thunderbolt
-
పిడుగు ముద్దాడ బోయింది
వానలో తడవాలని పిల్లలకు ఉంటుంది. జల్లుల్లో వాళ్లు కేరింతలు కొడితే ముద్దొస్తారు. మరి పిడుగుకు ముద్దొస్తే? తృటిలో ప్రాణాలు తప్పిపోయాయి. వానలో పిల్లలు జాగ్రత్త.బిహార్‌లోని సీతామర్హిలో ఒకమ్మాయి వానలో టెర్రస్ మీద సరదాగా కేరింతలు కొడుకుతుంటే తల్లి అది ఫోన్లో వీడియో తీయసాగింది. మనం అనుకుంటాం వాతావరణం ఆహ్లాదంగా ఉందని. కాని మెరుపులు, పిడుగులు ఎలా మెరిసి ఉరుముతాయో తెలియదు కదా. ఇక్కడ ఆ అమ్మాయికి కొద్ది దూరంలోనే పిడుగు పడింది. క్షణాల్లో ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది. అమ్మాయి, తల్లి క్షేమమేగాని గురి సూటిగా ఉండి ఉంటే? అందుకే జాగ్రత్త. ఇకపై వానలు... ఉరుములు... పిడుగులు.. -
ఒక్కసారిగా పెద్ద శబ్దం..! పిడుగు రూపంలో మృత్యువు..!!
నారాయణ్‌పేట్: తెల్లవారుజాము నుంచి చిరు జల్లులు.. రెక్కాడితే గాని డొక్కాడని అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన ఐదుగురు ఓ వ్యవసాయ పొలంలో కూలీకి వెళ్లారు.. పనులు చేస్తూ మధ్యాహ్నం కావడంతో అందరు కలిసి భోజనం చేశారు.. ఇంతలో ఉరుములు, మెరుపులతో వర్షం జోరందుకోవడంతో అక్కడే ఉన్న ఓ చెట్టు చెంతన చేరారు.. సరిగ్గా 1.20 గంటలు.. ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం.. అటుఇటు చూసే లోపే ముగ్గురు కుటుంబ పెద్దలను పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. పిడుగుపాటుకు బలైన వారు తెలుగు లక్ష్మణ్ణ (40), వాకిట ఈదన్న (52), తెలుగు పరమేష్ (27). గాయపడిన వారు కొండన్న, శివ. మృతుడు తెలుగు లక్ష్మణ్ణకు భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. మరో మృతుడు ఈదన్నకు భార్య మణెమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. మృతుడు పరమేష్‌కు భార్య జయమ్మ (బంగారమ్మ)తో పాటు కూతురు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఈ కుటుంబాలు ప్రస్తుతం దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మణెమ్మ, జయమ్మ కూలి పనులకెళ్తూ, లక్ష్మి పండ్లు అమ్ముకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆస్పత్రుల ఖర్చులు తడిసిమోపెడు కాగా.. అప్పులతో కాలం వెళ్లదీస్తున్నారు. -
పేద బతుకులు.. పిడుగుకు సమిధలు! ప్రమాదకర జోన్లో ఆ 13 జిల్లాలు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలుగు.. చీకటిని చీల్చి బతుకుపై భరోసానిచ్చే ఓ ఊపిరి! కానీ అదే మిరుమిట్లు గొలుపే వెలుగు నిరుపేదల బతుకును చీకటిలోకి నెడుతోంది. తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఆకాశంలో మేఘాల మధ్య జరిగే ఘర్షణ.. పిడుగుల గర్జనగా కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో నిరుపేద రైతుకూలీల ప్రాణాలు తీస్తోంది. ప్రమాదాన్ని నివారించలేని విపత్తు నిర్వహణ సంస్థల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే అరవై రెండు మంది పిడుగుపాటుతో పంట పొల్లాల్లోనే ప్రాణాలు వదలగా.. గత ఆరేళ్లలో ఏకంగా 398 మంది కన్నుమూశారు. తెలంగాణలో ఏటా సగటున లక్షా యాభైవేల నుండి రెండు లక్షల వరకు పిడుగులు పడుతున్నట్టు అంచనా. రైతులు, కూలీలు పంట పొలాల్లో ఎక్కువ సమయం గడిపే అక్టోబర్‌లోనే ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి. అందులో 90శాతం గ్రామాల్లోనే పడుతుండగా.. మరణిస్తున్న వారిలో నూటికి 96 మంది రైతులు, కూలీలే ఉంటున్నారు. ఊహించని విపత్తుతో మరణించిన మెజారిటీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కనీస ఆర్థిక సహాయం అందడం లేదు. భూమి ఉన్న రైతులు మరణిస్తే రైతు బీమా వర్తిస్తుండగా.. భూమి లేని నిరుపేదలు ఏళ్ల తరబడి సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రమాదకర జోన్లో 13 జిల్లాలు దేశంలో అత్యధికంగా పిడుగులు పడుతున్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. గత ఏడాది అక్కడ 6,55,788 పిడుగులు పడితే.. తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 5,76,498, మహారాష్ట్రలో 5,28,591 పిడుగులు పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన పొరుగున ఉన్న కర్నాటక ఎనిమిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పదకొండో స్థానంలో, తెలంగాణ 1,49,336 పిడుగులతో పద్నాలుగో స్థానంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో చూస్తే.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి, కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట జిల్లాలు అత్యధిక పిడుగు పీడిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. గత ఆరేళ్లలో అత్యధికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 90 మంది పిడుగుపాటుతో చనిపోయారు. వరంగల్ జిల్లాలో 59, ఆదిలాబాద్‌లో 52, మెదక్‌లో 27 మంది చనిపోయారు. పిడుగులు 96 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే పడుతుండగా.. మృతుల్లో 98శాతం రైతులు, కూలీలే. మొత్తంగా గత ఆరేళ్లలో తెలంగాణలో 398 మంది నిరుపేదలు మరణించగా.. మరో 1,220 మంది గాయాలపాలయ్యారు. (చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ) నివారించే అవకాశమున్నా.. పిడుగుపాటు మరణాలను నివారించే అవకాశమున్నా.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పిడుగుపాటు నష్టాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన అరెస్టర్లు, కండక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. పుణె ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అది 20 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే అప్రమత్తం చేస్తుంది. దీనికితోడు ఎర్త్ నెట్వర్క్ అనే అమెరికా సంస్థ సైతం అధునాతన పరికరాలను మార్కెట్లోకి తెచ్చింది. పలు రాష్ట్రాల్లో గ్రామ, మండల యంత్రాంగాలు వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం భారీ నష్టానికి కారణం అవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మెరుగైన పద్ధతులతో పేదల ప్రాణాలు కాపాడుతున్నారు. కోట్ల వోల్టుల శక్తితో పిడుగులు మేఘాల నుంచి ఒక్కసారిగా విడుదలయ్యే ఎలక్ట్రాన్లు 15–30 కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో భూమ్మీదకు దూసుకువచ్చే శక్తినే ‘పిడుగు’ అంటారు. ఒక మేఘం నుంచి మరో మేఘానికి ప్రసారమయ్యే పిడుగుల వల్ల ఆకాశంలో ఎగిరే విమానాలకు ముప్పు ఉంటుంది. మేఘం నుంచి భూమిని తాకే (క్లౌడ్ టు గ్రౌండ్) పిడుగులు మనుషులు, ఇతర జీవజాలానికి ముప్పు కలిగిస్తున్నాయి. పూరి గుడిసెలో బంగారమ్మ.. వనపర్తి జిల్లా బాలకిష్టాపూర్‌లో జూన్ 6, 2017న పడిన పిడుగులు ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములను పొట్టనపెట్టుకున్నాయి. ముళ్ల పొదలు తొలగించే క్రమంలో ఆకాశమంతా ముప్పై సెకన్లపాటు వెలుగును చిమ్ముతూ పడిన పిడుగుతో తెలుగు లక్ష్మన్న (40), ఈదన్న (52), పరమేశ్ (27) ప్రాణాలు వదిలారు. ఊరంతా కన్నీరు పెట్టింది. ఆదుకుంటామంటూ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఆపద్బంధు కింద సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. ఆ ముగ్గురిలో ఈదన్న, లక్ష్మన్న కుటుంబాలకు పాత ఇళ్లయినా ఉండగా.. చివరివాడైన పరమేష్‌కు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన భార్య బంగారమ్మ(24) రోజు కూలీకి వెళ్తూ.. సగం కూలిన గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి విషాద గాధలు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. (చదవండి: రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్) కాలం కాటేసినా.. కదలని యంత్రాంగం అక్టోబర్ 9, 2021లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ పరిధిలోని బుర్కపల్లిలో సోయా చేనులో పనిస్తుండగా పిడుగుపాటుతో గరణ్ సింగ్ (45), ఆయన తమ్ముడి భార్య ఆశాబాయి (30) మరణించారు. విపత్తు పరిహారం కోసం బాధిత కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణ పూర్తయినా ఇంకా పరిహారం అందలేదు. తక్షణ కార్యాచరణ అవసరం జాతీయ స్థాయిలో ప్రధాని చైర్మన్‌గా, నిపుణులు వైస్ చైర్మన్‌గా ఉండే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) తరహాలోనే రాష్ట్రస్థాయిలో సీఎం చైర్మన్‌గా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పనిచేయాలి. మన రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను మర్చిపోయారు. వరద వచ్చాక సహాయక చర్యలు చేస్తున్నారు. అలాంటిది ముందే పిడుగుపాటు నివారణ చర్యలు ఎజెండాలోనే లేకపోవడం దారుణం – మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్డీఎంఏ మాజీ వైస్ చైర్మన్ నివారించదగిన ప్రమాదాలు.. పిడుగు అనేది వంద శాతం నివారించదగ్గ విపత్తు. కానీ తెలంగాణలో పిడుగులతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన అరెస్టర్లు, కండక్టర్లతో పిడుగుపాటు మరణాలను అరికట్టవచ్చు. పిడుగుపాటు సమయాలను ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి చర్యల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో ఆ ప్రయత్నాలేవీ మొదలుకాలేదు. తగిన సలహాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. – కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ, క్లైమైట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, న్యూఢిల్లీ -
దసరా దావత్లో విషాదం: మద్యం తాగుతుండగా పిడుగు పడి ముగ్గురి మృతి
సాక్షి, వరంగల్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దసరా పండుగ సందర్భంగా జఫర్గడ్ మండలం సాగరం శివారులోని గుట్టవద్ద దావత్ చేసుకుంటుండగా పెద్దశబ్దంతో మర్రిచెట్టుపై పడ్డ పిడుగుతో ముగ్గురు మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామానికి చెందిన నేరెల్లి శివ, మరుపట్ల సాంబరాజు, జెట్టబోయిన సాయికృష్ణగా గుర్తించారు. చదవండి: డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లా గార్లలో పిడుగుపాటుకు ఎముల సంపత్ అనే వ్యక్తి మృతి చెందాడు.మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. -
పొలం పనుల్లో దంపతులు.. భార్య కళ్లెదుటే కబళించిన మృత్యువు
అనంతగిరి: దంపతులిద్దరూ పొలంలో కలుపుతీస్తున్నారు.. ఉన్నట్టుండి ఆకాశంలో ఉరుములు.. మెరుపులు.. ఒక్కసారిగా పిడుగుపాటు.. తేరుకునేలోగా భర్త విగతజీవిగా కనిపించాడు. తట్టుకోలేక గుండెలవిసేలా రోదించిన భార్య.. ఈ ఘటన వికారాబాద్ మండలం కొటాలగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొటాలగూడెంలో రాందాస్(45), భార్య రామిబాయిలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనకున్న ఎకరన్నర పొలంలో పత్తి పంట వేయడంతో భార్యతో కలిసి పొలానికి వెళ్లి కలుపుతీసే పనిలో నిమగ్నమయ్యాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చి పిడుగుపడటంతో రాందాసు అక్కడికక్కడే కుప్పకూలాడు. పక్కనే ఉన్న భార్య శబ్దం నుంచే తేరుకునే లోపే భర్తవిగత జీవిలా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యింది. రోదనలు విన్న చుట్టుపక్కలా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రాములు నాయక్ పోలీసులకు ఫోన్ చేయగా ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వామ్మో.. చలిపిడుగు.. పుస్తేల తాడు తెగి ముక్కలయ్యింది..
సాక్షి, సంగెం(వరంగల్): అంత్యక్రియలకు హాజరైన వారిపై చలిపిడుగు పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. తీగరాజుపల్లికి చెందిన కారింగుల ప్రవీణ్‌కుమార్(35) గుండెపోటుతో మరణించగా మంగళవారం అంత్యక్రియల్లో బంధుమిత్రులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ఎస్పారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లిన సమయంలో ఒకసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో అంతా సమీపాన ఉన్న చెట్ల కిందికి పరుగులు తీశారు. రావి చెట్టుపై చలిపిడుగు పడడంతో దాని కింద ఉన్న 25 మంది వరకు అకస్మాత్తుగా కిందపడిపోయారు. వీరిలో కట్య్రాలకు చెందిన చెంగల రేణుక మెడలోని పుస్తేల తాడు తెగి ముక్కలు అయింది. కీర్తి తిరుపతి, మోడెం స్వరూప, రావుల శంకర్ ప్రసాద్, పుట్ట నరేష్, మారబోయిన రాకేష్, పూజారి నరేష్, దామోజోజు రాకేష్, డిష్ స్వామి, బలభద్రుని రమేష్, శ్రీదేవి తది తరులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నరేష్, రాకేష్, స్వరూపను 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. -
చిన్నారులపై పిడుగు
కొత్తూరు: ఓండ్రుజోల గుండె పగిలింది. ఊరంతా ఒక్కటై ఏకధారగా ఏడ్చింది. లోకం తెలీని చిన్నారులను ప్రకృతి బలి తీసుకోవడంతో గ్రామం దుః ఖమయమైంది. గ్రామంలో సోమవారం సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్న అన్నాచెల్లెళ్లపై పిడుగు పడగా.. కొర్రాయి శర్వాన్(11) అనే బాలు డు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లి రూపాశ్రీ స్వల్ప గాయాలతో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొర్రాయి ఈశ్వరరావు అరుణకుమారి దంపతుల పిల్లలు శర్వాన్, రూపాశ్రీలు రోజూలాగానే సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలోనే వాన మొదలైంది. వారు బయటకు వెళ్లిన కాసేపటికే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఈ ధాటికి శర్వాన్(11) మృతి చెందాడు. రూపాశ్రీ కూడా స్పృహ కోల్పోయి పక్కనే చెత్త కాలుస్తున్న అగ్గిమంటలో పడటంతో పలు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన పిల్లలను కొత్తూరు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే శర్వాన్ చనిపోయాడని డ్యూటీ అధికారి ప్రశాంత్ తెలిపారు. చిన్నారి రూపాశ్రీకి సీహెచ్‌సీలో వైద్యం అందించారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిరించారు. వారి రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ సంఘటనతో ఓండ్రుజోలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఈశ్వరరావు రైల్వేలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. -
ఏపీ: ఈ ప్రాంతాలకు పిడుగు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ గురువారం హెచ్చరించారు. దీంతో ఆయా ప్రాంతాకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ హెచ్చారించారు. కాగా పిడుగులు పడే ఆయ జిల్లాల్లోని ప్రాంతాల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. చెట్ల కింద కాని, బయట ఉండకూడదని కమిషనర్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవే.. విశాఖపట్నం: నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, గోలుగొండ, కోయ్యూరు, రావికమతం, మాడుగుల, జి.మాడుగుల, బుచ్చయ్య పేట, చీడికాడ, కశింకోట తూర్పుగోదావరి: తుని, రౌతులపూడి, కోటనందూరు, ప్రత్తిపాడు, వరరామచంద్రపురం, శంకవరం, గంగవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి పశ్చిమగోదావరి: బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం మండలాల పరిసర ప్రాంతాలు రానున్న 24 గంటల్లో అల్ప పీడనం -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
సాక్షి, వరంగల్ : జిల్లాలోని రెండు వేర్వేరు గ్రామాల్లో పిడుగు పడి ఇద్దరు మరణించారు. మృతులు ఆత్మకూరు మండలం, అక్కంపేట గ్రామానికి చెందిన మహిళ పూలమ్మ(40), గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన రైతు దూడయ్య(45)గా అని గ్రామస్తులు తెలిపారు. జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు కూడా పడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పిడుగుపాటు: తెలుగు రాష్ట్రాల్లో విషాదం
సాక్షి, పశ్చిమగోదావరి/జోగులాంబ/కామారెడ్డి: తెలుగు రాష్ట్ర్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం చింతపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు పాస్టర్లు మృతి చెందారు. మృతులను నరసాపురానికి చెందినవారిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. పిట్లం గ్రామ శివారులో జాతీయ రహదారి విస్తరణలో విద్యుత్ స్తంభాల వద్ద పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కామారెడ్డి మండల కేంద్రంలో పిడుగు పాటుకు గురై దేమె రవి(23) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతునికి 9 నెలల కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ రైతుకు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి. గొర్రెలపైకి దూసుకెళ్లిన బస్సు.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపురం గ్రామం దగ్గర పెట్రోల్ బంకు సమీపంలో గద్వాల్ డిపో ఆర్టీసీ బస్సు గొర్రెల పైకి దూసుకెళ్లిడంతో 15 గొర్రెలు మృతిచెందాయి. విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ లో విద్యుత్ కంచె తగిలి విద్యుత్ షాక్ తో ఇద్దరి మృతి చెందారు. మృతుల్లో ఒకరు రైతుకాగా, మరొకరు కూలీగా గుర్తించారు. అడవి పందుల కోసం కంచెకు రైతులు విద్యుత్ అమర్చడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. -
భార్యతో మాట్లాడుతుండగానే..
సాక్షి, ఇచ్ఛాపురం రూరల్: పది రోజుల కిందట కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ తండ్రి ఇక ఆ బిడ్డకు లేడు. భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపిన మనిషి మరి లేరు. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి తోటూరు గ్రామానికి చెందిన దుంప అప్పారావు, లక్ష్మమ్మల మూడో సంతానం దుంప బైరాగి(28) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ పిడుగుపాటుకు గురై శుక్రవారం మృతి చెందారు. బైరాగి ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీ జవాన్‌గా రాజస్థాన్‌లో విధుల్లో చేరి రెండున్నరేళ్ల క్రితం దివ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే తండ్రి మృతి చెందడంతో కుటుంబ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. 25 రోజుల కిందటే స్వగ్రామానికి సెలవుపై వచ్చిన బైరాగి 18 నెలల కుమారుడు యశ్వంత్‌ను క్షణం కూడా వదలకుండా గడిపాడు. పది రోజుల పాటు పిల్లా పాపలతో ఉండి పదిహేను రోజుల క్రితమే రాజస్థాన్ వెళ్లిపోయాడు. శుక్రవారం విధుల్లో ఉండగానే సాయంత్రం నాలుగు గంటల సమయంలో భార్య దివ్యతో వాట్సాప్‌లో మాట్లాడుతుండగా పెద్ద శబ్దం వినిపించి ఫోన్ కట్ అయిపోయింది. ఆ సమయంలోనే పిడుగు పడి బైరాగి మృతి చెందారు. ఈ విషయాన్ని శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామం ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. ఆదివారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని బంధువులు తెలిపారు. -
కుప్పంలో భారీ వర్షం..రైతు మృతి
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని కుప్పంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పిడుగుపాటుకు రైతుతో పాటు రెండు ఎద్దులు మృతి చెందాయి. వివరాలు.. కుప్పం మండలం గుడ్లనాయనపల్లికి చెందిన తిమ్మప్ప(60) పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందగా.. మరో రైతు మనోహర్ తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక జిల్లాలోని వీకోట మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. దీంతో బీన్స్, అరటి పంటలకు భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నాడు ముగ్గురు.. నేడు ఒకరు
భీమారం(చెన్నూర్):రబీలో పండించిన ధాన్యాన్ని వర్షాలనుంచి కాపాడుకోబోయి పిడుగుపాటు గురై పలువురు రైతులు మరణిస్తున్నారు. ఇలా ఏడాదిలో నలుగురు చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో గత మేనెల 13న అదే గ్రామానికి చెందిన జాడి రమేశ్, రాంటెంకి రాజయ్య, ముడిపల్లి రాజం ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాల వద్దకు వెళ్లారు. అదే సమయంలో భారీవర్షం వచ్చింది. పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఏడాది మే నెలలోనే ఇదే మండలం పోలంపల్లిలో కౌలురైతు పోశం కుమారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేందర్ కూడా శుక్రవారం ఉదయం వర్షం రావడంతో ధాన్యం తడవకుండా.. కవర్లు కప్పేందుకు వెళ్లి పిడుగుపాటుతో మరణించారు. ఖరీఫ్‌లో వచ్చిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బంది పడని రైతులు రబీలో ఎండ ఉన్నా.. తేమశాతం పేరుతో ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు అకాలవర్షాలతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సరం ఆరెపల్లిలో కౌలు రైతులు పండించిన ధాన్యం భీమారంలోని కేంద్రానికి తరలించకముందే ముందు జాగ్రత్తగా ఆరబెడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడటంతో ముగ్గురు కౌలు రైతులు అనంత లోకాలకు వెళ్లారు. అప్పట్లో ఆరెపల్లి సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. అప్పటి ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఆరెపల్లిలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చినా.. ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు. ఈ ఏడు కూడా ఆరెపల్లి రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమారం కేంద్రానికి తరలిస్తున్నారు. పోలంపల్లి విషాదం కౌలు రైతు కుమారుడు రాజేందర్ ఉన్నత విద్య అభ్యసించారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఉపాధ్యాయుడి నియామకమయ్యారు. ఈ క్రమంలో సెలువులు రావడంతో తండ్రికి బాసటగా ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో పిడుగు పడి ఇలా అర్థాంతరంగా అనంత లోకానికి పోవడంతో అతని కుటుంబం రోడ్డున పడినట్లయ్యింది. -
విమానంపై పిడుగు!
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానప్రమాదానికి పిడుగుపాటే కారణమని విమాన పైలట్ డెనిస్ యెవ్‌డొకిమొవ్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. తాము బయలుదేరిన కొద్దిసేపటికే సంభవించిన పిడుగుపాటు కారణంగానే తమ విమాన సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయనీ, తాము అత్యవసర నియంత్రణ పద్ధతిలోకి మారినప్పటికీ సమాచారాన్ని సరిగ్గా చేరవేయలేక పోతుండటంతో మాస్కోకు తిరిగొచ్చామని చెప్పారు. అయితే పిడుగు నేరుగా విమానంపైన పడిందా లేదా పక్కన ఎక్కడైనానా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. కూలిపోయిన సమయంలో తమ విమాన ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయనీ, ఈ కారణంగానే మంటలు అంటుకుని ఉండొచ్చని అన్నారు. ఈ ప్రమాదంపై రష్యా ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయగా, అననుకూల వాతావరణం, పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడానికితోడు పైలట్లకు తగినంత అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు వారు చెప్పారు. ప్రమాదంలో 41 మంది చనిపోగా 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మాస్కోలోనే అత్యంత రద్దీ విమానాశ్రయమైన షెరెమెటయెవో ఎయిర్‌పోర్ట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మాస్కో నుంచి ముర్మాన్స్క్కు వెళ్లేందుకు ఏరోఫ్లోట్ విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ 100 విమానం (ఎస్‌యూ–1492) సాయంత్రం 6.02 గంటలకు (రష్యా కాలమానం ప్రకారం) బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులతోపాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో మళ్లీ 6.30 గంటలకు మాస్కోకు తిరిగొచ్చింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నిస్తుండగా రన్ వే పైనే కూలి మంటలు అంటుకున్నాయి. విమానం లోపల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం మొదలైంది. పైలట్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు అత్యవసర మార్గాల ద్వారా బయటపడగా, మరికొంత మంది సకాలంలో బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారు. అధికారులు బ్లాక్ బాక్స్‌లను బయటకు తీసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ప్రకాశం జిల్లలో పిడుగు పాటుకు 50 గొర్రెలు మృతి
-
ఉలిక్కిపడిన నూతనపల్లి
కర్నూలు సీక్యాంప్ : కర్నూలు మండలం నూతనపల్లి ఉలిక్కిపడింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు గ్రామ సమీపంలో పిడుగు పడింది. ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నూతనపల్లికి చెందిన రమణమ్మకు గ్రామ శివారులో పొలం ఉంది. ఇందులో ప్రస్తుతం చౌళకాయల పంట సాగు చేశారు. పంటలో కలుపు తీయడానికి గురువారం రమణమ్మ, ఆమె కోడలు గీత(25), గ్రామానికి చెందిన నూర్జహాన్, చిట్టెమ్మ వెళ్లారు. సాయంత్రం కలుపు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా జోరు వర్షం కురిసింది. దీంతో నలుగురూ సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో వేపచెట్టుపై పిడుగు పడింది. అందరూ స్పృహ కోల్పోయారు. దాదాపు గంట తర్వాత పక్క పొలంలోని వ్యక్తి గమనించి తట్టిలేపే ప్రయత్నం చేశాడు. మాట్లాడలేని స్థితిలో ఉండడంతో కిలోమీటర్ దూరంలోని గ్రామానికి వెళ్లి స్థానికులకు సమాచారమిచ్చాడు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. అప్పటికే గీత మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమణమ్మకు కాలికి, చేతికి, నూర్జహాన్‌కు వీపుపై, చిట్టెమ్మకు కాలికి బలమైన గాయాలయ్యాయి. గీతకు భర్త మహేష్, రెండేళ్లలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగుపాటు బాధితులను పెద్దాసుపత్రిలో వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కర్నూలు తహసీల్దార్ వెంకటేశ్ పరామర్శించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబానికిరూ.20 లక్షల పరిహారమివ్వాలి పిడుగు పడి మృతి చెందిన గీత కుటుంబానికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని బీవై రామయ్య, మురళీకృష్ణ డిమాండ్ చేశారు. పిడుగులు పడే సమాచారాన్ని ప్రజలకు, మరీ ముఖ్యంగా గ్రామీణులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అలాగే పిడుగుపాటుపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బాధితులకు అయ్యే వైద్యఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించాలని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలన్నారు. -
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
నెల్లికుదురు(మహబూబాబాద్): పిడుగుపాటుకు సోమవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. నెల్లికుదురు మండలం బడితండా శివారు సొసైటీతండాకు చెందిన భూక్య రాములు అలియాస్ తుకారాం, భార్య బుజ్జి కలిసి తమ వ్యవసాయ భూమిలో కలుపు తీసేందుకు వెళ్లారు. వారి భూమిలోనే బడితండా శివారు తోడ్యా తండాకు చెందిన గుగులోతు లక్పతి వ్యవసాయ పనులకు వచ్చాడు. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో తుకారాం, బుజ్జి దంపతులతోపాటు లక్పతి పక్కనున్న గుడిసెలోకి వెళ్లారు. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో రైతు తుకారాం, అతడి భార్య బుజ్జితోపాటు లక్పతి స్పృహ కోల్పోయారు. వర్షం తగ్గిన తర్వాత అటుగా వెళ్తున్న వారు ప్రాథమిక చికిత్స నిమిత్తం చిన్ననాగారంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. తుకారాం(38) అప్పటికే మృతిచెందాడు. బుజ్జి, లక్పతిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వర్షం వల్ల మండలంలోని సీతారాంపురం శివారు రేకులతండాకు చెందిన జాటోతు సోమన్న మరో ముగ్గురు తండా వాసులతో కలిసి రెండు మోటార్ సైకిళ్లపై తొర్రూర్‌కు వెళ్లి వెళ్తుండగా వర్షం జోరుగా కురిసింది. మండలంలోని కాచికల్ వద్ద చెట్టుకొమ్మలు విరిగి పడగా గాయాలయ్యాయి. మన్నగూడెంలో మహిళ... డోర్నకల్: మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన దంపతులు బోడ రవి, మంగమ్మ(22) తమ పత్తి పంట వద్ద పనిచేసేందుకు వెళ్లారు. సాయంత్రం వర్షం కురవడంతో రంగమ్మతోపాటు కూలీలందరూ చెట్ల కిందికి వెళ్లారు. వర్షం తగ్గుతున్న క్రమంలో రంగమ్మ పత్తి పంటలో నుంచి రోడ్డుపైకి వస్తుండగా పెద్ద శబ్దంతో ఆమెపై పిడుగు పడింది. దీంతో ఆమె తలకు, చాతికి గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కొద్ది దూరంలోనే ఉన్న భర్త రవి కళ్ల ముందే భార్య చనిపోవడంతో స్పృహ కోల్పోయాడు. ముగ్గురికి గాయాలు నెక్కొండ(నర్సంపేట): వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దీక్షకుంట గ్రామానికి చెందిన దంపతులు కూస రాజు, అనితతోపాటు బానోతు గణేష్ పిడుగు పాటుతో గాయాలపాలయ్యారు. తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా మెరుపుల కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడింది. దీంతో రాజు, అనితకు తీవ్ర గాయాలయ్యాయి. గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం హుటాహుటిన నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు సర్పంచ్ పులి ప్రసాద్ తెలిపారు. -
పిడుగును ఫొటో తీయబోయి వ్యక్తి మృతి
గుమ్మిడిపూండి(తమిళనాడు): వర్షం కురుస్తుండగా పిడుగును సెల్‌ఫోన్‌తో ఫొటో తీయబోయి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చెన్నై తురైపాక్కానికి చెందిన రమేష్(45) బుధవారం గుమ్మిడిపూండి సమీపంలోని సున్నంబుకుళం గ్రామంలో తన స్నేహితుని రొయ్యల చెరువు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దూరంగా పిడుగులు పడుతుండటాన్ని గమనించిన రమేష్ తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోయాడు. దీంతో రమేష్‌కు సమీపంలో పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. -
మోటార్ సైక్లిస్ట్‌పై పిడుగు
సాక్షి, హుకుంపేట : మండలంలోని మారుమూల మత్స్యపురం పంచాయతీ తురకలమెట్ట సమీపంలో బుధవారం సాయంత్రం బైక్‌పై ఒక్కసారిగా పిడుగుపడడంతో మోటార్‌సైక్లిస్ట్ మృతి చెందాడు. సమీపంలో ఉన్న మరో గిరిజనుడికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఉప్ప బైరోడివలస గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు (40) పాడేరులో పనులు పూర్తి చేసుకుని, తురకలమెట్ట గ్రామానికి చెందిన ఉబ్బేటి మహేష్(30)తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. తురకలమెట్ట జంక్షన్లో తన బైక్ వెనుక కూర్చున్న మహేష్‌ను దింపి, వెళుతున్న సమయంలో బైక్‌పై పిడుగుపడింది. ఈ పిడుగు ధాటికి బైక్ నడుపుతున్న సుబ్బారావు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న మహేష్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమీపంలోని గిరిజనులు మహేష్‌ను ఉప్ప ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యసేవలు కల్పిం చారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో రాత్రి పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. మృతుడు సుబ్బారావు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుతో జీవనోపాధి పొందుతున్నాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వీఆర్వో జ్యోతి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పిడుగు పడి ఆవు మృతి పద్మనాభం(భీమిలి) : బి.తాళ్లవలసలో బుధవారం సాయంత్రం పిడుగు పడి ఒక చూడి ఆవు మృతి చెందింది. గెద్ద నాగరాజుకు చెందిన ఆవు కళ్లంలో చెట్టు కింద ఉంది. పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. దీని విలువ రూ. 35వేలు. మరో నెల రోజుల్లో ఈ ఆవు ప్రసవించనుంది. ఇంతలో పిడుగు మృత్యువు రూపంలో ఆవును కబళించకపోవడంతో నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అనకాపల్లిలో విషాదం
సాక్షి, విశాఖపట్నం జిల్లా : అనకాపల్లి మండలం తమ్మయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా హేమంత్(18), పవన్‌కుమార్(18) అనే ఇద్దరు యువకులపై పిడుగుపడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కాశీంకోట మండలం విస్సన్నపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. కుమారులతో మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. హేమంత్, పవన్‌లు క్రికెట్ ఆడుతున్న సమయంలో ఉరుములు, మెరుపులు వస్తుండటంతో దగ్గరలోని చెట్టుకిందకు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా పడటంతో వారు చనిపోయారు. -
నెల్లూరులో వర్షం పిడుగు పాటుకు ఒకరు మృతి
-
ప్రాణాలు తీసిన పిడుగులు
సాక్షి నెట్వర్క్: రోళ్లు పగిలే రోహిణి కార్తెలో పిడుగుల వాన ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు రాష్ట్రంలో 10 మంది మరణించారు. పదుల సంఖ్యలో పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో చిన్నపురెడ్డి శివారెడ్డి (60), అదే మండలంలోని పమిడిపర్రులో అనంత పెద్దబ్బాయి (30) పశువులు మేపుకుంటున్న సమయంలో పిడుగుపడటంతో ఇద్దరూ మృతిచెందారు. 20 గొర్రెలు చనిపోయాయి. పెదకూరపాడు మండలం క్రోసూరు మండలం 88 త్యాళ్లూరు గ్రామంలో కుంభా కోటేశ్వరమ్మ (60), సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో క్రోసూరి అశోక్ (21), ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామానికి చెందిన బొల్లయ్య (27), ఫిరంగిపురం మండలం యర్లగుంట్లపాడుకు చెందిన శివాలశెట్టి ప్రసాద్ (57), నాగార్జున సాగర్ డ్యాం దిగువన కొత్తబ్రిడ్జి సమీపంలో దుగ్యాల అంజయ్య(35) మృతిచెందారు. అనంతపురం జిల్లా అమరా పురం మండలం లోని కె.గొల్లహట్టికి చెందిన తిమ్మక్క(45) పిడుగుపాటుకు మృతి చెందింది. ప్రకాశం, తూర్పు జిల్లాల్లో ఇద్దరి మృతి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో పిడుగుపడి గొర్రెల కాపరి దారం పెద్దబ్బాయి (29) మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. 20 గొర్రెలు మృతిచెందాయి. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వాకాడకు చెందిన రైతు దూడల సత్యనారాయణ (55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం కూకటి గొల్లపల్లెలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం మినుములూరు పంచాయతీ సంగోడి గ్రామంలో పశువుల మందపై పిడుగుపడడంతో తొమ్మిది ఎద్దులు మృతి చెందాయి. వానలొస్తున్నాయ్! సాక్షి, విశాఖపట్నం: మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోందని, దాని ఫలితంగా జూన్ 3 నుంచి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వెంటనే ప్రవేశించే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. -
తాపం తగ్గించకుంటే శాపమే!
సమకాలీనం కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషులవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహిత్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరాకరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. పిడుగుపాటుకు మను షులు చనిపోతారని విన్నాం కానీ, ఇంత మందా? ఒకేరోజు 13 మంది! ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు నెలల్లో 62 మంది పిడుగుపాటుకు గురై చనిపోగా, ఉత్తర కోస్తాలోనే 37 మంది మరణిం చారు. పొరుగున ఉన్న ఒడిశాలో కిందటేడు 36 గంటల వ్యవధిలో 34 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఏపీలో పదమూడు గంటల వ్యవధిలో 36,749 పిడుగుపాట్లు చోటుచేసుకున్నాయి. (కొన్ని భూమివైపొచ్చి పిడుగులయ్యాయి, మరికొన్ని మేఘాల మధ్యే మెరుపులుగా ముగిసాయి). ఇదంతా ఏమిటి? అంటే, నిపుణులు కూడా ‘ఏమో...! ఇదైతే అసాధారణమే!!’ అంటున్నారు. కొందరు శాస్త్రవేత్తలు భూతాపం పెరగటం వల్ల వచ్చిన ‘వాతావరణ మార్పుల (క్లైమెట్ చేంజ్) కారణంగానే’ అంటే... చాలా మంది నమ్మట్లేదు. ‘ఆ.. మీరు అన్నిటికీ వాతావరణ మార్పు కారణం అంటారులే’ అన్నట్టు ఓ అపనమ్మకపు చూపు చూస్తున్నారు. గత రెండేళ్లుగా పెచ్చు మీరిన వడదెబ్బ చావులయినా, అకాలవర్షాలు–వరదలతో ముప్పైనా, ఇప్పుడీ పిడుగుపాటు మరణాలయినా, ఉత్తరాదిని హడలెత్తిస్తున్న ఇసుక తుపాన్లు–వేడిగాలి దుమార మైనా..... అంత తీవ్రత చూపడానికి వాతావరణ మార్పే కారణం అని పర్యావరణ వేత్తలు వెల్లడిస్తు న్నారు. పారిస్ సదస్సులో ప్రపంచ దేశాలు ఆందో ళన చెందినట్టు, భూతాపోన్నతి వల్ల ప్రమాదం ముంచుకొస్తుందనే విషయాన్ని అందరూ అంగీ కరించినా, ఇంత త్వరగా ఈ ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అందుకే, చాలామంది దాన్నంత తీవ్రంగా పరిగణించలేదు. భవిష్యత్ పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయనే ధ్యాస కూడా లేదు. రాబోయే పెనుప్రమాదాలకి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ స్పష్టమైన సంకేతాలే! ‘వాతావరణ మార్పు’ అన్నది కేవలం పర్యావరణానికే పరిమిత మైన అంశం కాదు. అనేకాంశాల సంకలనం! మార్పు లకు వేర్వేరు కారకాలున్నట్టే, ప్రభావం వల్ల పుట్టే విపరిణామాలకూ వైవిధ్యపు పార్శా్వలున్నాయి. ప్రభుత్వ విధానాలు, మనుషుల సంస్కృతి, ఆహా రపు అలవాట్లు, జీవనశైలి, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం, ఎల్లలెరుగని స్వార్థం–సౌఖ్యం... ఇవన్నీ కారకాలు– ప్రభావితాలు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కొంతయితే, మానవ తప్పిదాలు పెచ్చుమీరి ప్రమా దస్థాయిని ఎన్నోరెట్లు పెంచుతున్నాయి. వాటిని నియంత్రించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. స్వచ్ఛంద సంస్థలకు తగు చొరవ–ప్రాతినిధ్యం కరువైంది. పౌరులు పూనికవహించడం లేదు. వెరసి సమస్య జటిలమౌతోంది. తీవ్రత గుర్తించి అప్రమత్త మయ్యేలోపే పరిస్థితులు చేయి దాటుతున్నాయి. తెలివితో ఉంటే మంచిది వాతావరణ మార్పు, మెళ్లో పెద్ద బోర్డు తగిలించు కొని వచ్చే భౌతికాకారం కాదు. ఈ రోజు (గురు వారం) హైదరాబాద్‌లో కురిసిన వర్షాన్నే తీసు కోండి. మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్మలాకాశం, నగరమంతా చిట్టుమని కాసిన ఎండ. అరగంటలోనే ఏమైందో అన్నట్టు ఉరుకులు పరుగులతో కమ్ము కొచ్చిన మబ్బులు. ఆకాశమంతా నల్ల టార్పాలిన్ కప్పేసినట్టు, నిమిషాల్లో కుండపోతగా వర్షం. రోడ్లన్నీ జలమయం! ఇదీ క్యుములోనింబస్ మేఘాల దెబ్బ. ‘సాధారణాన్ని మించిన ఉష్ణోగ్ర తలు నమోదయినపుడు ఇది జరుగుతూ ఉంటుం ద’ని నిపుణులు చెబుతున్నారు. వాటి రాకను, ఆ మేఘాల ద్వారా వచ్చే వర్షపాతాన్ని, సగటును అంచనా వేయడం కూడా కష్టం. ఇవే మెరుపులు, ఉరుములు తద్వారా పిడుగుల్ని కురిపిస్తాయి. భూతా పోన్నతి ప్రత్యక్ష ప్రభావమే ఈ పిడుగుపాట్లు! మన దేశంలో పిడుగుపాటు మరణాల పరిస్థితి దారుణం. జాతీయ నేర నమోదు బృందం (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గత దశాబ్ది, ఏటా సగటున 2000 మంది పిడుగుపాటుతో మరణించారు. తుపాన్లు, వరదలు, వడదెబ్బ, భూకంపాలు... ఇలా ఏ ఇతర ప్రకృతి వైపరీత్యపు మరణాలతో పోల్చినా పిడుగుపాటు మరణాలే ఎక్కువ. గత మూడేళ్లతో పోల్చి చూసినా ఈ సంవత్సరం పరిస్థితి అసాధారణంగా ఉందని వాతావరణ అధికారులే చెబుతున్నారు. ఏ అభివృద్ధి చెందిన సమాజంలో నైనా ఈ మరణాల రేటు తగ్గుతుందే కాని పెరగదు. అమెరికాలో, పిడుగుపాటు మరణాల్ని కచ్చితంగా లెక్కించడం మొదలైన ఈ 75 ఏళ్లలో అతి తక్కువ మరణాలు, కేవలం 16 గత సంవత్సరం నమోద య్యాయి. 2013లో నమోదయిన 23 మరణాల సంఖ్య మీద ఇది రికార్డు! ప్రతి పది లక్షల మంది జనాభాకు పిడుగుపాటు మృతుల నిష్పత్తి అమె రికాలో సగటున 0.3 అయితే, ఐరో పాలో 0.2 గా నమోదవుతోంది. భారత్‌లో ఇది 2గాను, జింబా బ్వేలో 20 గాను, మాలవిలో 84 గాను ఉంది. పిడుగుపాటు మరణాలు అమెరికాలో తగ్గటానికి కారణాలేమిటి? అని ఓ అధ్యయనం జరిగింది. ప్రజల్లో అవగాహన పెరగటం, పిడుగు నిరోధక నిర్మాణాలు, సకాలంలో వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మనుషుల సంఖ్య తగ్గడం ప్రధాన కారణాలుగా తేలింది. ఆ తెలివిడి మనకూ ఉండాలి. వేడి తగ్గించుకుంటే, చెట్లు సమృ ద్ధిగా ఉంటే పిడుగులు మనుషుల జోలికీ, ఏ ఇతర జీవుల జోలికీ రావు. ఒత్తిడి పెంచుతున్నాం! భూపర్యావరణంలో ఉష్ణోగ్రత అసాధారణమైనపుడు మేఘాలపై ఒత్తిడి పెరిగి పైకి, పైపైకి అతి శీతలంవైపు వడివడిగా సాగుతాయి. ఫలితంగా మేఘాల్లో అంతర్గతంగా ఆ తాడనంలో పుట్టే మెరుపు నిజానికొక విద్యుత్ విడుదల! అత్యధిక సందర్భాల్లో ఇది మేఘాల మధ్యే జరిగి మనకొక మెరుపులా కన బడుతుందంతే! కానీ, తీవ్రంగా ఉన్నపుడు అట్టడు గున ఉండే మేఘ వరుసవైపునకు వస్తూ రుణావేశం (నెగెటివ్ చార్జ్)గా పనిచేస్తుంది. వర్షపు మేఘం– భూమి మధ్య అసమతౌల్యతను సవరించే క్రమంలో ఈ రుణావేశం, కిందికి పయనించి... భూమిపైని ధనావేశం (పాజిటివ్ చార్జ్)తో కరెంట్‌గా కలిసి పిడు గవుతుంది. ఇది సాధారణంగా మనిషిని యాంటెన్నా చేసుకోదు. భూమ్మీద టవర్లనో, ఎల్తైన నిర్మాణాలనో, చెట్లనో, కడకు భూమినో వాహకంగా ఎంచుకుం టుంది. అందుకే చెట్ల కింద, రక్షణ లేని టవర్ల వద్ద, ఇంటి బాల్కనీల్లో, ఆరు బయట నిలబడొద్దంటారు. పరంపరగా మెరుపులొస్తున్నపుడు సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్ మాట్లాడొద్దంటారు. భూమితో ‘ఎర్తింగ్’ అయ్యేలా ఉండొద్దంటారు. మేఘాల్లో పుట్టే ఈ నెగెటివ్ చార్ఎ్జ సగటున గంటకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో భూమివైపు వస్తుంటుంది. గాలి బలహీన వాహకం అవడం వల్ల మెరుపు పుట్టినపుడు ఉద్భవించే ఉష్ణం ఆ గాలిని అత్యంత వేగంగా వ్యాపింప/కంపింప చేయడం వల్లే ఆకాశంలో పెద్ద శబ్దాలతో ఉరుములు పుడతాయి. ఈ మెరుపు ఓ బలహీన వాహకం (గాలి)లో పుట్టించే ఉష్ణం (53,540 డిగ్రీల ఫారెన్హైట్) సూర్యుని ఉపరితల ఉష్ణం(10,340 డిగ్రీల ఫారెన్హైట్) కన్నా అయిదు రెట్లు అధికం! అందుకే, ఈ కరెంటు ఒక చెట్టులోకి వ్యాపించినపుడు పుట్టే ఉష్ణం ఆ చెట్టులో ఉండే మొత్తం తేమను లాగి మోడు చేస్తుంది. పిడుగు స్థాయిని బట్టి కొన్నిసార్లు బతికి, మనుషులు ఏదో రకమైన వైకల్యానికి గురవుతారు. ఇక మన తెలుగు భూభాగంపై ఈసారి పిడుగుల తాకిడి పెరగటానికి ఓ కారణాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చే శీతల మేఘాలు, ఉత్తర భారతం నుంచి వేడిగాలులు కలవడంతో కరెంట్ వల్ల 124 మైళ్ల మేర మేఘాచ్ఛాదనం ఏర్పడిందని, అదే ఇందుకు కారణమై ఉండవచ్చని ఓ అభి ప్రాయం. నియంత్రిస్తేనే మనుగడ తెలిసి తెలిసీ... మనం మన దైనందిన చర్యల ద్వారా భూతాపోన్నతికి కారణమౌతున్నాం. పారిస్ ఒప్పం దంలో భాగంగా పెద్ద హామీలిచ్చి వచ్చాక కూడా మన ప్రభుత్వ విధానాలు మారలేదు. వివిధ సంస్థల నిర్వాకాలు, కార్పొరేట్ల కార్యకలాపాలు, వ్యక్తుల ప్రవర్తన, జీవనశైలి... దేనిలోనూ మార్పు రాలేదు. శిలాజ ఇంధన వినియోగం తగ్గలేదు. జలరవాణా ఊసే లేదు! ఆశించిన స్థాయిలో థర్మల్ విద్యుదు త్పత్తి తగ్గలేదు. పైగా భూగర్భ గనుల కన్నా ఉప రితల గని తవ్వకాల్నే ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. బొగ్గుతో విద్యుదుత్పత్తిలో ‘సూపర్ క్రిటికల్’ వంటి ఆధునిక సాంకేతికతకు మారకుండా, పాత ‘సబ్–క్రిటికల్’ పద్ధతిలోనే సాగి స్తున్నాం. కార్బన్‌డయాక్సైడ్‌ను విరివిగా విడుదల చేయడమే కాక జలాన్ని విస్తారంగా దుర్వినియో గపరుస్తున్నాం. సౌర–పవన విద్యుత్తు వాటా పెద్దగా పెరగలే! ఇకపై ప్రతి కొత్త వాహనం విద్యుత్ బ్యాటరీతో నడిచేదే రావాలన్న మాట గాలికి పోయింది. అడవుల విస్తీర్ణ శాతం పెంచాలన్నది ఉట్టి మాటయింది. పైగా, 1988 జాతీయ అటవీ విధా నానికి తూట్లు పొడుస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తాజా ముసాయిదా ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం వారి ముందుంది. దీన్ని నిశి తంగా ఖండిస్తూ ప్రజలు, పౌరసంఘాలు చేతన పొంది కేంద్ర ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి తెస్తాయో చూడాలి! చేయీ చేయీ కలిపితేనే.... కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషు లవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహి త్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరా కరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. ఉన్నొక్క సజీవ గ్రహాన్ని కాపాడుకుందాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల పిడుగుపాటు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవిస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పిడుగులు పడుతున్నాయి. దీంతో జననష్టంతోపాటు మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. చాలాచోట్ల ఆస్తినష్టం సంభవిస్తుంది. గత పక్షం రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పిడుగుపాటుపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. సామాజిక మాధ్యమాలతో పాటు వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా క్షేత్రస్థాయిలో చైతన్యం కల్పిస్తోంది. పిడుగుపాటు పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో వివరించింది. జాగ్రత్తలివే.. టీవీ, రేడియో ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకుని స్థానిక హెచ్చరికలను పాటించాలి. తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. తప్పని పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్యకు తలను వంచి రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలి. గోడలు, తలుపులు, కిటికీలకు దూరంగా నిల్చోవాలి. ఎండిన చెట్లు, విరిగిన కొమ్మలకు దూరంగా ఉండాలి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులోనే ఉండాలి. పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పిడుగుపాటుకు గురైతే బాధితులకు ప్రథమ చికిత్స అందించాలి. వెంటనే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి. చేయకూడని పనులు: పిడుగులు పడే సమయంలో ఆరుబయట ప్రదేశాల్లో ఉండకూడదు. ఆశ్రయం కోసం చెట్ల కిందకు వెళ్లకూడదు. నీటిలో ఉండకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చే నీటిని తాకవద్దు. సెల్ఫోన్లు ఉపయోగించవద్దు. రేకుల షెడ్ల కింద, వరండాల్లో ఉండకూడదు. ఉరుములు, మెరుపుల తర్వాత 30 నిమిషాల వరకు బయటకు వెళ్లొద్దు. ఎలక్ట్రిక్ ఉపకరణాలు, వ్యవసాయ పంపు సెట్లను ఉపయోగించవద్దు. ట్రాక్టర్, మోటార్ సైకిళ్లను ఆరుబయట నిలిపి ఉంచకూడదు. -
జబాగుడలో పిడుగుపడి యువకుడి మృతి
జయపురం : నవరంగ్‌పూర్ జిల్లా డాబుగాం సమితిలోని జబాగుడ గ్రామంలో పిడుగు పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆ గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. ఇంటికి పెద్ద కొడుకు అకస్మాత్తుగా పిడుగు పడి కళ్ల ముందే మరణించడంతో తల్లి దండ్రులు భోరున విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మోహన హరిజన్ పెద్ద కుమారుడు కృష్ణ హరిజన్(22) ఉదయం లేచి ఇంటి ముందు వరండాలో పళ్లు తోముకుంటున్నాడు. ఆ సమయంంలో అకస్మాత్తుగా పెనుగాలులు వీస్తూ పిడుగులు పడ్డాయి. ఒక పిడుగు కృష్ణ హరిజన్‌పై పడడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. ఇంటిలో ఉన్న వారు ఆ దృశ్యాన్ని చూసి విలçపిస్తూ వెంటనే డాబుగాం హాస్పిటల్‌కు ఫోన్ చేసి 108 అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. కృష్ణ హరిజన్‌ను పరీక్షించిన వైద్యుడు అప్పటికే చనిపోయాడని ప్రకటించారు. ఈ విషయం డాబుగాం పోలీసులకు తెలియడంతో సబ్ఇన్స్పెక్టర్ మహమ్మద్ స్వరాజ్, ఏఎస్సై రేణు ప్రధాన్‌లు సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు. సంఘటనపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేశారు. కృష్ణ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. చేతికంది వచ్చిన పెద్ద కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో తండ్రి మోహన హరిజన్ కుమారుడి మృతదేహంపై పడి రోదించడం చూపరుల హృదయాలను కలిచివేసింది. -
పిడుగు నుంచి కాపాడిన యాప్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పడుతున్న పిడుగుల కారణంగా 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఒక్క రోజే ఏపీలో 41,025 పిడుగులు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. మిన్ను విరిగి మనమీదే పడ్డట్టుగా ఉరుములు.. పిడుగులు.. భయానక వాతావరణాన్ని సృష్టించినప్పటికి మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఓ మొబైల్ యాప్ కారణం అంటున్నారు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఇస్రో అధికారుల సహాయంతో లైటెనింగ్ ట్రాకర్ సిస్టమ్ యాప్‌ని రూపొందించారు. విద్యుదయస్కాంత తరంగాలను విశ్లేషించడం ద్వారా ఉరుములు, పిడుగులు ఏ ప్రాంతాల్లో పడతాయో ముందే గుర్తించగలుగుతారు. ఎవరైతే ఈ యాప్‌ని వినియోగిస్తున్నారో వారికి 45 నిమిషాల ముందుగానే సరిగా ఏ ప్రాంతంలో పిడుగులు పడుతాయో సమాచారం అందుతుంది. వాతావరణ నిపుణుడు కెటీ కృష్ణ మాట్లాడుతూ.. కేవలం లైటింగ్ ట్రాకింగ్ యాప్ సహాయంతో చాలా మంది ప్రాణాలు రక్షించగలిగామని తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తరపున 20.14 లక్షల మంది మొబైల్ వినియోగదారులకి ఊరుములు, పిడుగులకు సంబంధించిన ముందస్తు సమాచారం అందజేశామని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ సాఫ్ట్‌వేర్‌ని(వజ్రపథ్) వినియోగించామన్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని దీనిని ఇతర మొబైల్ సర్వీస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
తీరంలో అలకలం..!
పిఠాపురం : పిఠాపురం సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో కడలి కెరటాలు ఉగ్రరూపం దాల్చాయి. ఎగసిపడుతున్న కెరటాల తాకిడికి తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. తీరప్రాంత వెంబడి రక్షణగా నిర్మించిన రక్షణ గోడ తునాతునకలవుతోంది. మంగళవారం ఉదయం నుంచి సముద్రం వెనక్కి వెళ్లిపోగా సాయంత్రానికి ఒక్కసారిగా సుమారు 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకుని వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో అలల ఉధృతి మరింత పెరిగింది. తీరప్రాంతం వెంబడి ఉప్పాడ నుంచి కాకినాడ శివారు వాకలపూడి వరకు ఉన్న బీచ్‌రోడ్డు తీవ్ర కోతకు గురవుతోంది. బుధవారం ఉదయానికి రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యే సూచçనలు కనిపిస్తున్నాయి. తీరప్రాంతంలో లంగరు వేసిన బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. పిడుగు హెచ్చరికలు భారీ వర్షంతోపాటు జిల్లాలో పిడుగులు పడే అవకాశాలున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో మారేడుమిల్లి, పిఠాపురం, ఉప్పాడ, ప్రత్తిపాడు, శంఖవరం, రామచంద్రాపురం, కాకినాడ, రౌతులపూడి తదితర మండలాల పరిధిలో మంగళవారం పిడుగులు పడే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. టోర్నడోను తలపించిన ఈదురు గాలులు కాకినాడ రూరల్: సముద్ర తీరం వెంబడి వీచిన బలమైన ఈదురుగాలులు మంగళవారం సాయంత్రం సూర్యారావుపేట వాసులను భయకంపితులను చేశాయి. టోర్నడో తరహాలో ఆకస్మాత్తుగా వీచిన బలమైన గాలులతో ఈ ప్రాంతంలోని పూరిళ్లు, తోపుడు, మిక్చర్బళ్లు, చిన్న, చిన్న నావలు ఎగిరి పడ్డాయి. మత్స్యకారులు, ఇతర పర్యాటకులు పరుగులు తీసినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పూరిపాకలు సైతం గాలిలో ఎగిరిపడ్డాయి. ఏ జరుగుతుందో అర్థం కాక మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి అంతా మేల్కొని ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు అక్కడి పెద్దలు తెలిపారు. -
వరంగల్ అర్భన్: పిడుగుపడి మహిళ మృతి
-
నేడు ఉరుములతో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గురువారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత 24 గంటల్లో మాగ్నూరులో అధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 8 సెంటీమీటర్లు, లక్సెట్టిపేటలో 7, మక్తల్, సంగారెడ్డిలలో 5, ధర్మపురి, నారాయణఖేడ్, పెద్దేముల్, ధర్పల్లి, హుజూరా బాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో పిడుగు పాటుకు గురై ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. జిల్లాలోని డోంగ్రి గ్రామానికి చెందిన చంద్రపాల్ సింగ్ కన్వార్(47), బుధ్వార్ సింగ్ కన్వర్(50), సుమిత్రా బాయి(55) అనే ముగ్గురు రైతు కూలీలు పొలం పనులు చేస్తుండగా.. భారీ వర్షం పడుతుండటంతో వారంతా సమీపంలో ఉన్న నూతన భవనంలోకి పరుగులు తీశారు. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఆ భవనంపై పిడుగు పడటంతో ముగ్గురు మృతిచెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. -
కోళ్లమేత వేద్దామని వెళ్లి కానరాని లోకాలకు..
పశ్చిమగోదావరి, పోడూరు: కోళ్లకు మేత వేద్దామని వెళ్లిన వ్యక్తి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పెనుమదం శివారు తెలు గుపాలెంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో అదే ప్రాంతానికి చెందిన కవురు నాగరాజు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు కుటుంబసభ్యులతో కలిసి గ్రా మంలోని ఓ తాటాకింట్లో నివాసముంటున్నాడు. ఇటీవల ఈ ఇల్లు పాడవడంతో సమీపంలోని మరో ఇంట్లోకి మారాడు. పాత ఇంటి వద్ద కోళ్లు మేపుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జోరుగా వర్షం కురుస్తుండగా కోళ్లకు మేత వేసేందుకు పాత ఇంటికి వెళ్లాడు. ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు కింద నిలబడి ఉండగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. భారీ శబ్దంతో పిడుగు పడటంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన కొబ్బరిచెట్టు మా ను సగభాగం నుంచి కిందకు నాలుగు అంగుళాల లోతున చీరుకుపోయింది. ఇప్పుడే వస్తానని వెళ్లి.. నాగరాజు కోళ్లకు మేత వేయడానికి వెళ్లే ముందు అదే ప్రాంతంలో ఉంటున్న తల్లి నాగరత్నం ఇంటికి వెళ్లాడు. నాగరాజు బయటకు వెళుతుండగా టీ తాగి వెళుదువు.. కొద్దిసేపు ఆగమని తల్లి చెప్పినా వినకుండా ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లాడు. తనమాట విని ఆగిఉంటే ప్రమా దం తప్పేదని తల్లి నాగరత్నం బోరుమంది. విషాదఛాయలు ఊహించని రీతిలో పిడుగుపాటుకు నాగరాజు బలికావడంతో తెలుగుపాలెంలో విషాదం నెలకొంది. నాగరాజుది పేద కుటుంబం. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మి, 11, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతదేహం వద్ద భార్య, తల్లి, కుమార్తెల రోదనలు మిన్నంటాయి. తహసీల్దార్ కె.శ్రీరమ ణి, ఎస్సై కె.రామకృష్ణ సంఘటనా స్థలా నికి వచ్చి నాగరాజు మృతి చెందిన తీ రును పరిశీలించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహానికి పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తప్పిన పెనుప్రమాదం తెలుగుపాలెంలో రామాలయం వద్ద ఇటీవల దేవీ నవరాత్రుల వేడుకలు ముగిశాయి. మృతుడు నాగరాజు పాత ఇల్లు రామాలయం ఎదురుగానే ఉంది. బుధవారం ఉదయం ఇక్కడ టెంట్లు, కుర్చీలు, బల్లలు తొలగిస్తున్నారు. పిడుగుపడిన కొబ్బరిచెట్టు కిందే కొన్ని బల్లలు ఉన్నాయి. అయితే పిడుగు పడటానికి కొద్ది నిమిషాల ముందే ఆరుగురు కూలీలు అక్కడున్న బల్లలను, కుర్చీలను వ్యానులో ఎక్కించి తరలించారు. కూలీలు అక్కడే ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురిసాయి. అనేకచోట్ల చెరువులకు జలకళ వచ్చింది. పలుచోట్ల గండ్లు పడ్డాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.. పంటలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. అక్కడక్కడ భారీ వృక్షాలు నేలకూలాయి. కర్నూలు జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలోని కుందూ నదిలో ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతయ్యారు. పిడుగుపాట్లకు పలుచోట్ల గేదెలు మృత్యువాతపడ్డాయి. కర్నూలు జిల్లాలో.. కర్నూలు జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన ముగ్గురు వ్యవసాయ కూలీలు సోమవారం కుందూ నదిలో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 12మంది కూలీలు రేవుకు అవతలనున్న వరిచేనులో కలుపు తీసి తిరిగొస్తున్న క్రమంలో కుందూ వంతెన వద్ద నదిని దాటుతుండగా అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి తొమ్మిది మందిని ఒడ్డుకు చేర్చారు. ముగ్గురు గల్లంతయ్యారు. జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి, జేసీ ప్రసన్న వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసాయి. సరాసరిన 21.8మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోనూ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాన.. సోమవారం ఉదయం వరకూ ఏకధాటిగా కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. జిల్లా వ్యాప్తంగా 34.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడలో కుండపోత.. కుండపోత వర్షానికి నగరం జలమయం అయింది. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నగరంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు, శివారు ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. -
ప్రకాశం జిల్లాలో పిడుగుల వర్షం
సాక్షి, బల్లికురవ : పిడుగుపాటును ముందే కనిపెట్టి హెచ్చరిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో పిడుగుపాటు మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొప్పరపాలెంలో ఆదివారం పిడుగుపాటుకు రాజు(24) అనే యువకుడు దుర్మణం చెందాడు. గొర్రెలు కాసేందుకు వెళ్లిన రాజుపై పిడుగు పడటంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి మోసుకెళ్లగా తీసుకెళ్లగా, అప్పటికే రాజు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యుడు గుర్తించారు. పిడుగు ధాటికి మృతుడి శరీరం పూర్తిగా కమిలిపోయి గుర్తుపట్టనిస్థితికి చేరింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం భయంకరంగా మారిందని, చుట్టుపక్కల కనీసం 8 పిడుగులు పడిఉంటాయని గ్రామస్తులు తెలిపారు. అందని ‘ఆధునిక’ సాయం : గడిచిన వారం రోజులుగా కర్నూలు, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పిడుగుపాటు మరణాలు సంభవించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుపాటును ముందే గుర్తించి, ప్రాణనష్టాన్ని నివారిస్తామని ఇటీవల చంద్రబాబు సర్కారు ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం ప్రజలకు ‘ఆధునిక సాయం’ అందడం లేదు. ఇస్రో సాయంతో పిడుగు ఏ ప్రాంతంలో పడనుందో 40 నిమిషాల ముందే ప్రజలను హెచ్చరించేందుకు ‘వజ్రపథ్’ అనే యాప్‌ను రూపొందించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పిడుగు హెచ్చరికలు జారీచేస్తోన్న ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ.. వాటిని అనుసరించి ప్రజలు ఏం చేయాలన్నదానిపై మాత్రం దృష్టిసారించలేదు. అత్యవసర పనుల నిమిత్తం పొలాలకు వెళ్లిన రైతులకు పిడుగుపాటు హెచ్చరిక జారీ అయిందన్న సమాచారం తెలియడంలేదు. -
ఆనందం ఆవిరి..!
మహబూబ్‌నగర్ ,ఖిల్లాఘనపురం (వనపర్తి) : తమ కుటుంబం బాగుండాలని.. వేసిన పం టల దిగుబడి మంచిగా రావాలని.. బంధుమిత్రులతో కలిసి దర్గా దగ్గర కం దూరు చేసేందుకు వెళ్లారు.. బంధువుల పిలుపు మేరకు అక్కడికి వచ్చిన బంధువులు, దర్గాను పూజించేందుకు తండ్రి వెంట వచ్చిన ఓ చిన్నారి బాలుడిపై ప్రకృతి కన్నెర్రజేసింది. ముసురు వర్షంతోపాటు పిడుగుపడి అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందడంతోపాటు మ రో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిం ది. ఈ సంఘటన ఖిల్లాఘనపురం మం డలం మానాజీపేటలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పొలం దగ్గరికి వెళ్లి.. మానాజీపేట గ్రామానికి చెందిన పాల్కొండ నాగమ్మ బుధవారం తన వ్యవసాయ భూమిలో ఉన్న దర్గా దగ్గర కందూరు చేసింది. ఇందుకు గాను తన ఇంటి చుట్టు పక్కల వారితోపాటు పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామానికి చెందిన రాములు(నాగమ్మ అల్లుడు)ను పిలిచింది. అందరూ కలిసి ఆనందంగా పొలం దగ్గరకు వెళ్లారు. దర్గాను శుభ్రపరిచి.. పొట్టేలును కోసి వంటలు చేశారు. దర్గాకు పాతేహాలు (నైవేద్యం అర్పించడం) ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. పాతేహాలు ఇచ్చేందుకు ముస్లిం వ్యక్తి ఖాజామియా తన ఎనిమిదేళ్ల కుమారుడు సోహెల్‌తో కలిసి అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి పరామర్శ.. ఖిల్లాఘనపురం మండలంలోని మానా జీపేటలో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగార్ ప్రభాకర్‌రెడ్డి వేర్వేరుగా తన సహచరులతో గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని భరోసా కల్పించారు. -
ఏడుగురిని బలిగొన్న పిడుగులు
ఖిల్లాఘనపురం/చింతలపాలెం/కుల్కచర్ల/ఐనవోలు: ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్రజేసింది.. బుధవారం వేర్వేరుచోట్ల పనుల్లో ఉన్న జనంపై పిడుగులు పడటంతో ఏడుగురు మృతి చెందారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటలో ఓ వేడుకలో పాల్గొనే పాల్గొనేందుకు వచ్చిన పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామానికి చెందిన రాములు(55), మాజీ సైనికుడు కృష్ణయ్య(56), సోహెల్(8) దర్గా సమీపంలోని వేపచెట్టు కిందకు చేరుకున్నారు. ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ వేప చెట్టుపై పిడుగు పడగా అందరూ స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటికి షాక్ నుంచి తేరుకున్న కొందరు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిస్థితి విషమంగా ఉన్న వారిని ట్రాక్టర్లో గ్రామానికి తీసుకు వెళ్లారు. 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి కృష్ణయ్య(56), రాములు(55), సోహెల్(8) మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురానికి చెందిన అనసూర్యమ్మ (52), వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అడవివెంకటాపూర్ అనుబంధ బజ్యానాయక్ తండాకు చెందిన నరేశ్ (22), వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గడ్డం రాజేశ్ (26), బొల్లెపెల్లి నరేశ్ (26)లు పడుగుపాటుకు మృతి మృతి చెందారు. -
చిత్తూరులో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
-
నీటిలో పిడుగు పడితే..
-
కాళేశ్వరం రాజగోపురంపై పిడుగు
పాక్షికంగా దెబ్బతిన్న శిఖర భాగం కాళేశ్వరం(మంథని): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రిలింగ క్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ రాజగోపురంపై మంగళవారం పిడుగు పడింది. దీంతో ప్రధాన గోపుర శిఖరం రెండు వైపులా పాక్షికంగా ధ్వంసమైంది. మంగళవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో పిడుగు పడడంతో గోపురం రెండు వైపులా సింహం విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గోపురం కింది భాగంలోని ఒక గదిలో ఉన్న ఆలయ విద్యుత్ మీటర్‌తో పాటు బోర్ మోటార్ స్టార్టర్ బోర్డులు కాలిపోయాయి. భక్తులు దగ్గరగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో భక్తులు పరుగులు తీశారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ఆలయానికి అమర్చిన సీసీ కెమెరాలు సైతం కాలిపోయినట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. ప్రధాన రాజగోపురంపై పిడుగు పడడంతో భక్తులు అపశృతిగా భావిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో శ్రీనివాస్ ఈ విషయంపై మాట్లాడుతూ జరగబోయే అనర్థాన్ని పిడుగు రూపంలో దేవుడే తప్పించాడని పేర్కొన్నారు. ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు నిర్వహించాక పునఃనిర్మాణ పనులు చేపడుతామని వివరించారు. -
రైల్వే సిగ్నల్‌పై పిడుగు
కరీంనగర్: పిడుగుపాటుకు రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. సిగ్నల్ పై పిడుగుపడటంతో.. సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైల్వే సిగ్నల్‌పై పిడుగుపడింది. దీంతో ఏపీ సంపర్క్‌క్రాంతి సూపర్ ఫాస్ట్‌తో పాటు స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను రాఘవపూర్ సమీపంలో రెండు గంటల నుంచి నిలిపి ఉంచడంతో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
వనపర్తి: వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ గ్రామం సమీపంలో అడవిలో ఈ ఘటనలో చోటు చేసుకుంది. మృతులను ఈదన్న(45), పరమేష్(25), లక్ష్మన్న(40)లుగా గుర్తించారు. వీరంతా బాలకిష్టాపూర్కు చెందినవారు. పొయ్యిలోకి కట్టెలు కొట్టుకోవడానికి వీరంతా అడవికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన మరో ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
సబ్‌స్టేషన్‌పై పిడుగు: పేలిన ట్రాన్స్ ఫార్మర్లు
సిద్దిపేట: సిద్ధిపేట జిల్లాలోని ముస్తాబాద్ చౌరస్తా సమీపంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున పిడుగుపడింది. ఈ ప్రమాదంలో సబ్‌స్టేషన్‌లోని మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలి బూడిదయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంబింపచేసింది. -
పిడుగుల వాన
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పిడుగులు ► వెల్దుర్తిలో విద్యార్థి మృతి ► లబోదిబోమన్న కుటుంబ సభ్యులు ► ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు ► బస్వాపూర్‌లో రైతు.. ► న్యాల్కల్, జగదేవ్‌పూర్, నంగనూర్, మద్దూర్ మండలాల్లో పశువులు.. వెల్దుర్తి(తూప్రాన్): ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వెల్దుర్తిలో విద్యార్థి, జగదేవ్‌పూర్ మండలం బస్వాపూర్‌లో రైతు మృతి చెందగా పలు చోట్ల పశువులు ప్రాణాలు కోల్పోయాయి. వెల్దుర్తిలో ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. న్యాల్కల్, జగదేవ్‌పూర్, నంగనూర్ మండలాల్లోనూ పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలతో బాధిత రైతులు లబోదిబోమన్నారు. వివరాలు ఇలా... పిడుగుపాటుకు విద్యార్థి బలి కాగా మరో పోతు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిదిలో ఉన్న శేరీ వాడ శివారు పొలాలలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శేరివాడకు చెందిన ఎర్రోల్ల సత్యనారాయణ, కిష్టవ్వ దంపతుల ఒక్కగానొక్క కొడుకు ఆంజనేయులు (18). ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు. మంగళవారం తండ్రితోపాటు కలిసి పొలానికి వెళ్లాడు. అదే సమయంలో వర్షం రావడంతో ఆంజనేయులు పరుగెత్తి ఇప్పచెట్టు కిందికి చేరాడు. తండ్రి సత్తయ్య దూరంలోని మరో చెట్టు కిందికి వెళ్లాడు. ఉరుములు, మెరుపులు అధికం కావడంతో ఒక్కసారిగా ఇప్ప చెట్టుపై పిడుగు పడడంతో అక్కడే ఉన్న ఆంజనేయులు ప్రాణాలు విడిచాడు. అక్కడే చెట్టుకు కట్టేసి ఉన్న పోతు సైతం మృతి చెందింది. ఆ చెట్టు ఆకులు మాడిపోయాయి. కళ్లముందే జరిగిన ఘటనతో కన్నకొడుకు నేలకొరగడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కగానొక్క కొడుకు పిడుగుపాటుకు బలి కావడంతో గుండెలు బాదుకునేలా రోదించడంతో పలువురు కంటతడి పెట్టించింది. 2016లోనే వెల్దుర్తి కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఆ తరువాత కుటుంబ పరిస్థితుల కారణంగా డిగ్రీలో చేరలేకపోయాడు. ఇప్పుడు డిగ్రీలో చేరేందుకు మూడు రోజుల క్రితమే ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. మృతునికి సోదరి లావణ్య ఉంది. విషయం తెలుసుకున్న ఆర్ఐ రమేష్‌యాదవ్, వీఆర్వో అర్జున్‌రెడ్డిలు పంచనామా చేశారు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు. న్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్ మండలం మామిడ్గి గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పడి గేదె మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం.. మామిడ్గి గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్ ఉదయం పాడి గేదెను మేపేందుకు పొలానికి తీసుకెళ్లాడు. మేత మేసిన తరువాత దాన్ని పొలం వద్ద చెట్టుకు కట్టేశాడు. సాయంత్రం వర్షం కురవడం ప్రారంభమైంది. వర్షం తగ్గిన తర్వాత గేదెను ఇంటికి తీసుకెళ్లాలని రైతు భావించాడు. అంతలోనే పిడుగు పడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని బాధితుడు సంతోష్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరాడు. మునిగడపలో కాడెద్దు మృతి జగదేవ్‌పూర్(గజ్వేల్): పిడుగుపాటుకు కాడెద్దు మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం మునిగడపలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మునిగడప గ్రామానికి చెందిన మెడిశెట్టి రాములు తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఎడ్లతో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అనంతరం మేత కోసం బావి దగ్గరనే మేపుతున్నాడు. ఈ క్రమంలో ఆకాశంలో ఒకేసారి ఊరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. భారీ శబ్దంతో కూడిన ఉరుములు మెరుపులతో ఎద్దు సమీపంలో పిడుగు పడింది. దీంతో మేత మేస్తున్న ఎద్దు అక్కడక్కడే మృతి చెందిందని బాధితుడు రాములు తెలిపారు. ఎద్దు మృతితో రూ.40 వేల నష్టం వాటిల్లిందని వాపోయాడు. అలాగే చాట్లపల్లి, మునిగడప, వట్టిపల్లి, చిన్నకిష్టాపూర్, చాట్లపల్లి తదితర గ్రామాల్లో వర్షం జల్లులు కురిసాయి. ఆంక్షాపూర్‌లో గేదె మృతి నంగునూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు చూడితో ఉన్న గేదె మృతి చెందింది. ఈ టన మంగళవారం ఆంక్షాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంజాల సదానందంగౌడ్ గేదెను వ్యవసాయ బావివద్ద ఉన్న చింతచెట్టుకు కట్టేశాడు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. అదే సమయంలో చింతచెట్టుపై పిడుగు పడడంతో అక్కడే ఉన్న గేదె మృతి చెందింది. ఈనే దశలో ఉన్న గేదె మృతి చెందడంతో సుమారుగా రూ.50వేల నష్టం జరిగిందని బాధిత రైతు సదానందంగౌడ్ బోరున విలపించాడు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. నర్సాయపల్లిలో రెండు ఆవులు.. మద్దూరు(హుస్నాబాద్): పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. మండలంలోని నర్సాయపల్లిలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వానకు తోడు పిడుగు పడడంతో ముస్త్యాల కిష్టయ్యకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో రూ.60 వేల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. -
నూజివీడుకు పిడుగు హెచ్చరిక!
కృష్ణా : నూజివీడు మండలంలో సోమవారం రాత్రి పిడుగులు పడే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ హెచ్చరించింది. నూజివీడు పరిసర గ్రామాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ శాఖ సూచించింది. -
పిడుగుపాటుకు గాయపడ్డ రైతు
పెనుకొండ రూరల్ : పెనుకొండ మండలం సత్తారుపల్లిలో శంకరరెడ్డి అనే రైతు పిడుగుపాటుకు గురై శనివారం గాయపడ్డారని బంధువులు తెలిపారు. స్వగ్రామం నుంచి మావటూరుకు బైక్‌లో వెళ్తుండగా మధ్యలో వర్షం మొదలైందన్నారు. దీంతో చెట్టు కింద బైక్‌ను ఆపి నిలబడి ఉండగా కొంత దూరంలోనే పిడుగు పడిందని చెప్పారు. దీంతో అతను షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. వెంటనే కుటుంబ సభ్యుల సహకారంతో సర్పంచ్ సుధాకరరెడ్డి తన కారులో శంకర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ హసీ నా సుల్తానా, ఎంపీడీఓ శివానందనాయక్ గ్రామానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. -
పిడుగుపాటుకు ఎద్దు మృతి
కోడుమూరు రూరల్: మండలంలోని పులకుర్తి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పిడుగు పడడంతో రైతు చిన్న తిక్కన్నకు చెందిన ఒక ఎద్దు మృతిచెందింది.అలాగే తెలుగు లక్ష్మన్నకు చెందిన ఇల్లు స్వల్పంగా దెబ్బతినింది. గ్రామంలో పదికిపైగా టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు రంగన్న, లక్ష్మన్న, బుడ్డ వెంకటేష్ తదితరులు వాపోయారు.గాలివానకు ఒక ట్రాన్స్ఫారం, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. ట్రాన్స్‌కో ఏఈ ప్రియాంక గ్రామాన్ని సందర్శించి సిబ్బందితో విద్యుత్లైన్లను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేశారు. నోడలాఫీసర్ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ అదెయ్య, ఏఓ అక్బర్‌బాషా, పశువైద్యాధికారులు నిర్మలమ్మ, చంద్రమౌళి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత రైతును పరామర్శించి సాయం నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. -
అపార్ట్‌మెంట్‌పై పిడుగు
నంద్యాల: స్థానిక నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని అపార్టుమెంట్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటాక పిడుగు పడింది. దీంతో పైకప్పు స్వల్పంగా దెబ్బతినింది. ఏడాది క్రితం నిర్మించిన దీనిలో 30 కుటుంబాలు నివాసం ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతోపాటు భారీగా శబ్దం చేస్తూ పిడుగు పడింది. శబ్దానికి అపార్టుమెంట్లో ఉన్న వారు భయాందోళనకు గురై బయటకు వచ్చారు. అపార్టుమెంట్పైనే పిడుగు పడిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
పిడుగు పడగ
పిడుగుపాటుతో ఇండియాలో 79 మంది మృతి గత ఏడాది జూన్‌లో మనదేశంలో భీకర తుపానుకు బీహార్ అస్తవ్యస్తం అయింది. మెరుపులు, పిడుగుల దాటికి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో పదిమంది, ఉత్తర ప్రదేశ్‌లో ఆరుగురు పిడుగుల బారిన పడ్డారు. వారిలో ఎక్కువ మంది పొలాల్లో పని చేసుకునే వాళ్లు, పశువుల కాపర్లే. వర్షం కురుస్తున్నప్పుడు తల దాచుకోవడానికి ఏ చెట్టు కిందకో పరుగులు తీయడం అసంకల్పితంగా జరిగిపోతుంది. మెరుపులో విడుదలయ్యే విద్యుత్తు ఆ చెట్టునే ఆకర్షిస్తే ఇక అంతే. రెండు రోజుల క్రితం రెండు రాష్ట్రాలలోని చాలా చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆనాడు వర్షం కంటే ఎక్కువగా ఉరుములు, మెరుపులే ప్రజలను భయపెట్టాయి. సాధారణంగా క్యుములోనింబస్ మేఘాలతో వర్షం కురిసినప్పుడు ఇలా మెరుపులు, ఉరుములతో వాతావరణం బీభత్సంగా మారిపోతుంది. ఇలాంటి సమయాల్లోనే పిడుగులు కూడా పడతాయి. ఇలా మెరుపులు, ఉరుములు, పిడుగుపడటం వంటివి ఎలా జరుగుతాయో చూద్దాం. మేఘాలలోని ధూళి కణాలలోని విద్యుదావేశాలు... అంటే ఛార్జ్డ్ పార్టికిల్స్ ఒకచోట పోగుపడతాయి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలన్నీ మేఘం పైవైపునకూ, నెగెటివ్ ఛార్జ్ ఉన్నవి కిందివైపునకు పోగుపడుతుంటాయి. రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు వాటిలోని భిన్నమైన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నవి ఆకర్షించుకుంటాయి. దాంతో మేఘంలోనే రెండు విద్యుదావేశాల మధ్యనా, లేదా రెండు మేఘాలలో ఉన్న వేర్వేరు విద్యుదావేశాల మధ్యనా లేదంటే... కొన్నిసార్లు మేఘానికీ, భూమికీ మధ్యన జరిగే ఘర్షణతో చాలా స్వల్ప వ్యవధిలోనే అపరిమితమైన విద్యుచ్ఛక్తి వెలువడుతుంది. ఇదే మెరుపుగా మెరుస్తుంది. ఇంత అపరిమితమైన శక్తి పుట్టడం వల్ల పెద్ద శబ్దమూ వెలువడుతుంది. అదే ఉరుము. అయితే శబ్దవేగం కంటే కాంతి వేగం ఎక్కువ కావడం వల్ల మొదట మెరుపు కనిపించి, ఆ తర్వాత ఉరుము వినిపిస్తుంది. ఒక్కోసారి మేఘాల నుంచి ఆ విద్యుత్ భూమిలోకి కూడా ప్రవహిస్తుందని అనుకున్నాం కదా. అలా పయనించే విద్యుచ్ఛక్తే పిడుగు. ఒక్కోసారి వర్షం ఏదీ లేకుండా కూడా ఇలా మెరుపులు రావచ్చు. దాన్నే ‘డ్రై లైటెనింగ్’ అని కూడా అంటారు. భూమ్మీదికి వచ్చే మెరుపుల వల్ల ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ భూమిలోకి ప్రవహించడం అన్నది ఒక్కోసారి పొడవాటి చెట్లు, పొడవైన స్తంభాల ద్వారా తేలిగ్గా జరిగిపోతుంది. అందుకే మెరుపులు మెరుస్తూ, ఉరుములు వినబడుతున్నప్పుడు చెట్ల కిందకీ, పెద్ద స్తంభాల దగ్గరికి వెళ్లవద్దని పెద్దలు చెబుతుంటారు. కొన్నిసార్లు మేఘాల నుంచి పాకే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ నిటారుగా నిలబడి ఉన్న మనుషుల ద్వారానే భూమిలోకి ప్రవేశిస్తే... ఆ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడంటారు. కొన్ని సెకన్లలోపే ఆయుర్దాయం మాత్రమే ఉండే ఇలాంటి పిడుగులో దాదాపు 28,000 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. నీరు 100 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద మరుగుతుందని తెలుసుకదా. దాన్ని బట్టి ఒక పిడుగులో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో ఊహించండి. పిడుగు పడి ఎంపైర్ బిల్డింగ్ ధ్వంసం చెట్లు సరే ఎత్తుగా ఉంటాయి కాబట్టి మెరుపును ఆకర్షించాయంటే అర్థం ఉంది. మరి భవనాల మీద ఎందుకు పడిందంటే... పిడుగులు పడిన ఆ భవనాలన్నీ ఆకాశాన్నంటేవే. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పిడుగుబారిన పడడానికి కారణం దాని ఎత్తే. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఇది 102 అంతస్థుల భవనం. నార్వే లో పిడుగు పడి 323 ప్రాణాలు బలి నార్వేలో పిడుగు ఏకంగా మూడు వందలకు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ మెరుపు దాడి అటవీ ప్రాంతం మీద విరుచుకు పడడంతో ఆ మరణాలన్నీ వన్యప్రాణులకే పరిమితమయ్యాయి. అయితే ఇది ఆ దేశ చరిత్రలో అత్యంత పెద్ద ప్రకృతి విలయం. ఈ జంతువులన్నీ మారే వాతావరణానికి అనుగుణంగా ప్రదేశాలు మారుతుంటాయి. ఆ వెళ్లడం సమూహాలుగా కదులుతాయి. దాంతో ఒక్క పిడుగుకు అన్ని జంతువులు బలయ్యాయి. రక్షించుకోండిలా... మనం అద్దం దగ్గర దువ్వుకునే సమయంలో జాగ్రత్తగా గమనిస్తే మన వెంట్రుకలు బాగా పొడిగా ఉన్నప్పుడు... దువ్వెన దగ్గరికి తేగానే దువ్వెన వైపునకు ఆకర్షితమవుతాయి. దీనికి కారణం... వెంట్రుకలు, దువ్వెనల్లోని వేర్వేరు ఎలక్ట్రిక్ ఛార్జే. ఇలాగే ఆరుబయట ఉన్నప్పుడు వెంట్రుకలు నిటారుగా పైకి లేస్తున్న తీరును గమనించి కూడా సర్వైవల్ నిపుణులు కొందరు పిడుగుపాటు ప్రమాదాన్ని పసిగడతారు. మీరూ ఇలాంటి సూచనను గమనిస్తే వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి. మెరుపులు, ఉరుములు కనిపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరుబయట ఉన్నవారు లైటెనింగ్ కండక్టర్ వంటివి ఉన్న భవంతిలోకి వెళ్లాలి. అంతేగాని నిటారుగా ఉండే చెట్ల కిందికి, స్తంభాల దగ్గరికి వెళ్లకూడదు. బయట మెరుపులు మెరుస్తూ, ఉరుముల శబ్దం వినపడుతున్నప్పడు ప్లంబింగ్, వైరింగ్ వంటి పనులు చేయడం సరికాదు. నీళ్లు విద్యుత్వాహకం. కాబట్టి పొడి నేల కంటే నీరుండే స్విమ్మింగ్‌పూల్ వంటివి పిడుగును త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే నీళ్లున్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్నవారిపైనా లేదా ఈదుతున్న వారిపైన పిడుగు పడే ప్రమాదం ఎక్కువ. అందుకే వర్షం సమయంలో ఈత లేదా నీటిలో ఆడటం వంటివి సరికాదు. ఇంటిలోపల (ఇన్‌డోర్స్‌లో) ఉన్నవారు సైతం విద్యుత్ ప్రవహించడానికి అవకాశం ఉన్న వైర్లు కలిగిన ఫోన్ (ల్యాండ్‌లైన్ ఫోన్)లలో మాట్లాడటం, వైర్లతో ఉండే విద్యుత్ ఉపకరణాలతో పనిచేయడం (అంటే కంప్యూటర్లు వాడటం) సరికాదు. ఆ సమయంలో టీవీ లాంటి విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం కూడా మంచిదే. కార్లలో ప్రయాణం చేస్తున్న వారు... తమ దేహం విద్యుత్ ప్రవహించే లోహానికి తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. విద్యుత్ ప్రవహించని సీటు వంటి ఇన్సులేటింగ్ మెటీరియల్‌కు మాత్రమే ఆని వుండేలా జాగ్రత్త పడాలి. అంతేగాని ఒళ్లు లోహానికి తాకకూడదు. మెరుపుని తిప్పికొడదాం ►ఏటా దాదాపుగా 25 మిలియన్ల పిడుగులు పడుతుంటాయి. ►మెరుపు సెకనుకు 90 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ►ఒక్క మెరుపులో ఒక బిలియన్ వోల్టుల విద్యుత్తు ఉంటుంది. ►వర్షం పడిన చోట మాత్రమే కాకుండా చుట్టూ పదిమైళ్ల విస్తీర్ణంలో కూడా మెరుపులు మెరుస్తుంటాయి, పిడుగులు పడుతుంటాయి. ►మెరుపు పక్కన ఉండే గాలి 28 వేల సెంటీగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది సూర్యుడి వేడికంటే ఐదురెట్లు ఎక్కువ. ►కరెంటు ప్లగ్‌తో కనెక్ట్ అయిన వస్తువులను ముట్టుకోవద్దు. ►గోడలను ఆనుకోవద్దు అంట్లు తోమకూడదు ►స్నానం చేయకూడదు ►యంత్రపరికరాలతో పని చేయకూడదు -
ఏపీలో అకాలవర్షం, పిడుగులు 9 మంది మృతి
-
కర్నూలులో పిడుగు పడి ముగ్గురికి గాయాలు
-
పిడుగు.. కన్నీటి మడుగు
పిడుగుపాటుకు ఐదుగురి మృతి ఈత కొలనులో మునిగి బాలుడు, ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం పిచ్చాటూరు/రామసముద్రం/శ్రీకాళహస్తి రూరల్/చిత్తూరు (అర్బన్): జిల్లాలో ఆదివారం పలు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పిడుగుపాటుతో ఐదుగురు, ఇంటి సన్‌సైడ్ గోడ కూలి ఓ చిన్నారి, స్విమ్మింగ్‌పూల్‌లో పడి మరో బాలుడు ప్రాణాలు విడిచారు. వీరిపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మెరుపులాంటి విషాదం జిల్లాలోని వివిధ మండలాల్లో పిడుగు పడి ముగ్గురు మృతిచెందారు. పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం కళత్తూరు గ్రామానికి చెందిన వెంకటరత్నం(55)కు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు వెంకటేశులు(20) పొలం పనిచేస్తుండగా, చిన్నకొడుకు చెంగల్రాయులు(16) పదో తరగతి పూర్తిచేశాడు. శనివారం వెలువడిన పది ఫలితాల్లో విజయం సాధించి సంబరాలు చేసుకున్నాడు. మూడో వాడు మతిస్థిమితం లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. వెంకటరత్నం పొలం వద్ద కాలువలు చదును చేయడానికి ఆదివారం తన ఇద్దరు కొడుకులతో కలిసి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. వారు పనిచేస్తున్న ప్రదేశంలోనే పిడుగుపడడంతో అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి వారిని హుటాహుటిన కేవీబీపురం ఆస్పత్రికి తరలించారు. తండ్రి వెంకటరత్నం, అన్న వెంకటేశులు కోలుకోగా, చెంగల్రాయులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చెంగల్రాయులు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పది పాసైన సంతోషం తమకు ఎక్కువకాలం నిలవలేదని తల్లిదండ్రులు బోరున విలపించారు. రామసముద్రం.. కన్నీటి సంద్రం రామసముద్రం మండలంలో ఆర్.నడుంపల్లె పంచాయతీ దిగువబొంపల్లెకు చెందిన ఆర్.నరసింహులు(50), అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప భార్య లక్ష్మీదేవమ్మ మేకలు మేపేందుకు సమీపంలోని వాలీశ్వరస్వామి కొండకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నరసింహులుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీదేవమ్మకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే తిరుమలరెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటరమణ భార్య ఆదిలక్ష్మి(37) సందూరి చెరువు కింద మల్బరీ ఆకు కోసుకొచ్చేందుకు వెళ్లింది. పిడుగుపడడంతో ఆమె గాయపడింది. పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూసింది. రైతు కుటుంబాల్లో విషాదం శ్రీకాళహస్తి మండలం భీమవరానికి చెందిన బి.రమణయ్య(45), బి.నరసింహులు(55) మేకలు మేపుకుని జీవిస్తున్నారు. ఆదివారం మేతకోసం మేకలను అడవికి తీసుకెళ్లారు. అయితే చీకటి పడ్డాక మేకలు మాత్రమే ఇంటికి వచ్చేశాయి. ఎంతసేపటికీ వారు రాకపోవడంతో స్థానికులు అడవిలోకి వెళ్లి గాలించారు. పిడుగుపడి ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గుర్తించి మృతదేహాలను గ్రామంలోకి తీసుకొచ్చారు. గుండెకోతే మిగిలింది.. సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్న త్రివిక్రమ్‌రెడ్డి, వంశీప్రియలది పూతలపట్టు మండలం. వేసవి సెలవులు కావడంతో తమ ఒక్కగానొక్క కొడుకును పూతలపట్టులోని స్వగ్రామానికి పంపారు. రిషి శనివారం చిత్తూరులోని కట్టమంచిలో ఉంటున్న తన బాబాయి వినీల్ ఇంటికి వచ్చాడు. ఆదివారం అతనితో కలిసి ఈత నేర్చుకోవడానికి డీఎస్డీవో (జిల్లా క్రీడాభివృద్ధి శాఖ)కు చెందిన స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లాడు. అప్పటికే 30మంది స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొడుతుండగా రిషి సైతం దూకేశాడు. ఊపిరాడక మృతి చెందాడు. ఆశలు ఆవిరి.. కేవీబీపురం మండలం మఠం గ్రామానికి చెందిన గజేంద్ర, సాయమ్మ దంపతులు పాత మిద్దెలో నివాసముంటున్నారు. వారి కుమార్తె మానస(1)ను బంధువుల పిల్లలు తేజస్విని, తులసి, పవిత్ర, కావ్య ఇంటి వరండాలో ఉన్న సన్సైడ్కు కట్టిన ఊయలలో ఉంచి ఊపుతున్నారు. ఊయల కట్టి ఉన్న సన్‌సైడ్ కూలి పిల్లలపై పడింది. చిన్నారి మానస అక్కడికక్కడే మృతి చెందింది. తేజశ్వని, తులసి, పవిత్ర, కావ్య గాయపడ్డారు. -
దుర్గమ్మ గుడిలో పిడుగుపాటు
-
పిడుగుపాటుకు 13మేకలు మృతి
గజ్వేల్‌రూరల్: పిడుగుపాటుకు 13మేకలు మృతి చెందిన సంఘటన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని సంగాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతగల్ల మల్లయ్య తన మేకలను తోలుకుని గురువారం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కాగా సాయంత్రం సమయంలో కురిసిన వర్షాలకు మేకల మంద పిడుగు పాటుకు గురైంది. ఈ ప్రమాదంలో 13 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, వాటి యజమాని మల్లయ్యకు సైతం గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వీఆర్వో ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అయితే పిడుగుపాటుకు తన మందలోని 13 మేకలు మృతి చెందాయని, దీంతో తనకు భారీ ఆస్తి నష్టం సంభవించిందని, ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని మల్లయ్య విజ్ఞప్తి చేస్తున్నాడు. -
పిడుగుపాటుకు ఒకరు మృతి
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందారు. కరీంపేట్ గ్రామానికి చెందిన మేడిచెల్మల రాజయ్య(52) కొత్తగట్టు గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బావి తవ్వుతుండగా గురువారం మధ్యాహ్నం పిడుగుపడింది. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. -
పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి
చేర్యాల : పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని ఆకునూరులో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆకునూరు గ్రామానికి చెందిన తాటికొండ బొందమ్మ(50) వ్యవసాయ కూలీకి వెళ్లి ఇంటికి తిరుగుపయనమైంది. ఈ క్రమంలో ఆమె ఆకునూరులోని గంగమ్మ గుడి సమీపంలోని పెద్దవాగులో నుంచి వస్తుండగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త వెంకటస్వామి, కుమార్తె ఉన్నారు. ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, మాజీ సర్పంచ్ లావణ్యరఘువీర్, పల్లె కనకయ్య, శనిగరం నరేందర్, ఎండీ.హైమత్, మోంటె ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
చిలుకూరు: నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం ఉదయం పిడుగుపడి వీరబాబు(32) అనే రైతు మృతి చెందాడు. వీరబాబు పొలంలో పనిచేసుకుంటుండగా పిడుగుపడింది. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వైపు మునగాలలో పిడుగుపడి బాలకృష్ణ(28) అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. మునగాల హైస్కూల్ పక్కన నీళ్లు పడుతుండగా పిడుగుపడి బాలకృష్ణ మృతిచెందాడు. -
పిడుగుపడి ఇద్దరి మృతి
చాట్రాయి: పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన. మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన తుర్లపాటి మారేష్(26) లింగారెడ్డి రాణి, చైతన్య కలసి గ్రామంలోని కాకర తోటలో శుక్రవారం సాయంత్రం పనిచేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండడంతో తోటలోఉన్న చెట్టు కిందకు వచ్చారు. అదే సమయంలో పిడుగు పడింది. ఈ సంఘటనలో మారేష్ అక్కడిఅక్కడే మృతి చెందాడు. రాణి, చైతన్యలకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నంపేట గ్రామానికి చెందిన కొమ్ము నాగేశు(40) మరో 10 మంది కూలీలు చింతలపూడి మండలం గండిచర్ల గ్రామంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. వర్షం కురుస్తుండడంతో దగ్గర్లో ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టు కింద ఉన్న కూలీలపై పిడుగు పడడంతో నాగేశు అక్కడిఅక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బాలస్వామిని చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి బార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతులు ఇద్దరూ కూలీలే.. పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఇద్దరు, తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు నిత్యం కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
పెద్దవూర మండలం చెలకుర్తి గ్రామపంచాయతీ బెత్తలతండాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న వారిపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో బోనావత్ సక్రూ(16) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా..బాలుడి తండ్రి జాన్, పొలంలో పనిచేయడానికి వచ్చిన కూలీ జ్యోతిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగార్జునసాగర్‌లోని కమలా-నెహ్రు ఆసుపత్రికి తరలించారు. -
పిడుగుపాటుకు కాలిపోయిన పరికరాలు
హత్నూర: మండలంలోని దౌల్తాబాద్‌లో గురువారం రాత్రి పిడుగుపాటుకు ఒక్కసారిగా ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రికల్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఒక్కసారిగా వర్షం, పిడుగుపాటుతో ఇళ్లలోని టీవీ, ఫ్రిజ్‌లు కాలిపోయి పొగలు వచ్చాయి. గ్రామంలో సుమారు 80శాతం ఎలక్ట్రికల్ పరికరాలు చెడిపోయినట్లు వారు తెలిపారు. -
పిడుగుపాటుకు తాటిచెట్టు దగ్ధం
త్రుటిలో తప్పిన ప్రమాదం పొదలకూరు : పట్టణంలోని పద్మావతినగర్‌లోని ఓ తాటి చెట్టుపై గురువారం సాయంత్రం పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో చుట్టుపక్కల నివాసితులు హడలిపోయారు. ఒక్కసారిగా వేల వాట్స్ లైట్లు వెలిగినట్టుగా నివాసాల ముందు వెలుగు, శబ్ధం రావడంతో భయకంపితులయ్యారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. వినాయకమాన్యం, శ్రామికనగర్ కాలనీవాసులు పిడుగు పడిన మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. పిడుగు పడే సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు అయింది. పిడుగు పడిన తాటిచెట్టుకు సమీపంలో ఆదెమ్మ నివాసం ఉంటుంది. అయితే ఆమెకు ప్రమాదం తప్పింది. పిడుగుపాటుతో పద్మావతినగర్, తొగటివీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
పిడుగుపాటుకు టెంకాయచెట్టులో మంటలు
కురింజాలం(వరదయ్యపాళెం): పిడుగుపాటుకు ఓ టెంకాయచెట్టులో మంటలు రేగాయి. కురింజాలం గ్రావుంలో వుంగళవారం సాయంత్రం పెద్ద శబ్దంతో ఉరుములు మెరుపులు వచ్చాయి. అదే సమయంలో గ్రావుంలోని మోహన్ ఇంటివద్ద ఉన్న టెంకాయ చెట్టుపై పిడుగుపడింది. దీంతో వుంటలు వ్యాపించాయి. పిడుగుపాటు కారణంగా గ్రావుంలోని పలు ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
టేకులపల్లి మండలంలోని రెండు గ్రామాల శివారులో శుక్రవారం పిడుగుపడింది. బిల్లుడుతండాలో పిడుగుపాటుకుభూక్య నాగేష్(25)అనే యువకుడు మృతిచెందగా..మరొకరికి గాయాలయ్యాయి. తూర్పుగూడెంలో పిడుగుపాటుకు ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. -
పిడుగు పడి 12 మందికి షాక్
మహబూబాబాద్ (వరంగల్): పిడుగుపాటుతో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా వాసులు మంగళవారం తండా శివారులో దాటుడు పండుగ జరుపుకున్నారు. తండావాసులంతా పండుగ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కొంతమంది సమీపంలో ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లారు. అదే సమయంలో పశువుల కొట్టం సమీపంలో పిడుగు పడింది. ఆ పిడుగు ప్రభావానికి కొట్టంలో ఉన్న భూక్య నరేష్, భూక్య సోమ్లా, భూక్య బుల్కి, కల్పన, మోహన్, బాజు, రామ, చీన్యా, సోమ్లితో పాటు మరో ముగ్గురు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
అక్షయపాత్ర అంటూ ఘరానా మోసం
హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. యురేనియం పేరిట కొందరు వ్యక్తులు టోకరా వేశారు. పిడుగు పడినప్పుడు తమ వద్ద ఉన్న పాత్రలో చుట్టుప్రక్కల ఉన్న యురేనియం అంతా చేరుతుందని ప్రచారం చేశారు. యురేనియానికి వెలకట్టలేని ధర పలుకుతుందని ప్రచారం చేశారు. ఇది సూరి హత్య కేసులోని ప్రధాన నిందితుడు భాను కిరణ్ ముఠా పనిగా అనుమానిస్తున్నారు. 18 మంది ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. భాను కిరణ్ జైల్లో ఉండే చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు ముఠా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. బెంగుళూరులో కోహ్లీ అనే వ్యక్తి అక్కడి నుంచే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తెలియవచ్చింది. తమ వద్ద ఒక అక్షయలాంటి పాత్ర ఉందని, పిడుగు పడినప్రదేశంలో ఆ పాత్ర ఉంచితే చుట్టుప్రక్కల ఉన్న యురేనియాన్ని ఆ పాత్ర ఆకర్షిత్తుందని, దానిని అమ్ముకుంటే రూ. కోట్లు వస్తాయని చెప్పి వారు ప్రచారం చేస్తున్నారని, వీరి వలలో చాలా మంది వీఐపీలు పడినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి జైల్లో ఉన్న భానుకిరణ్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా సీఐడీ పోలీసులు గుర్తించారు. 15 రోజుల క్రితం యురేనియం విషయంలో మోసపోయిన ఓ ఎన్నారై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన దీనిని సీఐడీ అధికారులకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం బెంగెళూరులో కోహ్లీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నది తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. -
పిడుగుపాటుకు ఒకరి మృతి
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఐలయ్య(45) గ్రామ శివారులో గొర్రెలు కాస్తుండగా.. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో తడవకుండా ఉండటానికి చెట్టు నీడకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. -
పిడుగుపాటుకు ఐదుగురు కూలీలు..
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో పిడుగుపడి ఐదుగురు కూలీలు స్పృహ కోల్పోయారు. ఇసుక ర్యాంప్‌లో పనిచేస్తున్న కూలీలకు పది అడుగుల దూరంలో పిడుగు పడటంతో.. ఐదుగురు కూలీలు స్పృహకోల్పోయారు. ఇది గుర్తించిన గ్రామస్థులు వారిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పిడుగు పాటుకు ఒకరి మృతి
సోంపేట: మండలంలోని బెంకిలి పంటపొలాల్లో బుధవారం పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. మరొక మహిళ తీవ్రంగా గాయపడింది. జింకిభద్ర గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రంగోయి జానకమ్మ(47), తాళ్ల హేమావతి వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగివస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన జోరువాన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పిడుగు పడటంతో జానకమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. హేమావతి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు ఈమెను సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జానకమ్మ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటోంది. ఆమె మృతితో కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు. ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ ఆర్.గోపాలరత్నం, ఎస్ఐ కె.భాస్కరరావులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమావతి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. -
ఉరుములు మెరుపులు
♦ స్తంభించిన పౌరజీవనం ♦ భెల్‌లో జనం బెంబేలు ♦ నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ♦ ఎగిరిపడ్డ పైకప్పులు ♦ అంధకారంలో గ్రామాలు గాలివాన.. మెతుకుసీమను అతలాకుతలం చేసింది. పెను బీభత్సాన్ని సృష్టించింది. వేర్వేరు చోట్ల పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. బలమైన గాలులు వీయడంతో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. సుమారు 150 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నారాయణఖేడ్, నర్సాపూర్, దుబ్బాక, పటాన్చెరు నియోజకవర్గాలో భారీ నష్టం జరిగింది. గాలివానకు భెల్ పట్టణం స్తంభించింది. వందలాది చెట్లు విరిగిపడ్డాయి. ఒకవైపు చెట్లు, మరోవైపు విద్యుత్ స్తంభాలు విరిగిపడుతుంటే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాకపోకలు స్తంభించిపోయాయి. విద్యుతు సరాఫరా నిలిచిపోయింది. పుల్కల్ మండలం బస్వాపూర్‌కి చెందిన గొల్ల దుర్గయ్య (25), సిద్దిపేట మండలం బక్రిచెప్యాలకు చెందిన కుర్మ సత్తయ్య, సత్తవ్వల కుమార్తె కుర్మ సౌజన్య (13) పిడుగుపాటుకు బలయ్యారు. కొత్త పెళ్లికొడుకును మింగిన పిడుగు పుల్కల్: పిడుగుపాటుకు నవ వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బస్వాపూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... బస్వాపూర్‌కు చెందిన గొల్ల దుర్గయ్య(25) ఎప్పటిలాగే గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోకూడిన వర్షం వచ్చింది. దుర్గయ్య వెంటనే వేప చెట్టు కిందకు వెళ్లే ప్రయత్నం చేయగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గయ్యకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. తమ ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కిష్టయ్య, ఎల్లమ్మలు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ⇔ సిద్దిపేటలో గాలివాన బీభత్సానికి విద్యుత్ తీగలు తెగిపోయాయి. చెట్లు విరగ్గా, గోడలు కూలాయి. కరీంనగర్ రోడ్డులో దుర్గా దాబా నేలమట్టమైంది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌తోపాటు పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు. రావిచెట్టు హనుమాన్ దేవాలయం వద్ద విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ⇔ శివ్వంపేట మండలం శివ్వంపేట, కొత్తపేట, రత్నాపూర్, అల్లీపూర్, పిల్లుట్ల, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో భారీగా నష్టం వాటిల్లింది. కొత్తపేటలో ధనారెడ్డికి చెందిన పౌల్ట్రీఫారం ధ్వంసమైంది. ఏడువేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.15 లక్షల నష్టం జరిగింది. ⇔ జిన్నారంలో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. మాధవరం, ఊట్ల, జిన్నారం తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ⇔ కల్హేర్, మార్డి, బీబీపేట, కృష్ణాపూర్ తదితర చోట్ల గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పౌల్ట్రీఫారాల రేకులు ఎగిరిపడ్డాయి. ⇔ పటాన్‌చెరుతోపాటు రామచంద్రాపురం, భెల్‌లో భారీ నష్టం జరిగింది. భారీ ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భెల్ టౌన్షిప్ అతలాకుతలమైంది. పెద్ద ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. సాధారణ స్థితికి చేరుకోవడానికి పదిరోజులైనా పడుతుందని కార్మికులు అంటున్నారు. ⇔ సంగారెడ్డిలో మోస్తరు వర్షం కురిసింది. ⇔ మెదక్ పట్టణంలో వర్షం ఊరించి ఉసూరుమన్పించింది. కారు మబ్బులు కమ్ముకున్నా, ఉరిమినా వర్షం కురవకపోవడంతో రైతులు నిరాశ చెందారు. గాలివానతో లబోదిబో... హత్నూర: మండలంలోని మూడు గ్రామాలు, నాలుగు తండాల్లో గాలివాన విధ్వంసాన్ని సృష్టించింది. నాగారం, కొడిప్యాక, కొత్తగూడెం గ్రామాలతోపాటు చింతల్‌చెరువు పంచాయతీలోని గోపాల్ తండా, కిషన్‌తండా, కిమ్యాతండా, ఎల్లమ్మ గూడెం పంచాయతీ పరిధిలోని రేన్ల గూడెం అతలాకుతలమయ్యాయి. దాదాపు 80 వరకు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. చాలామంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు దెబ్బతిన్న కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. దాదాపు వంద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌సరఫరా లేకపోవడంతో సదరు గ్రామాలు, తండాలు అంధకారంలో ఉండిపోయాయి. పెద్ద ఎత్తున చెట్లు కూలాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోపాల్ గిరిజన తండాలో లకావత్ శ్రీను పూరిల్లు కూలడంతో కుటుంబీకులు శిథిలా నుంచి బయటకు పరుగులు తీశారు. కిషన్ తండాకు చెందిన రోహుల నాయక్ ఇంటిపైకప్పు రేకులతోపాటు గోడలు కూలి ఇంట్లో ఉన్నవారిపై పడడంతో గాయాలయ్యాయి. గోపాల్ తండాకు చెందిన పాండు, దేవుల, డాక్య, సుభాష్, కిషన్, నర్సింగ్, గేమ్‌సింగ్, గోపాల్‌నాయక్, నాన్య, రమేష్నాయక్ల ఇళ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కిషన్తండాకు చెందిన సామ్య, బూల్యాతోపాటు మరోపదిమంది ఇళ్లు కూలిపోయాయి. కిమ్యా తండాకు చెందిన నర్సింగ్, శంకర్, కిమ్యానాయక్, రాజునాయక్‌తోపాటు పలువురి ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. మూడు తండాలలో గిరిజనులు ఇళ్లు ధ్వంసం కావడంతో బాధితులు సామగ్రితో బయటకు వచ్చేశారు. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగి ఇళ్లు, బైక్‌లపై పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొత్తగూడెం, నాగారం, కొడిపాకలో సుమారు 50 విద్యుత్ స్తంభాలు నేలకూలడంతోపాటు 60ళ్ల వరకు రేకులు, పెంకుటిళ్ళ పైకప్పులు ధ్వంసమయ్యాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న పెద్దపెద్ద చెట్లు వడ్డేపల్లి, నాగారం, కొత్తగూడెం రహదారులపై అడ్డంగా పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.గిరిజన తండాలో పైకప్పు రేకులు కూలడంతో శారద, కమల, రాధమ్మ అనే మహిళలకు గాయాలయ్యాయి. ఆయా గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పర్యటించనున్నారు. పసిగుడ్డుతో వీధిన పడ్డ బాలింత నర్సాపూర్ రూరల్: గూడెంగడ్డకు చెందిన స్వరూప అనే మహిళ పూరింట్లోకి నీరు చేరింది. దీంతో ఆమె కూతురైన బాలింత నాగమణి పసిగుడ్డుతోపాటు సామాన్లతో బయటకు వచ్చింది. ఆశ్రయం కోసం ఎదురు చూస్తోంది. పిడుగుపాటుకు నాలుగు మేకలు మృతి నత్నాయపల్లిలో పిడుగుపాటుకు నీలి లక్ష్మీనారాయణకు చెందిన నాలుగు మేకలు మృత్యువాత పడ్డాయి. అడవిలో మేకలు మేపుకొని వస్తుండగా వర్షం పడుతుండడంతో మేకల మందను ఓ చెట్టుకింద నిలిపాడు. పిడుగు శబ్దం రాగానే లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరుగు తీయగా నాలుగు మేకలు అక్కడికక్కడే మృతిచెందగా మరో నాలుగు మేకల పరిస్థితి విషమంగా ఉంది. లింగాపూర్‌లో హన్మంత్‌కు చెందిన పౌల్ట్రీఫారం దెబ్బతింది. దాదాపు 5వేల కోడిపిల్లలు చనిపోగా రూ.3లక్షల వరకు నష్టం జరిగింది. బాలికను బలిగొన్న పిడుగు సిద్దిపేట జోన్: పిడుగు పాటుకు ఓ బాలిక మృతి చెందింది. వెంట ఉన్న కుక్క పిల్ల సైతం మాడిమసైంది. ఈ ఘటన మండలంలోని బక్రిచెప్యాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్మ సత్త య్య, సత్తవ్వ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. శుక్రవారం పొలంలో ఎరువు చల్లేందుకు తల్లిదండ్రులతో కలిసి అన్నాచెల్లెలు వెళ్లారు. సాయంత్రం వేళ వాతావరణంలో మార్పును గమనించిన సౌజన్య(13) ఇంటికి వెళ్దామని అన్నయ్యతో చెప్పింది. తాను పశువులను కట్టేసి వస్తానని చెప్పడంతో సౌజన్య చెరువు వెంట ఇంటిముఖం పట్టింది. అప్పటికే ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. తనతోపాటు వచ్చిన కుక్కపిల్లతో కలిసి చెరువు గట్టున ఉన్న తుమ్మచెట్టు కిందకు చేరింది. పిడుగు పడడంతో సౌజన్య అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కుక్కపిల్ల సైతం మాడి మసైంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. తరలివచ్చిన మంత్రి... సిద్దిపేటలో రోజంతా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌కు బయలుదేరారు. పిడుగుపాటు తో బాలిక మృతి చెందిన విషయం తెలిసి వెంటనే వెనుదిరి గారు. బక్రిచెప్యాలకు వెళ్లి మృతురాలి కుటుం బీకులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని వారి భరోసా ఇచ్చారు. -
ఈదురుగాలుల బీభత్సం
* ఎగిరిపడ్డ ఇంటికప్పు రేకులు.. నిలిచిన కరెంట్ సరఫరా * గాలికి ఎగిరిపడ్డ ఊయలలోని చిన్నారి మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు వీచడంతో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. మహావృక్షాలు నేలకూలాయి. ఇదే సమయంలో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి. ఈదురుగాలులకు నిడ్జింత, మన్నాపూర్, దుప్పట్‌గట్, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మక్తల్‌లో ప్రాణభయంతో గొర్రెల కాపరి పూజరి నర్సింలు(30) చెట్టు ఎక్కాడు. ఈదురుగాలులకు చెట్టు నేలకూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మాగనూర్ మండలం హిందూపురంలో ఓ చిన్నారి రేకుల ఇంట్లో ఊయలలో ఆడుకుంటోంది. బలమైన గాలి వీచడంతో రేకులతోపాటు ఊయల లేచిపోయి అల్లంతదూరాన ముళ్లపొదల్లో పడింది. అక్కడే ఉన్న స్థానికులు కొందరు గుర్తించి ఆ పసికందును తల్లి శాంతమ్మకు అప్పగించారు. మక్తల్‌లో ఈదురుగాలులకు కరెంట్ స్తంభం విరిగిపోయి ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ సమయంలో కరెంట్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో మహబూబ్‌నగర్- రాయిచూర్ ప్రధానరోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అరగంటలో అతలాకుతలం బషీరాబాద్: రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలో హోరు గాలికి 200 చెట్ల వరకు నేలకూలాయి. కొర్విచెడ్‌లో చెట్టు మీద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని రైస్‌మిల్లులో హోరు గాలికి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మిల్లులోని 200 క్వింటాళ్ల బియ్యం, 80 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయాయి. -
పిడుగుపాటుకు దంపతుల మృతి
వజ్రకరూరు: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం పిడుగుపడి దంపతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన కదిరప్ప(65), లక్ష్మీదేవి(55) పూరిగుడిసెలో నిద్రిస్తుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆ దంపతులు నిద్రలోనే కన్నుమూశారు. బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుపాటుకు ఆ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పిడుగుపడి యువకుని మృతి
శ్రీకాకుళం జిల్లా హిర మండలం తుంగతంపర గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి గుణుపూరు శ్రీను(30) అనే యువకుడు మృతిచెందాడు. శ్రీను పొలం పనులు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. చెట్టు నీడన సేద దీరుతుండగా పిడిగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఇంటి పై పిడుగుపడి మహిళ మృతి
ఇంటిలో పిడుగులు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మదనపల్లి మండలం కోటప్రోలులో గురువారం సాయంత్రం జరిగింది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురిసింది. ఈ సమయంలోనే ఓ ఇంటిలో ఉన్న గంగులమ్మ (50)అనే మహిళపై పిడుగుపడింది. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిడుగుపడి ఇద్దరు మత్స్యకారుల మృతి
నంద్యాల పట్టణ శివారులోని చిన్న చెరువు వద్ద మత్స్యకారులపై గురువారం పిడుగుపడింది. ఈ ఘటనలో మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన పుల్లయ్య(25), నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన శేఖర్(30) అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
జనావాసాల మధ్య పిడుగుపాటు
మెదక్: మెదక్ జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఇళ్ల మధ్యనే పిడుగుపడింది. అయితే, సమీపంలో ఇళ్లు లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఉన్న చెట్లు నిలువునా మంటల్లో కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. పెద్దతూప్రా గ్రామంలో పొలంలో పనులు చేసుకుంటున్న వారిపై పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అదే విధంగా పెద్దగోల్కొండ గ్రామంలో శ్రీకాంత్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోగా లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా సోమవారం సాయంత్రం జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. -
పిడుగుపాటుకు నల్లగొండలో ముగ్గురి మృతి
మదిగూడ/వలిగొండ (నల్లగొండ) : పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందిన సంఘటనలు నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నాయి. మర్రిగూడ మండలం నర్సింహాపురంలో ఒకరు మృతి చెందగా, వలిగొండలో మరో ఇద్దరు మృతి చెందారు. నర్సింహాపురానికి చెందిన యాదయ్య(55) తన పొలంలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. సాయంత్రం పొలంలో ఉండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో పొలంలో ఉన్న యాదయ్యపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే వలిగొండ మండలం షంగ్యిం సమీపంలో బైకుపై వెళుతున్న ఇద్దరిపై పిడుగుపడగా వారు అక్కడిక్కడే మృతి చెందారు. భువనగిరి మండలం బొల్లపల్లికి చెందిన వనకళి నర్సింహా(40), గొటికె శ్రీశైలం(40)లుగా మృతులను గుర్తించారు. -
తెలంగాణలో పలుచోట్ల వడగళ్లవాన..
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని పలుజిల్లాలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని మద్దురు మండలం బైరాన్‌పల్లిలో వడగళ్ల వాన కురిసింది. నల్గొండ జిల్లాలో రామన్నపేట, చిట్యాల మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మర్రిగూడ మండలం నర్సింహాపురంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలో వాతావరణం చల్లబడినట్టుగా కనిపిస్తోంది. నగరంలో పలుచోట్ల ఓ మోస్తారు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
హఠాత్తుగా గాలివాన
పలు జిల్లాల్లో పంటలకు నష్టం తడిసిన ధాన్యం.. రైతుల దైన్యం పిడుగులు, ఈదురు గాలుల బీభత్సం వర్షంతో స్తంభించిన జనజీవనం సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం హఠాత్తుగా గాలివాన కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఎండలతో అల్లాడుతున్న జనం సేదతీరినప్పటికీ.. వివిధ చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోగా, మరికొన్ని చోట్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో కురిసిన వర్షానికి ఆరు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఐనాపూర్‌లో మామిడికాయలు నేలరాలాయి. ఐకేపీ కొనుగొలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయింది. అంగడిబజారులో ఓ పెద్ద చెట్టు, హోటల్ కోసం వేసిన ఇల్లు కూలి, ఒకరికి గాయాలయ్యాయి. వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న వేపచెట్టు కూలడంతో ధ్వజస్తంభం విరిగిపోయింది. ఒక్క ఐనాపూర్ గ్రామంలోనే సుమారు 500 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నది. తపాస్‌పల్లి, పోసానిపల్లి, గురువన్నపేట, నాగపూరి గ్రామాల్లోనూ వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. బచ్చన్నపేట మండలంలోనూ పంటలకు నష్టం వాటిల్లింది. - కరీంనగర్ జిల్లాలో గాలివానతో పలుచోట్ల వడగళ్లు, పిడుగులు పడ్డాయి. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధర్మపురి మార్కెట్‌యార్డు, రాయపట్నం సిరిసిల్ల మండలం జిల్లెల్ల తదితర చోట్ల వందల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. రాయికల్, బెజ్జంకి, కోహెడ, సారంగాపూర్, ఇల్లంతకుంట మండలాల్లో గాలివానకు రేకులషెడ్లు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకూలి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. బెజ్జంకి మండలం కల్లెపల్లిలో కోళ్లఫారం రేకులు ఎగిరిపోయి 3 వేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలో పిడుగుపడి రైతు చిర్ర రాజయ్య(40) మరణించాడు. అరికిల్ల శంకరవ్వ, ఉరిమిట్ల లచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. - రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఇళ్లు, పశువుల పాకలు దెబ్బతినగా.. చేతికొచ్చే దశలో ఉన్న మామిడికాయలు రాలిపడ్డాయి. వేగంగా వీచిన గాలులతో మేడ్చల్‌లో పిడుగుపాటుతో చెట్టుకొమ్మలు విరిగి పడ్డాయి. శామీర్‌పేటలో ఈదురుగాలుల బీభత్సంతో ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. పశువుల పాక ధ్వంసం కావడంతో మూగ జీవాలతోపాటు యజమానికి గాయాలయ్యాయి. యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలో పిడుగుపాటుకు సెంట్రింగ్ పనిచేసే శ్యామ్ (25) మృతి చెందాడు. -మెదక్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురుగాలులు తోడై పలుచోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. తూఫ్రాన్‌లో కోళ్లఫారం ధ్వంసమై ఫారం మొత్తం నాశనమైంది. 8 వేల కోళ్లు మృత్యువాత పడగా రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. గాలి ధాటికి రేకులు అర కిలోమీటరు దూరం మేర ఎగిరిపడ్డాయి. అక్కడ వాతావరణం భీతావహంగా మారింది. కాస యాదగిరి పదేళ్లుగా ఇక్కడ పది వేల సామర్థ్యం కలిగిన కోళ్లఫారం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వర్షం దెబ్బకు 8 వేల కోళ్లకు కోల్పోయి రోడ్డున పడ్డాడు. బలంగా వీచిన గాలులకు పలుచోట్ల పిందె దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. దౌల్తాబాద్, తొగుట ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు వేళ్లతో సహా నేలకూలాయి. జగదేవ్‌పూర్ మండలం మాందాపూర్‌లో పిడుగు పడి ఎద్దు, మేక మృతి చెందాయి. పశువుల కొట్టంలో పడుకున్న ఎద్దు పడుకున్నట్టే కాలిపోయింది. దౌల్తాబాద్ మండలం రాంసాగర్‌లో పిడుగు పడి పశువుల కాపరి గాయపడ్డాడు. - ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి, లక్సెట్టిపేట మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. ఈదురుగాలతో రహదారులపై చెట్లు విరిగి పడ్డారుు. రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరదనీరు చేరి, జనజీవనం అస్తవ్యస్తమైంది. - మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండల కేంద్రంలో జరుగుతున్న జాతరలో ఈదురుగాలులకు గుడారాలు కూలి పోయాయి. కల్వకుర్తి మండలంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన పుట్టోజు మాధవాచారి వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన పాలీహౌస్ కూలిపోయి రూ.70 లక్షల ఆస్తినష్టం సంభవించింది. కేశంపేట మండలలోని వేముల చింతకింది రామయ్యకు చెందిన 16 మేకలు పిడుగుపాటు చనిపోయాయి. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. కొందుర్గు మండలం అయోధ్యపూర్ తండాల్లో ఓ లేగదూడ చనిపోయింది. కొత్తూరు మండల కేంద్రంలోని వినాయకస్టీల్ పరిశ్రమలో మెకానికల్ ఆపరేటర్ నబీ (45) (ఏపీలోని కర్నూలు వాసి) విధులు ముగించుకుని బైకుపై వెళుతుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజధానిలో తేలికపాటి జల్లులు మండుటెండలతో సతమతమైన రాజధాని హైదరాబాద్ వాసులకు ఆదివారం చల్లటి జల్లులు పలకరించడంతో స్వల్పంగా ఉపశమనం పొందారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 42.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో మండుటెండ చుర్రు మనిపించగా.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశాలున్నాయని, ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చు తగ్గులుంటాయని ప్రకటించింది. ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. చెట్టుకొమ్మలు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు తెగడంతో వంద ఫీడర్ల పరిధిలో దాదాపు గంటసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
పిడుగు పాటుకు ఇద్దరు మృతి
పిడుగు పాటుకు గురై రాష్ట్రంలో ఇద్దరు వృద్దులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుందూరు లక్ష్మమ్మ(65) సోమవారం గ్రామ సమీపంలోని వరి పొలంలో కలుపు తీస్తోంది. మధ్యాహ్నం హఠాత్తుగా వర్షం కురవడంతో అంతా దగ్గర్లోని చెట్టుకిందకు చేరారు. చెట్టుమీద పిడుగు పడటంతో లక్ష్మమ్మ అక్కడికక్కడే మరణించింది. సమీపంలో ఉన్న మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం కొమ్మివారిపల్లెకు చెందిన మేడికొండూరు నారాయణ(62) పిడుగు పాటుతో మరణించాడు. భార్యతో కలసి సోమవారం నిమ్మతోటలో కాయలు కోస్తుండగా.. నారాయణపై పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఆయన భార్య షాక్‌కు గురైంది. ఆమెను వెంటనే తోటి రైతులు రాజంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
పిడుగుపడి వీఆర్ఏ మృతి
పిడుగుపాటుకు గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్ఏ) ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీఆర్ఏ కొలుకుల నర్సింహులు ఇంటి దగ్గర పశువులకు మేత వేస్తుండగా సమీపంలోనే పిడుగు పడింది. దీంతో నర్సింహులతో పాటు ఓ దుక్కిటెద్దు మృతి చెందింది. -
పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి
గుంటూరు జిల్లా కాకునూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన మంగళగిరి షాహిదా(29) అనే వ్యవసాయ కూలీ ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. పొలంపనులకు వెళ్లిన షాహిదా పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన సాటి కూలీలు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పిడుగుపాటుకు ముగ్గురు మహిళల మృతి
మహబూబ్ నగర్: పిడుగు పాటుకు శనివారం ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం ఔసులోను పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు మహిళలు శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో పని చేస్తుండగా హఠాత్తుగా వారిపై పిడుగు పడింది. దీంతో భారతమ్మ, మణెమ్మ, శాంతమ్మ అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తివివరాలు తెలియాల్సిఉంది. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
బషీరాబాద్(రంగారెడ్డి): పిడుగుపాటుకు ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని నవల్గి గ్రామంలో వ్యవసాయ పొలంలో కూలీలు పనిచేస్తుండగా పిడుగుపడింది. దీంతో మంజుల(20), మహాదేవి(48), చెన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
విశాఖపట్నం (కె.తోటపాడు) : విశాఖ జిల్లా కె.తోటపాడు మండలం ఎడ్లవానిపాలెంలో శనివారం భారీ వర్షం కురిసింది. పిడుగు పడటంతో గ్రామానికి చెందిన ఎడ్ల ముత్యమమ్మ(28) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో గడ్డి కోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలాన్ని తహశీల్దార్‌తోపాటు పోలీసులు పరిశీలించారు. -
పిడుగుపాటుకి చిన్నారి మృతి
టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ముర్రేడువాగులో మేకలు కాసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులపై పిడుగుపడింది. ఇందులో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పిడుగుపాటుకి ఇద్దరి మృతి
హైదరాబాద్: చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలం చెన్నశెట్టిపల్లెలో శుక్రవారం పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ముక్కమల్ల రామ్మోహన్‌రెడ్డి(38) అనే రైతు చింతలబాబు పొలంలో అతనితో కలిసి మందు చల్లుతుండగా సమీపంలో పిడుగు పడింది. దీంతో రామ్మోహన్‌రెడ్డి అక్కడికక్కడే మరణించగా, చింతలబాబు చేయి చచ్చుబడిపోయింది. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని సీకాయపట్టెడ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(33) శుక్రవారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఇతను శుక్రవారం మధ్యాహ్నం పశువులను మేతకోసం సమీపంలోని పొలాల వద్దకు తోలుకెళ్లాడు. సాయంత్రం భార్యవచ్చి నేను ఉంటాను, ఇంటికి వెళ్లమని చెప్పింది. దాంతో ఇంటికి వెళుతుండగా పక్కనే పిడుగుపడి శరీరం పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
-
పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం జూపల్లి గ్రామం సమీపంలోని పత్తిచేనులో పిడుగు పడి ముగ్గురు మహిళలు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు...గ్రామానికి చెందిన గైని లక్ష్మీ, ఊషం సంగీత, గైని వాణి అనే ముగ్గురు మహిళలు మంగళవారం పొలం పనుల్లో ఉన్న సమయంలో భారీగా వర్షం కురవడంతో చెట్టుకిందకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడటంతో ముగ్గురు అక్కడకక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మహిళలు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. -
భోజనం చేస్తుండగా పిడుగుపాటు
దుర్గి (గుంటూరు) : అప్పటి వరకు పొలంలో చెమటోడ్చి... ఆకలితో భోజనం చేస్తున్న ఓ మహిళను పిడుగు బలి తీసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దుర్గి మండలం నెహ్రూ నగర్ తాండాకు చెందిన రమావతు శాంతిబాయి(25) సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పొలంలో చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తోంది. అదే సమయంలో వర్షంతోపాటు సమీపంలోనే పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శాంతిబాయికి భర్త బాల్సింగ్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
హిరమండలం(శ్రీకాకుళం): పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తి పశువులను మేపుతుండగా.. పిడుగు పడటంతో.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు చెందిన ఎద్దు కూడా మృతిచెందింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి మండలం పసుకుడి గ్రామంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. మోహన్‌గౌడ్ (50) శనివారంపశువులను మేపేందుకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో సమీపంలోనే పిడుగు పడడంతో మృతి చెందాడు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా బామిని మండలం పసికిడిలో పిడుగుపాటుకు మరో వ్యక్తి మృతి చెందాడు. ఇదే మండలంలో లోహరిగోలలో పిడుగుపాటుకు 50 గొర్రెలు మృతి చెందాయి. -
పిడుగుపాటుకు 100 జీవాలు బలి
భామిని (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి సుమారు 100 మేకలు, గొర్రెలు మృత్యువాతపడ్డాయి. భామిని మండలం లోహరిజోల గ్రామానికి చెందిన పోలినాయుడు, బాబూరావు అనే తండ్రీ,కొడుకులు తమ గొర్రెలు, మేకలను తోలుకుని శనివారం ఉదయం గ్రామ సమీపంలోని పొలాలవైపు వెళ్లారు. కాగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ జీవాలపై పిడుగుపడింది. దీంతో సుమారు 100 మేకలు, గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. -
పిడుగుపాటుకు మహిళ దుర్మరణం
విడవలూరు : పిడుగుపాటుతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రం శివారులో ఈ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిడుగు పడడంతో సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న సుబ్బమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది. -
పిడుగుపాటుతో 20 గొర్రెలు మృతి
బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని భూగానపల్లిలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. బనగానపల్లి మండలం నందవరం గ్రామానికి చెందిన కొందరు గొర్రెలను తీసుకుని భూగానపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో గడ్డి మేపేందుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతోపాటు పిడుగు పడడంతో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. -
పిడుగు పడి ఇద్దరు మృతి
నాగర్‌కర్నూలు : మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మండలం పెద్దాపూర్ శివారులో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో వ్యవసాయ పనుల్లో ఉండగా సమీపంలోనే పిడుగు పడడంతో బక్కమ్మ (55), ఈశ్వరమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బాలయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
పిడుగుపాటు : ఆరుగురికి గాయాలు
పెద్దేముల్ (రంగారెడ్డి) : పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం కట్టేపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. ఉరుమలతో కూడిన వర్షం రాగా అదే సమయంలో ఓ ఇంటి సమీపంలో పిడుగుపడింది. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న శ్రీను(35), శివ(25), సుజాత(25), ప్రభు(23), ఉమ(18), పూజ(8)లు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పిడుగులు పడి ఇద్దరు మృతి
జి.కొండూరు/కృత్తివెన్ను : పిడుగుల ప్రభావంతో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఆదివారం రాత్రి కృత్తివెన్ను మండలం పోడు గ్రామంలో ఒకరు, సోమవారం సాయంత్రం జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడులో మరొకరు చనిపోయారు. పోడు గ్రామానికి చెందిన ఎన్.పోతురాజు (55) చెరువులో పీత మేత వేయడానికి వెళ్లిన సమయంలో భారీ వర్షం కురియటం, పిడుగులు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతను ఎంతసేపటికీ ఇంటికి రాకపోవటంతో గాలింపు చేపట్టిన కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి చెరువు వద్ద అతని మృతదేహాన్ని గుర్తించారు. సోమవారం అతని మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడులో గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన అమర్లపూడి దావీదు (35) కూలి పనుల నిమిత్తం వలస వచ్చి గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో నాట్లు వేసేందుకు సోమవారం వెళ్లిన దావీదు ఇంటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పిడుగు పడింది. ఆ ప్రభావానికి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దావీదుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
పిడుగుపాటుతో వ్యక్తి మృతి
జి.కొండూరు (కృష్ణా) : పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీ ఒకరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన అమరపూడి దావీదు(35) మండలంలోని ముత్యాలంపాడు(హెచ్)లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా ఆయన సోమవారం గ్రామంలోని ఓ రైతుకు చెందిన పొలంలో వరి నాటు వేశాడు. ఇంటికి తిరిగి వచ్చేందుకు బయలుదేరుతుండగా చిన్నగా వర్షం మొదలైంది. అంతలోనే హఠాత్తుగా ఆయనపై పిడుగు పడింది. దీంతో దావీదు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. -
పిడుగుపాటుతో వ్యక్తి మృతి
సత్తెనపల్లి (గుంటూరు) : పిడుగు పాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని భట్లూరు గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గేదెలు మేపుతుండగా పిడుగు పడింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. -
పిడుగుపాటుకి ముగ్గురు మృతి
పెనుగంచిప్రోలు (కృష్ణా) : పిడుగుపాటుతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని శనగపాడు గ్రామంలో వ్యవసాయ పొలంలో పిడుగుపడటంతో ఆ సమయంలో అక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మృతులు రాజారత్నం, విశాక్, సత్యేశ్రావులుగా స్థానికులు గుర్తించారు. -
పిడుగు కాటు
డిగ్రీ విద్యార్థి దుర్మరణం పొలం పనులు చేస్తుండగా దుర్ఘటన దేవరాపల్లి: పిడుగు పాటుకు విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం మండల కేంద్రం దేవరాపల్లి కొరుపోలు వారి కల్లాలు వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొరుపోలు సింహాచలం నాయుడు (21) వర్షం కురుస్తున్నప్పటికీ వరినాట్లుకు అనుకూలంగా పారపని చేస్తున్నాడు. అకస్మాత్తుగా పిడుగు నేరుగా అతనిపై పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇతడు ప్రస్తుతం బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రామ్మూర్తి రెండేళ్లు క్రితం చనిపోవడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఇతనికి తల్లి దేముడమ్మ ఉంది. ఇప్పుడామె ఒంటరిదయింది. దేవరాపల్లిలో విషాదం అందరితో కలిసి మెలిసి ఉండే సింహాచలం నాయుడు పిడుగు పాటుకు మరణించాడని తెలియడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అతని మృతదేహాన్ని చూసేందుకు పీహెచ్‌సీకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. తల్లి దేముడమ్మ, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవరాపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మోదిగూడ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మోదిగూడ గ్రామానికి చెందిన కనక మారుతి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వ్యవసాయ బావి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపడి మృతిచెందాడు. అయితే రాత్రి నుంచి మారుతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం వెతుక్కుంటూ వెళ్లి చూడగా వ్యవసాయబావి వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. -
పిడుగుపాటుకు 8మంది మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం పిడుగుపాటుకు ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. సాయంత్రం వరకు ఎండలు, ఉక్కపోతలతో ఉన్న వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో వర్షంతోపాటు ఉరుములు మెరుపులతో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న కాగజ్‌నగర్‌లో మండలంలోని చింతగూడ గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న మెస్రం గిరిజాబాయి(16), దరిగాం గ్రామంలో ఆత్రం అయ్యూబాయి(16)లు మరణించారు. అలాగే, బెజ్జూర్ మండలంలో పోతపల్లి గ్రామంలో పత్తిచేనులో విత్తనాలు నాటుతుండగా ఆత్రం లలిత(20) అనే డిగ్రీ విద్యార్థిని, కౌటాల మండలంలోని తాడిపల్లిలో పొలం పనులు చేసుకుంటుండగా తుమ్మిడి మంగళబాయి(28), రౌతు ఉద్దవ్(30), బాబాసాగర్ గ్రామంలో రౌతు వెంకటేశ్(29), చింతమానపల్లి గ్రామంలో పూజారి పార్వతి(22), చెన్నూర్ మండలం సోమారంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బట్టె దుర్గయ్య (32) పిడుగుపాటుతో మృత్యువాతకు గురయ్యారు. -
విజయనగరంలో భారీ వర్షం
విజయనగరం: విజయనగరం జిల్లాలో సోమవారం పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. పార్వతీపురం, విజయనగరం మండలాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాగా జిల్లాలోని ప్రదీప్ నగర్లో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు కాలిపోయింది. -
పిడుగుపాటుతో బీజేపీ నేత కుమారుని మృతి
సుల్తానాబాద్ (కరీంనగర్): పిడుగుపాటుతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్ధాల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన అరవింద్‌రెడ్డి (25) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున పిడుగుపాటుతో మృతి చెందాడు. కాగా, మృతుడు బీజేపీ సీనియర్‌నేత వెంగల్రావు కుమారుడిగా సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురంలో సోమవారం పిడుగుపడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పళ్ల అప్పయ్య(45) అనే వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా అంతటా ఆదివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. -
పిడుగుపాటుకు దంపతులు బలి
బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సీతారామపురం గ్రామంలో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సీతారామపురం గ్రామానికి చెందిన పాపన్న, ఆయన భార్య భాగ్యమ్మ శుక్రవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లారు. భార్యాభర్తలు పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం మొదలయ్యింది. దాంతో సమీపంలోని ఓ చెట్టును ఆశ్రయించారు. చెట్టు కింద ఉండగా... సమీపంలోనే పిడుగు పడడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. -
పిడుగుపాటుతో కూలీ మృతి
భట్టిప్రోలు (గుంటూరు జిల్లా) : పిడుగుపాటుకు ఇసుక క్వారీలో పని చేస్తున్న కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలోని ఇసుక క్వారీ వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. ఓలేరు గ్రామానికి చెందిన ఉప్పాల సత్యనారాయణ(45) సమీపంలోని ఇసుక క్వారీలో కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం క్వారీలో పనిచేస్తుండగా అతని సమీపంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రేపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు సమాచారం. -
పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
రేగిడి (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పెద్దసిర్లాం గ్రామానికి చెందిన కోడుబోయిన సంగం(55), అతని కుమారుడు బంగారి(38) మేకలు మేపేందుకు గురువారం మధ్యాహ్నం పొలాలకు వెళ్లారు. కాగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. అదే సమయంలో పొలంలో మేకలు మేపుతున్న సంగం, బంగారిపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. కాగా పిడుగు శబ్దానికి మేకలు తలోదిక్కు పరుగు తీశాయి. -
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. వాంకిడి మండలం కమాన గ్రామంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పొలంలో పనులు చేసుకుంటున్న ఆర్జె. రాజన్న(40), ఆర్జె విమలాబాయి(38) వర్షానికి చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగుపడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పిడుగుపడి భారీగా ఎగసిన మంటలు
బి.కొత్తకోట: చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని కోటావూరు గ్రామం సమీపంలో ఓ గుట్టపై బుధవారం పిడుగు పడగా ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. గుట్టపై 33 కేవీ విద్యుత్‌లైన్ దగ్గర బుధవారం తెల్లవారుజామున పిడుగుపడింది. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభం వద్ద పొగలు వస్తుండడాన్ని గుర్తించి గ్రామస్తులు అక్కడికెళ్లి చూడగా... భూమి చీలినట్టు ఉండి మంటలు ఎగసిపడడం కనిపించింది. సర్పంచ్ జయచంద్రారెడ్డి విద్యుత్ శాఖ ఏఈకి సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. ఏఈ గుట్టవద్దకు చేరుకుని ట్యాంకర్లతో నీటిని తెప్పించి పోయించారు. మంటలు ఆరిపోయినా లోపలి నుంచి ఆవిర్లు, వేడి మాత్రం తగ్గలేదు. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
వైఎస్సార్ జిల్లా : శుక్రవారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షాలకు పిడుగులుపడి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా నిజాంనగర్ కాలనీకి చెందిన చిన్న గంగన్న(52)పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. చిన్న గంగన్న మృతితో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. అదేవిధంగా పెండ్లిమర్రి మండలం బుడ్డాయపాలెంలో మరో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. కాగా మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
-
పిడగుపాటుకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి
చిత్తూరు (చౌడేపల్లి): పిడుగుపాటుతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని లగిరిమిట్టపల్లికి చెందిన వెంకటరమణ, పద్మావతి దంపతుల చిన్న కుమారుడు ఉమ్మిరాజు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే వేసవి సెలవులకు ఇంటికి వచ్చాడు. రాత్రి వర్షం పడుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి దగ్గర ఉన్న సామానును లోపల వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో విద్యార్థి కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. -
పిడుగుపాటుకు రైతు మృతి
శ్రీకాకుళం (సీతంపేట): పిడుగు పాటుతో ఓ వ్యక్తితో పాటు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బామిని మండలంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని సొలికిరి గ్రామానికి చెందిన సింహాద్రి(34) వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండితో పొలానికి వెళుతుండగా పిడగు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పాలకొండ నియోజక వర్గంలో బుధవారం అర్ధరాత్రి నుంచి సీతంపేట, బామిని మండలాల్లోవర్షం కురుస్తుంది. -
పిడుగుపాటుకు వ్యక్తి బలి
కొత్తబొమ్మాళి : శ్రీకాకుళం జిల్లా కొత్తబొమ్మాళి మండలం కొత్తపల్లిలో సోమవారం సాయంత్రం పిడుగుపడింది. ఈ ఘటనలో సారవకోట మండలం కేజేపురం గ్రామానికి చెందిన పేరు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, కొత్తూరు, టెక్కలి, సారవకోట, కొత్తబొమ్మాళి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలులు భారీగా వీయడంతో కొన్నిచోట్ల పూరిళ్ల పైకప్పులతో పాటు రేకులు కూడా ఎగిరిపోయాయి. -
పిడుగుపాటుతో నలుగురి మృతి
జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా): పిడుగుపాటుతో నలుగురు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. గాంగాపూర్ గ్రామ సమీపంలో పిడుగుపడటంతో అదే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నలుగురు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. -
పిడుగుపాటుతో వ్యక్తి మృతి
రాయదుర్గం(అనంతపురం జిల్లా): పిడుగుపాటుకు గుండె ఆగిపోయి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74ఉడేగోలం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మగల్లు మండలం రంగచేడ్ గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం 74ఉడేగోలం గ్రామంలో ఉల్లినారుకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. అయితే గురువారం భయంకరంగా పిడుగుశబ్దాలు, ఈదురుగాలులు వీచాయి.ఆ సమయంలో తన సమీపంలో పిడుగుపడటంతో భయంతో రామాంజనేయులు గుండె ఆగిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపాటుకు 26 మేకల మృతి
అవుకు (కర్నూలు) : పిడుగుపాటుకు 26 మేకలు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలోని కంభగిరిస్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అవుకుకు చెందిన లాలూనాయక్ అనే వ్యక్తి తన మేకలను సమీపంలోని అడవికి తోలుకెళ్లాడు. ఈ క్రమంలో కంభగిరిస్వామి ఆలయ సమీపంలో మేకలు మేత మేస్తుండగా లాలూనాయక్ ఆలయం వద్ద కూర్చున్నాడు. ఒక్కసారిగా వర్షంతో పాటు పిడుగు పడడంతో 26 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. దాంతో మేకల యజమాని లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. -
పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి
ముద్దనూరు : వైఎస్సార్ జిల్లా ముద్దనూర్ మండలంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కురిసిన అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది. గాలివాన తాకిడికి ఆర్పీపీ రహదారిపై చెట్లు కూలి పడిపోవటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ మార్గంలోని దాదాపు నలభై వరకు స్తంభాలు కూలటంతో రాత్రి నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది. పిడుగుపాటుకు మండలకేంద్రంలోని శివాలయం వద్ద ఉన్న40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. -
పిడుగుపాటుకు 36 మేకలు మృతి
విజయనగరం: పిడుగుపాటుకు 36 మేకలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకింగుర గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. ఇదే మండలం బుసాయివలస గ్రామానికి చెందిన రైతు కొయ్యన సోములు తనకున్న మేకలతో మేతకోసం బయలుదేరాడు. ఈ సమయంలో పిడుగు పడటంతో మేకలన్నీ మృతిచెందాయి. జీవనోపాధి కోల్పోవడంతో రైతు బోరున విలపించాడని సమాచారం. (రామభద్రాపురం) -
పిడుగుపడి వ్యక్తి మృతి
నిజామాబాద్: పిడుగు పడటంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం బండ రెంజల్ గ్రామంలో గురువారం తె ల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయిరాం(45) అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో వర్షం రావడంతో చెట్టు కిందకు పరిగెత్తాడు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో సాయిరాం అక్కడికక్కడే మృతిచెందాడు. -
పిడుగు పడి ఇద్దరి పరిస్థితి విషమం
విజయనగరం: ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతోంది. బుధవారం జిల్లాలోని సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక డాక్టర్లు తెలపడంతో వెంటనే వారిని విజయనగరం ఆస్పత్రికి త రలించారు. -
పిడుగుపాటుకు కాడెద్దులు బలి
మహబూబ్ నగర్: జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని సదగోడులో శనివారం రాత్రి పిడుగు పాటుకు మొగిలి లక్ష్మయ్యకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి. రోజు మాదిరిగానే సాయంత్రం పొలంలో కట్టేసి ఉంచిన ఎద్దులు ఉదయం వెళ్లి చూసేసరికి చనిపోయి పడివున్నాయని బాధిత రైతు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తంచేశాడు. తహశీల్దార్ సైదులు సూచనమేరకు వీఆర్వో సుదర్శనాచారీ ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. చనిపోయిన ఎద్దుల విలువ రూ. 80 వేల వరకు ఉంటుందని వీఆర్వో తెలిపారు. -
పిడుగుపాటుకు బాలుడు మృతి.. చూపు కోల్పోయిన మహిళ
కారంపూడి(గుంటూరు): పొలంలో మిరపకాయలు కోస్తున్న బాలుడిపై పిడుగు పడి దుర్మరణం చెందగా, మరో మహిళకు కళ్లు కన్పించకుండా పోయిన ఘటన గుంటూరు జిల్లా కారంపూడి మండలం కాచవరం గ్రామంలో జరిగింది. వివరాలివీ.. గ్రామంలోని ఉత్తరపు పొలంలో కూలీలు మిరపకాయలు కోస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే చేలో పిడుగు పడింది. మిరపకాయలు కోస్తున్న కేతావతు రాజానాయక్(11) పిడుగు పాటుకు అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం యజమానురాలు సయ్యద్ కాసింబీకి మెరుపు కళ్లలో పడడంతో ఆమె కళ్లు తెరవడానికి వీల్లేకుండా మూసుకు పోయాయి. కాగా, రాజానాయక్‌కు తల్లి లేదు. తండ్రితో పాటు నల్లగొండ జిల్లా దేవరకొండ దగ్గరున్న నీలకుంట గ్రామం నుంచి మరికొందరితో కలసి వలస కూలీగా వచ్చాడు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని బోడెవలస గ్రామంలో పిడుగు పడటంతో వెంకటబైరిపురం గ్రామానికి చెందిన వెలమల పార్వతి(40) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. వివరాలు...పార్వతి కట్టెలకోసం బోడెవలస గ్రామ సమీపాన కొండ దగ్గరకి వచ్చింది. ఆ సమయంలోనే ఈదురు గాలులు వీయటంతో పక్కనే ఉన్న పాకలోకి చేరుకుంది. రవిప్రసాద్ అనే వ్యక్తి కూడా వర్షం మొదలవటంతో పాకలోకి చేరుకున్నాడు. ఒక్కసారిగా దభేలున పిడుగు పడటంతో పార్వతి మృతి చెందింది. రవిప్రసాద్ అపస్మారకస్థితిలో ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. (మక్కువ) -
పిడుగుపాటు మరణాలకూ ఇక పరిహారం
14వ ఆర్థిక సంఘానికి చేరిన ప్రతిపాదనలు న్యూఢిల్లీ: పిడుగుపాటును ప్రకృతి వైపరీత్యంగా పరగణించి, పిడుగుపాటుతో సంభవించే మరణాలకూ ప్రభుత్వం త్వరలో నష్టపరిహారం చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి, కేంద్ర హోంమంత్రిత్వశాఖ 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిన పక్షంలో పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లభిస్తుంది. దేశవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 400 మంది పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ వైపరీత్యాల సహాయ నిధినుంచి, వివిధ రాష్ట్రాల వైపరీత్యాల సహాయ నిధులనుంచి పిడుగుపాటు మరణాలకు పరిహారం అందే విధంగా, పిడుగుపాటు సంఘటనను వైపరీత్యాల జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వశాఖ 14వ ఆర్థిక సంఘానికి సమర్పించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి పిడుగుపాటు దుర్ఘటన, పరిహారానికి అర్హమైన ప్రకృతి వైపరీత్యాల జాబితాలో లేదు. కాగా, తనకు అందిన ప్రతిపాదనలపై 14వ ఆర్థిక సంఘం ఈ నెల 31లోగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. -
పిడుగుపడి రైతు మృతి
తొండూరు: మండలంలోని టి.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన బండి కృష్ణారెడ్డి(43) అనే రైతు పిడుగుపడి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. బంధువుల కథనం మేర కు.. కృష్ణారెడ్డి తన పొలంలో రబీలో బుడ్డ శనగ పంటను సాగు చేశాడు. శుక్రవారం సాయంత్రం పొలంలో కలుపు ను తొలగిస్తుండగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో రైతుపై పిడుగు పడటంతో పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. రాత్రి 8గంటలైనా కృ ష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో భార్య రమణమ్మ, బంధువులతో కలిసి పొలం వద్దకు వెళ్లగా అప్పటికే అతను పొలంలో మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య రమణమ్మతోపాటు పిల్లలు శ్రీలత, శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. రైతు మృతితో టి.తుమ్మలపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రబీలో సాగు చేసిన పంటలు చేతికందగానే బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ పంట పండక ముందే మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణారెడ్డికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నాయకులు : టి.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన బండి కృష్ణారెడ్డి అనే రైతు పిడుగుపాటుతో మృతి చెందాడనే విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్సీపీ నాయకులు శనివారం పులివెందుల ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు. వీరిలో వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రగంగిరెడ్డి, ఎంపీపీ భర్త రవీంద్రనాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రమణారెడ్డి, సర్పంచ్ చిన్న గంగిరెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ వెంకటరామిరెడ్డి, సైదాపురం మాజీ సర్పంచ్ సురేష్‌రెడ్డి తదితర నాయకులు ఉన్నారు. -
పిడుగుపాటుకు 26 మందికి అస్వస్థత
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఘటన కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం మైలారంలో ఆదివారం ఉదయం 11 గంటలకు పిడుగు పడడంతో పత్తి చేనులో పనిచేస్తున్న 26 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వారు చేనులో పత్తి తీస్తుండగా చిన్నపాటి వర్షం పడింది. దీంతో అందరూ సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్దామని బయలుదేరారు. వారు చెట్టుకు 100 గజాల దూరంలో ఉండగానే ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో షాక్‌కు గురైన కూలీలంతా అస్వస్థతకు లోనయ్యారు. పక్కనున్న వారు కూలీలను కొత్తగూడెం మండలం రేగళ్లలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
పిడుగుపాటుకు రైతు బలి
గిద్దలూరు : పిడుగుపాటుకు రైతుతో పాటు అతనికి చెందిన ఎద్దు కూడా మృతిచెందింది. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వేములపాడుకు చెందిన మోక్షగుండం అంకయ్య (37) తన రెండు ఎద్దులను గ్రామ సమీపంలోని పొలాల్లో మేపుకుంటుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో ఎద్దులను తోలుకుని పొలం నుంచి ఇంటికి బయలుదేరాడు. ముందువైపు ఒక ఎద్దు, వెనుకవైపు ఒక ఎద్దు నడుస్తుండగా మధ్యలో అంకయ్య నడుస్తున్నాడు. పొలంలో నుంచి రోడ్డుమీదకు వచ్చిన కొద్దిసేపటికే అంకయ్య కాళ్లవద్ద పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెనుక ఉన్న ఎద్దు కూడా పిడుగుపాటుకు మృతిచెందగా, ముందువైపున్న ఎద్దు భయపడి వేగంగా పరిగెడుతూ గ్రామానికి చేరుకుంది. పిడుగుపడిన ప్రదేశంలో తారురోడ్డుపై రంధ్రం ఏర్పడింది. అటుగా వెళ్తున్న వారు గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని భోరున విలపించారు. అంకయ్య స్వగ్రామం బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం కాగా, అతని అక్క అంకమ్మను వేములపాడుకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. అంకమ్మ కుమార్తె లింగమ్మను వివాహం చేసుకున్న అంకయ్య.. 12 సంవత్సరాలుగా వేములపాడులోనే నివాసముంటూ వ్యవసాయం చేస్తున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని చూసి వారంతా కన్నీరుమున్నీరయ్యారు. అంకయ్యతో పాటు మృతిచెందిన ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుంది. గ్రామ వీఆర్వో శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గిద్దలూరులోనూ పిడుగు... గిద్దలూరు పట్టణంలోని పాండురంగారెడ్డినగర్లో ఉన్న బాలరంగారెడ్డి ఇంటిపై కూడా మంగళవారం పిడుగుపడింది. దీంతో మిద్దెపై ఉన్న గోడ దెబ్బతింది. పైఅంతస్తులో అద్దెకు ఉంటున్న చిన్నారెడ్డి గృహంలోని టీవీ, విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి. -
రెండుచోట్ల పిడుగుపాటు ఇద్దరు సజీవ దహనం
కొప్పురాయి (టేకులపల్లి): ఏజెన్సీలో దారుణం జరిగింది. పిడుగుపాటుతో ఇద్దరు సజీవంగా దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పురాయి పంచాయతీలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన సోలెం బుచ్చిరాములు-పొట్టెమ్మ, కుంజా ముత్తయ్య-పుల్లమ్మ, చింత లక్ష్మయ్య-కల్యాణి దంపతులు బర్లగూడెం సమీపం లోని అటవీ ప్రాంతంలో కొన్నేళ్ళుగా సాగు చేసుకుంటున్నారు. రోజులాగానే వీరు మంగళవారం ఉదయం చేను వద్దకు వెళ్లారు. పొట్టెమ్మ, ముత్తయ్య మాత్రం వెళ్లలేదు. చేను వద్ద పని చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో, దగ్గరలోని గుడిసెలోకి కుంజా పుల్లమ్మ(40), సోలెం బుచ్చిరాములు(33), చింత లక్ష్మయ్య, చింత కల్యాణి తలదాచుకున్నారు. కొద్దిసేపటి తరువాత, సరిగ్గా ఆ గుడిసెపై భారీ శబ్దంతో పిడుగు పడి, మంటలు లేచాయి. గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో చిక్కుకుని కుంజా పుల్లమ్మ(40). సోలెం బుచ్చిరాములు(33) సజీవంగా దహనమయ్యారు. శబ్దం వినపడగానే చింత కల్యాణి బయటకు పరుగెత్తింది. కాలిపోతున్న గుడిసెలో ఉన్న తన భర్త లక్ష్మయ్యను రక్షించేందుకు వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చింది. తన వద్దనున్న కండువాను లక్ష్మయ్య కాళ్ళకు చుట్టి గట్టిగా బయటకు లాగి దూరంగా తీసుకెళ్లింది. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజారాం తండాలో కూడా... రాజారాంతండాలోని చేనులో కూడా పిడుగు పడింది. అక్కడికి సమీపంలో అరక కట్టడానికి సిద్ధమవుతున్న పిడుగు ప్రభాకర్ అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన ప్రదేశాలను బోడు ఎస్ఐ ముత్తా రవికుమార్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి ఎస్ఐ తరలించారు. రెండు గ్రామాల్లో విషాధం ఈ విషాద ఘటనలతో కొప్పురాయి పంచాయతీలోని ఒడ్డుగూడెం, మోదుగులగూడెం గ్రామా ల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోలెం బుచ్చిరాములు ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన పొట్టెమ్మను వివాహమాడి ఇల్లరికం వచ్చాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో పాప సుమత మానసిక, శారీరక వికలాంగురాలు. పెద్ద పాప స్పందన నాలుగో తరగతి చదువుతోంది. మూడో పాప సాత్వికకు రెండేళ్ళు. చింత పుల్లమ్మ స్వగ్రామం మోదుగులగూడెం. భర్త ముత్తయ్యతో కలిసి వ్యవసాయం చేస్తోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
పిడుగుపాటుకు మందుగుండు పేలి ఇద్దరు దుర్మరణం
పిడుగుపాటుకు క్వారీలో మందుగుండు పేలి ఇద్దరి దుర్మరణం నలుగురికి తీవ్రగాయాలు కొత్తగట్టు శివారు క్వారీలో ఘటన ఆత్మకూరు : క్వారీలో పనికి వెళ్లిన కూలీల ప్రాణాలు గాలిలో కలిశాయి. క్వారీలో పేల్చేందుకు మందుగుండును సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడి భారీ పేలుడు జరగడంతో ఇద్దరు కార్మికులు అక్కడిక క్కడే మృతిచెంది మాంసపు ముద్దలుగా మారారు. బండరాళ్లు తగిలి మరో నలుగురు తీవ్రం గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కొత్తగట్టు సమీపంలోని మహేందర్‌రెడ్డి క్వారీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అక్కంపేటకు చెందిన ఏడుగురు కార్మికులు, శాయంపేట మండలం మాందారిపేటకు చెందిన ఒక కార్మికుడు ఈ క్వారీలో పనిచేస్తున్నారు. కార్మికులంతా క్వారీలో ఇటీవల బ్లాస్టింగ్లు జరిపి రాళ్లను వేరు చేశారు. మళ్లీ రెండు రోజులుగా బ్లాస్టింగ్ బోర్లలో మందుగుండు సామగ్రి నింపుతున్నారు. మందుగుండు నింపడం పూర్తయ్యాక కొంతదూరం వెళ్లి పేల్చాల్సి ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం వర్షం మొదలైంది. దీంతో కార్మికులు పేలుళ్లకు సిద్ధమవుతండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో మందుగుండు భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో బండరాళ్లు ఎగిరిపడి అక్కంపేటకు చెందిన కార్మికుడు ఓర్సు కిష్టయ్య(35), శాయంపేట మండలం మాందారిపేటకు చెందిన జడిశెట్టి మధుకర్(20) అక్కడికక్కడే మృతి చెందారు. వారి మీద రాళ్లు పడటంతో నుజ్జునుజ్జయ్యారు. అక్కంపేటకు చెందిన ఓర్సు సాలయ్య, దారగండ్ల మధుకర్, పల్లపు సమ్మయ్య, సారంగుల సమ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.కార్మికులు మల్లేశ్, ఐలయ్య క్షేమంగా బయటపడ్డారు. కుమారు డు కిష్టయ్య చనిపోవడం.. తండ్రి సాలయ్య తీవ్రం గా గాయపడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడు కిష్టయ్యకు భార్య దుర్గ, ఒక కుమారుడు ఉండగా, మధుకర్‌కు భార్య ఐల మ్మ, దత్తత తీసుకున్న ఒక కుమార్తె ఉన్నారు. అనుమతులు లేకుండానే పేలుళ్లు ? మహేందర్‌రెడ్డి క్వారీలో పేలుళ్లకు అనుమతులు లేవ ని తెలిసింది. ఈ క్వారీలో యథేచ్ఛగా పేలుళ్లు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల 43 బోర్ బ్లాస్టింగ్లు ఏర్పాటు చేశారని వారు తెలిపారు. కాగా ఈ క్వారీ అనుమతుల విషయమై తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా అనుమతులు ఉంది.. లేనిది. శనివారం చూసి చెబుతానన్నారు. -
కారు మబ్బు కమ్మేసింది
పొదిలి : పత్తిపొలంలో కలుపు తీసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళా కూలీలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మాదాలవారిపాలెంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో గ్రామానికి చెందిన దామరెడ్డి సాయమ్మ(60), కాపులపల్లి రామసుబ్బులు(50), పోతల ధనమ్మ(30) ప్రాణాలు కోల్పయారు. ఎస్సై నాగమల్లేశ్వరరావు,తహశీల్దార్ పి.విద్యాసాగరుడు వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ట్రాక్టర్లో పొదిలి తరలించారు. ఆ ఇంటికి సాయమ్మే దిక్కు కూలి పనికి పోతేనే సాయమ్మ కుటుంబం గడిచేది. ఆమె భర్త పని చేయలేడు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిగి అంతా ఎవరిదారిన వారు వెళ్లారు. పెద్ద కొడుకు ఏమయ్యాడో కూడా తెలియదు. ఆరోగ్యం బాలేదంటే ఇంటి వద్దే ఉండమన్నా వినకుండా పనికి వెళ్లి కనిపించకుండా పోయిందని సాయమ్మ భర్త దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు. బిక్కుబిక్కుమంటున్న పిల్లలు ధనమ్మ,పుల్లయ్య దంపతులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. ముగ్గురు కుమారులను బడికి పంపుతున్నారు. వారికి ఏలోటూ రాకుండా చూస్తున్నారు. పాఠశాలలో ఉండగానే సమాచారం అందటంతో ఇంటికి చేరిన పిల్లలు వీరబ్రహ్మం, ఈశ్వర్, వీరాంజనేయులు తల్లి ధనమ్మ మృతదేహం వద్ద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. పని చేస్తూ.. చేయిస్తూ... కాపులపల్లి రామసుబ్బులు అనే మహిళ తమ సొంత పొలంలో పనిచేస్తూనే పిడుగుపాటుకు ప్రాణాలొదిలింది. కూలీలతో పనులు చేయిస్తూ, తాను కూడా వారితో కలిసి పనిచేస్తూ కలివిడిగా ఉండేది. రామసుబ్బులుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పొలంలో పనిచేస్తూ కూలీలు చనిపోవటం బాధగా ఉందని రామసుబ్బులు భర్త వెంకటరెడ్డి అలియాస్ శివరాజ్ హృదయవిదారకంగా రోదిస్తున్నాడు. అమ్మా.. లేమ్మా! రామసుబ్బులు తోడుకోడలు కుమార్తె అశ్విని. తండ్రి చనిపోయినప్పటి నుంచి పెద్దమ్మ రామసుబ్బులు, పెద్దనాన్న శివరాజ్‌ల సంరక్షణలో పెరుగుతోంది. రామసుబ్బులను ఎప్పుడూ పెద్దమ్మా అని పిలవదు. అమ్మా అని మాత్రమే పిలిచేది. తనను గారాబంగా చూసుకునే అమ్మ విగతజీవై ట్రాక్టర్లో అచేతనంగా పడి ఉండటాన్ని చూసి అశ్విని బిగ్గరగా రోదిస్తోంది. మృతదేహాన్ని తట్టి లేపుతూ అమ్మా ఒక్కసారి లేమ్మా అంటూ రోదిస్తున్న అశ్వినిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అండగా ఉంటా : ఎమ్మెల్యే జంకె సంఘటన జరిగిన సమయంలో తహ శీల్దార్ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హుటాహుటిన మాదాలవారిపాలెం చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, రావి భాషాపతిరెడ్డి, నాయకులు గొలమారి చెన్నారెడ్డి, వాకా వెంకటరెడ్డి, ఓంకార్, పి.శ్రీనివాసులు, బాలవెంకటేశ్వర్లు, గుంటూరు పిచ్చిరెడ్డి, మీగడ ఈశ్వరరెడ్డి, దోర్నాల చిన్ననారాయణరెడ్డి తదితరులు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
ప్రకృతి శాపం..జీవితం దుర్భరం!
చిన్నకోడూరు: అతనో మామూలు బక్క రైతు.. నేల తల్లిని నమ్మి కుటుంబాన్ని పోషించుకుందామనుకున్న ఆ అభాగ్యుడి ఆశలు అడియాశలయ్యాయి. ప్రకృతి పగబట్టి పిడుగు రూపంలో మృత్యువు అంచుల వరకు తీసుకవెళ్లింది. దీంతో ఆయన ఏడాది కాలంగా జీవచ్ఛవంలా బతుకీడుస్తున్నాడు. ఇంటి పెద్దను కాపాడుకునేందుకు ఆ కుటుంబం పడుతున్న వ్యధ వర్ణనాతీతం. వైద్య చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శరీరంలోని ఒక భాగం స్పర్శ కోల్పోవడంతో సంవత్సర కాలంగా మంచానికే పరిమితమైన బాధితుని వివరాలు ఇలా ఉన్నాయి.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన ఈరగారి కిష్టారెడ్డి (39) ఊరి శివారులోని ఐదెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. గత ఏ డాది జూన్ 5న వర్షంతో పాటు పిడుగు పడడం తో పొలంలో పనులు చేసుకుంటున్న మరో ఇద్దరు రైతులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ ప్రాంతానికి కొద్ది దూరం లో వ్యవసాయ పనులు చేసుకుంటు న్న కిష్టారెడ్డి పిడుగుపాటుతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించినా నాటి నుంచి నేటి వరకు ఆయన కుడి చేయి, కుడి కాలు, కుడి కన్ను పని చేయకుండా పోయాయి. దీంతో కిష్టారెడ్డిని మామూలు మనిషిగా మార్చేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వైద్య ఖర్చుల కో సం నగలను అమ్ముకున్నారు. వైద్య ఖర్చులు తలకుమించి భారంగా మారడం, కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా నిలవడంతో కుటుంబ సభ్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నరకం అనుభవిస్తున్నాం... పిడుగు పాటుతో జీవచ్ఛంగా మారిన భర్త కిష్టారెడ్డిని చూస్తూ నరకం అనుభవిస్తున్నానని, ఏడాది కాలంగా మంచానికే పరిమితమైన ఆయన బాధ వర్ణనాతీతమని భార్య కవిత, కుమార్తె నిఖిత ఆవేదనవ్యక్తం చేశారు. -
పిడుగుపాటుకు విద్యార్థి మృతి
స్నేహితుడికి తీవ్రగాయాలు జగ్గయ్యపేటలో ఘటన జగ్గయ్యపేట : పట్టణంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి ఓ విద్యార్థి మృతిచెందగా, అతడి స్నేహితుడికి గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్ర కారం.. పట్టణంలోని క్రిస్టియన్ పేటకు చెందిన పె రుమాళ్ల రఘురాం(16), తాటి వంశీ స్నేహితులు. ఇ ద్దరూ ఇటీవల ఇంటర్మీడియెట్‌లో చేరారు. ఆది వారం సాయంత్రం ఇద్దరూ సమీపంలోని పాలేరు నది వద్దకు వెళ్లారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వస్తుండగా వర్షం మొదలైంది. కొద్దిసేపటికి పెద్ద శబ్దంతో పిడుగు వారి మీద పడింది. ఈ ఘ టనలో రఘురాం అక్కడ కుప్పకూలి పోగా, వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతవాసులు వెంటనే స్పందించి ఇద్దరినీ హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి రఘురాం అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. వంశీకి పళ్లు ఊడిపోవడంతోపాటు తలకు బలమైన గాయమైం ది. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆ స్పత్రికి తరలించారు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ రఘురాం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆర్ఐ వెం కటేశ్వరరావు, వీఆర్వో రంగారావు వచ్చి మృతుని వివరాలు సేకరించారు. ప్రముఖుల నివాళి రఘురాం మృతదేహాన్ని మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కౌన్సిలర్ జాన్‌బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ ము త్యాల చలం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీ నర్ షేక్‌మదార్ సాహెబ్, మాజీ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్, టీడీపీ యువ నేత శ్రీ రాం ధనుంజయ్ తదితరులు సందర్శించి నివా ళు లర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. -
తొలకరి పులకింత
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : తొలకరి పలకరించింది. వరుణుడు విరుచుకుపడ్డాడు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజామున మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు.. కుంటల్లో నీరు చేరింది. హొళగుంద, కోసిగి, కౌతాళం, చాగలమర్రి మండలాలు మినహా జిల్లాలోని 50 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు నాలుగు గంటల పాటు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ప్రజలను బెంబేలెత్తించాయి. భారీ వర్షం అతలాకుతలం చేసింది. మద్దికెర మండలం బురుజులలో పిడుగుపాటుకు గడ్డివాము కాలిపోయింది. దేవనకొండలో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ప్యాపిలిలో అత్యధికంగా 10.4.2.. చాగలమర్రిలో అత్యల్పంగా ఒక మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మిల్లీమీటర్లు కాగా.. ఒక్క రోజులోనే జిల్లాలో సగటున 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. గత మూడేళ్లలో ఒకే రోజు ఇంత వర్షపాతం నమోదు కావడం మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దేవనకొండ, మద్దికెర, గూడూరు, సి.బెళగల్, కోడుమూరు, క్రిష్ణగిరి, పత్తికొండ మండలాల్లో హంద్రీ నదికి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం వ్యవసాయ పంటలు లేనందున రైతులకు నష్టం ముప్పు తప్పింది. అయితే ఒక్క మామిడి పంటకు మాత్రమే భారీ నష్టం వాటిళ్లింది. ఖరీఫ్‌కు సన్నద్ధం ఏకధాటిగా కురిసిన వర్షంతో రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధమయ్యారు. ప్రధానంగా బీటీ పత్తి సాగు ఊపందుకుంది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో విత్తన పనులు మొదలయ్యాయి. వ్యవసాయ పనులు ఊపందుకున్నా విత్తన పంపిణీ అతీగతీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు 8.50 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లను అలాట్ చేసినా పలు కంపెనీల్లో ఇప్పటికీ పొజిషన్ చేయని పరిస్థితి. దీంతో వ్యాపారులు బ్లాక్‌లో విత్తనాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బీటీ-1 ప్యాకెట్ ధర రూ.830.. బీటీ-2 ప్యాకెట్ ధర రూ.930 కాగా.. వ్యాపారులు రూ.1000కు పైగా ధర వసూలు చేస్తున్నారు. వేరుశనగ 40 వేల క్వింటాళ్లు మంజూరు చేసినా ఇప్పటికీ పంపిణీ ఊసే కరువైంది. ఉద్యాన అధికారులు మాత్రమే 50 శాతం సబ్సిడీపై మిరప మినహా అన్ని రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హగరి హొళగుంద: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని మార్లమడికి గ్రామం వద్ద హగరి(వేదావతి) నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించనున్నాయి. హగరి ఎగువ భాగంలోని గుంతకల్లు, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం హగరిలో 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. -
గాలివాన బీభత్సం
కెరమెరి, న్యూస్‌లైన్ : కెరమెరి మండలం అంతా కూడా గాలివానతో అతలాకుతలం అయింది. హట్టి, సాకడ, గోయేగాంలోని ప్రధాన రహదారులతో పాటు పోలీస్‌స్టేషన్ ఎదుట చెట్లు విరిగిపడ్డాయి. ఆయా దారుల్లో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. హట్టి, మోడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రూపాం తరం కింద నిర్మించిన భవనాల పైకప్పులు గాలికి లేచిపోయి పంట పొలాల్లో పడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు కానీ, ఇతర పాఠశాల సిబ్బంది కానీ ఆ గదుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఝరిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న జొన్న పంట నేలవాలింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు 30 ఇన్సులేటర్లు పాడైపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
గాలివాన బీభత్సం
కొత్తగూడెం, న్యూస్‌లైన్: జిల్లాలో వడగండ్ల వాన, గాలి దుమారం బీభత్సం సృష్టించాయి. బుధవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గాలితో కూడిన వడగండ్లవాన కురిసింది. బలమైన ఈదురు గాలులు రావడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో పలు గ్రామాలు అంధకారంగా మారాయి. ఏజెన్సీ ప్రాంతంలో గాలి దుమారం ప్రభావం అధికంగా ఉంది. జిల్లాలో సుమారు 600 ఎకరాల్లో కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేలరాలగా, పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు తడిసి ముద్దయ్యాయి. దీంతో ఆయా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం నియోజకవర్గాల్లో గాలిదుమారం ప్రభావం అధికంగా ఉండగా వైరా, మధిర, ఖమ్మం, పినపాక నియోజకవర్గాల్లో చిరుజల్లులు కురిశాయి. పిడుగుపాటుకు ఒకరికి గాయాలు... కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీ ఎదురుగడ్డలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన కాటం మీన అనే బాలిక చేతికి గాయమైంది. పిడుగు ప్రభావం విద్యుత్ తీగెలపైనా పడడంతో పలు ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, విద్యుత్ గృహోపకరణాలు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. దమ్మపేట మండలం పాతర్లగూడెంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మూడు గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. అశ్వారావుపేట మండలం గుమ్మడివెల్లిలో విద్యుత్ లైన్ తెగిపోయి సరఫరాకు అంతరాయం వాటిల్లింది. చండ్రుగొండ మండలంలో కరెంటు తీగెలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తల్లాడ మండలంలో గాలిదుమారం కారణంగా విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరాకు అంతరాయం వాటిల్లింది. భారీ వృక్షాలు ప్రధాన రహదారులపై అడ్డంగా పడ్డాయి. భద్రాచలం నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లోనూ విద్యుత్ వైర్లు తెగి సరఫరా నిలిచిపోయింది. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో గాలిదుమారం కారణంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. టేకులపల్లి మండలంలో గాలిదుమారాలకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 600 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం... మామిడితోటలు అధికంగా ఉండే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గాలిదుమారం ప్రభావంతో సుమారు 600 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు కల్లాల్లో ఆరబోసిన మిర్చి కూడా తడిసిపోయింది. సమయానికి పరదాలు, టార్బాలిన్లు దొరకక మిరపకాయలను కాపాడుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
యాచారం: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్లతో మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి, నానక్‌నగర్, చింతపట్ల, నక్కగుట్ట తండా, మల్కీజ్‌గూడ, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నక్కగుట్ట తండాలో ఈదురుగాలులకు ఓ ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చింతపట్లలో రైతు అచ్చెన రమేష్‌కు చెందిన రూ. లక్ష విలువైన రెండు పాడి ఆవులు పిడుగుపాటుతో మృతి చెందాయి. సింగారం, నందివనపర్తి, తమ్మలోనిగూడ, మాల్ తదితర గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, విస్తరణ అధికారి లక్ష్మణ్ తదితరులు దెబ్బతిన్న పంటల ను సోమవారం పరిశీలించారు. నివేదిక అం దజేయాలని ఆయా గ్రామాల ఆదర్శ రైతు లు, రెవెన్యూ కార్యదర్శులకు సూచించారు. శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని పెద్దతూప్ర, పాల్మాకులలో సోమవారం హోరుగాలి, వడగళ్లతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్దతూప్రలో మల్లెల యాదయ్య ఇంటి సమీపంలోని ఓ తుమ్మ చెట్టు, కరెంటు స్తంభం నేలకొరిగి ఇంటి గోడ పాక్షికంగా ధ్వంసమయ్యింది. పాల్మాకులలో ఎం.చంద్రయ్య, రుక్కమ్మ ఇళ్ల పైకప్పు రేకులు, పిల్లోనిగూడ రోడ్డులో పశువుల డెయిరీఫాం రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. పి.యాదయ్య ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో పైకప్పు రేకులు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న వారిపై రేకుల ముక్కలు పడడంతో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. పెద్దతూప్ర, పెద్దతూప్రతండా, ఇనాంషేరి, పిల్లోనిగూడ, అచ్చం పేట, పాల్మాకుల, ముచ్చింతల్ గ్రామాల్లోని పంటలకు వాటిల్లింది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. -
పిడుగు ఎక్కడ పడుతుందంటే...
సాక్షి, ముంబై: వర్షాకాలంలో పిడుగు పడి మృతి చెందుతున్న ఘటనలను అరికట్టేందుకు వాతావరణశాఖ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పిడుగులను గుర్తించే కొత్త యంత్రాన్ని కనిపెట్టడంలో ఈ శాఖ సఫలీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ, ఏ సమయంలో పిడుగులు పడతాయో అరగంట నుంచి రెండు గంటల ముందే తెలియజేసే సెన్సార్లను ఇది ఐఐటీ నుంచి సేకరించింది. వీటిని రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. వచ్చే వర్షాకాలం నుంచి ఈ సెన్సార్లు పనిచేయడం ప్రారంభస్తాయని ముంబై వాతావరణ శాఖ కార్యాలయం తెలిపింది. వర్షాకాలం వచ్చిందంటే రైతులు, వారి దగ్గర పనిచేసే కూలీల్లో గుబులు మొదలవుతుంది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో అనేకచోట్ల పిడుగులు పడతాయి. పశువుల పాకలు, చెట్టు కింద తలదాచుకున్నా అక్కడ కూడా పిడుగులు పడుతున్నాయి. దీంతో ఏటా వందలాది మంది రైతులు, కూలీలు దుర్మరణం పాలవుతున్నారు. దీన్ని అరికట్టేందుకు వాతావరణశాఖ పుణే ఐఐటీని సంప్రదించింది. ఈ సంస్థే పిడుగులు గుర్తించే సెన్సార్లను తయారు చేసి ఇచ్చిందని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. వీటి నియంత్రణ కేంద్రం (కంట్రోల్ రూం) ఐఐటీ కార్యాలయంలో ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కడ, ఏ స్థాయిలో పడతాయనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని ఈ ప్రాజెక్టు చీఫ్, ఐఐటీ సీనియర్ శాస్త్రజ్ఞులు డాక్టర్ సునీల్ పవార్, వి.గోపాలకృష్ణ, పి.ముర్గువెల్ వెల్లడించారు. వీటి తయారీకి అమెరికాకు చెందిన అర్థ్ నెట్వర్క్ అనే కంపెనీ నుంచి పరికరాలను దిగుమతి చేసుకున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పరిమాణం, అవి ఏ స్థాయిలో నేలపై పడతాయి తదితర కీలక అంశాలను అధ్యయనం చేసేందుకు వీలుపడుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ సెన్సార్లు 200-250 కిలోమీటర్ల దూరంలోని పిడుగుల వివరాలను కూడా తెలియజేస్తాయి. ఐఐటీ వెబ్సైట్లో స్థానికులు తమ మొబైల్ నంబర్లు, గ్రామం పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడి వాతావరణ వివరాలు అందులో లభిస్తాయని పవార్ అన్నారు. అయితే వర్షాకాలంలో ప్రతీ ఐదు, పది నిమిషాలకు ఒకసారి ఎస్ఎంఎస్లు పంపడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నామని పవార్ తెలిపారు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేశారు........... మధ్య మహారాష్ట్ర-పుణే, మహాబలేశ్వర్, కొల్హా పూర్, షోలాపూర్, నాసిక్, జల్గావ్, నందూర్బార్. కొంకణ్ రీజియన్-ముంబై, హరిహరేశ్వర్ , రత్నగిరి, వెంగుర్లే. మరఠ్వాడా రీజియన్-ఔరంగాబాద్, బీడ్, లాతూర్, పర్భణి విదర్భ రీజియన్-నాగపూర్, అకోలా, యవత్మాల్, గోండియా, చంద్రపూర్ -
రైతు కుటుంబాల్లో ‘పిడుగు’
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఆదివారం ముగ్గురు మృతి చెందారు. కర్నూలు మండలం ఆర్.కె.దుద్యాలకు చెందిన నరసింహ గౌడు(30) పశువుల మేత కోసం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కర్నూలు-కడప కాలువ పక్కనున్న పొలానికివెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీగా వర్షంతో పాటు పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు అతన్ని కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇతని భార్య పద్మావతితో పాటు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. అదేవిధంగా సి.బెళగల్ మండల పరిధిలోని కంబళదహాల్కు చెందిన కురువ మల్లేష్(బల్లయ్య) చిన్న కుమారుడు మల్లికార్జున(30) పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదిలాడు. సొంత గ్రామంలో సాగునీరు లేకపోవడంతో కొత్తకోట గ్రామ పరిధిలో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, పత్తి పంటలు సాగు చేశాడు. దినచర్యలో భాగంగా పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మరణించాడు. ఇతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు సంతానం కాగా.. కొద్దిరోజుల క్రితమే ఒక అమ్మాయి అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి మరణించడంతో ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇక ఓర్వకల్లు మండలం చింతలపల్లెకు చెందిన మహిళా రైతు లక్ష్మీదేవి(43) గ్రామ సమీపంలోని వారి పొలంలో పనిచేస్తూ పిడుగుపాటుకు తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించింది. ఈమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు సంతానం. వ్యవసాయంలో భర్తకు అండగా నిలిచిన లక్ష్మీదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
మృత్యుపిడుగుతో నలుగురు రైతులు దుర్మరణం
పినపాక, న్యూస్‌లైన్: ‘రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి..’ పోడుకొట్టుకుంటే గానీ పూటగడవని దయనీయం వారిది. అందుకే రెక్కలుముక్కలు చేసుకొని పోడుకొట్టుకున్నారు. ఒక్కొక్కరు రెండెకరాల చొప్పున పత్తి సాగుచేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా చేలకు వెళ్లారు. సాగుచేస్తున్న చేలల్లో కలుపుతీస్తున్నారు. ఇంతలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవసాగింది. రైతులు, కూలీలు ఇలా మొత్తం పదిమంది సమీపంలోని ఓ పూరిపాక కిందకు వెళ్లారు. దురదృష్టం వెంటాడింది.. మృత్యువు తరుముకొచ్చింది..భారీ శబ్ధంతో ఉరుము ఉరిమింది. పిడుగు వచ్చి రైతులు, కూలీలు తలదాచుకున్న ఆ పూరిపాకపై పడింది. అంతే తాటి లకిష్మ(35), శర్పా సత్యనారాయణ (25), చందా యశోద(50), చందా లకిష్మ(60) అనే గిరిజన రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. శర్పా రాంబాయి, శర్పా సత్యం, శర్పా ఆదిలకిష్మ, చందా సుభం, మైపతి విజయలకిష్మ, చందా సీతారాములమ్మ అనే ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ మండలంలోని చిరుమళ్ల గ్రామానికి చెందినవారే. పైగా సమీప బంధువులు కావడంతో ఆ గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. పిడుగు వార్తవిని... గ్రామశివారున ఉన్న మీదిచెరువు వద్ద పిడుగుపడి నలుగురు మృతిచెందారన్న వార్త తెలియగానే ఊరుఊరంతా అటువైపుగా పరుగులు తీసింది. ‘అయ్యో బిడ్డలారా...ఎంత ఘోరం జరిగిపోయిందే..’అంటూ గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఓవైపు తీవ్రగాయాలు...మరోవైపు కుమారుడి మరణం...శర్ప సత్యనారాయణ తల్లి ఆదిలకిష్మ పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గాయాలతో సతమతమవుతూ ఆమె ఏడుస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఈ ఘటనలో మృతిచెందిన మరో ఇద్దరు చందా లకిష్మ, చందా యశోద కుటుంబాలకు ప్రధాన ఆదరువు కావడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న వీరి మరణం వారి కుటుంబాలను ఏకాకులను చేసింది. చిరుమళ్ల గ్రామంలో పిడుగుపడి నలుగురు మృతిచెందిన విషయం తెలిసి సమీపంలోని కరకగూడెం, మోతె, అనంతారం, సమత్‌భట్టుపల్లి, భట్టుపల్లి గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి మృతులు, బాధితులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను కావడిలో తీసుకెళ్లి గ్రామస్తులు దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పందించిన గ్రామీణ వైద్యులు చిరుమళ్ల గ్రామంలో పిడుగుపడి నలుగురు మృతిచెందారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారనే విషయం తెలిసిన వెంటనే పినపాక మండలం గ్రామీణ వైద్యుల సంఘం స్పందించింది. హుటాహుటిన వైద్యులు ఆ గ్రామానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యసేవలు అందిస్తున్నారు. బీపీ పరీక్షించి సెలైన్ ఎక్కిస్తున్నారు. పిడుగుపాటుకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. అయినా దీపాలు, టార్చీలైట్ల వెలుతురులో ఆర్ఎంపీలు వైద్యసేవలు అందించారు. రెండుగంటలపాటు వైద్యసేవలందించిన అనంతరం క్షతగాత్రులను కరకగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన గ్రామీణ వైద్యులను పలువురు అభినందించారు. -
పిడుగుపాటుకు నలుగురు మహిళా కూలీల మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. నలుగురూ మహిళా కూలీలే. భీమిలిలో ముగ్గురు మృతి చెందగా, పోతిరెడ్డిపాలెంలో ఒకరు మృతి చెందారు. -
‘పిడుగు’ విషాదం ఐదుగురు రైతుల మృత్యువాత
పిడుగులు.. జిల్లాలో మృత్యుగంట మోగిస్తున్నాయి. రెండ్రోజుల వ్యవధిలో ఐదుగురిని బలిగొన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతు కుటుంబాలపై మృత్యువు పిడుగై పడుతోంది. ఉట్నూర్ మండలానికి చెందిన తండ్రీకొడుకులు, వాంకిడికి చెందిన మహిళ పిడుగుపాటుకు గాయపడి చికిత్స పొందుతూ చనిపోయారు. తాజాగా తాండూర్ మండలం అచ్చులాపూర్‌లో మామాఅల్లుడు దుర్మరణం చెందారు. తాండూర్, న్యూస్‌లైన్ : మండలంలోని అచ్చులాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ వర్షంతోపాటు పిడుగు పడడంతో గ్రామానికి చెందిన బామండ్లపల్లి పోచయ్య(60), చెన్నూరుకు చెందిన కమ్మల రాజయ్య(25) మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. అచ్చులాపూర్‌కు చెందిన బామండ్లపల్లి పోచయ్య కుమారుడు మహేశ్ తన బావమరిది చెన్నూరుకు చెందిన కమ్మల రాజయ్యతో కలిసి గ్రామ శివారులో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకుని పోచయ్యతోపాటు అతని కుమారులు మహేశ్, సంతోశ్, కమ్మల రాజయ్య(మహేష్ బావమరిది) ఇంటికి వస్తున్నారు. మహేశ్ తమ ఎడ్లను పట్టుకుని అందరి కంటే మందు నడుస్తుండగా, వెనకాల ఎడ్లబండిపై పోచయ్య, సంతోశ్, రాజయ్య వస్తున్నారు. అదే సమయంలో భారీ వర్షం కురియడంతోపాటు ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగు పడింది. దీంతో బండిలో ఉన్న పోచయ్య, రాజయ్య అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సంతోశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతిచెందగా ఇద్దరు కుమారులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో పోచయ్య, రాజయ్య కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుడు పోచయ్య అచ్చులాపూర్ సర్పంచ్ చవుళ్ల లక్ష్మికి కన్న తండ్రి.