అపస్మారక స్థితిలో ఉన్నా.. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు | Actor Irrfan Khan birthday Wife Sutapa Sikdar remembered him | Sakshi
Sakshi News home page

అపస్మారక స్థితిలో ఉన్నా .. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు

Jan 7 2022 3:46 PM | Updated on Jan 7 2022 4:02 PM

Actor Irrfan Khan birthday Wife Sutapa Sikdar remembered him  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత లెజెండరీ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ జయంతి సందర్భంగా ఆయన భార్య సుతాపా సిక్దర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇర్ఫాన్‌తో పంచుకున్న జీవితాన్ని, ఇతర విషయాలను తరచు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుతాప అతనితో మరెన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు.

భర్త చనిపోవడానికి ముందు రోజురాత్రి అతనికిష్టమైన పాటల్ని పాడుతూ  కూచున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక వెబ్‌సైట్‌తో  తన ఆవేదనను పంచుకున్నారు సుతాప. తాను పాడుతోంటే..అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇర్ఫాన్‌  కళ్ల నుంచి  నీళ్లు అలా ‍ ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉమ్రావ్ జాన్ మూవీలోని  'ఝూలా కిన్నే దాలా రే,  హమ్రియా,  లతా మంగేష్కర్‌ ఆలపించిన  పాపులర్‌ సాంగ్‌ ‘లగ్‌ జా గలే’,  ఆజ్‌ జానే కీ జిద్‌ న కర్‌ అనే గజల్‌ను ఇర్ఫాన్‌ కోసం  పాడి వినిపించానంటూ  సుతాప  ఎమోషనల్‌ అయ్యారు.

ఇర్ఫాన్‌ లేకుండా, సింగిల్‌ మదర్‌గా తన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకునే వారు సుతాప. గత ఏడాది  ఇర్ఫాన్‌ వర్ధంతి సందర్భంగా ఇర్ఫాన్‌కెంతో ఇష్టమైన  నైట్‌ క్వీన్‌  మొక్కను నాటి నివాళి అర్పించారు. ఈ పూల సువాసన ఇర్ఫాన్‌కి చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఇర్ఫాన్‌  పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్‌  కూడా తమకు దూరమైన తండ్రి గురించి తలచుకుంటూ ఇన్‌స్పైర్‌ అవుతూ ఉంటారు. కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29, 2020న ఇర్ఫాన్ ఖాన్  కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement