ఇర్ఫాన్ ఖాన్‌కు మ‌న‌మిచ్చే గౌర‌వం ఇదేనా? | Shekhar Suman Wants A white Marble Grave For Irrfan Khan | Sakshi
Sakshi News home page

'పాల‌రాతితో ఇర్ఫాన్ స‌మాధి క‌ట్టించాలి'

Published Fri, Oct 2 2020 11:02 AM | Last Updated on Fri, Oct 2 2020 4:32 PM

Shekhar Suman Wants A white Marble Grave For Irrfan Khan - Sakshi

ముంబై : దివంగ‌త న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ స‌మాధిని పాల‌రాయితో క‌ట్టించాల‌ని న‌టుడు  శేఖర్ సుమన్ అన్నారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఇర్ఫాన్‌కు త‌గిన గౌర‌వం ఇవ్వాల్సిన బాధ్య‌త ఇండ‌స్ర్టీపై ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుత‌మున్న ఇర్ఫాన్ స‌మాధి అప‌రిశుభ్రంగా ఉండ‌టం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎంతో కీర్తి ప్ర‌తిష్ట‌లు పొందిన ఇర్ఫాన్‌కు త‌గిన గౌర‌వం ఇచ్చేలా వైట్ మార్భుల్స్‌తో పాల‌రాతి స‌మాధి క‌ట్టించాల‌ని, దీనికి చిత్ర‌ప‌రిశ్ర‌మ ముందుకు రావాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఇంత‌కుముందు ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దార్ ఇర్ఫాన్ గురించిన చేసిన పోస్ట్‌పై ఓ అభిమాని స్పందిస్తూ ఇర్ఫాన్ స‌మాధిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. (‘ఆయన జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు’)

ఆ స్మ‌శాన‌వాటిక చెత్త‌కుండీలా ఉంద‌ని, అలాంటి ప్ర‌దేశంలో ఇర్ఫాన్ స‌మాధి ఉండ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అస‌లు ఇది నిజ‌మేనా లేక‌పోతే స్మ‌శాన‌వాటిక ఫోటో పంపాల్సిందిగా ఇర్ఫాన్ భార్య సుతాపకు ట్వీట్ చేయ‌గా..ముస్లిం మ‌హిళలు అక్క‌డికి వెళ్ల‌డానికి అనుమ‌తి లేద‌ని సుతాప బ‌దులిచ్చింది. ఇక స్మ‌శాన‌వాటిక గురించి స్పందిస్తూ..అడ‌వుల్ని, మొక్క‌ల్ని ఎంతో ఇష్ట‌ప‌డే ఇర్ఫాన్ స‌మాధిని అందుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటుచేశాం. దాన్నొక అంద‌మైన ప్ర‌దేశంగా చూడాల‌ని, ఇర్ఫాన్ ఆత్మ ఎల్లప్పుడూ త‌న‌తోనే ఉంటుంద‌ని పేర్కొంది. విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29న మరణించిన విషయం తెలిసిందే. (‘కలువ పూలు నిన్ను గుర్తు చేస్తున్నాయి ఇర్ఫాన్‌‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement