పెద్దవూర మండలం చెలకుర్తి గ్రామపంచాయతీ బెత్తలతండాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న వారిపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో బోనావత్ సక్రూ(16) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా..బాలుడి తండ్రి జాన్, పొలంలో పనిచేయడానికి వచ్చిన కూలీ జ్యోతిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగార్జునసాగర్‌లోని కమలా-నెహ్రు ఆసుపత్రికి తరలించారు.