పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో పిడుగుపడి ఐదుగురు కూలీలు స్పృహ కోల్పోయారు.
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో పిడుగుపడి ఐదుగురు కూలీలు స్పృహ కోల్పోయారు. ఇసుక ర్యాంప్‌లో పనిచేస్తున్న కూలీలకు పది అడుగుల దూరంలో పిడుగు పడటంతో.. ఐదుగురు కూలీలు స్పృహకోల్పోయారు. ఇది గుర్తించిన గ్రామస్థులు వారిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.