కాంక్రీట్ చెట్టు.. అదిరేటట్టు.. | The white Tree to be established in French | Sakshi
Sakshi News home page

కాంక్రీట్ చెట్టు.. అదిరేటట్టు..

Published Sat, Mar 15 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

కాంక్రీట్ చెట్టు.. అదిరేటట్టు..

కాంక్రీట్ చెట్టు.. అదిరేటట్టు..

ఇది చెట్టును స్ఫూర్తిగా తీసుకుని నిర్మించనున్న ఆకాశహ ర్మ్యం. పేరు.. ది వైట్ ట్రీ. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లోని మాంట్‌పెల్లియర్‌లో నిర్మించనున్నారు. 17 అంతస్తుల ఈ వినూత్న అపార్ట్‌మెంట్‌ను ఫ్రాన్స్, జపాన్ ఆర్కిటెక్ట్‌లు కలసి డిజైన్ చేశారు. చెట్ల ఆకుల తరహాలో ఇందులోని బాల్కనీలను నిర్మిస్తారు. ఇవి గాల్లో వేలాడుతున్నట్లు ఉంటాయి.  వీటి ద్వారా భవనంలోకి గాలి,వెలుతురు ధారాళంగా వస్తుంది. ఇందులో 120 అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, రెస్టారెంట్, బార్, ఆర్ట్ గ్యాలరీ అన్నీ ఉంటాయి. త్వరలో అపార్ట్‌మెంట్ల బుకింగ్ ప్రారంభమవనుంది. రేటు ఇంకా తెలియ రాలేదు. అయితే, ఈ కాంక్రీట్ చెట్టులాగే.. రేటు కూడా అదిరేటట్టే ఉండొచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement