథాగ్రాహులుగా ఉన్నారు. వీరంతా అద్భుతాలు చిత్రించగలిగారు’ అని వివరించారు సయ్యద్. కళాత్మక దృక్పథం...మార్చింది జీవితం ‘ఖైదీలతో ఎక్కువ సమయం గడపిన క్రమంలోనే వారి జీవితాలను, నేపథ్యాలను తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది. చాలా మంది నన్ను కేవలం ఆర్ట్ టీచర్‌గా మాత్రమే కాకుండా... మరింత దగ్గరగా చూశారు. ఒకసారి పెయింటింగ్ ప్రారంభించగానే దానిపై నిమగ్నమయేవారు. అంతగా వారు ఈ కళపై ఆసక్తి పెంచుకున్నారు. ఎప్పుడైన వాళ్లు అలసటగా ఫీలైతే... ఆ విరామంలో తమ వ్యక్తిగత జీవిత విషయాలను, కథలు, వ్యథలను నాతో పంచుకునేవారు. తాము జైలుపాలు కావడానికి కారణాలు చెప్పేవారు. జేబులు కొట్టడం లాంటి నేరాల దగ్గర్నుంచి స్నాచింగ్‌లకు పాల్పడ్డవారు, హత్యలు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే వారితో అంతకాలం గడిపాక, వారి చిత్రలేఖనం చూశాక వాళ్లు అలాంటి క్రూరమైన నేరాలు చేశారంటే నమ్మడం కష్టంగా అనిపించేది. ముఖ్యంగా పెయింట్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా, నిశబ్దంగా ఉండేవారు. ఒకసారి ల్యాండ్ స్కేప్స్, ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, పంట పొలాలను గీస్తున్నప్పుడు వాళ్లలో ఒకరు ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే.. తాను వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చాడు. ఆ చిత్రాలు అతనికి తన పొలాన్ని గుర్తు చేశాయి. తాము చేసిన పనులకు పశ్చాత్తాపం పడుతున్నట్టు వాళ్లు నాకు చెప్పేవారు’ అన్నారు సయ్యద్. తాము పెయింటింగ్స్ వేయగలగమని ఎప్పుడూ అనుకోలేదని, పెయింటింగ్స్ వేస్తూ కూడా హాయిగా బతకొచ్చునని అనుకొని ఉంటే తమ జీవితాలు వేరేగా ఉండేవని వారు భావిస్తున్నారని సయ్యద్ చెబుతున్నారు. వీరిలో కొందరు తాము విడుదలయ్యాక దీనినే ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారట. అందుకే యానిమేషన్, ఫైన్ఆర్ట్స్ రంగాల్లోకి వెళ్లడానికి సలహా చెప్పమని అడిగేవారట. ‘కళాత్మక దృక్పథం వీరిలో ఎంత మార్పు తెచ్చింది.. వీరు ఇప్పుడు మరింత వినయంగా మారారు. ఇంటికి డబ్బులు పంపించడం వారికి చాలా ఆనందాన్ని ఇస్తోంది’ అంటూ జైళ్ల శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
విజయనగరం ఉత్సవాలలో పుష్ప ప్రదర్శన
-
చిత్రాల పువ్వమ్మ చిరకాలం బతుకమ్మ
బ్రసెల్స్, ఇంగ్లాండ్... ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే పూల పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాలకు కేవలం ఆ ఫ్లవర్ ఫెస్టివల్స్ కారణంగానే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే వీటన్నింటినీ మించింది మన బతుకమ్మ. ప్రకృతి సౌందర్యానికి పట్టం గట్టే అద్భుతమైన ఈ వేడుక విశిష్టతను విశ్వవ్యాప్తం చేసే కృషిలో భాగంగా తెలంగాణ చిత్రకారుల సంఘం రవీంద్రభారతిలో బతుకమ్మ చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. – ఎస్.సత్యబాబు ప్రకృతిలోని ప్రతి ఆకు, పువ్వు అందమైనదేనని నిరూపిస్తూ.. మనసులను పూల వనంలా మార్చేంత చక్కని సంప్రదాయం బతుకమ్మ పండుగ. ఈ సంబరాల్లో సున్నితత్వం ఉంది. సృజనాత్మకత ఉంది. అందం ఉంది. అంతకు మించిన ఆధ్యాత్మికత ఉంది. ఒక చిత్రకారుడి మనసు స్పందించడానికి అంతకన్నా కావాల్సిన ముడిసరుకు ఏముంది? అదే విషయాన్ని ఇలా పంచుకున్నారీ చిత్రకారులు... పాటకు పట్టం కట్టా... అమ్మమ్మ, నానమ్మ, అమ్మ బతుకమ్మలు చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. పండుగ సెలవుల్లో ముత్యాల పూలు అవీ ఇవీ తెచ్చి కలర్స్ వేస్తూ బతుకమ్మ తయారీలో నిమగ్నమయ్యే దానిని. బతుకమ్మ పేర్చడం ఇప్పటి వారికి చాలా మందికి తెలీదు. అందుకని ఆ పేర్చడం అనేదాన్ని వివరిస్తూ కూడా ఓ చిత్రం గీశాను. అలాగే ‘ఓరుగల్లు చూసి ఉయ్యాలో..’ పాటకు తగ్గట్టుగా నా పెయింటింగ్‌లో తెలంగాణలోని అన్ని ముఖ్యమైన ప్లేసెస్ వచ్చేలా చిత్రం గీశాను. – సరస్వతి, చిత్రకారిణి ఢిల్లీలో ఉన్నా మరువలేకున్నా... గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాం. మా స్వస్థలం చిట్యాల. మా ఊరిలో శివుడి గుడి ఉండేది. అక్కడే బతుకమ్మ ఆడేవాళ్లం. అప్పటి జ్ఞాపకాలు, ఆ సంతోషం మరిచిపోలేం. అవే స్ఫూర్తిగా బతుకమ్మ చిత్రాలు గీస్తున్నాను. గత కొంతకాలంగా దేశ రాజధానిలో సైతం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చాక గతేడాది ఢిల్లీలో 25 మంది మహిళలతో కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేశాం. తెలంగాణ భవన్లో కూడా తరచూ జరిగే సంబరాల్లో పాల్గొంటున్నాను. – అర్పితారెడ్డి. ఢిల్లీ చిత్రకారిణి కుంచెను కదిలిస్తుంది... ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాల్సిన పండుగ ఇది. తెలంగాణ ఆర్టిస్ట్, హైదరాబాద్ ఆర్టిస్ట్ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ‘ఫ్లవర్–ఫిమైన్ అండ్ బతుకమ్మ’ అనే థీమ్ ఎంచుకున్నాం. ప్రతి చిత్రకారుడికీ మహిళ, పుష్పం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. అసలు ఫైనార్ట్స్‌లో మదర్ అండ్ చైల్డ్తోనే పాఠం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో 40 మంది చిత్రకారులు బతుకమ్మ స్ఫూర్తిని ఎవరికి వారే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రాలను మేం ప్రదర్శిస్తున్నాం. – ఎం.వి.రమణారెడ్డి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ -
అందరి చూపు ఆ కేఫ్ వైపే!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్ట్ గ్యాలరీలు అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉంటాయి. ఇక కాఫీడేలు, కల్చరల్ సెంటర్లలోని ఎగ్జిబిషన్ హాల్స్ సైతం ప్రముఖులకో, మేధావులకో అందుబాటులో ఉంటాయి. అక్కడ నిర్వహించే ఫొటో ప్రదర్శనలను తిలకించే అవకాశం సామాన్యులకు సు‘దూరమే’. ఈ దూరాన్ని చెరిపేయాలనుకున్నారు నగరానికి చెందిన ‘ఫొటో వాకర్స్’. సిటీ ఐడెంటిటీ సింబల్స్‌లో ఒకటైన ఇరానీ కేఫ్‌నే ఫోటో ఎగ్జిబిషన్‌కు వేదిక చేసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్స్ అనగానే ఏ గ్యాలరీ అనే ప్రశ్నే వస్తుంది. అయితే వీటిని సామాన్యులకు చేరువ చేయాలనే ట్రెండ్ ఇటీవలే మొదలైంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇవి ఇప్పటికే సామాన్యుడి ముంగిటకు వచ్చేశాయి. ఏకంగా బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు.. ఇలా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలను వెతికి మరీ ఎక్స్పోలను ఆరెంజ్ చేస్తున్నారు. నగరానికి ఈ ట్రెండ్‌ని పరిచయం చేస్తూ ఎక్కువ జనాలు వచ్చే ఇరానీ కేఫ్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సిటీ లుక్.. సిటిజన్స్ క్లిక్.. ఈనెల 19న అబిడ్స్‌లోని హోటల్ గ్రాండ్ ఇరానీ కేఫ్‌లో ఫొటో గ్రాఫర్స్ గ్రూప్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నేటితో ముగియనుంది. మధ్య తరగతి, సామాన్య జనాన్ని అందుకునేందుకు సిటీలో తొలిసారిగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, నగరం నలుమూలల్నీ ప్రతిబింబించే ఫొటోలను, నగరవాసులే తీసిన నేపధ్యంలో ఈ ప్రదర్శనను ఏదైనా రద్దీగా ఉండే ప్లేస్‌లో పెట్టాలని అనుకున్నామని చెప్పారు నిర్వాహకులు. తాము ఆశించినట్టే గ్యాలరీల కన్నా మిన్నగా గంటకి కనీసం 50 నుంచి 70 మంది సందర్శకులు వీటిని వీక్షిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్పిరిట్ ఆఫ్ సిటీ.. ఈ ఎగ్జిబిషన్ కోసం ‘స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ టైటిల్‌తో ఫొటోలు పంపించాల్సిందిగా కోరామని, వందలాదిగా ఎంట్రీలు వచ్చాయని, అందులో నుంచి ప్రత్యేకమైన ఫొటోలను ఎంపిక చేసినట్టు హైదరాబాద్ ఫొటోగ్రాఫర్స్ క్యూరేటర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. మన సిటీకి చెంది హైదరాబాద్ వీకెండ్ షూట్ టీం మెంబర్స్‌తో పాటు హైదరాబాద్ ఫొటో వాకర్స్.. వీకెండ్స్‌లో సిటీలో సంచరిస్తూ.. నచ్చిన దృశ్యాన్ని క్లిక్‌మనిపించిన వాటిలో నుంచి ఉత్తమ ఫొటోలను తీసుకున్నారు. అజయ్ కుమార్ పాణిగ్రాహి, ఆశ సతీశ్, బాబీ చౌదరి, చంద్ర కూచిభొట్ల, దీపాలు శర్మ, ద్వారకానాథ్ కీర్తి.. ఇలా ఆ వీకెండ్ షూట్ టీంలోని 20 మంది టాప్ ఫొటోగ్రాఫర్ల ఎక్స్‌క్లూజివ్ ఫొటోస్‌ని ఈ ఇరానీ కేఫ్ ఎక్స్‌పోలో ఉంచారు. కామన్ పీపుల్ సైతం కేఫ్‌లోని ఇరానీ చాయ్‌ని ఆస్వాదిస్తూ ఫొటోగ్రాఫ్్సని చూస్తూ వాటి వెనక స్టోరీని తెలుసుకుంటూ.. ఫొటో గ్రాఫర్స్తో సెల్ఫీలు దిగుతూ కొత్త థ్రిల్‌ని ఎంజాయ్ చేస్తున్నారని చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. -
చెరిగిపోతున్న చరిత్ర
అవనిగడ్డ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో స్థానిక లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఇష్టారాజ్యంగా చేస్తున్న రంగుల తొలగింపు కార్యక్రమం వల్ల ఎంతో విలువైన చారిత్రక ఆధారాలు చెదిరిపోతున్నాయి. రూ.17లక్షలతో ఆలయం చుట్టూ గ్రానైట్స్ ఏర్పాటు, గతంలో వేసిన రంగులు, ప్లాస్టింగ్ నిర్మాణాల తొలగింపు, సహజ రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. ఆలయం చుట్టూ గ్రానైట్ పనులను ఐదు రోజుల కిందటే ప్రారంభించారు. ఆలయం లోపల ఉన్న స్తంభాలపై పలు రకాల శిల్పాలు చెక్కగా, వాటిపై ప్లాస్టింగ్ చేయించి రంగులు వేయడంతో మరుగున పడిపోయాయి. వీటిని తొలగించి పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. ఎంతో సున్నితమైన ఈ పనులను జాగ్రత్తగా చేయకపోతే చాలా చిత్రాలు, ఆధారాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెయ్యేళ్ల చరిత్రకు ముప్పు? ఈ ఆలయాన్ని వెయ్యేళ్ల క్రితం చోళులు నిర్మించారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శిల్పకళా సౌందర్యంతో కూడిన 32 స్తంభాలతో ర«థం ఆకృతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపల స్తంభాలపై గోవర్థనోద్ధరణ, కాళింది మర్ధనం, వేణుగోపాల, షోడషభుజ, నటరాజ శిల్పాలతో పాటు ఎన్నో పౌరాణిక శిల్పాలు చెక్కారు. దక్షిణవైపున స్తంభాలపై శ్రీరామ పట్టాభిషేకం ఉంది. ఇవి ఏ కాలం నాటివో చెప్పలేకపోతున్నప్పటికీ.. తదనంతర కాలంలో జరిగిన అభివృద్ధి పనుల దృష్ట్యా కొన్ని స్తంభాలకు రకరకాల డిజైన్లతో ప్లాస్టింగ్ పనులు చేయించారు. దీనివల్ల పూర్వపు శిల్పకళా సౌందర్యం మరుగున పడింది. స్తంభాలపై చెక్కిన గుర్రం, మనిషి తల, చిన్నచిన్న గొలుసుల డిజైన్లు, ఆభరణాలు ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతో అబ్బురపరిచేవి. అంతేకాదు చారిత్రక ఆనవాళ్లు తెలియజేసే పలు రకాల శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయం మూల భాగాల్లో చేసిన రాతి గొలుసులు ఆనాటి శిల్పకళకు అద్దం పడుతుండగా, నేటి జిమ్మాస్టిక్ని పోలిన స్త్రీల నాట్యభంగిమలు, శ్లాబుపై చెక్కిన నాగేంద్రుడి చిత్రాలతో పాటు ఎన్నో సున్నితమైన శిల్పాలు ఉన్నాయి. ప్రస్తుతం పాత పెయింటింగ్, ప్టాస్టింగ్ తొలగింపు కార్యక్రమం చేపట్టగా జాగ్రత్తగా పనులు చేయకపోతే చాలా చారిత్రక ఆధారాలు చెరిగిపోయే ప్రమాదముంది. ఇటీవల మూడు రోజుల పాటు ఆలయం లోపల రెండు స్తంభాలపై చేసిన ప్లాస్టింగ్ని తొలగించే సమయంలో స్తంభాలపై చెక్కిన అద్భుత శిల్పకళా చిత్రాలు విరిగిపోయాయి. పనులు జాగ్రత్తగా చేయకపోతే చారిత్రక ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదముంది. -
హార్ట్ ఫుల్ సిటీ
ఆర్ట్ గ్యాలరీ అంటే సంపన్నులు ఉండే బంజారాహిల్స్, మాదాపూర్ గుర్తుకొస్తాయి. ఏ కళాకారులు గీసినా చిత్రాలు ఇక్కడే ఎగ్జిబిట్ అవుతాయన్న ఆలోచన సిటీవాసుల్లో ఉంది. వీఐపీలే కాదు సామాన్యులు కూడా ఈ చిత్రాలను ఆరాధిస్తుండటంతో సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటవుతున్నాయి. మాదాపూర్, బంజారాహిల్స్‌కు వెళ్లే పని లేకుండానే ఆర్ట్ లవర్స్‌కు చూడచక్కనైన పెయింటింగ్స్ చూసి తరించే భాగ్యాన్ని కల్పిస్తున్నాయి. తన అంతరాలలో రూపుదిద్దుకున్న ఊహా చిత్రాన్ని కాన్వాస్‌పై అందమైన బొమ్మగా రూపుదిద్దడం ఒక్క చిత్రకారునికే సాధ్యం. ఆ చిత్రకారుల సృజనకు వేదిక అవుతున్నాయి ఆర్ట్ గ్యాలరీలు. పెయింటింగ్స్‌పై సిటీవాసుల్లో పెరుగుతున్న క్రేజీని, సామాన్యులకు కూడా ఈ కళలపై అవగాహన కలిగించేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లోనూ ఆర్ట గ్యాలరీలు ఏర్పాటవుతున్నాయి. ఏడాది క్రితం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ, ఇటీవల సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోనూ అద్వైత ఆర్ట్ గ్యాలరీ ప్రారంభమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న ఆర్ట్ లవర్స్‌ను గ్యాలరీ వరకు తీసుకొస్తున్నాయి. ఇవేకాకుండా ప్రతిభ కలిగిన పేదింటి కళాకారులకు కూడా తమ పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. యంగ్ ఆర్టిస్ట్‌ల కోసం వర్క్‌షాప్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఆర్టిస్ట్‌లతో ఆర్ట్ పాఠాలు బోధిస్తున్నాయి. మరికొందరు చిత్రకారులైతే ఏకంగా తమ ఇంటినే ఆర్ట్ గ్యాలరీగా మలచి పెయింటింగ్‌లను ఎగ్జిబిట్ చేస్తున్నారు. సందడే సందడి... నగరంలోని అన్ని ఆర్ట్ గ్యాలరీల వద్ద అభిమానుల సందడి నెలకొంటుంది. ఎప్పుడు ఎక్కడ చిత్రప్రదర్శన జరిగినా సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. శని, ఆదివారాల్లో పిల్లాపాపలతో కలిసి పేరెంట్స్ రావడం కనబడుతోంది. చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలను చూసేందుకు బారులు తీరుతున్నారు. తమ మనసును కట్టిపడేసిన చిత్రరాజాలను డబ్బులు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. వాటర్ కలర్, చార్కోల్ డ్రాయింగ్స్, పెన్ డ్రాయింగ్, ప్రింట్ మేకింగ్, కల్చర్, న్యూరల్స్, ఆయిల్ పెయింటింగ్స్‌కు మంచి డిమాండ్ ఉందని ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు అంటున్నారు. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్ట్ ప్రేమికులు పెయింటింగ్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. - వీఎస్ స్పందన బాగుంటుంది నేను రిటైర్డ్ హెడ్మాస్టర్ని. ఉత్తమ టీచింగ్ జాతీయ అవార్డును కూడా అందుకున్నా. ఆర్ట్ అంటే నాకు ప్రాణం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని పెయింటింగ్ రూపంలో తెలుపుతుంటా. మూడేళ్ల క్రితం బోరబండలోని నా ఇంట్లోనే ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. ప్రతి ఏటా మూడు వరకు ఆర్ట్ షోలు చేస్తుంటా. సిటీవాసుల నుంచి స్పందన బాగానే ఉంది. నచ్చిన వారు పెయింటింగ్ కొనుగోలు చేస్తుంటారు. - యాసాల బాలయ్య, నిర్వాహకుడు, యాసాల ఆర్ట్ గ్యాలరీ కళకు లైఫ్ ఇవ్వాలి.. అసమాన ప్రతిభతో వివిధ అంశాలను ఎంచుకొని ఆర్టిస్ట్‌లు పెయింటింగ్స్ వేస్తుంటారు. ఇటువంటి పెయింటింగ్స్‌కు ప్రాణం పోస్తున్నాయి ఆర్ట్ గ్యాలరీలు. ఆర్ట్ లవర్స్‌కు అనుగుణంగా సిటీలో గ్యాలరీలు పెరగడం శుభపరిణామం. ఇవి యువ చిత్రకారులకు ప్రోత్సాహాన్ని అందించినప్పుడే.. కళకు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. -బాలభక్తరాజు, ప్రముఖ చిత్రకారుడు అందరూ వస్తున్నారు ఏడాది క్రితం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాం. ఇప్పటివరకు సుమారు 15 వరకు ఆర్ట్ షోలు నిర్వహించాం. సీనియర్లతో పాటు ప్రతిభ కలిగిన యువ చిత్రకారుల పెయింటింగ్స్ ప్రదర్శనకు అవకాశమిస్తున్నాం. పేద, మధ్య, సంపన్న తరగతులకు చెందిన వారందరూ పెయింటింగ్స్ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇది ఆర్ట్‌కు శుభపరిణామం. - విజయారావు, నిర్వాహకుడు, ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ -
చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు
బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ డా.వరప్రసాద్ రెడ్డి ప్రకటన నాంపల్లి: బాపు కేవలం చిత్రకారుడు మాత్రమే కాదని...చరిత్రకారుడని పారిశ్రామికవేత్త పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి శ్లాఘించారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో బాపు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా సాహితీవేత్తలందరం కలిసి ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామని వెల్లడించారు. కొంటె చిత్రాలు, చలన చిత్రాలను రాబోయే తరాలకు అందించినప్పుడే ఆయనకు నిజమైన అశ్రునివాళి అవుతుందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి మోహన్ కందా మాట్లాడుతూ తెలుగు భాషకు బాపు కొత్త రూపం తెచ్చారని కీర్తించారు. ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తన వంతుసాయం అందిస్తానన్నారు. సినీ నటుడు రావి కొండలరావు మాట్లాడుతూ బాపుతో సాన్నిహిత్యం లభించినందుకు తన జీవితం ధన్యమైందని చెప్పారు. ఇప్పటి వరకు దేవతామూర్తుల చిత్రాలను కార్టూన్లుగా వేసిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరని తెలిపారు. సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ చిత్రకారుడిగా బాపు లెజెండ్ అన్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ బాపు నిర్యాణ సభను చలోక్తులు, చమత్కారాలతో జరుపుకోవడం విశేషమన్నారు. నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ బాపును తలచుకొని నవ్వుకుంటుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత శ్రీ రమణ, సన్‌షైన్ ఆస్పత్రి (సికింద్రాబాద్) ఎం.డి.డాక్టర్ గురువారెడ్డి, కార్డియాలజిస్ట్ మన్నెం గోపీచంద్, కార్టూనిస్ట్‌లు సుధామ, ఎస్వీ రామారావు, రచయిత ఎంబీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కళామూర్తులు
కంటికి కనిపించే కళారూపాల వెనుక కనిపించని ప్రోత్సాహం వారిది. సహజత్వం నిండిన కళను ప్రపంచానికి పరిచయం చేసేది ఈ కళామూర్తులే. కళారవి కుంచె నుంచి ఉదయించిన చిత్రరాజం వేయి పొద్దులు నిలిచి ఉండాలంటే క్యూరేటర్ పాత్రే కీలకం. ఆర్ట్.. గ్యాలరీ.. క్యూరేటర్.. ఈ మూడు కలిస్తేనే షో! చిత్రకారుడి సృజనకు థీమ్ అండ్ ఫేమ్‌ని ఫ్రేమ్ చేసేది ఈ క్యూరేటర్సే! దక్కన్ కళాజగతిలోని చిత్రరేఖలను కలుపుతూ హైదరాబాద్ కాన్వాస్‌ను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు నగరంలోని లేడీ క్యూరేటర్లు! సృష్టి.. కళాకృతి.. అలంకృత.. ఏ ఆర్ట్ గ్యాలరీలోనైనా మనసుకు హత్తుకునే చిత్రరాజాలు కొలువుదీరాయంటే దాని వెనుక లేడీ క్యూరేటర్ పాత్ర ఉంటుంది. సిటీలో ఉన్న చాలా ఆర్ట్ గ్యాలరీలకు ఓనర్లు క్యూరేటర్లే! రమా నంబియార్, రేఖా లహోటి, ప్రశాంతి గోయల్, అథియా అమ్జద్.. గ్యాలరీ ఓనర్లుగా ఉంటూనే.. క్యూరేటర్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కేవలం క్యూరేటర్లుగా రాణిస్తున్న మహిళామణులు ఎందరో ఉన్నారు. ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో షోస్‌ను క్యూరేట్ చేసే కోలి ముఖర్జీ, ప్రముఖ ఆర్టిస్ట్, ఆర్ట్ రైటర్, బరోడా ఆర్ట్స్ కాలేజ్ ఫ్యాకల్టీ బాలమణి మొదలు ఇంకెందరో ఆర్ట్ క్రిటిక్స్ కూడా క్యూరేటర్స్గా పనిచేస్తున్నారు. ఢిల్లీ, ముంబై స్థాయిలో వీళ్లు ఇక్కడ కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సృజనకు అనుసృజన కేవలం గ్యాలరీలో షోస్ నిర్వహించడమే కాదు.. కళాకారుడిలో దాగి ఉన్న సృజనకు అనుసృజన చేయడంలో క్యూరేటర్ల పాత్ర కీలకం. మేల్ క్యూరేటర్స్తో పోల్చుకుంటే మహిళల పనితనంలో భావుకత స్పష్టంగా కనిపిస్తుంది. క్యూరేటర్స్ రెండురకాలు.. థీమ్ చెప్పి ఆర్ట్ వేయించే వాళ్లు, ఆర్ట్‌ను బట్టి థీమ్ సెట్ చేసి ఎగ్జిబిషన్ నిర్వహించే వాళ్లు! ఈ కళకు ఈ ఇద్దరూ అవసరమే. కావాల్సిందల్లా సామాజిక స్పృహ, సున్నిత త్వాన్ని మరింత సన్నిహితంగా చూపించాలనే తపన.. ఇవి ఉన్నంత కాలం ఈ కళ విరాజిల్లుతూనే ఉంటుంది. కళాత్మక వేదిక.. ఆర్ట్ అనేది లగ్జరీ ఇండస్ట్రీ. క్యూరేటర్స్లో మహిళల సంఖ్య ఎక్కువే. సెన్సిబిలిటీస్‌తో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. ఒడిదుడుకులు ప్రతిచోటా ఉంటాయి. అయినా ఈ రంగంలో మహిళలు సక్సెస్ అయ్యారనే చెబుతాను. సెన్సిబిలిటీ, అడ్మినిస్ట్రేషన్, అవుట్‌రీచ్.. ఈ మూడూ ఇందులో కలగలిపి ఉంటాయి. ఇక క్యూరేషన్ అనేది కళాత్మక విన్యాసానికి, విశ్లేషణకు లింక్ వంటింది. ఇవి కనిపించ కపోతే ఆర్ట్ షోలకు ప్రయోజనం ఉండదు. క్యూరేషన్కి బాధ్యతతో పాటు ఆర్ట్‌పై అవగాహన ఉండాలి. - బాలమణి, క్యూరేటర్, ఆర్టిస్టోరియన్, క్రిటిక్ సిటీ ఆర్ట్ హబ్ కానుంది పన్నెండేళ్ల నుంచి నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. క్యూరేషన్ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆర్ట్‌కి సంబంధించి లోతైన అవగాహన తప్పనిసరి. స్వేచ్ఛ ఉన్న కళాకారుల్లో సృజనాత్మకతకు కొదవుండదు. ఎటొచ్చీ మార్కెటింగే ఇబ్బంది. క్యూరే టింగ్‌లో ముంబై, ఢిల్లీలతో మనం సమానంగా ఉన్నా.. మార్కెటింగ్‌లో వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ఈ అవేర్నెస్ కూడా పెరిగింది. త్వరలోనే ఆర్ట్ సేల్‌కి హైదరాబాద్ మంచి హబ్‌గా మారొచ్చు. ఈ మధ్య చాలామంది ఇంటీరియర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ చైతన్యం ఎంత ఎక్కువైతే ఈ కళకు మంచి రోజులొస్తాయి. - ప్రశాంతి గోయల్, అలంకృత ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అండ్ క్యూరేటర్ త్రీ సిస్టర్స్.. మేడ్ వండర్ శాంతి కసవరాజు.. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ క్యూసీ, శిల్ప కసవరాజు.. ఐటీ హెచ్ఆర్ కన్సల్టెంట్, శ్యామా నదింపల్లి.. సాధారణ గృహిణి.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లది రక్తసంబంధమే అయినా.. వీరి అనుబంధాన్ని కన్నులపండువగా మార్చింది మాత్రం కళాభిరుచే. శ్యామా వివాహానంతరం సింగపూర్‌లో సెటిల్ అయ్యింది. సరదాగా గీసే బొమ్మలు.. ఆమెలోని సృజనాత్మకతకు ప్రతిరూపాలయ్యాయి. చెల్లెలిలోని సహజ కళాకారిణిని గుర్తించిన ఆ అక్కలిద్దరూ.. ఆ కళా రూపాలను ప్రపంచానికి చాటాలని నిశ్చయించుకున్నారు. అందుకే వాళ్లిద్దరూ క్యూరేటర్లుగా మారారు. తమ చెల్లెలి సృజనాత్మకతకు అందమైన కాన్వాస్ ఏర్పాటు చేశారు. శ్యామా ఇన్స్పిరేషన్తో పది నెలల కిందట ఇన్స్పైర్జ్ అనే పేరుతో ఓ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించారు. ఆర్టిస్టుగా తనపై తనకు నమ్మకం లేని శ్యామా లాంటి ఎందరో సహజ కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పని చేస్తోంది. అందులో భాగంగా ఎన్నో ఎక్స్పోలను నిర్వహిస్తోంది. ఇటీవల మారియట్ హోటల్లో అనేక మంది కళాకారుల చిత్రాలతో ఫ్యూజన్ పేరిట ఓ ఎగ్జిబిషన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు ఈ త్రీ సిస్టర్స్. ఇతర మెట్రో నగరాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ షోలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. కళ ఒకరిది, ప్లానింగ్ ఒకరిది, ప్రమోషన్ బాధ్యత ఇంకొకరిది.. ఇలా తమకున్న సహజ నైపుణ్యాలే పెట్టుబడిగా ఈ ముగ్గురు వేసిన ముందడుగు ఎందరికో ఇన్స్పిరేషన్. - సరస్వతి రమ/ ఓ మధు -
కదలికే కళారూపం
కదలికే కళారూపం... ఔను! ఆమె మదిలోని ప్రతి కదలికా కళారూపమే. ప్రజల కన్నీళ్లు, కేరింతలు, ఆవేదనలు, హర్షాతిరేకాలు ఆమెను కదిలిస్తాయి. అలాంటప్పుడే ఆమె కుంచె చేతపట్టుకుంటారు. అంతే! ఒక కళాఖండం రూపుదిద్దుకుంటుంది. అలా రూపుదిద్దుకున్న కళాఖండమే ‘గివింగ్ బర్త్ టు మీ’. ఈ చిత్తరువుతోనే రమాదేవికి పేరు వచ్చింది. చిత్తరువంటే, ఇది చిత్తరువు మాత్రమే కాదు, కళాకారిణిగా నిలదొక్కుకోవడానికి ఏళ్ల తరబడి ఆమె పడిన శ్రమ ఫలితం. కడుపులోని బిడ్డ అడ్డం తిరిగి, కాళ్లు బయటకు వచ్చి, బాహ్య ప్రపంచంలోకి రావడానికి పడే జీవన్మరణ పోరాట రూపమే ఈ కళాఖండం. ఈ చిత్రంలోని చెట్టు తల్లి గర్భానికి సంకేతం. కనిపిస్తున్న పాదాలు కడుపులో అడ్డం తిరిగిన బిడ్డవి. నిజాం నాటి వారసత్వం... బతుకు తెరువు కోసం టీచర్‌గా పనిచేస్తున్న రమాదేవి వృత్తిపరంగా కళాకారిణి. పాతబస్తీ దూద్‌బౌలికి చెందిన ఆమె, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటోంది. కళ ఆమెకు తాతముత్తాతల నుంచి అబ్బిన వారసత్వం. రమాదేవి తాతముత్తాతలంతా నిజాం ప్రభువుల వద్ద పనిచేసిన వారు. వారిది ‘నఖాషి’ (బొమ్మలు చెక్కడం) కులం. నిర్మల్ పెయింటింగ్స్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింది వారే. స్వతహాగా కళాప్రియులైన నిజాం ప్రభువులు వివిధ దేశాల్లో తాము చూసిన డిజైన్లను రాజమహల్‌కు, వస్తువులకు వేయించేందుకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని కళాకారుల కుటుంబాలను హైదరాబాద్ రప్పించారు. అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి. ఒకప్పుడు గోడలపైనే... నిర్మల్ పెయింటింగ్స్ ఒకప్పుడు గోడలపైనే వేసేవారు. స్వాతంత్య్రం తర్వాత నిజాం ప్రభువుల అధికారం పోయాక ఈ పెయింటింగ్స్ చీరలపైకి పాకాయి. రమాదేవి తండ్రి ఇప్పటికీ తాను పెయింటింగ్ చేసిన చీరలను ‘లేపాక్షి’ సంస్థకు ఇస్తుంటారు. చీరలపై పెయింటింగ్స్ వేయడంలో చిన్నప్పటి నుంచి తండ్రికి చేదోడుగా ఉన్న రమాదేవి క్రమంగా కళపై ఆసక్తి పెంచుకుంది. పాతబస్తీలో చిత్రలేఖనం నేర్పే ప్రముఖ ఆర్టిస్ట్ డోంగ్రే వద్ద ల్యాండ్‌స్కేప్, స్టిల్‌లైఫ్ చిత్రాలు గీయడంలో మెలకువలు నేర్చుకుంది. తర్వాత జేఎన్టీయూలో బీఎఫ్ఏ పూర్తి చేసింది. అదయ్యాక ఎంఎఫ్‌ఏలో చేరడానికి ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు. వాళ్లకు తెలియకుండా ఎంఎఫ్ఏ సీటు సంపాదించి, ఇంట్లో చెప్పింది. ఇక చేరమనక వారికి తప్పలేదు. అలా ఎంఎఫ్ఏ పూర్తి చేసింది. పర్యావరణ రక్షణపై పలు ఫొటోలు తీసింది. మహిళల సమస్యలపై లెక్కలేనన్ని బొమ్మలు గీసింది. - తాయమ్మ కరుణ -
కాంక్రీట్ చెట్టు.. అదిరేటట్టు..
ఇది చెట్టును స్ఫూర్తిగా తీసుకుని నిర్మించనున్న ఆకాశహ ర్మ్యం. పేరు.. ది వైట్ ట్రీ. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లోని మాంట్‌పెల్లియర్‌లో నిర్మించనున్నారు. 17 అంతస్తుల ఈ వినూత్న అపార్ట్‌మెంట్‌ను ఫ్రాన్స్, జపాన్ ఆర్కిటెక్ట్‌లు కలసి డిజైన్ చేశారు. చెట్ల ఆకుల తరహాలో ఇందులోని బాల్కనీలను నిర్మిస్తారు. ఇవి గాల్లో వేలాడుతున్నట్లు ఉంటాయి. వీటి ద్వారా భవనంలోకి గాలి,వెలుతురు ధారాళంగా వస్తుంది. ఇందులో 120 అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, రెస్టారెంట్, బార్, ఆర్ట్ గ్యాలరీ అన్నీ ఉంటాయి. త్వరలో అపార్ట్మెంట్ల బుకింగ్ ప్రారంభమవనుంది. రేటు ఇంకా తెలియ రాలేదు. అయితే, ఈ కాంక్రీట్ చెట్టులాగే.. రేటు కూడా అదిరేటట్టే ఉండొచ్చని అంచనా. -
మువ్వన్నెల చిత్ర సాహిత్యం!
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ // కౌంట్‌డౌన్ 2 సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: మనిషి ముందుగా బొమ్మలను వేశాడు. అక్షరాలను తర్వాత రూపొందించుకున్నాడు. అక్షరాల సాహిత్యం ప్రాచుర్యంలోకి వచ్చిన అనేక శతాబ్దాల తర్వాత ‘చిత్రసాహిత్యం’ ప్రత్యేక ప్రక్రియగా గుర్తింపు పొందింది. బొమ్మలను రూపొందించడం ఒక సాహితీ కళ. వాటిని అర్థం చేసుకోలేకపోవడం ‘విజువల్ ఇల్లిటరసీ’ (దృశ్య నిరక్షరాస్యత)గా స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో నాల్గో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ చిత్రసాహిత్యానికి ప్రత్యేక గౌరవం ఇస్తోంది. ఇందులో భాగంగా లిటరరీస్ట్రీట్గా ప్రాచుర్యం పొందుతోన్న బంజారాహిల్స్, రోడ్‌నెం.8లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో మూడు వినూత్న ప్రదర్శనలను మూడు రోజులపాటు నిర్వహిస్తోంది. ఆర్తివీర్ మట్టితో చేసిన ఆకృతుల రూపకల్పన, నోబెల్ బహుమతి గ్రహీత దివంగత కామూ డిజిటల్ ఎగ్జిబిషన్, ప్రియాం క ఏలె చిత్రాల ప్రదర్శనలను ఫెస్టివల్ తొలిరో జు శుక్రవారం మధ్యాహ్నం 12-30 గంటలకు పద్మశ్రీ జగదీష్ మిట్టల్ ప్రారంభిస్తారు. ‘అక్షరాల దారుల’ ప్రదర్శన! సుశీథారు-కె.లలితలసంపాదకత్వంలో రూపొందిన అపురూప పుస్తకం, ‘విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’ను ప్రపంచంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు సేకరించాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దపు మహిళా సాహిత్యకారుల వరకూ ఆసక్తికర విశేషాలున్న ఈ పుస్తకం ‘దారులేసిన అక్షరం’గా తెలుగులో త్వరలో రానుంది. ఈ పుస్తకానికి వర్ధమాన చిత్రకారిణి ప్రియాంక ఏలె సమకూర్చిన చిత్రాలు ప్రత్యేకమైనవి. బ్రష్‌లు, రంగులు వాడలేదు. రచన-చిత్రకళ సమ ఉజ్జీలని సంకేతమిస్తూ కలం-సిరాతో చిత్రసాహిత్యానికి రూపిచ్చారు. ప్రియాంక తన చిత్రాల గురించి: ‘దృశ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అక్షర సాహిత్యం కంటే చిత్రసాహిత్యం ఏమాత్రం తీసిపోదనే గుర్తింపు ఆధునిక కాలంలో ఏర్పడింది. మహాభారత రచనలోనే ప్రస్తావించిన దమయంతి తన ప్రియుడు నలమహారాజుకు ‘సందేశం’ పంపడంతో ‘దారులేసిన అక్షరం’ మొదలైంది. ఈ సంకలనంలో ఇటీవల కాలం వరకూ అనేక మంది మహిళా రచయితలున్నారు. వీరందరూ వేర్వేరు కాలాలకు, సమాజాలకు సంస్కృతులకు చెందిన వారు. అన్నింటిలో అంతఃసూత్రం ఒక్కటే. ‘వస్తువుగా పరిగణింపబడిన మహిళ, ఎవరూ దొంగిలించలేని జ్ఞానం అనే వస్తువుపై సాధికారత తెచ్చుకుని ‘నో’ అనగలిగిన ధీమతిగా పురోగమిస్తోంది’! ఉత్తరాన్ని తెస్తోన్న పక్షి ఆ నాటి దమయంతినే కాదు, చదువుకున్న ఆధునిక మహిళకూ ప్రతీక! సావకాశంగా సాలోచనగా చూస్తే నా చిత్రాలు మంచి పఠనానుభూతిని కలిగిస్తాయని విశ్వసిస్తున్నాను.’ -
కొత్త పుస్తకం: మలినం అంటని మాండలిక కతలు.. ఇరులదొడ్డి బతుకులు
హోసూరులో కథలు వరదలెత్తుతున్నాయి. తమిళ పరిష్వంగంలో నలిగిపోతున్న తెలుగు ప్రాంతం హోసూరు. కృష్ణగిరి జిల్లాలో ఉంది. బెంగళూరుకు కూతవేటు దూరం. అక్కడ తెలుగువారున్నారన్న సంగతి, అది తెలుగు ప్రాంతం అన్న సంగతి చాలామంది తెలుగువారికే తెలియదు. మేమున్నాం ఇక్కడ అని వాళ్లు అరిస్తే ఎవరూ పట్టించుకోరు. అందుకే వాళ్లు సాహిత్యంలోకి తమ గళాల్ని (కలాల్ని) మళ్లించారు. తమ ప్రాంతం భాష, యాస, సంస్కృతి, తెలుగు వారు మర్చిపోయినా తాము మర్చిపోని కట్టుబాట్లు అన్నింటిని తాము ఎలా కాపాడుకుంటున్నామో కథలు రాస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతం నుంచి ‘ఎర్నూగుపూలు’, ‘తెల్లకొక్కెర్ల తెప్పం’ వంటి పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు నంద్యాల నారాయణరెడ్డి రాసిన ‘ఇరులదొడ్డి బతుకులు’. హోసూరుకు సమీపంలోని ఒక అడవి ప్రాంతంలో ఈ రచయిత గడిపిన బాల్యాన్ని ఈ కతలన్నీ చూపుతాయి. చెట్లు, పుట్టలు, సీళు కుక్కలు, ఏనుగులు, కొమ్ముల ఆవులు అడపా దడపా గాండ్రించే పులులూ అన్నెం పున్నెం ఎరగని అమాయకపు మనుషులు... వీళ్లంతా ఈ కథల్లో కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందులో వాడిన భాషది కూడా ఒక తెలియని రుచి. మాండలికం అంటే అశ్లీలమైన పదాలు వాడాలనీ స్త్రీలను కించపరిచే పదాలు ఉన్నదే మాండలికం అనీ స్థిరపరిచిన కొన్ని రకాల రచనలకు ఈ కథలు ఒక మెరుగైన జవాబు. కాలుష్యం గాలి నుంచి కాసేపు తప్పించుకోవాలంటే ఈ కథలు వీచే అడవిగాలిని ఆహ్వానించండి. వెల: రూ. 100; ప్రతులకు: 09360514800 స్త్రీ హృదయం: గాజు నది ‘ఏమీ రాయకపోతే/ ఏదీ రాయలేకపోతే ఏదో కోల్పోయిన వెలితి కలల నిండా కలం నిండా స్త్రీల కన్నీటి సిరాతో చైతన్యించిన దీపశిఖల ప్రజ్వలనమే కవిత్వం’ అనే కవయిత్రి రాయకుండా ఉండగలదా? ఏదో ఒక బాధను కవిత్వం చేయకుండా ఉండగలదా? స్త్రీ వాద రచయిత్రులలో ఒక ప్రత్యేకతను సాధించుకున్న కవి శిలాలోలిత. సరళంగా చెప్తూనే గట్టిగా నిర్మొహమాటంగా కూడా మాట్లాడే కవిత్వం ఆమెది. అతడు - ప్యాంటూ చొక్కా తొడుక్కుని వెళతాడు. ఆమె - ఇంటిని కూడా తొడుక్కుని వెళుతుంది... అనడంలో స్త్రీని వదలని ఇంటి చాకిరి స్త్రీని పట్టి ఉంచే బంధనాలు ఎలాంటివో సూటిగా చెప్తారామె. ‘ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేమో’ అనే వేదన ఆమె కవిత్వం. ద్రవీభవించే, ఘనీభవించే, ప్రతిబింబాన్ని చూపే, భళ్లున బద్దలయ్యే స్త్రీ హదృయం వంటి ఈ గాజునది కవిత్వాన్ని చదవండి. వెల: రూ.రూ.80; ప్రతులకు: 9391338676 సాహిత్య పత్రిక చినుకు గత ఎనిమిదేళ్లుగా తెలుగు సాహిత్యానికి మెరుగైన వేదికగా వెలువడుతున్న మాస పత్రిక ‘చినుకు’. కథలు, కవితలు, సాహిత్య చర్చలు... ప్రామాణిక స్థాయిలో ప్రచురిస్తూ సాహిత్యాభిమానులకు చేరువైన పత్రిక ఇది. అంతే కాకుండా ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో వార్షిక సంచిక వెలువరించి తెలుగులో వార్షిక సాహిత్య సంచికలకు ఉన్న లోటును తీరుస్తోంది. చిన్నా పెద్దా రచయితలు చాలా మంది తమ రచనలు ఈ పత్రికలో చూసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే ఇది సాధించిన గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. సంపాదకుడు నండూరి రాజగోపాల్. వివరాలకు: 98481 32208 సాహిత్య డైరీ నల్గొండలోని మారుమూల గ్రామం కదిరేని గూడెం నుంచి ఇవాళ అంతర్జాతీయ చిత్రకళా ప్రపంచంలో తనదైన ముద్రను వేసే స్థాయికి ఎదిగిన చిత్రకారుడు ఏలే లకష్మణ్. దేశ విదేశాల్లో ఆయన ఆర్ట ఎగ్జిబిషన్ జరుగుతున్నా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అక్టోబర్ 5 నుంచి 15 వరకూ ‘ఫెలో ట్రావెలర్స’ పేరుతో ఆయన చిత్రకళా ప్రదర్శన జరగనుంది. వేదిక: కళాకృతి, రోడ్ నం. 10, బంజారాహిల్స. 040 - 66564466 రూ. 12 వేల నగదు బహుమతి కలిగిన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ (సిరిసిల్లా) కోసం కవిత్వ సంపుటాలు ఆహ్వానిస్తున్నారు. వివరాలకు : 98490 12459 అంగడి సరుకు: మండి ‘మండి’ అంటే మార్కెట్ అని అర్థం. మార్కెట్లో సరుకు అమ్ముతారు. అయితే తరతరాలుగా ఈ ప్రపంచంలో అమ్ముడుపోయే ఒక మానవ సరుకు ఉంది - స్త్రీ. హైద్రాబాద్‌లో జరిగే ఈ కథలో ఒక రద్దీ ప్రాంతంలో ఒక ‘కోఠా’ (వ్యభిచార కేంద్రం) ఉంటుంది. నగరం పెరిగి పెద్దదయ్యి ఆ ప్రాంతంలో ఒక కొత్త మార్కెట్‌ను కట్టాలనుకోవడంతో ఆ ‘కోఠా’కు ముప్పొచ్చి పడుతుంది. దానిని ఖాళీ చేయాలి. కాని ఆ ఆడవాళ్లు, పొట్టకూటి కోసం పడుపువృత్తి చేసుకునే ఆ నిర్భాగ్యులు, నిరక్షరాస్యులు ఎక్కడికెళ్లాలి? చివరకు వాళ్లను ఊరి అవతలకు తరిమేస్తారు. ఆశ్చర్యం. అక్కడ ఎప్పటితో ఒక బాబాగారి సమాధి బయటపడి అదొక రద్దీ క్షేత్రం ఏర్పడుతుంది. మళ్లీ ఆ స్థలానికి మార్కెట్ వ్యాల్యూ వచ్చింది. దాంతో అక్కణ్ణుంచి వాళ్లను తిరిగి తరిమేయాలి. లేదా ఆ చీమల పుట్టను పాములు ఆక్రమించుకోవాలి. చివరకు అదే జరుగుతుంది. విషాదమైన ఈ కథను వ్యంగ్యంగా చెప్పడం వల్ల అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు ఏడుస్తూ చూస్తాం. ప్రసిద్ధ పాకీస్తానీ రచయిత గులామ్ అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే కథానిక ఆధారంగా శ్యామ్ బెనగళ్ తీసిన సినిమా (1983) ఇది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ పోటీ పడి చేసినా షబానా స్థిరత్వం అసామాన్యం అనిపిస్తుంది. ‘మేమున్నాం కాబట్టే ఈ సమాజం ఈ మాత్రమైనా ఉంది’ అంటుంది ఈ సినిమాలో షబానా. ‘మేం తప్పు చేస్తున్నామా? మీ మొగాళ్లను ఇంట్లో కట్టి పెట్టండి చేతనైతే. మమ్మల్నెందుకంటారు?’ అని నిలదీస్తుంది నలుగురినీ. దానికి సమాధానం లేదు. ఉండదు కూడా. మర్యాదకరమైన సాహిత్యం చూడ నిరాకరించే ఈ కురుపు సలపరం తెలియాలంటే యూ ట్యూబ్‌లో Mandi (film) అని కొట్టి చూడండి. పాత సంగతి భమిడిపాటి కామేశ్వరరావు అభిమానులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి ‘అయ్యా... తమకు సన్మానం చేసి బిరుదు ప్రదానం చేద్దామనుకొంటున్నాం’ అన్నారు. అందుకు ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. వాళ్లు మరీ బలవంతం చేసేటప్పటికి - ‘కొంతమంది బిరుదులు తమకు తాము తగిలించుకుంటారు. మరికొంతమంది బిరుదులు సాహిత్య సంఘాలకు విరాళాలు ఇచ్చి కొనుక్కుంటారు. మొదటి పద్ధతి బిరుదు స్వయంగా తగిలించుకోవడం నాకిష్టం లేదు. రెండో పద్ధతిలో బిరుదు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మీకు మీరుగా బిరుదు ఇస్తున్నారు కనుక సరే అలాగే కానివ్వండి’ అన్నారు. అలా ఆయనకు ‘హాస్యబ్రహ్మ’ అనే బిరుదు లభించింది. ఒకసారి క్లాస్‌లో హోమ్‌వర్‌క చేయని పిల్లలను తలా ఒక దెబ్బ వేస్తున్నారట. క్లాసులో వారబ్బాయి కూడా ఉన్నాడు. ‘హోమ్‌వర్‌క ఎందుకు చేయలేదు’ అనంటే ‘మా కుటుంబం అంతా పెళ్లికి వెళ్లిందండి’ అన్నాట్ట కుమారుడు. ఆయన కుమారుడికి ఒక దెబ్బ వేసి, పరీక్షలు దగ్గర పడుతున్న సంగతి పట్టించుకోకుండా నిన్ను పెళ్లికి తీసుకెళ్లినందుకు ఇదిగో నాక్కూడా దెబ్బ అని చేతి మీద ఒక దెబ్బ కొట్టుకున్నారట. ఇలా భమిడిపాటి ఉదంతాలు అనేకం. న్యూ రిలీజెస్ ది హంగ్రీ ఘోస్‌ట్స The Hungry Ghosts చేసిన పాపాల నుంచి నిష్కృతి ఉంటుందా? ఈ జీవితంలో లెక్కకు మించి కోరికలు ఉన్నవారు చనిపోయాక దెయ్యాలుగా మారతారట. కాని వాళ్లకు ఎప్పుడూ ఆకలిగానే ఉంటుందట. కాని ఏమీ తినలేకపోతారట. వింటేనే భయం వేసే ఇలాంటి కథలు తన నాయనమ్మ నోటి గుండా విని పెద్దవాడయ్యాడు శివన్. కాని అతడి జీవితంలో కూడా అతడి నిమిత్తం లేకుండా ‘పాపం’ జరిగింది. అతడు ‘గే’. తన స్వదేశం శ్రీలంకను వదిలి కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. కాని ఏదో అసంతృప్తి, పాపభీతి నాయనమ్మ చిన్నప్పుడు చెప్పిన బౌద్ధకథలు వెంటాడుతూనే ఉన్నాయి. అతడు తిరిగి కొలంబో బయలుదేరుతాడు. తర్వాత ఏం జరుగుతుంది? జీవితంలో ఉండాల్సిన వెతుకులాట, కనుగొనడం, అర్థం చేసుకోవడం, వచ్చిన సంఘర్షణలను దాటి ముందుకు వెళ్లడం, వదలక పట్టుకున్న కోరికల దెయ్యాలను వదిలించుకోవడం వీటన్నింటి సమాహారమే శ్యామ్ సెల్వదురై రాసిన నవల ‘ది హంగ్రీ ఘోస్‌ట్స’. ఇంగ్లిష్‌లో రాసే శ్రీలంక రచయితలు భారతీయ రచయితలతో సమానంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు. వాళ్లలో శ్యామ్ కూడా ఒకడు. బాగుంది. రెండు కోట్ల మంది ఉన్న శ్రీలంక నుంచి అంతమంది రచయితలు వస్తే ఇన్ని కోట్ల మంది ఉన్న తెలుగువారి నుంచి ఎంత మంది రావాలి? పోనీలెండి. మనకెందుకు? నవల చదవండి. The Hungry Ghosts, Shyam Selvadurai, Penguin Viking, Rs. 599