పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్‌ వీడియో | 25 years partner Retired circus elephant mourns viral video | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్‌ వీడియో

Published Sat, Mar 15 2025 12:33 PM | Last Updated on Sat, Mar 15 2025 2:17 PM

25 years partner Retired circus elephant mourns viral video

మనుషులైనా, జంతువులైనా మనసుంటుంది. అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయి. అపురూపమైన ఆ అనుబంధం (Friendship) తెగిపోతే.. కలకాలం తోడునీడగా ఉన్న ఆత్మీయ నేస్తం.. అందనంత దూరం వెళ్లిపోతే.. మనుషులైతే గుండె పగిలేలా రోదిస్తారు.  మరి మూగజీవి ఏం చేస్తుంది. మూగగానే రోదిస్తుంది. ఈ మాటలకు అక్షర సత్యం అనేలా ఒక వీడియో నెట్టింట పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. అసలేంటీ కథ.. తెలుసుకుందాం..

పాతికేళ్ల బంధాన్ని వీడిన శాశ్వతంగా కన్నుమూసిన తన భాగస్వామిని ఒక ఏనుగు (elephant) చలించి పోయింది. ఎలాగైనా దాన్ని తట్టి లేపాలని ప్రయత్నించింది. తొండంతో గుండెలకు హత్తుకోవాలని తపించిపోయింది.  కానీ తనవన్నీ వృధా ప్రయత్నాలనీ, ఇకలాభం లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంది.   ఈ సమయంలో పశువైద్యులను  దగ్గరకు  రానీయలేదు.

బాజా వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జెన్నీ, మాగ్డా అనే ఏనుగులు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో ఉండేవి. 25 సంవత్సరాలకు ఇవి రెండూ  పార్టనర్స్‌గా ఉండేవి.  వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. వయసుమీద పడటంతో సర్కస్‌ వర్క్‌నుంచి విముక్తి లభించింది. ఈ వారం జెన్నీ కన్నుమూసింది. దీంతో తన నేస్తం అలా నిర్జీవంగా పడి ఉండటం మాగ్డా  తట్టుకోలేకపోయింది. దాన్ని  లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. 

 

గంటల తరబడి దాని చుట్టూ తిరిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆఖరికి వెటర్నరీ వైద్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. చివరికి జెన్నీకి  కన్నీటి వీడ్కోలు(Mourns) పలికింది. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. వారు దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెటిజన్లు హృదయాలను తాకింది.  ఏనుగు దుఃఖం చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement