ఇర్ఫాన్ ఖాన్ ఫైల్ ఫోటో
సాక్షి, జైపూర్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంపై ఆయన చిన్ననాటి స్నేహితుడు భరత్ పూర్ (రాజస్థాన్) ఎస్పీ హైదర్ అలీ జైదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఇర్ఫాన్ గొప్ప మనిషి అని వ్యాఖ్యానించిన ఆయన ఏ క్షణమైనా అతడినుంచి ఫోన్ వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానంటూ కంటతడి పెట్టారు. ఇంతటి విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఆ కుటుంబానికి కలగాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన జైదీ ఈ సందర్భంగా ఇర్ఫాన్ జీవితానికి సంబంధించి ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇర్ఫాన్ ఉపాధ్యాయుడు కావాలని ఆమె తల్లి కోరుకున్నారని జైదీ గుర్తు చేసుకున్నారు. (ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత)
క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ ఖాన్ లండన్ లో కొంతకాలం చికిత్స పొందారు. ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన ఇర్ఫాన్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. కాగా గత వారం, ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్‌లో కన్నుమూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు.
Irrfan Khan's friend, Haider Ali Zaidi, the SP of Bharatpur, shares a video after coming to know of his death pic.twitter.com/IsZhRVAWEq
— Jayadev (@jayadevcalamur) April 29, 2020
Comments
Please login to add a commentAdd a comment