mourns
-
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
మైనర్లను డ్రైవింగ్‌కు ఎందుకు అనుమతించకూడదనేదానికి పూణె పోర్షే ప్రమాదం కొందరికి విషాదకరమైన ఉదాహరణ. తప్పతాగి, పోర్స్చే కారును 200 కి.మీ వేగంతో నడిపిన యువకుడు రెండు కుటుంబాల్లో అంతు లేని అగాధాన్ని మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన బిడ్డలు తిరిగి రాని లోకాలకువెళ్లిపోయారన్న షాక్‌నుంచి తేరుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పుణేలో ఆదివారం తెల్లవారుజామున హై-ఎండ్ కారు పోర్సే కారుమితిమీరిన వేగంతో దూసుకొచ్చి ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన అనిష్ అవధియా , అశ్విని కోస్తా అనే ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లుగా గుర్తించారు.అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి బలంగా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.జబల్పూర్లో నివసించే అశ్విని తల్లి మమత ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. ‘‘కూతురికి పెళ్లి చేసి పల్లకీలో అత్తారింటికి పంపించాలను కున్నాం.. ఇలా పాడె ఎక్కించాల్సివస్తుందని ఊహించలేదు’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.మా పాప అశ్వినికి న్యాయం జరగాలి. మైనర్ , అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వారు అతన్ని సరిగ్గా పెంచలేదు. వారు అతనికి కారు ఇవ్వకూడదు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జువెనైల్ జస్టిస్ బోర్డ్ విధించిన శిక్షపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. (300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం మద్యపానం అలవాటుపై మానసిక చికిత్స కోసం కౌన్సెలింగ్‌కు హాజరు కావడం వంటి షరతులు)"ఇది ఒక జోక్? అతను ఏ వ్యాసం వ్రాస్తాడు? అశ్విని చాలా టాలెంటెడ్ గర్ల్.. కోటిమందిలో ఒకరు ఆమెకు. చాలా కలలు కనింది’’ అంటూ" కన్నీళ్లు పెట్టుకున్నారు. తను చాలా స్మార్ట్, ఇండిపెండెంట్, అన్ని రంగాల్లో ముందుండేది..వచ్చే నెలలో మా నాన్నగారి పుట్టినరోజుకి రావాలని ప్లాన్ చేశాం.. ఆయనకు రిటైర్మెంట్ పార్టీ కూడా ఆమె ప్లాన్ చేసిందంటూ అశ్విని సోదరుడు సంప్రీత్ వాపోయాడు.“నా కొడుకుని చంపేసాడు.. ఇప్పుడు నా కొడుకుని ఎప్పటికీ కలవలేను.. ఆ అబ్బాయి హత్యచేశాడు. వాణ్ని సరిగ్గా పెంచి ఉంటే ఈ రోజు నా కొడుకు జీవించి ఉండేవాడు” అనిష్ అవధియా తల్లి సవితా అవధియా గర్భశోకమిది. అనీష్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడని, చాలా హ్యపీ, సరదాగాఉండే వాడంటూ కొడుకును తలచుకుని గుండెపగిలేలా రోదించారామె. ఇటీవల యానివర్సరీకి ఇంటికొచ్చాడు. మళ్లీ వస్తాను..గిప్ట్ తెస్తా అన్నాడు అంటూ గుర్తు చేసుకున్నారు.“అపరాధికి శిక్ష పడుతుంది.. కానీ ఇప్పుడు మా బిడ్డను ఎలా తిరిగి తీసుకొస్తారు, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు తన తల్లితో మాట్లాడి, త్వరలో వస్తానని చెప్పాడు. కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉన్నాడు. పూణేలో ఉన్న నా చిన్న కొడుకును ఇప్పుడు ఎవరు చూసుకుంటారు?" కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకునే బాధ్యతాయుతమైన కొడుకు దూరమైపోయాడంటూ అనీష్ తండ్రి ఓం అవధియా కంట తడిపెట్టారు. -
Pankaj Udhas కాలం పగబట్టిందేమో! మరో దిగ్గజం నింగికెగిసింది!
లెజెండ్రీ గాయకుడు, గజల్ మాస్ట్రో పంకజ్‌ఉద్దాస్ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సోమవారం ఇక సెలవంటూ వెళ్లిపోయారు. పంకజ్ ఉదాస్అనేక ఆల్బమ్‌లను విడుదలచేశారు ప్రపంచవ్యాప్తంగా కచేరీలిచ్చారు. మధురమైన గాత్రంతోనే కాదు, పదునైన సాహిత్యంతో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. గజల్ పంకజ్.. పంకజ్ గజల్! 'చిట్టి ఆయీ హై', 'జీయే తో జీయే కైసే', 'చుప్కే చుప్కే' 'ఔర్ అహిస్తా', లాంటి పాటలతో దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గళం మూగపోయింది. కానీ తరతరాలుగా శ్రోతల చెవులలో ఆ మధుర గీతాలుప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పంకజ్ ఉద్ధాస్ మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సోనూ నిగమ్ లాంటి గాయకులు ఆయనను గుర్తు చేసుకొని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాలం పగబట్టిందేమో.. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు అంటూ కన్నీటి పర్యంత మవుతున్నారు. సోషల్ మీడియాలో ఆర్ఐపీ పంకజ్ ఉద్దాస్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. Thank you Pankaj Udhas Ji for such masterpieces 😊 RIP to the departed soul 💔 Legend never Dies !! @musicculturehub pic.twitter.com/YAiWccPgvo — Utkarsh (@utkarshh_tweet) February 26, 2024 View this post on Instagram A post shared by Sonu Nigam (@sonunigamofficial) 1951న మే 17, గుజరాత్లో జన్మించారు. తన ముగ్గురు సోదరులలో చిన్నవాడు పంకజ్. చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితులై, తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భారతీయ సంస్కృతి, సంగీతం ఆయన ముద్ర చెరగనిది. 1980 , 1990 లలో ఆయన పాటలు, గజల్స్ బాగా పాపులర్ అయ్యాయి. గజల్స్‌తోపాటు, బాలీవుడ్ సినిమాల్లో పాటలు అనేకం సూపర్‌హిట్‌గా నిలిచాయి. 1989లో 'నబీల్' ఆల్బమ్ అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. తొలి కాపీ వేలంలో రూ. 1 లక్షకు విక్రయించారు. సంగీత ప్రపంచంలో తన ప్రతిభను చాటుకున్న పంకజ్‌ఉద్దాస్ దాత్వంలోని తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ లక్ష రూపాయలను కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్‌కు అందజేశారు. ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సామాజిక సంక్షేమం కార్యక్రమాలకు మద్దతిచ్చేవారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకుగాను 2006లో భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ దక్కింది. మరికొన్ని సంగతులు పంకజ్‌ఉద్దాస్ కన్సర్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోషారూఖ్ఖాన్ అందుకున్న తొలి పారితోషికం 50 ఆ డబ్బుతో రైల్లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూశామని స్వయంగా షారూఖ్ ఒకసారి వెల్లడించారు. బాలీవుడ్‌కు పాటలను అందించడమే కాకుండా నటుడు జాన్ అబ్రహంను కూడా తెరపైకి తెచ్చింది కూడా పంకజ్ ఉద్ధాస్. పంకజ్ తొలుత డాక్టర్ కావాలనుకున్నారట. తండ్రి కేశుభాయ్ ఒక రైతు , తల్లి జితుబెన్ సాధారణ గృహిణి. పెద్ద సోదరుడు మన్హర్ బాలీవుడ్ చిత్రాలలో హిందీ నేపథ్య గాయకుడు. రెండో అన్నయ్య నిర్మల్ ఉద్దాస్ కూడా ప్రసిద్ధ గజల్ గాయకుడే. పంకజ్ భార్య ఫరీదా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు- నయాబ్, రీవా -
అయ్యో! ఎంత విషాదం: గుండె పగిలిందంటున్న నెటిజనులు
మాట్లాడటం మినహా, మనుషులకుండే అన్ని భావోద్వేగాలు ప్రపంచంలోని అన్ని ఇతర జీవుల్లోనూ సహజమే. ఆకలి దప్పికలతోపాటు, కోపం,శోకం, దుంఖం ఇలా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తాజాగా జీవిత సహచరుడిని కోల్పోవడాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు. అలా ఒకచెట్టుకింద, ప్రేయసిని కోల్పోయి విలపించిన కోలా హృదయ విదారక వీడియో ఒకటి నెట్టింట తెగషేర్ అవుతోంది. సౌత్ ఆస్ట్రేలియన్ వాలంటీర్ కోలా రెస్క్యూ గ్రూపు ఈ కోలాని గుర్తిచింది. అక్కడ చనిపోయిన ఆగ కోలాను పట్టుకుని మగ కోలా విలపిస్తోంది. ఇది చాలా హృదయ విదారకంగా ఉంటూ ఈ టీం ఈ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ జంటను చూసినప్పుడు గుండె పగిలిందన్నారు కోలా రెస్క్యూ అధికారి హార్ట్లీభావోద్వేగానికి లోనయ్యారు. అత్యంత విషాదకరమైన వీడియో. గుండె పగిలిపోయింది.. నా కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయంటూ చాలామంది కమెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. A koala mourning its female friend who has passed , holding and hugging her pic.twitter.com/zLO9JZE3Ox — Science girl (@gunsnrosesgirl3) February 23, 2024 కాగా ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలోని యూకలిప్టస్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి. యూకలిప్టస్ ఆకులు తింటాయి. ఈ ఆకులే వాటి ఏకైక, ప్రధాన ఆహారం. అంతేకాదు ప్రపంచంలోనే రోజుకు 22 గంటలు నిద్రించే జంతువు. తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. అందుకే వీటిని 'నో డ్రింక్' జంతువు అని కూడా అంటారు. ఆకుల్లో ఉండే తేమే వీటికి ఆధారం. -
ఆర్బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత: పలువురి సంతాపం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ (92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం చెన్నైలో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అద్భుతమైన వ్యక్తిత్వం , ప్రజా సేవకుడు, సంక్షోభ సమయాల్లో అపారమైన సహకారాన్ని అందించిన వెంకటరమణన్ మరణం విచారకరం అంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతాపం వెలిబుచ్చారు. ఆత్మకు శాశ్వత శాంతి కలగాలంటూ ట్వీట్ చేశారు. ఆర్థిక రంగంలో తనదైన ముద్ర వేశారంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి , ఇంధనానికి కూడా ప్రధాన కృషి చేసారనీ. 60వ దశకం మధ్యలో హరిత విప్లవానికి నాంది పలకడంలో కీలక పాత్ర పోషించిన సి.సుబ్రమణ్యంకు కీలక సహాయకుడిగా పనిచేశారన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు అనుబంధం ఉంది, చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, చాలా నేర్చుకున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. Very sad to hear about the demise of Shri S.Venkitaramanan, former Governor of the RBI. He was an outstanding personality and public servant. Made immense contribution during periods of crisis. May his soul rest in eternal peace. — Shaktikanta Das (@DasShaktikanta) November 18, 2023 కాగా వెంకటరమణన్ 1931లో తమిళనాడులోని నాగర్ కోయిల్ లో జన్మించారు. తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1953లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరారు. 1968లో, అమెరికా కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్లో మరొక మాస్టర్స్ డిగ్రీని చేశారు. 1990 - 1992 వరకు ఆర్బీఐ 18వ గవర్నర్‌గా పనిచేశారు.1985 నుండి 1989 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక కార్యదర్శిగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టక ముందు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగానూ వ్యవహరించారు. వెంకటరమణన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు (గిరిజా వైద్యనాథన్, తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి , సుధా వైద్యనాథన్.) ఉన్నారు. One of India's most brilliant civil servants who left his mark, especially in the field of finance, has just passed away in Chennai at the age of 92. S. Venkitaramanan was RBI Governor at a most crucial time of our economic history during 1990-92. Apart from this he made major… — Jairam Ramesh (@Jairam_Ramesh) November 18, 2023 -
మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం
Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సెలీమ్ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు. 1980 నుంచి 2014 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు. 1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా, తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు. అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ , ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. Saddened at the demise of the veteran Left leader and former MP Basudeb Acharia. He was a trade union leader and Parliamentarian of formidable strength and his departure will cause significant loss in public life. Condolences to his family, friends and colleagues. — Mamata Banerjee (@MamataOfficial) November 13, 2023 -
ఇలా ఉన్నామంటే...అంతా ఆయన పుణ్యమే: ఆనంద్ మహీంద్ర నివాళులు
హరిత విప్లవ పితామహుడు, దిగ్గజ వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్ స్వామినాథన్ మృతిపై వ్యాపారవేత్త ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర సంతాపం ప్రకటించారు. ఈ రోజు భారతదేశంలో ఆహార భద్రత ఉందీ అంటే ఆయన పుణ్యమే.. దానికి మన అందరమూ రుణపడి ఉండాలి అంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయనతో కంపెనీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2011లో మహీంద్రా సమృద్ధి అవార్డ్స్‌లో ఇయర్ అవార్డలు సందర్బంగా వ్యవసాయంతో సంస్థకున్న లోతైన సంబంధాల దృష్ట్యా, హరిత విప్లవ సారధిగా ఆయన అందించిన సేవలకు అగ్రి-ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించుకున్నాం. అదే రోజు డిన్నర్లో స్వామినాథన్ గారితో ముచ్చటించడం తన అద్భుత జ్ఞాపకాలలో ఒకటి అని వెల్లడించారు. అలాగే 2019లో, బలహీనంగా ఉన్నప్పటికీ, తమ కోసం ఒక వీడియో రికార్డు చేసి పంపించారంటూ గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. వ్యవసాయంలో అయనకున్న అపారమైన జ్ఞానం, వ్యవసాయం పట్ల మక్కువ 1.4 బిలియన్ల భారతీయుల జీవితాలను మరింత సురక్షితం చేసింది. కానీ ఆయన ఏ లోకాన ఉన్నా, ఆయన చుట్టూ ఉన్నపొలాలు మరింత సారవంతంగా ఉంటాయంటూ నివాళులర్పించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలి! దీంతో నెటిజన్లను కూడా ఎంఎస్ స్వామినాథన్‌కు నివాళలర్పించారు. నిజానికి దేశానికి ఆయనందించిన సేవలకు ప్రతిఫలంగా భారత రత్న ఇవ్వాలి.. ఇది మన దేశ పరిశోధకులు , శాస్త్రవేత్తల సంఘానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందంటూ కమెంట్ చేశారు. కాగా 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో పుట్టిన మాంకోంబ్ సాంబశివన్ స్వామినాథన్ దేశీయ వ్యవసాయం రంగానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా మేలు రకపు, ఎక్కువ దిగుబడినిచ్చే వరి వంగడాలను రైతులకు అందించింది. ముఖ్యంగా 1960- 70లలో భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన సమూల మార్పులు, అభివృద్ధికి ఆయనందించిన అపారమైన సేవలు, కృషి దేశీయ రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే భారతీయ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 98 ఏళ్ల వయసులో గురువారం సెప్టెంబరు 28న కన్నుమూసిన సంగతి తెలిసిందే. If we have food security in India today, then in large measure we owe it this man—M.S.Swaminathan, fondly known as the ‘Father of the Green Revolution.’ Given our deep links with agriculture, we presented him with the Agri-Icon of the year award at the Mahindra Samriddhi Awards… pic.twitter.com/1WAjQKt4CC — anand mahindra (@anandmahindra) September 30, 2023 -
యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు
Odisha Train Accident: ఒడిశా పెను విషాదంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విచారం ప్రకటించారు. ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన ఒక విషాదం. ఓం శాంతి అంటూ ఆయన ట్వీట్ చేశారు. “ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగనివ్వకూడదు. ఈ విషాదానికి మూలకారణాన్ని తెలుసుకోవాలి. మానవ తప్పిదమైనా లేదా సాంకేతిక తప్పిదమైనా, ఇంత వినాశనానికి దారితీయకూడదు. రైల్వే ఆపరేషన్లోఫెయిల్-సేఫ్ మెకానిజమ్ వ్యవస్థను మరోసారి సమీక్షించుకోవాలి’’ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. కాగా ఒడిశా బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 261కి చేరింది. అత్యంత ఘోరమైన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ దుర్ఘటనపై సర్వత్రా తీవ్ర సంతాపం వెల్లు వెత్తుతోంది. A tragedy the scale of which requires the entire country to pause in silent reflection, in memory of those who have lost their lives. Om Shanti🙏🏽 We cannot let such accidents happen again. We must get to the root cause of this tragedy. Whether human or technical error, neither… https://t.co/fxs2k387YG — anand mahindra (@anandmahindra) June 3, 2023 -
కుప్పకూలిపోయాను..డియర్.. RIP: కిరణ్ మజుందార్ షా భావోద్వేగం
బెంగళూరు: బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తన జీవితంలో చోటు చేసుకున్న విషాదంపై భావోద్వానికి లోనయ్యారు. దీపావళి పర్వదినం రోజు తనను శాశ్వతంగా విడిచివెళ్లిన భర్త జాన్ షా ను గుర్తు చేసుకుంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా కన్నీటి నివాళి అర్పించారు. ‘‘కుంగిపోయాను.. నా భర్త, సోల్ మేట్, గురువును కోల్పోయాను. నా లక్క్ష్య సాధనలో జాన్ ఎప్పుడూ చాలా అండగా నిలిచారు. ఎంతో మార్గనిర్దేశనం చేశారు. నా జీవితాన్ని ఇంత స్పెషల్‌గా ఉంచి నందుకు ధన్యవాదాలు. రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ జాన్...మీరు లేని లోటు పూడ్చలేనిది’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కేన్సర్‌తో బాధపడుతున్న జాన్ షా (73)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. దీంతో పలువురు వ్యాపార, రాజకీయ పెద్దలు ఆమెకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాన్సర్‌తో బాధపడుతూ కిరణ్ మజుందార్ షా తల్లి యామిని మజుందార్ షా ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. ఇపుడు భర్తను కోల్పోవడంతో కిరణ్ విషాదంలో మునిగిపోయారు. కాగా స్కాటిష్ జాతీయుడైన జాన్షా 1998లో కిరణ్ మజుందార్ షాను వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ బయోకాన్ గ్రూప్ కంపెనీల సలహా బోర్డు సభ్యుడు సేవలందించారు. 1978లో కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీని స్థాపించగా 1999 నుంచి జాన్ షా బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరిగా వివిధ హోదాల్లో పనిచేశారు. విదేశీ ప్రమోటర్‌గా వ్యవహరిస్తూనే బయోకాన్ గ్రూప్ కంపెనీలకు అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గానూ సేవలు అందించారు. 1999లో బయోకాన్‌లో చేరడానికి ముందు వస్త్ర తయారీదారు మధుర కోట్స్‌కు నాయకత్వం వహించారు జాన్ షా. జూలై 2021లో పదవీ విరమణకు ముందు బయోకాన్ వైస్ ఛైర్మన్ ,నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా 22 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు అందించారు. I am devastated to lose my husband, my mentor and soul mate. I will always be spiritually guided by John as I pursue my purpose. Rest in Peace my darling John. Thank you for making my life so very special. I will miss you profoundly pic.twitter.com/b0qv6ZGI2D — Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 25, 2022 -
అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(62) ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి గురిచేసింది. నేడు(ఆగస్టు 14న) ముంబైలో గుండెపోటుతో కన్నుమూయడంపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బిలియనీర్ హఠాన్మరణంపై ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? ఒక శకం ముగిసిందంటూ పలువురు పారిశశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, బిలియనీర్ గౌతమ్ అదానీ, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అండ్ ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం వెలిబుచ్చారు. ఝున్‌ఝున్‌వాలా సలహాలు, సూచనలతో మార్కెట్లో విజయం సాధించిన పలువురు అభిమానులు ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుని కంట తడి పెట్టు కుంటున్నారు. పెట్టుబడిదారులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తన గుమిగూడడంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్లో ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం భారతదేశానికి చెందిన వారెన్ బఫెట్ అని పిలుచుకునే నికర విలువ 5.8 బిలియన్ డాలర్లు (ఆగస్టు 2022 నాటికి) ఇండియాలో 36వ సంపన్నుడు. ప్రపంచంలోని 438వ బిలియనీర్‌గా ఉన్నారు. Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7 — Narendra Modi (@narendramodi) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Very saddened to know about the passing of the veteran investor Shree Rakesh JhunJhunwala. India has lost a gem, who made a mark not just on the stock market but on the minds of almost every investor in india.#RakeshJhunjhunwala pic.twitter.com/QX4uvBx7hA — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 14, 2022 -
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యం కారణంగా బొజ్జల.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత -
పప్పా నా హీరో, బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులోని ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బాసిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో శనివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లిడ్డర్ సతీమణి గీతిక, కుమార్తె అస్నా భావోద్వేగానికి లోనుకావడం అక్కడున్న వాందరి కళ్ళల్లో కన్నీరు నింపింది. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అమరుడయ్యారన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి పార్థివ దేహాన్ని ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆస్రా మాట్లాడుతూ ఆయన అకాల మరణం జాతికి తీరని నష్టం. నన్ను చాలా గారాబం చేసేవారు.. ఇపుడు భయంగా ఉంది. నాకిపుడు 17 ఏళ్లు. ఈ 17 ఏళ్లు నాన్న నాతో ఉన్నారు. ఆ సంతోషకరమైన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తా. మా పప్పా నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నా బిగ్గెస్ట్ మోటివేటర్ అంటూ కంటతడి పెట్టారు. #WATCH | Daughter of Brig LS Lidder, Aashna Lidder speaks on her father's demise. She says, "...My father was a hero, my best friend. Maybe it was destined & better things will come our way. He was my biggest motivator..." He lost his life in #TamilNaduChopperCrash on Dec 8th. pic.twitter.com/j2auYohtmU — ANI (@ANI) December 10, 2021 బ్రిగేడియర్ లిడ్డర్ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు గీతిక. అనంతరం సతీమణి గీతిక మాట్లాడుతూ ‘‘ఆయన చాలా మంచి మనిషి, స్నేహ శీలి..అందుకే నవ్వుతూ సాగనంపుతామని వచ్చా ఆయన మంచి తండ్రి. నా బిడ్డ ఆయనను చాలా మిస్ అవుతుంది. ఆయన లేకుండా జీవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. చాలా నష్టం. కానీ విధి అలా ఉంది..గర్వంగా కంటే చాలా బాధగా ఉంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లిడ్డర్తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. లిడ్డర్ జనరల్ రావత్‌కు రక్షణ సలహాదారుగా ఉన్నారు. లిడ్డర్ మేజర్ జనరల్ ర్యాంక్‌కి పదోన్నతి పొందాల్సి ఉంది. లిడ్డర్‌కు 2020లో సేన మెడల్, విశిష్ట సేన పతకం లభించింది. గతంలో కశ్మీర్లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించారు. #WATCH | "...We must give him a good farewell, a smiling send-off, I am a soldier's wife. It's a big loss...," says wife of Brig LS Lidder, Geetika pic.twitter.com/unLv6sA7e7 — ANI (@ANI) December 10, 2021 -
Sirivennela Seetharama Sastry అస్తమయం: మాదిక ఏకాకి జీవితం,కన్నీటి నివాళులు
సాక్షి, హైదరాబాద్: సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్తలో యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సిరివెన్నెల మరణం తీరని లోటంటూ సంతాపం వెలిబుచ్చారు. Heartbroken After my Father,he was d only 1 who wud scold,Correct or appreciate me rightfully Wil miss U Dearest Uncle Lov U & ThankU 4 all d Magical Lyrics dat decorated my Tunes & 4 Encouraging my Lyrics U r Irreplaceable — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 30, 2021 'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు — Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021 ప్రముఖ నటుడుప్రకాశ్ రాజ్, మాదిక ఏకాకి జీవితం అంటూ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకులు దేవ కట్టా, అనిల్ రావిపూడి ‘‘మా గుండెల్లో నిద్రపోయావా?... విశ్వాత్మలో కలిసిపోయావా? ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. అలాగే నా తండ్రి తరువాత నన్నునడిపించిన ఏకైక వ్యక్తి మీరు .. మిస్ యూ అంకుల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) ‘పదం ఆయన ఆస్తి... జ్ఞానంతో ఆయనకు దోస్తీ ఆయనో పదభవన నిర్మాణ మేస్త్రి సీతారామ శాస్త్రి..సీతారాముడికి సెలవు’ అంటూ మోహన కృష్ణ అనే అభిమాని సిరివెన్నెలకు నివాళులర్పించారు. (Sirivennela Seetharama Sastry చుక్కల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? — dev katta (@devakatta) November 30, 2021 జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది... Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి..... కన్నీటి వీడ్కోలు ...... ,, — Anil Ravipudi (@AnilRavipudi) November 30, 2021 — Prakash Raj (@prakashraaj) November 30, 2021 The Lyrical Legend. It's deeply saddening to hear the demise of Sirivennela Seetharama Sastry Garu. There will never be one like him. There will never shine another star like the way he did. May his soul rest in peace — v e n u u d u g u l a (@venuudugulafilm) November 30, 2021 His words, his songs and his magic will live forever. ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడుకోలు గురువు గారూ.. — Nani (@NameisNani) November 30, 2021 Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. — RAm POthineni (@ramsayz) November 30, 2021 -
బిగ్‌బాస్ విన్నర్ మరణం: షాక్‌లో బాలీవుడ్
సాక్షి,ముంబై: యువనటుడు, బిగ్‌బాస్-13 విన్నర్ సిద్ధార్థ శుక్లా (40) హఠాన్మరణంపై బాలీవుడ్, టీవీ పరిశ్రమ పెద్దలు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనయ్యారు. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్ధార్థ్ గుండెపోటు కారణంగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టు ముంబైలోని కూపర్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సిద్ధార్థ్ మరణంపై పలువురు నటీ నటులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. దీంతో ట్విటర్ ఆర్ఐపీ సిద్ధార్థ్ శుక్లా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. నమ్మకలేకపోతున్నామంటూ ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, నటి మోడల్ మల్లికా షెరావత్ ట్వీట్ చేశారు. ప్రముఖ టీవీ, సినీ నటి రేణుకా సహానే, మున్మున్ దత్తా తదితరులు సిద్ధార్థ్ ఆకస్మిక మరణంపై సంతాపం వ్యక్తంచేశారు. చదవండి : Sidharth Shukla: బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కాగా1980, డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. బాబుల్ కా ఆంగన్ చూటే నా అనే టెలివిజన్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. జానే పెహచానే సే, యే అజ్నబీ, లవ్ యు జిందగీ లాంటి సీరియల్స్‌లో నటించాడు. ముఖ్యంగా పాపులర్ టీవీ సీరియల్ ‘బాలికా వధు’ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ శర్మకి దుల్హానియాతో బాలీవుడ్‌కీ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి : నేను అమ్మకూచిని: బిగ్‌బాస్ విన్నర్ With a broken heart and sadness in in my soul I miss you more every day. Rest in peace#SiddharthShukla absolutely heartbroken I don't know what to say totally blank I miss you your jabra fan ❤️❤️ pic.twitter.com/NFy9gsJjth — Dhruvvvv🌟 (@dhruvda7) September 2, 2021 Too young to go💔 #SiddharthShukla RIP 🙏🙏 pic.twitter.com/78AW1l8Gsd — Mallika Sherawat (@mallikasherawat) September 2, 2021 Shocked and numb. No Words 🙏🙏🙏 #SiddharthShukla — Munmun Dutta (@moonstar4u) September 2, 2021 I cannot process that Siddharth Shukla has passed away. Life is just too unpredictable. RIP Siddharth. My condolences to his family and friends and to all his devastated fans 🙏🏽🙏🏽🙏🏽😢 — Renuka Shahane (@renukash) September 2, 2021 Hello bollywood !!! Is it really a heart attack ??? Remember SSR.#SiddharthShukla 😓😨💔 pic.twitter.com/6TSfBe9hlS — Diptiman Yadav (@Dipti_6450) September 2, 2021 I cannot process this news that I just came across. Is this true? Please no. No… #SiddharthShukla — ARMAAN MALIK (@ArmaanMalik22) September 2, 2021 -
ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి, సీఎం ఠాక్రే సంతాపం
సాక్షి,ముంబై: సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్(81)కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఆమె బుధవారం కన్నుమూశారని భర్త, కార్యకర్త భారత్ పటాంకర్ ప్రకటించారు. గెయిల్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. వివిధ సామాజిక ఉద్యమాలు, జానపద సంప్రదాయాలు, మహిళల హక్కులపై ఆమె చేసిన కృషి మరువలేనివని ఠాక్రే నివాళులర్పించారు. అటు పలువురు దళిత, మహిళా ఉద్యమకారులు, ఇతర సాహితీవేత్తలు కూడా గెయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలో వామపక్ష ఉద్యమానికి ఎంతో సహాయపడ్డారని సీపీఎం నేత అజిత్ అభ్యంకర్ అన్నారు. అమెరికాలో జన్మించిన గెయిల్ అంబేద్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్డీ చేసేందుకు ఇండియాకు వచ్చారు. భారతీయ పౌరురాలిగా మారి సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. దళిత రాజకీయాలు, మహిళా పోరాటాలు, కుల వ్యతిరేక ఉద్యమంపై అనే పుస్తకాలు రచించారు. ముఖ్యంగా శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటు, కుల వ్యతిరేక ఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. అలాగే పర్యావరణ సమస్యలపైన కూడా రచనలు చేశారు. కాగా 1941, ఆగస్టు 2వ తేదీన అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గెయిల్ జన్మించారు. 1963-64 కాలంలో ఇండియాను సందర్శించిన ఆమె దళిత, కుల వ్యతిరేక ఉద్యమాల ఆమె ఆకర్షితురాలయ్యారు. అలా పీహెచ్డీ నిమిత్తం 1970-71లో ఇండియాకు వచ్చారు. 1976లో భరత్ పటాంకర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1983లో భారతీయ పౌరసత్వం సాధించారు. అప్పటినుంచి సతారా జిల్లాలోని కాసేగావ్‌లో నివాసముంటున్నారు. భర్తతో గెయిల్ (ఫైల్ ఫోటో) భర్తతో కలిసి శ్రామిక్ ముక్తి దళ్‌ను స్థాపించి అక్కడి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, కొంకణ్ ప్రాంతంలో నీటి హక్కుల కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం, నార్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీల బోర్డ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌తో వివిధ సమస్యలపై సలహాదారుగా కూడా గెయిల్ పనిచేయడం విశేషం. -
నిర్మాత, మీడియా మొగల్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
సాక్షి, ముంబై: మీడియా మొగల్ సినీ నిర్మాత ప్రదీప్ గుహ (60) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. స్టేజ్ -4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ఆయనకు శుక్రవారం వెంటిలేటర్‌పై చికిత్సఅందించారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు బీటౌన్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు ప్రదీప్ గుహ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రదీప్ గుహ మృతిపై నటుడు, మనోజ్ బాజ్‌పేయి, సుభాష్ ఘాయ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. హీరోయిన్లు దియామీర్జా, లారా దత్తా మిస్ ఆసియా పసిఫిక్ పోటీల నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ రాశారు. ఒక గొప్ప శక్తిని కోల్పోయామంటూ విచారం వ్యక్తం చేశారు. గత 21 సంవత్సరాలుగా తనకు ధైర్యాన్నిచ్చిన వ్యక్తి అంటూ ఆయనకు నివాళులర్పించారు. 2000 సంవత్సరంలో అందాలపోటీదారులకు మార్గదర్శకులలో ప్రదీప్ ఒకరని తెలిపారు. కళాకారులు, రచయితలు, మీడియా నిర్వాహకులకు మార్గదర్శకుడిగా, ప్రకటనల దిగ్గజం’ గా ఆస్ట్రేలియా బేస్డ్ మీడియా టెక్ ఎంటర్ప్రెన్యూర్ చార్ల్టన్ డిసిల్వా గుర్తు చేసుకున్నారు. మీడియా అమ్మకాలను ఆకర్శణీయంగా చేసిన ఘనత ప్రదీప్ గుహాకే దక్కుతుందన్నారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మాజీ అధ్యక్షుడైన ప్రదీప్ అస్తమయంపై దేశంలో అంతర్జాతీయ ప్రకటనల సంస్థ కూడా సంతాపం తెలిపింది. కాగా9ఎక్స్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నా ప్రదీప్ గుహ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, జీ నెట్వర్క్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు. ఆయనకు భార్య పాపియా గుహా, కుమారుడు సంకేత్ ఉన్నారు. హృతిక్ రోషన్, కరిష్మా కపూర్ నటించిన 'ఫిజా' , మిథున్-డింపుల్ కపాడియా జంటగా 'ఫిర్ కభీ' చిత్రాలను గుహ నిర్మించారు. Deeply shocked and saddened to hear about my friend @guhapradeep ‘s passing away !! May you rest in peace Pradeep 🙏 — manoj bajpayee (@BajpayeeManoj) August 21, 2021 Pradeep Guha, Past President IAA, passed away today. Our condolences to his family & dear ones. He continues to live in our hearts. pic.twitter.com/wJrlAKpSBI — IAA India Chapter (@IAA_India) August 21, 2021 Good bye my friend #Pradeep Guha I will always be indebted for your genuine love n support to I needed n we all @Whistling_Woods international 4 your enriched guidance as a director on board since its birth. U were the makers of many in our industry👍 RIP MY FRIEND🙏🏽 pic.twitter.com/Io33oh5gM3 — Subhash Ghai (@SubhashGhai1) August 21, 2021 Our Dearest PG as we so lovingly called him. A formidable force… i think back to the courage he consistently gave me over the 21 years i’ve known him. A man who truly empowered us. We will always work hard to make you proud PG 🙏🏻❤️🙏🏻 Gone too soon… @guhapradeep https://t.co/FyR7frz3MC — Dia Mirza (@deespeak) August 21, 2021 -
ఒక స్వర్ణయుగం ముగిసింది: సోనియా గాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె దిలీప్ కుమార్ భార్య సైరా బానుకు ఒక లేఖ రాశారు. "మీ ప్రియమైన భర్త దిలీప్ కుమార్ కన్నుమూతతో, భారతీయ సినిమా చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది’’ అని సైరా బానుకు గురువారం రాసిన సంతాప సందేశంలో సోనియా పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ఒక లెజెండ్..భవిష్యత్తులో కూడా లెజెండ్‌గానే కొనసాగుతారు.ఎందుకంటే భవిష్యత్తరం సినీ ప్రేమికులు కూడా ఆయన అద్భుతమైన నటనా వైభవాన్ని ఆస్వాదిస్తాయి. ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీలను అందించిన ఆయన నటనా నైపుణ్యాన్ని ఆరాధిస్తారంటూ ఆయన సాధించిన ఘనతను, విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే గంగా జమునా, డాగ్, దీదార్, మొఘల్-ఏ-ఆజం, నయా దౌర్, మధుమతి, దేవదాస్,రామ్ ఔర్ శ్యామ్ లాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో తన పాత్రలతో అలరించిన ఆయన నటను ఎవరు మరచిపోగలమని వ్యాఖ్యానించారు..పూర్తికాల జీవితాన్ని అనుభవించిన దిలీప్ కుమార్ అమూల్యమైన వారసత్వాన్ని ప్రపంచ సినిమాకు అందించారని కొనియాడారు. ఆయన మరణం విశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచేసిందనీ, దేశం ఎప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటుందనీ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని,ధైర్యాన్ని మీకివ్వాలని ప్రార్థిస్తున్నానని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. కాగా వయసు సంబంధిత సమస్యలతో దిలీప్ కుమార్ ముంబై ఆసుపత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా 'కోహినూర్' గా భావించే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, స్క్రీన్ పేరు దిలీప్ కుమార్‌గా ప్రపంచానికి సుపరిచితుడు. 1966లో ఆయన సైరా బానును వివాహమాడారు. -
మూగబోయాను..సైరా భాభీ మీకు నమస్కారం!
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంతో సీనీరంగంతో పాటు, యావత్ ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి లోనైంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ‘ఆర్ఐపీ దిలీప్ సాబ్’ ట్రిండింగ్‌లో నిలిచింది. దిలీప్ అస్తమయంపై పలువురు నటీనటులతో పాటు ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘యూసుఫ్ భాయ్ తన చిన్న సోదరిని విడిచి వెళ్లిపోయారు..నాకేమీ తోచడం లేదు.. చాలా బాధగా ఉంది... మీ జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి..మౌనం ఆవహించింది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ సతీమణి సైరా బానుపై గౌరవంతో లతాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న యూసుఫ్ భాయ్‌కి సైరా భాభి ఎంతో సేవచూశారు. ఎవర్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న ఆయనను రాత్రి పగలూ కంటికి రెప్పలా కాపాడుకున్న సైరాబానుకు నమస్కరిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. యూసుఫ్ భాయ్ ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్‌తో తన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇంకా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తదితరులు దిలీప్ కుమార్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దిలీప్ సాబ్ అల్విదా అంటూ సంతాపం తెలిపిన షబానా, ఆయనకు తాను ఏకలవ్య శిష్యురాలనని చెప్పుకున్నారు. అంతేకాదు. దిలీప్‌జీ నిమాలకు, భాషకు, డిగ్నీటీతోపాటు సామాజిక బాధ్యత వహించినందుకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు భర్తను కోల్పోయిన సైరా బాను తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సహచరుడి పార్థివదేహం వద్ద కన్నీరు పెడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు, పలువురు ఓదార్చారు. pic.twitter.com/nPwM4myyOJ — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 यूसुफ़ भाई पिछले कई सालों से बिमार थे, किसीको पहचान नहीं पाते थे ऐसे वक़्त सायरा भाभीने सब छोड़कर उनकी दिन रात सेवा की है उनके लिए दूसरा कुछ जीवन नहीं था. ऐसी औरत को मैं प्रणाम करती हूँ और यूसुफ़ भाई कीं आत्मा को शान्ति मिले ये दुआ करती हूँ. — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 Adieu Dilip Saab . Unknown to you I have been your Eklavya.Thank you for the movies.Thank you for the language . Thank you for the dignity . Thank you for being socially responsible.Thank you🙏🙏 pic.twitter.com/P5UeMUOQ8t — Azmi Shabana (@AzmiShabana) July 7, 2021 -
గుండె బద్దలైంది.. సారీ మందిరా!
సాక్షి,ముంబై: ప్రముఖ నటి, మోడల్ మందిరా బేడీ భర్త రాజ్కౌశల్ ఆకస్మిక మరణం పలువుర్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో బాలీవుడ్ నటీ నటులతో పాటు, మందిరా దంపతుల స్నేహితులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందిరా బేడీకి, ఆమె కుటుంబ సభ్యలుకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ముఖ్యంగా ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, కబీర్‌బేడీ, మాధవన్, నటి నేహా ధూపియా, మనోజ్‌బాజ్‌పాయ్ తోపాటు, సింగర్ విశాల్ దాద్లానీ తమ సానుభూతి ప్రకటించారు. 49 సంవత్సరాల చిన్న వయసులో ఆయన మరణం తీరని విషాదమంటూ ట్వీట్ చేశారు. రాజ్ కౌశల్ దర్శకత్వంలో వచ్చిన ఆంథోనీ కౌన్ హై మూవీలో నటించిన మినీషా లాంబా, ఆంథోనీ కౌన్ హై చిత్రంలో ఆయనతో పనిచేసిన అర్షద్ వార్సీ ట్విటర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కృతి కర్బందా, రణదీప్ హుడా, లారా దత్తా, రణ్వీర్ శ్రాయ్, గౌరవ్ చోప్రా, సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్, ఇతర ప్రముఖులు సోషల్ మీడియాద్వారా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా భర్త రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో మందిరాబేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు హ్యుమా ఖురేషి, అపూర్వ అగ్నిహోత్రి, సమీర్ సోని, రోహిత్ రాయ్, గుల్ పనాగ్, ఆశీష్ చౌదరీ తదితరులు మందిరా నివాసానికి చేరుకుని ఆమెను ఓదార్చారు. స్నేహితులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ముంబైలోని బాంద్రా శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలను పూర్తి చేశారు. తీరని దుంఖంతో పిల్లలను ఓదార్చుతూ మందిరా తన భర్తకు అంతిమ సంస్మారాలను పూర్తి చేసిన వైనం కంటతడిపెట్టించింది. చదవండి : ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా No news can be more shocking and tragic for us personally than loosing our dear friend and a fantastic human being Raj kaushal !! It will definitely take time to come to terms with this loss!! Rest in peace my friend 🙏 — manoj bajpayee (@BajpayeeManoj) June 30, 2021 Deeply saddened & shocked to know about the sudden demise of #RajKaushal! A friend, a film maker & a very positive man. Have some great memories of working with him & spending time with him few years back. Sorry dearest @mandybedi & family for your irreparable loss. 🙏#OmShanti pic.twitter.com/HrzULdJhYd — Anupam Kher (@AnupamPKher) June 30, 2021 Deepest condolences to Mandira Bedi on the tragic passing of her husband Raj Kaushal. Such a sudden and unexpected loss is deeply traumatic. My heart is with her in her great sorrow. @mandybedi #MandiraBedi — KABIR BEDI (@iKabirBedi) June 30, 2021 I just don’t know what to say. No words nor lines can express how devastating this news has been. One of the nicest guys with a heart of gold is now lighting up the heavens. Farewell my bro @rajkaushal1. Our world just got very very small. 🙏🙏🙏🙏 pic.twitter.com/KBZZz7ejVF — Ranganathan Madhavan (@ActorMadhavan) June 30, 2021 RIP #RajKaushal 🙏🏽 pic.twitter.com/X9J2oTL3Hc — Randeep Hooda (@RandeepHooda) June 30, 2021 Deepest condolences to Mandira Ma’am, her children and their family. This is so shocking. Rest in peace #RajKaushal sir. 💔 — kriti kharbanda (@kriti_official) June 30, 2021 -
గురుప్రసాద్ మహాపాత్ర మృతి: పీఎం మోదీ సంతాపం
సాక్షి,ముంబై: కరోనా సంబంధిత సమస్యలతో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర కన్నుమూశారు.ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన శనివారం కన్నుమూశారు. గురుప్రసాద్ మరణంపై ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గురుప్రసాద్ మృతిపై విచారాన్ని వ్యక్తం చేశారు. మహాపాత్రను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందనీ సుదీర్ఘకాలంపాటు, దేశానికి ఎనలేని సేవలందించారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగానికి ఆయన కుటుంబానికి స్నేహితులకు సానుభూతిని తెలిపారు. అటు ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ కూడా సంతాపం వెలిబుచ్చారు. అత్యంత సమర్థవంతమైన, డెడికేటెడ్ అధికారిని కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ నెలలో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అయినా కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విచారు. గుజరాత్ కేడర్ 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన గురుప్రసాద్ 2019 ఆగస్టులో డీపీఐఐటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో గుజరాత్‌లోని సూరత్‌లో మునిసిపల్ కమిషనర్ పదవిని నిర్వహించిన వాణిజ్య విభాగంలో జాయింట్ సెక్రటరీగా తన సేవలను అందించారు. Deeply saddened by the demise of Dr.Guruprasad Mohapatra,Secretary DPIIT,GOI. A highly efficient and dedicated civil servant. Knew him as a former colleague through several interactions.Was always very responsive and constructive. May his soul rest in eternal peace. — Shaktikanta Das (@DasShaktikanta) June 19, 2021 Extremely saddened to hear about the loss of Dr. Guruprasad Mohapatra, Secretary DPIIT. His long-standing service and dedication to the Nation have left a lasting impact. I convey my deepest sympathies to his family and friends. ॐ शांति pic.twitter.com/JFwZJFDE1b — Piyush Goyal (@PiyushGoyal) June 19, 2021 -
దేవుడు చాలా కఠినాత్ముడు: మేఘనా రాజ్ ఎమోషన్
సాక్షి,బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ అకాల మరణంపై టి మేఘనా రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా ద్వారా విజయ్ మృతిపై మేఘనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ అందమైన ఫోటోను షేర్ చేసిన మేఘనా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ‘మనిషిగా, నటుడిగా మీరెంతో అద్భుతమైన వారు. మీరు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.. నిజంగా దేవుడు కఠినాత్ముడు. ఆర్ఐపీ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. అంతేకాదు గత ఏడాది జూన్‌లో తన భర్త చిరంజీవి సర్జా మృతిపైవిచారం వ్యక్తం చేసిన సంచార్ విజయ్ పోస్ట్‌ను షేర్ చేశారు. మేఘనా రాజ్ భర్త , హీరో చిరంజీవి సర్జా తీవ్ర గుండెపోటు కారణంగా (202, జూన్ 7న) ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా స్నేహితుడితో కలిసి వెళుతుండగా విజయ్ ప్రమాదానికి గురయ్యారు.తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విజయ్ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆయన చని పోయినట్టుగా ప్రకటించారు. మరోవైపు విజయ్ ఆకస్మిక మరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు పలువురుఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నటుడి ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తరువాత కూడా విజయ్ పలువురికి ప్రాణదానం చేశారని సీఎం కొనియాడారు. మరోవైపు బంధువులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికార లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
గౌరీ అమ్మ ఇక లేరు: గవర్నరు, సీఎం సంతాపం
తిరువనంతపురం: కేరళ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీమంత్రి నేత కేఆర్ గౌరీ కన్నుమూశారు. కేరళ రాజకీయాల్లో ఐరన్ లేడీగా పేరుగాంచిన కేఆర్ గౌరీ తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. మరికొన్ని వారాల్లో ఆమె 102వ పుట్టిన రోజులు జరుపుకునేవారు. కేరళ గవర్నరు, ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు గౌరీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాలాతో సహా పార్టీ సీనియర్ నాయకులు ఆమె స్వస్థలమైన అలప్పులో ఘనంగా నివాళులు అర్పించారు. ‘‘దోపిడీకి వ్యతిరేకంగా సమ సమాజ నిర్మాణంకోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధురాలు. మరింత ప్రగతిశీల సమాజాన్నినిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆమెకిచ్చే నివాళి. రెడ్ సెట్యూట్’’ అని సీఎం విజయన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో భూసంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిర స్మరణీయమని గవర్నరు సంతాపం తెలిపారు. అసాధారణమైన ధైర్యం, ఉత్తేజకరమైన నాయకత్వంతో మహిళా సాధికారతకు నిజమైన చిహ్నంగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం చేసిన ఆమె పోరాటాలు కేరళ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ట్వీట్ చేశారు. ఆధునిక కేరళకు పునాదులు వేసిన వారిలో కేఆర్ గౌరీ అమ్మ ఒకరని ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆమెకు నివాళులర్పించారు. మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఆమె అని గుర్తు చేసుకున్నారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేరళలోని రాజకీయ రంగాలలో అనేక కీలక ఫైనాన్స్, పరిశ్రమలు మంత్రి పదవులను చేపట్టారు. గౌరీ అమ్మ చారిత్రాత్మక భూస్వామ్య వ్యతిరేక భూ సంస్కరణల చట్టాన్ని తీసుకు రావడంలో ఆమె చేసిన కృషి అమోఘం. భూమిలేని రైతులకు భూమిని సొంతం చేసుకోవడానికి మార్గం సుగమమైంది.1952లో ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభకు ఎన్నిక కావడంతో గౌరీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1957లో కమ్యూనిస్ట్ లెజెండ్ ఇఎంఎస్ నంబూద్రిపాత్ నేతృత్వంలోని ప్రపంచంలోని మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. 1960 లలో కమ్యూనిస్టులు విడిపోయిన తరువాత, గౌరీ సీపీఎంలో చేరారు, ఆమె భర్త మరో ముఖ్య నాయకుడు టీవీ థామస్ సీపీఐలో చేరారు. మొదటి కేరళ శాసనసభ నుండి 1977 వరకు ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మొత్తం ఆరు క్యాబినెట్లలో 16 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. Hon'ble Governor Shri Arif Mohammed Khan said : "My heartfelt condolences on the demise of Smt K R #GouriAmma , former minister & veteran political leader. Her exceptional courage and inspiring leadership made her a true symbol of woman empowerment": PRO,KeralaRajBhavan(T1/2) pic.twitter.com/WQjHwiYZRC — Kerala Governor (@KeralaGovernor) May 11, 2021 Com. K R Gauri was a brave fighter, dedicated her life to end exploitation, build an egalitarian society. She made seminal contributions in building the Communist movement & as an administrator. Let's show respects, by pledging to build a more progressive society. Red Salute! pic.twitter.com/NYzyv8wyjD — Pinarayi Vijayan (@vijayanpinarayi) May 11, 2021 -
ఏబీఎన్ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
బిడ్డ కోసం పెంగ్విన్ల ఆరాటం
-
వైరల్: ‘బిడ్డా లే.. అమ్మ వచ్చింది చూడు’
న్యూఢిల్లీ: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే తల్లి హృదయం విలవిల్లాడుతుంది. పిల్లలు ఏ చిన్నాపాటి అనారోగ్యానికి గురైన అమ్మ మనసు సహించదు. బిడ్డలు కోలుకునే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దురదృష్టం కొద్ది బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలవు. ఇలాంటి తల్లి ప్రేమ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. వాటి బిడ్డలకు ఏం జరిగినా అవి కూడా తట్టుకోలేవు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. చనిపోయిన పిల్ల పెంగ్విన్ని చూసి దాని తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపించాయి. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ‘‘జీవితం అంటేనే ఇలా ఉంటుంది. తమ బిడ్డను కోల్పోయినందుకు ఈ రెండు పెంగ్విన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మహమ్మారి టైంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి.. బాధపడుతున్న వారికి దేవుడు ఆత్మనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుశాంత నంద వీడియో షేర్ చేశారు. ఇక దీనిలో ఓ పెంగ్విన్ జంట చనిపోయిన బిడ్డను అటు ఇటు దొర్లిస్తూ.. ముక్కుతో దాన్ని కదుపుతూ లేపే ప్రయత్నం చేశాయి. కానీ దానిలో ఎలాంటి చలనం లేదు. బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ పెంగ్విన్ల గుండె పగిలింది. బిడ్డను చూస్తూ.. మౌనంగా రోదించాయి. వాటి వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి -
గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే టీచర్ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే వార్తతో తన గుండె పగిలి పోయిందంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఇన్‌స్టాలో తన బాధను షేర్ చేసుకున్నారు. ఢిల్లీలోని మానెక్జీ కూపర్ స్కూల్లో చదివి ఉంటే ఇతరులకు కూడా తన టీచర్ గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందంటూ సంతాపం ప్రకటించారు పూజా. తాను నిరాశపడిన ప్రతీసారి ఆమె తనకు ఎంతో ధైర్యం చెప్పేవారని ఆమె ధైర్యవచనాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా కొంతమంది టీచర్లు ప్యూర్ గోల్డ్ అంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన ఉన్నతికి కారణమైన అంతటి గొప్ప టీచర్ మాటలను ఎప్పుడూ మరిచిపోలేను.. జెసికా జియోగ్రఫీ టీచర్ అయినా ఎన్నో జీవిత పాఠాలను నేర్పించారన్నారు. ఈ సందర్భంగా టీచర్ కుటుంబ సభ్యులకు పూజా తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చదవండి: ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి!