బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరన్న విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు బాలీవుడ్ నటులు సైతం అతనితో గల సాన్నిహిత్యపు మధురానుభూతులను నెమరేసుకుంటున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు అయిన బాబీ పర్వేజ్ శాన్ అలాంటి ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ గతంలోకి తొంగి చూశాడు. "సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ముచ్చట ఇది. అప్పుడు నేను బొంబాయిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. ఆ కాలంలో మొబైల్ ఫోన్లు అంటే చాలా ఖరీదైనవి, ఏ ఒకరిద్దరి దగ్గర మాత్రమే ఉండేవి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఢిల్లీ నుంచి వందల సంఖ్యలో నటీనటులు అక్కడికి వచ్చేవారు. వందలాది మంది తమ ఫొటోల వెనక ఓ ఫోన్ నంబర్, పేరు రాసి ఇచ్చేవారు. (పోరాడి పోరాడి మరణించాడు)
ఎనీ టైమ్ రెడీగా....
ఆశ్చర్యం ఏంటంటే ఆ వందలాది మంది రాసిన పేర్లు, ఫోన్ నెంబర్ ఒకే ఒక్కరివి. అతడే ఇర్ఫాన్ ఖాన్ లేదంటే కొన్నిసార్లు అతడి భార్య సుతాపా పేరు ఉండేది. ఎవరైనా నటీనటులను ఎంపిక చేసుకుంటే వారిచ్చిన నంబర్ ఆధారంగా ఇర్ఫాన్‌కే కాల్ వెళుతుంది. అతను శ్రద్ధగా విని ఏ ఆఫీసు నుంచి కాల్ చేస్తున్నారో తెలుసుకుని, ఎంతో ఓపికతో సంబంధిత వ్యక్తులకు సమాచారం చేరవేసేవాడు. ఒకవేళ నేను వేళ కాని వేళలో ఫోన్ చేసినా అతను ఏమాత్రం విసుగు చెందకుండా అన్ని వివరాలు అడిగి తెలుసుకునేవారు. సెల్‌ఫోన్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చేవరకు వాళ్ల కోసం అతను కష్టపడుతూనే ఉన్నాడు. ఇలా అందరి గురించి ఫోన్‌లు మాట్లాడుతూ కూర్చునే తెలివితక్కువ ఇర్ఫాన్ ఎవరు? అని నేననుకున్నాను. కానీ అతను ప్రతి విషయాన్ని నటీనటులకు చేరవేసేవాడు. ఇది కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింద"ని బాబీ చెప్పుకొచ్చాడు. (ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment