unconscious
-
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నట్లుండి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. వేడి కారణంగా డీహైడ్రేషన్‌తో ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. #WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25— ANI (@ANI) April 8, 2025కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 79 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో పాంబన్ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బడ్జెట్ వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రధాని సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జీడీపీ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. కానీ, జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’’ అని ప్రశ్నించారు. -
ఎంత ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇదేమిటి తమ్ముడూ!
అమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్ జోషిల ‘త్రీ ఇడియెట్స్’ సినిమాలోని సన్నివేశాలను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాం. అందులో ఒకటి హాస్పిటల్ సీన్. అనారోగ్యంతో బాధపడుతున్న శర్మన్ తండ్రిని అమీర్‌ఖాన్ స్కూటర్‌పై కూర్చోబెట్టుకొని, భుజాలకు కట్టేసుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లే సీన్ ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఒక హాస్పిటల్లో అచ్చం ఇలాంటి సీనే కనిపించింది. అపస్మారకస్థితిలో ఉన్న తన తాతను బైక్‌పై కూర్చోపెట్టుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లాడు ఒక వ్యక్తి. సదరు ఈ వ్యక్తి ఇదే ఆస్పత్రిలో పనిచేస్తాడట. ‘ఎక్స్’లో ఒక యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘త్రీఇడియెట్స్’ సినిమా సీన్‌ను గుర్తు తెస్తుంది. -
సూరత్‌లో ‘దీపావళి ప్రయాణికుల’ తొక్కిసలాట.. పలువురికి అస్వస్థత!
దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. గ్రామాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను రద్దీగా మారాయి. ఈ నేపధ్యంలో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్‌లోని సూరత్ రైల్వే స్టేషన్‌కు సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. వీరంతా రైళ్లు రాగానే ఒక్కసారిగా రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఉన్న వారు కూడా రైలు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. दीपावली घर जाने को सूरत रेलवे स्टेशन पहुंचे यूपी और बिहार के मजदूर दम घुटने के कारण घायल हो गए। pic.twitter.com/zPMRZ0mpbg — Rakesh chaudhari (@Rakeshchau58578) November 11, 2023 ఈ సమయంలో తోపులాట జరిగి, పలువురు ప్రయాణికులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీనిని గమనించిన రైల్వే పోలీసులు బాధిత ప్రయాణికులకు సీపీఆర్ ఇచ్చి వారిని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉపాధి రీత్యా సూరత్‌లో ఉంటున్నారు. వీరంతా దీపావళి పండుగకు తమ ఊళ్లకు వెళ్లాలని రైల్వే స్టేషన్‌కు తరలివస్తున్నారు. ఫలితంగా రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంటోంది. ఇది కూడా చదవండి: ‘గ్రేవ్‌యార్ట్ ఫర్ చిల్డ్రన్’ అంటే ఏమిటి? -
బస్ నడుపుతుండగా స్పృహ కోల్పోయిన డ్రైవర్‌కు.. ఈ బుడ్డోడు ఏం చేశాడో చూశారా?
-
అపస్మారక స్థితిలో ఉన్నా.. కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: దివంగత లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జయంతి సందర్భంగా ఆయన భార్య సుతాపా సిక్దర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇర్ఫాన్‌తో పంచుకున్న జీవితాన్ని, ఇతర విషయాలను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుతాప అతనితో మరెన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. భర్త చనిపోవడానికి ముందు రోజురాత్రి అతనికిష్టమైన పాటల్ని పాడుతూ కూచున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక వెబ్‌సైట్‌తో తన ఆవేదనను పంచుకున్నారు సుతాప. తాను పాడుతోంటే..అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఇర్ఫాన్ కళ్ల నుంచి నీళ్లు అలా ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉమ్రావ్ జాన్ మూవీలోని 'ఝూలా కిన్నే దాలా రే, హమ్రియా, లతా మంగేష్కర్ ఆలపించిన పాపులర్ సాంగ్ ‘లగ్ జా గలే’, ఆజ్ జానే కీ జిద్ న కర్ అనే గజల్‌ను ఇర్ఫాన్ కోసం పాడి వినిపించానంటూ సుతాప ఎమోషనల్ అయ్యారు. ఇర్ఫాన్ లేకుండా, సింగిల్ మదర్‌గా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునే వారు సుతాప. గత ఏడాది ఇర్ఫాన్ వర్ధంతి సందర్భంగా ఇర్ఫాన్కెంతో ఇష్టమైన నైట్ క్వీన్ మొక్కను నాటి నివాళి అర్పించారు. ఈ పూల సువాసన ఇర్ఫాన్‌కి చాలా ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఇర్ఫాన్ పెద్ద కుమారుడు బాబిల్ ఖాన్ కూడా తమకు దూరమైన తండ్రి గురించి తలచుకుంటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29, 2020న ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
సరైన దుస్తులు లేవు, ఒంటిపై గాయాలు: యువతిని ఆదుకున్న డాక్టర్
సాక్షి, హిమాయత్‌నగర్: తల్లిదండ్రులు లేరు. అయిన వాళ్లెవరో కూడా తెలీదు. కొద్దిరోజుల క్రితం నగరంలోని పలు రోడ్లపై తిరుగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఓ యువతి(25)ని అక్కడి స్థానికులు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఉస్మానియా వైద్యులు కింగ్‌కోఠి హాస్పిటల్‌కు పంపారు. ఈ నెల 12న యువతిని కింగ్‌కోఠి హాస్పిటల్‌కు తీసుకురాగా.. ఒంటిపై గాయాలు, ఒంటిపై బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆమె వద్దకు వెళ్లాలంటేనే సిబ్బంది హడలెత్తారు. ఓ పక్క కోవిడ్ వార్డులోని బెడ్‌పై పడుకోబెడితే అక్కడున్న వారు ఇక్కడ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో యువతిని అక్కున చేర్చుకున్న ఆస్పత్రి అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా తన సిబ్బంది సాయంతో యువతికి వైద్యం అందించి శుభ్రంగా తీర్చిదిద్దారు. అనంతరం రెండుసార్లు కోవిడ్ టెస్టు చేయగా.. నెగిటివ్ వచ్చింది. యువతికి ఎవరూ లేకపోవడంతో ఆమె స్వచ్ఛంద సంస్థల వారికి అప్పగించే యత్నంలో డాక్టర్ జలజ వెరోనికా ఉన్నారు. అభాగ్యురాలికి అండగా నిలిచిన డాక్టర్ జలజ వెరోనికా, సిబ్బంది, కోవిడ్ ఇన్చార్జి డాక్టర్ మల్లిఖార్జున్ తదితరులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. -
విజయబ్యాంక్ వద్ద çస్పృహ తప్పి పడిన మహిళ
మంత్రాలయం రూరల్: మాధవరం గ్రామానికి చెందిన సుగమ్మ ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బును తెచ్చుకునేందుకు బుధవారం విజయబ్యాంకుకు వెళ్లింది. బ్యాంక్ దగ్గర రద్దీ అధికంగా ఉండటంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో క్యూలో నిల్చున్న సుగమ్మ స్పృహ తప్పి కిందపడిపోయింది. గమనించిన స్థానికులు, ఖాతాదారులు ఆమెపై నీళ్లు చల్లి కూర్చోబెట్టారు. -
పిడుగుపాటుకు ఐదుగురు కూలీలు..
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో పిడుగుపడి ఐదుగురు కూలీలు స్పృహ కోల్పోయారు. ఇసుక ర్యాంప్‌లో పనిచేస్తున్న కూలీలకు పది అడుగుల దూరంలో పిడుగు పడటంతో.. ఐదుగురు కూలీలు స్పృహకోల్పోయారు. ఇది గుర్తించిన గ్రామస్థులు వారిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
డబ్బులడిగితే కత్తితో పొడిచాడు
నెల్లూరు క్రైం: ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... సాదు హరి అనే వ్యక్తిని మాలకొండారెడ్డి దారుణంగా పొడిచాడు. తీవ్రగాయాలపాలైన హరిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. బాధితుడు అపస్మాకర స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.